సార్ లేని లోటు పూడ్చలేనిది
–కులాలు, మతాలకు అతీతంగా పనిచే సిన మహోన్నత వ్యక్తి
–సమైక్య పాలకుల అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన మహనీయుడు
–జీవితమంతా తెలంగాణ కోసమే అంకితం చేసిన త్యాగధనుడు
–ఆచార్య జయశంకర్ జయంతి సభలో ఎంపీ కవిత, మంత్రి జగదీశ్‌రెడ్డి
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంర్ అని, సార్ లేని లోటు పూడ్చలేనిదని తెలంగాణ జాగృతి వ్యవస్థాక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శనివారం ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కులాలు, మతాలుకు అతీతంగా రాష్ట్ర సాధనే ద్యేయంగా పని చేసిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. జయశంకర్ సార్ మన మధ్య లేకపోయినా ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. ప్రతికూల పరిస్థితిల్లోనూ తెలంగాణ నడిపించారని పేర్కొనామ్నరు. యువత జయశంకర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణకు జరిగిన అన్యాయాలపై సమైక్య పాలకులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ నిలదీశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి తనకుంటూ ఒక చర్రిత సృష్టించుకుందన్నారు. అంతకుముందు కవిత స్థానిక మున్సిపల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, విప్ సునీత, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇం చార్జి దుబ్బాక నర్సింహ్మారెడ్డి, నోముల నర్సిహ్మాయ్య, కాసోజు శంకరమ్మ, మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ తదితరులు పాల్గొ న్నారు.
వర్షంతో నిలిచిన సభ
రాత్రి 7.50 గంటలకు ప్రారంభమైన సభ 8.30 గంటలకు ముగిసింది. దేశపతి శ్రీనివాస్, మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడిన అనంతరం ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రసంగిస్తుండగా భారీ వర్షం రావడంతో సభను అర్ధాంతంగా ఆపేశారు.