నా మద్దతు నాన్నకే | varalakshmi sarathkumar supports to sarath kumar | Sakshi
Sakshi News home page

నా మద్దతు నాన్నకే

Published Thu, Jun 25 2015 9:02 AM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM

నా మద్దతు నాన్నకే - Sakshi

నా మద్దతు నాన్నకే

చెన్నై : ప్రస్తుతం కోలీవుడ్‌లో ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు.కారణం అందరికీ తెలిసిందే. త్వరలో జరగనున్న దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలకు ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.అందులో ప్రస్తుత సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ ఒక వర్గంగానూ నటుడు విశాల్ బృందం వర్గంగానూ పోటీకి సిద్ధం అవుతున్నాయి.

శరత్‌కమార్ వర్గం విజయం తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తుంటే, ఓడిపోయినా పర్వాలేదు పోటీ చేసే తీరుతాం అంటున్నారు విశాల్ వర్గం.అంతేకాదు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.అదే సమయంలో ఊరూరా తిరిగి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
 
ఇదిలా ఉంటే శరత్‌కుమార్‌కు విశాల్‌కు మధ్య వైరానికి కారణం నటి వరలక్ష్మినేనని,ఆమే శరత్‌కుమార్ పైకి విశాల్‌ను ఉసిగొల్పుతున్నారని సోషల్ నెట్‌వర్క్స్‌లో ప్రచారం హల్‌చల్ చేస్తోంది. నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కూతురన్న విషయం గమనార్హం. అలాగే విశాల్‌కు వరలక్ష్మి శరత్‌కుమార్ కి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయనే వదంతులు చాలా కాలంగా హోరెత్తుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో  నడిగర్ సంఘం ఎన్నికల్లో నటి వరలక్ష్మి మద్దతు విశాల్‌కే ఉంటుందనే ఊహాగానాలు ఇంటర్నెట్‌లలో దుమారం రేపుతున్నాయి. ఇలాంటి ప్రచారంపై ఇప్పటివరకు పట్టించుకోని నటి వరలక్ష్మి తాజాగా ఘాటుగా స్పందించారు.సోషల్‌నెట్‌వర్క్స్‌లో అసత్యాల్ని ప్రచారం చేసేవారంతా కళ్లులేని కబోదులని తన ట్విట్టర్‌లో విమర్శించారు.  తన మద్దతు ఎప్పుడూ తన తండ్రికే ఉంటుందని వరలక్ష్మి కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement