
హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా.. ఎలాంటి పాత్రలనైనా ఇట్టే చేయగలదు నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). సీనియర్ నటుడు శరత్‌కుమార్ కూతురైన వరలక్ష్మి.. పోడాపొడి (2012) సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. నిజానికి ఈ సినిమాకంటే ముందే ఆమెకు శంకర్ 'బాయ్స్' మూవీలో ఆఫర్ వచ్చింది. కానీ తండ్రి వద్దనడంతో మంచి అవకాశాన్ని వదులుకుంది.
సౌత్‌లో విలక్షణ నటిగా గుర్తింపు
అయినప్పటికీ వరుస ఆఫర్లు వస్తూనే ఉండటంతో కాదనలేకపోయింది. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. తెలుగులో తెనాలి రామకృష్ణ బిఎ. బిఎల్. నాంది, క్రాక్, యశోద, వీర సింహా రెడ్డి, ఏజెంట్, హను-మాన్, కోట బొమ్మాళి ఐపీఎస్, శబరి వంటి పలు చిత్రాల్లో నటించింది.

వెండితెర.. బుల్లితెర
ఓపక్క వెండితెరపై బిజీగా ఉంటూనే మరోపక్క బుల్లితెరపైనా సందడి చేస్తోంది. డ్యాన్స్ జోడీ డ్యాన్స్ రీలోడెడ్ 3 (తమిళ) షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షో నుంచి ఓ ప్రోమో రిలీజైంది. అందులో ఓ కంటెస్టెంట్ అద్దం ముందు నిలబడి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. మన జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు కుటుంబమే మద్దతుగా నిలబడుతుందంటారు. కానీ నా జీవితంలో మాత్రం కుటుంబం, బంధువులెవరూ నాకు సాయంగా నిలబడలేదు. పైగా నన్ను తిడుతూ వేధించారు, టార్చర్ పెట్టారు అంటూ ఏడ్చేసింది.
నీది నాదీ ఒకే కథ
అది విన్న వరలక్ష్మి.. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మా అమ్మానాన్న పనిలో బిజీగా ఉండటం వల్ల చిన్నప్పుడు నన్ను ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లిపోయేవారు. నన్ను చూసుకోమని బంధువులకు అప్పజెప్పేవారు. అలా ఓసారి నా ఇంట్లోనే ఐదారుగురు మంది నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అసభ్యంగా తాకారు. నీదీ నాదీ ఒకే కథ.. అంటూ కంటెస్టెంట్‌ను పట్టుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. దయచేసి తల్లిదండ్రులు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలని వరలక్ష్మి కోరింది.
చదవండి: లూసిఫర్2: 'మోహన్‌లాల్' రెమ్యునరేషన్‌పై పృథ్వీరాజ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment