సినిమా: సీనియర్ నటుడు రాధారవి క్వారంటైన్‌లో ఉన్నట్టు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. ఈయన గత పదో తేదీన చెన్నై నుంచి కుటుంబంతో సహా నీలగిరిలోని కొత్తగిరిలో తన నూతన భవనానికి వెళ్లారు. అయితే, ఆయన చెన్నైలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయన కొత్తగిరికి మకాం మార్చడం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారులకు తెలియడంతో వారు అక్కడికి వెళ్లి విచారించారు. అయితే, రాధారవి అన్ని అనుమతులతోనే కొత్తగిరికి వచ్చినట్టు తెలిసింది.
అయినా గానీ, ఆయన కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. దీంతో మంగళవారం కొత్తగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి రాధారవి కుటుంబం కరోనా పరీక్షలను చేయించుకున్నారు. అయితే, రిజల్ట్ రావాల్సి ఉంది. ఈ కారణంగా 14 రోజుల పాటు రాధారవి కుటుంబాన్ని ఇంటిలోనే ఉండాల్సిందిగా అధికారులు సూచించారని, ఇంటికి ఓ స్టికర్ కూడా అతికించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, నటుడు రాధారవి ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను వేసవి విడిది కోసమే కొత్తగిరికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఇలాంటి అసత్యప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment