'ఆహా' కోసం పోలీస్‌ అవతారం ఎత్తిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ | Varalakshmi Sarathkumar To Play Cop Role For Aha Ott | Sakshi
Sakshi News home page

Varalakshmi Sarathkumar: 'ఆహా' కోసం పోలీస్‌ అవతారం ఎత్తిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌

Published Sun, Dec 18 2022 9:10 AM | Last Updated on Sun, Dec 18 2022 9:11 AM

Varalakshmi Sarathkumar To Play Cop Role For Aha Ott - Sakshi

తమిళసినిమా: ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌. ఈమె హీరోయిజం, విలనిజం, క్యారెక్టరిజం ఇలా పాత్ర ఏదైనా నచ్చితే చేసేస్తున్నారు. తాజాగా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పోలీస్‌ అధికారి అవతారం ఎత్తారు. దర్శకుడు దయాళ్‌ పద్మనాభన్‌ ఆహా ఓటిటీ కోసం తెరకెక్కిస్తున్న చిత్రంలో ఈమె పోలీస్‌ అధికారిగా పవర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తున్నారు. దీనికి కథ, కథనం దర్శకుడు అందిస్తున్నారు.

కాగా ఇందులో ఆమెతో పాటు నటుడు సంతోష్‌ ప్రతాప్, మహత్, రాఘవేంద్ర, దర్శకుడు సుబ్రమణ్యం, శివ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణికాంత్‌ కాంద్రీ సంగీతాన్ని, శేఖర్‌ చంద్ర చాయాగ్రహణను అందిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ శుక్రవారం బెంగళరులో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.

చిత్ర కథా పోలీస్‌స్టేషన్‌ నేపథ్యంలో సాగుతుందన్నారు. ఆది నుంచి అంతం వరకు చిత్రం ఉత్కంఠ భరితంగా సాగుతుందని పేర్కొన్నారు. కాగా ఇంతకుముందు ఈయన దర్శకత్వంలో వరలక్ష్మి, సంతోష్‌ ప్రతాప్‌ కలిసి కొండ్రాల్‌ పావం అనే చిత్రంలో నటించడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement