కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ధనుష్‌కు టాలీవుడ్ లోను భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన తాజాగ తన స్కూల్ స్నేహితులను కలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: రీ- రిలీజ్ సినిమాలకు ఎందుకంత క్రేజ్..?)
ధనుష్ స్కూల్లో చదువుకునే రోజుల్లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒకరకంగా సినిమాపై ఉండే పిచ్చి అభిమానమే చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టి ఆయన్ను ఇండస్ట్రీ వైపు నడిపించింది. ఇప్పడు అంతర్జాతీయ స్థాయిలో తానేమిటో ప్రూవ్ చేసుకున్న ధనుష్ మళ్లీ తన స్కూల్ ఫ్రెండ్స్‌తో ఇలా కలిశాడు. ఎప్పుడో విడిపోయిన వారందరూ మళ్లీ ఇలా ఒక్కసారి రీయూనియన్ అయ్యారు.
ధనుష్ ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు కదా తమతో కలుస్తాడా..? తమతో కలిసి భోజనం చేస్తాడా..? కనీసం ఫోటో అయినా దిగుతాడా..? అనే సందేహాలు వారిలో వచ్చాయట. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా గత మూలాలు ఎలా మరిచిపోతామని ధనుష్ పేర్కొన్నాడట. వారితో ఒకరోజంతా గడపడమే కాకుండు పలు పాటలకు డ్యాన్స్‌లు చేయడమే కాకుండా అందరూ కలిసి భోజనం చేయడం. ఇలా ఆనందంగా గడిపారు.
తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం గడిపింది మీతోనే కదా అని ఆయన తెలపడంతో వారంతా ఎంతో సంతోషంగా ధనుష్‌తో ఫోటోలు దిగారట. ప్రస్తుతం ధనుష్ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలను స్కూల్ డేస్ నుంచి ఉన్న కొందరు స్నేహితులే చూసుకుంటున్నారు.
గతంలో స్కూల్ డేస్ గురించి ధనుష్ ఏమన్నారంటే
సార్ సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి చాలా ఎమోషనల్ అయ్యాడు. అప్పట్లో చదువును నిర్లక్ష్యం చేశానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకునే సమయంలో చాలా అల్లరి పనులు చేశానని ధనుష్ గుర్తు చేసుకున్నారు. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసం ట్యూషన్‌లో చేరానని, అక్కడ టీచర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడంతో సిగ్గేసి కొన్ని రోజుల తర్వాత ట్యూషన్ మానేశానని పేర్కొన్నారు. అప్పట్లో తాను ఒక అమ్మాయి కోసం బయట వేచి చూస్తుండేవాడినని, తాను వచ్చినట్టు ఆమెకు తెలిసేందుకు బైక్‌తో సౌండ్ చేసేవాడినని అన్నారు.
ఇది చూసి టీచర్ లోపలున్న విద్యార్థులతో.. మీరంతా బాగా చదువుకుని పరీక్షలు పాసైతే ఉన్నత స్థానాల్లో ఉంటారని, బయట బైక్‌తో శబ్దం చేసేవాడు వీధుల్లో డ్యాన్స్ చేసుకోవాల్సిందేనని వారితో అన్న విషయం తనకు తెలిసిందన్నారు. ఆ తర్వాత ఆ టీచర్ చెప్పినట్టే తమిళనాడులో ప్రస్తుతం తాను డ్యాన్స్ చేయని వీధంటూ ఏమీలేదని నవ్వుతూ చెప్పారు. అప్పట్లో తానెందుకు సరిగ్గా చదువుకోలేదని అనిపిస్తూ ఉంటుందని, ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతూ ఉంటానని అన్నారు. ఇప్పుడు ఆ మిత్రులందరిని ధనుష్ మరోసారి కలుసుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment