జైలుకు వెళ్లనున్న హనుమాన్‌ నటి? స్పందించిన వరలక్ష్మి | Varalakshmi Sarathkumar Fires On Fake News About Drugs Case | Sakshi
Sakshi News home page

Varalakshmi Sarathkumar: టాలీవుడ్‌ లేడీ విలన్‌ అరెస్ట్‌? నటి ఏమందంటే?

Mar 14 2024 2:16 PM | Updated on Mar 14 2024 2:49 PM

Varalakshmi Sarathkumar Fires On Fake News About Drugs Case - Sakshi

గతేడాది డ్రగ్స్‌ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్‌ పేరు మార్మోగిపోయింది. ఆమె దగ్గర ఫ్రీలాన్స్‌ మేనేజర్‌గా పని చేసిన ఆదిలింగం డ్రగ్స్‌ కేసులో అరెస్టయ్యాడు. దీంతో ఆమెకు కూడా ఏమైనా సంబంధాలున్నాయేమోనని ఎవరికి వారు అనుమానించారు.

టాలీవుడ్‌లో లేడీ విలన్‌గా పేరు తెచ్చుకుంది నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌. ఇటీవలే ఆమె పెళ్లికి సిద్ధమైంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్‌ గ్యాలరీల నిర్వాహకుడు నికోలై సచ్‌దేవ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. త్వరలోనే అతడితో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇకపోతే గతేడాది డ్రగ్స్‌ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్‌ పేరు మార్మోగిపోయింది. ఆమె దగ్గర ఫ్రీలాన్స్‌ మేనేజర్‌గా పని చేసిన ఆదిలింగం డ్రగ్స్‌ కేసులో అరెస్టయ్యాడు. దీంతో ఆమెకు కూడా ఏమైనా సంబంధాలున్నాయేమోనని ఎవరికి వారు అనుమానించారు.

ఇష్టారీతిన తప్పుడు ప్రచారం
తాజాగా ఈ డ్రగ్స్‌ కేసులో వరలక్ష్మికి సమన్లు అందాయని, ఆమెను విచారణకు హాజరవాలని అధికారులు ఆదేశించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. కొందరైతే ఏకంగా ఆమెను అరెస్ట్‌ చేసి జైలుకు తీసుకెళ్లారంటూ ఇష్టారీతిన ప్రచారం చేస్తున్నారు. దీంతో సదరు వార్తలపై ఘాటుగా స్పందించింది నటి. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తప్పుడు ప్రచారంపై మండిపడింది. 'ఈ మీడియాకు నేను తప్ప ఎవరూ దొరకడం లేదేమో.. మళ్లీ పాత ఫేక్‌ న్యూస్‌నే ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా అసలైన జరల్నిజం అంటే ఏంటో తెలుసుకోండి.

బయట ఇంకా చాలా సమస్యలున్నాయ్‌
సెలబ్రిటీలుగా మేము నటిస్తాం, నవ్విస్తాం.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తాం.. మాలో లొసుగులు వెతకడం మానేసి మీ పని మీరు సరిగా చేయండి.. లోకంలో ఇంకా చాలా పెద్ద సమస్యలున్నాయి. వాటిపైన ఫోకస్‌ చేయండి. మా నిశ్శబ్ధాన్ని వీక్‌నెస్‌గా చూడకండి. మీకు తెలీదేమో.. పరువునష్టం దావా అనేది కూడా ఈ మధ్య ట్రెండ్‌ అవుతోంది. కాబట్టి అసత్య ప్రచారాలు, అబద్ధపు రాతలు మానేసి నిజమైన జర్నలిజాన్ని బయటకు తీయండి' అని చురకలంటించింది.

చదవండి: శ్రీకాంత్‌ మేనకోడలితో లవ్‌.. డైరెక్ట్‌గా అడగలేక ఆ నటుడితో రాయబారం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement