sir
-
వీకే నరేష్‌కి డాక్టరేట్ ప్రదానం
నటుడు వీకే నరేష్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ‘ఐఎస్ సీఏహెచ్ఆర్’ నుంచి ఆయన ‘సార్’ అనే బిరుదుతోపాటు డాక్టరేట్‌ని అందుకున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో వీకే నరేష్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్’ సంస్థతో పాటు ‘ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్)’ కలిసి నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేష్‌కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌తో పాటు లెఫ్టినెంట్ కల్నల్‌గా ఆయన్ను నియమించినట్లు సన్నిహితులు తెలిపారు. ఇకపై నరేష్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై నరేష్ ప్రసంగించినందుకు గుర్తింపుగా ఈ గౌరవాలు దక్కాయి. -
స్కూల్ ఫ్రెండ్స్‌తో రీ యూనియన్ అయిన టాప్ హీరో.. ఫోటోలు వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ధనుష్‌కు టాలీవుడ్ లోను భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన తాజాగ తన స్కూల్ స్నేహితులను కలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: రీ- రిలీజ్ సినిమాలకు ఎందుకంత క్రేజ్..?) ధనుష్ స్కూల్లో చదువుకునే రోజుల్లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒకరకంగా సినిమాపై ఉండే పిచ్చి అభిమానమే చదువుకు ఫుల్స్టాప్ పెట్టి ఆయన్ను ఇండస్ట్రీ వైపు నడిపించింది. ఇప్పడు అంతర్జాతీయ స్థాయిలో తానేమిటో ప్రూవ్ చేసుకున్న ధనుష్ మళ్లీ తన స్కూల్ ఫ్రెండ్స్‌తో ఇలా కలిశాడు. ఎప్పుడో విడిపోయిన వారందరూ మళ్లీ ఇలా ఒక్కసారి రీయూనియన్ అయ్యారు. ధనుష్ ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు కదా తమతో కలుస్తాడా..? తమతో కలిసి భోజనం చేస్తాడా..? కనీసం ఫోటో అయినా దిగుతాడా..? అనే సందేహాలు వారిలో వచ్చాయట. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా గత మూలాలు ఎలా మరిచిపోతామని ధనుష్ పేర్కొన్నాడట. వారితో ఒకరోజంతా గడపడమే కాకుండు పలు పాటలకు డ్యాన్స్‌లు చేయడమే కాకుండా అందరూ కలిసి భోజనం చేయడం. ఇలా ఆనందంగా గడిపారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం గడిపింది మీతోనే కదా అని ఆయన తెలపడంతో వారంతా ఎంతో సంతోషంగా ధనుష్‌తో ఫోటోలు దిగారట. ప్రస్తుతం ధనుష్ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలను స్కూల్ డేస్ నుంచి ఉన్న కొందరు స్నేహితులే చూసుకుంటున్నారు. గతంలో స్కూల్ డేస్ గురించి ధనుష్ ఏమన్నారంటే సార్ సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి చాలా ఎమోషనల్ అయ్యాడు. అప్పట్లో చదువును నిర్లక్ష్యం చేశానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకునే సమయంలో చాలా అల్లరి పనులు చేశానని ధనుష్ గుర్తు చేసుకున్నారు. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసం ట్యూషన్లో చేరానని, అక్కడ టీచర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడంతో సిగ్గేసి కొన్ని రోజుల తర్వాత ట్యూషన్ మానేశానని పేర్కొన్నారు. అప్పట్లో తాను ఒక అమ్మాయి కోసం బయట వేచి చూస్తుండేవాడినని, తాను వచ్చినట్టు ఆమెకు తెలిసేందుకు బైక్‌తో సౌండ్ చేసేవాడినని అన్నారు. ఇది చూసి టీచర్ లోపలున్న విద్యార్థులతో.. మీరంతా బాగా చదువుకుని పరీక్షలు పాసైతే ఉన్నత స్థానాల్లో ఉంటారని, బయట బైక్‌తో శబ్దం చేసేవాడు వీధుల్లో డ్యాన్స్ చేసుకోవాల్సిందేనని వారితో అన్న విషయం తనకు తెలిసిందన్నారు. ఆ తర్వాత ఆ టీచర్ చెప్పినట్టే తమిళనాడులో ప్రస్తుతం తాను డ్యాన్స్ చేయని వీధంటూ ఏమీలేదని నవ్వుతూ చెప్పారు. అప్పట్లో తానెందుకు సరిగ్గా చదువుకోలేదని అనిపిస్తూ ఉంటుందని, ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతూ ఉంటానని అన్నారు. ఇప్పుడు ఆ మిత్రులందరిని ధనుష్ మరోసారి కలుసుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. -
ధనుష్ " సార్ మూవీ రివ్యూ "
-
'సార్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పాఠశాలల్లో ఉపాధ్యాయులను సార్! మేడమ్! అని పిలవకూడదు!
రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను సార్, మేడమ్ వంటి పదాలతో సంభోదించకూడదట. కేవలం "టీచర్" అనే సంబోధించాలని కేరళ స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్యానెల్ (కేఎస్‌సీపీసీఆర్) విద్యాశాఖను ఆదేశించింది. ఉపాధ్యాయులను సర్ లేదా మేడమ్ వంటి గౌరవమైన పదాల కంటే లింగంతో సంబంధం లేకుండా తటస్థమైన పదంతో సంబోధించాలని ప్యానెల్ నిర్ణయించింది. ఈ మేరకు కేరళ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో "టీచర్" అని సంబోధించేలా ఆదేశాలు ఇవ్వాలని చైర్ పర్సన్ కేవీ మనోజ్ కుమార్, సభ్యుడు విజయకుమార్‌లతో కూడిన ప్యానెల్ బుధవారం విద్యాశాఖను ఆదేశించింది. టీచర్ అని సంబోధించడం వల్ల అన్ని పాఠశాలల్లో పిల్లల మధ్య సమానత్వాన్ని కొనసాగించడంలో ఉపకరించడమే కాకుండా ఉపాధ్యాయులు, పిల్లల మధ్య అనుబంధాన్ని పెంచుతుందని బాలల హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా ఉపాధ్యాయులను లింగం ఆధారంగా సర్ లేదా మేడమ్ అనే సంబోధన కారణంగా ఏర్పడుతున్న లింగ వివక్షతను అంత చేయాలని కోరుతూ..ఒక వ్యక్తి దాఖలు చేసిని పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని ప్యానెల్ ఈ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: మాజీ మంత్రి శరద్ యాదవ్ మృతికి రాహుల్ నివాళి) -
మాస్టారు... నా మనసును గెలిచారు
‘‘శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. సీతకు మల్లే నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంత విన్నాలే.. ’ అని ప్రేమగీతం పాడుకున్నారు సంయుక్తా మీనన్. ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా ‘సార్’ (తమిళంలో ‘వాతి’). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నుంచి ‘మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు.. అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను గురువారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మాస్టారు ధనుష్‌ని ఉద్దేశించి సంయుక్త పాడే ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, శ్వేతా మోహన్ ఆలపించారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. కాగా, ఈ పాట తమిళ వెర్షన్‌కు ధనుష్ సాహిత్యం అందించడం విశేషం. -
టీజర్: గట్టిగా క్లాసులు పీకిన ధనుష్ 'సార్'
స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళంలో వాత్తి పేరిట రిలీజ్ కానుంది. ఈరోజు ధనుష్ బర్త్‌డే కావడంతో సార్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. జీరో ఫీజు.. జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీజు.. మోర్ ఎడ్యుకేషన్.. ఇదేరా ఇప్పుడు ట్రెండ్.. అన్న డైలాగ్‌తో టీజర్ మొదలువుతుంది. ఆ తర్వాత యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. ఇక టీజర్లో ధనుష్ పాత్రను రివీల్ చేశారు. అతడి పేరు బాలగంగాధర్ తిలక్ అని, జూనియర్ లెక్చరర్‌గా నటించాడని హీరోనే స్వయంగా వెల్లడించాడు. 'విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సర్.. పంచండి, ఫైవ్‌స్టార్ హోటల్లో డిష్‌లాగా అమ్మకండి' అని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. టీజర్ చూస్తుంటే విద్యావ్యవస్థలో ఉన్న లోపాను ఎత్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌లతో కలిసి సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ధనుష్‌కు ఇది తొలి తెలుగు స్ట్రయిట్ ఫిలిం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. చదవండి: విక్రాంత్ రోణ సినిమా రివ్యూ 'ఇంద్ర' సినిమాలో అందుకే నటించలేదు: పరుచూరి గోపాలకృష్ణ -
అన్నదమ్ములకు సోకిన కరోనా.. సినిమా షూటింగ్‌కు బ్రేక్
Hero Dhanush Tests Positive For Covid 19: తమిళ స్టార్ హీరో ధనుష్‌కు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్లో కూడా అభిమానులు ఉన్నారు. ఈ క్రేజ్‌తోనే తెలుగులో నేరుగా ధనుష్ ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరే 'సార్'. వెంకీ అట్లూరీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం రెండు భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే చిత్రీకరణ మొదలైన ఈ చిత్రాన్ని తమిళంలో 'వాత్తి' పేరుతో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ధనుష్ సోదరుడు డైరెక్టర్ సెల్వ రాఘవన్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ధనుష్ కూడా కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధనుష్ కొవిడ్ పరీక్షలు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో 'సార్' సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ధనుష్‌కు కరోనా అని తేలగానే 'సార్' చిత్రీకరణ ఆపేశారు. ప్రస్తుతం ధనుష్ హోం ఐసోలేషన్‌లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. వారం, పదిరోజుల వరకూ ధనుష్ 'సార్' చిత్రీకరణలో పాల్గొనే అవకాశం లేదు. అయితే ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించిన చిత్రబృందం ఈ షెడ్యూల్‌ను భారీగా ప్లాన్ చేశారని టాక్. ఎక్కువ సీన్లు ధనుష్పైనే ఉండటంతో ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఈ సినిమా షూటింగ్ ముందుకు వెళ్లనట్లే అని సమాచారం. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫొర్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ టీచర్‌గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
టాలీవుడ్‌కి పరిచయం అవుతున్న పరభాషా హీరోలు
టాలీవుడ్‌ది పెద్ద మనస్సు... ఎంతమంది వచ్చినా ఎస్సు అంటుంది. మామూలుగా పరభాషా నాయికలు, విలన్లు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు పరభాషా హీరోలు ఇక్కడ హీరోలుగా పరిచయం కానున్నారు. అంతేనా... పరభాషలో హీరోలుగా దూసుకెళుతున్నవాళ్లు ఇక్కడ సహాయనటులుగా, విలన్లుగా పరిచయం కానున్నారు. ‘రారండోయ్ పరిచయం చేస్తాం’ అంటూ అందరికీ అవకాశం ఇస్తోంది టాలీవుడ్. ఈ పరిచయాలు పెరగడానికి ఓ కారణం పాన్ ఇండియన్ సినిమాలు. ఏది ఏమైనా ఇతర భాషల్లో లేనంతగా తెలుగులో పరభాషలవారికి అవకాశాలు దక్కుతున్నాయి. ఆ స్టార్స్ గురించి తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరో విజయ్ చేసిన ‘మాస్టర్’, ‘బిగిల్’, ‘సర్కారు’, ‘మెర్సెల్’ వంటి చిత్రాలు తెలుగులో అనువాదమై, మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. మరో తమిళ స్టార్ ధనుష్ అయితే ఒకేసారి రెండు తెలుగు సినిమాలు కమిట్ కావడం విశేషం. శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి దర్శకత్వాల్లో ఆయన సినిమాలు చేయనున్నారు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న ‘సర్’ (తమిళంలో ‘వాతి’) సినిమా షూటింగ్ ఈ నెల 5న ప్రారంభం కానుంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్ మార్చిలో ఆరంభమవుతుందట. ఇక తమిళంలో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుని, హీరోగా మారిన శివకార్తికేయన్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రానికి ఇటీవలే సైన్ చేశారు. ‘జాతిరత్నాలు’ వంటి మంచి హిట్ ఇచ్చిన కేవీ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు. అలాగే సంగీతదర్శకుడిగా, ఎడిటర్‌గా నిరూపించుకుని, హీరోగా చేస్తున్న విజయ్ ఆంటోని ఇప్పటివరకూ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు తెరపై కనిపించారు. ఇప్పుడు తెలుగులో స్ట్రయిట్ సినిమా ఒప్పుకున్నారు. అయితే సోలో హీరోగా కాదు.. మరో హీరోతో కలిసి ‘జ్వాల’లో నటిస్తున్నారు. ఆ మరో నటుడు ఎవరంటే.. ‘బ్రూస్లీ’, ‘సాహో’ చిత్రాల్లో ఓ రోల్ చేసిన అరుణ్ విజయ్ అన్నమాట. ఈ ఇద్దరూ హీరోలుగా ‘జ్వాల’ (తమిళంలో ‘అగ్ని సిరగుగళ్’ టైటిల్) చేస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ దర్శకుడు. అటు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌కి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే. కీర్తీ సురేష్ చేసిన ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో ఆకట్టుకున్నారు దుల్కర్. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దుల్కర్‌కు హీరోగా తెలుగులో తొలి చిత్రం. ఇక టాలీవుడ్‌కు హాయ్ చెబుతున్నారు మరో మలయాళ నటుడు దేవ్ మోహన్. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్లో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’లో దేవ్ మోహన్ మెయిన్ లీడ్‌గా చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు తెలుగుకి పరిచయం కావడానికి రెడీ అవుతున్నారు. అక్కడ హీరోలు... ఇక్కడ క్యారెక్టర్లు! మాతృభాషలో హీరోలుగా చేస్తూ హీరోలుగానే తెలుగులో పరిచయమవుతున్న వారు కొందరైతే... పరభాష హీరోలు కొందరు ఇక్కడ కీలక పాత్రలు చేస్తుండడం విశేషం. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న చిత్రంలో నవాజుద్దిన్ సిద్ధిఖీ ఓ పాత్ర చేయనున్నారనే ప్రచారం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ప్రభాస్ హీరోగా చేసిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా, రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రధానంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. సో.. ‘ఆదిపురుష్’ సినిమాయే సైఫ్‌కి తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రంలోని లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఓ రోల్ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించారు. ఇక జూనియర్ ఆర్టిస్టు నుంచి మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు దునియా విజయ్ టాలీవుడ్‌కు వస్తున్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో దునియా విజయ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. మరో కన్నడ యాక్టర్ ధనుంజయ ‘పుష్ప’ చిత్రంతో, వశిష్ట సింహా ‘నయీం డైరీస్’తో వచ్చారు. మరోవైపు ఇటీవల విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో విలన్‌గా చేసి, తెలుగు ప్రేక్షకులకు స్ట్రయిట్‌గా హాయ్ చెప్పారు మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్. వీరితోపాటు మరికొందరు పరభాషా నటులు స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగు సినిమాల్లో కనిపించిన అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, వరుణ్ తేజ్ ‘గని’లో సునీల్ శెట్టి, రవితేజ ‘ఖిలాడి’లో ఉన్ని ముకుందన్ తదితరులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నారు. -
ధనుష్ తొలి తెలుగు సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
కోలివుడ్ స్టార్ ధనుష్ తొలి తెలుగు సినిమా టైటిల్ వచ్చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ‘సార్’అని నామకరణం చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. తమిళంలో ‘వాతి’అనే టైటిల్‌తో తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంయుక్త హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయాలను తెలియజేస్తూ మేకర్స్ ఓ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. టైటిల్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో ధనుష్ టీచర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. కాగా, ధనుష్ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. -
యజమాని, పని మనిషి ప్రేమ కథ
సినిమా : సార్ నటీనటులు : తిలోత్తమా శోమె, వివేక్ గోంబర్ దర్శకత్వం : రొహెనా గెర నిర్మాతలు : రొహెనా గెర, బ్రిస్ పోసన్ సంగీతం : పిర్రె ఏవియట్ కథ : న్యూయార్క్‌లో ఉద్యోగం చేసుకుంటున్న అశ్విన్( వివేక్ గోంబర్) సోదరుడి ఆరోగ్యం బాగోలేదని తెలిసి ముంబై వస్తాడు. అతడు చనిపోవటంతో కుటుంబానికి అండగా ఉండటానికి ముంబైలోనే ఉండిపోతాడు. ప్రియురాలితో కలిసి అక్కడే ఓ అపార్ట్మెంట్ ఉంటాడు. రత్న(తిలోత్తమ శోమె) వారింట్లో పని మనిషిగా చేరుతుంది. కొద్ది కాలానికి అశ్విన్‌కు అతడి ప్రియురాలికి మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటాయి. దీంతో ఇద్దరూ విడిపోతారు. మానసికంగా కుంగుబాటులో ఉన్న అతడి మనసుకు రత్న ద్వారా సాంత్వన లభిస్తుంది. ఆమె చేష్టలు, తన పట్ల కేరింగ్ అశ్విన్‌ను ఎంతోగానో ఆకట్టుకుంటాయి. ఆమె పని మనిషి అన్న ఆలోచన లేకుండా ప్రేమలో పడతాడు. ఆమెకు తన ప్రేమను చెబుతాడు. తమ మధ్య ఉండాల్సింది యజమాని, పని మనిషి బంధమేనని ఇంకేమీ ఉండొద్దని ఆమె తేల్చి చెబుతుంది. తమ ప్రేమను సమాజం హర్షించదని హితవు పలుకుతుంది. అయినా పట్టు వదలకుండా ఆమె ప్రేమకోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు అశ్విన్. అయితే చివరకు అశ్విన్.. రత్న ప్రేమను గెలుచుకోగలిగాడా? పని మనిషి సంకెళ్లను తెంపుకుని ఆమె అతడితో ఒక్కటవుతుందా? లేదా? అన్నదే మిగితా కథ. సినిమా ఎలా ఉందంటే లాక్డౌన్ తర్వాత సినిమా థియేటర్లలో విడుదలయిన మొదటి సినిమా ఇది. 2020, మార్చి నెలలో సినిమాను విడుదల చేయాలనుకున్నా కుదర్లేదు. 2018లోనే ఈ సినిమా అమెరికాలో విడుదలై మంచి ఫలితాలను రాబట్టింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది. బోల్డ్ స్టోరీ లైన్‌తో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. కథ కొత్తదేమీ కాకపోయినప్పటికి ఇతర బాలీవుడ్ ప్రేమకథా చిత్రాల్లాగా కాకుండా విభిన్నంగా తీశాడు. రెండు భిన్న ధ్రువాల మధ్య ప్రేమ చిగురించటానికి యజమాని, పని మనిషికి బంధం అడ్డుకాదని చెప్పే కథాంశం. మన ప్రతీ చర్య ఎదుటి వ్యక్తిపై ఎంతలా ప్రభావం చూపుతుందో రత్న పాత్ర మనకు తెలియజేస్తుంది. ఇద్దరి మధ్యా చోటు చేసుకునే ప్రేమ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న పదానికి సరికొత్త అర్థానిచ్చే ప్రేమ జంటగా నిలుస్తారు అశ్విన్, రత్న. ఓ వ్యక్తిని ప్రేమించటం అంటే వారి కలల్ని గౌరవించటం కూడా అని చెప్పే సింపుల్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ. -
కారణజన్ముడు కాటన్
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పలువురికి సర్ ఆర్ధర్ కాటన్ జీవిత సాఫల్య పురస్కారాలు అందజేత రాజమహేంద్రవరం రూరల్ : ఒక ఆంగ్లేయుడు భారతీయుల యోగక్షేమాలు కోసం పరితపించడం మామూలు విషయం కాదని, సర్ ఆర్ధర్ కాటన్ నిజంగా కారణజన్ముడని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. బొమ్మూరులోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఫిలాంత్రోఫిక్ సొసైటీ, తెలుగు యూనివర్సిటీ సంయుక్తంగా కాటన్ 214వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉండవల్లి మాట్లాడుతూ ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన అపర భగీర«ధుడు కాటన్ అని కొనియడారు. ఫిలాంత్రోఫిక్ సొసైటీ వ్యవస్థాపకులు అద్దంకి రాజయోనా స్వాగతం పలుకగా, ఇండియన్ నర్సరీ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభకు అధ్యక్షత వహించిన సాహిత్య పీఠాధిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ కాటన్ మహిమాన్వితుడని కొనియడారు. అందుకే ఆయన కీర్తి భారతదేశ నదీజలాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అంతర్లీనమై కలకాలం నిలిచే ఉంటుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకూరి వెంకట రామారావు, తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తిమండ ప్రతాప్, బొమ్మూరు మాజీ సర్పంచి మత్సేటి ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు ఎం.శ్రీరామ్మూర్తి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి కొల్లివెలసి హారిక, డాక్టర్ పి.హేమలత మాట్లాడారు. వివిధ రంగాలకు చెందిన 21 మంది ప్రముఖులకు సర్ ఆర్ధర్ కాటన్ జీవిత సాఫల్య పురస్కారాలు అందించారు. పురస్కార గ్రహీతలు వీరే పల్ల వెంకన్న (కడియం), ఆచార్య ఎండ్లూరి సుధాకర్, దూలం రాజ్‌కుమార్(పొట్టిలంక), సత్తి భాస్కరరెడ్డి (కందరెడ్డి, దుళ్ల), తుమ్మిడి అరుణ్‌కుమార్(రాజమహేంద్రవరం), డాక్టర్ గుబ్బల రాంబాబు (స్వర్ణాంధ్ర సేవా సంస్థ), బొంతు శ్రీహరి (సఖినేటిపల్లి), డాక్టర్ మానికిరెడ్డి సత్యనారాయణ (కాకినాడ), కర్రా వెంకటలక్ష్మి (ఎంపీపీ, వై.రామవరం), ఇసుకపట్ల ఇమ్మానియేలుకుమార్ (అన్నా మినిస్ట్రీస్, రావులపాలెం), అలమండ ప్రసాద్(కూచిపూడి నృత్య కళాకారుడు, సామర్లకోట), రహీమున్నీసాబేగం(విశాఖ), తురగా సూర్యారావు (కాకినాడ), కొచ్చెర్ల చక్రధారి(సూక్ష్మకళాకారుడు, సామర్లకోట), డాక్టర్ బీఎస్ఎస్ఏ జగదీష్(టీచర్, సామర్లకోట), శివకోటి విజయప్రసాద్ (మ్యుజీషియన్, కాకినాడ), పొట్నూరి రజనీకాంత్ (ఏలూరు), ప్రత్తి రామలక్ష్మణమూర్తి (టీచర్, పిఠాపురం), పి.కీర్తిప్రియ (కూచిపూడి నర్తకి, శ్రీకాకుళం), గరికిపర్తి నమశ్శివాయ (కాకినాడ), ముష్ఠి శ్రీదేవి (వెదురుపాక)లను జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, పతకాలతో ఘనంగా సత్కరించారు. -
సార్ లేని లోటు పూడ్చలేనిది
–కులాలు, మతాలకు అతీతంగా పనిచే సిన మహోన్నత వ్యక్తి –సమైక్య పాలకుల అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన మహనీయుడు –జీవితమంతా తెలంగాణ కోసమే అంకితం చేసిన త్యాగధనుడు –ఆచార్య జయశంకర్ జయంతి సభలో ఎంపీ కవిత, మంత్రి జగదీశ్‌రెడ్డి నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంర్ అని, సార్ లేని లోటు పూడ్చలేనిదని తెలంగాణ జాగృతి వ్యవస్థాక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శనివారం ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కులాలు, మతాలుకు అతీతంగా రాష్ట్ర సాధనే ద్యేయంగా పని చేసిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. జయశంకర్ సార్ మన మధ్య లేకపోయినా ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. ప్రతికూల పరిస్థితిల్లోనూ తెలంగాణ నడిపించారని పేర్కొనామ్నరు. యువత జయశంకర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణకు జరిగిన అన్యాయాలపై సమైక్య పాలకులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ నిలదీశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి తనకుంటూ ఒక చర్రిత సృష్టించుకుందన్నారు. అంతకుముందు కవిత స్థానిక మున్సిపల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, విప్ సునీత, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇం చార్జి దుబ్బాక నర్సింహ్మారెడ్డి, నోముల నర్సిహ్మాయ్య, కాసోజు శంకరమ్మ, మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ తదితరులు పాల్గొ న్నారు. వర్షంతో నిలిచిన సభ రాత్రి 7.50 గంటలకు ప్రారంభమైన సభ 8.30 గంటలకు ముగిసింది. దేశపతి శ్రీనివాస్, మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడిన అనంతరం ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రసంగిస్తుండగా భారీ వర్షం రావడంతో సభను అర్ధాంతంగా ఆపేశారు. -
సార్ ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యం
మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ సిటీ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా శనివారం నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆకలి కేకలు, ఆత్మహత్యలు లేని రాష్ట్రాన్ని జయశంకర్‌సార్ కోరుకున్నారని అన్నారు. దాని సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్లలో సార్ ముందుంటారన్నారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ స్ఫూర్తినిచ్చారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బొడిగె శోభ, మేయర్ సర్ధార్ రవీందర్‌సింగ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్, జెడ్పీటీసీలు తన్నీరు శరత్‌రావు, ఎడ్ల సుగుణాకర్, ఫారెస్ట్ కన్జర్వేటర్ అక్బర్, జి.రఘువీర్‌సింగ్, దూలం సంపత్ పాల్గొన్నారు.