varalakshmi sarathkumar
-
సవాల్ చేయకు...
‘అందరి జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే అని ఒక రోజు ఉంటుంది. కానీ నా జీవితంలో రెండూ ఒకే రోజు జరిగాయి’ అన్న డైలాగ్స్‌తో మొదలవుతుంది ‘శివంగి’ సినిమా ట్రైలర్. ఆనంది, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది. దేవరాజ్ భరణీధరన్ దర్శకత్వంలో నరేశ్‌బాబు. పి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘నువ్వు ఒకడ్ని ప్రేమించి ఇంకొకడిని పెళ్లి చేసుకున్నావ్.., ప్రేమించినవాడి కోసం లైఫ్ అంతా వెయిట్ చేయడానికి నేను రెడీ, ఇసుమంటి అత్తల–కోడళ్లప్రాబ్లమ్ ప్రతి ఇంట్లో ఆల్ ఓవర్ వరల్డ్‌కి ప్రాబ్లమ్.., ఇది నాకు, మా అత్తమ్మకి, మేనేజర్ కిరణ్‌గాడికి జరుగుతున్న వార్... దీంట్లో మేం గెలుస్తాం, సత్యభామ రా... సవాల్ చేయకు... చంపేస్తా’ అన్న డైలాగ్స్ ‘శివంగి’ సినిమా ట్రైలర్లో ఉన్నాయి. -
ఇక్కడ బ్యూటీ నేనే... బీస్ట్‌ని నేనే: ఆనంది
ఆనంది, వరలక్ష్మీ శరత్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘శివంగి’(shivangi). దేవరాజ్ భరణీ ధరణ్ దర్శకత్వంలో పి. నరేశ్‌బాబు నిర్మించిన ఈ పవర్ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ మార్చి 7న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘నా జీవితంలో జరిగిన రెండు ముఖ్యమైన విషయాలు ఇప్పుడు నన్ను వెంటాడుతున్నాయి.ఒక అమ్మాయికి ఒక్క రోజుకి ఇన్ని కష్టాలు, సత్యభామ అంటే ఏదో చందమామ కథలు చెప్పే భామ అనుకున్నావేమో... సత్యభామ రా... ఇక్కడ బ్యూటీ నేనే... బీస్ట్‌ని నేనే’’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. జాన్ విజయ్, డా. కోయ కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఏహెచ్ కాషిఫ్, ఎబినేజర్ పాల్ సంగీతం అందించారు. -
వినాయకచవితికి కొత్త పాట.. వరలక్ష్మి విశ్వరూపం
సుదర్శన్ పరుచూరి హీరోగా నటిస్తున్న చిత్రం మిస్టర్ సెలెబ్రిటీ. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. వినాయక చవితి స్పెషల్‌గా తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి ఓ హుషారైన భక్తి పాటను రిలీజ్ చేశారు.ఇంత ఎనర్జీగా..‘గజానన’ అంటూ సాగే ఈ పాటను మంగ్లీ ఆలపించారు. ఈ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ వేసిన స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. చాలా రోజుల తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంత ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వినోద్ ఇచ్చిన బాణీకి గణేశ్ లిరిక్స్ అందించాడు. ఈ పాట మార్మోగడం ఖాయంఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఈ పాట మార్మోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఎన్. పాండురంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. -
varalaxmi sarathkumar: కొత్త ప్రయాణం ఆరంభమైంది
‘‘హైదరాబాద్ నాకు సెకండ్ హోమ్. తెలుగు ప్రేక్షకులు నా సినిమాలు చూసి నన్ను చాలా ్ర΄ోత్సహించారు. మీ ్ర΄ోత్సాహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. ముంబైకి చెందిన వ్యా΄ారవేత్త నికోలయ్ సచ్దేవ్తో వరలక్ష్మి వివాహం ఈ నెల 12న థాయ్‌లాండ్‌లో జరిగింది. బుధవారం వరలక్ష్మి–నికోలయ్ హైదరాబాద్‌లో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చె΄్పాలనే ఉద్దేశంతో నా భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చాను. నా కెరీర్ ముగిసి΄ోలేదు. నా సరికొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నా భర్త ్ర΄ోత్సాహంతో మరిన్ని సినిమాలు చేస్తాను’’ అన్నారు. ‘‘నా భార్య వరలక్ష్మి అద్భుతమైన నటి. తన వ్యక్తిత్వం కూడా ఉన్నతమైనది. సంస్కృతి, సంప్రదాయం, కుటుంబానికి గౌవరం ఇస్తుంది. ఆమెను పెళ్లి చేసుకోవడం నా లక్. మీరంతా తనని ఇలానే స΄ోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు నికోలయ్. -
హనీమూన్ ట్రిప్‌లో కొత్తజంట.. ఎవరో గుర్తుపట్టారా..?
కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, నికోలయ్ సచ్దేవ్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. థాయ్‌లాండ్ వేదికగా జులై 2న వీరి వివాహం ఘనంగా జరిగింది. చెన్నైలో జరిగిన రిసెప్షన్లో తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.కొన్నిరోజులుగా తమ పెళ్లికి రావాలంటూ చాలామంది ప్రముఖులను ఆహ్వానించే పనిలో వరలక్ష్మీ బిజీగా గడిపేసింది. ఇలా కొద్ది రోజులుగా శుభలేఖలు పంచడం, హల్దీ, మెహీందీ, ఫ్రీ వెడ్డింగ్ పార్టీ, పెళ్లి, రిసెప్షన్, వివాహానరంతరం జరిగే విశేష కార్యక్రమాలతో ఊపిరాడనంత బిజీ బిజీగా గడిపిన నటి వరలక్ష్మీశరత్‌కుమార్ ఇప్పుడు భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లారు. అయితే, ఈ కొత్తజంట హనీమూన్‌కు ఏ దేశానికి వెళ్లారో మాత్రం చెప్పలేదు.అందమైన ప్రదేశాల్లో వారు తీసుకున్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో వరలక్ష్మీ పంచుకుంది. తుపాన్ తరువాత ప్రశాంతత అంటూ వారు ఆనందంగా ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేసింది. ఇప్పుడు ఈ జంట హనీమూన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
తుపాన్ తరువాత ప్రశాంతత
నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ విలక్షణ నటి అనాలో, సంచలన నటి అనాలో, బహుభాషా నటి అనాలో, డేర్ అండ్ డేరింగ్ నటి అనాలో ప్రేక్షక మహాశయులకే వది లేద్దాం. అయితే నటిగా మాత్రం ఒక చట్రంలో ఇరుక్కోకుండా వచ్చిన పాత్రల్లో నచ్చినవి చేసుకుంటూ తనకుంటూ ఒక స్టార్ ఇమేజ్ను సంపాధించుకున్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ప్రేమలో నికోలాయ్‌ని పెళ్లి కూడా చేసుకున్నారు. ఇటీవలే చైన్నె లో వీరి వివాహం చాలా గ్రాండ్‌గా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా పలువురు రాజకీయ ప్రముఖులు, నటుడు రజనీకాంత్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు వీరి వివాహా వేడుకకు హాజరై శుభాకాంక్షలు అందించారు. ఇలా కొద్ది రోజులుగా శుభలేఖలు పంచడం, హల్దీ, మెహీందీ, ఫ్రీ వెడ్డింగ్ పార్టీ, పెళ్లి, రిసెప్షన్, వివాహానరంతరం జరిగే విశేష కార్యక్రమాలతో ఊపిరాడనంత బిజీ బిజీగా గడిపిన నటి వరలక్ష్మీశరత్‌కుమార్ ఇప్పుడు భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లారు. అయితే ఈ నూతన జంట హనీమూన్‌కు ఏ ప్రదేశానికి వెళ్లారో చెప్పలేదు గానీ, సుందరమైన ప్రదేశంలో వారు తీసుకున్న ఫొటోలను మాత్రం నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పో స్ట్ చేశారు. అందులో తుపాన్ తరువాత ప్రశాంతత అని పేర్కొనడం విశేషం. ఇప్పుడు ఈ జంట హనీమూన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ (ఫొటోలు)
-
డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్న 'హనుమాన్' నటి..?
-
శబరి: తల్లి ప్రేమను గుర్తుచేసే సాంగ్ రిలీజ్
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'అనగనగా ఒక కథలా ఓ చందమామా.. కడవరకు కరగదులే ఈ అమ్మ ప్రేమ' పాటను ఆస్కార్ విన్నర్, గేయరచయిత చంద్రబోస్ విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సతీమణి సుచిత్ర నృత్య రీతులు సమకూర్చారు. సాంగ్ చాలా ప్రత్యేకంగా..పాటను విడుదల చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ... 'గోపీసుందర్ గారి సంగీతంలో రెహమాన్ గారు రాశారు. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సాంగ్ విడుదల కంటే ముందు నేను విన్నాను. నా భార్య సుచిత్ర కొరియోగ్రఫీ చేయడం కోసం ఇంటికి సాంగ్ తీసుకు వచ్చింది. సాంగ్ విని సాహిత్యం చదువుతానని తీసుకున్నా. చదువుతుంటే నాకు చాలా సంతోషం కలిగింది. ఈ పాట తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. చిత్ర గారు ఈ పాటకు తన గాత్రంతో జీవం పోశారు'' అని చెప్పారు. చదవండి: లావైపోయా.. సడన్‌గా అన్నీ మారిపోయాయి.. బాధేసింది! -
త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ ఇదే!
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లికూతురిగా ముస్తాబు కానుంది. ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. తన పెళ్లి తనకే సర్ప్రైజింగ్గా ఉందని.. ఏదేమైనా ఈ ఏడాదిలోనే మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పింది. తాజాగా దీనిపై హీరో విశాల్ స్పందించాడు. వరలక్ష్మి పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. సినిమాల్లో తనను తాను నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడింది. సంతోషంగా ఉంది అలాంటిది తను అనుకున్నది సాధించి తెలుగు చిత్రపరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. తను ఎంతో మంచి వ్యక్తి.. ఆమె తల్లిని నేను కూడా అమ్మ అనే పిలుస్తాను. పర్సనల్ లైఫ్‌లో సెటిలవుతున్న వరలక్ష్మికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నాడు. కాగా గతంలో వరలక్ష్మి, విశాల్ ప్రేమించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఓ కార్యక్రమంలో లక్ష్మీకరమైన అమ్మాయితో ఏడడుగులు వేస్తానన్నారు. స్నేహితులమే.. దీంతో అతడు వరలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం ఊపందుకుంది. కానీ తమ మధ్య స్నేహం తప్ప ప్రేమకు చోటు లేదని విశాల్ క్లారిటీ ఇచ్చాడు. ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉండే విశాల్ - వరలక్ష్మి 2019లో నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శత్రువులుగా మారిపోయారు. తన తండ్రి శరత్ కుమార్ గురించి విశాల్ అడ్డగోలుగా మాట్లాడాడని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది. ఆ సమయంలో విడిపోయిన వీరిద్దరూ ఇప్పుడు మళ్లీ ఫ్రెండ్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది. చదవండి: హీరోయిన్ చెల్లితో భర్త ఎఫైర్.. ఒక్క దెబ్బతో పక్షవాతం.. చివరికి..! -
వరలక్ష్మి అమ్మ కాలేకపోయింది ఎందుకు?
తమిళసినిమా: దక్షిణాదిలో సంచలన నటిగా ముద్రవేసుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి పాత్రనైనా, ఏ భాషలోనైనా నటించి సత్తా చాటగలిగిన నటి ఈ భామ. నటుడు శరత్‌కుమార్ వారసురాలైన వరలక్ష్మి నిజానికి 18 ఏళ్ల వయసులోనే కథానాయకిగా సినీ రంగప్రవేశం చేయాల్సిందట. ఈ సమయంలో శంకర్ దర్శకత్వంలో బాయ్స్, కాదల్ చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశాలు రాగా చాలా చిన్న వయసు ఇప్పుడే సినిమాలు వద్దు అని తండ్రి శరత్‌కుమార్ హితబోధ చేశారట. దీని గురించి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 2012లో ధనుష్ హీరో నటించిన పోడాపోడీ చిత్రం ద్వారా ఈమె కథానాయకిగా తెరంగేట్రం చేశారు. ఆ విధంగా నటిగా పుష్కరకాలం పూర్తి చేసుకున్నారు. విగ్నేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో వరలక్ష్మికి వెంటనే అవకాశాలు రాలేదు. దీంతో తెలుగు, కన్నడం భాషల్లో దృష్టి సారించి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నటిగా నిరూపించుకున్నారు. ఆ తరువాత బాలా దర్శకత్వంలో తారై తప్పట్టై చిత్రంలో నాయకిగా నటించే అవకాశం రావడం, ఆ చిత్రంలో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అయినప్పుటికీ కథానాయకిగానే నటించకుండా, ప్రతినాయకి పాత్రల్లోనూ నటిస్తూ విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఈమెకు ఇప్పుడు 38 ఏళ్లు. గత నెలలోనే వివాహ నిశ్చితార్థం జరిగింది. ముంబైకి చెందిన నిక్కోలాయ్ సచ్దేవ్తో పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ముంబైలో ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్న ఈయనకిది రెండో పెళ్లి. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. విశేషం ఏమిటంటే ఈయన వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు 14 ఏళ్లుగా స్నేహితుడట. వరలక్ష్మి ఇంటర్వ్యూ పేర్కొంటూ తన సినిమా, వ్యక్తిగత జీవితం గానీ చేసుకున్న ప్లాన్ ప్రకారం జరగలేదని చెప్పారు. తాను పోడాపోడీ చిత్రంలో నటించినప్పుడు తన వయసు 22 ఏళ్లు అని, ఎలాగైనా 28 ఏళ్లలోపు స్టార్ నటిగా ఎదగాలని భావించానన్నారు. అదేవిధంగా 32 ఏళ్లలో పెళ్లి చేసుకుని 34 ఏళ్లలో పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకున్నానని, అయితే తన వయసు ఇప్పుడు 38 ఏళ్లు అని పేర్కొన్నారు. అలా తన సినీ, వ్యక్తిగత జీవితాల్లో వేసుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదని అన్నారు. పోడాపోడీ చిత్రం తరువాత పర్సనల్ జీవితంపై ఎక్కువగా దృష్టి పెట్టానని, అదే తాను చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు. అందువల్ల తన సినీ జీవితం బాధించిందన్నారు. అప్పుడే తాను సినిమాలపై దృష్టి సారించి ఉంటే ఎక్కువ చిత్రాలు చేసి ఉండేదానినని అన్నారు. అయితే అపజయాలే తనను దృఢపరిచాయని వరలక్ష్మీ శరత్‌కుమార్ పేర్కొన్నారు. -
జైలుకు వెళ్లనున్న హనుమాన్ నటి? స్పందించిన వరలక్ష్మి
టాలీవుడ్లో లేడీ విలన్‌గా పేరు తెచ్చుకుంది నటి వరలక్ష్మి శరత్‌కుమార్. ఇటీవలే ఆమె పెళ్లికి సిద్ధమైంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నికోలై సచ్దేవ్తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. త్వరలోనే అతడితో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇకపోతే గతేడాది డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్ పేరు మార్మోగిపోయింది. ఆమె దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్‌గా పని చేసిన ఆదిలింగం డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. దీంతో ఆమెకు కూడా ఏమైనా సంబంధాలున్నాయేమోనని ఎవరికి వారు అనుమానించారు. ఇష్టారీతిన తప్పుడు ప్రచారం తాజాగా ఈ డ్రగ్స్ కేసులో వరలక్ష్మికి సమన్లు అందాయని, ఆమెను విచారణకు హాజరవాలని అధికారులు ఆదేశించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. కొందరైతే ఏకంగా ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారంటూ ఇష్టారీతిన ప్రచారం చేస్తున్నారు. దీంతో సదరు వార్తలపై ఘాటుగా స్పందించింది నటి. ఇన్స్టాగ్రామ్ వేదికగా తప్పుడు ప్రచారంపై మండిపడింది. 'ఈ మీడియాకు నేను తప్ప ఎవరూ దొరకడం లేదేమో.. మళ్లీ పాత ఫేక్ న్యూస్‌నే ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా అసలైన జరల్నిజం అంటే ఏంటో తెలుసుకోండి. బయట ఇంకా చాలా సమస్యలున్నాయ్ సెలబ్రిటీలుగా మేము నటిస్తాం, నవ్విస్తాం.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాం.. మాలో లొసుగులు వెతకడం మానేసి మీ పని మీరు సరిగా చేయండి.. లోకంలో ఇంకా చాలా పెద్ద సమస్యలున్నాయి. వాటిపైన ఫోకస్ చేయండి. మా నిశ్శబ్ధాన్ని వీక్నెస్గా చూడకండి. మీకు తెలీదేమో.. పరువునష్టం దావా అనేది కూడా ఈ మధ్య ట్రెండ్ అవుతోంది. కాబట్టి అసత్య ప్రచారాలు, అబద్ధపు రాతలు మానేసి నిజమైన జర్నలిజాన్ని బయటకు తీయండి' అని చురకలంటించింది. It’s so sad that our talented media has no news than to start circulating old #fakenews. Our dear journalists especially the self proclaimed news sites and your articles, why don’t you actually start doing some real journalism! Stop finding flaws with your celebtrities, we are… — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) March 14, 2024 చదవండి: శ్రీకాంత్ మేనకోడలితో లవ్.. డైరెక్ట్‌గా అడగలేక ఆ నటుడితో రాయబారం.. -
లేడీ విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్ బర్త్ డే (ఫొటోలు)
-
హనుమాన్ నా బాధ్యత పెంచింది
‘‘హనుమాన్’ సినిమా విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి రుణం ‘జై హనుమాన్’ సినిమాతో తీర్చుకోబోతున్నాను. ‘హనుమాన్’కి వంద రెట్లు ఎక్కువగా ‘జై హనుమాన్’ ఉంటుంది’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకుడు. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలైంది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ–‘‘హనుమాన్’కి వచ్చిన స్పందన చూసిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది నాపై ఇంకా బాధ్యత పెంచింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి వచ్చే చిత్రాలను బాధ్యతగా తీస్తాను’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు పాదాభివందనం’’ అన్నారు తేజ. ‘‘హనుమాన్’ని హిట్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు నిరంజన్ రెడ్డి. -
Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ
టైటిల్: హను-మాన్ నటీనటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు నిర్మాణ సంస్థ: ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాత: కె.నిరంజన్ రెడ్డి దర్శకత్వం: ప్రశాంత్ వర్మ సంగీతం: గౌరహరి,అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటర్: ఎస్.బి. రాజు తలారి విడుదల తేది: జనవరి 12, 2024 ఈ సంక్రాంతి బరిలో మూడు బడా హీరోల సినిమాలు ఉన్నాయి. వాటికి పోటీగా అన్నట్లు ‘హను-మాన్’ దిగాడు. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రచార చిత్రాలు విడుదలయ్యాక ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి చర్చించుకున్నారు. ఇక ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘హను-మాన్’పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 12) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా అంజనాద్రి అనే ఫిక్షనల్ విలేజ్ చుట్టూ తిరుగుతుంది. అడవి ప్రాంతంలో ఉండే ఆ ఊర్లో అంజనమ్మ(వరలక్ష్మీ శరత్ కుమార్), తన సోదరుడు హనుమంతు(తేజ సజ్జ)తో కలిసి నివాసం ఉంటుంది. హనుమంతు ఓ చిల్లర దొంగ.ఊర్లో చిన్న చిన్న వస్తువులను దొంగలిస్తూ చిల్లరగా తిరుగుతుంటారు. ఆ ఊరి బడి పంతులు మనవరాలు మీనాక్షి(అమృత అయ్యర్) అంటే హనుమంతుకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓ రోజు బందిపోట్లు మీనాక్షిపై దాడి చేసేందుకు యత్నించగా.. హనుమంతు ఆమెను రక్షించబోయి జలపాతంలో పడిపోతాడు. అక్కడ హనుమంతుడి రక్త ధారతో ఏర్పడి రుధిర మణి హనుమంతుని చేతికి చిక్కుతుంది. అప్పటి నుంచి అతనికి సూపర్ పవర్స్ వస్తాయి. ఇదిలా ఉంటే.. చిన్నప్పటి నుంచి సూపర్ హీరో కావాలని కలలు కంటున్న మైఖేల్(వినయ్ రాయ్)..ఆ శక్తుల కోసం సొంత తల్లిదండ్రులను చంపేస్తాడు. ప్రపంచంలో తనకు మాత్రమే సూపర్ పవర్స్ ఉండాలని, ఆ దిశగా ప్రయోగాలు సైతం చేయిస్తుంటాడు. ఈ క్రమంలో హనుమంతుకి వచ్చిన శక్తుల గురించి తెలుస్తుంది. దీంతో మైఖేల్ తన అనుచరులతో అంజనాద్రి గ్రామానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హనుమంతుకి ఉన్న శక్తులను సొంతం చేసుకునేందుకు మైఖేల్ పన్నిన పన్నాగం ఏంటి? అసలు ఆ శక్తులు హనుమంతుకు మాత్రమే ఎందుకు వచ్చాయి? హనుమంతుకి ఆపద వచ్చినప్పుడలా రక్షిస్తున్న స్వామిజీ(సముద్రఖని) ఎవరు? ఎందుకు రక్షిస్తున్నాడు? హనుమంతుకి ఉన్న శక్తులు ఉదయం పూట మాత్రమే ఎందుకు పని చేస్తాయి? అంజనాద్రిని కాపాడుకోవడం కోసం హనుమంతు ఏం చేశాడు? అసలు మీనాక్షి-హనుమంతుల ప్రేమ సంగతి ఏమైంది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హీరోకి సూపర్ పవర్స్ రావడం.. ఆ శక్తిని మంచి కోసం ఉపయోగించడం.. విలన్ దాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నించడం.. హీరో అతని ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ఆ శక్తిని లోక కల్యాణం కోసం వాడడం.. ఈ తరహా కాన్సెప్ట్‌తో హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ లాంటి సూపర్ హీరోలు అందరికి పరిచయమే. అయితే ఈ కథలన్నింటికి మూలం మన పురాణాలే. మన ఇండియాకు ఆంజనేయ స్వామిజీనే ఓ సూపర్ మ్యాన్ అని పురాణాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ హను-మాన్ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది లేదు. ఈ తరహా కాన్సెప్ట్‌తో తెలుగులోనూ సినిమాలు వచ్చాయి కానీ.. నేటివిటీ కామెడీని టచ్ చేస్తూ.. తనదైన స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడు ప్రశాంత్ వర్మ. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ తెలుగు నేటివిటీ మిస్ అవ్వకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీని చివరి వరకు కంటిన్యూ చేశాడు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కథను తీర్చి దిద్దాడు. కేవలం సూపర్ పవర్స్ కాన్సెప్ట్నే కాకుండా సిస్టర్ సెంటిమెంట్, ప్రేమ కథను కూడా ఇందులో జోడించాడు. అయితే అంతగా ఆకట్టుకోలేదు. అలా అని అనవసరంగా జోడించినట్లు కూడా లేవు. కథ రొటీన్‌గా సాగుతుందనే ఫీలింగ్ కలిగేలోపు ఆంజనేయ స్వామి తాలుకు కథను తీసుకురావడం..గూస్బంప్స్ తెప్పించే సీన్స్ పెట్టడంతో చూస్తుండగానే సినిమా అయిందనే భావన కలుగుతుంది. హను-మాన్ కథ ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. విలన్ ఎందుకు సూపర్ పవర్స్ కావాలనుకునేది ప్రారంభ సన్నివేశాల్లోనే చూపించాడు. ఆ తర్వాత కథంతా అంజనాద్రి చుట్టూ తిరుగుతుంది. కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం..హీరో గురించి ఆ కోతి చెప్పే మాటలు నవ్వులు పూయిస్తాయి. హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ రొటీన్‌గా ఉంటుంది. హీరోకి ఎప్పుడైన సూపర్ పవర్స్ వస్తాయో అప్పటి నుంచి కథనం ఆసక్తిరంగా సాగుతుంది. రాకేష్ మాస్టర్ గ్యాంగ్‌తో హీరో చేసే ఫైట్ సీన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మరోవైపు సత్య, గెటప్ శ్రీను కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో కథ సింపుల్‌గా, ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలోనే అసలు కథంతా ఉంటుంది. సూపర్ పవర్స్ కోసం విలన్ ప్రయత్నించడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయి. హీరోకి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ కూడా విజుల్స్ వేయిస్తాయి. ఓ సందర్భంలో పెద్ద బండరాయిని కూడా ఎత్తేస్తాడు. అయినా కూడా అది అతిగా అనిపించడు. మరో యాక్షన్ సీన్లో చెట్టు వేర్లతో హెలికాప్టర్ని ఆపేస్తాడు..అయినా కన్విన్సింగ్‌గానే అనిపిస్తుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. విఎఫెక్స్ అద్భుతంగా ఉన్నాయి. చిన్న చిన్న లోపాలు ఉన్నా ఇంత తక్కువ బడ్జెట్(రూ. 25 కోట్లు అని సమాచారం)లో ఇలాంటి సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మను నిజంగా అభినందించాల్సిందే. రాముడికి ఆంజనేయ స్వామి ఇచ్చిన మాట ఏంటి ? అనే ఆసక్తికర ప్రశ్నతో సీక్వెల్‌ని ప్రకటించాడు. మరి ఆంజనేయ స్వామి ఇచ్చిన హామీ ఏంటి అనేది 2025లొ విడుదలయ్యే ‘జై హను-మాన్’లో చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. తేజ సజ్జకు నటన కొత్తేమి కాదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి, తనదైన నటనతో మెప్పించాడు. హీరోగాను మంచి మార్కులే సాధించాడు. ఇక హనుమాన్ కోసం మరింత కష్టపడినట్లు తెలుస్తోంది. కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. కామెడీ, ఎమోషన్‌తో పాటు యాక్షన్ సీన్స్‌ని కూడా ఇరగదీశాడు. కావాల్సిన చోట మాత్రమే హీరోయిజాన్ని చూపించాడు. సాధారణ మనిషిగా.. సూపర్ పవర్స్ ఉన్న హను-మాన్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన తేజ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్్ చూపించి ఆకట్టుకున్నాడు. హీరో సోదరి అంజనమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు కూడా ఇందులో ఓ యాక్షన్స్ సీన్ ఉంది. అమృత అయ్యర్ తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్రఖని పోషించిన పాత్రలోని సస్పెన్స్‌ని తెరపై చూడాల్సిందే. వినయ్ రాయ్ స్టైలీష్ విలన్‌గా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. తనదైన బీజీఎంతో గౌరహరి సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా తెరకెక్కించాడు. వీఎఫెక్స్ వర్క్ అబ్బురపరిచేలా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రాజకీయాలతో సంబంధం లేదు
‘‘ప్రస్తుత రాజకీయాలకు, ‘కోటబొమ్మాళి పీఎస్’ సినిమా కథకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఈ మూవీలో ఎన్నికల గురించి, ఓటు విలువ గురించి చర్చించాం. వ్యవస్థ, మనం ఎలా అవినీతిమయమై ఉన్నాం అనేది ఈ చిత్రంలో చెబుతున్నాం. ఈ మూవీకి ఏ పొలిటికల్ ఎజెండా లేదు’’ అని డైరెక్టర్ తేజా మార్ని అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్’. ‘బన్నీ’ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా తేజా మార్ని మాట్లాడుతూ– ‘‘వ్యవస్థలో ఉన్న వాళ్లు అదే వ్యవస్థకు బలైతే ఎలా ఉంటుంది? అనే కథని జనాలకు చెప్పాలనిపించింది. కోటబొమ్మాళి అనే ఊరిలో ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఏం జరిగింది? అది ముగ్గురు పోలీస్ అధికారుల జీవితాలను ఎలా మార్చింది? అనేది ఈ చిత్ర కథ. మలయాళ హిట్ ‘నాయట్టు’ కి ఇది తెలుగు రీమేక్ అయినా తెలుగుకి తగ్గట్టు మార్పులు చేశాం. శ్రీకాంత్, వరలక్ష్మిగార్ల పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. రాహుల్, శివాని చక్కగా నటించారు. నిర్మాతలు వాసు, విద్యగార్లు ఎక్కడా రాజీపడలేదు. ‘లింగిడి లింగిడి..’ పాట వల్లే మా సినిమా గురించి అందరికీ తెలిసింది’’ అన్నారు. -
నటుడికి సంతృప్తి అనేది ఉండదు
‘‘ఈ మధ్య కాలంలో నేను పూర్తి స్థాయి పాత్ర చేసిన చిత్రం ‘కోట బొమ్మాళి’. నటనకి చాలా స్కోప్ ఉన్న పాత్ర. అంతకు ముందు నేను చేసిన సినిమాల్లో పాటలు, ఫైట్స్.. ఇలా వాణిజ్య అంశాలు ఉన్నాయి. ‘కోట బొమ్మాళి’లో చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది’’ అని శ్రీకాంత్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ చెప్పిన విశేషాలు. ► ‘కోట బొమ్మాళి’ వైవిధ్యమైన కథ. ఎక్కడైనా క్రిమినల్స్‌ని ΄ోలీసులు వెంటాడి పట్టుకుంటారు. ఈ సినిమాలో ΄ోలీసులే ΄ోలీసులను వెంటాడటం ఆసక్తిగా ఉంటుంది. రాజకీయ నాయకులు ΄ోలీసులను ఎలా వాడుకుంటారు? దాని వల్ల ΄ోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? తమ ఓట్ల కోసం కులాలను, మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు? అనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఈ సినిమాలో ఎలాంటి పొలిటికల్ సెటైర్ ఉండదు. అయితే ప్రస్తుతం వ్యవస్థలో జరుగుతున్నది చూపించాడు దర్శకుడు తేజ. ►ఓ మధ్య తరగతి హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటుందన్నది ఈ మూవీలో ఆసక్తిగా ఉంటుంది. నేను హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్ర చేశాను. నా పాత్ర, రాహుల్, శివాని.. మా ముగ్గురి పాత్రల మధ్య కథ తిరుగుతుంటుంది. మా పై అధికారి వరలక్ష్మి మమ్మల్ని పట్టుకోవడానికి వేసే ఎత్తులకు నేను వేసే పై ఎత్తులు ఆసక్తిగా ఉంటాయి. ►దాదాపు 32 ఏళ్ల కెరీర్లో ఎన్నో పాత్రలు చేశాను. ఎన్ని చేసినా ఓ నటుడికి సంతృప్తి ఉండదు.. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయాలనే ఆరాటం ఉంటుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘గేమ్ చేంజర్’, ఎన్టీఆర్‌తో ‘దేవర’, మోహన్‌లాల్, మా అబ్బాయి రోషన్ నటిస్తున్న ‘వృషభ’ సినిమాల్లో కీ రోల్స్ చేస్తున్నాను. -
ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది..నన్ను రీప్లేస్ చేస్తారేమో అనుకున్నా
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్ ప్రధాన పాత్రధారులుగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కానిస్టేబుల్ రవి పాత్రలో నటించాను. ఎస్ఐ రామకృష్ణగా శ్రీకాంత్‌గారు, కానిస్టేబుల్ కుమారిగా శివానీ రాజశేఖర్ నటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోట బొమ్మాళి అనే ఊర్లోని పోలీస్‌స్టేషన్‌లో ఏం జరిగింది? అన్నది ఈ సినిమా కాన్సెప్ట్. మలయాళ చిత్రం ‘నాయట్టు’కు ‘కోట బొమ్మాళి పీఎస్’ రీమేక్. అయితే నా పాత్రపై ఏ ప్రభావం ఉండకూడదని ‘నాయట్టు’ పూర్తి చిత్రం నేను చూడలేదు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక ఈ సినిమాలోని ‘లింగిడి..’ పాటకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాటతోనే మరింత మందికి మేం చేరువ అయ్యాం. గీతా ఆర్ట్స్ బ్యానర్లో మా నాన్నగారు (ఫైట్ మాస్టర్ విజయ్) అసిస్టెంట్ ఫైట్ మాస్టర్‌గా, ఫైట్ మాస్టర్‌గా చేశారు. అదే బ్యానర్లో నేను హీరోగా చేయడం పట్ల ఆయన హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ సినిమా సమయంలో నాకు ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది. దీంతో నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో నన్ను రీప్లేస్ చేస్తారేమో? అనుకున్నాను. కానీ ‘బన్నీ’ వాసు, విద్యాగార్లు నన్ను సపోర్ట్ చేశారు. ఇలాంటి సంస్థలో వర్క్ చేయడం నాకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఆర్కా మీడియాలో ఓ షో కమిట్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చారు. -
తొలిసారి అలాంటి సీన్ చేశా!
‘‘నేనిప్పటివరకూ ఏ సినిమాలోనూ సిగరెట్ తాగే సన్నివేశంలో నటించలేదు. ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా కథకు అవసరం కావడంతో తొలిసారి స్మోకింగ్ సన్నివేశం చేశాను. అందుకే ఈ చిత్రం నాకు సవాల్‌గా అనిపించింది’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విశేషాలు. ∙నేను కథే హీరోగా భావిస్తాను. నా కెరీర్లో తమిళంలో ఎక్కువగా పోలీస్ పాత్రలు చేశాను. కానీ తెలుగులో మాత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’ నా తొలి మూవీ. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలకు క్రేజ్ ఉంటోంది. ∙‘కోట బొమ్మాళి పీఎస్’లో శ్రీకాంత్‌గారు, నేను పోలీస్ ఆఫీసర్స్. ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది? పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? అన్నది ఈ చిత్రకథ. పిల్లి మరియు ఎలుక ఆటలా థ్రిల్ చేసేలా ఉంటుంది. ఓటు గురించి అవగాహన కల్పించే లైన్ కూడా ఉంటుంది. ఎన్నికల టైమ్‌లో వస్తున్న మా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ∙‘వరలక్ష్మి చాలా వైవిధ్యంగా చేసింది’ అని ప్రేక్షకులు అనుకునేలా మంచి పాత్రలు చేయడమే నా లక్ష్యం. లేడీ ఓరియంటెండ్ సినిమాలతో పాటు పాత్ర నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ. తెలుగులో నేను నటించిన ‘హనుమాన్’ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. కన్నడలో సుదీప్తో ‘మ్యాక్స్’ చిత్రంలో నటిస్తున్నాను. -
లింగి లింగిడి..!
శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల అవుతోంది. రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘లింగి లింగిడి..’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేయగా, 30 మిలియన్ వ్యూస్‌ను పూర్తి చేసుకుంది. ‘‘ఈ పాటలానే మా చిత్రానికి ప్రేక్షకులు విజయం అందిస్తారనే నమ్మకం ఉంది’’ అని హైదరాబాద్‌లో నిర్వహించిన సెలబ్రేషన్స్‌లో ‘బన్నీ’ వాసు అన్నారు. -
Kota Bommali Ps Teaser Launch: 'కోట బొమ్మాళి పి.ఎస్' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'గన్ కన్నా.. ఫోన్ బాగా పేలుతుంది సార్'
శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'కోట బొమ్మాళి పి.ఎస్'. ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: అందుకే ఆ హీరోను దూరం పెట్టేశా.. అనసూయ క్రేజీ కామెంట్స్!) టీజర్ చూస్తే ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పోలీసులు, రాజకీయ నాయకుల మధ్య జరిగే సన్నివేశాలే కథాంశంగా తీసినట్లు కనిపిస్తోంది. సస్పెన్స్‌తో పాటు క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే యాక్షన్ సీన్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. అసలు ఈ కోట బొమ్మాళి పీఎస్ కథేంటో తెలియాలంటే ఈనెల 24 వరకు ఆగాల్సిందే. Haunting tale from the rustic lands of Srikakulam 🔥🔥#KotabommaliPS teaser out now! - https://t.co/GrvWpLzMBL Grand release worldwide on November 24th ❤🔥@actorsrikanth #BunnyVass #VidyaKoppineedi @GA2Official @DirTejaMarni @varusarath5 @bhanu_pratapa @Rshivani_1… pic.twitter.com/TG1Pq39zV3 — GA2 Pictures (@GA2Official) November 6, 2023 -
బొమ్మాళి డేట్ ఫిక్స్
శ్రీకాంత్ మేకా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రల్లో, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో నటించారు. తేజ మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న రిలీజ్ కానుంది. ‘‘ఓ పోలీస్ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పవర్ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్‌గా ఈ మూవీ ఉంటుంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. అలాగే ‘లింగి లింగిడి..’ పాట కొన్ని కోట్ల వ్యూస్ సాధించింది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్, సహనిర్మాతలు: భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ ్రపొడ్యూసర్: అజయ్ గద్దె. -
భలేగా బ్యాలెన్స్!
సినిమాలను, వెబ్ సిరీస్‌లను భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. కథను బట్టి మెయిన్ లీడ్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తుంటారు. ఇప్పటికే తెలుగు ఆంథాలజీ సిరీస్ ‘అద్దం’తో డిజిటల్ వ్యూయర్స్‌కు దగ్గరైన వరలక్ష్మి తాజాగా మరో తెలుగు వెబ్ సిరీస్ ‘మాన్షన్ 24’లో మెయిన్ లీడ్ రోల్ చేశారు. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రూ΄÷ందిన ఈ సిరీస్‌లో అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్, అయ్యప్ప పి. శర్మ, రావు రమేష్ ఇతర ΄ాత్రధారులు. ‘రాజుగారి గది’ ఫ్రాంచైజీ ఫేమ్ ఓంకార్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ‘‘ఒకవైపు సినిమాల్లో నెగటివ్, ΄ాజిటివ్ షేడ్స్ ఉన్న ΄ాత్రలు చేస్తున్నాను. వెబ్ సిరీస్‌లలో కూడా మంచి ΄ాత్రలు చేస్తున్నాను’’ అన్నారు వరలక్ష్మి. -
తెలుగోడి జానపదం దమ్ము చూపించింది
‘‘ఒక పాట హిట్ అయితే సక్సెస్ మీట్ చేయడం మాకు తెలిసి ఇదే తొలిసారి. మా ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమాలోని ‘లింగి లింగి లింగిడి...’ పాట తెలుగోడి జానపదం దమ్ము చూపించింది. ఈ పాటకి పి. రఘు సాహిత్యం అందించడంతో పాటు పాడారు’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్ మేక, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘లింగి లింగి లింగిడి...’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకి అద్భుతమైన స్పందన వస్తోందంటూ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘చాలా కాలం తర్వాత మంచి సినిమా చేశాననే అనుభూతి ఉంది’’ అన్నారు. ‘‘నా జీవితంలో గుర్తుండిపోయే పాట వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు రాహుల్ విజయ్. ‘‘ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో సినిమా కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు శివానీ రాజశేఖర్. ‘‘నా సినిమాలో జానపదం పాట పెట్టాలనే కల ఈ చిత్రంతో నెరవేరింది’’ అన్నారు తేజ మార్ని. -
ఓటీటీల్లోకి ఆ రెండు మూవీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
జనాలకు ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. థియేటర్లలో కంటే వీటినే ఎక్కువగా ఆదరిస్తున్నారు. అయితే ఒకప్పుడు చోటామోటా యాక్టర్స్ ఓటీటీల కోసం మూవీస్ చేసేవారు. ఇప్పుడు ఏకంగా స్టార్స్ నటించిన సినిమాలు కావొచ్చు, వెబ్ సిరీసులు కావొచ్చు నేరుగా ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అలా స్టార్ హీరోయిన్స్ నటించిన ఓ మూవీ, ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. (ఇదీ చదవండి: తెలుగు యువ హీరో తల్లిపై పోలీస్ కేసు.. ఏం జరిగింది?) మలయాళ బ్యూటీ నిత్యామేనన్ ఎవరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ కమ్ సింగర్ అయిన ఈమె.. క్యూట్ యాక్టింగ్‌తో పలు సినిమాలు చేసింది. స్టార్ హీరోలతోనూ కలిసి పనిచేసింది. అయితే ఈమెకు రానురాను తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఓటీటీల్లోనూ నటిస్తూ బిజీ అయిపోయింది. అలా ఈమె ప్రధాన పాత్రలో నటించి 'కుమారి శ్రీమతి'.. ఈ సెప్టెంబరు 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. Get ready to laugh, cry and cheer as Srimathi takes on life’s challenges head-on. 🏡#KumariSrimathiOnPrime streaming from September 28th on @PrimeVideoIN.#KumariSrimathi @MenenNithya @Sri_Avasarala @gomtesh_upadhye @iamThiruveer @PatnaikPraneeta @ItsActorNaresh… pic.twitter.com/EzHzY648rE — Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2023 తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి చాలామందికి తెలుసు. ఒకప్పుడు హీరోయిన్గా చేసింది కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉంది. ఈమె ప్రధాన పాత్రలో, ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ తీసిన హారర్ వెబ్ సిరీస్ 'మ్యాన్షన్ 24'. దీన్ని త్వరలో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. వినాయక చవితి సందర్భంగా ప్రకటించిన ఈ రెండూ లేడీ ఓరియెంటెడ్ మూవీ/వెబ్ సిరీస్ కావడం విశేషం. (ఇదీ చదవండి: పెళ్లికి ముందే అత్తారింట్లో మెగా కోడలు సందడి) So excited for this one..My next release#Mansion24 Watch at your own risk ⚠️#Mansion24OnHotstar coming soon..!!#DisneyPlusHotstar. @avika_n_joy @thebindumadhavi @vidyuraman @ActorNandu #MeenaKumari @ActorMaanas @actor_amardeep @shraddhadangara @jois_archie @mgabhinaya… pic.twitter.com/uWRdqFwbRo — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) September 18, 2023 -
పోలీసులే నిందితులైతే...
సాధారణంగా హత్యలకు కారణమైన దోషులకు శిక్ష పడేలా బాధ్యతగా విధులు నిర్వర్తిస్తుంటారు పోలీసులు. అయితే ఓ హత్య కేసులో పోలీసులే నిందుతులు అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసు కుంటాయి? అన్న కథాంశంతో ఓ చిత్రం రూపొందుతోంది. తేజా మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ఇది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, విద్య నిర్మిస్తున్నారు. బుధవారం (జూన్ 7) రాహుల్ విజయ్ బర్త్ డే ఈ సందర్భంగా ఈ సినిమాలో ఎస్. రవి పాత్రను రాహుల్ విజయ్ చేస్తున్నట్లుగా వెల్లడించి, పోస్టర్ రిలీజ్ చేశారు. శివానీ రాజశేఖర్, పవన్ తేజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: మిధున్ ముకుందన్. -
బుల్లెట్ బండి నడిపిన వరలక్ష్మి శరత్‌కుమార్.. వీడియో వైరల్
దక్షిణాది హీరోయిన్లలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ది మాత్రం డేరింగ్ అండ్ డైనమిక్ రూట్ అనే చెప్పాలి. అర్ధరాత్రి పోలీసునే చెంపలు వాయించిన రఫ్ బ్యూటీ ఈమె. ఈ విషయాన్ని ఆమె తండ్రి, నటుడు శరత్‌కుమార్‌నే స్వయంగా ఇటీవల ఒక వేదికపై చెప్పారు. ఇక నటిగా వరలక్ష్మి శరత్‌కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. దక్షిణాది సినీ ప్రేక్షకులకు బాగా తెలుసు. పాత్ర ఏదైనా ఈమెకు మోల్డ్ అయిపోతారు. పోడా పోడీ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్‌కుమార్ ఆ తరువాత తనకు నచ్చినట్లు కాకుండా ప్రేక్షకులు మెచ్చేటట్లు నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు దక్షిణాదిలో కథానాయకి పాత్రలను అటుంచితే ఛాలెంజింగ్‌తో కూడిన విలనిజం పాత్ర అయితే ఈ విలక్షణ నటిని వెతుక్కుంటూ రావాల్సిందే. ఆ మధ్య సర్కార్ చిత్రంలో అలాంటి పాత్రలోనే విజయ్ను ఢీకొన్న వరలక్ష్మి శరత్‌కుమార్ ఇటీవల తెలుగులో వీరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణకు పోటీ ఇచ్చారు. ఈమెలో మొండి ధైర్యం కూడా ఉంది. నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ ఇప్పటి వరకు కొన్ని కారణాల వల్ల సైకిల్ తొక్కడం లాంటి వాటి జోలికి పోలేదట. అయితే ఇప్పుడు ఏకంగా బుల్లెట్ ఎక్కేవారు. సైకిల్ నుంచి స్టెప్ బై స్టెప్ బుల్లెట్ నడపడం వరకు నేర్చేసుకున్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది తెగ వైరల్ అవుతోంది. దీని గురించి ఆమె పేర్కొంటూ బాల్యంలో కొన్ని కారణాల వల్ల తనకు బైక్ తోలడానికి ఇంట్లో అనుమతి ఇవ్వలేదన్నారు. అయితే బైక్ నడపడానికి భయాన్ని పోగొట్టడానికి ఇది సరైన టైమ్ అని భావించానన్నారు. దీంతో గత వారం బైక్ నడపడానికి తొలి మెట్టు అయిన సైకిల్ తొక్కడం నేర్చుకున్నానని, ఆ తరువాత స్క్రూటీ, ఇప్పుడు బుల్లెట్ కూడా నడుపుతున్నానని చెప్పారు. మొదట్లో కొంచెం కష్టం, బాధ అనిపించినా, భయాన్ని పోగొట్టడానికి ఇదంతా చేసినట్లు చెప్పారు. ఇక్కడ తాను కింద పడ్డాను అన్నది ముఖ్యం కాదని ఎలా లెగిశాను అన్నదే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. -
నాన్న వల్ల వచ్చిన అవకాశాలు పోయాయి : వరలక్ష్మీ శరత్‌కుమార్
చాలెంజింగ్ పాత్రలకు కేరాఫ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె సుప్రీమ్ స్టార్ శరత్ కుమార్ వారసురాలు అన్న విషయం తెలిసిందే. అయితే స్వశక్తితోనే నటిగా ఎదిగి తనకంటూ ఒక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఈమె రాకింగ్ నటన ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురి చేస్తుంది. నాయకి, ప్రతినాయకి ఇలా ఏ తరహా పాత్రకైనా రెడీ అంటారు. కథానాయకిగా రంగ ప్రవేశం చేసినా, ప్రతినాయకిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో శింబుకు జంటగా పోడాపొడి చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తదుపరి అవకాశాల కోసం కొంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. అలా బాలా దర్శకత్వంలో నటించిన తారై తప్పటై చిత్రంలో నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆపై వరలక్ష్మి నటిగా వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ముఖ్యంగా నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన సర్కార్, విశాల్ హీరోగా నటించిన సండై కోళీ 2 వంటి చిత్రాల్లో ప్రతి నాయకిగా తనదైన శైలిలో అదరగొట్టారు. చదవండి: శరత్‌బాబు-రమాప్రభ లవ్‌స్టోరీ వెనుక ఇంత కథ నడిచిందా? ఆ తర్వాత ఈమె ఎక్కువగా ఆ తరహా పాత్రల్లోనే నటిస్తున్నారు. మధ్య మధ్యలో కథానాయిక పాత్రలనూ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా దశాబ్దం పాటుగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ఇటీవల ఈమె ఒక భేటీలో పేర్కొంటూ శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రంలో జెనీలియా పాత్రలో తాను నటించాల్సి ఉందని చెప్పారు. దర్శకుడు శంకర్ నుంచి తనకు పిలుపు వచ్చిందన్నారు. ఆడిషన్, స్క్రీన్ టెస్ట్ కూడా జరిగిందన్నారు. ఆ చిత్రంలో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్న సమయంలో తాను నటించడానికి తన తండ్రి అనుమతించలేదని చెప్పారు. ఆ తర్వాత బాలాజీ శక్తి వేల్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రంలోనూ కథానాయికగా నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. దాన్ని నాన్న వద్దన్నారని చెప్పారు. ముందు చదువు పూర్తి చెయ్యి ఆ తర్వాత నటన గురించి ఆలోచిద్దామని చెప్పారన్నారు. అలా తన తండ్రి వల్ల చాలా అవకాశాలు మిస్ అయ్యానని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొన్నారు. -
మరోసారి గొప్ప మనుసు చాటుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్
కోలీవుడ్‌లో ధైర్యం, సాహసం, సాయం, సేవా వంటి గుణాలు కలిగిన అతి తక్కువ నటీనటుల్లో వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకరు. శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన స్వసక్తితోనే ఎదిగారు. నటిగా దక్షిణాదిలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. పోడా పోడి చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత రకరకాల పాత్రల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. తెరపై విలన్‌గా భయపెట్టే వరలక్ష్మిలో సేవ గుణం ఎక్కువే అనే విషయం తెలిసిందే. చదవండి: ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి.. తరచూ ఆమె సామాజిక సేవలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆమె మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. క్యాన్సర్ బాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువులను సాయం చేసి అండగా నిలిచారు. కాగా శనివారం తన పుట్టిన రోజును స్థానిక ఎగ్మోర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్‌లో హాస్పిటల్లో వైద్యులు, క్యాన్సర్ బాధితుల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జాయ్ ఆఫ్ షేరింగ్ పేరుతో శివశక్తి సంకల్ప్ బ్యటిఫుల్ వరల్డ్ సేవా సంస్థలు నిర్వహించాయి. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. అనేకమంది క్యాన్సర్ బాధితులను కాపాడుతున్న వైద్యుల మధ్య తన పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మన సన్నిహితులు, దగ్గరి వారు మాత్రమే క్యాన్సర్ బాధితులైనప్పుడు వ్యాధి గురించి ఆలోస్తున్నామని అభిప్రాయపడ్డారు. చేతిలో ఉన్న పది రూపాయలు సాయం చేసినా బాధితుల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుందన్నారు. అలాగే దేశమంత సైకిల్ యాత్ర చేస్తూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న చెన్నైకి చెందిన శివ రవి, జై అశ్వాణిలపై ఆమె ప్రశంసలు కురిపించారు. చదవండి: తీవ్రమైన గుండెపోటు నుంచి కాపాడింది అదే: సుస్మితాసేన్ కాగా క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కలిగించే విధంగా శివ రవి అనే 26 ఏళ్ల వ్యక్తి, జై అశ్వాణి అనే 18 ఏళ్ల యువకుడు కలిసి చెన్నై నుంచి కోల్కత్తా వరకూ 1746 కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు అదే విధంగా అనేకమంది క్యాన్సర్ బాధితులను కాపాడుతున్న సంకల్ప్ సేవా సంస్థ, వైద్యుల చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి క్యాన్సర్ బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను సాయంగా అందించారు. అదేవిధంగా సైకిల్ యాత్రతో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రవన్ని చేపట్టిన యువకులకు జ్ఞాపికలను అందజేశారు. -
వరలక్ష్మికి తండ్రిగా గర్వపడుతున్నా!: శరత్ కుమార్
తమిళసినిమా: నటిగా వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎదుగుదల అనూహ్యం అనే చెప్పాలి. తొలి చిత్రం పోడాపోడీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో వరలక్ష్మీ కెరీర్ ఇక అంతే అనే ప్రచారం జరిగింది. అదేవిధంగా ఆ తరువాత అవకాశాలు రావడానికి చాలా కాలమే పట్టింది. అలాంటి పరిస్థితిని వరలక్ష్మీ శరత్‌కుమార్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కథానాయకిగానే నటిస్తానని ఒక చట్రంలో ఇరుక్కోకుండా ప్రతినాయకిగానూ చాలెంజింగ్ పాత్రల్లో నటించడానికి సిద్ధమయ్యారు. అలాంటి పాత్రల్లో నటించి విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్నారు. చదవండి: మంచు వారి ఇంట పెళ్లి సందడి షురూ? ఆమెతో మనోజ్ పెళ్లి ఫిక్స్! బహుభాషా నటిగానూ రాణిస్తున్న వరలక్ష్మీ శరత్‌కుమార్ చాలా గ్యాప్ తరువాత కథానాయకిగా తమిళంలో నటించిన చిత్రం కొండ్రాల్ పావమ్. నటుడు సంతోష్ ప్రతాప్ కథానాయకుడిగా నటించిన ఇందులో దర్శకుడు సుబ్రమణ్యం శివ, నటుడు చార్లీ, సెండ్రాయన్,మనోబాల, నటి ఈశ్వరిరావు ముఖ్య పాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి దయాళ్ పద్మనాభన్ దర్శకత్వం వహించారు. కన్నడంలో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ఈయన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ప్రదాప్ కృష్ణ, మనోజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. నటుడు శరత్‌కుమార్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వేదికపై అందరూ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను నటి విజయశాంతితో పోలుస్తున్నారని, అది నిజమేనని అన్నారు. అయితే మొదట్లో వరలక్ష్మీ నటిస్తానని చెబితే వద్దు అనలేదు గానీ, ముంబై యూనివర్సిటీలో ఎంఏ చదివి సినిమాల్లో నటించడం అవసరమా? అని అన్నానన్నారు. అయితే తను మాత్రం నటించడానికే సిద్ధమయ్యారని, అయితే ఈ స్థాయికి రావడానికి కారణం తనే అన్నారు. చదవండి: అభిమాని నుంచి అలాంటి ప్రశ్న, మండిపడ్డ బిగ్‌బాస్ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా స్వశక్తితోనే ఎదిగిందని చెప్పారు. వరలక్ష్మీ బోల్డ్ అండ్ బ్రేవ్ ఉమెన్ అని పేర్కొన్నారు. ఒక రోజు రాత్రి ఒక పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. ఏమిటని అడిగితే మీ అమ్మాయి పోలీస్‌స్టేషన్‌లో ఉందని, వరలఓఇ్మ ఇద్దరు వ్యక్తుల్ని కొట్టినట్లు తెలిసిందన్నారు. ఆ వ్యక్తులు వరలక్ష్మి కారును ఢీకొట్టి అల్లరి చేయడంతో తను వారిని చితక బాధినట్లు తెలిసిందన్నారు. అలాంటి ధైర్యశాలి వరలక్ష్మి అని అన్నారు. ఆమె తండ్రిగా తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. ఇక కొండ్రాల్ పావం చిత్ర విషయానికి వస్తే కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. తానీ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్య థియేటర్లోనే చూస్తానని శరత్‌కుమార్ చెప్పారు. -
రివ్యూవర్స్‌పై వరలక్ష్మి అసహనం, అసలు మీరెవరంటూ మండిపడ్డ నటి
డేరింగ్ అండ్ బోల్డ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ సోషల్ మీడియా రివ్యూవర్స్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఆమె నటించిన లేటెస్ట్ తమిళ్ మూవీ ‘కొండ్రల్ పావమ్’. తెలుగులో చిత్రం ‘అనగనగా ఓ అతిథి’కి రీమేక్ ఇది. ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందంతో కలిసి ఆమె మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఓ తమిళ చానల్‌తో ముచ్చటించిన ఆమె సోషల్ మీడియాలో సినిమాలపై రివ్యూ ఇచ్చే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రివ్యూ చేప్పేవాళ్లకు కనీసం ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉండాలంది. ‘ఈ మధ్య ఇలా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయో లేదో అలా సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. చదవండి: ఆమిర్ ఖాన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన! ఆయనకు ఏమైంది? ఇంకా చెప్పాలంటే కొన్ని రిలీజ్ కాకముందే ట్రైలర్, టీజర్లు చూసి వాళ్లకు అనిపించింది చేప్పేస్తున్నారు. అలా అర్థంపర్థంలేని రివ్యూలు ఇస్తూ ప్రేక్షకుడిని తప్పుదొవ పట్టిస్తున్నారు. అసలు రివ్యూలు ఇవ్వడానికి వాళ్లు ఎవరు. మూవీ ఈ సినిమాలో ఇది బాగోలేదు, ఆ సినిమాలో అది బాగోలేదు, అసలు మూవీలో సందేహమే లేదంటూ ఇష్టం వచ్చినట్లు రివ్యూలు చెప్పేస్తున్నారు. అలాంటి వాళ్లందరిని నేను ఒక్కటే అడుగుతున్నా. అసలు మీరూ ఎలాంటి సినిమా ఆశిస్తున్నారు?’ అని ప్రశ్నించింది. అనంతరం ‘మొదట్లో అందరూ సినిమాని వినోదం కోసం చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేయడం మర్చిపోయి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది ఎక్కువ అయిపోయింది. అసలు సినిమా హిట్టు లేదా ఫ్లాప్ అని చెప్పడానికి వాళ్లేవరు. అది ప్రేక్షకుల నిర్ణయం. మూవీ బాగుందా? లేదా అని చెప్పేది ఆడియన్స్ మాత్రమే. ప్రేక్షకులను సినిమా చూసి ఆనందించనివ్వండి. చెత్త రివ్యూలతో వాళ్లను తప్పుదొవ పట్టించకండి. ఇదొక్కటే నా విన్నపం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అనంతరం మాట్లాడుతూ.. అలాగే కొంతమంది సినిమా కలెక్షన్స్ గురించి వాగ్వాదాలకు దిగుతున్నారని, ఇవన్నీ ఎందుకు? జీవితం చాలా చిన్నది దాన్ని ఎంజాయ్ చేయండంటూ రివ్యూవర్స్‌కి ఆమె సూచించింది. దీంతో ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతొంది. అంతేకాదు ఆమె మాట్లాడిని వీడియోను వరలక్ష్మి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. -
ఆ సీన్ చూసి నన్ను చంపేస్తారేమోనని భయపడ్డా: వరలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు
డేరింగ్ అండ్ బోల్డ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పోడా పోడీ అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే వెండితెరపై తన బౌండరిలను చేరిపేసుకుని నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో డిగ్లామర్స్ రోల్స్‌కే కాదు విలన్ పాత్రలకు సైతం సై అంటుంది. అలా సినిమాల్లో లేడీ విలన్‌గా విజృంభిస్తోంది. ప్రస్తుతం వరలక్ష్మి తెలుగు, తమిళం, మలయాళంలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. చదవండి: సావిత్రి గారి వల్లే నేను సక్సెస్ అయ్యాను: లలితా జువెల్లర్స్ ఎండీ ఇక రీసెంట్గా ఆమె తెలుగులో బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రంలో నటించింది. ఇందులో సొంత అన్నయ్యను చంపే చెల్లెలిగా ప్రతినాయకి పాత్రలో మెప్పించింది. ఇందులో తన నటనకు ఆమె ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఈ సినిమా తర్వాత తనని చంపేస్తారని మూవీ షూటింగ్ సమయంలో భయాందోళనకు గురయ్యానంది. తాజాగా జరిగిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్లో వరలక్ష్మి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ సినిమాలో బాలయ్యను పొడిచి చంపే సీన్ చేస్తున్నప్పుడు చాలా భయపడ్డాను. చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు ఆ సీన్ చూశాక.. బాలయ్య అభిమానులు నాపై పగ పెంచుకుని చంపుతారేమో అని ఆందోళనకు గరయ్యా. షూటింగ్లో ఈ సీన్ చేసేటప్పుడు నేను భయంతో ఇబ్బంది పడ్డాను. అది చూసి బాలయ్య నాలో ధైర్యం నింపారు. ఈ సీన్ చేస్తున్నప్పుడు నేను భయపడుతుంటే ‘ఎందుకు భయం?’ అని అడిగారు. ఇది చూశాక మీ ఫ్యాన్స్ నెగిటివ్‌గా తీసుకుంటారేమో, నాపై విరుచుకుపడతారమో అని ఆయనతో అన్నాను. దీనికి బాలయ్య స్పందిస్తూ.. ‘నెగెటివ్‌గా ఏం తీసుకోరని.. పాజిటివ్‌గానే రిసీవ్ చేసుకుంటారు’ అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మీరందరూ ఆ సీన్‌ని పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నందకు ధన్యవాదాలు’’ అంటూ చెప్పుకొచ్చింది. -
స్టార్ హీరోలను గడగడలాడిస్తున్న లేడీ విలన్
లేడీ విలన్‌గా మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. పైగా స్టార్ హీరోలను సైతం గడగడలాడించడం, వారికి సవాల్ విసరడం చిన్న విషయం కాదు. కాని వరలక్ష్మి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. గతంలో క్రాక్‌లో జయమ్మగా నటించి మెప్పించింది. ఇప్పుడు వీర సింహారెడ్డిలో మరోసారి నట విశ్వరూపాన్ని చూపింది. వీర సింహారెడ్డి సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసింది వరలక్ష్మి. బాలయ్యపై పగ పెంచుకోవడం, సీమ యాసలో డైలాగ్స్ చెప్పడం, మొత్తంగా నరసింహలో నీలాంబరి పాత్రను మరోసారి గుర్తు చేసింది వరలక్ష్మి. వీర సింహారెడ్డి సినిమాలో సెకండ్ హాఫ్ తనదైన నటనతో దుమ్మురేపింది. 2018లోనే కోలీవుడ్‌లో లేడీ విలన్‌గా బిజీ అయింది వరలక్ష్మి. ఆ ఏడు తమిళంలో తెరకెక్కిన పందెంకోడి సీక్వెల్, సర్కార్ లాంటి చిత్రాల్లో ప్రతినాయక పాత్రలు చేసి అబ్బురపరిచింది. సర్కార్, మారి -2 సినిమాల్లో నటన వరలక్ష్మి కెరీర్‌ను మలుపు తిప్పింది. గోపీచంద్ మలినేని గతంలో తెరకెక్కించిన క్రాక్‌లోనూ జయమ్మ పాత్రలో అదరగొట్టింది వరలక్ష్మి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం, అందులోనూ వరలక్ష్మి పాత్ర సెన్సేషన్ సృష్టించడంతో లేడీ విలన్‌గా స్టార్ డమ్ అందుకుంది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకుంది లేదు. ఇప్పుడు వీర సింహారెడ్డిలో నటనకు మరోసారి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చదవండి: తల్లి కాబోతున్న సాహో నటి తేజస్వినితో అఖిల్ ప్రేమాయణం -
అందుకే గ్లామర్ పాత్రలు చేయను : వరలక్ష్మీ శరత్‌కుమార్
తమిళసినిమా: డేరింగ్ అండ్ బోల్డ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్. పోడా పోడీ చిత్రం ద్వారా నటుడు శింబుకు కథానాయకిగా పరిచయమైన ఈమె తర్వాతి కాలంలో ట్రెండ్ మార్చుకుని ప్రతినాయకిగా అవతారం ఎత్తారు. అప్పటి నుంచి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ప్రశంసలు, విజయాలు వరిస్తున్నాయి. ఇప్పుడు తమిళంతో పాటు తెలుగు, మలయాళం తదితర భాషల్లోనూ ఈమె కెరీర్ పీక్స్‌లో కొనసాగుతోంది. నాయకిగా, ప్రతినాయకిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఏ పాత్రకైనా రెడీ అంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. తమిళంతో పాటు తెలుగులోనూ వరలక్ష్మి శరత్‌కుమార్‌కు మంచి డిమాండ్ ఉంది. సంక్రాంతి బరిలోకి దిగుతున్న బాలకృష్ణ కథానాయకుడుగా నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో ఈమె విలనిజం ప్రదర్శించారు. ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రతినాయకిగా నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు వరలక్ష్మి శరత్‌కుమార్ ఇటీవల ఒక భేటీలో బదులిస్తూ గ్లామర్ పాత్రలు తనకు వర్కౌట్ కాదని భావించానని, అయినా అలాంటి పాత్రలు చేయడానికి చాలామంది ఉన్నారని అన్నారు. అందుకే తాను ప్రతినాయక బాటను ఎంచుకున్నానని తెలిపారు. ఇలాంటి కొన్ని పాత్రలు తానే చేయగలనని అభిప్రాయపడ్డారు. అయితే తనకు గురువు, దర్శకుడు బాల అని పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో తారై తప్పట్టై చిత్రంలో గరగాటకారిగా నటించి ప్రశంసలు అందుకున్నట్లు చెప్పారు. అయినా తాను ప్రతినాయకి పాత్రల్లో నటిస్తూ సంతోషంగానే ఉన్నానని పేర్కొన్నారు. -
'ఆహా' కోసం పోలీస్ అవతారం ఎత్తిన వరలక్ష్మీ శరత్‌కుమార్
తమిళసినిమా: ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె హీరోయిజం, విలనిజం, క్యారెక్టరిజం ఇలా పాత్ర ఏదైనా నచ్చితే చేసేస్తున్నారు. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ అధికారి అవతారం ఎత్తారు. దర్శకుడు దయాళ్ పద్మనాభన్ ఆహా ఓటిటీ కోసం తెరకెక్కిస్తున్న చిత్రంలో ఈమె పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. దీనికి కథ, కథనం దర్శకుడు అందిస్తున్నారు. కాగా ఇందులో ఆమెతో పాటు నటుడు సంతోష్ ప్రతాప్, మహత్, రాఘవేంద్ర, దర్శకుడు సుబ్రమణ్యం, శివ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణికాంత్ కాంద్రీ సంగీతాన్ని, శేఖర్ చంద్ర చాయాగ్రహణను అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ శుక్రవారం బెంగళరులో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్ర కథా పోలీస్‌స్టేషన్ నేపథ్యంలో సాగుతుందన్నారు. ఆది నుంచి అంతం వరకు చిత్రం ఉత్కంఠ భరితంగా సాగుతుందని పేర్కొన్నారు. కాగా ఇంతకుముందు ఈయన దర్శకత్వంలో వరలక్ష్మి, సంతోష్ ప్రతాప్ కలిసి కొండ్రాల్ పావం అనే చిత్రంలో నటించడం విశేషం. -
'శబరి' షూటింగ్ కంప్లీట్ చేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శబరి’. ఈ మూవీతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్‌పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ– ‘‘నేను పనిచేసిన బెస్ట్ ప్రొడ్యూసర్లలో మహేంద్రగారు ఒకరు. ఆయన ఇచ్చిన ప్రతి రూపాయిని అనిల్ తెరపైకి తీసుకొచ్చారు. రెండు మూడు రోజుల్లో ఈ సినిమా డబ్బింగ్ ప్రారంభిస్తా’’ అన్నారు. ‘‘ఇదొక స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించాం. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. ‘‘స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతి శబరి పాత్రలో వరలక్ష్మి నటించారు’’ అన్నారు అనిల్ కాట్జ్. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపీ సుందర్. -
ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌కు తీవ్ర అస్వస్ధత
ప్రముఖ సీనియర్ నటుడు శరత్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డయేరియాతో డీహైడ్రేషన్‌కు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇప్పటికే ఆసుపత్రి వద్దకు చేరుకున్నట్లు తెలుస్తుంది. కాగా 1986లో 'సమాజంలో స్త్రీ' అనే తెలుగు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన శరత్‌కుమార్ సపోర్టింగ్ రోల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని అనతికాలంలోనే హీరోగా మారాడు. తెలుగునాట మంచి పాపులారిటీ దక్కించుకున్న శరత్‌కుమార్ ఇటీవలె తెలుగులో పరంపర వెబ్‌సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. -
ఈ పదేళ్ల నా సినీ కెరీర్ అంత ఈజీగా సాగలేదు: వరలక్ష్మి శరత్‌కుమార్ ఎమోషనల్
కోలీవుడ్‌లో ధైర్యం, సాహసం, సాయం, సేవా వంటి గుణాలు కలిగిన అతి తక్కువ నటీనటుల్లో వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకరు. శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన స్వసక్తితోనే ఎదిగారు. నటిగా దక్షిణాదిలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. పోడా పోడి చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత రకరకాల పాత్రల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. అందులో విలనిజం ప్రదర్శించి మెప్పించిన పాత్రలు చాలానే ఉన్నాయి. అలా వరలక్ష్మి నటిగా దశాబ్ద కాలాన్ని సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ సందర్భంగా ఈ పదేళ్ల తన సినీ కెరీర్ అంత ఈజీగా సాగలేదంటూ ఆమె చేదు సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ పదేళ్లలో తాను 45 చిత్రాలు చేశానని చెప్పారు. ‘ఈ పదేళ్ల నా సినీ కెరీర్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను.ముఖ్యంగా విలన్ పాత్రలో ప్రేక్షకులు నన్ను ఆదరించారు. నిజం చెప్పాలంటే విలనిజాన్ని ప్రదర్శించడం చాలా కష్టం. అయినా అలాంటి పాత్రలో నటించగలనని నిరూపించాను. అయితే ఈ పదేళ్ల నా సినీ ప్రయాణం అంతా జాలీగా సాగలేదు. ప్రారంభంలో ఎన్నో అవమానాలు పడ్డాను. మరెన్నో తిరస్కారాలకు గురయ్యాను. అయితే ఈవేవి నన్ను ఆపలేదు. వీటి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కఠినంగా శ్రమించాను. ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఇప్పుడు తిరిగి చూస్తే 45 చిత్రాలు చేశాననే తలుచుకుంటుంటే మంచి అనుభూతికి లోనవుతున్నా. నాలోని నటనను చాటుకునే విధంగా పలు అవకాశాలు వస్తున్నాయి. విరామం లేకుండా నటిస్తున్నాను. నా నట జీవితం చాలా బిజీగా సాగుతుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని తన పోస్ట్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) చదవండి: గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత, పరిస్థితి విషమం! నాకు ఇష్టమైన నటుడితో నటించే అవకాశం వచ్చింది : హీరోయిన్ -
శరవేగంగా వరలక్ష్మి శరత్‌కుమార్ సినిమా షూటింగ్
తమిళసినిమా: నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కొండ్రాల్ పావం. నటుడు సంతోష్ ప్రతాప్, ఈశ్వరిరావు, చార్లీ, మనోబాల, జయకుమార్, మీసై రాజేంద్రన్, సుబ్రమణ్యం శివ, ఇమ్రాన్, సెండ్రాయన్, టీఎస్ఆర్ శ్రీనివాసన్, రాహుల్, కవితా భారతి, తంగదురై, కల్యాణి మాధవి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇన్చ్ స్టూడియోస్ పతాకంపై ప్రతాప్ కృష్ణ, మనోజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ.. ఈ నెల మొదట్లో ప్రారంభించిన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే అధిక భాగం షూటింగ్ పూర్తయినట్లు తెలిపారు. రచయిత మోహన్‌బాబు రాసిన ప్రముఖ నాటకాన్ని కొండ్రాల్ పావం పేరుతో చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. దీనిని తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నట్లు తెలిపారు. తెలుగు వెర్షన్ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఆహా ఓటీటీ కోసం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసి షూటింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయిందని, త్వరలోనే మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి చెళియన్ చాయాగ్రహణను, శ్యామ్ సీ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి టీ పిక్చర్స్ సంస్థ సహ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. -
వైజాగ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్
వరలక్ష్మీ శరత్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ వైజాగ్‌లో పూర్తయింది. ఈ సంద్భంగా అనిల్ కాట్జ్ మాట్లాడుతూ– ‘‘శబరి’ భిన్నమైన చిత్రం. స్వతంత్ర భావాలున్న యువతి పాత్రలో వరలక్ష్మి కనిపిస్తారు. మూడో షెడ్యూల్లో భాగంగా వైజాగ్‌లోని ఆర్కే బీచ్, సిరిపురం జంక్షన్‌తో పాటు అరకు లాంటి అందమైన లొకేషన్లలో షూటింగ్ చేశాం. ప్రధాన తారాగణంపై కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, ఒక పాట, కీ సీన్స్ చిత్రీకరించాం. నందు, నూర్ మాస్టర్స్ పర్యవేక్షణలో రూపొందిన యాక్షన్ సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. ఈ నెలలో హైదరాబాద్‌లో నాలుగో షెడ్యూల్ మొదలు కానుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల. -
ఆ తర్వాతే సమంత ఆరోగ్యం క్షీణించి ఉండొచ్చు : నటి
సమంత అనారోగ్య పరిస్థితిపై చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని సమంత పోస్ట్ చేయడంతో ఇండస్ట్రీ సహా ఆమె అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు. తాజాగా సమంత అనారోగ్యంపై నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ స్పందించారు. '12 ఏళ్లుగా సామ్‌తో పరిచయం ఉంది. యశోద సినిమాలో కలిసి నటించడం ఆనందంగా అనిపించింది. సెట్స్‌లో ఇద్దరం చాలా సరదాగా ఉండేవాళ్లం. షూటింగ్ టైంలో సామ్ అనారోగ్యంతో బాధపడుతుందని మాకు తెలీదు, ఎందుకంటే ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేది. యశోద షూటింగ్ పూర్తయిన తర్వాతే సామ్ ఆరోగ్యం క్షీణిందని అనుకుంటున్నా. కానీ ఆమె ఒక ఫైటర్. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుందని ఆశిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. కాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా నవంబర్ 11న విడుదల కానుంది. -
తమిళ్లో నటించే సమయమే దొరకట్లేదు: వరలక్ష్మీ శరత్ కుమార్
‘‘క్రాక్’లో నేను చేసిన జయమ్మ పాత్ర తర్వాత తెలుగులో నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో సినిమాలు చేసే టైమ్ లేనంతంగా తెలుగు చిత్రాలు చేస్తున్నాను. దర్శకులు నా కోసం ప్రత్యేక పాత్రలు రాస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. హరి–హరీష్ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న విడుదలవుతోంది. ఇందులో కీలక పాత్ర చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘సమంత పన్నెండేళ్లుగా నాకు తెలుసు.. తను స్ట్రాంగ్ ఉమెన్. ‘యశోద’లో కథే హీరో. మేమంతా ఆ కథలో పాత్రధారులు మాత్రమే. ఈ చిత్రంలో సరోగసీ అనేది ఒక టాపిక్ అంతే. ఈ సినిమాలో నేను డాక్టర్ పాత్ర చేయలేదు.. సరోగసీ ఫెసిలిటీ సెంటర్ హెడ్ పాత్రలో నటించాను. నా నిజ జీవితానికి విరుద్ధమైన పాత్ర ఇది. మహిళలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి పాత్ర కోసం దర్శకులు బాగా రీసెర్చ్ చేశారు. ఈ మూవీ కోసం సమంత చాలా కష్టపడ్డారు. మణిశర్మగారు మంచి సంగీతం ఇచ్చారు. శివలెంకగారు గ్రాండ్‌గా ఈ మూవీ తీశారు. ప్రస్తుతం నేను తెలుగులో ‘శబరి’ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాను. బాలకృష్ణగారి ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో కీ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. -
మీరు పెట్టే టికెట్ రేటుకు వాల్యూ ఉంటుంది: వరలక్ష్మి
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఇందులో వరలక్షి శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. హరి, హరీష్ దర్శకత్వం వహించగా శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న సినిమా రిలీజవుతున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం... ► 'యశోద' కథ విన్నప్పుడు ఇటువంటి క్యారెక్టర్లను ఎలా రాశారు? ఈ కథను ఎలా ఆలోచించారా? అని ఆశ్చర్యపోతూ అడిగాను. ఇందులో గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశా. సమంత క్యారెక్టర్, నా క్యారెక్టర్ మధ్య ఉన్న రిలేషన్... మా కథలు ఆసక్తిగా ఉంటాయి. ► సినిమాలో లీడ్ రోల్ సమంత చేశారు. ఆమెకు ఒకరు అవసరం అవుతారు. అప్పుడు నా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. రెండు కథలు జరుగుతాయి. ఆ రెండూ ఎలా కలిశాయి? అనేది సినిమా. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. నాది సెకండ్ లీడ్ అని చెప్పవచ్చు. ఇంత కంటే ఎక్కువ చెబితే స్టోరీ రివీల్ అవుతుంది. ► నాది డాక్టర్ రోల్ కాదు అండి. ట్రైలర్లో చూపించిన సరోగసీ ఫెసిలిటీ సెంటర్ హెడ్. ఆమె చాలా రిచ్. డబ్బులు అంటే ఇష్టం. నిజ జీవితంలో నా డ్రసింగ్ స్టైల్, ఇతర అంశాలకు పూర్తి విరుద్ధంగా ఆ పాత్ర ఉంటుంది. తనను తాను బాగా ప్రేమించే పాత్ర. ► దర్శకులు ఇద్దరూ చాలా కామ్. నేను పని చేసిన దర్శకుల్లో అంత కామ్ గా ఎవరినీ చూడలేదు. వాళ్ళిద్దరూ అరవడం ఎప్పుడూ చూడలేదు. వాళ్ళకు ఏం కావాలో బాగా తెలుసు. ఒక్కో క్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేశారు. ► సినిమాటోగ్రాఫర్ సుకుమార్ గారు అద్భుతంగా షూట్ చేశారు. సినిమాలో సంగీతానిది కీలక పాత్ర. మణిశర్మ గారు మంచి సంగీతం అందిస్తున్నారు. మీరు పెట్టే టికెట్ రేటుకు వేల్యూ ఉంటుంది. సినిమాలో అంత మంచి కంటెంట్ ఉంది. క్వాలిటీ విజువల్స్ ఉంటాయి. మా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారు ఎంతో ఖర్చుపెట్టి సెట్స్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కనబడుతోంది. ► సరోగసీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల డిస్కషన్స్ జరుగుతున్నాయి. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ. కానీ, సమాజంలో అటువంటి మనుషులు ఉన్నారనిపిస్తుంది. ► నాకు సమంత పది పన్నెండు ఏళ్ల క్రితమే తెలుసు. మాకు చెన్నైలో పరిచయం అయ్యింది. సినిమాలో తనకు సీరియస్ సీన్స్ ఉన్నాయి. నేను ఏమో షూటింగ్ గ్యాప్ వస్తే జోక్స్ వేసేదాన్ని. తను నవ్వేది. 'షాట్ ముందే ఎందుకు ఇటువంటి జోక్స్ వేస్తావ్?' అనేది. తనతో నటించడం సరదాగా ఉంటుంది. తను స్ట్రాంగ్ విమెన్. పాత్రలో జీవించింది. పవర్ ఫుల్ రోల్ బాగా చేసింది. ► 'క్రాక్'లో జయమ్మ తర్వాత నాకు మంచి రోల్స్ వస్తున్నాయి. రచయితలు నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తున్నారు. ఇప్పుడు నేను తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. బయటకు వెళ్ళడానికి ఖాళీ లేదు. తమిళ సినిమాలు చేయడానికి డేట్స్ లేవు. నాకు స్టీరియో టైప్ రోల్స్ రావడం లేదు. అది సంతోషంగా ఉంది. ► తెలుగులో 'శబరి' చేస్తున్నా. అందులో నాది లీడ్ రోల్. 'వీర సింహా రెడ్డి'లో నాది క్రేజీ క్యారెక్టర్. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. చదవండి: సమంత ఆరోగ్యంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ నన్ను చితక్కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు: అనుపమ్ ఖేర్ -
కూతురుతో కలిసి రజనీని కలిసిన శరత్ కుమార్
నటుడు శరత్ కుమార్ తన కూతురు, నటి వరలక్ష్మి శరత్ కుమార్‌తో కలిసి ఆదివారం సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిశారు. వీరిని తలైవా సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని నటుడు శరత్ కుమార్ తన ట్విట్టర్లో పొందుపరిచారు. మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటుడు శరత్ కుమార్ పెరియ పళవేట్టరైయర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం చూసిన రజనీకాంత్ శరత్ కుమార్‌కు ఫోన్‌చేసి ప్రశంసించారు. అందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే తాను రజనీకాంత్ కలిసినట్లు శరత్ కుమార్ పేర్కొన్నారు. కూతురు వరలక్ష్మి కూడా రావడంతో తాజాగా నటిస్తున్న చిత్రాలపై కొద్దిసేపు చర్చించినట్లు వెల్లడించారు. -
తల్లి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్..
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శబరి’. ఈ మూవీతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కొడైకెనాల్లో ముగిసింది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రెండు వారాలుగా కొడైకెనాల్లో జరుగుతున్న ‘శబరి’ షూటింగ్ సోమవారంతో ముగిసింది. చదవండి: జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ఆది’ రీరిలీజ్! ఎప్పుడంటే.. ఈ చిత్రం షూటింగ్ త్వరగా పూర్తి చేసి, మీ ముందుకు సినిమాని ఎప్పుడు తీసుకువద్దామా? అని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. తర్వాతి షెడ్యూల్‌ని వైజాగ్‌లో ప్రారంభిస్తాం’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. ‘‘కూతుర్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించే తల్లిగా వరలక్ష్మి నటిస్తున్నారు’’ అన్నారు అనిల్ కాట్జ్. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. -
పోలీస్ ఆఫీసర్ రోల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్
వరలక్ష్మి చేజింగ్ అన్యాయాలను ఎదిరించడానికి సిన్సియర్ పోలీసాఫీసర్‌గా రంగంలోకి దిగారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఆమె లీడ్ రోల్లో రూపొందిన చిత్రం ‘చేజింగ్’. ఈ తమిళ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ఏఎన్ బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘ ‘మా బేనర్లో ‘ఒరేయ్ బామ్మర్ది, మై డియర్ భూతం’ వంటి హిట్ చిత్రాలను అందించాం. ‘చేజింగ్’ మంచి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని ఏఎన్ బాలాజీ అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం: కె. వీరకుమార్ -
వరలక్ష్మి శరత్ కుమార్ ‘ఛేజింగ్’ డబ్బింగ్ పూర్తి, త్వరలోనే రిలీజ్
సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసి వెండితెరపై తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ విభిన్నమైన పాత్రలతో స్పెషల్ క్రేజ్ అందుకుంది. పాజిటివ్ రోల్స్‌తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తూ తమిళ, తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ ఛేజింగ్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది వరలక్ష్మి శరత్ కుమార్. చదవండి: టాలీవుడ్‌పై అమలా పాల్ షాకింగ్ కామెంట్స్.. ఇప్పటికే తమిళ్లో విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఒరేయ్ బామ్మర్ది, మై డియర్ భూతం లాంటి పలు సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఏఎన్ బాలాజీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో అదే ఛేజింగ్ పేరుతో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. -
వాట్ ఏ ట్రాన్స్ఫర్మేమషన్.. ఈ హీరోయిన్స్ ఎంతలా మారిపోయారో
న్యూ ప్రాజెక్ట్స్ కోసం కొందరు హీరోయిన్స్ కొత్త చాలెంజ్‌లు తీసుకున్నారు. న్యూ మేకోవర్ కోసం పర్ఫెక్ట్ డైట్, వర్కౌట్స్‌తో క్యారెక్టర్స్‌కు తగ్గట్లు మౌల్డ్ అవుతున్నారు. అలాంటి వారిలో సమంత, కీర్తీ సురేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి వారు ఉన్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. ► ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్, వర్కౌట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు సమంత. ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్‌సిరీస్ తర్వాత దర్శక–ద్వయం రాజ్ అండ్ డీకేలతో సమంత మరో వెబ్‌సిరీస్ చేయనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసందే. ఇందులో బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ మరో లీడ్ యాక్టర్. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత పాత్ర చాలా పవర్ఫుల్ అండ్ యాక్షన్‌తో ఉంటుందట. అందుకే సమంత ఈ ప్రాజెక్ట్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారని టాక్. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత లుక్ కూడా కొత్తగా ఉంటుందనీ, ఆల్రెడీ వర్క్‌షాప్స్ మొదలయ్యాయని, త్వరలోనే ఈ వెబ్‌సిరీస్‌పై అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్ టాక్. ► హీరోయిన్ కీర్తీ సురేశ్ మరోసారి లాఠీ పట్టనున్నారట. రీసెంట్ వచ్చిన తమిళ చిత్రం ‘సానికాయిదమ్’(తెలుగులో ‘చిన్ని’)లో పోలీస్ కానిస్టేబుల్‌గా నటించారామె. తాజాగా మరోసారి పోలీసాఫీసర్‌గా(ఎస్ఐ) నటించనున్నారు. తమిళ చిత్రాలు ‘హీరో’, ‘విశ్వాసం’, ‘అన్నాత్తే’లకు కథా రచయితగా పని చేసిన ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ రూపొందనుంది. ఈ చిత్రంలో ‘జయం’ రవి హీరోగా నటిస్తారు. ఈ మూవీలోనే కీర్తీ సురేశ్ పోలీసాఫీసర్‌గా నటించనున్నారని కోలీవుడ్ టాక్. ఈ పాత్ర కోసమే ఆమె కాస్త బరువు పెరిగి, ఫిట్‌గా ఉండేలా వర్కౌట్స్ చేస్తున్నారని తెలిసింది. ► కాగా ఈ చిత్రంలో కీర్తితో పాటు మరో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహనన్ కూడా నటిస్తారట. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా... ఇలా డిఫరెంట్ రోల్స్ చేస్తూ విలక్షణ నటిగా పేరు తెచ్చు కున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఓ కొత్త సినిమా కోసం ఆమె బాగా బరువు తగ్గి, స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘నువ్వు ఏం చేయాలో, చేయకూడదో ఇతరులు నీకు చెప్పేలా ఉండకూడదు. ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా తీసుకుని ముందడుగు వేయాలి. నా కొత్త లుక్ కోసం దాదాపు నాలుగు నెలలు కష్టపడ్డాను’ అంటూ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఓ కొత్త ప్రాజెక్ట్ కోసమే ఆమె ఇలా స్లిమ్ లుక్‌లోకి మారిపోయారని కోలీవుడ్ టాక్. అయితే సమంత, కీర్తీ సురేశ్, వరలక్ష్మి.. వీరే కాదు.. మరికొంతమంది హీరోయిన్స్ కూడా న్యూ ప్రాజెక్ట్స్ కోసం కొత్త మేకోవర్‌కు రెడీ అవుతున్నారు. -
అమ్మవారి పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్.. షూటింగ్ ప్రారంభం
సుమంత్ శైలేంద్ర, మేఘా ఆకాష్ జంటగా రూపొందుతున్న ‘ఓం శ్రీ కనకదుర్గ’ చిత్రం గురువారం ఆరంభమైంది. కనకదుర్గ అమ్మవారి పాత్రను వరలక్ష్మీ శరత్‌కుమార్ పోషిస్తున్నారు. లంకా ఫణిధర్ సమర్పణలో స్వీయ దర్శకత్వంలో లంకా శశిధర్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తొలి సీన్‌కి నిర్మాత డీయస్ రావు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అంబికా కృష్ణ క్లాప్ ఇచ్చారు. నిర్మాత సైలేంద్ర బాబు స్క్రిప్ట్ అందించగా, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేస్తున్నాను’’ అన్నారు మురళీమోహన్. ‘‘అమ్మవారి నేపథ్యంలో భారీ గ్రాఫిక్స్‌తో లవ్, ఎంటర్టైనర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని దర్శక–నిర్మాత లంకా శశిధర్ అన్నారు. ‘‘మా చిన్నబ్బాయి శశిధర్‌కు సినిమాలంటే చిన్నప్పటి నుండి ఇష్టం. దర్శకుడు కావాలనే తన కల ఈ చిత్రంతో నెరవేరుతోంది’’ అన్నారు లంకా శివశంకర్ ప్రసాద్. ఈ చిత్రానికి సంగీతం: సామ్ కె. ప్రసన్, కెమెరా: శ్రీచిత్ విజయన్ దామోదర్, లైన్ ప్రొడ్యూసర్: జేత్రం మహేష్ రెడ్డి . -
పెద్ద బ్యానర్లో శివానీ రాజశేఖర్ సినిమా!
భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సంచలన విజయాలతో దూసుకుపోతూ పక్కా కమర్షియల్ సినిమాతో మరో మారు ప్రేక్షకుల ముందుకు వస్తోంది జీఏ2 పిక్చర్స్ నిర్మాణ సంస్థ. తాజాగా ఈ బ్యానర్లో మరో కొత్త సినిమా ప్రారంభమైంది. జోహార్, అర్జున ఫల్గుణ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలు తెరకెక్కించిన తేజ మర్ని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. దీనికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్ దైవసన్నిధానంలో గురువారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు బన్నీ వాస్ తనయ బేబీ హన్విక క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి బన్నీ వాసుతో పాటు విద్య మాధురి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిగా కంటెంట్ ప్రధానంగానే ఈ సినిమా కథ సాగుతుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. భాను ప్రతాప్ సహ నిర్మాత, ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. Some journeys are worth waiting for… this one is going to be special :)#AlluAravind garu Presents @GA2Official's #ProductionNo8 launched today with a pooja ceremony.✨Produced by #BunnyVas & #VidhyaMadhuri Directed by #TejaMarni @actorsrikanth @varusarath5 #Shivani pic.twitter.com/u76XITcrnY— Rahul Vijay (@ActorRahulVijay) June 30, 2022 చదవండి: అంకుల్ అంటూ భోరున విలపించిన మీనా.. రజనీకాంత్ కంటతడి అలాంటి సినిమాలను ప్రేక్షకులు వదులుకోరు: రాజమౌళి -
VaraLakshmi Sarathkumar : చేజింగ్.. చేజింగ్
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో కె. వీరకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చేజింగ్’. జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియాండి నిర్మించారు. పరిటాల రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్రం టీజర్‌ని దర్శకులు వి. సముద్ర, సూర్యకిరణ్, నిర్మాత రామ సత్యనారాయణ విడుదల చేశారు. జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియాండి మాట్లాడుతూ– ‘‘చేజింగ్’ మా కాంబినేషన్లో మొదటి సినిమా అయినా ఖర్చుకి ఎక్కడా వెనకాడలేదు. మరిన్ని తెలుగు, తమిళ సినిమాలు తీయాలనుకుంటున్నాం’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్ గుండు ప్రభాకర్, కె. వీరకుమార్, దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడారు. -
ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అయిన వరలక్ష్మి శరత్ కుమార్ ‘కన్ని దీవు’
సాక్షి, చెన్నై: ‘కన్ని దీవు’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. నటి వరలక్ష్మీ శరత్ కుమార్, సుభిక్ష, ఐశ్వర్య దత్త, ఆస్నా దేవేరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇది. సుందర్ బాలు దర్శకత్వంలో కృతిక ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ ప్రతాప్ సంగీతాన్ని అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఉత్తర చెన్నై ప్రాంతంలోలోని ఓ హౌసింగ్ బోర్డులో నివశించే నలుగురు యువతుల ఇతివృత్తంతో రూపొందించిన యాక్షన్ కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రంలోని ‘పోరాడి వా’ అనే సింగిల్ సాంగ్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపారు. -
'మధుబాల'గా వరలక్ష్మీ శరత్‌కుమార్.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
వరలక్ష్మీ శరత్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంతో పాటు తెలుగులోనూ అదరగొడుతుంది. ఇటీవలె క్రాక్, నాంది సినిమాలతో హిట్ అందుకున్న ఆమెకు తెలుగులో మరింత క్రేజ్ పెరిగింది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. శనివారం ఆమె పుట్టినరోజు కావడంతో యశోద టీం ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఆ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ వదిలారు. ఈ చిత్రంలో ఆమె 'మధుబాల' అనే పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్లో స్పష్టమవుతుంది. ఈ సినిమాకు హరీశ్ శంకర్, హరీశ్ నారాయన్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీదేవీ మూవీ బ్యానర్‌పై శివలంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్ మరో ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. -
వరలక్ష్మీ శరత్‌కుమార్ లేటెస్ట్ మూవీ 'ఆద్య' షూటింగ్ ప్రారంభం
ఆశిష్ గాంధీ, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రధారులుగా ఎమ్ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆద్య’. డి.ఎస్.కె. స్క్రీన్స్ సమర్పణలో పి.ఎస్.ఆర్. కుమార్, ఎస్. రజనీకాంత్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ‘‘సాయిలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ‘షికారు’ తర్వాత బాబ్జీ నిర్మిస్తున్న ద్వితీయ చిత్రం ‘ఆద్య’. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా కథాంశం ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. విశ్వ కార్తీక్, హెబ్బా పటేల్, కన్నడ కిశోర్, అమితా రంగనాథన్, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సహనిర్మాత: పి.సాయి పవన్‌కుమార్. -
మధుబాల ఆన్ సెట్
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’. ఈ సినిమా ద్వారా హరి–హరీష్ దర్శకులుగా పరిచయమవుతున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ జానర్లో ఆకట్టుకునేలా తీస్తున్న చిత్రం ‘యశోద’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 6న ప్రారంభమైంది. ఇందులో కీలకమైన మధుబాల పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపిస్తారు. బుధవారం నుంచి ఆమె చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ నెల 23 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చేస్తాం. జనవరి 3న రెండో షెడ్యూల్ మొదలవుతుంది. మార్చికి సినిమాను పూర్తి చేస్తాం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, కెమెరా: ఎం. సుకుమార్, సంగీతం: మణిశర్మ, సహనిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి. -
సంక్రాంతిని ముందే తెస్తున్నాం
‘‘రవితేజగారితో ఇంతకుముందు ‘డా¯Œ శీను, బలుపు’ వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశాను. ప్రస్తుతం రియలిస్టిక్ స్టోరీస్‌కి మంచి ఆదరణ లభిస్తుండటంతో మూడో చిత్రంగా ఒక రియలిస్టిక్ అప్రోచ్‌తో సినిమా చేస్తే బాగుంటుందనిపించి ‘క్రాక్’ చేశా’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్ జంటగా, సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్రాక్’. బి. మధు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని చెప్పిన విశేషాలు. ► రియల్ క్యారెక్టర్స్‌ను కమర్షియల్ సినిమాలోకి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి తీసిన సినిమా ‘క్రాక్’. నేను చదువుకునే రోజుల్లో ‘ఒంగోలులో రాత్రి కరెంట్ పోతే హత్య జరుగుతుంది’ అని చెప్పుకునే వారు.. మా ఊరి దగ్గరలో కొంతమంది గాడిద రక్తం తాగేవారు. అలా తాగిన తర్వాత ఒళ్లంతా చెమటలు పట్టేలా పరిగెత్తకపోతే రక్తం గడ్డకట్టుకు పోతుందని కొద్దిసేపు వేగంగా పరిగెత్తే వారు. అలా చేస్తే బాడీ స్ట్రాంగ్‌గా తయారవుతుందని వాళ్ల నమ్మకం. అలాంటి కొన్ని అంశాలకు ఒంగోలులో జరిగే మర్డర్స్‌కి లింక్ చేస్తూ థ్రిల్లింగ్‌గా కథ రాసుకున్నాం. ► 2021లో సంక్రాంతికి వస్తోన్న మొదటి చిత్రం మాదే కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని 2019 మే 8న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా ప్రభావం వల్ల వాయిదా వేశాం. అయితే ఒక మంచి సినిమా పండగకి రావాలని రాసిపెట్టిందేమో.. కాకపోతే ఈసారి సంక్రాంతిని కొంచెం ముందుగానే మీ ముందుకు తీసుకువస్తున్నాం. రవితేజగారి కెరీర్లో అత్యధికంగా 1000కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ► ఒక సీఐ పాత్రని స్ఫూర్తిగా తీసుకుని రవితేజగారి పాత్ర తీర్చిదిద్దాను. కర్నూల్ నేపథ్యం కూడా సినిమాలో ఉంటుంది. కామెడీ, యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. ‘బలుపు’ తర్వాత రవితేజగారు అంత అందంగా, ఎనర్జిటిక్‌గా కనిపించిన చిత్రమిదే. ‘మెర్సల్, బిగిల్’ ఫేమ్ జీకే విష్ణుగారు ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమవుతున్నారు. ► ఈ సినిమాలో హీరో కొడుకు పాత్రలో మా అబ్బాయి సాత్విక్ నటించాడు.. కావాలని తీసుకోలేదు.. ఆ పాత్రకు సరిపోతాడనే తీసుకున్నాం. సముద్రఖని, వరలక్ష్మి పాత్రలు బాగుంటాయి. నేను అసోసియేట్‌గా ఉన్నప్పుడు మణిశర్మగారి దగ్గర పని చేసేవాడు తమన్. అప్పటి నుండి మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. నా సినిమా అంటే తమన్ కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాడని నేను నమ్ముతాను. ► ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలై బాగా ఆడటం దేశమంతా హాట్ టాపిక్ అయింది. తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాని ఎంత ఇష్టపడతారనేది నిరూపితం అయింది. ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాను. నా తర్వాతి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌లో ఉంటుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. -
నా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి
సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు అప్పుడప్పుడు హ్యాక్‌కు గురవడం చూస్తుంటాం. వారి ఖాతాల్ని హ్యాక్ చేసి అభ్యంతరకరమైన సందేశాలు, ఫొటోల్ని పోస్ట్ చేస్తుంటారు హ్యాకర్లు. తాజాగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ‘‘బుధవారం రాత్రి నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేశారు. ఈ కారణంగా వాటిలో నేను పోస్టులు పెట్టలేకున్నాను. నా ఖాతాలను పునరుద్ధరించేందుకు సాంకేతిక బృందాలతో సంప్రదింపులు జరుపుతున్నాను. వీటి పునరుద్ధరణకు కొన్నిరోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు నా సోషల్ మీడియా ఖాతాలో ఏవైనా పోస్టులు వస్తే వాటి పట్ల ఫాలోయర్లు జాగ్రత్తగా ఉండాలి. నా అకౌంట్లు పునరుద్ధరణ అయిన తర్వాత నేనే అభిమాలకు తెలియజేస్తాను’’ అని వరలక్ష్మి తెలిపారు. -
ఒకరికొకరు నిలబడదాం
‘‘ఎవరు ఎలా ఉంటే వాళ్లను అలాగే అంగీకరిద్దాం. వేరే వారితో పోల్చి చూడటం మానేద్దాం’’ అంటున్నారు తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. సామాజిక అంశాల మీద తరచూ ఏదో ఓ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారామె. తాజాగా పాతకాలపు ఆలోచనా విధానాన్ని ఎలా బద్ధలుకొట్టాలి? స్త్రీలకు అండగా ఎలా నిలబడటం ఎంత ముఖ్యం? అనే విషయాలపై ఓ పోస్ట్ చేశారు వరలక్ష్మి. ‘‘ఒక స్త్రీ ఎలా ఉండాలనుకుంటుందో అది తన ఇష్టం. ఒక సమాజంగా తన ఇష్టాన్ని మనందరం గౌరవించాలి. నువ్వెందుకు ఇలా ఉన్నావు? మిగతావారిలా లేవు? అని పోల్చి చూడొద్దు. ప్రతీ ఒక్కరం ఏదో ఒక సమస్యతో నిరంతరం పోరాడుతూనే ఉంటాం. సమస్యను అనుభవించే వాళ్లకే ఆ నొప్పి తెలుస్తుంది. ఒకరికొకరం నిలబడదాం.. తోడుగా నిలబడదాం. మనలో ఎవ్వరూ సంపూర్ణంగా లేము. మనకి ఉన్నది ఒక్కటే జీవితం. నచ్చినట్టు బతుకుదాం.. నచ్చిన పనిని నచ్చినట్టు చేసుకుంటున్న ప్రతి స్త్రీకి నా అభినందనలు’’ అన్నారామె. కాగా వరలక్ష్మి సినిమాల విషయానికి వస్తే రవితేజ ‘క్రాక్’, అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాల్లో నటిస్తున్నారు. -
నా బెండ్ తీశాడు
‘‘చాలా రోజుల తర్వాత మరోసారి నన్ను ఆర్టిస్ట్‌గా గుర్తించే సినిమా ఇది. ‘గమ్యం’ తర్వాత నాకు మరో మొమరబుల్ మూవీ అవుతుంది. విజయ్ టాలెంట్ ఏంటో షూటింగ్ మొదలైన రెండు మూడు రోజుల్లోనే తెలిసిపోయింది. విజయ్ నా బెండు తీశాడు (నవ్వుతూ). ఆయన దర్శకత్వంలో ఇదే బ్యానర్లో మరో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నవమి ముఖ్య పాత్రల్లో సతీష్ వేగేశ్న నిర్మించిన చిత్రం ‘నాంది’. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయి తేజ్ ‘బ్రీత్ ఆఫ్ నాంది’ (టీజర్)ని విడుదల చేశారు. సాయి తేజ్ మాట్లాడుతూ – ‘‘నరేశ్ అన్న నటించిన ‘నేను’, ‘గమ్యం’, ‘మహర్షి’ సినిమాల్లో ఆయన నటన నాకు చాలా ఇష్టం. ‘నాంది’ టీజర్ చాలా బాగుంది. నా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాకి విజయ్ చాలా హెల్ప్ చేశారు. ఆయన దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కరోనా సమయంలో కూడా ఎంతో రిస్క్ చేసి షూటింగ్ కంప్లీట్ చేశాం’’ అన్నారు సతీష్ వేగేశ్న. విజయ్ కనకమేడల మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ రివీల్ ఇంప్యాక్ట్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘బ్రీత్ ఆఫ్ నాంది’కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిçస్తున్నాను’’ అన్నారు. -
వరలక్ష్మీ దాగుడుమూతలు
వరలక్ష్మీ శరత్‌కుమార్ దాగుడుమూతలు ఆడుతున్నారు. చిన్నప్పుడు ఆడుకునే దాగుడుమూతలు ఆటని ఇప్పుడు ఆడుతుందేంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. వరలక్ష్మీ ‘కన్నామూచ్చి’ అనే తమిళ సినిమాతో డైరెక్టర్‌గా మారబోతున్నారు. ‘కన్నామూచ్చి’ అంటే తెలుగులో దాగుడుమూతలు అని అర్థం. మహిళా ప్రధానంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తేనాండల్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించనుంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి, వరలక్ష్మీ మాట్లాడుతూ– ‘‘ఫైనల్‌గా దర్శకురాలిగా కొత్త అవతారంలోకి అడుగుపెడుతున్నాను. దర్శకురాలిగా కష్టపడి నేనేంటో నిరూపించుకుని, మీ (ప్రేక్షకులు) అందరి ముందు తలెత్తుకుని నిలబడతాను’’ అన్నారు. -
నో చెప్పడం నేర్చుకోండి
‘‘కెరీర్ తొలిరోజుల్లో క్యాస్టింగ్ కౌచ్‌కి నో చెప్పాను అని చాలా సందర్భాల్లో నన్ను సినిమాలనుంచి పలువురు దర్శక–నిర్మాతలు దూరం పెట్టారు. కానీ ఇవాళ 25 సినిమాలు పూర్తి చేసుకుని ఇండస్ట్రీలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగాను’’ అన్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారామె. ‘‘మహిళలు తమను లైంగికంగా వేధించేవాళ్లను, క్యాస్టింగ్ కౌచ్‌కి అంగీకరించమనే వాళ్ల పేర్లను ధైర్యంగా బయటపెట్టాలి. అవకాశాలు తగ్గిపోతాయనే భయంలో ఉండిపోకూడదు. ఒకవేళ ఆ దారిలో వెళ్లి హీరోయిన్ అవుదామనుకున్నా అది వ్యక్తిగత నిర్ణయం. ఎవరి ఇష్టం వాళ్లది. కానీ ముందు అంగీకరించి ఆ తర్వాత ఫలనా వాళ్లు ఇలా చేశారు అని ఫిర్యాదు చేయకూడదు. కష్టమైనా ‘నో’ చెప్పడం నేర్చుకోండి’’ అన్నారు వరలక్ష్మి. -
నేను పెళ్లే చేసుకోను!
సినిమా: తాను జీవితంలో పెళ్లే చేసుకోను అని సంచలన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయం గురించి ఈమె ఇంతకు ముందే చెప్పిన విషయం తెలిసిందే. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. వాటిలో ఒకటి నటుడు విమల్‌కు జంటగా నటించిన చిత్రం కన్నిరాశి. కింగ్ మూవీ మేకర్స్ పతాకంపై షమీమ్ ఇబ్రహీం నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ముత్తుకుమార్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం చెన్నైలోని ఒక నక్షత్రహోటల్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దర్శకుడు ముత్తుకుమార్ మాట్లాడుతూ ఇదే తన తొలి చిత్రం అని తెలిపారు. దర్శకుడిగా అవకాశం కల్సించిన నిర్మాతకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. సంగీతదర్శకుడు విశాల్ చంద్రశేఖర్ సూపర్ సంగీతాన్ని అందించారని తెలిపారు. తదుపరి చిత్రంలోనూ ఆయనతో కలిసి పనిచేస్తానని అన్నారు. పెద్ద పోరాటం తరువాతనే ఈ చిత్రం విడుదల వరకూ వచ్చిందని అన్నారు. యోగిబాబు, రోబోశంకర్ అద్భుతంగా నటించారని చెప్పారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ చిత్రానికి ఏం కావాలో అలా నటించారని చెప్పారు. మనం చెప్పింది చెప్పినట్టుగా నటించిన నటుడు విమల్ అని అన్నారు. ఆయన కారణంగానే తనకీ అవకాశం వచ్చిందని చెప్పారు. ఇది వినోదభరితంగా సాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుం దని, తాను ఇంత కు ముందు చా లా మంది హీరోయిన్లతో కలిసి నటించానని అన్నారు. అయితే తొలిసారిగా ఒక మగాడు లాంటి నటి(వరలక్ష్మీశరత్‌కుమార్)తో నటించానని నటుడు విమల్ పేర్కొన్నారు. నటి వరలక్ష్మీశరత్‌కుమార్ మాట్లాడుతూ సాధారణంగానే తనకు నూతన దర్శకులంటే ఇష్టం అని అన్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే కడుపుబ్బ నవ్వానని చెప్పారు. ఇది ప్రేమ వివాహం నేపథ్యంలో సాగే చిత్రంగా ఉంటుందని తెలిపింది. అయితే నిజ జీవితంతో తనకు వివాహంపై నమ్మకం లేదని, జీవితంలో తానెవరినీ పెళ్లే చేసుకోనని అన్నారు. పాండిరాజన్, యోగిబాబు, రోబోశంకర్తో కలిసి జాలీగా నటించినట్లు తెలిపారు. నటుడు విమల్ మంచి నటుడని, ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. కన్నిరాశి పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా ఉంటుందన్నారు. -
ఇండియా కోసం ఇంగ్లాండ్‌కు!
ఇండియా కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లారు మన ముద్దుగుమ్మలు. సినిమా రంగం, క్రీడారంగం ఈ రెండే ప్రేక్షకులకు ప్రత్యేకం. సినిమాలను ఎంతగా ఆదరిస్తారో, క్రికెట్ క్రీడను అంత ఆసక్తిగా తిలకిస్తారు. దీంతో ఈ రెండు రంగాల్లోని ప్రముఖులను ప్రజలు హీరోలుగానే చూస్తారు. సినిమాలు విజయవంతం అయితే అభిమానులు ఎంతగా పండగ చేసుకుంటారో, క్రికెట్ మ్యాచ్‌లో గెలిస్తే అంతకంటే ఎక్కువ సంబరాలు చేసుకుంటారు. అయితే క్రికెట్ క్రీడాకారులకు సినీ స్టార్స్‌పై ఎంత అభిమానం ఉంటుందో గానీ, సినీ తారలకు మాత్రం క్రికెట్ క్రీడాకారులంటే చాలా క్రేజ్. దీనికి ఉదాహరణే అందాలభామలు త్రిష, వరలక్ష్మీ శరత్‌కుమార్ లాంటివారు భారత క్రికెట్టు ఆటను చూడడానికి, వారిని ఉత్సాహపరచడానికి ఏకంగా ఇంగ్లాడ్ దేశానికి ఎగిరిపోయారు. ఇప్పుడు వరల్డ్ కప్ క్రికెట్ వార్ జరుగుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిందిన అవసరం లేదు. మధ్యాహ్నం అయితే జనాలు టీవీల ముందు వాలిపోతున్నారు. ఇక భాగ్యవంతులైతే ప్రత్యక్షంగా చూడడానికి క్రికెట్ జరుగుతున్న స్టేడియంకే వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఇండియా క్రికెట్ జట్టు ఇప్పుడు విజయవిహారం చేస్తోంది. ఆరు పోటీల్లో ఐదింటిలో విజయం సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ఇంకా మూడు పోటీలు ఉన్నాయి. కాగా మరో పోటీలో గెలిస్తే సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. కాగా ఆదివారం ఇండియా జట్టు ఇంగ్లాండ్ జట్టుతో ఢీకొనబోతోంది. అయితే ఈ పోటీ ఇరుజట్లకు ముఖ్యమే. ఇండియాను సెమీఫైనల్‌కు చేర్చే పోటీ అయితే, ఇంగ్లాండ్‌ను పోటీలో నిలిపేపోరు. అవును ఈ పోటీలో గెలవకపోతే ఇంగ్లాండ్ సెమీఫైనల్ అవకాశాలను కోల్పోతుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఆ జట్టుకు చాలా ముఖ్యం. దీంతో ఇరు జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ క్రీడను ప్రత్యక్షంగా తిలకించడానికి, ఇండియా జట్టును ఎంకరేజ్ చేయడానికి నటి త్రిష, వరలక్ష్మీశరత్‌కుమార్, బిందుమాదవి ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. దీని గురించి నటి వరలక్ష్మీశరత్‌కుమార్ ట్విట్టర్లో కామెంట్ చేశారు. -
విశాల్‌పై రాధిక ఫైర్
నడిగర్ ఎన్నికలు ఈ సారి మరింత రసవత్తరంగా మారుతున్నాయి. మరోసారి గెలిచి సత్తా చాటాలని విశాల్ సారధ్యంలోని పాండవర్ టీం ప్రయత్నిస్తుంది. అయితే ఈ సారి విశాల్ టీంకు వ్యతిరేకంగా భాగ్యరాజ్ బరిలో దిగటంతో పోటి ఆసక్తికరంగా మారంది. ప్రచారంలో భాగంగా విశాల్ ఇటీవల విడుదల చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. గత కమిటీలపై దుమ్మెత్తిపోస్తూ గత ఎన్నికలలో కొందరు శరత్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యల వీడియోలను ట్వీట్లుగా యూట్యూబ్ ద్వారా మళ్లీ తెరపైకి తెచ్చాడు విశాల్. అయితే ఈ వీడియోలపై శరత్ కుమార్ భార్య సీనియర్ నటి రాధిక, కుమార్తె వరలక్ష్మిలు తీవ్రస్థాయిలో చిరుచుకు పడుచున్నారు. ఇప్పటికే విశాల్‌కు ట్విటర్ ద్వారా బహిరంగ లేఖ రాసిన వరలక్ష్మీ శరత్‌కుమార్ నా ఓటును కోల్పోయావ్ అంటూ ట్వీట్ చేశారు. గతంలో ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ బయటపెట్టడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై సీనియర్ నటి, శరత్‌కుమార్ సతీమణి రాధిక స్పందించారు. నిజంగా శరత్ కుమార్ తప్పు చేసుంటే న్యాయస్థానం తేల్చుతుందని, న్యాయస్థానంలో ఉన్న కేసుపై విశాల్ వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం అని ఆమె మండిపడ్డారు. అంతేకాదు.. నిజంగానే విశాల్ టీమ్ ఈ రెండేళ్ళలో అభివృద్ది చేసుంటే వాటిని చూపించి ఓట్లు అడగాలి, కాని పాత విషయాలు, న్యాయస్థానంలో ఉన్న విషయాలను విశాల్ మాట్లాడుతున్నారంటే ఆయనకు నడిగర్ సంఘానికి చేసింది ఏమిలేదని అర్థం అవుతుందన్నారు. ఇదే ఇప్పుడు విశాల్ కు ఇబ్బందులు తెచ్చిపడుతుంది. 23న నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్న వేళ రాధిక, వరలక్ష్మిలతోపాటు మరికొందరు సీనియర్ల విమర్శలు దక్షిణాది సినిమా నటీనటుల సంఘంలో చర్చనీయాంశంగా మారింది. -
ప్రభాస్‌కైతేనే ఐ లవ్యూ చెప్తా : హీరోయిన్
నేను ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే ఎవరికి చెబుతానో తెలుసా అంటోంది నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఈ అమ్మడిని డేరింగ్ అండ్ డైనమిక్ నటి అని పేర్కొనవచ్చు. నటిగానే కాకుండా నిజ జీవితంలోనూ చాలా బోల్డ్ వరలక్ష్మీ శరత్‌కుమార్. ఏ విషయానైన్నా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం వరలక్ష్మీ నైజం. హీరోయిన్గా రంగ ప్రవేశం చేసి, గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూస్తూ కూర్చుంటే ఈ భామ ఇంత పేరు తెచ్చుకునేది కాదేమో. నాయకి, ప్రతినాయకి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ అవకాశం వస్తే దాన్ని అందిపుచ్చుకుని నటించేయడంతో ఇప్పుడు కోలీవుడ్‌లోనే బిజీయస్ట్ నటిగా మారింది. సండైకోళీ–2, సర్కార్ వంటి చిత్రాల్లో విలనిజంలో దుమ్మురేపిన వరలక్ష్మీశరత్‌కుమార్‌పై వదంతులు చాలానే ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ అమ్మడు నటుడు విశాల్‌తో చెట్టాపట్టాల్ అంటూ ఈ మధ్య వరకూ జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇటీవల విశాల్‌కు హైదరాబాద్‌కు చెందిన అనీషా అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ కావడంతో ఆ వార్తలకు పుల్‌స్టాప్ పడింది. కాగా నటి వరలక్ష్మీ తాజాగా మరో సంచలనానికి తెర లేపింది. ఈ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో తెలుగు నటుడు ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం అని, నేను ఎవరికైనా ఐలవ్యూ చెప్పాలనుకుంటే అది బాహుబలి ప్రభాస్‌కే చెబుతానని అని మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో హెడ్లైన్లో ఉండడం వరలక్ష్మీకి అలవాటే. -
ఇప్పుడు నా టైమ్ మొదలైంది
‘‘ఇన్ని రోజులు తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం తమిళం, కన్నడం, మలయాళ సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడమే. ప్రతిదానికి ఓ టైమ్ రావాలంటాం కదా. ఇప్పుడిలా డబ్బింగ్ సినిమాల ద్వారా ఆ టైమ్ వచ్చింది. రేపు స్ట్రయిట్ సినిమాలకూ వస్తుందేమో’’ అన్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. విజయ్, కీర్తీ సురేశ్ జంటగా మురుగదాస్ తెరకెక్కించిన ‘సర్కార్’ లో వరలక్ష్మీ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రం నవంబర్ 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తొలిసారి తెలుగు మీడియాతో ముచ్చటించారు వరలక్ష్మీ. ∙ఆర్టిస్ట్ అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి. అందుకే హీరోయిన్, సెకండ్ హీరోయిన్, విలన్, గెస్ట్ రోల్స్ అనే తేడా చూడను. బహుశా అందుకేనేమో ఈ ఏడాది ఆల్రెడీ 4 సినిమాలు రిలీజయ్యాయి. మరో మూడు రిలీజ్ కాబోతున్నాయి. ∙విజయ్, మురుగదాస్ కాంబినేషన్ అంటే ఎవరైనా ఎగై్జట్ అవుతారు. నేనూ అంతే. సినిమాలో మంచి పాత్ర చేశాను. పాజిటీవా? నెగటీవా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ∙పందెం కోడి 2, సర్కార్ సినిమాలకు తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను. పాత్ర తాలూకు ఎమోషన్స్ నటీనటులకే ఎక్కువ తెలుస్తాయి కాబట్టి మనది మనమే చెప్పుకుంటే ఇంకా పాత్రకు డెప్త్ వస్తుందని నమ్మకం. అందుకే కొంచెం కష్టమైనా డబ్బింగ్ చెప్పుకున్నాను. ∙నా ఫస్ట్ సినిమా ‘పోడా పోడి’ (2012) తర్వాత ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలు తక్కువ. ఆ మాటకొస్తే గతేడాది నుంచే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు నా టైమ్ మొదలైంది. ∙మా నాన్నగారి (శరత్ కుమార్) పేరు వాడటం ఇష్టం ఉండదు. సొంతంగా ఎదగాలనే ఫిలాసఫీ నాది. ఇప్పుడందరూ వరలక్ష్మీ వాళ్ల నాన్నగారు శరత్ కుమార్ అంటుంటే కూతురిగా నాకు గర్వంగా ఉంది. ప్రస్తుతం నాన్నతో కలసి ‘పాంబన్’ అనే సినిమా చేస్తున్నా. ∙లైంగికంగా వేధిస్తే బయటకు చెప్పాలి. సెలబ్రిటీలుగా మేం చెబితే బయట వాళ్లకు ఓ ధైర్యం వస్తుందని దాదాపు ఏడాదిన్నర క్రితమే నాకు జరిగిన ఓ చేదు అనుభవం గురించి బయటకు చెప్పాను. ‘మీటూ’ ఉద్యమం స్టార్ట్ అవ్వకముందే క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాను. ‘మీటూ’ ఉద్యమం ముఖ్య ఉద్దేశం ‘నేమ్ అండ్ షేమ్’. అంటే.. స్త్రీల పట్ల తప్పుగా ప్రవర్తించిన వారి పేరు బయటపెట్టి, పరువు తీయడం. అలా చేస్తే భవిష్యత్తులో మరొకరు ఆ తప్పు చేయడానికి భయపడతారు. పాత తరం హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో కామన్ అని పాపం తలవొంచి ఉండొచ్చు. అందర్నీ అనడంలేదు. కానీ ఇప్పుడు మేం మార్పు తీసుకొస్తే, భవిష్యత్తు తరం వాళ్లు హాయిగా పని చేసుకునే వాతావరణం ఉంటుంది. బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లు.. లేనివాళ్లు అని ఉండదు. పవర్‌ని తప్పుగా వాడుకోవాలనుకున్నవాళ్లు ఎవర్నీ వదలరు. ప్రశ్నించే అలవాటు, అనిపించింది బయటకు చెప్పే స్వభావం నాకు చిన్నప్పటి నుంచే అలవడింది. తప్పు ఎవరిదైతే వాళ్ల వైపు వేలు ఎత్తి చూపించడానికి భయపడను. అది మా నాన్నగారు అయినా సరే. ∙మరో ఐదేళ్లలో మిమ్మల్ని ఎక్కడ ఊహించుకుంటున్నారు అని అడగ్గా – ‘‘రాజకీయాల్లో. తప్పకుండా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఉంది. జయలలితగారి వారసురాలు అనిపించుకోవాలనుంది. జయలలితగారు రాష్ట్రాన్ని పాలించిన తీరు, విధానం, ఆమె జర్నీ కచ్చితంగా స్ఫూర్తినిస్తుంది. ఆవిడ మనల్ని వదిలి వెళ్లాక తమిళనాడు రాజకీయాల్లో ఒక శూన్యం ఏర్పడింది. దాన్ని నింపేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. చూద్దాం ఏమౌతుందో. కమల్ హాసన్‌గారు, రజనీకాంత్గారిలో ఎవరు గెలుస్తారు? అని ప్రశ్నించగా నవ్వి ఊరుకున్నారు. ∙విశాల్‌తో నేను డేటింగ్ చేయడం లేదు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. ఒకవేళ విశాల్‌కి పెళ్లి అయినా కూడా మేం ఇప్పటిలానే బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటాం. తను నన్ను సోల్‌మేట్ అనడానికి కారణం మేం అంత మంచి ఫ్రెండ్స్ కావ డమే. -
మా మధ్య ఏం లేదు : విశాల్
కోలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విశాల్. ఇటీవల అభిమన్యుడు సినిమాతో మరో ఘనవిజయాన్ని నమోదు చేసిన విశాల్ ప్రమోషన్ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కోలీవుడ్ హీరోయిన్, శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మీతో విశాల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టుగా కోలీవుడ్ మీడియాలో చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై విశాల్ స్పందించాడు. ‘మా ఇద్దరి మధ్య ఏదో సంబంధమున్నట్టుగా షికారు చేస్తోన్న వార్తలు నా వరకూ వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు నేను వరలక్ష్మీ మంచి స్నేహితులం, ఒకరి కష్టా సుఖాలు ఒకరం పంచుకుంటాం.. అంతే’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. రజనీకాంత్, కమల్ హాసన్‌ల రాజకీయ అరగేంట్ర శుభపరిణామం అన్న విశాల్, తాను ఎవరికి మద్దతు తెలిపేది ఇప్పుడే చెప్పలేనన్నారు. -
ఏప్రిల్ 25న రీస్టార్ట్
తమిళ సినిమా: ఎన్నడూ లేనట్లుగా చిత్రపరిశ్రమ 48 రోజుల పాటు నిరవధిక సమ్మె. తమిళ సినీ పరిశ్రమ స్తంభించిందనే చెప్పాలి. ఎక్కడ షూటింగ్‌లు అక్కడ ఆగిపోయాయి. నటీనటుల నుంచి ఇతర సాంకేతిక వర్గం ఇళ్లకే పరిమితమైపోయారు. ముఖ్యంగా సినీ కార్మికులు చాలా ఆర్థికసమస్యలను ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితికి పుల్‌స్టాప్ పడడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న సినీ వర్గాలు శుక్రవారం నుంచి అందరూ తమ తమ విధులకు రెడీ అవుతున్నారు. అలా నటుడు విజయ్ చిత్ర బృందం ఏకంగా విదేశాలకే పయనం అవ్వడానికి సన్నద్ధం అవుతోంది. విజయ్ నటిస్తున్న తాజా చిత్రానికి ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. నటి కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ రాజకీయనాయకురాలిగా ప్రతినాయకి ఛాయలున్న పాత్రను పోషిస్తున్నారు. ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్న ఈ భారీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. ఈ నెల 25వ తేదీన విజయ్ చిత్రం యూనిట్ విదేశాలకు పయనం కానుందని సమాచారం. అక్కడ విజయ్, కీర్తీసురేశ్‌ల యువళ గీతాలను, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేసుకున్నారట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది సమాజానికి సంబంధించిన ఒక ముఖ్య అంశాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. -
నేను రాజకీయాల్లోకి రావడం పక్కా : నటి
తమిళసినిమా: నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావడం అన్నది పక్కా అంటున్నారు. కల్సా డాన్స్ కళాకారిణి అయిన ఈమె నటిగా రంగప్రవేశం చేసినప్పుడు క్లిక్ అవుతారో? లేదో అన్న సందేహం చాలామందికి కలిగింది. ఎందుకుంటే తొలి చిత్రం నిరాశపరచింది. మలి చిత్ర విడుదల నిలిచిపోయింది. ఆ తరువాత కూడా అవకాశాలు రాని పరిస్థితి. అలాంటి నటి ఇప్పుడు 9 చిత్రాలతో తీరిక లేనంత బిజీగా ఉన్నారు. లక్ అంటే ఈమెదే అనాలి. నటుడు విశాల్‌తో ప్రేమ, ఆ తరువాత మనస్పర్థలు లాంటి వదంతులు కూడా వరలక్ష్మిని పాపులర్ చేశాయని చెప్పొచ్చు. ఒక పక్క నటిగా బిజీగా ఉన్నా మరో పక్క మహిళల కోసం ‘సేవ్‌శక్తి’ అనే సంస్థను నెలకొల్సి దాని ద్వారా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా ఉత్తర చెన్నై ప్రాంతంలో సేవ్‌శక్తి తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ ఇచ్చిన భేటీ.. ప్ర: అనూహ్యంగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజకీయ రంగప్రవేశం చేసే ఆలోచన ఏమైనా ఉందా? జ: రాజకీయం అనేది కాని పదమా? ఎవరినో ఓడించాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి రాకూడదు గానీ, నటీనటులే కాదు, సమాజానికి మంచి చేయాలనుకునే వారెవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. సినిమా ద్వారా పేరు, ప్రఖ్యాతులనే బలాన్ని మంచి విషయాలకు ఉపయోగించడంలో తప్పులేదు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో నేను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను. అన్నింటినీ ఒకే సారి మార్చలేం. ప్ర: రాజకీయాల్లో మీ లక్ష్యం? జ: మహిళలకు అన్ని విధాలుగా మంచి చేయాలన్నదే నా లక్ష్యం ప్ర: రజనీకాంత్, కమలహాసన్‌ల రాజకీయరంగ ప్రవేశం గురించి? జ: నేను ముందే చెప్పాను. ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. ఇంకా చెప్పాలంటే ఊరులోని వారందరు రావాలంటాను. ప్ర: నటుడు విశాల్ రాజకీయరంగ ప్రవేశం గురించి? జ: ఆయన రాజకీయరంగం గురించి చెప్పడానికేమీలేదు. ప్ర: మీరు ఉత్తర చెన్నైలో సేవా కార్యక్రమాలను ప్రారంభించడానికి కారణం? జ: కారణం ఇతర ప్రాంతాల కంటే అక్కడ సమస్యలు అధికం కావడమే. ఆ ప్రాంతంలో నాకు చేతనైనంత సాయం చేయాలనే అక్కడ సేవా కార్యక్రమాలు ప్రారంభించాను. ప్ర: పాఠశాల విద్య విధానంలో ఎలాంటి మార్చులు రావాలంటారు? జ: పాఠశాల విద్యతో పాటు ఆత్మరక్షణ విద్య, సెక్స్ గురించి అవగాహన పాఠాలు అవసరం. -
ఆమె రూటే సెపరేటు..
సాక్షి, చెన్నై: నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ రూటే సెపరేటు. ఆటైనా, పాటైనా, హీరోయిన్‌గానైనా, ఆ మాటకొస్తే అతిథి పాత్రలో మెరవడానికైనా, ప్రతినాయకిగా మారడానికి రెడీ అంటారీ భామ. హీరో శింబుతో కలిసి రొమాన్స్ చేసిన తొలి చిత్రం పోడాపోడీ పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు. అందుకే రాశి లేని నటి అనే ముద్ర పడింది. అయినా డోంట్‌కేర్ అంటూ నటిగా ముందుకు సాగిన ఆమెకు బాలా చిత్రం తారైతప్పట్టేలో తన సత్తా చాటుకునే అవకాశాన్ని కల్పించింది. ఆ చిత్రం ప్రేక్షకాదరణను అంతగా పొందకపోయినా వరలక్ష్మీ నటనకు మాత్రం కోలీవుడ్ ఫిద్యా అయ్యిపోయింది. ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఒక్క తమిళంలోనే మూడు చిత్రాలు చేతిలో ఉన్నాయి. అందులో ఒకటి ధనుష్‌తో కలిసి నటిస్తున్న మారి-2 చిత్రం. ఈ సినిమాలో సాయిపల్లవి, టోవినో థామస్, వరలక్ష్మీ శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరిగింది. వీరిలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రతినాయకిగా కనిపించనున్నారట. ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఒకవైపు నచ్చిన పాత్రల్లో నటిస్తూ, మరోవైపు మహిళా హక్కుల కోసం, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పోరుడుతున్నారు. అందుకు సేవ్ శక్తి పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి మహిళలకు నేనున్నానంటూ భరోసానిస్తున్నారు. ఇలా తన రూటే వేరు అంటూ సహ హీరోయిన్లలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. -
ధనుష్‌తో వరూ సై
సాక్షి, సినిమా: నటుడు ధనుష్‌తో నటించడానికి నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ సై అన్నారు. వరలక్ష్మీ ఒక పక్క కథానాయకిగా నటిస్తూనే మరో పక్క చాలెంజింగ్ పాత్రల్లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. అలా ధనుష్ కథానాయకుడిగా నటించినున్న తాజా చిత్రం మారి-2లో కీ రోల్‌ను పోషించడానికి ఓకే చెప్పేశారు. ఇంతకు ముందు ధనుష్ హీరో బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరపైకొచ్చిన మారి చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. నటి కాజల్ అగర్వాల్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చిత్ర వర్గాలు అప్పుడే ప్రకటించారు. దానికి ఇప్పుడు ముహూర్తం కుదిరింది. ధనుష్ హీరోగా నటించి తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్న మారి-2లో సాయిపల్లవి కథానాయకిగా ఎంపికైంది. ఇందులో ముఖ్య పాత్రకు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నటుడు, నిర్మాత ధనుష్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అందుకు ప్రతిగా ట్విట్ చేసిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మారి-2లో తనను ఒక భాగం చేసినందుకు ధనుష్, దర్శకుడు బాలాజీ మోహన్‌కు కృతజ్ఞతలు చెప్పింది. ఈ చిత్రంలో నటించడానికి ఆలస్యం చేయదలచుకోలేదు. ఎప్పుడెప్పుడు నటిస్తానా అని చాలా ఎగ్జైట్‌గా ఫీలౌతున్నాను అని పేర్కొన్నారు. ఇందులో మలయాళ నటుడు టోవినో థామస్ ప్రతినాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నారు. సుమారు 10 ఏళ్ల తరువాత ధనుష్, యువన్‌శంకర్‌రాజా కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం మారి-2 అన్నది గమనార్హం. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను కొత్త సంవత్సరం వెల్లడించే అవకాశం ఉంది. -
అలాంటి వ్యక్తితో నేను చేయలేను!
పురుషాధిక్యం గల నిర్మాతతో కలిసి పని చేయలేనని నటి వరలక్ష్మీశరత్‌కుమార్ అన్నారు.ఈ సంచలన నటి ఎవరి గురించి మాట్లాడుతున్నారన్నదేగా మీ ఆసక్తి. ఆ మధ్య నటుడు విశాల్‌తో ప్రేమాయణం, ఆ తరువాత అది మనస్పర్థల కారణంగా ముగిసిందనే ప్రచారం మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక నటిగా తారాతప్పట్టై చిత్రంలో గరగాట కళాకారిణిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్న వరలక్ష్మీశరత్‌కుమార్‌కు ఈ తరువాత వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. ప్రస్తుతం అమ్మాయి వంటి హారర్ కథా చిత్రంతో పాటు కొన్ని చిత్రాల్లో నటిస్తున్న వరలక్ష్మీశరత్‌కుమార్‌కు మాలీవుడ్‌లో రంగప్రవేశం చేసే అవకాశం వచ్చింది. తమిళంలో సముద్రకని స్వీయదర్శకత్వంలో నిర్మించి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అప్పా. ఈ చిత్రం మలయాళంలో రీమేక్ అవుతోంది. సముద్రకనినే దర్శకత్వం వహిస్తున్న ఇందులో జయరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జంటగా ఇద్దరు పిల్లల తల్లిగా నటి వరలక్ష్మీశరత్‌కుమార్ నటించడానికి అంగీకరించారు.ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కొన్ని సన్నివేశాల్లో నటించిన వరలక్ష్మీశరత్‌కుమార్ సముద్రకని దర్శకత్వంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అలాంటిది అనూహ్యంగా ఆ చిత్రం నుంచి వైదొలిగారు. కారణం ఏమిటన్న ప్రశ్నకు పురుషాధిక్యం, మానవ విలువలు లేని నిర్మాత చిత్రం లో నటించడం తన వల్ల కాదని పేర్కొన్నారు. తన నిర్ణయాన్ని సమర్థించిన దర్శకుడు సముద్రకని, నటుడు జయరామ్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు. ఇంతకీ ఆ చిత్ర నిర్మాతకు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌కు మధ్య ఏంజరిగిందన్నది మాత్రం చిత్ర వర్గాల్లో ఆసక్తిగా మారింది. -
అది క్షమించరాని నేరం!
భారత దేశంలో స్త్రీలకు రక్షణ కరువైందా? ఇందుకు అవుననే సమాధానమే వస్తోంది మహిళా లోకం నుంచి. ఈ ఆధునిక యుగంలో స్త్రీలు మగవారికి ఎందులోనూ తీసిపోనంతగా రాణిస్తున్నారు. అయినా కొందరు మానవ మృగాలు స్త్రీని ఒక ఆట వస్తువుగానే చూస్తున్నారు. వారి అఘాయిత్యాలకు మహిళలు బలైపోతూనే ఉన్నారు. అన్ని రకాలుగా బలపడిన స్త్రీలు కూడా ఒక్కోసారి మగవాడి పైశాచికత్వం నుంచి బయట పడలేకపోతున్నారు. ఇందుకు నటి భావన ఉదంతమే ఒక నిదర్శనం. ఆమెకు జరిగిన అఘాయిత్యాన్ని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఖండిస్తున్నారు.అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని గళమెత్తున్నారు.చాలా మంది నటీమణులు భావనకు అండగా నిలుస్తున్నారు.నటి వరలక్ష్మీశరత్‌కుమార్, స్నేహ, సంధ్య ఇలా పలువురు భావనపై అత్యాచారయత్నాన్ని తీవ్రంగా ఖండించారు.తాజాగా నటి శ్రుతీహాసన్ స్పందిస్తూ విదేశాల్లో మహిళలకు రక్షణ ఉంటుందన్నారు. భారతదేశంలో మాత్రం ఇంకా అభద్రతాభావంతో గడుపుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు మానవ రక్షణ కరవైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.నటి భావనపై లైంగికయత్నం క్షమించరాని నేరంగా పేర్కొన్నారు.అలాంటి అఘాయిత్యాయలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.అప్పుడు ఇలాంటి ఘటనలకు అడ్డుకట్టపడుతుందని మంగళవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటి శ్రుతీహాసన్ అన్నారు. -
నా మద్దతు నాన్నకే
చెన్నై : ప్రస్తుతం కోలీవుడ్‌లో ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు.కారణం అందరికీ తెలిసిందే. త్వరలో జరగనున్న దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలకు ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.అందులో ప్రస్తుత సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ ఒక వర్గంగానూ నటుడు విశాల్ బృందం వర్గంగానూ పోటీకి సిద్ధం అవుతున్నాయి. శరత్‌కమార్ వర్గం విజయం తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తుంటే, ఓడిపోయినా పర్వాలేదు పోటీ చేసే తీరుతాం అంటున్నారు విశాల్ వర్గం.అంతేకాదు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.అదే సమయంలో ఊరూరా తిరిగి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే శరత్‌కుమార్‌కు విశాల్‌కు మధ్య వైరానికి కారణం నటి వరలక్ష్మినేనని,ఆమే శరత్‌కుమార్ పైకి విశాల్‌ను ఉసిగొల్పుతున్నారని సోషల్ నెట్‌వర్క్స్‌లో ప్రచారం హల్చల్ చేస్తోంది. నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కూతురన్న విషయం గమనార్హం. అలాగే విశాల్‌కు వరలక్ష్మి శరత్‌కుమార్ కి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయనే వదంతులు చాలా కాలంగా హోరెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నడిగర్ సంఘం ఎన్నికల్లో నటి వరలక్ష్మి మద్దతు విశాల్‌కే ఉంటుందనే ఊహాగానాలు ఇంటర్నెట్లలో దుమారం రేపుతున్నాయి. ఇలాంటి ప్రచారంపై ఇప్పటివరకు పట్టించుకోని నటి వరలక్ష్మి తాజాగా ఘాటుగా స్పందించారు.సోషల్నెట్వర్క్స్లో అసత్యాల్ని ప్రచారం చేసేవారంతా కళ్లులేని కబోదులని తన ట్విట్టర్లో విమర్శించారు. తన మద్దతు ఎప్పుడూ తన తండ్రికే ఉంటుందని వరలక్ష్మి కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడించారు. -
శ్రీయ అవుట్ వరలక్ష్మి ఇన్
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ అన్న మహాకవి రాసిన పాటలోని పల్లవిని గుర్తు చేసుకునేలా చేస్తున్నారు దర్శకుడు బాల. ఈ జాతీయ ఉత్తమ నటుడు పరదేశి చిత్రం తరువాత తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో శశికుమార్‌ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్ పాత్రకే నటీమణుల్లో ఆశలు రేకెత్తించి నిరాశ పరుస్తున్నారు. వైవిధ్యంతో కూడిన కథలను తెరకెక్కించే బాలా ఈసారి గరగాట్టాన్ని నేపథ్యంగా ఎంచుకుని చిత్రాన్ని రూపొందించనున్నారు. దీంతో గరగాట్ట నృత్యం బాగా ఆడే హీరోయిన్ బాలాకు అవసరం అయ్యారు. దీంతో నృత్యంలో ప్రావీణ్యం ఉన్న నటి శ్రీయను హీరోయిన్ పాత్రకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా శ్రీయను కాదని ఆ పాత్రలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ఎంపిక చేశారని తెలిసింది. వరలక్ష్మి శరత్‌కుమార్ కల్సా నృత్యంలో శిక్షణ పొంది పలు నృత్య రూపకాలను ఆడారన్నది గమనార్హం. పోడాపొడి చిత్రం నిరాశ పరచడం, రెండవ చిత్రం మదగజరాజా చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదల కాకపోవడంతో అలిగి కన్నడ చిత్ర పరిశ్రమ వైపు పరిగెత్తిన వరలక్ష్మి శరత్‌కుమార్‌కు బాలా అవకాశం ఇవ్వడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందట. ఈ చిత్రం కోసం ఇళయరాజా ఆరు రోజుల్లో 12 పాటలను సిద్ధం చేశారు. ఈ చిత్రం మార్చిలో ప్రారంభం కానుందని సమాచారం.