Sarath Kumar
-
ఓటీటీలో అథర్వ, శరత్‌కుమార్ థ్రిల్లర్ సినిమా
కోలీవుడ్‌లో ఈ ఏడాదిలో విడుదలైన 'నిరంగల్ మూండ్రు' అనే సినిమా మూడు విభిన్న కథలతో తెరకెక్కింది. దర్శకుడు కార్తీక్ నరేన్ ప్రతిభకు తమిళ్ సినిమా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు తాజాగా ప్రకటన వచ్చింది. ఈ సినిమాపై కోలీవుడ్‌లో చాలామంది ప్రశంసలు కురిపించారు.తమిళ్లో నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రంలో అథర్వ మురళి, నిక్కీ గల్రాని,అభిరామి, రెహమాన్, శరత్‌కుమార్ వంటి స్టార్స్ నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురిచేసిన 'నిరంగల్ మూండ్రు' ఇప్పుడు తమిళ్ ఆహా ఓటీటీలో విడుదల కానుంది. డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన కూడా వెలువడింది. అయితే, తెలుగులో కూడా అదే రోజు విడుదల కావచ్చని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.'నిరంగల్ మూండ్రు' చిత్రాన్ని మొదట తమిళ్ వర్షన్‌తో పాటే టాలీవుడ్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల కుదరలేదు. దీంతో ఓటీటీలో మాత్రం రెండు భాషలలో ఒకేసారి డిసెంబర్ 20న స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. -
ఆ సీన్లో నటించింది నేను కాదు... విజయ్ ఆంటోని
నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మలై పిడిక్కాద మనిదన్. ఇన్ఫినిటీ ఫిలిం వేంచర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడు, దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించారు. నటుడు శరత్‌కుమార్, సత్యరాజ్, నటి మేఘాఆకాశ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా ఈ చిత్రంలోని ఆరంభంలో వచ్చే ఒక నిమిషం సన్నివేశాలను తనకు తెలియకుండా కలిపారని దర్శకుడు విజయ్ మిల్టన్ ఆరోపించడంతో పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ విషయమై ఆయన మీడియాను కలవడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ తరువాత మీడియాను కలవాలనే తన నిర్ణయాన్ని విరమించుకున్నారు. చిత్రంలో కథానాయకుడు ఏం చేస్తాడు, అతను రౌడీనా? పోలీసా? అతనికి వర్షం అంటే ఎందుకు నచ్చదు? వంటి విషయాలను సస్పెన్స్‌గా ఉంచానన్నారు. అయితే ఆ సన్నివేశాలను చిత్రంలో ముందుగానే రివీల్ చేసేలా తనకు తెలియకుండా చేర్చారని దర్శకుడు విజయ్ మిల్టన్ ఆరోపించడంతో నటుడు శరత్‌కుమార్ ఈ వివాదంలో జోక్యం చేసుకుని దర్శకుడికి, నిర్మాతకు మధ్య సమన్వయం కుదిర్చినట్లు సమాచారం. ఈ వివాదం గురించి ఆ చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోని పేర్కొంటూ మలై పిడిక్కాద మనిదన్ చిత్రంలో నిమిషం పాటు సాగే సన్నివేశానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ సన్నివేశాల్లో నటించింది తాను కాదని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికైనా ఈ వివాదం సద్దుమణిగినా? అనే చర్చ సాగుతోంది. -
నాదనాథుడి ఉగ్రరూపం
మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఆదివారం (జూలై 14) శరత్ కుమార్ పుట్టినరోజు.ఈ సందర్భంగా ఈ మూవీలో ఆయన నటిస్తున్న నాదనాథుడి పాత్ర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని ఉగ్రరూపంలో ఉన్న ఓ యోధుడిలా కనిపిస్తున్నారు శరత్ కుమార్. ‘‘శివ భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో ఈ సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు న్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఓటీటీలో టాప్ డైరెక్టర్ కుమారుడి తొలి సినిమా
దర్శకుడు కేఎస్ రవికుమార్ తన ఆర్కే సెల్యులాయిడ్స్ పతాకంపై తాజాగా 'హిట్ లిస్ట్' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో నటుడు శరత్ కుమార్ ప్రధాన పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం ద్వారా టాప్ దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కనిష్క హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి రవికుమార్ శిష్యులు సూర్య, కార్తికేయన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. మే 31న థియేటర్లలో తెలుగు, తమిళంలో ఒకే రోజు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. ఇప్పుడు ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, సముద్ర ఖని, మునీశ్కాంత్, నటి సితార, కేజీఎఫ్ చిత్రం ఫేమ్ గరుడ రామచంద్రా, అనుపమా కుమార్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన 'హిట్‌లిస్ట్' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. జూలై 9 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు,తమిళ్ రెండూ భాషల్లో ఒకేరోజు రానుంది. View this post on Instagram A post shared by aha Tamil (@ahatamil) -
టాలీవుడ్ నటి మెహందీ వేడుక.. డ్యాన్స్‌తో ఇరగదీసిన ఆమె తండ్రి!
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన ప్రియుడిని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను కలిసిన తన పెళ్లికి ఆహ్వానించింది. టాలీవుడ్ హీరోలకు సైతం పెళ్లి పత్రికలు అందజేసింది. ఆమె వివాహా వేడుక థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. జూలై 2న వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారు.తాజాగా వీరి మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆమె తండ్రి శరత్‌కుమార్ డ్యాన్సు వేస్తూ సందడి చేశారు. మెహందీ వేదిక వద్దే అతిథులతో కలిసి శరత్‌కుమార్ డ్యాన్సుతో అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. హనుమాన్ చిత్రంలో మెరిసిన వరలక్ష్మి ఈ ఏడాది మార్చిలో ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్తో నిశ్చితార్థం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Radikaasarath_love❤️ (@virad_15) -
భార్య కోసం పొర్లుదండాలు.. ప్చ్, ఫలించని పూజలు!
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రకారం ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉంది. మరోసారి నరేంద్రమంత్రి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలని కోరుకుంటూ సినీ నటుడు శరత్‌కుమార్ సోమవారం నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.తమిళనాడులోని విరుదునగర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న తన సతీమణి, నటి రాధిక విజయం సాధించాలని, అలాగే వారణాసిలో నరేంద్రమోదీ గెలవాలని ఆలయంలో పొర్లుదండాలు పెట్టారు. అనంతరం భార్యతో కలిసి గుడిలో విశేష పూజలు నిర్వహించారు.ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్‌లో విరుదునగర్‌లో రాధిక మూడోస్థానానికి పడిపోయారు. విజయప్రభాకరన్ (డీఎండీకే), మాణిక్యం ఠాగూర్ (కాంగ్రెస్)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరి మధ్య ఓట్ల తేడా 32గా ఉంది. దీంతో ఈ ఇద్దరిలోనే ఒకరికి గెలుపు తథ్యమని తెలుస్తోంది. రాధిక ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. Actor Sarathkumar visited the Sri Parasakthi Mariamman temple in Virudhunagar to pray for his wife and NDA candidate Radhika's success, as the counting of votes will be held on June 4.#actor #sarathkumar #visited #srioarasakthitemplE #wifesuccess @radhikasarath pic.twitter.com/eLJ5KbXEB8— Pradeep (@PRADEEPDEE2) June 3, 2024చదవండి: 100 మార్క్ దాటనున్న కాంగ్రెస్ : 2014 తరువాత ఇదే తొలిసారి -
రాధిక శరత్‌కుమార్‌కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో బాలీవుడ్‌తో పాటు దక్షిణాది హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు. ఇటీవలే కంగనా రనౌత్‌కు సైతం బీజేపీ లోక్‌సభ సీటును కేటాయించింది. అంతకుముందే సీనియర్ నటి రాధికా శరత్ కుమార్‌కు బీజేపీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆమె తమిళనాడులోని విరుధునగర్ నుంచి పోటీలో నిలిచారు. ఈ నేపథ్యంలో రాధిక శరత్‌కుమార్ ఆస్తులపై చర్చ మొదలైంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసేవారు అఫిడవిట్లో తప్పనిసరిగా ఆస్తులు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా విరుధునగర్ నుంచి పోటీ చేస్తున్న రాధిక నామినేషన్ దాఖలు చేసింది. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులను ప్రస్తావించారు. తన మొత్తం ఆస్తుల విలువను రూ.53.45 కోట్లుగా పేర్కొన్నారు. తన వద్ద ప్రస్తుతం రూ.33.01 లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులతో కలిపి రూ.27.05 కోట్ల చరాస్తులున్నట్లు రాధిక నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. రూ.26.40 కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. రాధిక భర్త, నటుడు ఆర్. శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని భాజపాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. -
ఇద్దరు స్టార్స్ కాంబినేషన్లో నా నా మూవీ.. రిలీజ్ అప్పుడే!
నటుడు శశికుమార్, శరత్‌కుమార్ ఇటీవల నటించిన చిత్రాలు విజయాలు సాధించడంతో మంచి జోష్‌లో ఉన్నారు. శశికుమార్.. అయోధి, శరత్‌కుమార్.. పొన్నియిన్‌సెల్వన్, పోర్ తొళిల్ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ కలిసి ననా అనే చిత్రంలో నటించారు. కల్పనా పిక్చర్స్ పతాకంపై పీకే రామ్ మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎన్వి నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని గణేష్ చంద్ర ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ననా చిత్రాన్ని ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. శశికుమార్, శరత్‌కుమార్ అద్భుత నటనను ప్రదర్శించారని, యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఖచ్చితంగా అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిత్ర కథ ఆది నుంచి చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుందన్నారు. దీనికి భూపతి రాజా, ఎన్వీ నిర్మల్ కుమార్ కలిసి కథను సమకూర్చారు. భూపతి రాజా థాయమిది శివకుమార్, నైవేలి భరత్ కుమార్, సురులిపట్టి శివాజీ మొదలగు వారు సంభాషణలను రాయడం విశేషం. చదవండి: ఆలయాన వెలసిన కథలతో పూనకాలు తెప్పిస్తున్న స్టార్స్ -
కన్నప్పలో ఎంట్రీ
సీనియర్ నటులు మంచు మోహన్‌బాబు, శరత్‌కుమార్ ‘కన్నప్ప’ మూవీ సెట్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. మంచు విష్ణు కలలప్రాజెక్ట్గా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నటుడు, నిర్మాత మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. హీరో ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా నటుడు మంచు మోహన్‌బాబు, శరత్ కుమార్ ‘కన్నప్ప’లో భాగమైనట్లు ప్రకటించి, వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోని విడుదల చేశారు. ‘‘శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర చుట్టూ ఈ చిత్రకథ తిరుగుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
కేవలం రూ.7 కోట్ల సినిమా.. బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది!
తమిళ స్టార్ రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కాంచన(ముని-2). 2007లో రిలీజైన ముని సిరీస్‌లో వచ్చిన రెండో చిత్రమే కాంచన. 2011లో విడుదలైన బాక్సాఫీస్ బరిలో నిలిచిన ఈ చిత్రం ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. శరత్ కుమార్, కోవై సరళ, లక్ష్మీ రాయ్, దేవదర్శిని, శ్రీమాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. హార్రర్- కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే దాదాపు 12 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రానికి అప్పట్లోనే రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. (ఇది చదవండి: అందుకే నా ట్రస్ట్‌కి విరాళాలు వద్దని చెప్పా: లారెన్స్) కాంచన కథ మొత్తం లారెన్స్ చుట్టే తిరుగుతుంది. అతను ఒక దుష్ట ఆత్మతో బాధపడుతుంటూ ఉంటారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు భయానకంగా అనిపిస్తాయి. కాగా.. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఏ(A) సర్టిఫికేట్ ఇచ్చింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం అప్పట్లోనే రుజువు చేసిన చిత్రంగా కాంచన నిలిచింది. పలు భాషల్లో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్ల వసూళ్లు రాబట్టింది. చిన్న చిత్రంగా వచ్చిన వంద కోట్ల మార్కును దాటేసిన కాంచనకు మొదట ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కాగా.. 2020లో విడుదలైన అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటించిన లక్ష్మీ బాంబ్ చిత్రం కాంచన చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఆమె ఒక స్టార్ హీరోయిన్.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! ) మిమి కూడా.. 2021లో ఇటీవల పంకజ్ త్రిపాఠి, కృతి సనన్ల చిత్రం మిమీ సైతం వసూళ్లపరంగా దుమ్ములేపింది. కేవం రూ.20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.298 కోట్ల రూపాయలు రాబట్టింది. తక్కువ బడ్జెట్ చిత్రమైన కలెక్షన్ల పరంగా అద్భుత విజయం సాధించింది. -
శరత్ కుమార్ కొత్త సినిమా ట్రైలర్ వచ్చేసింది..
నటుడు శరత్ కమార్, అమితాష్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం పరం పొరుల్. ఈ సినిమాలో కాశ్మీరా ప్రదేశీ హీరోయిన్గా నటించింది. కవి క్రియేషన్‌న్స్ బ్యానర్‌పై మనోజ్, గిరీష్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి సీ. అరవింద్ రాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఎస్.పాండికుమార్ ఛాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలకు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు మణిరత్నం సతీమణి సుహాసిని మణిరత్నం ట్రైలర్ ఆవిష్కరించారు. నటుడు అమితాష్ మాట్లాడుతూ 2023 ఎంతో ఇన్స్పైరింగ్ సంవత్సరం అని చెప్పవచ్చన్నారు. దాదా, పోర్ తొళిల్, లవ్ టుడే వంటి పలు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయన్నారు. కాగా పరంపొరుల్ చిత్ర కథను నిర్మించాలని భావించినప్పుడు ఇందులో పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్ర కోసం ముందుగా గుర్తుకొచ్చింది శరత్ కుమారేనని పేర్కొన్నారు. ఆయన ఇందులో నటించడానికి సమ్మతించడంతో చిత్ర దశే తిరిగిపోయిందన్నారు. ప్రతి సన్నివేశంలోనూ ఎంతో ఇన్వాల్ అయి నటించారన్నారు. ఇక యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా చిత్రం కోసం సంగీత దర్శకుడు అనిరుధ్ ఒక పాట పాడడం విశేషం అన్నారు. శరత్ కుమార్ మాట్లాడుతూ ఫుల్ ఎఫర్ట్ పెడితే సక్సెస్ ఖాయం అని చెప్పుకొచ్చారు. చదవండి: సలార్‌తో వార్.. మళ్లీ ఆ సీన్ రిపీట్ అవుతుందా? -
కుల విభేదాలకు కారణం రాజకీయ నాయకులే : నటుడు శరత్ కుమార్
తమిళ సినిమా: నటుడు, దర్శకుడు చేరన్ చాలా గ్యాప్ తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం తమిళ్ క్కుడిమగన్. నటి శ్రీ ప్రియాంక, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్, లాల్, వేల రామమూర్తి, దీపిక్ష, అరుళ్ దాస్, రవి మరియా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై ఇస్సక్కీ కార్వానన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. శ్యావ్. సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు శరత్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించగా దర్శకుడు అమీర్, తంగర్ బచ్చన్, మారి సెల్వరాజ్, నటుడు పొన్ వన్నన్ తొలి ప్రతిని అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత ఇస్సక్కీ కార్వానన్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో భగ్గుమంటున్న కుల చిచ్చు ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం తమిళ్ క్కుడిమగన్ అని చెప్పారు. ఇది చిత్రం కాదు పాఠం అని పేర్కొన్నారు. నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ కుల విభేదాలను కారణం రాజకియాలేనని పేర్కొన్నారు. మనిషి పుట్టినప్పుడు తన కులమేమిటన్నది తెలియదన్నారు. అదేవిధంగా పాఠశాల దేశంలో, కళాశాల దేశంలోనూ అందరూ కలిసి మెలిసి ఆడుకుంటారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత కుల, మత భేదాలు తలకెక్కుతాయన్నారు. కుల వివక్షత రూపుమాపడానికి వేరే రాజకీయం ఉందన్నారు. అదే సమానత్వం అనీ దాని కోసం అందరూ పాటు పడాలని అన్నారు. తాను రాజకీయ నాయకుడినేననీ, సమానత్వవం కోసమే తాను భవిష్యత్తు కార్యక్రమాలు ఉంటాయని శరత్ కుమార్ అన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
రాజకీయాల్లోనే కాదు సినిమాల్లో కూడా ఆయన బిజీనే
సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేతి నిండా చిత్రాలతో దూసుకుపోతున్న నటుడు శరత్ కుమార్. సుప్రీం హీరోగా అభిమానులు పిలుచుకునే ఈయన మరో పక్క రాజకీయ నాయకుడిగానూ కొనసాగుతున్నారు. కాగా శరత్ కుమార్ ఇప్పుడు డజన్‌కు పైగా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల అశోక్ సెల్వన్‌తో కలిసి నటించిన పోర్ తొళిల్ మంచి విజయాన్ని సాధించింది. (ఇదీ చదవండి: ప్రముఖ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!) తాజాగా మిస్టర్ ఎక్స్ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. నటుడు ఆర్య గౌతమ్ కార్తీక్ నటిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. నటి అనకా, మంజు వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఇందులో నటుడు శరత్ కుమార్ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. యాక్షన్ స్పై థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి దీపం నీనన్ థామస్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. -
50 దాటేసిన వరలక్ష్మి ... అప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ సినిమా చేసుంటేనా?
దక్షిణాది చిత్ర పరిశ్రమలోని సంచలన నటిమణులలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. నటిగానూ, వ్యక్తిగతంగానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన నటి ఈమె. ఈమె కోలివుడ్లో శింబుకు జంటగా 'పోడాపొడి' చిత్రం ద్వారా కథానాయకగా పరిచయం అయ్యారు. అయితే నిజానికి ఈమె శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ చిత్రం ద్వారానే నాయకిగా పరిచయం కావలసి ఉందట. నటనపై ఆసక్తితో ముంబాయిలో అనుపమ్ ఖేర్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన వరలక్ష్మి శరత్ కుమార్‌ను చదువు పూర్తి అయిన తరువాత నటించాలని ఆమె తండ్రి శరత్ కుమార్ చెప్పడంతో బాయ్స్ చిత్ర అవకాశాన్ని వదులుకున్నారట. ఇదే విధంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో సరోజా చిత్రంలోనూ నటించలేకపోయారట. ఈ విషయాన్ని ఆమె ఇటీవల స్పష్టం చేశారు. ఆ తర్వాత నటుడు శింబు సరసన పోడా పోడి చిత్రంలో నటించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా నటి వరలక్ష్మి కెరీర్‌కు మాత్రం మంచి పునాది వేసింది. ఆ తర్వాత తారై తప్పట్టై చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతే ఆమెకు ఇక నటిగా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కలగలేదు. (ఇదీ చదవండి: లిప్‌లాక్,బోల్డ్ సీన్స్‌పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్) కథానాయకగా, ప్రతినాయకగా తమిళం, తెలుగు తదితర చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ అర్ధసెంచరీ మైలు రాయిని అధిగమించేశారు. దీని గురించి ఆమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. యాబై చిత్రాలు పూర్తి చేయడానికి అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ముఖ్యంగా తన టీమ్‌కు స్పెషల్ థ్యాంక్స్ అనీ, తాను ఇంతకాలం నటిగా కొనసాగుతానని గానీ, ఇన్ని చిత్రాల్లో నటిస్తానని అనుకోలేదన్నారు. ఇకపై నటనను ఆపే ప్రసక్తే లేదని నటి వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
సీరియల్ హత్యలు, పోలీసుల ఈగో.. కేసు చేధిస్తారా?
నటుడు శరత్‌కుమార్, అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం పోర్ తొళిల్. ఈ 4 ఎక్స్పిరిమెంట్స్, ఎప్రియస్ స్టూడియో సంస్థలతో కలిసి అప్లాస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం ఇది. దర్శకుడు విఘ్నేష్ రాజు తెరకెక్కించిన ఈ చిత్రంలో నటి నిఖిలా విమల్ కీలక పాత్ర పోషించారు. కలైసెల్వన్ శివాజీ ఛాయాగ్రహణం, జాక్స్ బిజాయ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని జూన్ 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చైన్నెలో విలేకరులతో ముచ్చటించింది. శరత్‌కుమార్ మాట్లాడుతూ.. ఇది క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. సీరియల్ హత్యల ఉదంతంతో సాగే ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. హత్యలను ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనే పలు ఆసక్తికరమైన అంశాలతో చిత్ర కథ సాగుతుందన్నారు. నటుడు అశోక్ సెల్వన్ మాట్లాడుతూ.. థ్రిల్లర్ కథా చిత్రంలో నటించాలని చాలా కాలంగా కోరుకుంటున్నానని, అది ఈ చిత్రంతో నెరవేరిందని పేర్కొన్నారు. దర్శకుడు విఘ్నేశ్ రాజు మాట్లాడుతూ.. చిత్రాన్ని 42 రోజులలో పూర్తి చేశామని, అందులో ఎక్కువ భాగం రాత్రి వేళ షూటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఇద్దరు పోలీసు అధికారులు తమ ఈగోల మధ్య సీరియల్ హత్యల మిస్టరీ ఎలా చేధించారు అన్నదే పోర్ తొళిల్ చిత్రమని చెప్పారు. -
వరలక్ష్మికి తండ్రిగా గర్వపడుతున్నా!: శరత్ కుమార్
తమిళసినిమా: నటిగా వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎదుగుదల అనూహ్యం అనే చెప్పాలి. తొలి చిత్రం పోడాపోడీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో వరలక్ష్మీ కెరీర్ ఇక అంతే అనే ప్రచారం జరిగింది. అదేవిధంగా ఆ తరువాత అవకాశాలు రావడానికి చాలా కాలమే పట్టింది. అలాంటి పరిస్థితిని వరలక్ష్మీ శరత్‌కుమార్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కథానాయకిగానే నటిస్తానని ఒక చట్రంలో ఇరుక్కోకుండా ప్రతినాయకిగానూ చాలెంజింగ్ పాత్రల్లో నటించడానికి సిద్ధమయ్యారు. అలాంటి పాత్రల్లో నటించి విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్నారు. చదవండి: మంచు వారి ఇంట పెళ్లి సందడి షురూ? ఆమెతో మనోజ్ పెళ్లి ఫిక్స్! బహుభాషా నటిగానూ రాణిస్తున్న వరలక్ష్మీ శరత్‌కుమార్ చాలా గ్యాప్ తరువాత కథానాయకిగా తమిళంలో నటించిన చిత్రం కొండ్రాల్ పావమ్. నటుడు సంతోష్ ప్రతాప్ కథానాయకుడిగా నటించిన ఇందులో దర్శకుడు సుబ్రమణ్యం శివ, నటుడు చార్లీ, సెండ్రాయన్,మనోబాల, నటి ఈశ్వరిరావు ముఖ్య పాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి దయాళ్ పద్మనాభన్ దర్శకత్వం వహించారు. కన్నడంలో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ఈయన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ప్రదాప్ కృష్ణ, మనోజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. నటుడు శరత్‌కుమార్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వేదికపై అందరూ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను నటి విజయశాంతితో పోలుస్తున్నారని, అది నిజమేనని అన్నారు. అయితే మొదట్లో వరలక్ష్మీ నటిస్తానని చెబితే వద్దు అనలేదు గానీ, ముంబై యూనివర్సిటీలో ఎంఏ చదివి సినిమాల్లో నటించడం అవసరమా? అని అన్నానన్నారు. అయితే తను మాత్రం నటించడానికే సిద్ధమయ్యారని, అయితే ఈ స్థాయికి రావడానికి కారణం తనే అన్నారు. చదవండి: అభిమాని నుంచి అలాంటి ప్రశ్న, మండిపడ్డ బిగ్‌బాస్ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా స్వశక్తితోనే ఎదిగిందని చెప్పారు. వరలక్ష్మీ బోల్డ్ అండ్ బ్రేవ్ ఉమెన్ అని పేర్కొన్నారు. ఒక రోజు రాత్రి ఒక పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. ఏమిటని అడిగితే మీ అమ్మాయి పోలీస్‌స్టేషన్‌లో ఉందని, వరలఓఇ్మ ఇద్దరు వ్యక్తుల్ని కొట్టినట్లు తెలిసిందన్నారు. ఆ వ్యక్తులు వరలక్ష్మి కారును ఢీకొట్టి అల్లరి చేయడంతో తను వారిని చితక బాధినట్లు తెలిసిందన్నారు. అలాంటి ధైర్యశాలి వరలక్ష్మి అని అన్నారు. ఆమె తండ్రిగా తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. ఇక కొండ్రాల్ పావం చిత్ర విషయానికి వస్తే కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. తానీ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్య థియేటర్లోనే చూస్తానని శరత్‌కుమార్ చెప్పారు. -
నేరస్తుడిగా యువ హీరో గౌతమ్ కార్తీక్.. కొత్త సినిమా ప్రారంభం
తమిళసినిమా: యువ నటుడు గౌతమ్ కార్తీక్, శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి క్రిమినల్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. పార్సా పిక్చర్స్ మీనాక్షి సుందరం, బిగ్ ఫ్రింట్ పిక్చర్స్ కార్తీకేయన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దక్షణామూర్తి రామ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్యామ్ సీఎస్.సంగీతాన్ని, ప్రసన్న ఎస్.కుమార్ చాయాగ్రహణను అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మధురైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చిత్ర వివరాలను నిర్మాతలలో ఒకరైన మీనాక్షీసుందరం వెల్లడించారు. చిత్ర షూటింగును మధురైలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇది మధురై నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. నటుడు గౌతమ్ కార్తీక్ నేరస్తుడిగా, శరత్‌కుమార్ పోలీస్ అధికారిగా విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు దక్షిణామూర్తి రామ్‌కుమార్ కథ చెప్పినప్పుడే చాలా కొత్తగా అనిపింందన్నారు. కథ, కథనం ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని కలిగిస్తుందని అన్నారు. చిత్ర షూటింగ్‌ను 40 రోజుల పాటు ఏకధాటిగా నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. -
ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌కు తీవ్ర అస్వస్ధత
ప్రముఖ సీనియర్ నటుడు శరత్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డయేరియాతో డీహైడ్రేషన్‌కు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇప్పటికే ఆసుపత్రి వద్దకు చేరుకున్నట్లు తెలుస్తుంది. కాగా 1986లో 'సమాజంలో స్త్రీ' అనే తెలుగు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన శరత్‌కుమార్ సపోర్టింగ్ రోల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని అనతికాలంలోనే హీరోగా మారాడు. తెలుగునాట మంచి పాపులారిటీ దక్కించుకున్న శరత్‌కుమార్ ఇటీవలె తెలుగులో పరంపర వెబ్‌సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. -
మహేష్ బాబును పరామర్శించిన శరత్ కుమార్
-
కూతురుతో కలిసి రజనీని కలిసిన శరత్ కుమార్
నటుడు శరత్ కుమార్ తన కూతురు, నటి వరలక్ష్మి శరత్ కుమార్‌తో కలిసి ఆదివారం సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిశారు. వీరిని తలైవా సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని నటుడు శరత్ కుమార్ తన ట్విట్టర్లో పొందుపరిచారు. మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటుడు శరత్ కుమార్ పెరియ పళవేట్టరైయర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం చూసిన రజనీకాంత్ శరత్ కుమార్‌కు ఫోన్‌చేసి ప్రశంసించారు. అందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే తాను రజనీకాంత్ కలిసినట్లు శరత్ కుమార్ పేర్కొన్నారు. కూతురు వరలక్ష్మి కూడా రావడంతో తాజాగా నటిస్తున్న చిత్రాలపై కొద్దిసేపు చర్చించినట్లు వెల్లడించారు. -
ఆ సీన్ చేసేటప్పుడు విజయశాంతి నన్ను విసుక్కున్నారు: శరత్‌కుమార్
కోలీవుడ్ సీనియర్ హీరో శరత్‌కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇటీవలె పరంపర వెబ్‌సిరీస్‌తోనూ ఆకట్టుకున్నారాయన. కాగా ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో మూవీ టీం ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శరత్‌కుమార్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'నా మొదటి సినిమా తెలుగులోనే చేశాను. విజయశాంతి మెయిన్ లీడ్‌లో నటించిన సమాజంలో స్త్రీ అనే సినిమాలో నేను కూడా నటించాను. ఆరోజు ఓ సీన్లో ఆర్టిస్ట్ రాలేదు. ఆ నిర్మాత నాకు ఫ్రెండ్ కావడంతో నన్ను ఆ సీన్ చేయమని అడిగాడు. కానీ నాకు యాక్టింగ్ రాకపోవడంతో చాలా టేకులు తీసుకున్నా. అప్పటికే విజయశాంతి గారు చాలా ఓపిక పట్టారు. కానీ చాలా టేకులు అవుతుండటంతో.. నేను వెంటనే చెన్నై వెళ్లిపోవాలి. కొత్తవాళ్లని తీసుకొచ్చి నా టైమ్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మంచి ఆర్టిస్టులను పెట్టొచ్చు కదా అని విసుక్కున్నారు. అయితే కొన్నాళ్లకు నటుడిగా నేను బిజీగా ఉన్న సమయంలో ఓ సినిమాలో మళ్లీ విజయశాంతి కాంబినేషన్లో నటించాల్సి వచ్చింది. అప్పుడు మీరు నన్ను ఆ సినిమాలో విసుక్కున్నారు అని సరదాగా చెప్పగా అయ్యో సారీ అండీ అని చెప్పి ఫీలయ్యారు' అని అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. -
పరంపర సీజన్-2 వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
పరంపర..గతేడాది నెటిజన్లను విపరీతంగా ఆకర్షించిన వెబ్‌సిరీస్‌లలో ఇది ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్‌సిరీస్ మొదటి సీజన్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్‌కు కొనసాగింపుగా రెండవ సీజన్ రాబోతుంది. పరంపర-2గా వస్తున్న వెబ్‌సిరీస్ జులై21 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. యంగ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. దీంతో సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.నాయుడు, గోపి మధ్య మొదలైన యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో ఊహించని మజిలీలతో ఆసక్తి రేపుతున్న "పరంపర సీజన్ 2" ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఎవరికోసమో మొదలుపెట్టిన యుద్ధం.. దేనికోసం అనే ప్రశ్న దగ్గర ఆగితే.. దానికి అసలైన సమాధానమే "పరంపర" సీజన్ 2. పాయింట్ బ్లాంక్ కి భయపడకుండా, ఎదురువెళ్ళి తెగబడే ఓ యువకుడి ధైర్యం ప్రపంచానికి వినిపించిన ఒక కొత్త స్వరం ఈ సీజన్-2. ప్రేమ, ప్రతీకారాల మధ్య నమ్మిన సిద్ధాంతం ఎవరిని ఎటు నడిపించిందో.. ఏ బంధాన్ని ఏ తీరానికి చేర్చిందో తెలుసుకోవాలంటే "పరంపర" సీజన్ 2 చూడాల్సిందే. సో డోంట్ మిస్. పరంపర సీజన్-2ని డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://bit.ly/3cue9Vc -
మా నాన్న రియల్ హీరో: వరలక్షి శరత్ కుమార్
పాన్ ఇండియా నటుడు శరత్‌కుమార్‌ను అభిమానులు సుప్రీం హీరో అంటారు. తమిళ సినిమాలో కథానాయకుడిగా ఎన్నో విలక్షణ పాత్రలు చేసిన ఈయన ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న ప్రధాన పాత్రల్లో నటించడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే శరత్‌కుమార్ ఇప్పటికీ హీరోనే. తమిళం, తెలుగు, మలయాళం ఇలా పలు భాషల్లో పలు రకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు. మరో పక్క ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అలాంటి ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురువారం తన 69వ పుట్టినరోజును జరుపుకున్నారు. చదవండి: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు హైకోర్టులో ఊరట ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఈయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన వారసురాలు వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకున్నారు. ఆమె హీరోయిన్గా మాత్రమే కాదు పాత్ర ప్రాధాన్యత ఉన్న రోల్స్ పోషిస్తూ విలక్షణ నటిగా రాణిస్తున్నారు. ఇక గురువారం తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా వరలక్ష్మి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసింది. అందులో ‘వయసు అనేది ఒక నంబరు మాత్రమే అని మీరు నిరూపించారు.. మాకు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఐ లవ్ యూ డాడీ..నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
రాధిక, శరత్‌కుమార్ దంపతులకు ఏడాది జైలు శిక్ష
సాక్షి, చెన్నై: తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్, అతడి భార్య, నటి, నిర్మాత రాధికలకు కోర్టులో చుక్కెదురైంది. 2018 నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. 2015లో 'ఇదు ఎన్న మాయం' సినిమా కోసం రాధికా, శరత్‌కుమార్‌లు రేడియంట్ గ్రూప్ అనే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు. అయితే సకాలంలో ఆ అప్పును తీర్చలేదు. తర్వాత వీరు ఇచ్చిన చెక్ కాస్త బౌన్స్ అయింది. దీంతో రేడియంట్ గ్రూప్ 2018లో కోర్టును ఆశ్రయించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం చెన్నై స్పెషల్ కోర్టు ఈ దంపతులకు జైలు శిక్ష విధిస్తున్నట్లు తాజాగా తీర్పు వెలువరించింది. చదవండి: రజనీకి అమ్మగా చేయమంటారని తెలుసు! -
ద్రవిడ పార్టీల పెత్తనం చెల్లదంటున్న రాధిక శరత్ కుమార్
-
తమిళనాట మూడో కూటమి.. సూత్రధారి చిన్నమ్మ..!
సాక్షి, చెన్నై: తమిళనాడు ఎన్నికలంటే అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ అనే ఆనవాయితీకి చెక్‌పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు కూటముల్లోని అసంతృప్త పార్టీలను కూడగట్టడం ద్వారా మూడో కూటమి సన్నాహాలు జోరందుకున్నాయి. మూడో కూటమి ఏర్పాట్లలో తెరవెనుక శశికళ, తెరముందు శరత్‌కుమార్ సారథ్యం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, డీఎండీకేతోపాటు ఒకటి రెండు చిన్నపార్టీలున్నాయి. డీఎంకేలో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీలున్నాయి. ఇండియా జననాయక కట్చి (ఐజేకే) డీఎంకే కూటమి నుంచి బయటకొచ్చి మూడో కూటమి ఏర్పాటుకు నడుం బిగించింది. తమిళనాడులో పెద్దగా ప్రాచుర్యం లేని ఐజేకే ప్రస్తుతానికి కూటమికి సారథ్యం వహిస్తున్నా తెరవెనుక నుంచి శశికళ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే కూటమిలో ఉన్న సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్ కొద్దిరోజుల క్రితం శశికళతో భేటీ కావడం కలకలం రేపింది. తర్వాత అన్నాడీఎంకే కూటమిని వీడి ఐజేకేలో శరత్ చేరారు. పదేళ్లు అన్నాడీఎంకే కూటమితో కలిసి ప్రయాణించానని, సీట్ల కేటాయింపుపై కనీసం తనకు ఆహ్వానం లేకపోవడం వల్లనే వైదొలిగానని శరత్‌కుమార్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని శరత్‌కుమార్ కూటమిని బలోపేతం చేయడంలో కూడా ప్రధానపాత్ర పోషిస్తున్నారు. మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ను శరత్‌కుమార్ శనివారం కలిసి కూటమిలో చేర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. డీఎంకే కూటమిలో చేరాలని ఎన్నో నెలలుగా వేచి చూస్తున్న కమల్‌హాసన్‌కు నిరాశే ఎదురుకాగా ఐజేకే ఆహ్వానాన్ని మన్నించే అవకాశం ఉంది. మూడో కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యం కాదు, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసంక్షేమం కోసం పాటుపడే పార్టీలను సంఘటితం చేసి గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శరత్‌కుమార్ తెలిపారు. కమల్ మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్మకం ఉందని శరత్‌కుమార్ అన్నారు. ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్న రెండు కూటముల్లోని ఆశావహులపై కూడా ఐజేకే ఒక కన్నేసింది. మూడో కూటమిలోని ఏదో పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం లేదా కూటమి తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే అవకాశం కల్పించేందుకు ఐజేకే సిద్ధంగా ఉంది. డీఎంకే నేతలు జారిపోకుండా ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మార్చి 2వ తేదీ నుంచి ఆశావహులను ఇంటర్వ్యూ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే తమ సామాజికవర్గమైన వన్నియర్లకు రిజర్వేషన్ల డిమాండ్‌ను తెరపైకి తెచ్చి సాధించింది. అదే జరగకుంటే పీఎంకే సైతం అన్నాడీఎంకే నుంచి వైదొలిగి డీఎంకే లేదా మూడో కూటమి వైపు మొగ్గి ఉండేది. అన్నాడీఎంకే అగ్రనేతలతో శనివారం జరిగిన చర్చల్లో సామరస్యం కుదరగా 23 సీట్లతో పీఎంకే సరిపెట్టుకుంది. అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ 60 సీట్లను కోరుతుండగా, 20–25 సీట్లకు మించి దక్కే పరిస్థితి కనపడడం లేదు. తమిళనాడులోని మొత్తం 234 సీట్లలో పోటీచేసేందుకు బహుజన సమాజ్ పార్టీ సిద్ధమైంది. రాబోయే రోజుల్లో మూడో కూటమిలో చేరినా చేరవచ్చు. అదే జరిగితే ఒంటరిపోటీపై బీఎస్పీ తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. నటుడు రజనీకాంత్ స్థాపించదలుకున్న పార్టీకి ప్రధాన సమన్వయకర్తగా నియమితులైన అర్జున్‌మూర్తి ‘ఇండియా మక్కల్ మున్నేట్ర కట్చి’అనే పార్టీని స్థాపించారు. బీజేపీ నేపథ్యం కలిగిన అర్జున్‌మూర్తికి ‘ఆల్ ది బెస్ట్’అంటూ రజనీకాంత్ ఆశీస్సులు అందజేశారు. మూడో కూటమికి అధికారంలోకి వచ్చేంత సంఖ్యా బలం సమకూరకున్నా రెండు కూటముల్లోని అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసే పరిస్థితి ఏర్పడవచ్చు. తమిళనాడులో రాహుల్, అమిత్‌షా.. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మూడు రోజులపాటు తమిళనాడులో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదివారం కారైక్కాల్, విల్లుపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. పీఎంకేకు 23 సీట్లు ♦ఏఐఏడీఎంకే అంగీకారం ♦బీజేపీతో కొనసాగుతున్న చర్చలు చెన్నై: తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను సీట్ల పంపకాలు జోరందుకున్నాయి. అధికార ఏఐఏడీఎంకే, ఎస్.రాందాస్ నేతృత్వంలోని పీఎంకే పార్టీ మధ్య సీట్ల పంపిణీపై శనివారం అంగీకారం కుదిరింది. దీని ప్రకారం పీఎంకే రాష్ట్రంలోని 23 సీట్లలో పోటీ చేయనుంది. కాగా, సీట్ల సర్దుబాటుపై ఏఐఏడీఎంకే, బీజేపీల మధ్య చర్చలు తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వీకే సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్‌లు ఏఐఏడీఎంకేకు చెందిన సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలతో శనివారం చర్చలు జరిపారు. తాము గెలిచేందుకు అవకాశమున్న 60 స్థానాలను కోరుతున్నట్లు బీజేపీ నేతలు అంటున్నారు. సూత్రధారి చిన్నమ్మ.. మూడో కూటమి ఏర్పాటుకు శశికళ సూత్రధారి అని ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే నుంచి ఆశించిన స్థాయిలో అగ్రనేతలు శశికళ వైపు రాకపోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. అందుకే శశికళ అక్క కుమారుడు దినకరన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కూడా మూడో కూటమిలో చేరిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ కోసం ఐజేకే యత్నిస్తోంది. అన్నాడీఎంకే, డీఎంకే కూటముల్లో సీట్ల సర్దుబాటు పూర్తయితేగానీ అసంతృప్తవాదులు బయటపడరు. అప్పటి వరకు ఐజేకే వేచిచూడక తప్పదు. మూడో కూటమి ఏర్పాటు ఒక కొలిక్కిరాగానే దాని స్వరూపం మారి శశికళ తెరపైకి రావచ్చని అంచనాలున్నాయి. -
శరత్‌కుమార్ పేరుతో మోసం
సినిమా: టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నటుడు శరత్‌కుమార్‌కు ఇలాంటి ఒక అనుభవమే ఇటీవల ఎదురైంది. అయితే ఆయన రీల్ హీరోనే కాదు రియల్ హీరో అని నిరూపించుకున్నారు. అఖిల భారత సమత్తువ కట్చి పార్టీ నేత శరత్‌కుమార్ పేరును వాడుకుంటూ ఒక వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ విషయం శరత్‌కుమార్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన యాక్షన్‌లోకి దిగారు. శరత్‌కుమార్ పోలీసులను ఆశ్రయించకుండా, తనే రంగంలోకి దిగి తన పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి గురించి ఆరా తీశారు. తన వాయిస్‌తో మోసానికి పాల్పడిన వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడారు. అతను కోవైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని తెలిసింది. దీంతో నటుడు శరత్‌కుమార్ గురువారం చెన్నై పోలీస్‌కమిషనర్‌ను కలిసి మోసానికి పాల్పడిన వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. -
సీఏఏ: శరత్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
నటుడుగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న వ్యక్తి శరత్‌కుమార్. ఒక్క తమిళంలోనే కాకుండా, తెలుగు, మలయాళం అంటూ బహుభాషా నటుడిగా గుర్తింపు పొందిన శరత్‌కుమార్ గత ఏడాది తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ చిత్రాలను చేశారు. కాగా తాజాగా కోలీవుడ్‌లో నటుడిగా వేగం పెంచారు. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయని, త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని చెప్పారు.అన్నట్లు ఇప్పుడు వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. తనూ వెబ్ సిరీస్‌కు ఎంటర్ అయ్యానని శరత్‌కుమార్ తెలిపారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు ఆయన చెప్పారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రకు మారిన శరత్‌కుమార్ తనకే సొంతమైన శక్తివంతమైన పాత్రల్లో నటిస్తున్నారు. అలా ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి దర్శకుడు మణిరత్నం తన మెడ్రాస్ టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న వానం కొట్టటుం ఒకటి. విక్రమ్‌ప్రభు, నటి ఐశ్వర్యరాజేశ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్ కలిసి నటిస్తున్నారు.ఈ సందర్బంగా శరత్‌కుమార్ మంగళవారం మీడియాతో ముచ్చటించారు. సినిమాలు, నడిగర్‌సంఘం, రాజకీయాలు వంటి పలు విషయాలను శరత్‌కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముస్లింలకు వ్యతిరేకంగా లేదు ఇక ప్రస్తుత రాజకీయాల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నిజానికి ఈ బిల్లు గురించి యువతకు సరైన అవగాహన లేదన్నారు. ఈ పౌరచట్ట బిల్లులో ముస్లింలకు వ్యతిరేకంగా ఏమీ లేదని అన్నారు. అలాంటిదేదైనా ఉంటే తానే రంగంలోకి దిగి పోరాడతానని అన్నారు. కరుణానిధి తరువాత ఆ స్థానంలో స్టాలిన్‌ను తను అంగీకరించలేకపోతున్నానన్నారు. ఇకపోతే తమిళనాడులో నాయకత్వం సరిలేదన్న ఆరోపణలు తగ్గిపోయాయన్నారు. ఊగుతున్న స్తంభాన్ని ఎత్తి నిలబెట్టినట్లు ఎడపాటి చాలా బాగా పరిపాలిస్తున్నారని పేర్కొన్నారు. కాగా రాబోయే ఎన్నికల్లో తన అఖిల భారత సమత్తువ పార్టీ శక్తి వంతంగా పని చేస్తుందని శరత్‌కుమార్ పేర్కొన్నారు. తండ్రిగా సహాయం చేయలేకపోతున్నాను.. ప్రస్తుతం తాను నటిస్తున్న వానం కొట్టటుం చిత్రం గురించి తెలుపుతూ గతంలో తాను నటించిన అయ్యా, సూర్యవంశం చిత్రాల తరహాలో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. ఇక దక్షిణ భారత నటీనటుల సంఘంకు ఇంతకు ముందు ఈయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సంఘ భవన నిర్మాణం నలిచిపోవడం సంకటకరమైన పరిస్థితిగా శరత్‌కుమార్ పేర్కొన్నారు. దానికి తాను కూడా సహాయం చేయలేని పరిస్థితి అని పేర్కొన్నారు. నటీనటుల సంఘానికి ప్రత్యేక అధికారిని నియమించే వరకూ పరిస్థితి రావడం చింతించవలసిన పరిస్థితి అన్నారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో పరిస్థితులు బాగాలేవన్నారు. ఇంతకు ముందు పోడా పోడి చిత్రానికి సంబంధించిన సమస్య వ్యవహారంలో ఆ చిత్ర కథానాయకి వరలక్ష్మీకి ఒక తండ్రిగా తాను సహాయం చేయకపోవడం ఇప్పుడు బాధ అనిపిస్తోందని శరత్‌కుమార్ అన్నారు. చదవండి: సీఏఏ : అమెరికా యువతి వీడియో వైరల్ వారు వెళ్లేందుకు 150 దేశాలున్నాయ్.. -
శరత్‌కుమార్, రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు
-
శరత్‌కుమార్, రాధారవిని అరెస్టు చేయండి: హైకోర్టు
సాక్షి, చెన్నై: ప్రముఖ నటులు శరత్‌కుమార్, రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో సినీ నటీనటుల సంఘానికి శరత్‌కుమార్ అధ్యక్షుడిగా, రాధారవి కార్యదర్శిగా ఉన్నారు. ఆ కాలంలో కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న నడిగర్ సంఘానికి చెందిన స్థలాన్ని వీరిద్దరు అక్రమంగా అమ్మారని 2017లో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించింది. సంఘం అనుమతి లేకుండా స్థలాన్ని విక్రయించిన ఈ కేసును 3నెలల్లో తేల్చి చర్యలు తీసుకోవాలని, శరత్, రవిలను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. -
కొలంబో పేలుళ్లు.. స్పందించిన సినీతారలు
శ్రీలంకలోని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఇప్పటికీ వరకు అందించిన సమాచారం మేరకు ఈ దాడిలో 165 మంది మృతిచెందగా, 280మందికి పైగా గాయాలయ్యాయి. అయితే తమిళ, తెలుగు తారలు సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనను ఖండించారు. తమిళ హీరో శరత్ కుమార్ ట్వీట్ చేస్తూ.. ‘కొలంబోలో జరిగిన ఉగ్రదాడి ఖండించదగినది. ఆ దాడిలో చనిపోయిన అమాయకులను చూస్తే.. హృదయం చలించిపోతోంది’ అని పేర్కొన్నారు. విశాల్ కూడా ఈ ఘటనను ఖండించారు. సాయి ధరమ్ తేజ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. శ్రీలంక బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాధికా శరత్‌కుమార్ తృటిలో ప్రమాదం తప్పించుకున్నానని తెలిపారు. ప్రధాని మోదీ సహా ప్రముఖ రాజకీయ నాయకులు ఈ ఘటనను ఖండించారు. A dastardly act of terror unleashed in Colombo is condemnable, our heart goes out to innocent lives lost in the attack @TamilTheHindu @ThanthiTV @bbctamil — R Sarath Kumar (@realsarathkumar) April 21, 2019 My prayers,strength and deepest condolences to the people of #Srilanka #PrayforSriLanka 🙏🏼 pic.twitter.com/E3WBbuLTTy — Sai Dharam Tej (@IamSaiDharamTej) April 21, 2019 Devastated to hear about the Bomb blasts in Sri Lanka.... My Thoughts & Prayers are with the People of Sri Lanka....#SriLanka #SriLankaBlasts — Vishal (@VishalKOfficial) April 21, 2019 -
స్పందించకపోవడం సరికాదు!
స్పందించకపోవడం సరికాదని నటి వరలక్ష్మీశరత్‌కుమార్ సినీ ప్రముఖులకు చురకలు వేసింది. ఏ విషయంలోనైనా తనకు అనిపించింది వ్యక్తం చేయడానికి ఏ మాత్రం భయపడని నటి వరలక్ష్మీ. చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీ శరత్‌కుమార్ సమాజంలోని స్త్రీలకు అండగా ఉండడానికి సేవ్‌శక్తి అనే సేవా సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక భవిష్యత్తులో తన రాజకీయరంగ ప్రవేశం తథ్యం అని కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. తన తండ్రి శరత్‌కుమార్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పేసింది. ఈమె నోరు విప్పిందంటే సంచలనమే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. ముఖ్యంగా పొల్లాచ్చిలో ఇటీవల జరిగిన అత్యాచార సంఘటన గురించి తీవ్రంగా స్పందించింది. ఆ సంఘటనను ఇప్పుటికే పలువురు తీవ్రంగా ఖండించారని, అందరూ ముఖ్యంగా ప్రభుత్వం అలాంటి మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాగే పలువురు సినీ ప్రముఖులు పొల్లాచ్చి సంఘటనపై తీవ్రంగా స్పందించారు.అయితే ఇంకా ఖండించని సినీ ప్రముఖులు ఉన్నారని, వారు ఎందుకు స్పందించలేదో అర్థం కావడం లేదని వరలక్ష్మీశరత్‌కుమార్ అంది. ఇటీవల మీటూ విషయంలోనూ తాను, గాయని చిన్మయి లాంటి వారు పోరాడామని, అయితే చాలా మంది ప్రముఖులు నోరు మెదపలేదని విమర్శంచింది. నిజానికి ఇలాంటి ఘోర సంఘటనలపై స్పందించడం ప్రముఖుల బాధ్యత అని పేర్కొంది. వారి స్పందనకు చాలా పవర్ ఉంటుందని అంది. దాని ప్రభావం చాలా ఉంటుందని అంది. కాబట్టి పొల్లాచ్చి సంఘటనలాంటి వాటిపై సినీ ప్రముఖులు స్పందించాలని వరలక్ష్మీశరత్‌కుమార్ అంటోంది. వరలక్ష్మీశరత్‌కుమార్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందో అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి వస్తామంటున్న కొందరు పొల్లాచ్చి సంఘటనపై ఇంకా గొంతు విప్పలేదన్నది వాస్తవం. -
బీజేపీలో చేరిన ప్రముఖ నటి.. కాదు నేను చేరలేదు!
సాక్షి, చెన్నై : ప్రముఖ నటుడు శరత్‌కుమార్ తనయురాలు, సినీ నటి వరలక్ష్మి బుధవారం బీజేపీలో చేరినట్టు కథనాలు వచ్చాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారని తమిళ మీడియా పేర్కొంది. అయితే, ఈ వార్తలపై నటి వరలక్ష్మి వివరణ ఇచ్చారు. నరేంద్రమోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మురళీధర్‌రావు బుధవారం వరలక్ష్మిని కలిశారు. మోదీ ప్రభుత్వ విజయాలను ఆమెకు వివరించారు. దీంతో ఆమె బీజేపీలో చేరిందన్న కథనాలు ఊపందుకున్నాయి. దీంతో తాను బీజేపీలో చేరలేదని ఆమె వివరణ ఇచ్చారు. మోదీ ప్రభుత్వ విజయాల గురించి తెలుసుకునేందుకే తాను బీజేపీ నేతలను కలిశానని, ఆ సమావేశంలో దేశ ప్రగతి,మహిళల భద్రత గురించి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేసిన కృషిని వివరించారని, ఈ విషయాలు తనకు సంతృప్తి కలిగించాయని ఆమె అన్నారు. వరలక్ష్మి ప్రస్తుతం దళపతి 62, మిస్టర్ చంద్రమౌళి, శక్తి, కదల్ మన్నన్ వంటి పలు సినిమాల్లో నటిస్తున్నారు. వరలక్ష్మి తండ్రి, ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన గతంలో ఆలిండియా మక్కల్ సమథువ కచ్చి పార్టీని స్థాపించారు. -
ఆ ఛానెల్ వార్తను నమ్మొద్దు : స్టార్ హీరో
సాక్షి, చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ అసత్యపు కథనాలపై స్పందించారు. తన ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగిందంటూ ఓ ప్రముఖ ఛానెల్ లో వస్తున్న వార్తను ఆయన ఖండించారు. ‘సన్ న్యూస్ ఛానెల్లో నా ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగినట్లు ఫ్లాష్ న్యూస్ స్క్రోలింగ్ వస్తోంది. అది నిజం కాదు’ అని ఆయన కాసేపటి క్రితం ట్వీట్ చేశారు. కాగా, గతంలో డీఎంకే పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన.. కరుణానిధి కుటుంబంతో విభేధాల కారణంగా 2006లో పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం అఖిల భారతీయ సమతువా మక్కల్ అనే రాజకీయ పార్టీతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. The flash news scrolling in Sun News channel that petrol bombs have been hurled at my house is not true — R Sarath Kumar (@realsarathkumar) 11 March 2018 -
రజనీపై విరుచుకుపడ్డ శరత్‌కుమార్
సాక్షి, చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్‌పై నటుడు శరత్ కుమార్ విరుచుకుపడ్డారు. సినిమాల విడుదల సమయంలో పబ్లిసిటీ కోసం రజనీ రాజకీయాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చని అన్న ఆయన.. రజనీ చెబుతున్న ఆధ్యాత్మికత, సెక్యులర్ విలువలేంటో ఎన్నికల సమయంలో తెలుస్తుందన్నారు. అప్పుడే రజనీ వెనకున్న రాజకీయ శక్తులు కూడా బయటకు వస్తాయని చెప్పారు. తమిళులు, కన్నడిగుల మధ్య కావేరి, మేగదారు సమస్యలు వచ్చినప్పుడు రజనీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రజనీకి ధైర్యం ఉంటే కర్ణాటక నుంచి ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగగలరా? అంటూ సవాల్ విసిరారు. జయలలిత, కరుణానిధిలు రాజకీయాల్లో ఉన్నప్పుడు రజనీ ఎందుకు రాజకీయ ప్రవేశం చేయలేదని ప్రశ్నించారు. యువతరానికి రాజకీయాల్లో దారి ఇవ్వండన్న విశాల్.. ఇప్పుడు ఆ విషయాన్ని కొంచెం రజనీ చెవిలో చెబుతారా? అంటూ విమర్శించారు. -
విశాల్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, చెన్నై: హీరో రాధారవి పిటిషన్ వ్యవహారంలో ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా నటుడు విశాల్‌కు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. గత ఏడాది దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో పోటీ చేసి విశాల్ వర్గం గెలిచిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవిని నాజర్, కార్యదర్శి పదవిని విశాల్, కోశాధికారి పదవిని కార్తీ చేపట్టారు. వీరికి ముందు నిర్వాహక బాధ్యతలను నిర్వహించిన అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి అవకతవకలకు పాల్పడిన ఆరోపణపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు విశాల్ వర్గం ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారంపై మాజీ కార్యదర్శి రాధారవి చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు తీర్పు వెలువడే వరకూ రాధారవిపై చర్యలు ఉండవని ప్రస్తుత నిర్వాహక వర్గం పేర్కొంది. అలాంటిది గత సెప్టెంబర్ 22వ తేదీన హీరో రాధారవిని సంఘ సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు తీర్మానం చేశారు. దీంతో ఇది కోర్టు ధిక్కార చర్య అవుతుందని రాధారవి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు బుధవారం న్యాయమూర్తి ఎంఎం.సుందరేశ్ సమక్షంలో విచారణకు వచ్చింది. దక్షిణ భారత నటీనటుల సంఘం తరఫున హాజరైన న్యాయవాది తగిన బదులివ్వడానికి సమయం కోరగా ఈ నెల 19వ తేదీన గానీ, అంతకు ముందుగానీ నటుడు విశాల్ కోర్టుకు హాజరై ఈ కేసు వ్యవహారంలో వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
హీరో సూర్యపై కేసు కొట్టివేత
తమిళసినిమా: నటుడు సూర్య, శరత్‌కుమార్‌లతో పాటు మరో 8మంది నటీనటులపై ఊటీ కోర్టులో నమోదైన కేసును బుధవారం చెన్నై హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2009లో ఓ సంతాప కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సూర్య, శరత్‌కుమార్, సత్యరాజ్, వివేక్, అరుణ్‌విజయ్, దర్శకుడు చేరన్, నటి శ్రీప్రియ వీరంతా తమ గురించి తప్పుగా రాశారంటూ విలేకరులను, వారి కుటుంబ సభ్యులను దూషించారు. దీనిపై నీలగిరికి చెందిన మరియకుసై అనే విలేకరి ఊటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు 8మందిని కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే వారు కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. దీంతో సూర్య, శరత్‌కుమార్ బృందం చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ముందు హైకోర్టు నటులపై అరెస్ట్ వారెంట్‌ను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బుధవారం ఈ కేసు విచారణకు రాగా న్యాయమూర్తి ఎంవీ మురళీధరన్ ఇరువర్గాల వాదనలు విన్న తరువాత నటీనటులపై కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. -
మహేశ్ తండ్రిగా?
ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ యాక్టర్ లేదా సీనియర్ హీరో కనిపిస్తే ప్రేక్షకులకు ఆ కిక్కే వేరు. సినిమాపై మంచి క్రేజ్ వస్తుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేశ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తారట! కాబట్టి హీరో తండ్రి పాత్రకూ చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ఆ పాత్రకు సరిపోయే నటుడు ఎవరా అని సర్చ్ చేసిన చిత్రబృందం తమిళ నటుడు శరత్‌కుమార్‌ను ఫైనల్ చేశారని టాక్. ఈ సినిమాకు ‘భరత్ అను నేను’ టైటిల్ ప్రచారంలో ఉంది. ‘బన్ని’ సినిమాలో అల్లు అర్జున్ తండ్రిగా పవర్ఫుల్ రోల్లో శరత్‌కుమార్ నటనను ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేదు. మహేశ్– కొరటాల చిత్రంలోనూ ఆయన పాత్ర అదే స్థాయిలోనే ఉంటుందని సమాచారం. -
రాడాన్ గ్రూపులో ఐటీ దాడులు
-
ఆ రోజు చిరంజీవి అన్నమాట నిజమైంది!
‘‘చిరంజీవిగారి ‘గ్యాంగ్‌లీడర్’ తెలుగులో నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’లో విలన్‌గా చేశాక చిరుగారితో ‘తర్వాత సినిమాలోనూ ఛాన్స్ ఇవ్వండి’ అనడిగా. ‘నువ్ హీరో అయిపోతావ్’ అన్నారు. అలాగే, హీరోనైపోయా. తమిళంలో హీరోగా బిజీ కావడం వల్ల తెలుగులో పెద్దగా ఛాన్సు లు రాలేదనుకుంట!’’ అన్నారు శరత్‌కుమార్. కొంత గ్యాప్ తర్వాత ఆయన చేసిన తెలుగు సినిమా ‘నేనో రకం’. రామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా సుదర్శన్ శైలేంద్ర దర్శకత్వంలో వంశీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీకాంత్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. శరత్‌కుమార్ చెప్పిన సంగతులు. ♦‘నేనో రకం’ వంటి మంచి ఛాన్సులొచ్చిన ప్రతిసారీ తెలుగులో నటించా. ఎమోషన్స్‌తో పాటు మంచి సందేశాత్మక కథతో దర్శకుడు సుదర్శన్ ఈ సినిమా తీశారు. ప్రేమంటే ఏంటి? తల్లిదండ్రుల ప్రేమ.. ఇలా అనేక విషయాలను సినిమాలో చర్చించాం. నా పాత్రతో పాటు హీరో రామ్‌శంకర్ పాత్రను బాగా డిజైన్ చేశారు. నాతో పోటాపోటీగా రామ్‌శంకర్ నటించాడు. సినిమా అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ♦∙చిరంజీవిగారంటే ప్రత్యేకమైన అభిమానం. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనతో సినిమా నిర్మించాలనుకున్నా. మీ రెమ్యునరేషన్ ఎంతని ఆయన్ను అడగ్గా.. ‘నువ్ నాకు డబ్బులిస్తావా! నువ్వు హెల్ప్ అడిగావ్. ముందు సినిమా, మిగతావన్నీ తర్వాత చూసుకుందాం’ అన్నారు. అప్పుడు సినిమా చేయలేకపోయా. కానీ, ఆయనిచ్చిన ధైర్యం మర్చిపోలేను. ‘ఖైదీ నంబర్ 150’లో చిన్న పాత్రైనా చేస్తానని చిరు, వినాయక్‌లను అడిగా. కానీ, కుదరలేదు. అన్నయ్యతో నటించే ఛాన్స్ వస్తే నేనెప్పుడైనా రెడీ. ♦ మా అమ్మాయి వరలక్ష్మి ఒకడి గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. వరలక్ష్మి చెప్పిన విషయాలు వింటే వాడెంత నీచుడో తెలుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, సమాజంలో స్త్రీలకూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం సరి కాదు. ♦ నా వందో చిత్రానికి నేనే దర్శకత్వం వహించా. కానీ, దర్శకత్వం అంత ఈజీ కాదు. ప్రతి క్రాఫ్ట్‌ను దగ్గరుండి చూసు కోవాలి. ప్రస్తుతం నాకంత టైమ్ లేదు. ఇప్పటివరకూ 140 సినిమాల్లో నటించా. ఇప్పుడు ఏదైనా కొత్తగా చేయాలనుంది. ఉదాహరణకు... హిందీలో అమితాబ్ చేస్తున్న పాత్రలు లేదా ‘ధృవ’లో అరవింద్ స్వామి పాత్ర వంటివి. నిర్మాతగా విజయ్ ఆంటోనితో ఒకటి, జీవీ ప్రకాశ్‌తో మరొక సినిమా చేస్తున్నా. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నార్పల ( శింగనమల) : మండలంలోని బొందలవాడ గ్రామ సమీపంలోని తాడిపత్రి – ధర్మవరం ప్రధాన రహదారిపై ఉన్న మలుపు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు .. బొందలవాడకు చెందిన దాసరి వెంకటనారాయణ కుమారుడు శరత్‌కుమార్ (26) నార్పలలో వ్యక్తిగత పని ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో నార్పలకు చెందిన చిలమకూరి గోపాల్ కుమారుడు విజయ్ బొందలవాడలో నరసింహస్వామి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్నాడు. వీరిరువురి వాహనాలు బొందలవాడ సమీపంలోని మలుపువద్ద ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో శరత్‌కుమార్ మరణించాడు. మరో యువకుడు చిలమకూరు విజయ్ పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ రాంప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సరికొత్త థ్రిల్
సాయిరామ్ శంకర్, రేష్మిమీనన్ జంటగా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నేనో రకం’. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రం కొత్తగా ఉంటుంది. సాయిరామ్–శరత్ కుమార్ల నటన, వారిద్దరి మధ్య సన్నివేశాలు ఆడియన్స్‌కు సరికొత్త థ్రిల్‌ను కలిగిస్తాయి. మహిత్ స్వరపరచిన పాటలను టాప్ సెలబ్రిటీస్ త్వరలో రిలీజ్ చేస్తారు’’ అన్నారు. ‘‘మా చిత్రం ప్రేక్షకులను అలరించటంతో పాటు, ఆలోచింపచేసేలా ఉంటుంది. ఆసక్తికరమైన కథతో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాం’’ అని సాయిరామ్ శంకర్ చెప్పారు. ‘‘మా చిత్రానికి కథే హైలెట్. ఈ నెల 17న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
హీరో కూతురికీ తప్పని లైంగిక వేధింపులు
మళయాళ నటి కిడ్నాప్, లైంగిక దాడి ఆరోపణల కేసు సృష్టించిన సంచలనం ఇంకా వీడిపోక ముందే మరో తమిళ నటి తనపై ఇటీవల జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టి సంచలనం సృష్టించారు. తమిళంలో ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె, స్వయంగా హీరోయిన్ కూడా అయిన వరలక్ష్మి తనపై చోటుచేసుకున్న వేధింపుల విషయాన్ని వెల్లడించారు. తాను ఇటీవల ఒక టీవీ చానల్‌కు వెళ్లినప్పుడు అక్కడి ప్రోగ్రాం హెడ్ అసభ్య వ్యాఖ్యలు చేయడంతో అక్కడినుంచి బయటకు వచ్చేశానన్నారు. అతడు దారుణంగా మాట్లాడాడని, తనను వేధించాడని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిత్రసీమలో హీరోయిన్లపై కూడా వేధింపులు వెలుగు చూడటం దారుణంగా ఉందని తెలిపారు. ట్విట్టర్లో ఈ అంశంపై ఆమె ఒక భారీ లేఖ పోస్ట్ చేశారు. (వరలక్ష్మి లేఖ పూర్తి పాఠానికి ఇక్కడ క్లిక్ చేయండి) అసలు ఈ సమాజంలో ఏం జరుగుతోందని, మహిళల భద్రత అనేది జోక్‌గా మారిపోయిందని ఆమె మండిపడ్డారు. ఈ వెధవలను ఉరి తీయాలన్నారు. మళయాళ నటికి మద్దతు పలుకుతున్నానని, వాళ్లకు శిక్ష పడి తీరుతుందని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ పెట్టిన సందర్భంలోనే ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని కూడా ఒక భారీ లేఖ రూపంలో ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని బయట పెట్టాలా వద్దా అని రెండు రోజులుగా మధనపడుతున్నానని, చివరకు చెప్పి తీరాలని గట్టిగా నిర్ణయించుకుని మరీ రాస్తున్నానని అన్నారు. ఒక ప్రముఖ టీవీ చానల్ ప్రోగ్రామింగ్ హెడ్‌తో తాను సమావేశంలో పాల్గొన్నానని, ఒక అరగంట తర్వాత సమావేశం ముగుస్తోంది అనగా అతడు తనను ''మనం బయట ఎక్కడ కలుద్దాం'' అని అడిగాడని, ఏదైనా పని కోసమా అని తాను అడగ్గా.. కాదని, ఇతర విషయాల కోసమని అతగాడు అన్నట్లు ఆమె తెలిపారు. తాను కోపంగా అక్కడినుంచి వెళ్లిపోవాలని అతడికి చెప్పానన్నారు. సినిమా పరిశ్రమతో పాటు బయట కూడా పరిస్థితులు ఇలాగే ఉన్నాయని, పరిశ్రమలోకి తాను శరీరాన్ని అమ్ముకోడానికి రాలేదని, మహిళలపై జరుగుతున్న దోపిడీ ప్రమాణాలను పాటించడానికి కూడా రాలేదని చెప్పారు. తనకు నటన అంటే ఇష్టమని, ఇలాంటి అఘాయిత్యాలను అడ్డుకుని, వాటిపై బయటకు మాట్లాడాలన్నదే తన ఉద్దేశమని అన్నారు. పురుషులకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉందని, వాళ్లు మహిళలను అగౌరవపరచడం మానుకోవాలి లేదా బయటకు పోవాలని ఆవేశంగా ఆ లేఖలో వరలక్ష్మి రాశారు. తాను ఒక నటినని, వెండితెర మీద గ్లామరస్‌గా కనిపించినంత మాత్రాన తన గురించి ఎలా పడితే అలా మాట్లాడతానంటే కుదరదని స్పష్టం చేశారు. తన జీవితం, తన శరీరం తన ఇష్టమని, ఏ మగాడూ కూడా తనను అగౌరవంగా చూసి సులభంగా వెళ్లిపోతానని అనుకోకూడదని వరలక్ష్మి అన్నారు. ఇది చిన్న విషయమని, ఏమీ జరగలేదని అనుకునేవాళ్లు కూడా ఉంటారని, అయితే ఇది టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ మాత్రమేనని తెలిపారు. అదృష్టవశాత్తు తాను సురక్షితంగా బయటపడ్డాను గానీ, దీనివల్ల చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడే అవకాశం తనకు లభించిందని తెలిపారు. కేవలం సినీ పరిశ్రమలోనే కాక.. అన్ని రకాల పరిశ్రమలు, ఆర్థిక పరిస్థితులు, సంస్కృతులు, వయసులో కూడా ఇలాంటి వేధింపులు ఉంటున్నాయని, మనది పురుషాధిక్య సమాజం కావడంతో మహిళలను వస్తువులుగా చూస్తూ అసమానతలు పెంచుతున్నారని ఆవేశంగా చెప్పారు. మహిళల భద్రత అనేది కేవలం ఒక కలగా మిగిలిపోయిందని, మన సమాజం నుంచి 'రేప్' అనే పదం ఎప్పటికీ తొలగిపోదా అని ఆమె ప్రశ్నించారు. తాను మౌనంగా ఊరుకునేది లేదని, తన స్నేహితులు, చెల్లెళ్లు కూడా మౌనాన్ని వీడాలని తెలిపారు. మీరు ఒంటరి కారని.. తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. What the hell is going on??!!! #WomenSafety has become a joke.. hang those bloody b@st@rds.. strength to #bhavna ... they will be punished — varu sarathkumar (@varusarath) 19 February 2017 Needs to be said..!! pic.twitter.com/GjJimBIKd3 — varu sarathkumar (@varusarath) 20 February 2017 -
హీరో కూతురికీ తప్పని లైంగిక వేధింపులు
-
క్రితిక దర్శకత్వంలో విజయ్‌ఆంటోని
సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు.సంగీతదర్శకుడుగా, కథానాయకుడిగా జోడు గుర్రాల సక్సెస్ స్వారీ చేస్తున్న ఈయన పిచ్చైక్కారన్ చిత్రంతో అసాధారణ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత నటించిన సైతాన్ ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రస్తుతం యమన్ గా తెరపైకి రావడానికి రెడీ అవుతున్న విజయ్‌ఆంటోని తదుపరి రెండు చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ స్వంత నిర్మాణ సంస్థలోనే నటించిన ఈయన తొలిసారిగా బయట సంస్థల్లో నటించనున్నారు.అందులో ఒకటి రాధిక, శరత్‌కుమార్ నిర్మించనున్న చిత్రం. ఇది త్వరలో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. తాజాగా మరో చిత్రానికి విజయ్‌ఆంటోని సైతాన్ చేశారని తెలిసింది.ఇంతకు ముందు శివ, ప్రియఆనంద్ జంటగా వణక్కంచెన్నై వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన క్రితిక ఉదయనిధిస్టాలిన్ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.ఇందులో విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటించనున్నారట.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
రాజకీయ సినిమా
-
జయ మృతిపై మరో సీనియర్ నటుడి లేఖాస్త్రం!
ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన శరత్‌కుమార్ చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రముఖ నటి గౌతమి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయగా.. తాజాగా సీనియర్ నటుడు, ఆలిండియా సమథువ మక్కల్ కచ్చి అధినేత శరత్‌కుమార్ కూడా ఇదే విషయమై లేఖ రాశారు. జయలలిత ఆస్పత్రిపాలు కావడం, ఆ తర్వాత కోలుకోవడం, ఆ వెంటనే మృతి చెందడం మిస్టరీగా కనిపిస్తున్నదని, ఈ విషయంలో తలెత్తిన తీవ్ర ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని గౌతమి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా గౌతమి లేఖను పరోక్షంగా తప్పుబడుతూ.. ఆమెపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ తన ఫేస్బుక్ పేజీలో ప్రధానికి శరత్‌కుమార్ లేఖాస్త్రం సంధించారు. జయలలిత మృతి విషయంలో కొందరు తమకు తాము సామాన్య పౌరులుగా చెప్పుకుంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సర్వోన్నతమైన అధికారులు జయలలితకు అందించిన చికిత్సను పర్యవేక్షించినా.. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం, క్రూరమైన దాడులు చేయడం బాధ, దిగ్భ్రాంతి కలిగిస్తున్నదని పరోక్షంగా గౌతమిని దుయ్యబట్టారు. ఈ నిరాధార ఆరోపణలు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని కించపరచడమేనని పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా జయలలిత జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులపై సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ఆరోపణలు చేయడం, వాటిని ప్రధానికి నివేదించడం తన వైపు అందరి చూపు తిప్పుకొనే ఎత్తుగడ మాత్రమేనని శరత్‌కుమార్ విమర్శించారు. ఆయన పూర్తి లేఖ ఇది.. (ఆంగ్లంలో) To The Prime Minister of India Dear Modiji The recent attacks by few - so called - common citizens, have no ground in making such anguish, suspecting the entire execution of medical attention, constant monitoring by the supreme authorities both the state and the central governments. It is shocking and saddening to come across such baseless comments and brutal attacks. It is a baseless allegation demeaning the character of all of us in the state. It is a clear attention seeking tactics by addressing one's concerns on Social Media to the Prime Minister throwing allegation directly or indirectly on personalities whose roles have been very significant in the life our beloved Chief minister for many decades. As a common citizen again, I have some basic questions to those Social Media Savvy few who have numerous questions in mind. 1. During hospitalisation of the late honourable Chief Minister, the Governor, representing the Central Government had visited the hospital and released statements where there was never a mention of him being denied access and if he was, has he withheld any truth? If the truth was withheld, was he compelled to do so? Can anyone compel The Governor to say anything which is not the truth? Three senior central ministers representing the Central Government and the Honourable Prime Minister, had visited and met the press outside the hospital. In all their interviews, no where did they mention denial of accessibility nor treatment was inadequate or incompetent. They always mentioned international standard of medical care to her which was always supported by Dr Richard Beale from London and medical experts from AIIMS. If that is the case, where is the question of any hidden truth which was not revealed? Can the Central Ministers be compelled by anyone to hide the truth or speak otherwise? 3. Under the constitution of India, more specifically Article 19, people have the freedom of expression; but at the same time, slandering without any relevance and truth may cause huge damage to the sentiments of the already wounded hearts. 4. The Governor, The Central Ministers, Tamilnadu government and its authorities, Apollo Hospital, AIIMS Doctors, Dr Richard Beale from London and people who were taking care of her have been insulted by such comments. All their tireless efforts and services during the last 75 days have been now ridiculed by such baseless and senseless comments. Medical profession is considered the Noblest in the world, but ridiculing their selfless efforts and services hurt them the most. Every medical update was official and it was all released with utmost accuracy and authenticity. So, when people make such baseless allegations, Dear Prime Minister, are they actually undermining your systems and the values? I am sincerely seeking a reply from you to put an end to the untruths which is actually belittling your office, the state of Tamilnadu and our constitution itself. Thank you With warmest regards R Sarathkumar -
రాధారవిపై నిషేధం చెల్లదు : హైకోర్టు తీర్పు
తమిళసినిమా: నడిగర్ సంఘానికి ఎదురు దెబ్బ తగిలింది. నడిగర్ సంఘంలో అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు మోపబడ్డ ఆ సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, రాధారవి, వాగై చంద్రశేఖర్‌లను సభ్యత్వం నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ఇటీవల సంఘ నూతన కార్యవర్గం వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా తనను సంఘం నుంచి నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సంఘ మాజా కార్యద ర్శి రాధారవి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తి సుందరేశన్ సమక్షంలో విచారణకు వచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తి సుందరేశన్ రాధారవిపై నిషేధం చెల్లదంటూ తీర్పునిచ్చారు. -
విశాల్ క్లారిటీ ఇచ్చాడు
తమిళనాట సినిమాలతో పాటు సినీ రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేస్తున్న యంగ్ హీరో విశాల్. వరుస హిట్స్‌తో హీరోగా మంచి ఫాం కొనసాగిస్తునే నడిగర్ సంఘం నేతగా కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో ప్రేమాయణం వార్తలతో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. చాలా కాలంగా విశాల్, వరలక్ష్మిల మధ్య ఏదో ఉందంటూ చర్చ జరుగుతున్నా.. క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ముఖ్యంగా నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శరత్ కుమార్, విశాల్ ముఖాముఖి తలపడటంతో.. ఇక విశాల్, వరలక్ష్మి కలవటం అసాధ్యం అనుకున్నారు. కానీ అన్ని అనుమానాలకు చెక్ పెడుతూ ఒక్క ఫొటోతో మొత్తం క్లారిటీ ఇచ్చేశాడు విశాల్. వరలక్ష్మితో కలిసి తీసుకున్న ఓ సెల్పీ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన విశాల్, అన్ని ప్రశ్నలకు ఈ ఫొటోనే సమాధానం చెబుతుందంటూ కామెంట్ చేశాడు. విశాల్ ఉద్దేశం ఏంటో తెలియదు గానీ, సినీ వర్గాలు మాత్రం ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం మీదే విశాల్ క్లారిటీ ఇచ్చాడని భావిస్తున్నారు. విశాల్ ఫొటో పోస్ట్ చేసిన సమయంలో శరత్ కుమార్ అస్వస్థతకు గురికావటం కూడా హాట్ టాపిక్‌గా మారింది. Dis pic says it all. pic.twitter.com/SFL6nBfdDx — Vishal (@VishalKOfficial) 26 June 2016 -
డబ్బుతో పట్టుబడ్డ హీరో
ట్యుటికొరిన్: తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ శనివారం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్న డబ్బుతో పట్టుబడ్డారు. 'ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి' అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాఏడీఎంకేతో పొత్తుతో తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. తాను పోటీచేస్తున్న నియోజకవర్గానికి సమీపంలోనే ఎన్నికల అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆయన కారులో 9 లక్షల రూపాయలతో పట్టుబడ్డారు. ఈ డబ్బుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపించడంలో శరత్ కుమార్ విఫలమయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును ట్రెజరీలో డిపాజిట్ చేసినట్లు వారు వెల్లడించారు. మే 16న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటివరకు 80 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు నేరుగా ఇలా డబ్బుతో పట్టుబడటం మాత్రం ఇదే తొలిసారి. హీరోయిన్ రాధిక భర్త అయిన శరత్ కుమార్.. ఇలా పట్టుబడ్డారు గానీ, తమిళనాడు ఎన్నికల్లో భారీ మొత్తంలో ధన ప్రవాహం సాగుతోందని జాతీయ మీడియా గగ్గోలు పెడుతోంది. పట్టుబడింది ఆవగింజలో ఆరోవంతేనని, ఇంకా చాలా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని చెబుతున్నారు. -
ఎన్నికల పోరు...తారల హోరు
అన్ని పార్టీల్లోనూ కనబడుతోన్న తారల సందడి రాజకీయాలకు తోడవుతోన్న సినీ గ్లామర్ కాంగ్రెస్‌కు మద్దతుగా కుష్బూ, అన్నాడీఎంకే మద్దతుగా శరత్‌కుమార్ ప్రచారం తమిళసినిమా: ఎన్నికలు రాజకీయ నాయకులకు మాత్రమే కాదు సినిమా తారలకూ హడావిడే. ఎందుకంటే ఈ రెండు రంగాలను ఇప్పుడు వేరుగా చూడలేని పరిస్థితి కాబట్టి. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వాన్ని ఏలుతున్న వారు, ఏలాలని ఆశపడుతున్న వారిలో అధిక శాతం చిత్ర పరిశ్రమకు చెందిన వారేనన్నది గమనార్హం. ఇక్కడ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల సమరానికి సరిగ్గా 15 రోజులే ఉంది. ఈ పోరులో గెలుపే లక్ష్యంగా అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, బీజేపీ తలపడుతున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎవరి ఊహలకనుగుణంగా వారు ఇప్పటికే ప్రచారభేరి మోగిస్తున్నారు. వారికి సినీ తారల కళ తోడవుతోంది. వీరు తమ గ్లామర్ అనే ఆయుధంతో ప్రత్యర్థులపై అస్త్రశస్త్రాలు సంధించడానికి సిద్ధం అయ్యారు. ఏ తారలు ఏ పార్టీకి మద్దతు: దాదాపు అన్ని పార్టీలలోనూ తారల సందడి కనిపించడం విశేషం. అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా నటుడు రామరాజన్, ఆనంద్‌రాజ్, సెంథిల్, మనోబాలా, పొన్నంబలం, గుండు కల్యాణం, సింగముత్తు, వైయాపురి, నటి వింధ్య, ఫాతిమాబాబు అంటూ పెద్ద పటాలమే ప్రచార గోదాలోకి దిగింది. వీరంతా 234 శాసనసభ స్థానాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇక సమత్తువ కట్చి నేత శరత్‌కుమార్ కూడా అన్నాడీఎంకే పార్టీ గెలుపునకు తన వంతు ప్రచారం చేస్తున్నారు. ఆయన పోటీ చేస్తున్న తిరుచెందూర్ సెగ్మెంట్లో ఆయన విజయానికి నటి రాధికా శరత్‌కుమార్ ప్రచారం చేస్తున్నారు. నటి కుష్భు ప్రచారం: ఇక కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్న నటి కుష్భు కాంగ్రెస్-డీఎంకే కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా ఇటీవలే డీఎంకే తీర్థం పుచ్చుకున్న బుల్లితెర, వెండితెర నటుడు ఇమాన్ అన్నాచ్చి ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. నటుడు వాసు విక్రమ్ బోస్ వెంకట్ తదితరులు ఆ పార్టీకి మద్దతుగా గళమెత్తుతున్నారు. ఇక భారతీయ జనతా పార్టీకి మద్దతుగా సంగీత దర్శకుడు గంగైఅమరన్, నటి గాయత్రి రఘురామ్ తదితరులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి నడుం బిగించారు. -
ఇప్పుడు శరత్ కుమార్ వంతు
సాక్షి, చెన్నై : ఇన్నాళ్లు కార్యకర్తల మీద విరుచుకుపడ్డ విజయకాంత్‌ను చూశాం. ఇప్పుడు శరత్ వంతు వచ్చినట్టుంది. వ్యాన్ నుంచి దిగి మరీ అంతు చూస్తా అని బెదిరించడం ఆత్తూరు ఓటర్లను విస్మయంలో పడేసిందట.తన ప్రసంగానికి ఎవరైనా అడ్డు పడినా, ఇష్టారాజ్యంగా వ్యవహరించినా, తాను చెప్పింది వినకున్నా, చితక్కొట్టే నాయకుడు విజయకాంత్. ఇప్పటి వరకు ఆయన చేతిలో ఎందరో దెబ్బలు తిన్నారు. చివాట్లు ఎదుర్కొన్నారు. ఆయన బెదిరింపుల్ని ప్రత్యక్షంగా ఇన్నాళ్లు ఓటర్లు తిలకించిన సందర్భాలు అనేకం. అదే బాటలో ప్రస్తుతం శరత్ నడిచేందుకు సిద్ధ పడ్డట్టుంది. అందుకు తగ్గట్టుగా వ్యవహరించి ఆత్తూరు ఓటర్లను ముక్కుమీద వేలు వేసుకునే లా చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా సినీ నటుడు శరత్‌కుమార్ ప్రచారం సాగిస్తున్నారు. ఆత్తూరు ఎన్నికల బరిలో ఉన్న మంత్రి నత్తం విశ్వనాథన్‌కు మద్దతుగా ప్రచార వాహనంలో శరత్ దూసుకొచ్చారు. తిత్తల్ పట్టి వద్ద ఆయన ప్రచార రథం ఆగింది. అక్కడి వేదిక వద్ద ప్రసంగం మొదలెట్టారు. ఈ సమయంలో జనం వైపు నుంచి సాత్తూరు డీఎంకే కోట, ఇక్కడ పాగా వేయలేరంటూ వచ్చిన నినాదం శరత్‌కు కొపాన్ని తెప్పించిందట. అంతే చటుక్కున వేదిక దిగి వచ్చి మరీ ఎవడ్రా..ఎవడ్రా అంటూ సినీ బానీలో డైలాగులు చెప్పడమే కాకుండా, అంతు చూస్తా...నేనేమిటో చూపించాల్సి ఉంటుందని గర్జించడంతో ఓటర్లు నివ్వెర పోయారట. ఇంతలో మేల్కొన్న మంత్రి నత్తం విశ్వనాథన్ చటుక్కున శరత్‌ను వ్యాన్ వైపుగా లాక్కెళ్లడంతో అక్కడ పరిస్థితి కాస్త కుదుట పడిందట. అయితే, ఇన్నాళ్లు విజయకాంత్ ఒక్కడే కొపంతో గర్జించే నాయకుడిగా అందరి నోట నానుతుంటే, ఇప్పుడు ఆ బాటలో శరత్ సాగి సెటైర్లు ఎదుర్కొనే పనిలో పడ్డారు. ఇది శరత్‌కు అవసరమా?అని పెదవి విప్పే వాళ్లూ ఉన్నారు. -
శరత్‌కుమార్‌పై ఫిర్యాదు
చెన్నై : శరత్‌కుమార్‌పై నడిగర్ సంఘం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. శరత్‌కుమార్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో సంఘం ట్రస్ట్‌లో భారీ అవినీతి జరిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.గురువారం ఉదయం సంఘ నిర్వాహకులు పూచ్చి మురుగన్ నేతృత్వంలో న్యాయవాది కృష్ణతో కలిసి నగరంలోని పోలీస్‌కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా: శరత్
టీనగర్ : తెన్కాశి నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేస్తానని సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్ తెలిపారు. శరత్‌కుమార్ గత ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ కూటమి తరఫున తెన్‌కాశీలో పోటీ చేసి గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో సమత్తువ మక్కల్ కట్చి అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలగింది. ఆయన మాట్లాడుతూ అన్నాడీఎంకేలో చేరడం ద్వారా తమ పార్టీ అభివృద్ధి కుంటుపడినట్లు భావిస్తున్నానన్నారు. గత ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రాకూడదనే భావన ప్రజల్లో ఉందని, అందువల్ల అన్నాడీఎంకే కూటమిలో విజయకాంత్ చేరడంతో తాను చేరానన్నారు. తాను గెలుపొందిన తర్వాత తెన్కాశి నియోజకవర్గంలో ఇచ్చిన వాగ్దానాలల్లో 75 నుంచి 80 శాతం నెరవేర్చానన్నారు. తెన్కాశిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటుచేసేందుకు ప్రయత్నించానని, అది నెరవేరకపోవడం నిరాశకు గురించేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెన్కాశి నియోజక వర్గం నుంచే పోటీ చేస్తానని తెలిపారు. -
శ్రీవారి సేవలో రాధిక శరత్‌కుమార్
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాధిక, శరత్‌కుమార్ దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ వీరామ సమయంలో వారు స్వామి దర్శనం చేసుకున్నారు. వారికి టీటీడీ అధికారులు స్వామి వారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. -
ఆరోపణలు నన్నెంతో బాధించాయి:శరత్ కుమార్
చెన్నై: ఎస్పీఐ సంస్థతో చేసుకున్న నడిగర్ సంఘం భవన నిర్మాణ ఒప్పందాన్ని సెప్టెంబర్ 29 వ తేదీనే రద్దు చేసినట్టు సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్ ప్రకటించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల ఫలితాలు ఆదివారం రాత్రి వెలువడిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పాండవర్ జట్టు ఘన విజయం సాధించింది. అపజయాన్ని సవినయంగా స్వీకరిస్తున్నట్లు శరత్‌కుమార్ జట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో నటుడు శరత్‌కుమార్ సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో నిర్మాణ ఒప్పందం రద్దు పత్రాన్ని మీడియాకు చూపించారు. తనపై సదాభిప్రాయం ఉండడం వల్లే ఎస్పీఐ సంస్థ ఒప్పందాన్ని రద్దు చేయడానికి అంగీకరించిందన్నారు. ఈ విషయంలోనే తనపై ప్రత్యర్థులు పలు ఆరోపణలు చేశారనీ, అవన్నీ నిరాధారమని, ఒప్పందం రద్దుతో ఈ విషయం నిరూపణ అయిందని అన్నారు. అయితే ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు తనను ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒప్పంద రద్దు పత్రాలను కొత్త కార్యవర్గానికి అందిస్తానని చెప్పారు. తనకు గౌరవ పదవులను ఇస్తానంటే అంగీకరించనని, గత 30 ఏళ్లుగా నడిగర్ సంఘానికి వివిధ రకాలుగా సేవలు అందించానని అన్నారు. వారు కోరితే ఇకపై కూడా తన సేవలు కొనసాగుతాయని చెప్పారు. నడిగర్ సంఘం ప్రాంగణంలో నాజర్, విశాల్ ఇదిలా ఉండగా, నడిగర్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నాజర్, విశాల్ తదితరులు హబీబుల్లా రోడ్డులోని నడిగర్ సంఘం స్థలాన్ని సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. నడిగర్ సంఘం పేరు మార్చాలన్న కోర్కెపై మీడియా అడిగిన ప్రశ్నకు సంఘం అధ్యక్షుడు నాజర్ సమాధానం ఇస్తూ, ఎన్నికలు ముగిసి ఒక్కరోజు కూడా ముగియలేదు, మరుసటి రోజునే పేరును మార్చలేం కదా అని వ్యాఖ్యానించారు. శరత్‌కుమార్ మీడియా సమావేశంపై విశాల్ స్పందిస్తూ, నడిగర్ సంఘం భవనానికి సంబంధించిన ఒప్పందం రద్దు పత్రాన్ని పరిశీలించిన తరువాతనే వ్యాఖ్యానిస్తానని అన్నారు. అయినా ఒప్పందం పత్రం రద్దు గురించి సర్వసభ్య సమావేశంలో శరత్‌కుమార్ ప్రకటించాల్సి ఉంటుందని విశాల్ అన్నారు. సీనియర్ నటి సచ్చు తదితరులకు శాశ్వత సభ్యత్వ పత్రాలను అందించారు. కరుణ శుభాకాంక్షలు నడిగర్ సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన పాండవర్ జట్టుకు డీఎంకే అధినేత కరుణానిధి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సమయంలో తలెత్తిన విభేధాలను విడిచి సంఘం సంక్షేమానికి పాడుపడాలని ఆయన కోరారు. -
రజినీ, కమల్ జోక్యం చేసుకోవాలి
నడిగర్‌సంఘం వ్యవహారం రోజురోజుకు జటిలం అవుతోంది. ఇటు ప్రస్తుత సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, రాధారవి వర్గం, అటు నటుడు విశాల్ వర్గం మద్య పోటీతత్వం పెరిగిపోతోంది. ఎవరూ తగ్గేది లేదన్నట్టుగా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. గెలుపుపై కూడా ఎవరికి వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వివాదం కోర్టు గుమ్మం ఎక్కింది. చెన్నై హైకోర్టు సంఘం ఎన్నికలపై స్టే విధించడంతో ఒక వర్గం పండగ చేసుకుంటుంటే మరో వర్గం కోర్టులో మరో పిటీషన్ వేయడానికి సిద్ధం అవుతోంది. సంఘం సభ్యులతో పాటు సినీ పరిశ్రమ వర్గాలు ఈ వ్యవహారం ఎటు వైపు దారి తీస్తుందోనంటూ కలత చెందుతున్నారని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు, నామ్‌తమిళర్ పార్టీ నేత సీమాన్ శనివారం తిరుచ్చిలో పాల్గొన్న ఒక కార్యక్రమంలో నడిగర్ సంఘం వ్యవహారంపై స్పందిస్తూ చిత్ర పరిశ్రమ మేలుకోరే నటులు కమలహాసన్, రజినీకాంత్‌లు జోక్యం చేసుకుని సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. -
నా మద్దతు నాన్నకే
చెన్నై : ప్రస్తుతం కోలీవుడ్‌లో ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు.కారణం అందరికీ తెలిసిందే. త్వరలో జరగనున్న దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలకు ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.అందులో ప్రస్తుత సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ ఒక వర్గంగానూ నటుడు విశాల్ బృందం వర్గంగానూ పోటీకి సిద్ధం అవుతున్నాయి. శరత్‌కమార్ వర్గం విజయం తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తుంటే, ఓడిపోయినా పర్వాలేదు పోటీ చేసే తీరుతాం అంటున్నారు విశాల్ వర్గం.అంతేకాదు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.అదే సమయంలో ఊరూరా తిరిగి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే శరత్‌కుమార్‌కు విశాల్‌కు మధ్య వైరానికి కారణం నటి వరలక్ష్మినేనని,ఆమే శరత్‌కుమార్ పైకి విశాల్‌ను ఉసిగొల్పుతున్నారని సోషల్ నెట్‌వర్క్స్‌లో ప్రచారం హల్చల్ చేస్తోంది. నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కూతురన్న విషయం గమనార్హం. అలాగే విశాల్‌కు వరలక్ష్మి శరత్‌కుమార్ కి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయనే వదంతులు చాలా కాలంగా హోరెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నడిగర్ సంఘం ఎన్నికల్లో నటి వరలక్ష్మి మద్దతు విశాల్‌కే ఉంటుందనే ఊహాగానాలు ఇంటర్నెట్లలో దుమారం రేపుతున్నాయి. ఇలాంటి ప్రచారంపై ఇప్పటివరకు పట్టించుకోని నటి వరలక్ష్మి తాజాగా ఘాటుగా స్పందించారు.సోషల్నెట్వర్క్స్లో అసత్యాల్ని ప్రచారం చేసేవారంతా కళ్లులేని కబోదులని తన ట్విట్టర్లో విమర్శించారు. తన మద్దతు ఎప్పుడూ తన తండ్రికే ఉంటుందని వరలక్ష్మి కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడించారు. -
అందులో రాజకీయాలు లేవు
తమిళసినిమా: నడిగర్ సంఘం ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పోటీ వర్గాల్లో సెగలు పుడుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. మరోపక్క తామే గెలుస్తామని ఎవరికి వారు మేకపోతు గాంభీర్యం వెలిబుచ్చుతున్నారు. అదే సమయంలో సంగం సభ్యుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. గురువారం ప్రస్తుతం సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి జట్టు మళ్లీ పోటీకి సిద్ధమైంది. వీరికి పోటీగా నటుడు విశాల్ జట్టు బరిలోకి దిగుతోంది. కాగా శరత్‌కుమార్ గురువారం మదురై వెళ్లి అక్కడి నటనారంగ కళాకారుల మద్దతు కోరే ప్రయత్నం చేశారు. అక్కడే ఆధ్యాత్మిక పీఠాన్ని సందర్శించి, విలేకరులతో మాట్లాడారు. నడిగర్ సంఘం విషయంలో కొందరు రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నటుడు విశాల్ మదురైలో మాట్లాడుతూ నడిగర్ సంఘం విషయంలో ఎవరూ రాజకీయాలు చేయడం లేదని శరత్‌కుమార్ వ్యాఖ్యలకు బదులిచ్చారు. ఆ కోరికలు అంగీకరిస్తే.. విశాల్ మాట్లాడుతూ తమ న్యాయమైన కోరికలను శరత్‌కుమార్ అంగీకరిస్తే తాను ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలుగుతామని అన్నారు. అందులో ముఖ్యమైంది సంఘం భవన నిర్మాణం చేపట్టాల న్నారు. అందుకు తామంతా ఒక చిత్రంలో ఫ్రీగా నటించి నిధిని సమకూర్చడానికి సిద్ధమన్నారు. ఈ సినీ దిగ్గజాలు నాటక రంగం నుంచి వచ్చిన దివంగత మహానటులు ఎంజీఆర్, శివాజీగణేశన్ వంటి పలువురు నెలకొల్పిన సంఘం నడిగర్ సంఘం అన్నారు. ఈ సంఘంలో రంగస్థల నటులు ఒక అంగం అన్నారు. అలాంటి సంఘంలో ఏర్పడిన సమస్యల పరిష్కారం కోసమే తాము ఇక్కడికి వచ్చామని అన్నారు. రంగస్థల నటులను డబ్బుతో మభ్యపెట్టి తమ పక్క తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఫిర్కాదులు అందుతున్నాయన్నారు. అలా నాటక కళాకారులకు డబ్బులిస్తే సంతోషమేనన్నారు. కళాకారులు లేకపోతే సినీ కళాకారులు లేరని విశాల్ పేర్కొన్నారు. ఆయనతో పాటు నటుడు కార్తీ, నాజర్ తదితరులు ఉన్నారు. -
జయ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు వచ్చారంటే..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మద్రాస్ యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు శరత్ కుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, జయ ఇష్టసఖి శశికళ, కుమారుడు సుధాకర్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రజనీకాంత్, శరత్ కుమార్ పక్కపక్కనే ఆశీనులయ్యారు. అలాగే అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అమ్మ పట్టాభిషేకానికి తరలి వచ్చారు. గవర్నర్ రోశయ్య ..జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఆమెను అభినందించారు. ఆ తర్వాత మంత్రులంతా సామూహికంగా ప్రమాణ స్వీకారం చేశారు. -
ఇదేమి మాయ
జగమే మాయ అంటారు. అందులో సినిమా ఇంకా మాయ. అలాంటి మాయా ప్రపంచంలో ఇదు ఎన్న మాయం (ఇదేమి మాయ) చిత్రం రూపొందుతోంది. మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై నటుడు శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్, లిస్టన్ స్టీఫెన్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో యువ నటుడు విక్రమ్ ప్రభు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక తేనాంపేటలోని హైయత్ హోటల్లో జరిగింది. చిత్ర దర్శక, నిర్మాతలు ఏ మాయ చేశారో గానీ చిత్ర పరిశ్రమ తరలి వచ్చిందా అనిపించింది. అక్కడ సినీ ప్రముఖులను చూస్తే తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను, తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, ఆర్ కె సెల్వమణి, వసంత్, కె ఎస్ రవికుమార్, ప్రియదర్శన్, రామ్‌కుమార్, ప్రభు, ఎ ఎల్ అళగప్పన్, జి.వి.ప్రకాష్ కుమార్, సైదైరవి, మేనకా సురేష్, సుహాసిని, అమలాపాల్, మీనా, నవదీప్, నాజర్, టి.శి, పెప్సీ శివ, పి ఎల్ తేనప్పన్, కదిరేశన్, అరుళ్మణి ఇలా పలువురు చిత్ర ప్రముఖులు హాజరై ఇదు ఎన్న మాయం చిత్ర పాటలు, చిత్రం విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. కుంకీ చిత్రంతో విజయ పరంపరను కొనసాగిస్తున్న విక్రమ్ ప్రభు నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా నటి మీనన్ సురేష్ వారసురాలు కీర్తి సురేష్ హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఇది సరికొత్త ప్రేమ కథా చిత్రం అని దర్శకుడు విజయ్ వెల్లడించారు. ఈ మ్యూజికల్ ఎంటర్టైనర్ చిత్ర ఆడియోను దర్శకుడు విజయ్ గురువు ప్రియ దర్శన్ ఆవిష్కరించగా నటుడు ప్రభు తొలి ప్రతిని అందుకున్నారు. -
ప్రేమలోకంలో విహరిస్తూ...
హీరో సాయిరామ్‌శంకర్ హీరోయిన్ రేష్మీమీనన్‌తో ప్రేమలో పడ్డారు. నిజంగా కాదులెండి...! సినిమాలో మాత్రమే...! వీరిద్దరూ జంటగా సుదర్శన్ దర్శకత్వంలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు పాటలు మినహా టాకీ పార్టు పూర్తి చేసుకుంది. అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ-‘‘మంచి టీమ్‌తో కలిసి పనిచేస్తున్నా. నా కెరీర్లో ఓ స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది’’ అని చెప్పారు. ‘‘దర్శకుడు సుదర్శన్ చెప్పిన కథాకథనాలు నచ్చాయి. పెద్ద సినిమాల ఆఫర్లు వచ్చినా వాటిని కాదని ఈ సినిమా ఒప్పుకున్నా. కచ్చితంగా మంచి సినిమా అవుతుంది’’ అని శరత్ కుమార్ అన్నారు. ఈ వారంలో టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్ధ్, సంగీతం: మహిత్ నారాయణ్, సమర్పణ: వంశీధర్ రెడ్డి. -
విలన్‌గా శరత్‌కుమార్
నటుడు శరత్‌కుమార్ కొంచెం గ్యాప్ తరువాత పూర్తిగా ఇన్వాల్ అయి ఆయనే కథను వండి చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుని కథా నాయకుడిగా నటించిన చిత్రం సండమారుతం. అంతేకాదు ప్రతి నాయకుడిగాను ఆయనే నటించడం విశేషం. మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి రాధికా శరత్‌కుమార్, ఎస్టిన్ స్టీపెగ్లు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించారు. ఇంతకుముందు ఏయ్ వంటి కొన్ని విజయవంతమైన చిత్రాలను శరత్‌కుమార్ హీరోగా తెరకెక్కించిన దర్శకుడు ఎ.వెంకటేశ్ ఈ చిత్రానికి దర్శక బాధ్యతలు నిర్వహించారు. మీరానందన్, ఓవియ నాయికలుగా నటించిన ఈ చిత్రంలో రాధారవి, సముద్రకణి, టాలీవుడ్ నటుడు నరేష్, తంబిరామయ్య, ఇమాన్ అన్నాచ్చి, వెన్నిరాడైమూర్తి, సింగం పులి, నళిని తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సర్వేశ్వరన్ (శరత్‌కుమార్) అనే కరుడుగట్టిన దాదా మదురై దాని చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను, పోలీసుల్ని కూడా ఎలా హడలెత్తించారు. ఈ పాత్రలో శరత్‌కుమార్ విజృంభించారు. అందుకు కారణాలేమిటి? అన్నదే సండమారుతం చిత్ర కథ. పోలీసు అధికారి సూర్య (మరో శరత్‌కుమార్) సర్వేశ్వరన్‌ను ఎదుర్కొనడానికి ఎలాంటి వ్యూహం పన్నారు? దాన్ని ఫలితం ఏమిటి? అన్న పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో ఉత్కంఠ భరిత యాక్షన్ సన్నివేశాలతో దర్శకుడు ఎ.వెంకటేశ్ తెరపై ఆవిష్కరించిన సండమారుతం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా 390 థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులు విశేష ఆదరణను చూరగొనడంతో తొలి రోజు సాయంత్రమే అదనంగా మరో 70 థియేటర్లలో విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. అంతేకాదు మంచి విజయానందంలో ఉన్న శరత్‌కుమార్ యూనిట్ సభ్యులకు విందు ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారట. -
విజయాల బాటలో విక్రమ్
ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుల్లో విక్రమ్ ప్రభు పేరు ముందు ఉంటుంది. కుంకి తో తొలి విజయాన్ని అందుకున్న ఈయన చిత్రం తరువాత చిత్రం చేసుకుంటూ వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ఇటీవలే శిఖరం తొడు చిత్రంతో మంచి విజయాన్ని పొందిన విక్రమ్ ప్రభు ఈసారి తన చిత్రాల వేగాన్ని పెంచారు. ప్రస్తుతం ఎళిల్ దర్శకత్వంలో వెళ్లైక్కార దురై చిత్రంతో పాటు ఎఎల్ విజయ్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై నటుడు శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్, ఎస్టిన్ స్టీఫెన్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇదు ఎన్న మాయం అనే పేరును నిర్ణయించా రు. ఏఎల్ విజయ్, అమలాపాల్‌ను వివాహం చేసుకున్న తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఇదే మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై శరత్‌కుమార్ హీరోగా చండమారుతం అనే చిత్రం తెరకెక్కుతోంది. అదే విధంగా ధనుష్, కాజల్ అగర్వాల్ జంటగా మారి చిత్రాన్ని ఈ సంస్థే నిర్మిస్తోంది. -
అవాస్తవ ప్రకటనలపై ప్రశ్నిస్తే తప్పా?
అవాస్తవ ప్రకటనలపై ప్రశ్నిస్తే తప్పా? సంఘం నుంచి బహిష్కరించినా భయపడను అంటున్నారు నటుడు విశాల్. సంఘంపై తరచూ విమర్శలు చేస్తే, నటుడు విశాల్‌పై వేటు వేస్తామని దక్షిణ భారత నటీనటులసంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ బుధవారం తిరుచ్చిలో చేసిన వ్యాఖ్యలకు నటుడు విశాల్ స్పందించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ నటీనటుల సంఘం నుంచి తనను బహిష్కరిస్తానన్న శరత్‌కుమార్ వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు. ఆ వ్యాఖ్యలు తన సినీ జీవితాన్ని వేదనకు గురి చేసేవిగా ఉన్నాయన్నారు. నటీనటుల సంఘం కార్యదర్శి రాధారవి, ఉపాధ్యక్షుడు కె ఎస్‌కాళైలు ఇటీవల మదురైలో రంగస్థల నటులకు సాయం అందించే కార్యక్రమంలో పాల్గొని సినిమా నటులను కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. నిజానికి నటీనటుల సంఘం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యవహారంపై వివరణ కోరడం తప్పా? అంటు ప్రశ్నించారు. సభ్యుడిగా సంఘం చర్యలపై ప్రశ్నించే హక్కు తన కుందన్నారు. సంఘం భవన నిర్మాణం గురించి అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి పూర్తి వివరాలను ఇప్పటి వరకు సభ్యులకు తెలియపరచకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. సంఘం నిర్వాహకుల గురించి ప్రశ్నించే హక్కు ప్రతి సభ్యుడికి ఉంటుందని విశాల్ ఉద్ఘాటించారు. సంఘం గురించి తాను చేసిన విమర్శలు ఏమిటో నిరూపిస్తే తానే సంఘం నుంచి వైదొలగుతానని విశాల్ అన్నారు. -
మమ్మల్ని ఎవరూ బెదిరించలేదు: శరత్‌కుమార్
చెన్నై: జయలలితకు మద్దతుగా తమిళ సినిమా పరిశ్రమ స్వచ్ఛందంగానే ముందుకు వచ్చిందని నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్ తెలిపారు. తమకు తాముగానే నిరాహారదీక్ష చేస్తున్నామని వెల్లడించారు. దీనికోసం తమకు ఎవరూ బెదిరించడంగాని, ఒత్తిడి చేయడంగాని చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక జైలులో ఉన్న జయలలితకు మద్దతుగా తమిళ సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాతలు, నటులు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఇతరులు మంగళవారం నిరాహారదీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టాలని తమపై ఎవరూ ఒత్తిడి చేయలేదని శరత్‌కుమార్ తెలిపారు. సినిమా పరిశ్రమకు 'అమ్మ' ఎంతో చేశారని, ఆపదకాలంలో ఆమెకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. -
సమ్‌థింగ్ స్పెషల్
‘‘నా కెరీర్లో సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలిచిపోయే సినిమా ఇది. మంచి కథాకథనాలతో పాటు ప్రతిభావంతమైన బృందంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది’’ అని సాయిరామ్ శంకర్ చెప్పారు. సాయిరామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా, శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వంశీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీకాంత్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 18 నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. తెలుగులో చాలా అవకాశాలు వచ్చినా, కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నానని శరత్‌కుమార్ చెప్పారు. అన్ని వర్గాలనూ అలరించే సినిమా ఇదని నిర్మాతలు తెలిపారు. ఎమ్మెస్ నారాయణ, కాశీ విశ్వనాథ్, పృథ్వీ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్ధ్, సంగీతం: మహత్. -
నచ్చితే ఉచితంగా...
కథా పాత్ర తన మనస్సును హత్తుకుంటే ఉచితంగా నటించడానికి సిద్ధం అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది నటి ఓవియూ. కలవాని చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన కేరళకుట్టి ఈ బ్యూటీ. తొలి చిత్రంతోనే విజయూన్ని నమోదు చేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత తడబడి, తప్పటడుగులు వేసింది. అయితే ఇటీవల మళ్లీ గాడిలో పడిన ఓవియూ కలగలప్పు, మేరినా వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో చేసింది. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలు చేతిలో ఉన్నాయి. పస్తుత హీరోయిన్లు హీరోలతో పోటీపడి పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ మలయాళ భామ పాత్ర న చ్చితే పారితోషికం తీసుకోకుండా నటిస్తాననడం విశేషం. ప్రస్తుతం అందాలు ఆరబోయడానికి రెడీ అయిన ఓవియూ సాధ్యమైనంత వరకు వైవిధ్య భరిత చిత్రాలు చేయూలని ఆశిస్తున్నానంది. ధనార్జన మాత్రమే తన ధ్యేయం కాదని, పాత్ర తన మనస్సును టచ్ చేస్తే పారితోషికం తీసుకోకుండా నటించడానికి సిద్ధం అని చెప్పింది. మేకప్ సహాయకులకు నిర్మాత వేతనాలు చెల్లిస్తే చాలని పేర్కొంది. ప్రస్తుతం శరత్‌కుమార్ సరసన సండమారుతంతోపాటు భారతీరాజ దర్శకత్వంలో ఒక చిత్రం, మరికొన్ని చిత్రాలు చేస్తున్నట్టు తెలిపింది. ఉచితంగా నటించడానికి నిజంగా సిద్ధమా అన్న ప్రశ్నకు పాత్ర ఆకట్టుకుంటే సిద్ధమేనని స్పష్టం చేసింది. సాధారణ పాత్రలకు తన స్థాయికి తగ్గ పారితోషికం తీసుకుంటానని ఓవియూ అంది. -
శభాష్ శరత్‌కుమార్!
సాక్షి, చెన్నై: సమత్తువ మక్కల్ కట్చి నేత, ఎమ్మెల్యే, నటుడు శరత్‌కుమార్ శభాష్ అనిపించుకున్నారు. అసెంబ్లీలో మూడేళ్ల కాలంలో మూడు వేలకు పైగా ప్రశ్నల్ని సంధించి అందరి దృష్టిలో పడ్డారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. ఈ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయింది. నాలుగో ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఈ కాలంలో బడ్జెట్ సమావేశాలు, ఏడాది ఆరంభంలో తొలి సమావేశం, ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ 234 మంది సభ్యుల పనితీరు అసెంబ్లీలో ఏ మేరకు ఉన్నదో అన్న వివరాల్ని ఓ తమిళ మీడియా సేకరించింది. మెజారిటీ శాతం మంది సభ్యులు ప్రజా సమస్యలు తమ గిట్టనట్టుగా వ్యవహరించి ఉండటం గమనించాల్సిన విషయం. ప్రతి పక్షాలు అయితే, వాకౌట్లతో కాలయాపన చేశాయే గానీ, గంటల తరబడి సభలో కూర్చున సందర్భమే లేదు. ఈ పరిస్థితుల్లో సమత్తువ మక్కల్ కట్చి నేత, నటుడు, ఎమ్మెల్యే శరత్‌కుమార్ అందరి దృష్టిలో పడ్డారు. ఇందుకు కారణం సభకు ఆయన 46 శాతం రోజులు వచ్చినా, 3,288 ప్రశ్నలను సంధించడం విశేషం. అలాగే, అదేపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణన్ 1744 ప్రశ్నలను లేవదీసి ఉన్నారు. శరత్‌కుమార్ సంధించిన ప్రశ్నల్లో 679 ప్రశ్నలకు స్టార్ హోదా కల్పించి ఉన్నారు. ఇక సభలో అత్యధిక సమయం నిలుచుని ప్రసంగం చేసిన వారిలో సీఎం జయలలిత ముందు వరుసలో ఉన్నారు. ఆమె ప్రతి రోజూ ప్రత్యేక ప్రకటనల్ని అసెంబ్లీలో ప్రకటించడం గమనార్హం. ఇక సభకు వంద శాతం మేరకు హాజరు అయిన వారిలో కేవలం 38 మంది మాత్రమే ఉన్నారు. వీరంతా అన్నాడీఎంకే సభ్యులే. ప్రతి పక్ష సభ్యులు సభలో కన్నా, లాబీల్లో ఎక్కువ సమయం గడిపి ఉన్నారు. డీఎంకే అధినేత ఎం.కరుణానిధి కేవలం మూడు శాతం రోజులు మాత్రమే సభకు చుట్టుపు చూపుగా వచ్చి వెళ్లారు. ఆయన వీల్ చైర్‌కు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం నిరాకరించ బట్టే, సమావేశాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ కూడా అదే బాటలోనే ఉన్నారు. ఆయన 14 శాతం రోజులే సభలో అడుగుపెట్టారు. -
తుది దశకు చేరిన చండమారుతం
చండమారుతం చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. శరత్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం చండమారుతం. విశేషమేమిటంటే ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. శరత్‌కుమార్ ద్విపాత్రాభినయం చేయడం కొత్తేమి కాకపోయినా ఈ చిత్రంలో నాయకుడు, ప్రతినాయకుడు ఆయనే కావడం విశేషం. ప్రతి నాయకుడంటే ఆషామాషి పాత్ర కాదట. క్రూరమైన విలన్‌గా నటిస్తున్నారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ పాత్ర అరాచకాలు తెరపై చూడాల్సిందే నంటున్నారు. సాధారణంగా ద్విపాత్రాభినయం అనగానే అన్నదమ్ములుగానో, తండ్రీకొడుకులుగానో నటిస్తుంటారు. ఈ చిత్రంలో అలాంటి సంబంధాలేవీ లేని రెండు విభిన్న పాత్రల్లో శరత్‌కుమార్ నటిస్తున్నారని తెలిపారు. నటి ఓవియా, మీరానందన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో దర్శకుడు సముద్రకని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో రాధారవి, తంబిరామయ్య, ఇమాన్ అన్నాచిచ, జార్జ్, నళిని, రామ్‌కుమార్, గానా ఉలగనాథన్, నరేన్, వెన్నిరాడై మూర్తి, ఆదవన్ శింగంపులి, ఢిల్లి గణేశన్ మొదలగు వారు నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ 80 శాతం పూర్తయిందని, మిగిలిన 20 శాతం పూర్తి చేసి త్వరలో చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి శరత్‌కుమార్‌నే కథను తయారు చేశారు. ఈ చిత్రాన్ని ఆయనతోపాటు రాధిక శరత్‌కుమార్, లిస్టిన్ స్టీఫెన్లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏ.వెంకటేష్ దర్శత్వం వహిస్తున్నారు. -
ఐటమ్ సాంగ్‌తో గౌరవమే
అవకాశాలు లేక హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌కు సిద్ధం అవుతున్నారన్నది పాత మాట. అధిక పారితోషికం ఆశతో టాప్ హీరోయిన్లు కూడా అలాంటి శృంగార నృత్యాలకు సై అంటున్నారన్నది నేటి మాట. అయితే ఇనియా లాంటి అసలు విజయాలు, అంతగా అవకాశాలు లేని హీరోయిన్లు కూడా ఐటమ్స్ ఆడేస్తూ పైగా హీరోయిన్గా అవకాశాలు లేక కాదు ఆ గీతాలు నచ్చడం వల్లే అంటే వినేవారు నమ్మేస్తారా? వాగైచూడవా వంటి కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఇనియా ప్రస్తుతం ఐటమ్ గర్ల్‌గా వచ్చిన అవకాశాన్ని ఒప్పేసుకుని ఆడేస్తోంది. దీని గురించి ఈ అమ్ముడు వివరిస్తూ ప్రస్తుతం శరత్ కుమార్ సరసన వేళచ్చేరి చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నానని తెలిపింది. తమిళంలో గ్యాప్ రాకూడదని ఇటీవల మూడు చిత్రాల్లో సింగిల్ సాంగ్స్ చేశానని చెప్పింది. రెండవదు పడం చిత్రంలో వెంకట్ ప్రభుతో స్పెషల్‌సాంగ్‌కు ఆడానని తెలిపింది. ఇందులో పాత కథానాయికల గెటప్‌లో నర్తించానని వివరించింది. ఇక పార్తిబన్ దర్శకత్వం వహించిన కథై తిరైకథై, వచనం ఇయక్కం చిత్రంలో ఆయన అడగడంతో పలువురు ప్రముఖ నటీనటుల అతిథి పాత్రలు పోషించిన ఈ చిత్రంలో తానూ భాగం కావాలని భావించి సింగిల్ పాటలో నటించానని తెలిపింది. మూడో చిత్రం ఒరు ఊరుల రెండు రాజా దర్శకుడు కన్నన్ కోరిక మేరకు పాట కూడా నచ్చడంతో ఐటమ్ సాంగ్ చేశానని చెప్పింది. అందుకని హీరోయిన్ అవకాశాలు లేక ఐటమ్ సాంగ్స్ ఒప్పుకుంటున్నట్లు భావించరాదని, అయినా అలాంటి పాటలతోను తన గౌరవం పెరుగుతోందని ఇనియ సెలవిచ్చింది. -
శ్రీలంకపై కోలీవుడ్ ధ్వజం
చెన్నై, సాక్షి ప్రతినిధి:‘అమ్మ’ అంటూ తమిళులు ఎంతో అభిమానంగా పిలుచుకునే ముఖ్యమంత్రి జయలలితకు శ్రీలంక అధికారిక ఆర్మీ వెబ్సైట్లో జరిగిన అవమానంపై కోలీవుడ్ ధ్వజమెత్తింది. చెన్నై నుంగంబాకం కాలేజీ రోడ్‌లోని శ్రీలంక రాయబార కార్యాలయం వద్ద సోమవారం ధర్నాకు దిగింది. రాజపక్సే దిష్టిబొమ్మ దహనం చేసింది. శ్రీలంక చేతిలో తరచూ వేధింపులకు గురవుతున్న తమిళ జాలర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటూ అక్కడి జైళ్లలో మగ్గుతున్న జాలర్లను, మరపడవలను విడిపించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇటీవల లేఖలు రాశారు. ఈ లేఖలపై శ్రీలంక ఆర్మీ తన వెబ్సైట్లో వ్యంగ్యాస్త్రాలను విసిరింది. పీఎం, సీఎం వంటి ఉన్నత స్థానాల్లో ఉన్న మోడీ, జయలను కించపరిచింది. దీనిపై రాష్ట్రంలో తీవ్రనిరసనలు పెల్లుబికాయి. ఇం దులో భాగంగా జయకు బాసటగా నిలుస్తూ కోలీవుడ్ తరలి వచ్చింది. ఉదయం 10.30 గంటలకు చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయం వద్ద ధర్నాకు దిగింది. శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేను శిక్షించాలని, ఆ దేశంపై ఆర్థిక నిషేధం విధించాలని తమిళ నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కచ్చదీవులు శ్రీలంకకు మాత్రమే సొంతం కావని సీనియ ర్ నటులు శివకుమార్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాల కోసం ఆవిర్భవించిన రాయబార వ్యవస్థ శ్రీలంక వల్ల చెడగొట్టే వ్యవస్థగా మారిందని సీనియర్ దర్శకులు ఆర్కే సెల్వమణి విమర్శించారు. చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ నాయకత్వంలో 24 విభాగాలకు చెందిన వారంతా పెద్ద సం ఖ్యలో ధర్నాలో నినాదాలతో హోరెత్తించారు. నటీ నటులు శివకుమార్, సూర్య, విజయ్, భాగ్యరాజ్, వివేక్ సహా వందలాది సినీ ప్రముఖులు, పలువురు నటీమణులు నిరసనలో పాల్గొనడంతో వారిని చూసేందుకు సాధారణ ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చింది. అయితే పోలీసు లు వారిని అనుమతించలేదు. కోలీవుడ్ ధర్నాను పురస్కరించుకుని 300మందికి పైగా పోలీసులు అక్కడ మోహరించారు. ఈ సందర్భంగా కోలీవుడ్ ప్రముఖులు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దిష్టిబొమ్మను దహనం చేసేందుకు పెట్రోల్ పోశారు. ఇంతలో వారి ని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే రాయబార కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నానికి కూడా పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించిన పోలీసులు అడ్డుతగిలారు. ఉదయం 10.30గంటలకు ప్రారంభమైన కోలీవుడ్ ధర్నా మధ్యాహ్నం 12.15 గంటలకు ముగిసింది. శ్రీలంక క్రికెట్ జట్టు తిరుగుముఖం శ్రీలంక తీరుపై రాష్ట్రం ఒకవైపు అట్టుడికి పోతుండగా అండర్-16 క్రికెట్లో ఆడేం దుకు చెన్నైకి చేరుకున్న శ్రీలంక జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ తమిళనాడు అధ్యక్షతన చెన్నైలోని వైఎమ్‌సీఏ మైదానంలో అండర్ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. భారత్, మలేషియాతోపాటూ పోటీల్లో పాల్గొనేందుకు 13 మంది క్రీడాకారులు, ముగ్గురు శిక్షకులతో శ్రీలంక జట్టు ఆదివారం రాత్రి చెన్నై చేరుకుంది. సోమవారం కోలీవుడ్ ధర్నా చేస్తున్న సమయంలో వీరు క్రికెట్ ఆడితే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని తలంచిన రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో సోమవారం ఉదయం 9.55 గంటలకు శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులు తిరుగు ప్రయనమయ్యూరు. శ్రీలంక వ్యవహారంపై చర్చించేం దుకు సోమవారం నాటి అసెంబ్లీలో స్పీకర్ నిరాకరించగా, చెన్నై శివార్లలోని షోలింగనల్లూరులో రాజపక్సే దిష్టిబొమ్మను అన్నాడీఎంకే శ్రేణులు దహనం చేశాయి. -
శరత్‌కుమార్‌తో మీరానందన్
వాల్మీకి ఫేమ్ మీరానందన్ గుర్తుందా? మలయాళంలో మోహన్‌లాల్ వంటి స్టార్ హీరో సరసన నటించి ప్రాచుర్యం పొందిన ఈ కేరళ కుట్టి కోలీవుడ్ కంట పడ్డారు. ఇంకేముంది వాల్మీకి చిత్రంలో హీరోయిన్ అయిపోయారు. ఆ తరువాత అయ్యనార్, కాదలుక్కు మరణమిల్లై, సూర్య నగరం వంటి చిత్రాలలో నటించినా సరైన హిట్స్ లేకపోవడంతో ఆ తరువాత కోలీవుడ్‌లో కనిపించలేదు. టాలీవుడ్ బై భోలో తెలంగాణ చిత్రంలో మెరిశారు. అలాంటి మీరానందన్ తాజాగా కోలీవుడ్‌కు తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యారు. శరత్‌కుమార్ హీరోగా విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్న చండమారుదం చిత్రంలో నటిస్తున్నారు. మ్యూజిక్ ఫ్రేమ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్గా ఓవియ నటిస్తున్నారు. ఈ చిత్రానికి శరత్‌కుమార్ కథ, కథనం, సమకూర్చడంతో పాటు సంభాషణలు రాయడం మరో విశేషం. -
శరత్‌కుమార్‌కు జోడిగా ఓవియ
నటి ఓవియ బిగ్ ఆఫర్‌ను అందుకుంది. సుప్రీమ్ స్టార్ శరత్‌కుమార్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని అనూహ్యంగా పొందింది. కొంత విరామం తరువాత శరత్‌కుమార్ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఛండమారుతం. ఎ.వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మొదట అవని మోడి, సరయు హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అయితే అవనిమోడి అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో అంగీకరించని నిర్మాతలు ఆమెను తొలగించి ఆ పాత్రలో ఓవియను ఎంపిక చేశారు. నటి అవనిమోడితో ఆరు రోజులు షూటింగ్ కూడా చేశారు. పారితోషికం డిమాండ్‌తోపాటు మలయాళ చిత్రంలో నటిస్తున్న అవనిమోడి కాల్షీట్స్ సమస్య కూడా తోడవ్వటంతో ఆమె ను తొలగించినట్లు యూనిట్ వర్గాలు తెలి పారుు. కాగా ఛండమారుతం చిత్రంలో ఓవి య, సరయుతోపాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందని చిత్ర వర్గం తెలిపింది. ఈ చిత్రం పక్కా కమర్షియల్ కథాంశంతో రూపొం దుతున్నట్లు వెల్లడించారు. నాట్టామై, సూర్యవంశం చిత్రాల తరువాత శరత్‌కుమార్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఇదన్నారు. చిత్ర షూటింగ్ ఆగస్టుకు పూర్తి చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. -
స్టాలిన్‌తో ఎలాంటి విబేధాలు లేవు
సాక్షి, చెన్నై: డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా నటి ఖుష్బు ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఏప్రిల్ ఐదో తేదీ నుంచి నిర్విరామంగా 17 రోజుల పాటు ఆమె ప్రచారం సాగ నుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం ఆమె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం కోసం తాను సిద్ధం అయ్యానని, అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే విధంగా తన ప్రచార ప్రసంగాలు ఉంటాయని వివరించారు. అయితే, ప్రచారంలో ఎక్కడా డీఎండీకే అధినేత విజయకాంత్, సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్‌ను విమర్శించనని ప్రకటించారు. పార్టీ ముఖ్యం: తాను డీఎంకేలో కార్యకర్తను, నాయకురాలిని కావున తనకు పార్టీ ముఖ్యం అని స్పష్టం చేశారు. డీఎంకేకు అనుకూలంగానే తాను వ్యవహరిస్తుంటానని పేర్కొన్నారు. వదంతులను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. పుకార్లు పుట్టించే వాళ్లు పుట్టిస్తూనే ఉంటారని, వాటి గురించి ఆలోచించడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని వ్యంగ్యాస్త్రం సంధించారు. పార్టీ వర్గాలతో ఎలాంటి అభిప్రాయ బేధాలు తనకు లేదని స్పష్టం చేశారు. స్టాలిన్‌తో అసలు ఎలాంటి విబేధాలు లేవు అని, అంతా మీడియా సృష్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేళ పార్టీలో తనకు ఇబ్బందులు కలిగి ఉంటే, ఎప్పుడో పార్టీని వీడేదాన్ని అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పిల్లల కోసం : తన ఇద్దరు పిల్లల కోసం సినిమాలకు దూరంగా ఉన్నానని, వారితో ఎక్కువ సమయం గడపాలన్నదే తన అభిమతంగా పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు లేనప్పుడు పిల్లలతో సరదాగా గడుపుతానని, అంత మాత్రాన పార్టీకి దూరంగా ఉన్నట్టు కాదన్నారు. పార్టీ కోసం కష్టపడేందుకు తాను సిద్ధం అని, తాను సరైన అభ్యర్థి కాదు కాబట్టే, తనకు ఎన్నికల్లో సీటు ఇవ్వలేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన సేవల్ని ప్రచారానికి పార్టీ ఉపయోగించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఎన్నికల్లో డీఎంకే ప్రగతిని, అన్నాడీఎంకే వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రసంగాలు చేయనున్నానని వివరించారు. డీఎంకే చేసిందేమిటో, అన్నాడీఎంకే చేసిందేమిటో ప్రజలకు వివరించడమే కాదు, ఎవరైనా చర్చకు వచ్చినా తేల్చుకునేందుకు తాను సిద్ధం అని సవాల్ చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయను: ప్రచారంలో ఎవరి మీదా వ్యక్తిగత విమర్శలను తాను చేయనని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలకు డీఎంకే దూరం అన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానంగా డీఎండీకే అధినేత విజయకాంత్, సమత్తువమక్కల్ కట్చినేత శరత్‌కుమార్ రాజకీయ పార్టీలకు అధినాయకులైనా, డీఎంకేకు ప్రత్యర్థులుగా ఉన్నా, వారిని మాత్రం విమర్శించనని స్పష్టం చేశారు. సినీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లతో తనకు ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవు అని, తామంతా ఒకే కుటుంబం అని, అందువల్లే వారిని మాత్రం విమర్శించనని పేర్కొన్నారు. నటి నగ్మా తన కన్నా సీనియర్ అని, ఆమెను ముద్దాడే విధంగా వ్యవహరించిన నాయకుడి చెంప పగలగొట్టి ఉండాలని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ స్థానంలో తాను ఉండి ఉంటే, ఆ వ్యక్తి చెంప పగిలి ఉండేదన్నారు. ఇలాంటి పరిస్థితి తమకు ఇంత వరకు ఎదురు కాలేదని, ఎదురు కాదు కూడా అని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేలో మహిళకు భద్రత, రక్షణ ఉందని చివరి ప్రశ్నకు సమాధానం ఇచ్చి ముగించారు. -
రజనీ జన్మదిన కానుకగా కొచ్చడయాన్ విడుదల?
ఇప్పటికే అభిమానుల భారీ అంచనాలు నెలకొన్న ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కొచ్చడయాన్ చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ జన్మదినం రోజున విడుదల చేసేందుకు ప్తాన్ చేస్తున్నట్టు ఆ చిత్ర యూనిట్ వర్గాలు నుంచి విశ్వసనీయంగా సమాచారం అందింది. అనుకున్న ప్రకారం అన్ని పనులు సవ్యంగా పూర్తవుతే అభిమానులకు రజనీ కాంత్ బర్త్ డే గిప్ట్ గా కొచ్చడయాన్ ను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న తొలి టీజర్ సోమవారం ఆన్ లైన్ లో విడుదలైంది. కొచ్చడయాన్ టీజర్ కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వంద కోట్ల వ్యయంతో భారత దేశంలో తొలి మోషన్ క్యాప్చర్ 3డీ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, శరత్ కుమార్, జాకీ ష్రాఫ్, శోభన, ఆది పినిశెట్టిలు నటించారు. -
సినీ నటుడు శరత్ కుమార్ కు సత్కారం
రాజకీయ వేత్తగా మారిన దక్షిణాది నటుడు శరత్ కుమార్ ను న్యూజెర్సీ రాష్ట్ర శాసనసభ ఘనంగా సత్కరించింది. రాజకీయాల్లో ప్రవేశించి..తన నియోజకవర్గానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా సత్కరించినట్టు న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ చివుకులు ఉపేంద్ర తెలిపారు. సెంట్రల్ అసెంబ్లీ హాల్ జరిగిన ఓ కార్యక్రమంలో స్పీకర్ షీలా ఓలివర్ సంతకం చేసిన జ్ఞాపికను శరత్ కుమార్ కు ఉపేంద్ర అందచేశారు. తన నియోజకవర్గానికి విశేష సేవలు అందిస్తున్న శరత్ కుమార్... సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మూడవసారి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. గతంలో శరత్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. న్యూజెర్సీ పర్యటనలో వ్యవసాయ శాఖ కార్యదర్శి డగ్లస్ హెచ్ ఫిషర్, చివుకుల ఉపేంద్ర, జయంతి విలయానూర్, వ్యవసాయ శాఖ నిపుణుడు అల్ ఫ్రెడ్ ముర్రేలతో సమావేశమయ్యారు. న్యూజెర్సీలోని అధునిక వ్యవసాయ పద్దతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.