కోలీవుడ్‌లో ఈ ఏడాదిలో విడుదలైన 'నిరంగల్ మూండ్రు' అనే సినిమా మూడు విభిన్న కథలతో తెరకెక్కింది. దర్శకుడు కార్తీక్ నరేన్ ప్రతిభకు తమిళ్ సినిమా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు తాజాగా ప్రకటన వచ్చింది. ఈ సినిమాపై కోలీవుడ్‌లో చాలామంది ప్రశంసలు కురిపించారు.
తమిళ్‌లో నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రంలో అథర్వ మురళి, నిక్కీ గల్రాని,అభిరామి, రెహమాన్, శరత్‌కుమార్ వంటి స్టార్స్ నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురిచేసిన 'నిరంగల్ మూండ్రు' ఇప్పుడు తమిళ్ ఆహా ఓటీటీలో విడుదల కానుంది. డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన కూడా వెలువడింది. అయితే, తెలుగులో కూడా అదే రోజు విడుదల కావచ్చని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.
'నిరంగల్ మూండ్రు' చిత్రాన్ని మొదట తమిళ్ వర్షన్‌తో పాటే టాలీవుడ్‌లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల కుదరలేదు. దీంతో ఓటీటీలో మాత్రం రెండు భాషలలో ఒకేసారి డిసెంబర్ 20న స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment