ధనుష్‌తో వరూ సై | Varalakshmi Sarathkumar in danush movie | Sakshi
Sakshi News home page

ధనుష్‌తో వరూ సై

Published Fri, Dec 29 2017 6:44 PM | Last Updated on Fri, Dec 29 2017 6:45 PM

Varalakshmi Sarathkumar in danush movie - Sakshi

సాక్షి, సినిమా: నటుడు ధనుష్‌తో నటించడానికి నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ సై అన్నారు. వరలక్ష్మీ ఒక పక్క కథానాయకిగా నటిస్తూనే మరో పక్క చాలెంజింగ్‌ పాత్రల్లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. అలా ధనుష్‌ కథానాయకుడిగా నటించినున్న తాజా చిత్రం మారి-2లో  కీ రోల్‌ను పోషించడానికి ఓకే చెప్పేశారు. ఇంతకు ముందు ధనుష్‌ హీరో బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో తెరపైకొచ్చిన మారి చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. నటి కాజల్‌ అగర్వాల్‌ నాయకిగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని చిత్ర వర్గాలు అప్పుడే ప్రకటించారు. దానికి ఇప్పుడు ముహూర్తం కుదిరింది. 

ధనుష్‌ హీరోగా నటించి తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మించనున్న మారి-2లో సాయిపల్లవి కథానాయకిగా ఎంపికైంది. ఇందులో ముఖ్య పాత్రకు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నటుడు, నిర్మాత ధనుష్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అందుకు ప్రతిగా ట్విట్‌ చేసిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మారి-2లో తనను ఒక భాగం చేసినందుకు ధనుష్, దర్శకుడు బాలాజీ మోహన్‌కు కృతజ్ఞతలు చెప్పింది. ఈ చిత్రంలో నటించడానికి ఆలస్యం చేయదలచుకోలేదు. ఎప్పుడెప్పుడు నటిస్తానా అని చాలా ఎగ్జైట్‌గా ఫీలౌతున్నాను అని పేర్కొన్నారు. 

ఇందులో మలయాళ నటుడు టోవినో థామస్‌ ప్రతినాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందించనున్నారు. సుమారు 10 ఏళ్ల తరువాత ధనుష్, యువన్‌శంకర్‌రాజా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం మారి-2 అన్నది గమనార్హం. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను కొత్త సంవత్సరం వెల్లడించే అవకాశం ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement