రాధారవిపై నిషేధం చెల్లదు : హైకోర్టు తీర్పు | High Court says Radharavi Ban not valid | Sakshi
Sakshi News home page

రాధారవిపై నిషేధం చెల్లదు : హైకోర్టు తీర్పు

Published Thu, Sep 22 2016 2:15 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

నడిగర్ సంఘానికి ఎదురు దెబ్బ తగిలింది. నడిగర్ సంఘంలో అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు మోపబడ్డ ఆ సంఘం

తమిళసినిమా: నడిగర్ సంఘానికి ఎదురు దెబ్బ తగిలింది. నడిగర్ సంఘంలో అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు మోపబడ్డ ఆ సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, రాధారవి, వాగై చంద్రశేఖర్‌లను సభ్యత్వం నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ఇటీవల సంఘ నూతన కార్యవర్గం వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా తనను సంఘం నుంచి నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సంఘ మాజా కార్యద ర్శి రాధారవి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తి సుందరేశన్ సమక్షంలో విచారణకు వచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తి సుందరేశన్ రాధారవిపై నిషేధం చెల్లదంటూ తీర్పునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement