Dhanush Family New Hero Entry Under His Direction - Sakshi
Sakshi News home page

Dhanush: మేనల్లుడి కోసం ధనుష్ మాస్టర్‌ ప్లాన్‌.. ఆయన సిస్టర్స్‌ ఎవరంటే?

Published Tue, Aug 15 2023 10:06 AM | Last Updated on Tue, Aug 15 2023 10:58 AM

Dhanush Family New Hero Entry Under His Direction - Sakshi

సౌత్‌ ఇండియాలో స్టార్‌ హీరోగా ధనుష్ కొనసాగుతున్నారు. 'సార్‌' విజయం తర్వాత ఆయన మరింత జోరుగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న 'కెప్టెన్‌ మిల్లర్‌' చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పీరియాడికల్ వార్ డ్రామాగా ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెతో రానుంది. తర్వాత తన మైల్‌స్టోన్ 50వ చిత్రానికి కూడా ప్లాన్‌ చేస్తున్నాడు. అయితే ధనుష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించకుండా అతిధి పాత్రలో మాత్రమే కనిపించనున్నాడు. కానీ ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే ఈ మూవీని ఆయనే డైరెక్ట్‌ చేయనున్నారు.


(తల్లి విజయలక్ష్మి, అక్కలు విమల గీత (కుడి), కార్తీక (ఎడమ)తో  ధనుష్)

పవర్ పాండి తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఇది. ఇందులో S.J సూర్య,సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, అనిఖా సురేంద్రన్, దుషార విజయన్, సెల్వరాఘవన్‌లు ఉండగా కీలక పాత్ర కోసం మట్టి కుస్తి హీరో విష్ణు విశాల్‌ను తీసుకున్నాడు. ఇదిలా ఉండగా తన మూడవ చిత్రాన్ని కూడా ధనుస్‌ లైన్‌లో పెట్టాడట. ఈ సినిమాతో అతని మేనల్లుడు ఆరంగేట్రం చేస్తున్నాడట. ధనుష్‌, సెల్వరాఘవన్‌లకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

డాక్టర్ విమల గీత, డాక్టర్ కార్తీక వారిద్దరూ చెన్నైలో ఒక ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. వారిలో ధనుష్‌ అక్క అయిన విమల గీత కుమారుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అందుకోసం అతను ఇప్పటికే శిక్షణ కూడా ప్రారంభించాడట. ఇదే నిజమైతే ధనుష్‌ల ఫాలోయింగ్‌తో అతని ఎంట్రీ కూడా భారీ రేంజ్‌లో ఉంటుందని అభిమానులు పేర్కొంటున్నారు.


(ధనుష్ అక్క విమల గీత  ఫ్యామిలీ)

మేనల్లుడికి ఇండస్ట్రీలో మంచి ప్లాట్‌ఫామ్‌ క్రియేట్‌ చేయాలని అందుకు కావాల్సిన కథను ఇప్పటికే రెడీ చేశాడట. ఈ సినిమా కోసం మ్యూజిక్‌ కింగ్‌ అనిరుధ్ రవిచందర్‌ను ఏర్పాటు చేస్తున్నాడట. ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ములతో 'D51' కూడా జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement