danush
-
'అమరన్' దర్శకుడితో ధనుష్ సినిమా.. ఛాన్స్ కొట్టేసిన టాప్ హీరోయిన్
కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, కథకుడు ఇలా.. పలు ముఖాలు కలిగిన నటుడు ధనుష్. అంతేకాదు బహుభాషా నటుడు. బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే. ప్రస్తుతం ఏక కాలంలో కథానాయకుడిగా మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో ఒకటి ద్విభాషా చిత్రం కుబేర. రెండోది ఇడ్లీ కడై. ఈ చిత్రానికి ధనుష్ దర్శకుడు కూడా. ఇక మూడో చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. గోపురం ఫిలిమ్స్ పతాకంపై అన్బు చెళియన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమరన్ చిత్రం ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. వీర సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రతో ఈయన అమరన్ చిత్రాన్ని తెరకెక్కించిన ఘనత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ధనుష్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం గురించి ఆయన ఒక భేటీలో పేర్కొంటూ ఇది కూడా రియల్ హీరో కథా చిత్రంగానే ఉంటుందని తెలిపారు. సమాజంలో ఎందరో రియల్ లైఫ్ వీరులు, హీరోలు ఉన్నారన్నారు. వారిలో ఒకరి కథగా తమ చిత్రం ఉంటుందని చెప్పారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గురించి అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నటి శృతిహాసన్ నాయకిగా నటించనున్నారన్నదే ఆ అప్డేట్. ఇంతకు ముందే ధనుష్, శృతిహాసన్ 3 అనే చిత్రంలో నటించారు. దీంతో మరో సారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందన్న మాట. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో నటిస్తున్న శృతిహాసన్ తదుపరి ధనుష్ తో జత కట్టనున్నారన్న మాట. కాగా రాయన్ చిత్రం తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
నయనతారకు అహంకారం.. అందుకే అలాంటి కామెంట్ చేసింది: సింగర్
నటి నయనతారకు ధన అహంకారం పెరిగిందని, సంచలన గాయని నటి సుచిత్ర పేర్కొన్నారు. ఇంతకుముందు పేరుతో పలువురు ప్రముఖ అంతరంగిక విషయాలను బయటపెట్టి కలకలం సృష్టించిన ఈమె కొద్దిగా సైలెంట్‌గా ఉండి ఇప్పుడు మళ్లీ తన మార్కు విమర్శలు, ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. తాజాగా నటి నయనతారపై విరుచుకుపడ్డారు. నటి నయనతార ఇటీవల యూట్యూబ్ ఛానల్ భేటీలో పాల్గొన్నారు. దానిపై గాయని సుచిత్ర స్పందిస్తూ నటి నయనతార ఇటీవల నటుడు ధనుష్‌ను విమర్శిస్తూ విడుదల చేసిన ప్రకటనను తాను చూశానన్నారు. అందులో ధనుష్‌పై ఉన్న ఆరోపణలన్నీ నయనతార వెల్లడించారన్నారు. దీంతో తాను నయనతారను అభినందించానన్నారు. అయితే ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న వివాదం ధనవంతులైన ఇద్దరి (నటుడు ధనుష్, నయనతార) మధ్య జరుగుతున్న పోరు అని పేర్కొన్నారు. మీ ఇద్దరి ఇళ్లల్లోనూ డబ్బు రూ.కోట్లలో మూలుగుతోందన్నారు. ఈ ఇద్దరికీ డబ్బు అహంకారం పెరిగిపోయిందన్నారు. కాగా నటి నయనతార చాలా గౌరవప్రదంగా మాట్లాడే వారిని అయితే ఇటీవల ఆమె ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నటించిన చిత్రాల కంటే తన డాక్యుమెంట్ చిత్రాన్ని ప్రేక్షకులు అధికంగా చూశారని పేర్కొనడం నయనతారలో ఎంత అహంకారం పెరిగిన దానికి నిదర్శనం అని పేర్కొన్నారు. బాలీవుడ్‌కు చెందిన అనుపమ చోఫ్రా గత రెండేళ్లుగా ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారని, ఆమె ప్రముఖులను మోయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అలాగే ఆమె నటి నయనతారను పొగడ్తలు ముంచేశారన్నారు. అందుకు ఆమె భారీగా డబ్బు పొందినట్లు తెలిసిందన్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నటి నయనతార ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతలా తాను నటుడు ధనుష్ ను ఢీకొంటున్నట్లు చెప్పడంతో పాటు, జవాన్ చిత్రం తర్వాత హిందీలో మరో అవకాశం రాకపోవడంతో అక్కడ అవకాశాలు పొందే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోందని గాయని సుచిత్ర పేర్కొన్నారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
మేము శత్రువులం కాదు.. పదేళ్లలో అంతా మారిపోయింది: నయనతార
ఇండియన్ స్టార్స్‌గా వెలుగొందుతున్న తారలు నటుడు ధనుష్,నటి నయనతార. వీరిద్దరూ సంచలన తారలుగా ముద్ర పడిన వారే. అదేవిధంగా ఇటీవల ఈ ఇద్దరి మధ్య పెద్ద వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. సమీప కాలంలో నటి నయనతార నటుడు ధనుష్‌ను విమర్శిస్తూ మీడియాకు బహిరంగ ప్రకటనను చేసి ప్రకంపనలు సృష్టించారు. అందుకు కారణం ఆమె జీవిత ఘటనలతో రూపొందిన నయనతార బిహైండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ చిత్రం కోసం నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని కొన్ని సీన్స్, పాటల సన్నివేశాలను ఉపయోగించడానికి అనుమతి కోరగా అందుకు ఆ చిత్ర నిర్మాత ధనుష్ నిరాకరించడమే. అయినా ఆ చిత్రంలోని మూడు నిమిషాల నిడివి గల సన్నివేశాలను నయనతార తన డాక్యుమెంటరీ చిత్రంలో వాడారు. దీంతో ధనుష్ నటి నయనతారపై రూ.10 కోట్లు నష్టపరిహారం కోరుతూ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి సమస్య ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్న విషయం విధితమే. ఇలాంటి పరిస్థితుల్లో నటి నయనతార ఓ భేటీలో ధనుష్ గురించి ప్రస్తావిస్తూ తాను, ధనుష్ బద్ధ శత్రువులు కాదన్నారు. ఇంకా చెప్పాలంటే కొంతకాలం క్రితం వరకూ మంచి మిత్రులుగా ఉన్నామని పేర్కొన్నారు. అలాంటిది 10 ఏళ్లలో అంతా మారిపోయిందన్నారు. అందుకు పలు కారణాలు ఉండవచ్చనని, వాటి గురించి ఇప్పుడు ప్రస్తావించలేనన్నారు. తనకు సరి అనిపిస్తే దాన్ని చేయడానికి తాను భయపడనన్నారు. తాను తప్పు చేస్తే కదా భయపడటానికి అన్నారు. అదే విధంగా పబ్లిసిటీ కోసమో, మరే విషయం కోసమో తాను ఎవరినీ అణగదొక్కాలని భావించనన్నారు. తన జీవితంలో ముఖ్యమైన చిత్రంలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకోవడానికి ధనుష్ అనుమతి కోసం ఆయన మేనేజర్‌కు పలు సార్లు ఫోన్ చేశానని, ఆయన్ని ఫోన్ మాట్లాడమని కోరానని, అదీ జరగలేదన్నారు. ధనుష్ పాపులర్ నటుడిని ఆయనకు అశేష అభిమానులు ఉన్నారని, అందులో తాము ఉన్నామన్నారు. అయితే నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తన వ్యక్తిగత జీవితానికి సంబంధం ఉండడం వల్లే వాటిని వాడుకోవడానికి అనుమతి కోరినట్లు నయనతార పేర్కొన్నారు. కాగా ఈమైపె నటుడు ధనుష్ వేసిన పిటిషన్ గురువారం న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి ఈ మేరకు వివరణ కోరుతూ.. నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులకు, నెట్ ఫ్లిక్స్ సంస్థకు నోటీసులిచ్చారు. అనంతరం వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. -
జాగ్రత్త అంటూ.. నయనతారకు మద్ధతుగా స్టార్ హీరోయిన్స్
ధనుష్‌పై ఆరోపణలు చేస్తూ నటి నయనతార ఈరోజు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, కోలీవుడ్ నుంచి చాలామంది స్టార్స్‌తో పాటు పలువురు టాప్ హీరోయిన్లు కూడా నయన్‌కు మద్ధతు తెలిపారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మాతగా నేనూ రౌడీనే అనే చిత్రం తీసిన విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన ఈ సినిమా 2015లో విడుదలైంది.నయనతార జీవిత చరిత్ర డాక్యుమెంటరీలో ధనుష్ అనుమతి లేకుండా నేనూ రౌడీనే సినిమా నుంచి మూడు సెకండ్ల వీడియోను ఉపయోగించుకున్నారు. దీంతో కాపీ రైట్స్ చట్టం కింది తనకు రూ. 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ధనుష్ నోటీసులు పంపారు. దీంతో నయన్ ఫైర్ అవుతూ ధనుష్‌పై సంచలన ఆరోపణలు చేసింది. చాలాకాలంగా తమపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపిస్తున్నావ్ అంటూ ధనుష్‌పై మండిపడింది. "నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట నువ్వు ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది.' అంటూ ఫైర్ అయింది.నయనతారకు మద్ధతుగా స్టార్స్నయనతార చేసిన ఆరోపణలకు చాలామంది స్టార్స్ మద్ధతు ఇస్తున్నారు. ఆమె షేర్ చేసిన పోస్ట్‌కు శ్రుతిహాసన్, నజ్రియా, ఏక్తాకపూర్, ఐశ్వర్య లక్ష్మి, దియా మీర్జా, శిల్పారావు లైక్ కొట్టి తమ సపోర్ట్ తెలిపారు. తంగలాన్ సినిమాతో తెలుగు వారికి దగ్గరైన మలయాళ నటి పార్వతీ తిరువొత్తు కూడా నయన్‌కు సపోర్ట్ చేసింది. ఆమెకు సెల్యూట్ చేస్తూ.. నయన్ ధైర్యాన్ని మెచ్చుకుంది. స్మృతి కిరణ్ అనే దర్శకురాలు కూడా ఈ విషయంపై రియాక్ట్ అయింది. ఈ సంఘటన చాలా బాధాకరం అంటూనే నయన్‌ను అభినందించింది. ఇలాంటి విషయాలు బయటపెట్టినప్పుడు పలు ఇబ్బందులు రావచ్చని కూడా సూచించింది. అయితే, ధనుష్‌కు భారీగా ఆయన ఫ్యాన్స్ మద్ధతు తెలుపుతున్నారు. వివాదాలు ఉంటే ఇలా ఒక అగ్ర హీరో గురించి తప్పుగా ఎలా మాట్లాడుతారంటూ నయన్‌పై మండిపడుతున్నారు. -
క్రేజీ కాంబినేషన్.. 'అమరన్' దర్శకుడితో స్టార్ హీరో సినిమా ఫిక్స్
కోలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌కు శ్రీకారం చుట్టారు. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న నట, దర్శక, నిర్మాత ధనుష్. ఈయన ఇటీవల స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం రాయన్ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నాడీ కోపం చిత్రాన్ని కొత్తవారితో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కాగా ప్రస్తుతం ఇడ్లీ కడై చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తెలుగు, తమిళం భాషల్లో ఈయన కథానాయకుడిగా నటిస్తున్న కుబేర చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. తాజాగా మరో కొత్త చిత్రానికి సిద్ధమయ్యారు. ఇటీవల శివకార్తికేయన్ హీరోగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన చిత్రం అమరన్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా రాజ్‌కుమార్ పెరియసామి ధనుష్ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది నటుడు ధనుష్ 55వ చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అన్భుచెలియన్ సమర్పణలో గోపురం ఫిలింస్ పతాకంపై సుస్మిత అన్భు చెలియన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో తాజాగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుస్మిత అన్బుచెలియన్ పేర్కొంటూ ధనుష్, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి వంటి ప్రతిభావంతులతో చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఇది వీరి కాంబినేషన్లో ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించే కథా చిత్రంగా ఉంటుందని ఆమె చెప్పారు. -
కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌ల విడాకుల విషయంలో కోర్టుకు హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, వారిద్దరూ విచారణ కోసం కోర్టులో హాజరుకాలేదు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా 2022లో పలు విభేదాల వల్ల తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ సమయం నుంచి ఇద్దరూ వేర్వేరుగానే ఉంటున్నారు.ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ తమ వైవాహిక జీవితం ముగిసిందంటూ పరస్పర విడాకుల కోసం చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో రెండేళ్ల క్రితమే పిటిషన్ వేశారు. కానీ, ఇప్పటి వరకు కోర్టులో మాత్రం హజరవలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే న్యాయస్థానం ముందుకు రావాలని వారికి నోటీసులు కూడా కోర్టు పంపింది. ఈ క్రమంలో అక్టోబర్ 7న విచారణకు రావాల్సి ఉంది. అయితే, వారిద్దరూ ఇప్పుడు కూడా కోర్టులో హాజరు కాలేదు. దీంతో అక్టోబర్ 19కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి శుభాదేవి తెలిపారు.2004లో ప్రేమ వివాహం చేసుకున్న ధనుష్, ఐశ్వర్య పలు విభేదాల వల్ల 2022 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరిని కలిపేందుకు రజనీకాంత్ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయినా కూడా వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, కోర్టు విచారణకు వారిద్దరూ హజరు కాకపోవడంతో మళ్లీ కలుస్తారంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. -
'రాయన్'తో లాభాలు.. ధనుష్‌కు గిఫ్ట్‌గా రెండు చెక్కులు
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టింది. దీంతో నిర్మాత కళానిధి మారన్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాజాగా ధనుష్‌ను కలిసి రెండు చెక్కులు అందించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధనుష్ కెరియర్లో 50వ చిత్రంగా జూలై 27న విడుదలైంది.ధనుష్ హీరోగా, డైరెక్టర్‌గా తన ప్రతిభను రాయన్‌లో చూపించాడు. బాక్సాఫీస్ వద్ద రూ. 158 కోట్ల కలెక్షన్లు రాబట్టి నిర్మాతతో పాటు పంపిణీదారులకు కూడా రాయన్ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇది ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా, అలాగే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా గుర్తింపు పొందింది. ధనుష్‌ని స్వయంగా కలుసుకున్న నిర్మాత ఆపై రెండు చెక్కులను చిత్ర విజయానికి బహుమతిగా అందజేశారు. ఒకటి హీరోకి,మరొకటి దర్శకుడికి అంటూ చెప్పుకొచ్చారు. అయితే, ధనుష్‌కు ఎంత మొత్తం ఇచ్చారని చెప్పలేదు. కానీ, సుమారు రూ. 10 కోట్ల వరకు ఇచ్చి ఉంటారని నెట్టింట ప్రచారం జరుగుతుంది.ఓటీటీలో రాయన్రాయన్ సినిమా నేడు (ఆగష్టు 23) ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్,ఎస్.జే సూర్య వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ తన తర్వాతి ప్రాజెక్ట్‌పై నిమగ్నమయ్యాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున,రష్మిక మందన్నా వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. -
ఓటీటీలోకి వచ్చేందుకు 'రాయన్' ఫిక్స్ అయ్యాడా..?
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. రాయన్ చిత్రాన్ని తెరకెక్కించిన తీరును చూసిన ప్రేక్షకులు ధనుష్ టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు. ఇందులోని నటీనటులు అందరూ కూడా తమ అద్భుతమైన నటనతో ఇచ్చిపడేశారు. టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు వంటి వారు కూడా రాయన్ సినిమా చూసి ఫిదా అయ్యారు. జూలై 27న విడుదలైన రాయన్ ఇప్పటి వరకు సుమారు రూ. 140 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.రాయన్ సినిమా ఈనెల చివరి వారంలో ఓటీటీలోకి రానుందని వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో రాయన్‌తో భారీ ఢీల్ సెట్ చేసుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లో ఓటీటీలో విడుదల చేయాలనే ఒప్పందం ఉన్నట్లు సమాచారం. దీంతో ఆగస్టు 30వ తేదీన రాయన్ స్ట్రీమింగ్కు రావచ్చని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.రాయన్ సినిమాలో ధనుష్‌తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్,ఎస్.జే సూర్య వంటి స్టార్స్ నటించారు. భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. ఇప్పిటికే బాక్సాఫీస్ వద్ద భారీగానే ఆ సంస్థ లాభాలు అందుకుంది. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ తన తర్వాతి ప్రాజెక్ట్‌పై నిమగ్నమయ్యాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున,రష్మిక మందన్నా వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. -
16 ఏళ్ల వయసులో రజనీకాంత్ ఇంటికి వెళ్లినప్పుడే నిర్ణయించుకున్నా: ధనుష్
తమిళసినిమా: బహుముఖ ప్రతిభావంతుడు బహుబాషా నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం రాయన్. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. ఎస్జే సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్‌కిషన్, కాళిదాస్ జయరాం, దూసరా విజయన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సందర్భంగా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మేకర్స్ నిర్వహించారు. ఈ వేదికపై నటుడు ధనుష్ పలు ఆసక్తికరమైన విషయాలను పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తే బాగుంటుందని ఆయనకు ఫోన్ చేసి ఇది తన 50వ చిత్రం అని చెప్పానన్నారు. అందుకు ఆయన తాను ప్రస్తుతం చాలా చిత్రాలు చేస్తున్నానని రెండు రోజుల్లో నీకు ఏ విషయం చెప్తానని అన్నారు. అన్నట్లుగానే రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి మీ చిత్రం చేస్తున్నాను అని చెప్పారు అన్నారు. అప్పుడు తనకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అన్నారు.కాగా ఇటీవల ధనుష్‌పై చాలా వదంతులు ప్రచారం అయిన విషయం తెలిసిందే. వాటిపై కూడా స్పందించిన ధనుష్ తానేంటో తనకు తెలుసని తన తల్లిదండ్రులకు, తన మిత్ర బృందానికి తెలుసని, ప్రారంభ దశ నుంచి బాడీ షేమింగ్‌కు గురయ్యారని పేర్కొన్నారు. అదేవిధంగా అనవసరపు వదంతులు, చెడ్డ పేరు, వెన్నుపోట్లు అంటూ పలు విషయాలు జరిగిన ఇంకా తాను ఇప్పుడిలా మీ ముందు నిలబడ్డానంటే అందుకు మీరే (ప్రేక్షకులను ఉద్దేశించి) కారణం అన్నారు. అదేవిధంగా తాను పోయెస్‌గార్డెన్‌లో ఇల్లు నిర్మించుకోవడానికి కారణాన్ని కూడా తెలుపుతూ పదహారేళ్ల వయసులోనే సెక్యూరిటీని బతిమాలి పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటిని చూడడానికి వెళ్లారన్నారు. అప్పుడే తాను ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక కలిగిందన్నారు. దాన్ని ఇటీవలే నెరవేర్చుకున్నట్లు ధనుష్ పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం పోయెస్ గార్డెన్స్‌లో సుమారు రూ. 150 కోట్లతో తనకు నచ్చిన విధంగా అద్భుతమైన ఇల్లు ధనుష్ నిర్మించారు. -
రజనీకాంత్‌తో పోటీకి దిగుతున్న ధనుష్
నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. నటి ప్రియాంక అరుణ్ మోహన్ నాయకిగా నటించగా నివేదిత సతీస్, జాన్ కొక్కెన్, సుమేష్కుమార్, శివరాజ్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. అరుణ్ మాదేశ్వరన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ముందుగా నిర్మాతలు ప్రకటించారు. ఇదే సమయంలో రజనీకాంత్ సినిమా కూడా విడుదల కానుంది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లాల్ సలామ్ సినిమా కూడా పొంగల్‌కు రెడీ అయిపోయింది. ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ సినిమాతో పోటీ ఎందుకని కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని ముందుగానే అంటే డిసెంబర్ నెలలోనే విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయింది. ఈ విషయంలో చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారమే అంటే సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంక్రాంతి పండుగరోజు రజనీకాంత్‌కు, ధనుష్‌కు మధ్య పోటీ తప్పనిసరిగా మారింది. లాల్ సలామ్ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అదే విధంగా ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్ర టీజర్, పాటలు విడుదలై ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకులు ఇచ్చే రిజల్ట్స్ పైనే సినీ వర్గాల్లోనూ, అటు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. కెప్టెన్ మిల్లర్ 2024 జనవరి 15న విడుదల అవుతుండగా... లాల్ సలామ్ సంక్రాంతికి విడుదల అని మాత్రమే ప్రకటించారు. -
అందరిలా నేనెందుకు ఆనందంగా లేనంటే: టాప్ హీరోయిన్
నటి అమలాపాల్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మంచి, సంచలన, వివాదాస్పద నటి అంటూ ముద్రవేసుకున్న నటి ఈమె. మైనా చిత్రంతో కోలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్ ఆ తరువాత వరుసగా పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. విజయ్, ధనుష్ వంటి ప్రముఖ నటులు సరసన నటించిన అమలాపాల్ టాలీవుడ్‌లోనూ నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. నటిగా మంచి పీక్‌లో ఉండగానే దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసుపై వివరణ ఇచ్చిన వరలక్ష్మీ శరత్‌కుమార్.. ఆదిలింగం ఎవరంటే) అయితే రెండేళ్లలోపే మనస్పర్థలు రావడంతో వీరి పెళ్లి విడాకులకు దారి తీసింది. కాగా అమలాపాల్‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. అందులో మైనా చిత్రం తరువాత తాను చాలా మానసిక వేదనకు గురయ్యానని పేర్కొంది. జీవితంలో మోసపోయాను అనడం కంటే మోసగించబడ్డాననే చెప్పాలన్నారు. కరోనా కాలంలో రెండేళ్ల పాటు ఇంట్లోనే కూర్చొని తన గురించి తాను ఆలోచించుకుని ఆవేదన చెందానని చెప్పింది. (ఇదీ చదవండి: విజయనిర్మల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్) తనను చూసి తన కంటే ఎక్కువ తన తల్లి బాధపడిందని చెప్పింది. తనకు మార్గదర్శి అంటూ ఎవరూ లేరంది. ఒక వేళ అలాంటి వ్యక్తి ఎవరైనా వుండి వుంటే తానూ అందరిలా ఆనందంగా ఉండేదానినేమోనని పేర్కొంది. కాగా ఆ మధ్య నిర్మాతగా మారిన అమలాపాల్ ప్రస్తుతం మాతృభాషలో మూడు చిత్రాలు, తమిళంలో ధనుష్ 50వ చిత్రంలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
అలాంటి వ్యక్తి నా జీవితంలో లేనట్లే.. ముఖం కూడా చూడను: సోనియా అగర్వాల్
సోనియా అగర్వాల్ టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రకారులో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. 2004లో విడుదలైన '7/జీ బృందావన కాలనీ' అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం కుమారుడు రవికృష్ణ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో సోనియా అగర్వాల్ హీరోయిన్ నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత ఇక్కడ అంతగా అవకాశాలు రాకపోవడంతో తమిళ్, కన్నడ సినిమాలపై ఫోకస్ పెట్టి అక్కడ మంచి విజయాలే అందుకుంది. తాజాగ '7/జీ బృందావనీ కాలనీ' సీక్వెల్ తీస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: చంద్రయాన్ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ హీరోయిన్) తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలోనే హీరో ధనుష్ అన్నయ్య అయిన దర్శకుడు సెల్వ రాఘవన్‌ను 2006లో వివాహమాడి ఆపై 2010లో విడాకులు తీసుకుంది. తర్వాత సెల్వరాఘవన్ 2011లో మళ్లీ పెళ్లి చేసుకున్నా.. సోనియా ఒంటరిగానే జీవిస్తోంది. తాజాగ ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను ఇలా పంచుకున్నారు. 'దర్శకుడిగా సెల్వరాఘవన్ మొండి పట్టుదలగలవాడు. కానీ వ్యక్తిగత జీవితంలో అలాంటి వ్యక్తి కాదు. చాలా ప్రశాంతమైన వ్యక్తి, ఎల్లప్పుడూ బిజీగా ఉంటారు. రచన వగైరాలతో ఎప్పుడూ తనదైన లోకంలో ఉండేవాడు. కానీ తనతో వైవాహిక జీవితం గురించి ఇక మాట్లాడే ప్రసక్తే లేదు. మేం ఎందుకు విడిపోయామో అతనికి, నాకు తెలుసు. ప్రస్తుతం ఆయన వెళ్తున్న దారిలో ఎంత సంతోషంగా ఉన్నారో.. నేను కూడా అంతే సంతోషంగా ఉన్నాను.' అని సోనియా అన్నారు. జీవితంలో భార్యాభర్తలుగా కలిసి ఉన్నవాళ్లు విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా ఎలా ఉంటున్నారో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. తన వరకు అయితే అది సాధ్యం కాదని చెప్పింది. అలాంటి పని మాత్రం చేయలేనని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అతను తన కంటికి మళ్లీ స్నేహితుడిగా కనిపించడని పేర్కొంది. ప్రేమ చనిపోయిన తర్వాత స్నేహితుడిలా చూడలేమని తెలిపింది. జీవితంలో మళ్లీ తన ముఖం చూడనని, అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ లేనట్లేనని సోనియా అగర్వాల్ అన్నారు. పెళ్లి తర్వాత తన సినిమా కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదని సోనియా పేర్కొంది. (ఇదీ చదవండి: రాజమౌళి- మహేశ్‌బాబు సినిమాపై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది) పెళ్లి జరిగిన సమయం నుంచే నటించకూడదని సెల్వ కుటుంబం అభ్యంతరం చెప్పిందని ఆమె గుర్తుచేసుకుంది. అందుకే ఆ సమయంలో బ్రేక్ తీసుకున్నానని తెలిపింది. అయితే 2010లో భర్త నుంచి విడిపోయిన తర్వాత, తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లు సోనియా చెప్పింది. ఆ తర్వాత ఆమె కన్నడ,తమిళ్లో పలు సినిమాలతో బిజీగానే ఉంటుంది. ఇప్పుడు '7/జీ బృందావన కాలనీ' సీక్వెల్‌తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆమె ప్రకటించింది -
ఆ ఇల్లు వల్లే ధనుష్-ఐశ్వర్య విడిపోయారా..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటున్నట్లు సుమారు రెండేళ్ల క్రితం ప్రకటించడం ఆపై వారిద్దరూ వేరువేరుగా ఉంటున్న విషయం తెలిసిందే. సుమారు 18ఏళ్ల పాటు కలిసి ఉన్న ధనుష్ దంపతులు ఈ నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది బహిరంగంగా వారిద్దరిలో ఎవరూ తెలపలేదు. కానీ వారిద్దరి విడాకులకు కారణం ధనుష్ కట్టించుకున్న ఇళ్లే అని సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: బ్రోలో సాయిధరమ్ తేజ్ రెండో చెల్లెలిగా నటించిందెవరో తెలుసా?) చెన్నైలోని పోయేస్ గార్డెన్లో హీరో ధనుష్ రూ.150 కోట్లతో కొత్త ఇంటిని నిర్మించిన సంగతి తెలిసిందే.. ఆ ఇంటిని నిర్మించే సమయంలో ధనుష్‌కు రజనీకాంత్ ఒక సలహా ఇచ్చారట. ఇళ్లు ఈ ప్రాంతంలో కాకుండా మరోచోట కట్టేందుకు ప్లాన్ చేయమని రజనీకాంత్ సలహా ఇచ్చారట. దీనికి ప్రధాన కారణం వాస్తు, జ్యోతిష్యం పట్ల రజనీకి విశ్వాసం ఎక్కువ. దీంతో ఈ ఇళ్లు కడితే కుటుంబానికి కూడా అంతగా కలిసిరాదని వద్దన్నారట. కానీ ఇవేమి లెక్కచెయకుండా పోయేస్‌గార్డెన్‌లో రజనీ ఇంటికి అతి సమీపంలోనే ధనుష్ ఇళ్లు నిర్మించడం 2021లో ప్రారంభించాడు. కానీ ఈ ఇంటి పనులను ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ధనుష్-ఐశ్వర్య ఇద్దరి మధ్య గొడవలు రావడం స్టార్ట్ అయ్యాయట. తన నాన్నకంటే ఇంత రిచ్‌గా ఇళ్లు కట్టడం ఎందుకని వారిద్దరి మధ్య గొడవ మొదలైందట. వీటితో పాటు ఐశ్వర్య సినిమా డైరెక్టర్,నిర్మాత అవడం, అందువల్ల భారీగా డబ్బు నష్టపోవడం ధనుష్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని అందుకే వారి మధ్య గొడవలు వచ్చాయిని కొందరు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కాదు ధనుష్ మరో హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే విడాకుల వరకు వెళ్లారని మరికొందరి వాదనగా ఉంది. ఏదేమైన ఇక్కడ ఇళ్లు కట్టడం అంత మంచిది కాదని రజనీకాంత్ సూచించడం వాస్తవమేనని పలువురు చెప్పుకొచ్చారు. అలా ధనుష్ నిర్మించిన ఇంటికి వాస్తు లేకపోవడంతోనే వారిద్దరి మధ్య దూరం పెరిగిందని ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. 2021లో ధనుష్ ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే.. 2022లో వారిద్దరు విడిపోయారు. 2023లో ధనుష్ తన తల్లిదండ్రులతో ఆ కొత్త ఇంటిలోకి ప్రవేశించారు. (ఇదీ చదవండి: తన 'కొత్త ప్రేమ'ని వెల్లడించిన సమంత) -
మేనల్లుడి కోసం ధనుష్, అనిరుధ్ మాస్టర్ ప్లాన్ ?
సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా ధనుష్ కొనసాగుతున్నారు. 'సార్' విజయం తర్వాత ఆయన మరింత జోరుగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న 'కెప్టెన్ మిల్లర్' చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పీరియాడికల్ వార్ డ్రామాగా ఆయన కెరీర్లోనే భారీ బడ్జెతో రానుంది. తర్వాత తన మైల్స్టోన్ 50వ చిత్రానికి కూడా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ధనుష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించకుండా అతిధి పాత్రలో మాత్రమే కనిపించనున్నాడు. కానీ ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే ఈ మూవీని ఆయనే డైరెక్ట్ చేయనున్నారు. (తల్లి విజయలక్ష్మి, అక్కలు విమల గీత (కుడి), కార్తీక (ఎడమ)తో ధనుష్) పవర్ పాండి తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఇది. ఇందులో S.J సూర్య,సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, అనిఖా సురేంద్రన్, దుషార విజయన్, సెల్వరాఘవన్లు ఉండగా కీలక పాత్ర కోసం మట్టి కుస్తి హీరో విష్ణు విశాల్‌ను తీసుకున్నాడు. ఇదిలా ఉండగా తన మూడవ చిత్రాన్ని కూడా ధనుస్ లైన్లో పెట్టాడట. ఈ సినిమాతో అతని మేనల్లుడు ఆరంగేట్రం చేస్తున్నాడట. ధనుష్, సెల్వరాఘవన్లకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. డాక్టర్ విమల గీత, డాక్టర్ కార్తీక వారిద్దరూ చెన్నైలో ఒక ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. వారిలో ధనుష్ అక్క అయిన విమల గీత కుమారుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అందుకోసం అతను ఇప్పటికే శిక్షణ కూడా ప్రారంభించాడట. ఇదే నిజమైతే ధనుష్‌ల ఫాలోయింగ్‌తో అతని ఎంట్రీ కూడా భారీ రేంజ్లో ఉంటుందని అభిమానులు పేర్కొంటున్నారు. (ధనుష్ అక్క విమల గీత ఫ్యామిలీ) మేనల్లుడికి ఇండస్ట్రీలో మంచి ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేయాలని అందుకు కావాల్సిన కథను ఇప్పటికే రెడీ చేశాడట. ఈ సినిమా కోసం మ్యూజిక్ కింగ్ అనిరుధ్ రవిచందర్‌ను ఏర్పాటు చేస్తున్నాడట. ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ములతో 'D51' కూడా జరుగుతుంది. -
స్కూల్ ఫ్రెండ్స్‌తో రీ యూనియన్ అయిన టాప్ హీరో.. ఫోటోలు వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ధనుష్‌కు టాలీవుడ్ లోను భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన తాజాగ తన స్కూల్ స్నేహితులను కలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: రీ- రిలీజ్ సినిమాలకు ఎందుకంత క్రేజ్..?) ధనుష్ స్కూల్లో చదువుకునే రోజుల్లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒకరకంగా సినిమాపై ఉండే పిచ్చి అభిమానమే చదువుకు ఫుల్స్టాప్ పెట్టి ఆయన్ను ఇండస్ట్రీ వైపు నడిపించింది. ఇప్పడు అంతర్జాతీయ స్థాయిలో తానేమిటో ప్రూవ్ చేసుకున్న ధనుష్ మళ్లీ తన స్కూల్ ఫ్రెండ్స్‌తో ఇలా కలిశాడు. ఎప్పుడో విడిపోయిన వారందరూ మళ్లీ ఇలా ఒక్కసారి రీయూనియన్ అయ్యారు. ధనుష్ ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు కదా తమతో కలుస్తాడా..? తమతో కలిసి భోజనం చేస్తాడా..? కనీసం ఫోటో అయినా దిగుతాడా..? అనే సందేహాలు వారిలో వచ్చాయట. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా గత మూలాలు ఎలా మరిచిపోతామని ధనుష్ పేర్కొన్నాడట. వారితో ఒకరోజంతా గడపడమే కాకుండు పలు పాటలకు డ్యాన్స్‌లు చేయడమే కాకుండా అందరూ కలిసి భోజనం చేయడం. ఇలా ఆనందంగా గడిపారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం గడిపింది మీతోనే కదా అని ఆయన తెలపడంతో వారంతా ఎంతో సంతోషంగా ధనుష్‌తో ఫోటోలు దిగారట. ప్రస్తుతం ధనుష్ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలను స్కూల్ డేస్ నుంచి ఉన్న కొందరు స్నేహితులే చూసుకుంటున్నారు. గతంలో స్కూల్ డేస్ గురించి ధనుష్ ఏమన్నారంటే సార్ సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి చాలా ఎమోషనల్ అయ్యాడు. అప్పట్లో చదువును నిర్లక్ష్యం చేశానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకునే సమయంలో చాలా అల్లరి పనులు చేశానని ధనుష్ గుర్తు చేసుకున్నారు. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసం ట్యూషన్లో చేరానని, అక్కడ టీచర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడంతో సిగ్గేసి కొన్ని రోజుల తర్వాత ట్యూషన్ మానేశానని పేర్కొన్నారు. అప్పట్లో తాను ఒక అమ్మాయి కోసం బయట వేచి చూస్తుండేవాడినని, తాను వచ్చినట్టు ఆమెకు తెలిసేందుకు బైక్‌తో సౌండ్ చేసేవాడినని అన్నారు. ఇది చూసి టీచర్ లోపలున్న విద్యార్థులతో.. మీరంతా బాగా చదువుకుని పరీక్షలు పాసైతే ఉన్నత స్థానాల్లో ఉంటారని, బయట బైక్‌తో శబ్దం చేసేవాడు వీధుల్లో డ్యాన్స్ చేసుకోవాల్సిందేనని వారితో అన్న విషయం తనకు తెలిసిందన్నారు. ఆ తర్వాత ఆ టీచర్ చెప్పినట్టే తమిళనాడులో ప్రస్తుతం తాను డ్యాన్స్ చేయని వీధంటూ ఏమీలేదని నవ్వుతూ చెప్పారు. అప్పట్లో తానెందుకు సరిగ్గా చదువుకోలేదని అనిపిస్తూ ఉంటుందని, ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతూ ఉంటానని అన్నారు. ఇప్పుడు ఆ మిత్రులందరిని ధనుష్ మరోసారి కలుసుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. -
అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్
తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సార్పట్టా పరంపరై చిత్రంలో అయ్యకు జంటగా కథానాయికిగా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత నక్షత్రం నగర్గిరదు చిత్రంలో మరోసారి నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. కాగా తాజాగా వసంత బాలన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన అనిత చిత్రంలో నటుడు అర్జున్‌దాస్‌తో పోటీ పడి నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం బాలాజి మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న దుషారా ఈ చిత్రంతో పాటు ధనుష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. దుషారా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అందుకే ఎలాంటి పాత్రలో నటించడానికై నా సిద్ధం అన్నారు. అయితే చిత్రంలో తన పాత్ర ఐదు నిమిషాలు ఉన్నా దానికి ప్రాధాన్యత ఉండాలన్నారు. (ఇదీ చదవండి: అమల అక్కినేనితో బాలీవుడ్ హీరో, ఫోటో వైరల్) కుటుంబకథా చిత్రాల నాయకి ఇమేజ్ తెచ్చుకున్న తనను గ్లామర్ పాత్రల్లో నటిస్తారా అని చాలామంది అడుగుతున్నారని, అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉందని, అలా ప్రేక్షకులు ముఖం తిప్పుకునేది ఏది గ్లామర్ కాదని అన్నారు. అందాలారబోతలో హద్దులు తనకు తెలుసని, అలాంటి పరిమితులుతో కూడిన గ్లామర్ పాత్రల్లో నటించడానికి తాను సిద్ధమేనని అన్నారు. బాలుమహేంద్ర, మణిరత్నం దర్శకులు అంటే ఇష్టం అని చెప్పారు. -
ఆ సూపర్ హిట్ సినిమాకు పార్ట్-2 ఉంది: వెట్రిమారన్
ధనుష్ హీరోగా వడచైన్నె- 2 చిత్రాన్ని కచ్చితంగా చేస్తానని దర్శకుడు వెట్రిమారన్ పేర్కొన్నారు. 2018లో పార్ట్-1 ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే. తాజాగా తమిళ్ సినిమా చిత్ర పాత్రికేయుల సంఘం నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకుడు వెట్రిమారన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు ధనుష్ కథా నాయకుడిగా వడచైన్నె - 2 చిత్రాన్ని కచ్చితంగా చేస్తానని ఆయన చెప్పారు. అంతకుముందు రెండు చిత్రాలు చేయాల్సి ఉందన్నారు. (ఇదీ చదవండి: అర్జున్ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే) అదే విధంగా నటుడు సూర్య కథా నాయకుడిగా ఆజన్బీ పుస్తకాన్ని చిత్రంగా తెరకెక్కించాలని అసురన్ చిత్ర షూటింగ్ సమయంలోనే నిర్ణియించానన్నారు. షూటింగ్‌కు ప్రారంభించాలనుకున్న సమయంలో కరోనా రావడంతో అది ఆగిపోయిందని చెప్పారు. పార్ట్-2 కథ రెడీగానే ఉంది. త్వరలో హీరో ధనుష్‌తో చర్చిస్తానని ఆయన పేర్కొన్నాడు. తాజాగా తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన 'విడుదల' సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో కమెడియన్ సూరి హీరోగా నటించగా విజయ్ సేతుపతి ముఖ్యపాత్ర పోషించాడు. (ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్) -
Amala Paul: మూడోసారి రొమాన్స్ చేసేందుకు రెడీ?
నటుడు ధనుష్ సరసన మూడోసారి నటించడానికి నటి అమలాపాల్ సిద్ధమవుతున్నారా? అంటే అలాంటి అవకాశమే ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి ఆనంద్ రాయ్ దర్శకత్వంలో ఒక హిందీ చిత్రాన్ని, తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయనున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఏకకాలంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తదుపరి ఆయన తన 50వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. (ఇదీ చదవండి: Drugs Case: ఆషూ రెడ్డి వీడియో విడుదల) ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇందులో నటి దుషార విజయన్, నటుడు విష్ణువిశాల్ తదితరులు ముఖ్య పాత్రలకు ఎంపికై నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ధనుష్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది చర్చగా మారింది. ముందుగా త్రిష నటించనున్నట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత అపర్ణ బాలమురళి పేరు వెలుగులోకి వచ్చింది. తాజాగా సంచలన నటి అమలాపాల్ పేరు వినిపిస్తోంది. (ఇదీ చదవండి: ఆకాంక్ష పూరి నడుమును కెమెరాల ముందే పట్టుకున్న నటుడు) ఇటీవల కోలీవుడ్‌లో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌పై దృష్టి సారించిన అమలాపాల్ ఇంతకుముందు ధనుష్‌కు జంటగా రఘువరన్ బీటెక్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాలు విజయాన్ని సాధించాయి. దీంతో మళ్లీ మూడోసారి ధనుష్ 50వ చిత్రంలో ఈ మలయాళీ భామ నటించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
త్రిష VS శ్రీలీల ఫుల్ డిమాండ్
-
సార్ మీ అందరి కథ – ధనుష్
‘‘సార్’ సినిమా అన్నివర్గాల వారికి నచ్చుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ల కథతో కనెక్ట్ అవుతారు. ‘సార్’ మీ అందరి కథ.. మీకు నచ్చుతుందని, అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని హీరో ధనుష్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారంవిడుదలకానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ– ‘‘2002లో నా తొలి చిత్రం విడుదలయినప్పుడు నెర్వస్‌గా ఉన్నా.. ఇప్పుడు 2023లో నా తొలి తెలుగు సినిమా రిలీజ్ అవుతోంది.. ఇప్పుడు కూడా అలాగే ఉంది. తమిళ్, హిందీ, ఇంగ్లిష్ సినిమాలు చేశాను.. ప్రతి సినిమాని నా మొదట దిగానే భావిస్తా. ‘సార్’ ఒక సింపుల్ ఫిల్మ్.. కానీ, గ్రాండ్ ఎమోషన్స్, మెసేజ్ ఉంటుంది. నా తర్వాతి తెలుగు సినిమాకి తప్పకుండా తెలుగులో మాట్లాడతాను’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ–‘‘ఒక మనిషి జీవన శైలిని మార్చేది చదువు మాత్రమే. అంత గొప్ప ఆయుధాన్ని డబ్బులేని వాళ్లకి దూరం చేయడం ఎంత వరకు న్యాయం? అనే ప్రశ్నే ‘సార్’ సినిమాలో వెంకీ అడిగే ప్రయత్నం చేశాడు. భారతీయ సినిమా చరిత్రలో ఒకప్పటి తరంలో శివాజీ గణేశన్‌గారు, కమల్ హాసన్‌గారు, తెలుగులో ఎన్టీఆర్‌గారు, నాగేశ్వరరావుగారు.. ఇలా తొలి తరం నటుల్లో ఎంత గొప్పవారుఉన్నారో తర్వాతి తరం గొప్ప నటుల్లో ధనుష్‌కి నేను టాప్ ప్లేస్ ఇస్తాను.. ఎందుకంటే సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆయనకు భయం లేదు. పని చేయడాన్ని మాత్రమే ఇష్టపడతాడు. అలా పనిచేసుకుంటూ పోయే ధనుష్‌ని ఎవరూ ఆపలేరు’’ అన్నారు. ‘‘మా సార్’ చిత్రం ప్రీమియర్స్ ఒక రోజు ముందే వేస్తున్నామంటే సినిమాపై మాకు ఎంత నమ్మకం ఉందో జనాలకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. చాలా మంచి సినిమా ఇది.. ఎవరూ నిరుత్సాహపడరు’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. ‘‘నా ‘తొలి ప్రేమ’ సినిమా తర్వాత ఇంత నమ్మకంగా చెబుతున్నా. ‘సార్’ ప్రీమియర్స్ అయిన తర్వాత వచ్చే మౌత్ టాక్‌తో 17న అందరూ సినిమాకి వస్తారు’’ అన్నారు వెంకీ అట్లూరి. ఈ వేడుకలో నిర్మాత ఎస్.రాధాకృష్ణ, కెమెరామేన్ జె.యువరాజ్, నటుడు సాయికుమార్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. -
కొత్త కబురు
హీరో మాధవన్ కొత్త కబురు చెప్పా రు. తన తర్వాతి సినిమా డైరెక్టర్ మిత్రన్‌తో చేయనున్నట్లు పేర్కొన్నారాయన. తమిళ చిత్ర పరిశ్రమలో గత ఏడాది హిట్ కొట్టిన చిత్రాల్లో ‘తిరుచిత్రంబలం’ (తెలుగులో ‘తిరు’) ఒకటి. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా హిట్ కావడంతో మిత్రన్‌కి మరో మంచి అవకాశం లభించింది. మాధవన్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘‘దర్శకుడు మిత్రన్‌తో సినిమా చేయడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు మాధవన్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. -
హైదరాబాద్‌లో ప్రారంభమైన ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’
ధనుష్ హీరోగా వెంకీ అల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘సార్’. సోమవారం ఈ సినిమాలో హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్ నారాయణ, పారిశ్రామికవేత్త సూరేశ్ చుక్కపల్లి కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ఎస్ రాధాకృష్ణ స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందించాడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, లక్ష్మీ సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేరళ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. జనవరి 5న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభం కానుందని ఈ సందర్భంగా మూవీ యూనిట్ స్పష్టం చేసింది. ఈ సినిమాలో ధనుష్ లెక్చరర్ పాత్ర కనిపించనుండగా.. సాయి కుమార్, తనికెళ భరణి, నర్రా శ్రీను కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. -
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
-
పాన్ ఇండియా మోజులో టాలీవుడ్ స్టార్స్, అదే అందరి టార్గెట్
భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా సినిమాపై దృష్టి పెట్టారు టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్. బాహుబలి సిరీస్ తర్వాత ప్రపంచ మార్కెట్ మీదనే కన్నేశారు. గతంలో మాదిరి ఒక భాషకి పరిమితం కాకుండా... రెండు మూడు భాషలు లక్ష్యంగా సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదగాలనేదే అందరి టార్గెట్. అందుకే పాన్ ఇండియా లెవెల్లో కొత్త కాంబినేషన్స్‌కు ట్రెండ్ ఊపందుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా దలపతి విజయ్ హీరో గా తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మరో 6 నెలల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు దర్శక, నిర్మాతలు. ఇక మరో తమిళ స్టార్ ధనుష్ దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయునున్నాట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమా నెక్ట్ జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది అని టాక్. అంతే కాకుండా ధనుష్ మరో తెలుగు దర్శకుడితోనూ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రామ్ చరణ్ 15 వ సినిమాగా వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు . సుమారు 500 కోట్ల తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ సినిమా ద్వారా ఇండియన్ పొలిటికల్ సిప్టమ్ మీద స్ట్రాంగ్ సెటైర్స్ వేయనున్నారట శంకర్. అంతే కాకుండా ఈ పాన్ ఇండియా మూవీలో అమితా బచ్చన్ ఓ కీలకపాత్ర పోషించనున్నారు . కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ 'సలార్' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే మెదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండు షెడ్యూల్ లోకి కూడా అడుగుపెట్టారు చిత్ర యూనిట్. సుమారు 350 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి . దీంతో పాటు ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడట ప్రభాస్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ లో ఈ సినిమా తెరకెక్కనుంది అని టాక్. రామ్‌తో తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ మధ్యనే సినిమా స్టార్ట్ చేసారు.ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది . ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా మురగాదాస్ దర్శకత్వంలో గజనీ 2 సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు నిర్మాత అల్లు అరవింద్. సూర్య కోసం బోయపాటి శ్రీను ఓ భారీ యాక్షన్ ధ్రిల్లర్‌ను రెడీ చేసాడట. శివకార్తికేయన్ కోసం 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కథలు సిద్ధం చేశారు అని తెలుస్తుంది . 'రాక్షసుడు-2' చిత్రం కోసం విజయ్ సేతుపతి రంగంలోకి దిగే అవకాశాలున్నాయనీ కూడా ప్రచారం సాగుతోంది. -
నవ్వులు పూయిస్తున్న డాక్టర్ ‘రౌడీ బేబీ’ పేరడీ సాంగ్
తమిళ హీరో ధనుష్, నాచ్యురల్ బ్యూటీ సాయిపల్లవి కలిసి స్టెప్పులేసిన ‘రౌడీ బేబీ’ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. రెండేళ్ల క్రితం ఏ ఫంక్షన్లో చూసినా, ఎవరి ఫోన్ రింగ్ అయినా ఈ పాటనే వినబడేది. అంతలా ఆకర్షించింది ఈ ‘రౌడీ బేబీ’. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డు సాధించింది. ప్రస్తుతం ఇండియా సినిమాల్లో ఏ పాటకు రానన్ని వ్యూస్ ‘రౌడీ బేబీ’సొంతం చేసుకుంది. దానికి కారణం కేవలం సాయిపల్లవి క్రేజ్, యాక్టింగ్ అనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె వేసిన స్టెప్పులకి సీనీ అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడిప్పుడే ఈ పాటను కాస్త మర్చిపోతున్న తరుణంలో ఓ డాక్టర్ పుణ్యమా అని మళ్లీ అంతా ‘రౌడీ బేబీ’ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఈ సారి ఒరిజినల్ ‘రౌడీ బేబీ’ని కాకుండా.. పేరడీ పాటను విని తెగ నవ్వుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. దేశంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతన్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో భాస్కర్ అనే ఓ వైద్యుడు గుండె ఆరోగ్యం గురించి చెబుతూ.. ‘రౌడీ బేబీ’ పెరడీ పాడారు. మధ్యపానం, ధూమపానం చేయకూడదని, ఉప్పు, మసాల కూడా తక్కువగా తినాలని పాట రూపంలో చెప్పాడు. ప్రస్తుతం ఈ పేరడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఒకే వేదికపై మామ అల్లుడికి అవార్డులు
చెన్నై: మామ అల్లుళ్లు నటుడు రజినీకాంత్, ధనుష్ ఒకే వేదికపై ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. రజనీ, కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే అసురన్ చిత్రంలో నటనకు, ఆయన అల్లుడు, ధనుష్ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించింది. 67వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మే 3న నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే వేదికపై రజనీకాంత్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించనున్నారు. ఇలా ఒకే వేదికపై మామ అల్లుళ్లు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోవడం అరుదైన విషయమే. చదవండి: ఒక అవార్డు... ఎన్నో ప్రశ్నలు! -
నా ప్రేయసి వద్దకు వచ్చేశా
తమిళ హీరోల్లో ఏడాదికి మూడు సినిమాలు చేస్తుంటారు ధనుష్. ఎప్పటికప్పుడు సినిమాలను ప్రారంభిస్తూ, పూర్తి చేస్తూ బిజీబిజీగా ఉంటారాయన. కరోనా కారణంగా సుమారు ఏడు నెలలు షూటింగ్స్‌కు దూరమయ్యారు ధనుష్. ఆయన చేతిలో దాదాపు నాలుగు సినిమాలున్నాయి. తాజాగా మళ్లీ షూటింగ్ లొకేషన్లో అడుగుపెట్టారు. బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అత్రంగీ’. అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు ధనుష్. కెమెరాతో దిగిన ఫోటోను పంచుకొని, ‘నా ప్రేయసి (కెమెరాని ఉద్దేశించి) దగ్గరకు తిరిగొచ్చేశాను’ అని పేర్కొన్నారు. -
ట్రెండింగ్‌లో ‘హ్యాపీ బర్త్ డే ధనుష్’
తమిళ హీరో ధనుష్ కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్‌లోను మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇక ధనుష్‌లో నటుడితో పాటు కథకుడు, గాయకుడు, గీత రచయిత, దర్శకుడు, నిర్మాత ఉన్నారన్న విషయం తెలిసిందే. ఆయన నేడు (జూలై 28) 37వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ధనుష్ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు బర్త్‌డే విషెష్ తెలియజేశారు. దీంతో ‘అసురన్’, ‘హ్యాపీ బర్త్‌డే ధనుష్’ హ్యాష్ ట్యాగ్లు ట్విటర్లో ట్రెండింగ్ అవుతున్నాయి. Happy birthday my bro @dhanushkraja ... to another fantastic year ahead 🤗😃 — Anirudh Ravichander (@anirudhofficial) July 28, 2020 ‘హ్యాపీ బర్త్‌డే మై బ్రో.. మరో అద్భుతమైన సంవత్సరంలోకి అడుగుపెడున్నారు’ అని సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ట్విటర్లో ధనుష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ‘హ్యాపీబర్త్ డే ధనుష్, మీరు చాలా ప్రేమ, అదృష్టాన్ని పొందాలి’ అని హీరోయిన్ జెనిలియా ట్విటర్లో విష్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే ధనుష్, మరో అద్భుతమైన ఏడాదిలో అడుగుపెతున్నారు’ అని హీరోయిన్ కాజల్ బర్త్‌డే విషెష్ తెలియజేశారు. మలయాళ హీరో టోవినో థామస్ ధనుష్‌తో దిగిన ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసి బర్త్‌డే విషెష్ తెలియజేశారు. Happy Birthday brother!! ❤️ @dhanushkraja #HappyBirthdayDhanush pic.twitter.com/60EpzvQl4O — Tovino Thomas (@ttovino) July 28, 2020 వీరితో పాటు మెహ్రీన్ పిర్జాదా, ఐశ్వర్య రాజేష్, విష్ణు విశాల్, సంతోష్ నారాయన్ ట్విటర్లో ధనుష్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ధనుష్ ప్రస్తుతం తన నటించిన ‘జగామే తంతిరామ్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ధనుష్ నటించే బాలీవుడ్ చిత్రం ‘అట్రాంగి రే’ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. Happy birthday @dhanushkraja have a fab one 💕 — Kajal Aggarwal (@MsKajalAggarwal) July 28, 2020 -
అన్నయ్య దర్శకత్వంలో ధనుష్ మూవీ
చెన్నై : తనను హీరోగా చేసిన అన్నయ్యకు ఇప్పుడు తమ్ముడు చెయ్యి అందించడానికి సిద్ధం అవుతున్నాడు. దర్శకుడు సెల్వరాఘవన్, నటుడు ధనుష్ గురించే ఈ వార్త. తుళ్లువదో ఇళౖయె చిత్రంతో ధనుష్‌ను హీరోగా పరిచయం చేసింది ఆయన అన్న సెల్వరాఘవన్ అన్న విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా కాదల్ కొండాన్, పుదుపేటై వంటి చిత్రాలతో సెల్వరాఘవన్ తన తమ్ముడు ధనుష్‌ను హీరోగా నిలబెట్టాడు. ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్న ధనుష్, ఇటీవల సరైన సక్సెస్‌లు లేని తన అన్నయ్యకు చెయ్యి అందించడానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం. సెల్వరాఘవన్ ఇటీవల సూర్య హీరోగా తెరకెక్కించిన ఎన్జీకే చిత్రం నిరాశ పరిచింది. దీంతో ఆయన ధనుష్ హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. దీన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.ధాను నిర్మించనున్నట్లు సమాచారం. ఈయన ధనుష్‌తో వరుసగా మూడు చిత్రాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం అసురన్ చిత్రాన్ని ధనుష్ హీరోగా నిర్మిస్తున్నారు. దీని తరువాత మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ఇక మూడో చిత్రాన్ని సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేయనున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ధనుష్ అరసన్ చిత్రంతో పాటు దురై సెంథిల్ దర్శకత్వంలో ఒక చిత్రం, కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మరో చిత్రం అంగీకరించారు. వీటిలో వెట్ట్రిమారన్ దర్శకత్వంలో నటిస్తున్న అసురన్, దురైసెంథిల్ దర్శత్వంలో నటిస్తున్న చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకున్నాయి. కాగా కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అదే విధంగా మారి సెల్వరాజ్‌తో చిత్రం కూడా పూర్తయిన తరువాత తన అన్న సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ చిత్రం 2020లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే సెల్వరాఘవన్ ఇటీవల పుదుపేట్టై చిత్రానికి సీక్వెల్ చేస్తానని ప్రకటించారు. బహుశా ఇదే అది అవుతుందా? అన్న చర్చ ఇప్పుడు కోలీవుడ్‌లో జరుగుతోంది. -
అల్లుడికి మరో చాన్స్
చెన్నై : అల్లుడు ధనుష్‌కు తలైవా మరో చాన్స్ ఇవ్వడానికి ఫిక్సయినట్టున్నారు. రజనీకాంత్ ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారు. ఆయన అభిమానులు త్వరగా రాజకీయ పార్టీని ప్రారంభించాలని కోరుకుంటున్నారు. ఇవి రెండూ నిజమే అయినా రజనీకాంత్‌ను మాత్రం సినిమాలు వదల బొమ్మాళి వదలా! అని అంటున్నాయి. రజనీకాంత్‌కు కాలా చిత్రమే చివరిది అనే ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత పేట చిత్రం చేసేశారు. అదీ హిట్ అయ్యి కూర్చుంది. తాజాగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చేస్తున్నారు. నయనతార నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో ముమ్మరంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. తదుపరి కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటించడానికి రజనీకాంత్ పచ్చజెండా ఊపినట్లు ప్రచారంలో ఉంది. తాజాగా తన అల్లుడు ధనుష్‌కు మరో అవకాశం ఇవ్వాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటుడు ధనుష్ హీరోగా బిజీగా ఉన్నారు. అయితే ఈయన తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, వండర్‌బార్ ఫిలింస్ నష్టాల్లో ఉందనే వదంతి ప్రచారంలో ఉంది. ఈ విషయం రజనీకాంత్ దృష్టికి వెళ్లడంతో అల్లుడిని నష్టాల్లోంచి బయడ పడేసేందుకు ఆయన సంస్థలో ఒక చిత్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా టాక్ స్ప్రెడ్ అయ్యింది. ధనుష్ ఇంతకుముందు తన మామ రజనీకాంత్ హీరోగా కాలా చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర సక్సెస్ వారి అంచనాలను రీచ్ కాలేదనే టాక్ ప్రచారంలో ఉంది. దీంతో వండర్‌బార్ ఫిలింస్ సంస్థకు రజనీకాంత్ మరో చాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. దీనికి పేట చిత్రం ఫేమ్ కార్తీక్‌సుబ్బరాజ్‌ను దర్శకుడిగా ఎంపిక చేయాలని ధనుష్ భావిస్తున్నారు. కార్తీక్‌సుబ్బరాజ్ ధనుష్ హీరోగా ఒక చిత్రం చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే రజనీకాంత్, కార్తీక్‌సుబ్బరాజ్‌ల కాంబినేషన్లో చిత్రం చేయడానికి ధనుష్ సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం దర్బార్ 2020 ప్రథమార్థంలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దీంతో రజనీకాంత్ వండర్‌బార్ ఫిలింస్ సంస్థలో నటించే చిత్రం ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది మొదట్లోగానీ సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
స్పృహతప్పి పడిపోయిన అనుపమ..
టీ.నగర్: ఒక చిత్రంలో నటిస్తూ వచ్చిన అనుపమ హఠాత్తుగా స్పృహ తప్పడం సంచలనం కలిగించింది. ధనుష్‌కు జంటగా ‘కొడి’ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ నటించారు. ప్రస్తుతం మళయాల, తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. గురువారం ఆమె ఒక తెలుగు చిత్రంలో ప్రకాష్‌రాజ్‌తో నటిస్తూ వచ్చారు. ఒక టెన్షన్ సీన్లో నటిస్తుండడంతో భావోద్వేగానికి గురైన అనుపమ స్పృహతప్పి కిందపడ్డారు. వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. దీనిగురించి అనుపమ తన ఫేస్బుక్లో ఈ విధంగా పోస్ట్ చేశారు. ప్రకాష్‌రాజ్‌తో నటిస్తుండగా డైలాగ్‌ను పూర్తిగా చెప్పలేక తటపాయించానని, వెంటనే ఆయన మళ్లీ డైలాగ్ చదివి నటించాలని తెలిపారన్నారు. ఇదివరకే తనకు చలిజ్వరంతో బాధపడ్డానని, లో బీపీతో బాధపడినట్లు తెలిపారు. దీంతో స్పృహతప్పడం జరిగిందని, ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిపారు. -
కేన్స్ చిత్రోత్సవాల్లో ధనుష్
తమిళసినిమా: తమిళ సినిమా గర్వించదగ్గ నటులలో ధనుష్ ఒకరు. నటుడు, గాయకుడు, గీతరచయిత, దర్శకుడు, నిర్మాత అంటూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. సినిమాలోని బహు శాఖల్లో తన ప్రతిభను చాటుకుంటున్న ధనుష్ నటుడిగానూ కోలీవుడ్, బాలీవుడ్‌ను దాటి హాలీవుడ్ ప్రేక్షకులను త్వరలోనే అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈయన నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది ఎక్స్ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఆంగ్లం, ఫ్రెంచ్ భాషల్లో రూపొందిన లవ్, కామెడీ, అడ్వంచర్ కథా చిత్రంగా ఉంటుంది. చిత్ర ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను తెచ్చుకుంది. ఈ చిత్రం మరో రికార్డును సాధించింది. చిత్రాన్ని కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఈ చిత్రోత్సవాలు ఈ నెల 8వ తేదీ ఫ్రాన్స్‌లో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి నటుడు ధనుష్ గురువారం ‘ది ఎక్స్ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’చిత్ర యూనిట్‌తో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లారు. అక్కడ చిత్ర బృందంతో కలిసి తీసుకున్న ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. -
వారసురాలు వస్తోంది
వ్యాపారం, వాణిజ్యం, రాజకీయం, సినీరంగం... ప్రస్తుతం అన్నిచోట్లా వారసత్వం ఆనవాయితీగా మారింది. అదే కోవలో ప్రముఖ నటులు రజనీకాంత్ సైతం కొత్తగా పెట్టబోయే రాజకీయపార్టీలో ఆయన చిన్న కుమార్తె సౌందర్యను వారసురాలిగా రంగంలోకి దించబోతున్నట్లు సమాచారం. అలాగే రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య భర్త, నటుడు ధనుష్ సైతం మామకు తోడుగా నిలుస్తారని తెలుస్తోంది. దీన్ని ధృవీకరిస్తూ మధురైలో ధనుష్ అభిమానుల పేరుతో ‘అరసియల్ వారిసే’ (రాజకీయ వారసుడా) గురువారం పోస్టర్లు కూడా వెలిశాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆకస్మిక మరణం రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ శూన్యతకు దారి తీసింది. ఈ శూన్యాన్ని భర్తీ చేసేందుకు నటుడు కమల్‌హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీని స్థాపించేశారు. అన్నాడీఎంకే బహిష్కృత నే టీటీవీ దినకరన్ సైతం ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే పార్టీని గురువారం ప్రకటించారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమని జనవరి ఆరంభంలో రజనీకాంత్ ప్రకటించారు. రెండు కోట్ల సభ్యత్వం లక్ష్యంగా పనులు ప్రారంభించారు. రజనీకాంత్ ప్రజా సంఘాలకు ఇన్‌చార్జ్‌ల నియామకం దాదాపు పూర్తయింది. పార్టీ పేరును ప్రకటించడం మినహా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న దశలో రజనీ హిమాలయాలకు ఆధ్యాత్మిక పర్యటనకు పయనమయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ వెండితెర వారసురాలిగా చిన్న కుమార్తె సౌందర్య స్వీయ దర్శకత్వంలో కొచ్చడయన్ అనే యానిమేషన్ సినిమాను నిర్మించారు. ఆ సినిమా ఘోరపరాజయం పొంది రజనీ కుటుంబాన్ని అప్పులపాలు చేసిన తరువాత కూడా సినిమారంగంలోనే కొనసాగడంలో వెనకడుగు వేయలేదు. వెండితెర వెనుక తండ్రికి అండగా నిలిచిన ఆమె రాజకీయాల్లో సైతం తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా తన భర్త, నటుడు ధనుష్‌ను తండ్రికి తోడుగా రాజకీయాల్లోకి సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కొందరు ధనుష్ అభిమానులు మధురైలో పోస్టర్లు కూడా వేసేశారు. ధనుష్‌ను రజనీకాంత్ ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న ఫొటోలతో ‘అరసియల్ వారిసే’ (రాజకీయ వారసుడా) అని పోస్టర్లలో నినాదాన్ని రాశారు. కోలీవుడ్‌లో ధనుష్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. పెద్ద ఎత్తున యువత అభిమానాన్ని ఆయన చూరగొన్నాడు. రజనీకాంత్ రాజకీయాలకు ధనుష్ తోడైతే రాజకీయ పార్టీకి మరింత ఊపు ఖాయమని అంచనా వేస్తున్నారు. హిమాలయాల్లోనూ సాధ్యం కాదు సాధారణ వ్యక్తిలా తిరిగేందుకు హిమాలయాలకు వచ్చే నేను ఇకపై ఇక్కడ కూడా అలా తిరగడం సాధ్యం కాదని తెలుసుకున్నట్లు నటులు రజనీకాంత్ చెప్పారు. రిషికేష్‌లోని ధ్యానానంద సరస్వతి ఆశ్రమంలో బుధవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం అక్కడి ఇంగ్లీషు చానల్ ప్రతినిధితో రజనీకాంత్ మాట్లాడారు. ఒక మనిషి తనను తాను తెలుసుకోవడంలోనే జన్మసార్ధకత చేకూరుతుందన్నారు. అందుకే హిమాలయాలకు వచ్చానని, «ధ్యానం చేయడం, ఆధ్యాత్మికపరమైన పుస్తకాలు చదవడం, ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ప్రజలతో కలిసి సంచరించడం కోసమే ఇలాంటి ప్రయాణాలు చేస్తుంటానన్నారు. రాజకీయ పార్టీల నేతలు, సినిమా రంగంలోని వారు నాకు ఇక్కడ అవసరం లేదని, ఇక్కడి ప్రజలు, ప్రకృతి మాత్రమే నాకు చాలునన్నారు. తమిళనాడులో ఇలా సంచరించడం సాధ్యం కాదని, ప్రజల్లో సా«ధారణ వ్యక్తిలా తిరిగే అవకాశాలను ఏనాడో కోల్పోయానని తెలిపారు. ఆ లోటును భర్తీ చేసుకునేందుకే 1995 నుంచీ హిమాలయాలకు వస్తూ స్వేచ్ఛగా తిరిగేవాడినని పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లోకి రావడంతో ఇక్కడ కూడా తిరిగే అవకాశాలు లేవన్నారు. రాజకీయాల్లోకి వచ్చినవారు త్యాగాలకు సిద్ధం కావాలని, తాను సైతం అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆ దేవుడు నటుడిగా ఇచ్చిన పాత్రను సరిగా పోషించానని, ఇక రాజకీయ నాయకుడిగా కొత్తపాత్రకు నూరుశాతం న్యాయం చేయగలనని నమ్ముతున్నట్టు తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, త్యాగాలు చేయడం ద్వారా వాటిని నెరవేర్చేందుకు సిద్ధమన్నారు. -
రజనీ పార్టీలోకి ధనుష్, సౌందర్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నటుడు రజనీకాంత్ తమిళనాట కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీలో ఆయన కుటుంబసభ్యులు చేరనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్యతోపాటు పెద్ద కుమార్తె ఐశ్వర్య భర్త, నటుడు ధనుష్‌లు పార్టీలో చేరతారని సమాచారం. రజనీకాంత్ ప్రస్తుతం హిమాలయాల్లో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. కాగా, రాజకీయాల్లోకి వచ్చిన వారు త్యాగాలకు సిద్ధం కావాలని, తాను సైతం అందుకు సిద్ధంగా ఉన్నానని రజనీకాంత్ అన్నారు. రిషీకేశ్‌లో ఓ ఇంగ్లిష్ చానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ‘రాజకీయ నాయకుడిగా కొత్త పాత్రను దేవుడిచ్చాడు. ఈ పాత్రకూ 100 శాతం న్యాయం చేయగలను’ అని చెప్పారు. -
ధనుష్‌తో వరూ సై
సాక్షి, సినిమా: నటుడు ధనుష్‌తో నటించడానికి నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ సై అన్నారు. వరలక్ష్మీ ఒక పక్క కథానాయకిగా నటిస్తూనే మరో పక్క చాలెంజింగ్ పాత్రల్లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. అలా ధనుష్ కథానాయకుడిగా నటించినున్న తాజా చిత్రం మారి-2లో కీ రోల్‌ను పోషించడానికి ఓకే చెప్పేశారు. ఇంతకు ముందు ధనుష్ హీరో బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరపైకొచ్చిన మారి చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. నటి కాజల్ అగర్వాల్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చిత్ర వర్గాలు అప్పుడే ప్రకటించారు. దానికి ఇప్పుడు ముహూర్తం కుదిరింది. ధనుష్ హీరోగా నటించి తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్న మారి-2లో సాయిపల్లవి కథానాయకిగా ఎంపికైంది. ఇందులో ముఖ్య పాత్రకు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నటుడు, నిర్మాత ధనుష్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అందుకు ప్రతిగా ట్విట్ చేసిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మారి-2లో తనను ఒక భాగం చేసినందుకు ధనుష్, దర్శకుడు బాలాజీ మోహన్‌కు కృతజ్ఞతలు చెప్పింది. ఈ చిత్రంలో నటించడానికి ఆలస్యం చేయదలచుకోలేదు. ఎప్పుడెప్పుడు నటిస్తానా అని చాలా ఎగ్జైట్‌గా ఫీలౌతున్నాను అని పేర్కొన్నారు. ఇందులో మలయాళ నటుడు టోవినో థామస్ ప్రతినాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నారు. సుమారు 10 ఏళ్ల తరువాత ధనుష్, యువన్‌శంకర్‌రాజా కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం మారి-2 అన్నది గమనార్హం. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను కొత్త సంవత్సరం వెల్లడించే అవకాశం ఉంది. -
ధనుష్‌తో సునైనా చిందులు
నటుడు ధనుష్ చిత్రంలో చిందులేయడానికి సిద్ధమైంది నటి సునైనా. కోలీవుడ్‌లో తన ఉనికిని చాటుకుంటున్న మరో టాలీవుడ్ భామ సునైనా. అయితే కొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించినా ఎందుకనో నటిగా తనకుంటూ ఒక స్థాయికి చేరుకోలేకపోయింది. కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ అడపాదడపా అవకాశాలను అందుకుంటోంది. ఆ మధ్య కవలైవేండామ్ చిత్రంలో అతిథిగా మెరిసిన సునైనా ఆ తరువాత మళ్లీ కోలీవుడ్‌లో కనిపించలేదు. అయితే పస్తుతం సముద్రకనికి జంటగా తొండన్ చిత్రంలో నటించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్‌లోనూ పెళ్లికి ముందు ప్రేమకథ అనే ఒక చిత్రంలో నటిస్తున్న సునైనాకు కొత్తగా అవకాశాలేమీ లేవు. తమిళంలో తొండన్ చిత్రం కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడికి ధనుష్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసి ఒప్పేసుకుందట. ధనుష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ఎన్నై నోక్కి పాయుం తోట్టా ఒకటి. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుక్ను తరుణంలో దర్శకుడికి, ధనుష్‌కు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో మళ్లీ చిత్ర నిర్మాణం మొదలైంది. కాగా 90 శాతం చిత్రీకరణ పూర్తి అయిన ఎన్నైనోక్కి పాయుం తోట్టా చిత్రంలో నటి సునైనాను ఎంపిక చేయడం ఏమిటన్న విషయం గురించి ఆరా తీయగా అమ్మడు ఈ చిత్రంలో సింగిల్ సాంగ్‌కు చిందులేయనుందని చిత్ర వర్గాలు తెలిపాయి. మొత్తం మీద చాలా మంది కథానాయకిల మాదిరిగానే సునైనా కూడా ఐటమ్ సాంగ్‌కు సై అనేసిందన్న మాట. చిత్రంలో ఈ జాణ పాట కనువిందు చేస్తే మరిని అలాంటి అవకాశాలు రావచ్చు. -
కర్నూల్ జిల్లాలో సినీహీరో ధనుష్ సందడి
-
నటుడు ధనుష్‌కు కోర్టు సమన్లు
చెన్నై : నటుడు ధనుష్‌కు చెన్నై ఎగ్మూర్ కోర్టు సమన్లు జారీ చేసింది.వివరాల్లోకెళితే నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, ఫాక్స్‌స్టార్ సూడిమోస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం కాక్కముట్టై. ఇటీవల విడుదలయిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాగా ఈ చిత్రంలో న్యాయవాదులను కించపరచే విధంగా సన్నివేశాలు చోటు చేసుకున్నాయంటూ అఖలభారత న్యాయవాదుల సంఘం పరిరక్షణ సంఘం అధ్యక్షుడు మణివన్నన్ ఎగ్మూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు శుక్రవారం మెజిస్ట్రేట్ మురుగన్ సమక్షంలో విచారణకు వచ్చింది. పిటిషనర్ తర పున న్యాయవాది నమోనారాయణ హాజరయ్యి తన వాదనలను వినిపించి భారతశిక్షాస్మృతి ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.ఆయన వాదనలను విన్న న్యాయమూర్తి నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, చిత్ర దర్శకుడు మణికంఠన్‌లకు సమన్లు జారీ చేశారు. -
రజనీకాంత్‌కు హైకోర్టు నోటీసు
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మద్రాసు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. రజనీకాంత్ పేరు వాడుకుని ఆయన వియ్యంకుడు (నటుడు ధనుష్ తండ్రి) కస్తూరి రాజా రూ. 65 లక్షల మోసానికి పాల్పడినట్లు సినీ ఫైనాన్షియర్ ముకున్‌చంద్ బోద్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి వారంలోగా రజనీకాంత్ తరపున బదులు పిటిషన్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేశారు. అయితే, గతంలో ముకున్‌చంద్ నిర్మించిన ‘మే హూన్ రజనీకాంత్’ అనే సినిమాకు తన పేరు వాడుకున్నందుకు రజనీకాంత్ కోర్టును ఆశ్రయించి, ఆ చిత్రాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు పొందడం గమనార్హం. -
మార్చి 20న అనేకుడు రిలీజ్
-
ఆ తలనొప్పి వాళ్లదే!
అభిమానులలాగే తానూ మామయ్యతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని హీరో ధనుష్ అంటే.... ‘క్రమశిక్షణ, హార్డ్‌వర్కే ఎవరినైనా సక్సెస్ వైపు నడిపిస్తాయి కానీ కుటుంబ నేపథ్యం కాదు’ అంటోంది హీరోయిన్ అక్షర హాసన్. ‘షమితాబ్’ చిత్రం ప్రమోషన్ కోసం ఇద్దరూ నగరానికి వచ్చిన సందర్భంగా ‘సిటీ ప్లస్’ పలకరించింది. ఆ చిట్‌చాట్ వారి మాటల్లోనే... ధనుష్: ‘మా మావయ్య (రజనీ కాంత్)తో నటించరా?’ అని చాలా మంది అడుగుతుంటారు. నిజంగా అలాంటి అవకాశం వస్తే అది అద్భుతం. నేనూ అందుకోసమే ఎదురు చూస్తున్నాను. ఇద్దరికీ సరిపడా కథ వస్తే నా భార్య సౌందర్యతో కలిసి కూడా నటిస్తానేమో. భార్యే హీరోయిన్ అయితే మీరు వివాదాలేమీ సృష్టించరు (నవ్వుతూ). అందుకే సొంత బ్యానర్... నా సోదరుడు (సెల్వరాఘవన్), నేను ఇండస్ట్రీలోకి రావడానికి పడ్డ ఇబ్బందులు నాకు గుర్తున్నాయి. అందుకే ‘వండర్‌బార్ ఫిల్మ్స్’ బ్యానర్‌ను స్థాపించాం. దీని ద్వారా దర్శకులు, నటులు, మ్యూజీషియన్స్, ఎడిటర్స్‌ను సైతం పరిచయం చేశాం. నాకెందుకా భారం..! ఈ సినిమాలో నా లుక్ గురించి ఎలాంటి కేర్ తీసుకున్నారని అడుగుతున్నారు. అయినా అదంతా నాకెందుకు చెప్పండి? మా స్టైలిస్ట్ తలనొప్పి కదా (నవ్వుతూ). ఇదే సమాధానం నా డ్రీమ్క్యారెక్టర్ ప్రశ్నకూ వర్తిస్తుంది. ఫీల్డ్కి వచ్చిన కొత్తలో అలాంటివి చేయాలి? ఇలాంటివి చేయాలి? అనే ఆలోచనలు ఉండేవి. ఇప్పుడు నా కోసం మంచి పాత్రలు సృష్టించే పని చేసేవాళ్లు చేస్తున్నారు. ఇక నాకెందుకా భారం చెప్పండి?( నవ్వుతూ) పూర్తిగా కొత్త సబ్జెక్ట్... షమితాబ్ ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్. ఓ మూడు రకాల వ్యక్తిత్వాలున్న ముగ్గురు వ్యక్తుల మధ్య కథ. డబ్బింగ్ తొలుత పూర్తి చేసి ఆ తర్వాత షూటింగ్ చేయడం దగ్గర్నుంచి... ఎన్నో ప్రయోగాలు చేశాం. ఇక ఇండియన్ సినిమాకు లెజండ్రీ పర్సనాలిటీ అయిన అమితాబ్‌తో నటించడం గొప్ప ఎక్స్పీరియన్స్. ఆయనతో షూటింగ్ చేస్తున్నంత సేపూ నేర్చుకుంటూనే ఉన్నాను. లొకేషన్లోకి వచ్చాక తానొక లెజెండ్ అని కాక, యాక్టర్ మాత్రమే అని మనం గుర్తు పెట్టుకునేలా ప్రవర్తిస్తారు. భాష నేర్చుకున్నాకే.... అక్షర: అసిస్టెంట్ డెరైక్టర్‌గా కొన్నేళ్లు పనిచేశాక... ముంబయిలో ఒక నాటకంలో క్యారెక్టర్ ప్లే చేశాను. అప్పుడే నటనపై ఆసక్తి ఏర్పడింది. అలా నటుడిగా మారాను. డెరైక్షన్, యాక్షన్.. దేని కష్టం దానిదే. హార్డ్ వర్క్‌తో దేనిలోనైనా పరిపూర్ణత సాధించగలం. నన్ను నేను నిరూపించుకోవాలి ఫ్యామిలీలో అందరూ సినిమారంగంలో ఉన్నవారే. అయితే నేనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. జయాపజయాలు పూర్తిగా వ్యక్తిగతం. వాటికి నాదే బాధ్యత. క్రమశిక్షణ, హార్డ్‌వర్క్... ఇవే నన్ను సక్సెస్ చేస్తాయి తప్ప కుటుంబ నేపథ్యం కాదని నా నమ్మకం. తెలుగులోనూ ఓకే... తెలుగులో నటించడానికి అభ్యంతరం ఏముంటుంది? అయితే బాలీవుడ్లో ఇప్పుడే ప్రవేశించాను. హిందీ భాష కాస్త కష్టంగానే ఉంది. ముందు భాష మీద పట్టు సాధించాలి. అప్పుడే మరింత బాగా నటించగలం. బాలీవుడ్లో తొలి చిత్రమే అమితాబ్, ధనుష్ వంటి మంచి ఆర్టిస్ట్‌లతో నటించే అవకాశం రావడం వల్ల ఎంతో నేర్చుకున్నా. - సత్యబాబు -
టాలీవుడ్ పై ధనుష్ పోకస్
-
రెట్టింపు ఆనందం!
తమిళ హీరో ధనుష్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పాలి. నటుడిగా జాతీయ పురస్కారం గెలుచుకున్నారు. నిర్మాతగా విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇక, ‘కొలవెరి..’ పాటను తనదైన శైలిలో పాడి గాయకునిగా కూడా ఎంత ప్రసిద్ధి పొందారో తెలిసిందే. కేవలం తన చిత్రాలకు మాత్రమే కాకుండా ఇతర హీరోల చిత్రాలకు కూడా పాటలు పాడుతుంటారు ధనుష్. అడపా దడపా గేయ రచయితగా కూడా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం తన సతీమణి ఐశ్యర్యా ధనుష్ దర్శకత్వం వహిస్తున్న ‘వై రాజా వై’ చిత్రం కోసం ధనుష్ ఓ పాట రాశారు. ఈ పాటను సంగీతజ్ఞాని ఇళయరాజా పాడారు. ‘‘పాట రాసినప్పుడు కలిగిన ఆనందంకన్నా ఈ పాటను ఇళయరాజా స్వరంలో వింటున్నప్పుడు కలిగిన ఆనందం రెట్టింపు’’ అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు ధనుష్. మరో రెండు రోజుల్లో ఈ పాటను విడుదల చేయనున్నారు. -
ధనుష్‌కు జోడీ కాదట
నటుడు కమలహాసన్ కుటుంబం నుంచి వస్తున్న మరో నటి అక్షర. ఈమె అక్క శ్రుతిహాసన్ లాగానే తన లక్‌ను తొలుత బాలీవుడ్లో పరీక్షించుకోనున్నారు. ఈ చిత్రం లో హీరో కోలీవుడ్ నటుడు ధనుష్ కావడం విశేషం. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు బాల్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు అమితాబ్ కూడా నటించడం విశేషం. దర్శకుడు బాల్కి అక్షరను ఒక వాణిజ్య ప్రకటన షూటింగ్లో చూశారట. ఆమె నడక హొయలు, హావభావాలు బాల్కిని ఎంతగానో ఆకట్టుకున్నాయట. వెంటనే తన చిత్రంలో నటిం చమని అడిగారట. అప్పటి వరకు పలు అవకాశాలు (మణిరత్నంతో సహా) వచ్చినా నటించడానికి అంగీకరించక తాను తెరవెనుకనే ఉంటానని చెప్పుకొచ్చిన అక్షర బాల్కి అడగ్గానే ఓకే చెప్పేశారట. ఈ చిత్రంలో ఈ బ్యూటీ ధనుష్ సరసన నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని దర్శకుడు ఖండించారు. దీని గురించి బాల్కి తెలుపుతూ అక్షర ధనుష్‌కు జోడీ కాదని పేర్కొన్నారు. ఆమె ఈ చిత్రంలో ఒక వైవిధ్యభరిత పాత్రను పోషిస్తున్నారని తెలిపారు. ఇంతకీ ధనుష్‌తో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరన్నది మాత్రం చెప్పలేదు. -
లక్ష్మీమీనన్‌పై ధనుష్ కన్ను
కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నటి లక్ష్మీమీనన్. చాలా తక్కువ హీరోల సరసన నటించిన ఈ భామ త్వరలోనే అందరి హీరోల హీరోయిన్ అవబోతోంది. షూటింగ్‌లకు సమయపాలన పాటిస్తూ చిత్ర ప్రచార కార్యక్రమాలకు క్రమం తప్పకుండా పాల్గొంటూ దర్శక నిర్మాతల వద్ద మంచి హీరోయిన్గా పేరు కొట్టేస్తున్న లక్ష్మీమీనన్‌పై స్టార్ హీరోల కన్ను పడుతోంది. వరుస సక్సెస్‌లతో విజయపథంలో పయనిస్తున్న ఈ కేరళ కుట్టిని తనకు జంటగా ఎంపిక చేయడానికి నటుడు ధనుష్ తన చిత్ర దర్శక నిర్మాతలను ఆదేశిస్తున్నట్లు సమాచారం. తొలి చిత్రం కుంకీతో విక్రమ్ ప్రభు సరసన, మలి చిత్రం సుందర్‌పాండియన్ చిత్రంలో శశికుమార్‌కు జంటగా, మూడో చిత్రంలో ఒక మెట్టు ఎక్కి విశాల్‌తో జతకట్టిన లక్ష్మీమీనన్ తాజాగా గౌతమ్ కార్తీ సరసన సిపాయ్, విశాల్ సరసన మరో చిత్రంలోనూ నటిస్తోంది. ఇలా నటిగా మంచి పేరుతోపాటు పలు అవకాశాలు రావడంతో ఈ కేరళ కుట్టి సంతోషంతో తబ్బిబ్బైపోతోంది. అంతా బాగానే ఉంది గానీ ఈ లక్ష్మీ నానాటికీ బరువెక్కిపోతుండటంతో కాస్త ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోమని దర్శక, నిర్మాతలు సలహా లివ్వడంతో ప్రస్తుతం ఈ భామ బరువు తగ్గే పనిలో పడిందట. -
ధనుష్‌కు జంటగా అక్షర?
జాతీయ ఉత్తమ నటుడు ధనుష్‌తో ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్ రెండవ కూతురు అక్షర రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారని కోలీవుడ్‌లో ప్రచారం అవుతోంది. ఈ చిత్రం బాలీవుడ్లో తెరకెక్కనుందని, దీనికి ప్రముఖ హిందీ దర్శకుడు బాల్కి తెరరూపం ఇవ్వనున్నట్లు సమాచారం. బాల్కి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఇంతకుముందు బిగ్‌బి అమితాబ్‌తో ‘పా’, ‘చీనీ కుమ్’ వంటి వైవిద్యభరిత చిత్రాలను రూ పొందించారు. మరోసారి అమితాబ్‌బచ్చన్‌తో ఒక చిత్రం, షారూఖ్‌ఖాన్‌తో ఒక చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా రాంజానా చిత్రంతో బాలీవుడ్‌ను ఆకర్షించిన కోలీవుడ్ నటుడు ధనుష్‌పై బాల్కి దృష్టి పడినట్టు సమాచారం. ధనుష్ హీరోగా నటించే చిత్రంలో అక్షరను హీరోయిన్గా తెరంగేట్రం చేయిం చడానికి సిద్ధం అవుతున్నట్లు తెలి సింది. అక్షర కెమెరా వెనుక పని చేయాలని ఆశిస్తున్నారు. సొసైటీ అనే హిందీ చిత్రానికి దర్శకుడు రాహుల్ దూల్కై వద్ద సహాయ దర్శకురాలిగా పని చేశారు. బాల్కి చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం కావడానికి అక్షర ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.