![Vishal Reacts on Varalakshmi Sarathkumar Engagement - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/04/15/Varalakshmi-Vishal-01.jpg.webp?itok=ISAl0NkI)
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లికూతురిగా ముస్తాబు కానుంది. ప్రియుడు నికోలయ్ సచ్‌దేవ్‌తో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. తన పెళ్లి తనకే సర్‌ప్రైజింగ్‌గా ఉందని.. ఏదేమైనా ఈ ఏడాదిలోనే మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పింది. తాజాగా దీనిపై హీరో విశాల్ స్పందించాడు. వరలక్ష్మి పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. సినిమాల్లో తనను తాను నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడింది.
సంతోషంగా ఉంది
అలాంటిది తను అనుకున్నది సాధించి తెలుగు చిత్రపరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. తను ఎంతో మంచి వ్యక్తి.. ఆమె తల్లిని నేను కూడా అమ్మ అనే పిలుస్తాను. పర్సనల్ లైఫ్‌లో సెటిలవుతున్న వరలక్ష్మికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నాడు. కాగా గతంలో వరలక్ష్మి, విశాల్ ప్రేమించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఓ కార్యక్రమంలో లక్ష్మీకరమైన అమ్మాయితో ఏడడుగులు వేస్తానన్నారు.
స్నేహితులమే..
దీంతో అతడు వరలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం ఊపందుకుంది. కానీ తమ మధ్య స్నేహం తప్ప ప్రేమకు చోటు లేదని విశాల్ క్లారిటీ ఇచ్చాడు. ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉండే విశాల్ - వరలక్ష్మి 2019లో నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శత్రువులుగా మారిపోయారు. తన తండ్రి శరత్ కుమార్ గురించి విశాల్ అడ్డగోలుగా మాట్లాడాడని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది. ఆ సమయంలో విడిపోయిన వీరిద్దరూ ఇప్పుడు మళ్లీ ఫ్రెండ్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది.
చదవండి: హీరోయిన్ చెల్లితో భర్త ఎఫైర్.. ఒక్క దెబ్బతో పక్షవాతం.. చివరికి..!
Comments
Please login to add a commentAdd a comment