radharavi
-
క్వారంటైన్లో రాధారవి..?
సినిమా: సీనియర్ నటుడు రాధారవి క్వారంటైన్లో ఉన్నట్టు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. ఈయన గత పదో తేదీన చెన్నై నుంచి కుటుంబంతో సహా నీలగిరిలోని కొత్తగిరిలో తన నూతన భవనానికి వెళ్లారు. అయితే, ఆయన చెన్నైలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయన కొత్తగిరికి మకాం మార్చడం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారులకు తెలియడంతో వారు అక్కడికి వెళ్లి విచారించారు. అయితే, రాధారవి అన్ని అనుమతులతోనే కొత్తగిరికి వచ్చినట్టు తెలిసింది. అయినా గానీ, ఆయన కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. దీంతో మంగళవారం కొత్తగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి రాధారవి కుటుంబం కరోనా పరీక్షలను చేయించుకున్నారు. అయితే, రిజల్ట్ రావాల్సి ఉంది. ఈ కారణంగా 14 రోజుల పాటు రాధారవి కుటుంబాన్ని ఇంటిలోనే ఉండాల్సిందిగా అధికారులు సూచించారని, ఇంటికి ఓ స్టికర్ కూడా అతికించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, నటుడు రాధారవి ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను వేసవి విడిది కోసమే కొత్తగిరికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఇలాంటి అసత్యప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. -
చిన్మయి వర్సెస్ రాధా రవి
‘మీటూ’ ఉద్యమం మన దేశంలోనూ ఊపందుకున్నప్పుడు సౌత్ ఇండస్ట్రీల్లో ఎక్కువగా వినిపించిన పేరు చిన్మయి. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మయి పాపులర్. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లకు గొంతుగా ఉండే చిన్మయి, ఈ ఉద్యమంలో ఎందరో బాధితులకు గొంతుగా నిలిచారు. ధైర్యంగా నిలబడ్డారు. ‘మీటూ’ ఉద్యమంలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపులను నిర్భయంగా బయటకు చెప్పడమే కాకుండా దాని వెనుక ఉన్నది ప్రముఖ గేయ రచయిత వైరముత్తు అని ఆయన పేరుని బయటపెట్టారు. తమిళ పరిశ్రమలో అది సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తన ట్వీటర్ వేదికగా వైరముత్తు, నటుడు, నిర్మాత రాధారవిపై ఆరోపణలు చేసిన స్త్రీల వివరాలను గోప్యంగా ఉంచి వాళ్ల చేదు సంఘటనలు షేర్ చేస్తూ ఉన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే చిన్మయి డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం రద్దయింది. సభ్యత్వం కొనసాగించకపోవడానికి వార్షికరుసుము చెల్లించకపోవడమే కారణం అని, అందుకే సభ్యత్వాన్ని రద్దు చేశామని యూనియన్ పేర్కొంది. అప్పుడు డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ పదవిలో రాధారవి ఉన్నారు. సభ్యత్వం రద్దు విషయమై చిన్మయి కోర్టుని ఆశ్రయించగా, కోర్టు చిన్మయి వాదనకు అనువుగా ఇంటర్న్ ఆర్డర్ (ఈ కేసు పరిశీలనలో ఉన్నంత కాలం ఆమె డబ్బింగ్ యూనియన్ సభ్యురాలిగానే పరిగణించాలి) మంజూరు చేసింది. ఆ తర్వాత తమిళంలో చిన్మయి డబ్బింగ్ కెరీర్ మందకొడిగా సాగుతోంది. తాజాగా ఈ నెల డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు జరగనున్నాయనే ప్రకటన విడుదలైంది. మరోసారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి రెడీ అయ్యారు రాధారవి. ఆయనకు ప్రత్యర్థిగా, రామరాజ్యం పార్టీ తరపున ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశారు చిన్మయి. విశేషం ఏంటంటే సభ్యత్వం రద్దు చేసినప్పుడే డబ్బింగ్ యూనియన్ ఓటర్ల జాబితాలో నుంచి చిన్మయి పేరును తొలగించారు. ‘సభ్యులు కానివారు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు?’ అని ఒక వర్గం వారు చిన్మయిని విమర్శించారు. ‘‘కోర్టు మంజూరు చేసిన ఆర్డర్లో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు నాకుంది’’ అని పేర్కొన్నారు చిన్మయి. ప్రస్తుతం చిన్మయి నామినేషన్ పత్రాలు పరిశీలనలో ఉన్నాయి. ఫిబ్రవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎలాంటి నాటకీయత చోటు చేసుకుంటుంది? చిన్మయి వర్సెస్ రాధారవి.. గెలుపు ఎవరిది? అని తమిళ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
శరత్‌కుమార్, రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు
-
శరత్‌కుమార్, రాధారవిని అరెస్టు చేయండి: హైకోర్టు
సాక్షి, చెన్నై: ప్రముఖ నటులు శరత్‌కుమార్, రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో సినీ నటీనటుల సంఘానికి శరత్‌కుమార్ అధ్యక్షుడిగా, రాధారవి కార్యదర్శిగా ఉన్నారు. ఆ కాలంలో కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న నడిగర్ సంఘానికి చెందిన స్థలాన్ని వీరిద్దరు అక్రమంగా అమ్మారని 2017లో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించింది. సంఘం అనుమతి లేకుండా స్థలాన్ని విక్రయించిన ఈ కేసును 3నెలల్లో తేల్చి చర్యలు తీసుకోవాలని, శరత్, రవిలను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. -
అది మగతనం కాదు!
‘కొలైయుదిర్ కాలమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తమిళ నటుడు రాధారవి (ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్ రాధా తనయుడు) నయనతారపై అగౌరవమైన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలకు తమిళ ఇండస్ట్రీ మండిపడుతోంది. పలువురు నటులు, నటీమణులు, దర్శక–నిర్మాతలు ఈ కామెంట్స్‌ను తిప్పి కొట్టారు. ‘డీఎంకే’ పార్టీ రాధారవిని సస్పెండ్ చేసింది. తనపై రాధారవి చేసిన వ్యాఖ్యలకు నయనతార ఓ లేఖ ద్వారా స్పందించారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘మన పని మాత్రమే మాట్లాడాలనే పాలసీని నమ్మే వ్యక్తిని నేను. కానీ ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల వల్ల ఈ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో నా స్టాండ్ గురించి, అసభ్యకర కామెంట్స్ పాస్ చేసేవాళ్ల ప్రవర్తనతో బాధపడుతున్న స్త్రీల తరఫున మాట్లాడుతున్నాను. ముందుగా రాధారవి స్పీచ్‌పై వెంటనే చర్య తీసుకున్న ‘డీఎంకే పార్టీ అధినేత’ ఎం.కే స్టాలిన్‌గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాధారవికి, ఆయనలా ఆలోచించే అందరికీ నేను గుర్తు చేయాలనుకుంటున్నది ఒక్కటే. మీ అందరికీ జన్మనిచ్చింది ఓ స్త్రీ అనే సంగతి మరువకండి. స్త్రీలను కించపరచడం, కామెంట్స్ చేయడం, అగౌరవపరచడాన్ని ఇలాంటి మతిస్థిమితం సరిగ్గా లేని మగవాళ్లు మగతనంగా భావిస్తున్నారు. వారి ప్రవర్తన నాకు చాలా బాధ కలిగిస్తోంది. అలాగే ఇలా కామెంట్ చేయడం గొప్ప అని భావించే మగవాళ్ల కుటుంబంలో ఉంటున్న స్త్రీలందరి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఒక సీనియర్ నటుడైన రాధారవి తర్వాతి జనరేషన్‌కు రోల్ మోడల్‌గా ఉండాలనుకోకుండా స్త్రీ విద్వేషకుడిగా మిగిలిపోవాలనుకున్నారు. అన్ని రంగాల్లో స్త్రీలు తమ ప్రతిభను చాటుతూ, ప్రస్తుతం ఉన్న పోటీలో తమ స్థానాన్ని నిరూపించుకుంటున్నారు. బిజినెస్‌లో వెనకబడిపోయిన రాధారవి లాంటి వాళ్లు ఇలాంటి తక్కువ స్థాయి మాటలు మాట్లాడి వార్తల్లో నిలవాలనుకుంటున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. స్త్రీలను తక్కువ చేసే వ్యాఖ్యలకు కొందరు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడం. ప్రేక్షకులు ఇలాంటి కామెంట్స్‌ను ప్రోత్సహించినంత వరకూ రాధారవి లాంటి వాళ్లు స్త్రీలను తక్కువ చేయడం, చీప్ జోక్స్ వేయడం చేస్తూనే ఉంటారు. నా అభిమానులు, సక్రమంగా నడుచుకునే సిటిజెన్స్ అందరూ ఇలాంటి చర్యలను దయచేసి ప్రోత్సహించవద్దు. ఈ లేఖ ద్వారా రాధారవి చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నాను. అదృష్టవశాత్తు దేవుడు నాకు అద్భుతమైన అవకాశాలు, ప్రేమను పంచే ప్రేక్షకులను ఇచ్చాడు. ఈ నెగటివ్ కామెంట్స్‌ని పట్టించుకోకుండా ఎప్పటిలా సీతలా, దెయ్యంలా, గాళ్‌ఫ్రెండ్‌లా, లవర్‌లా, భార్యలా.. ఇలా అన్ని పాత్రల్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నిరంతరం కృషిచేస్తాను. చివరిగా నడిగర్ సంఘా (నటీనటుల సంఘం)నికి నాదో ప్రశ్న. సుప్రీమ్ కోర్ట్ ఆదేశించినట్టు ‘ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ’ ని ఎప్పుడు నియమిస్తారు? విశాఖ గైడ్‌లెన్స్‌ను అనుసరిస్తూ ఇంటర్నల్ ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారు? ఈ సమయంలో నాతో నిలబడిన అందరికీ ధన్యవాదాలు ’’.‘కొలైయుదిర్ కాలమ్’ ఈవెంట్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన రాధారవి సోమవారం అపరాదభావం వ్యక్తం చేశారు. ఓ తమిళ పత్రికతో మాట్లాడుతూ – ‘‘ఒకవేళ నేను చేసిన వ్యాఖ్యలు వాళ్లను బాధపెట్టి ఉంటే, నేను పశ్చాత్తాపపడుతున్నాను. ఒకవేళ నా చర్యల వల్ల డీఎంకే పార్టీకి నష్టం జరుగుతుంది అనుకుంటే పార్టీ నుంచి తప్పుకోవడానికైనా నేను సిద్ధమే’’ అని పేర్కొన్నారు రాధారవి. నయనతారను అందరూ సపోర్ట్ చేస్తుంటే నటుడు సిద్ధార్థ్ మాత్రం ‘మనకు ఏదైనా జరిగినప్పుడు మాత్రమే ఎదురు తిరిగితే ధైర్యవంతులు అవ్వం’ అని ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ని ఉద్దేశించి నయనతార బాయ్‌ఫ్రెండ్, దర్శకుడు విఘ్నేష్ శివన్ ‘‘మీటూ’ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఉదృతంగా ఉంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో. సోషల్ మీడియాలో మీటూ గురించి స్పందించకుండా సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నట్లు కాదు. నయనతార స్త్రీ సంక్షేమం కోసం ఎప్పుడూ నిలబడతారు. ‘మీటూ’ బాధితులకు ఆర్థికంగా, నైతికంగా నిలబడ్డారు. తన సినిమాల్లో అవకాశాలు కూడా కల్పించారు. కానీ వీటిని సోషల్ మీడియాలో చెప్పుకోలేదు. చేసిన మంచిని బయటకు చెప్పుకోకుండా మౌనంగా ఉన్నవారి గురించి కామెంట్ చేయడం బాధాకరం’’ అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత సిద్దార్థ్ ‘నేను చెప్పాలనుకున్న విషయం సరిగ్గా చెప్పలేకపోయాను. గౌరవప్రదంగా ఆ ట్వీట్స్‌ను డిలీట్ చేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. రాధారవిగారు మీరు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఈ రోజు నుంచి కేవలం రవి అని పిలిపించుకోండి. ఎందుకంటే మీ పేరులో కూడా ఒక స్త్రీ పేరు ఉంది. – విశాల్, నటుడు, ‘నడిగర్ సంఘం’ జనరల్ సెక్రటరీ ఒక అద్భుతమైన నటి (నయనతార) గురించి రాధారవి చేసిన కామెంట్స్ విన్నాను. సార్ మీరు చేసిన కామెంట్స్ మీ అసభ్యకరమైన గుణాన్ని, ఆ నటి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. యాక్టింగ్ కమ్యూనిటీ సిగ్గుపడేలా చేశారు. – రానా, నటుడు -
నయనతారపై రాధారవి అసభ్యకర వ్యాఖ్యలు, వేటు
చెన్నై : హీరోయిన్ నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు, డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాధారవిపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నయనతార నటించిన తాజా చిత్రం కొలైయుధీర్ కాలం. హారర్, థ్రిల్లర్ ఇతి వృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ శనివారం చెన్నైలోని ఓ హోటల్లో జరిగింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొనని నయనతార ఈ చిత్ర ఆడియో విడుదలకు కూడా గైర్హాజరు అయ్యారు. చదవండి....(నయనతారను చూస్తే దెయ్యాలే పారిపోతాయి) నటుడు రాధారవి ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘నయనతార మంచి నటి. ఇంతకాలంగా సినీరంగంలో నాయకిగా కొనసాగడం పెద్ద విషయమే. అయితే ఆమె గురించి ప్రచారం కాని వార్తలే లేవు. అవన్నీ అధిగమించి నిలబడింది. తమిళ ప్రజలు ఎప్పుడూ ఒక విషయాన్ని నాలుగైదు రోజులే గుర్తుంచుకుంటారు. ఆ తరువాత మరచిపోతారు. నయనతార ఒక చిత్రంలో దెయ్యంగానూ నటించింది. మరో చిత్రంలో సీతగానూ నటించింది. ఇప్పుడు సీతగా ఎవరైనా నటించవచ్చు. ఇంతకుముందు అయితే సీతగా నటించడానికి కేఆర్ విజయనే ఎంపిక చేసుకునేవారు. ఇప్పుడు చూడగానే నమస్కరించాలనే వారు నటించవచ్చు, చూడగానే పిలివాలనిపించే వారు నటించవచ్చు. నయనతారను చూస్తే దెయ్యాలు పారిపోతాయి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అది చూసిన పలువురు రాధారవి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. దర్శకుడు విఘ్నేశ్ శివన్ మండిపాటు రాధారవి వ్యాఖ్యలపై దర్శకుడు, నయనతారతో సహజీవనం చేస్తున్నట్లు ప్రచారంలో ఉన్న విఘ్నేశ్ శివన్ మండిపడ్డాడు. ఎవరు చర్యలు తీసుకుంటారు? ‘ఒక పారంపర్య కుటుంబం నుంచి వచ్చిన వారి నోటి నుంచి వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎవరు చర్యలు తీసుకుంటారు? ఎవరు మద్దతు తెలుపుతారో అన్న విషయం గురించి నాకు పని లేదు. తనపై దృష్టిని మరల్చడానికే రాధారవి ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడ్డారు. బుర్రలేనివారు, అలాంటి చెత్త వ్యాఖ్యలకు నవ్వుకోవడం, చప్పట్లు కొట్టడంతో చింతలేదు. ఇంకా నిర్మాణం పూర్తి కాని చిత్రానికి ఇలాంటి కార్యక్రమం జరుగుతున్న విషయం మాకెవరికీ తెలియదు. ఇలాంటి కార్యక్రమాలకు పని పాటా లేని వారు వచ్చి అనవసర ప్రసంగం చేస్తుంటారు. ఇలా ఏం జరిగినా వారిపై ఏ సంఘం చర్యలు చేపట్టేది లేదు. అందుకే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనరాదని నిర్ణయించుకున్నాం.’ అన్నారు. నటుడు రాధారవి వ్యాఖ్యలను గాయని చిన్మయి, నటి వరలక్ష్మీశరత్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. అలాగే రాధారవి వ్యాఖ్యలను సోదరి నటి రాధిక శరత్‌కుమార్ ఖండించడం విశేషం. కొలైయుధీర్ కాలం చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో రాధారవి మాట్లాడిన వీడియోను నేను పూర్తిగా చూడలేదుగాని, నయనతార గురించి తను చేసిన వ్యాఖ్యలు సరికాదని రాధిక తన ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు రాధారవి వ్యాఖ్యలను నడిగర్ సంఘం కూడా తప్పుబట్టింది. అయితే ఆయన మాత్రం తానేమీ తప్పుగా మాట్లాడలేదని వివరణ ఇచ్చినా... వివాదం మాత్రం సద్దుమణగలేదు. మరోవైపు ఎన్నికల దృష్ట్యా డీఎంకే కూడా ఆచూతూచి వ్యవహరించింది. వివాదం పెద్దది కావడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. -
నయనతారను చూస్తే దెయ్యాలే పారిపోతాయి
‘‘యంజీఆర్, శివాజీ గణేశన్’ మరణం లేని ఇమేజ్ పొందినవాళ్లు. అలాంటి గొప్పవాళ్లతో నయనతారను పోలుస్తున్నారు. నాకు బాధగా ఉంది. నయనతార స్టారే. లేడీ సూపర్‌స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న మాట వాస్తవమే. కానీ వాళ్లతో పోలికేంటి?’’ అని నయనతార గురించి తమిళ నటుడు రాధారవి కామెంట్ చేశారు. నయనతార ముఖ్య పాత్రలో చక్రి తోలేటి తెరకెక్కించిన చిత్రం ‘కొలైయుదిర్ కాలమ్’. కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చే శారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాధారవి మాట్లాడుతూ– ‘‘నయనతార మంచి నటే. నేనొప్పుకుంటాను. ఇండస్ట్రీలో చాలా కాలంగా కొనసాగుతున్నారు. తన మీద పలు ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా టాప్‌లోనే కొనసాగుతున్నారు. తమిళ ప్రజలు ఏ విషయాన్నయినా నాలుగైదు రోజుల్లో మరచిపోతారు. తను ప్రస్తుతం ఫేమస్ కావచ్చు. తనే సీత పాత్ర చేస్తోంది, దెయ్యం పాత్రలూ చేస్తోంది. ఇంతకుముందు దేవుళ్ల పాత్రలో నటించాలంటే కేఆర్ విజయగారి వద్దకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు? ఎవరైనా చేయొచ్చు. గౌరవప్రదమైన వాళ్లనైనా నటింపజేయొచ్చు, ఎవరెవరితో తిరిగేవాళ్లనైనా నటింపజేయొచ్చు. ఈ మధ్య హారర్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు నయనతార. తనని మామూలుగా చూస్తే దెయ్యాలే పారిపోతాయి’’ అని నయనతారపై కామెంట్ చేశారు. అలాగే ‘మీటూ’ ఉద్యమం మీద కూడా కామెంట్ చేశారు రాధారవి. ‘‘సినిమా ప్రమోషన్లలో పాల్గొనమని నటీనటుల మధ్య అగ్రిమెంట్ కుదుర్చుకోమని మది (‘కొలైయుదిర్ కాలమ్’ చిత్రనిర్మాత, రాధారవి అల్లుడు) కి చెప్పాను. అలాగే షూటింగ్లో భాగంగా హీరోయిన్ను హీరో ఎక్కడైనా తాకుతాడు. ఆ విషయంలో మళ్లీ సినిమా తర్వాత గొడవ చేయకూడదు అనే అగ్రిమెంట్ కూడా ఉండాలి’’ అని పేర్కొన్నారు. ఈ సంచలన వ్యాఖ్యలను పలువురు తమిళ నటీనటులు, దర్శకులు వ్యతిరేకించారు. తమ అభిప్రాయాలను ట్వీటర్లో షేర్ చేశారు. ‘‘రాధారవిగారి ప్రవర్తన విసుగు పుట్టించింది. ఆయనలా స్త్రీలను తక్కువ చేసేవాళ్లను నా సినిమాల్లో తీసుకోకూడదని పర్సనల్‌గా స్టాండ్ తీసుకుంటున్నాను. – మిలింద్ రావ్, దర్శకుడు ఒక గొప్ప కుటుంబం (రాధారవి తండ్రి ప్రముఖ నటుడు ఎం.ఆర్. రాధ) నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇంత అసభ్యకరంగా మాట్లాడినప్పుడు తనని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సపోర్ట్ చేయరు, ఎటువంటి యాక్షన్ తీసుకోరు. ఆయన స్పీచ్‌కు ప్రేక్షకులు కూడా నవ్వుతూ, చప్పట్లు కొట్టడం బాధగా ఉంది. నాకు తెలిసి ఈ సినిమాను మొదలుపెట్టిన దర్శకులు, నిర్మాతలు ఈ సినిమాను సగంలోనే వదిలిపెట్టారు. ఇలాంటి ఒక ఈవెంట్ జరుగుతుందని మాకు తెలియదు. అనవసరమైన ఈవెంట్ నిర్వహించి, అందులో ఇలాంటి అనవసరమైన వాళ్లను కూర్చోబెట్టి సినిమాను ప్రమోట్ చేయడం కంటే అలాంటి ఈవెంట్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. ఇలాంటి ఈవెంట్స్ ద్వారా ఇలాంటి పనికిమాలిన వారి వ్యర్థమైన భావాలను బయటకు చెప్పడానికి ప్రోత్సహించడమే అవుతుంది. నడిగర్ సంఘం, ఇంకేదో సంఘం నుంచి ఎవ్వరూ ఎలాంటి యాక్షన్ తీసుకోరు. బాధాకరం’’ – విఘ్నేశ్ శివన్, దర్శకుడు స్త్రీల మీద అసభ్యకర జోక్స్ వేయడం (అది అసభ్యకరం కాదని వాళ్లు అనుకోవడం), తక్కువ చేయడం, స్త్రీలను కేవలం ఐ క్యాండీల్లా చూడటం ఇండస్ట్రీలో భాగం అయిపోయింది. ఇదంతా ఓకే అనుకుని ఇప్పటివరకూ మాట్లాడని స్త్రీ, పురుషులకు థ్యాంక్స్ (వ్యంగ్య ధోరణిలో). అదీ మన పరిస్థితి. ఇలాంటి అనుభవం మీకు ఎదురైతేనే ఈ విషయం అర్థం అవుతుంది. అప్పుడు కనువిప్పు కలుగుతుంది. చిన్మయి, నేను, ఇంకెందరో స్త్రీలు ‘మీటూ’ అంటూ పోరాటం చేస్తున్న సమయంలో ఇండస్ట్రీలో ఉన్న ఉమెన్ మాతో నిలబడి ఉంటే.. ఏమో పరిస్థితుల్లో కొంచెమైనా మార్పు వచ్చేదేమో? మౌనం మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. ఈ సంఘాలన్నీ నడిపేది కూడా మగ అహంకారులే. ఈ విషయాలపై ఎటువంటి చర్యలు తీసుకోరు. కానీ స్త్రీలను సపోర్ట్ చేస్తున్నాం అని యాక్షన్ మాత్రం చేస్తుంటారు. – వరలక్ష్మీ శరత్‌కుమార్, హీరోయిన్ ఒక సక్సెస్ఫుల్ ఫిమేల్ యాక్టర్‌ను స్టేజ్ మీద తిట్టేస్తున్నారు రాధారవి. వేరే యూనియన్స్ వాళ్ల విషయాల్లో ఇన్వాల్వ్ కాకూడదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, నడిఘర్ సంఘం ఎటువంటి చర్య తీసుకోవడం లేదు’’ – చిన్మయి, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధారవి సోదరి, ప్రముఖ నటి రాధిక కూడా సోదరుడి కామెంట్స్‌ను సపోర్ట్ చేయలేదు. ‘మనకున్న డెడికేటెడ్ నటుల్లో నయనతార ఒకరు. తను నాకు తెలుసు. తనతో పని చేశాను కూడా. తను చాలా మంచి మనిషి. రాధారవి మాట్లాడిన వీడియో మొత్తం చూడలేదు. రవిని ఇవాళ కలిశాను. తను మాట్లాడింది కరెక్ట్ కాదని చెప్పాను’’ అని ట్వీట్ చేశారు రాధిక. ఐరా..నయనతార నయనతార కథానాయికగా నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘ఐరా’. గంగా ఎంటర్టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కేఎమ్ సర్జున్ దర్శకత్వం వహించారు. నయనతార తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. ‘‘ఎమోషనల్ ఫ్యామిలీ హారర్‌గా రూపొందింది. భవాని, యమున పాత్రల్లో నయనతార కనిపిస్తారు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. భావోద్వేగాల సన్నివేశాల్లో నయనతార నటన హైలైట్’’ అని సర్జున్ అన్నారు. కళైయరసి, యోగిబాబు, ఎం.ఎస్. భాస్కర్, వంశీకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కె.ఎస్. సుందరమూర్తి సంగీతం అందించారు. -
వదల చిన్మయీ వదలా!
పెరంబూరు: వదల బొమ్మాళి వదలా అది నిన్నటి సినిమా డైలాగ్. నేటి నిజ డైలాగ్ చిన్మయీ నిన్నొదలా. ఏంటీ అర్థంకా? గాయని ఏ ముహూర్తంలో సీనియర్ నటుడు రాధారవిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందో గానీ, అది ఆరని మంటగా రగులుతూనే ఉంది. గాయని చిన్మయి ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై కూడా లైంగికవేధింపుల ఆరోపణలు గుప్పించింది. అయితే అది ఆరోపణలు, ఖండించడాలతో సరిపెట్టుకుంది. రాధారవి, చిన్మయిల మధ్య కోల్డ్ వార్ కాదు, డైరెక్ట్ వార్నే జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఎవరివి తప్పొప్పులన్న విషయం పక్కన పెడితే ఒకరిపై ఒకరు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని చెప్పవచ్చు. తనపై లైంగిక ఆరోపణలు చేసిన గాయని, డబ్బింగ్ కళాకారిణి చిన్మయిపై ప్రతీకారంగా రాధారవి తను అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దక్షిణభారత సినీ, టీవీ డబ్బింగ్ కళాకారుల సంఘం నుంచి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు చిన్మయి రెండేళ్లుగా సభ్యత్వ రుసుము కట్టడం లేదన్న సాకును చూపించారు. అలా రాధారవి గాయని చిన్మయి వృత్తిపై పెద్ద దెబ్బ తీశారు. అయితే తనను సంఘం నుంచి తొలగించడం ఎవరి తరం కాదని, తాను శాశ్విత సభ్యురాలినని తెలిపిన చిన్మయి ఈ వ్యవహారంలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానని అంటోంది. అంతటితో ఆగకుండా రాధారవి పరువు మీద దెబ్బకొట్టేలాంటి చర్యలకు పాల్పడింది. నటుడు రాధారవి తన పేరుకు ముందు దత్తో అనే మలేషియా ప్రభుత్వం అందించిన బిరుదును తగిలించుకుంటారు. అయితే ఆ బిరుదు నకిలీదన్న విషయాన్ని గాయనీ చిన్మయి బట్టబయలు చేసింది. తాను మలేషియా ప్రభుత్వానికి ఈ విషయమై లేఖ రాశానని, అందుకు స్పందించిన ఆ ప్రభుత్వం రాధారవికి అలాంటి బిరుదు ఇవ్వలేదని చెప్పినట్లు చిన్మయి తన ట్విట్టర్లో పేర్కొని కలకలం సృష్టించింది. దీంతో రాధారవి ఆమెపై మండిపడుతున్నారు. ఆయన సోమవారం ఒక మీడియాతో మాట్లాడుతూ గాయని చిన్మయి అబద్దాల మీద అబద్దాలు వల్లివేస్తోందన్నారు. ఆమె గీతరచయిత వైరముత్తును బ్లాక్ మెయిల్ చేసేలా ఆయనపై అసత్యలైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందన్నారు. తరువాత తనపైకి వచ్చిందని,తన వద్ద ఇవ్వడానికి ఏమీ లేదు నిజాలు తప్ప అని అన్నారు. తనకు దత్తో అవార్డును ప్రదానం చేసిన వారితోనే నిజాలు చెప్పిస్తానని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా చిన్మయిని తాను వదిలేది లేదని అన్నారు. మరి వీరిద్దరి మధ్య వార్ ఎటు దారి తీస్తుందో చూడాలి. -
విశాల్‌ది అనుభవ రాహిత్యం
నటుడు విశాల్ అనుభవరాహిత్యుడని రాధికా శరత్‌కుమార్ దుయ్యబట్టారు. అదే విధంగా నటుడు కార్తీ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. ఆదివారం జరిగిన దక్షిణ భారత నటీనటులు సర్వసభ్య సమావేశంలో సంఘ మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవిలపై వేటు పడిన విషయం తెలిసిందే. వారి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తోంది. సంఘం తీర్మానాన్ని తప్పుపడుతూ సభ్యత్వ రద్దు వ్యవహారాన్ని శరత్‌కుమార్, రాధారవి చట్టపరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు. కాగా నటి రాధికా శరత్‌కుమార్ మాత్రం నటులు విశాల్, కార్తీలపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ నటీనటుల సంఘం ట్రస్ట్‌కు తన భర్త శ్వాశత ట్రస్టీగా ప్రకటించుకున్నట్లు నటుడు కార్తీ అన్నారనీ, అందుకు తగిన ఆధారాలను వారు చూపగలరా? అంటూ ప్రశ్నించారు. ఇక ఇరు తరుఫు చర్చలు జరపకుండా తన భర్త శరత్‌కుమార్‌ను సస్పెండ్ చేయడం కోర్టును అవమానపరచడమే అవుతుందన్నారు. ఇక సంఘ ట్రస్ట్‌కు సంబంధించిన లెక్కలు చెప్పలేదని అంటున్నారని, అరుుతే తాము ఇంతకుముందు ఇచ్చిన లెక్కల పేపర్లను ప్రేమ లేఖలుగా భావిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు విశాల్ అనుభవరాహిత్యుడని పేర్కొన్నారు. అతడు తన బుద్ధిహీనతను ప్రదర్శించరాదని హితవు పలికారు. సంఘ సర్వసభ్య సమావేశ వేదికను అనూహ్యంగా మర్చడానికి మీకు ఏ అధికారి అనుమతిచ్చారు? ఆ వివరాలను చెప్పండి. ఒక శాశ్వత సంఘ సభ్యురాలిగా తనకు తెలియజేయాల్సిన అవసరం లేదా? అంటూ ప్రశ్నంచారు. మరి రాధిక ప్రశ్నలకు సంఘ ప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
ఆ ఇద్దరికీ శాశ్వత ఉద్వాసన
దక్షిణ భారత చలన చిత్ర రంగంలో ప్రముఖులుగా ఉన్న శరతకుమార్, రాధారవిలకు నడిగర్ సంఘం నుంచి శాశ్వతంగా ఉద్వాసన పలికారు. ఆ ఇద్దరిపై వేటు వేస్తూ ఆదివారం జరిగిన నడిగర్‌సంఘం సర్వ సభ్య సమావేశంలో తీర్మానించారు. ఇక, ముష్టియుద్ధాలు, దాడులు, ప్రతి దాడుల నడుమ సమావేశ ప్రాంగణం వెలుపల ఉత్కంఠ నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. చెన్నై : గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో నటుడు విశాల్ వర్గం గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా ఓటమి పాలైన శరత్‌కుమార్ వర్గం సంఘ నిర్వాకంలో పలు అవకతవకలకు పాల్పడినట్లు అధికారం చేపట్టిన నూతన కార్యవర్గం ఆరోపణలు చేసింది. ముఖ్యంగా సంఘ ట్రస్ట్ నిధికి సంబంధించి పలు అక్రమాలు జరిగినట్లు పేర్కొంటూ దానికి ప్రధాన ట్రస్టీలుగా బాధ్యతలు నిర్వహించిన శరత్‌కుమార్, రాధారవిలను సంఘం నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రటించారు. ఈ విషయమై శరత్‌కుమార్ వర్గం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో ఉండగానే ఆదివారం స్థానిక టీనగర్, అబిబుల్లా రోడ్డులో గల సంఘ ఆవరణలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవిలను సంఘం సభ్యత్వం నుంచి శ్వాశతంగా ఉద్వాసన పలుకుతూ తీర్మానం చేశారు. సంఘ అధ్యక్షుడు నాజర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎంజీఆర్ శతాబ్ది వేడుకలను, దివంగత ప్రముఖ కథాకారుల పేరుతో అవార్డుల ప్రధాన కార్యక్రమాలను నిర్వహించారు. బి.సరోజాదేవికి మక్కల్ తిలకం అవార్డు కాగా ప్రఖ్యాత నటి సరోజాదేవిని మక్కల్ తిలకం అవార్డుతో సత్కరించారు, అదే విధంగా నడిగర్ తిలకం అవార్డును నటి కాంచనకు, భానుమతి అవార్డును నటి ఊర్వశీ శారదకు, అంజలిదేవి అవార్డును, నటి వాణిశ్రీకి, ఎంఆర్.రాధ, తంగవేల్ల పేరుతో అవార్డును నటుడు వెన్నిరాడై మూర్తికి, టీపీ.రాజ్యలక్ష్మి అవార్డును ఎంఎస్.రాజ్యంకు, మనోరమ అవార్డును ఎస్.పార్వతికి, సహస్రనామ అవార్డును ఎన్ఎస్కే.థామ్‌కు, ఎస్ఎస్.రాజేంద్రన్ అవార్డును వినూచక్రవర్తికి అందించి ఘనంగా సత్కరించారు. తమిళసినిమా శతాబ్ది అవార్డుల ప్రదానం అదే విధంగా తమిళసినిమా శతాబ్ది అవార్డులను నటి బీఎస్.సరోజా, చో.రామసామి, శ్రీకాంత్, చారుహాసన్, కే.పురట్చిరాణి, ఎంపీ.విల్వనాథన్, ఎంఆర్.కన్నన్, కేఎస్వీ.కనకాంబరం, టీఆర్.తిరునావక్కురసు. వి.రాజశేఖరన్, ఎంఎస్.జహంగీర్, ఏఆర్.శ్రీనివాసన్, టీఎస్.జోకర్‌మణి, ఆర్.శంకర్, జి.రామనాథన్, పదార్థం పొన్నుసామి, ఆర్.ఎన్.బాలదాసన్, సీఆర్.పార్తిబన్, ఆర్.గుణశేకరన్, ఎంఆర్.విశ్వనాథన్, జే.కమల, టీఎస్.రంగరాజ్, ఒరు ఇరవు. వసంతన్, టీఎస్కే.నటరాజ్, నాంజల్ నళిని, కేకే.జూడోరత్నం, పీ.సరస్వతి,కే. పన్నీర్‌సెల్వం మొదలగు వారికి అందించి సత్కరించారు. ఆందోళన, ముష్టి యుద్ధాలు: సంఘం నుంచి తొలగించబడిన సభ్యులు, వ్యతిరేక వర్గం తమను సమావేశంలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలంటూ సమావేవ వేదిక ముందు ఆందోళనకు దిగారు. కొందరు సంఘ సభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్రంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది.ముష్టి యుద్ధాలకు దిగారు.పలువురికి గాయాలయ్యారుు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేక పోవడంతో లాఠిచార్జి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆందోళన కారులను అరెస్ట్ చేశారు. విశాల్ కార్యాలయం పై దాడి: అదే విధంగా సంఘ ఉపాధ్యక్షుడు, శాసనసభ్యుడు కరుణాస్ కారుపై ఆందోళన కారులు దాడి చేసి కారు అద్దాలను పగులగొట్టారు.ఇక్కడ ఇలా ఆందోళన జరుగుతుండగా సంఘం కార్యదర్శి విశాల్ కార్యాలయంపై దాడి చేశారు. రాళ్లతో దాడి చేసి కార్యాలయం నిర్వాహకులను గాయపరచారు. వేటును సమర్థించుకున్న నిర్వాహకులు కాగా ఇలా ఉద్రిక్త వాతావరణంలో సంఘం సర్వసభ్య సమావేశం పూర్తి చేసిన నిర్వాహకులు శఅనంతరం మీడియా సమావేశంలో శరత్‌కుమార్, రాధారవిల సభ్యత్వం నిరంతర రద్దును సమర్థించుకున్నారు.ఈ సందర్శంగా కోశాధికారి కార్తీ మాట్లాడుతూ గత నిర్వాకంలో సంఘ ట్రస్ట్‌కు తొమ్మింది మంది ట్రస్టీలు ఉండాల్సింది, శరత్‌కుమార్, రాధారవి మాత్రమే మొత్తం అధికారం ఉండేటట్లుగా వ్యవహరించి సంఘ నిధికి సంబంధించి పలు ఆక్రమాలకు పాల్పడట్టు లెక్కల్లో తేలిందన్నారు.అందుకే వారిపై వేటు వేసినట్లు వివరించారు.ఇకపై అవినీతిని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశం జరగనివ్వకుండా కొందరు కావాలనే ఆందోళనకు దిగారని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కార్యదర్శి విశాల్ తెలిపారు. నడిగర్ సంఘం నుంచి శాశ్వతంగా రద్దు చేయడంపై రాధారవి స్పందిస్తూ నడిగర్ సంఘంలో మేము అన్నీ కరెక్ట్‌గానే చేశామని, సంఘం నుంచి తొలగించడంపై కోర్టులో తేల్చుకుంటామని అన్నారు. -
రాధారవిపై నిషేధం చెల్లదు : హైకోర్టు తీర్పు
తమిళసినిమా: నడిగర్ సంఘానికి ఎదురు దెబ్బ తగిలింది. నడిగర్ సంఘంలో అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు మోపబడ్డ ఆ సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, రాధారవి, వాగై చంద్రశేఖర్‌లను సభ్యత్వం నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ఇటీవల సంఘ నూతన కార్యవర్గం వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా తనను సంఘం నుంచి నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సంఘ మాజా కార్యద ర్శి రాధారవి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తి సుందరేశన్ సమక్షంలో విచారణకు వచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తి సుందరేశన్ రాధారవిపై నిషేధం చెల్లదంటూ తీర్పునిచ్చారు. -
శరత్‌కుమార్, రాధారవి సస్పెన్షన్
చెన్నై: దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నుంచి ఆ సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి, మాజీ కోశాధికారి వాగా చంద్రశేఖర్‌లను సస్పెండ్ చేసినట్లు సంఘ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా చెప్పినట్లే సంఘ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, అందులో భాగంగా తాము నిర్వహించిన శోధనల్లో గత సంఘం నిర్వాహకం చేసిన పలు అవకతవకలు, అవినీతి వెలుగులోకి వచ్చాయని, వీటి గురించి పలు మార్లు కార్యవర్గ సమావేవంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు నడిగర్ సంఘం పేర్కొంది. అందులో భాగంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని, సంఘ విధి విధానాల పరంగా జరిగిన అవకతవకలపై విచారణలో నిజానిజాలు బయటపడతాయని తెలిపింది. అంత వరకూ మాజీ సంఘం నిర్వాహకులు శరత్‌కుమార్, రాధారవి, వాగా చంద్రశేఖర్‌ల సంఘ సభ్యత్వంను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది. అవకతవకలపై కోర్టు తీర్పు అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని తెలపింది. -
కమల్‌హాసన్ గురించి తప్పుగా మాట్లాడారు
చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్ గురించి నడిగర్ సంఘం కార్యదర్శి రాధారవి తప్పుగా మాట్లాడారని, ఆ ఆధారాలు తన వద్ద ఉన్నాయని నటుడు విశాల్ అన్నారు. నడిగర్ సంఘం వ్యవహారంలో శరత్‌కుమార్ వర్గం, విశాల్ వర్గం మధ్య పోటీ తీవ్రరూపం దాల్చిందని చెప్పక తప్పదు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేస్తున్నారు. విమర్శలు గుప్పించుకుంటున్నారు. అలాగే ఓట్ల ప్రచారం ముమ్మరం చేశారు. నటుడు విశాల్ వర్గం సేలం తిరుచ్చి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడి రంగస్థల నటులతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుత సంఘ నిర్వాహకులపై అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ దండెత్తారు. తిరుచ్చి దేవర్ హల్లో నిర్వహించి న సమావేశంలో నటుడు విశాల్ మాట్లాడుతూ తాము పదవుల కోసం ఊరూరా తిరగడంలేదని అన్నారు. సినిమా తమ కుటుంబం అని అందులో రంగస్థల నటులు ఒక అంగం అని పేర్కొన్నారు. అలాంటి వారి క్షేమం కోసం గొంతెత్తడం తప్పా? అంటూ ప్రశ్నించారు. నటుడు కమల్‌హాసన్‌ను రాధారవి తప్పుగా మాట్లాడారు. ఆ ఆధారాలు చూపడానికి తాను రెడీ అన్నారు విశాల్. సహ నటీనటులను తక్కువ చేసి మాట్లాడటం నాగరికతా? అంటూ ప్రశ్నించారు. ఇకపై సంఘం వ్యవహారాల్లో విశాల్ మాత్రమే కాదు నటులందరూ ప్రశ్నిస్తారన్నారు. తాను తమ జట్లుకు ఓటు వేయమని అడగడం లేదని మనసాక్షికనుగుణంగా ఓటు వేయండి అంటున్నానని విశాల్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో నటుడు నాజర్, కరుణాస్, పోన్వన్నన్ తదితరులు పాల్గొన్నారు.