Atharvaa
-
ఓటీటీలో అథర్వ, శరత్‌కుమార్ థ్రిల్లర్ సినిమా
కోలీవుడ్‌లో ఈ ఏడాదిలో విడుదలైన 'నిరంగల్ మూండ్రు' అనే సినిమా మూడు విభిన్న కథలతో తెరకెక్కింది. దర్శకుడు కార్తీక్ నరేన్ ప్రతిభకు తమిళ్ సినిమా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు తాజాగా ప్రకటన వచ్చింది. ఈ సినిమాపై కోలీవుడ్‌లో చాలామంది ప్రశంసలు కురిపించారు.తమిళ్లో నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రంలో అథర్వ మురళి, నిక్కీ గల్రాని,అభిరామి, రెహమాన్, శరత్‌కుమార్ వంటి స్టార్స్ నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురిచేసిన 'నిరంగల్ మూండ్రు' ఇప్పుడు తమిళ్ ఆహా ఓటీటీలో విడుదల కానుంది. డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన కూడా వెలువడింది. అయితే, తెలుగులో కూడా అదే రోజు విడుదల కావచ్చని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.'నిరంగల్ మూండ్రు' చిత్రాన్ని మొదట తమిళ్ వర్షన్‌తో పాటే టాలీవుడ్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల కుదరలేదు. దీంతో ఓటీటీలో మాత్రం రెండు భాషలలో ఒకేసారి డిసెంబర్ 20న స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. -
అధర్వ హీరోగా కొత్త మూవీ.. టైటిల్ ఫిక్స్!
కోలీవుడ్ నటుడు అధర్వ కథానాయకుడిగా నటించనున్న తాజా చిత్రానికి డీఎన్ఏ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకుముందు మనం కొత్తి పరవై, డాడా, కళువేత్తి మూర్కన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఒలింపియా మూవీస్ అధినేత అంబేత్‌కుమార్ తర్వాత చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇందులో నటుడు అధర్వ కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనకు జంటగా చిత్తా చిత్రంతో పాపులర్ అయిన మలయాళ నటి నిమీషా సజయన్ నటిస్తున్నారు. కాగా ఇంతకుముందు ఒరునాళ్ కూత్తు, మాన్స్టర్, పర్హానా వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన నెల్సన్ వెంకటేశన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. (ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 29 సినిమాలు) తాజాగా ఈ మూవీకి డీఎన్ఏ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం బుధవారం పూజాకార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ వేడుకలో నిర్మాత ఆర్బీ.చౌదరి, దర్శకుడు పా.రంజిత్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైవిధ్యమైన కథాంశంతో యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ప్రణాళిక ప్రకారం చిత్రాన్ని త్వరగా పూర్తిచేయనున్నట్లు చెప్పారు. కాగా ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. (ఇది చదవండి: నువ్వు నీలా ఉండు అని చెప్పింది ) Twitter Glimpse from #DNA film launch auspicious Pooja Starring @atharvaaMurali #NimishaSajayan Directed by @nelsonvenkat@Olympiamovis Production@Filmmaker2015 @editorsabu @amudhanPriyan @nagarajandir @Sanjay_cheqba @sharmaseenu11 @SriramRavi33@donechannel1 pic.twitter.com/SAZyHQsyPQ — Olympia Movies (@Olympiamovis) October 11, 2023 Twitter Presenting the title look of @atharvaaMurali & #NimishaSajayan starring #DNAmovie 🧬 Directed by @nelsonvenkat The shooting has officially kicked off. Brace yourself for an crime action drama@Ambethkumarmla@Filmmaker2015 @editorsabu @amudhanPriyan @nagarajandir pic.twitter.com/5T8io8BpkD — Olympia Movies (@Olympiamovis) October 11, 2023 -
వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ హీరో
తమిళసినిమా: నటుడు అధర్వ కథానాయకుడిగా నటించిన తొలి వెబ్ సిరీస్ మత్తగం. దర్శకుడు గౌతమ్ మీనన్, నటుడు మణికంఠన్, నటి నిఖిలా విమల్, డీడీ, ఇళవరసు, అరువి తిరునావుక్కరసు, మూనార్ రమేశ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. ఎడ్విన్ సాకే ఛాయాగ్రహణంను, దర్శకుడు శివ సంగీతాన్ని అందించారు. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు అధర్వ మాట్లాడుతూ మత్తగమ్ వెబ్ సిరీస్ ను 2018లోనే ప్రారంభించినట్లు చెప్పారు. దర్శకుడు గౌతమ్ మీననే ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రసాద్ మురుగేశన్‌ను పరిచయం చేశారని తెలిపారు. ప్రసాద్ మురుగేశన్ ఈ కథను క్వీన్ చిత్రానికి ముందే సిద్ధం చేశారని చెప్పారు. కథ సూపర్‌గా వచ్చిందని, దీన్ని దర్శకుడు తాను అనుకున్న విధంగా తెరకెక్కించారన్నారు. షూటింగ్ పూర్తిగా రాత్రి వేళలోనే నిర్వహించినట్లు చెప్పారు. దీనికి ముందుగా బైబిల్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు, ఆ తర్వాత పలు మార్పులు చేర్పులు చేయడంతో ఇది ఎలా వస్తుందో అన్న సందేహం ఉండేదన్నారు. దర్శకుడు శ్రమనే తమకు పోరాటం ఇచ్చిందన్నారు. ఇప్పుడు దీన్ని స్ట్రీమింగ్ చేస్తున్న డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు అధర్వ పేర్కొన్నారు. -
క్రైమ్ థిల్లర్‌గా వస్తున్న 'అధర్వ'.. త్వరలోనే రిలీజ్ డేట్ ఫిక్స్..!
యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో క్రైమ్ థిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమా 'అధర్వ'. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రానికి విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. (చదవండి: యంగ్ టైగర్ మూవీ బిగ్ అప్ డేట్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్) ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే.. మరోవైపు ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచారు మేకర్స్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
దేశంలో అడ్రస్ లేని గ్రామాలు ఎన్నో..!
చెన్నై సినిమా: ఇండియాలో అడ్రస్ లేని గ్రామా లు ఎన్నో ఉన్నాయని దర్శకుడు రాజమోహన్ పేర్కొన్నారు. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'అడ్రస్'. కాక్టైల్ సినిమా పతాకంపై నిర్మాత తమిళ్మణి వారసుడు అజయ్‌కృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో నటుడు అధ్వర్య మురళి ముఖ్య పాత్ర పోషించారు. ఇసక్కీ భారత్, దియా జంటగా నటించిన ఈ చిత్రానికి గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమ వుతున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం (ఏప్రిల్ 20) రాత్రి చెన్నైలో నిర్వహించా రు. చదవండి: మోసపోయిన ముగ్గురు మహిళల కథే 'ర్యాట్' నిర్మాత కె.రాజన్ నటుడు ఆర్.కె.సురేష్ తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ సమస్య అనేది ప్రతి మనిషికి, ప్రతి ఊరికి ఉంటుందన్నారు. దేశ ప్రధాని నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి, వార్డు కౌన్సిలర్ల దాకా.. తిరునెల్వేలి వరకు ఉన్న గ్రామాల గురించి తెలుసన్నారు. ఆ తరువాత ఉన్న గ్రామాల గురించి ఎవరికీ తెలియదన్నారు. అలాంటి ఒక గ్రామ ప్రజల ఈతి బాధలను ఆవిష్కరించే చిత్రమే 'అడ్రస్' అని తెలిపారు. చదవండి: హీరోతో బిగ్‌బీ మనవరాలు చెట్టాపట్టాల్, డేటింగ్ అనేసరికి కవరింగ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1651344978.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కన్నడంలో నిన్ను కోరి
నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ముఖ్య తారలుగా 2017లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘నిన్ను కోరి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతోంది. అథర్వా మురళి, అనుపమా పరమేశ్వరన్ జంటగా ‘తలళ్లి పోగాదే’ టైటిల్‌తో ఈ రీమేక్ తెరకెక్కుతోంది. తాజాగా కన్నడంలోనూ ‘నిన్ను కోరి’ రీమేక్ కాబోతోందని సమాచారం. కన్నడ పాపులర్ నటుడు ధృవ్ సార్జా ఈ రీమేక్‌లో హీరోగా నటించనున్నారు. నంద కిశోర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. -
తర్వాత ఏం జరుగుతుంది?
‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయమయ్యారు తమిళ యువ నటుడు అధర్వ మురళి. ఆయన నటించిన తమిళ చిత్రం ‘బూమరాంగ్’ను అదే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్. ఆర్. కణ్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్, ఇందుజా రవిచంద్రన్ కథానాయికలు. రేపు(3న) విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘అధర్వ నాకు ఇష్టమైన హీరో. చాలా ప్యాషనేట్ హీరో.. యువత తలుచుకుంటే ఎలాంటి మార్పు తీసుకురావచ్చనే సందేశాన్ని ఈ చిత్రంలో చక్కగా చెప్పారు’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి. తర్వాత ఏం జరుగుతుందోనని ఊహించలేని విధంగా దర్శకుడు స్క్రీన్‌ప్లే రాశారు’’ అన్నారు నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్. -
ఒకటే మాట.. సూపర్ హిట్
‘‘ప్రీమియర్ షోస్ పడినప్పటి నుంచి పాజిటివ్ టాక్ మొదలైంది. ఆనందంతో నిద్రపట్టలేదు. చిరంజీవిగారు, అల్లు అరవింద్‌గారు ఫోన్ చేసి అభినందించారు. ఇది నా ఒక్కడి సక్సెస్ కాదు మా టీమ్‌ది’’ అన్నారు వరుణ్ తేజ్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా పూజా హెగ్డే, మృణాళిని రవి, అథర్వ ముఖ్య పాత్రధారులుగా రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ వచ్చిందని చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో నాగబాబు, 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, వరుణ్ తేజ్, హరీశ్ శంకర్ తదితరులు కేక్ కట్ చేసి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ‘‘అందరి నోటా ఒకటే మాట.. సూపర్‌హిట్ అని. వరుణ్ వన్ మేన్ షో అంటున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిగారు ఫోన్ చేయడంతో మాకు ఇంకా ఎనర్జీ వచ్చింది. కొంతమందైతే నీ కెరీర్ బెస్ట్ వర్క్ అన్నారు. వరుణ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ కావడం ఆనందం’’ అన్నారు హరీశ్ శంకర్. -
టీజర్ వచ్చేస్తోంది
వరుణ్ తేజ్ విలనిజమ్ ఎలా ఉంటుందో చిన్న ప్రీ–టీజర్‌తో టీజ్ చేశారు ‘వాల్మీకి’ టీమ్. ఇప్పుడు టీజర్‌ను రెడీ చేస్తున్నారని తెలిసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్, అథర్వ మురళి నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే కథానాయిక. 14రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తోంది. తమిళ చిత్రం ‘జిగర్తండా’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇందులో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. ఓ వారం పది రోజుల్లో చిత్రం టీజర్‌ను రిలీజ్ చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోందని తెలిసింది. షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. మరో 10–15 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టేస్తారని సమాచారం. సెప్టెంబర్ 13న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: అయాంకా బోస్. -
పీఆర్ టీం అత్యుత్సాహం.. సారీ చెప్పిన హీరో
చాలా సందర్భాల్లో తమ వ్యక్తిగత సిబ్బంది, పీఆర్ సిబ్బంది చేసే తప్పుల కారణంగా సెలబ్రిటీలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా సినీరంగంలో ఉన్నవారికి ఇలాంటి అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఓ హీరోకు సంబంధించిన పీఆర్ టీం అత్యుత్సాహం కారణంగా ఏకంగా హీరోనే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కోలీవుడ్ యంగ్ హీరో అధర్వ హీరోగా తెరకెక్కిన మూవీ ‘100’. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక షోలో అధర్వ పీఆర్ టీం చేసిన పనికి అధర్వ స్వయంగా క్షమాపణ కోరాల్సి వచ్చింది. ప్రెస్‌కు వచ్చిన శుభకీర్తన అనే మహిళా రిపోర్టర్‌కు పీఆర్ టీం టికెట్ ఇవ్వలేదు. ప్రత్యేకంగా ప్రెస్ కోసం ఏర్పాటు చేసిన షోలో రిపోర్టర్‌కు టికెట్ ఇవ్వకపోగా మీ టికెట్ మీరే తీసుకోవాలి మేము సహాయం చేయలేం అంటూ సమాధానమిచ్చారు. తనకు ఎదురైన అనుభవాన్ని శుభకీర్తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఇలాంటి వారి నుంచి ప్రొఫెషనలిజం ఆశించవద్దనే.. కొత్త పాఠం నేర్పించారు’ అంటూ పీఆర్ టీంకు చురకలంటించారు. ఈ ట్వీట్‌పై స్పందించిన హీరో అధర్వ, దర్శకుడు సామ్ ఆంటోన్లు శుభకీర్తనను తన టీం తరపున క్షమాపణలు కోరారు. అధర్వ తనను కాంటాక్ట్ చేసిన విషయాన్ని ఆమె తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. The Tamil film PR guys think they screen shows for the press by doing us a favour. At the #100TheMovie press show, I was told, 'There's no seat. You've got to find one for yourself. We can't help.' Thanks, @DoneChannel1 for showing me not to expect professionalism. Lesson learnt. — Subhakeerthana (@bhakisundar) 8 May 2019 Sorry mam .. I will make sure will give u tickets when the movie releases .. I apologise on my behalf — sam anton (@samanton21) 9 May 2019 -
బిందుమాధవికి భలేచాన్స్
నటి బిందుమాధవికి భలే చాన్స్ తలుపు తట్టనుందని సమాచారం. తెలుగింటి ఆడపడుచు అయిననీ అమ్మడు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. కళుగు వంటి చిత్రాల్లో నటిగా చక్కని ప్రతిభను చాటుకుని ప్రశంసలు అందుకుంది. అయినా ఎందుకనో నటిగా రావలసినంత పేరు రాలేదు. ఈ మధ్య చేతిలో అకాశాలు లేక సొంత ఊరికి వెళ్లిపోయింది కూడా. అలాంటి బిందుమాధవికి అనుకోకుండా ఒక లక్కీచాన్స్ తలుపుతట్టిందన్నది తాజా సమాచారం. దర్శకుడు బాలా విషయానికి వస్తే ఈయన చిత్రాల్లో నటులెంత వాళ్లైనా పాత్రలే కనిపిస్తాయి. బాలా ప్రస్తుతం యువ హీరోలతో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల సూర్య హీరోగా చిత్రం చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. బాలా కథను వినిపించారని, అది సూర్యకు బాగా నచ్చిందని టాక్ స్ప్రెడ్ అయింది. అయితే ప్రస్తుతం సూర్య వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ఎన్జీకే చిత్రం మేడే సందర్భంగా తెరపైకి రానుంది. కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించిన కాప్పాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబరులో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రు చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరువాత శివ దర్శకత్వంలో ఒక చిత్రం, హరి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. దీంతో బాలా దర్శకత్వంలో ప్రస్తుతం నటించలేనని చెప్పడంతో ఆయన మరో కథను తయారు చేసుకున్నారు. ఇందులో యువ నటులు ఆర్య, అధర్వ హీరోలుగా నటించడానికి సై అన్నారు. ఇందులో బిందుమాధవికి నటించే అవకాశం వచ్చిందని సమాచారం. దీనికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించడం మరో విశేషం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
అధర్వ, హన్సిక చిత్రానికి డేట్ ఫిక్స్
నటుడు అధర్వ, నటి హన్సిక జంటగా నటించిన చిత్రం 100. ఈ చిత్ర విడుదలకు డేట్ ఫిక్స్ అయ్యింది. బూమరాంగ్ చిత్రం తరువాత నటుడు అధర్వ నటించిన చిత్రం 100. ఇంతకు ముందు పలు చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేసిన ఆరా సినిమస్ సంస్థ చిత్ర నిర్మాణంలోకి దిగి నిర్మిస్తున్న చిత్రం ఇది. అధర్వకు జంటగా హన్సిక నటిస్తున్న ఈ చిత్రానికి డార్లింగ్ (తమిళ్) సినిమాకు దర్శకత్వం వహించిన శ్యామ్ అంటన్ దర్శకత్వం వహిస్తున్నారు. నటి హన్సిక కోలీవుడ్ తెరపైకి వచ్చి చాలా కాలం అయ్యింది. దీంతో 100 చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. పైగా 100 అనగానే ఇదేదే పోలీస్ ఇతి వృత్తంతో కూడిన చిత్రం అనిపిస్తోంది కదూ! అవును ఇది అలాంటి కథా చిత్రమే. ఇందులో అధర్వ పోలీస్ అధికారిగా నటించారు. లవ్, యాక్షన్, కామెడీ అంశాలతో కూడిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని యూనిట్ వర్గాలు తెలిపారు. యోగిబాబు, మైమ్‌గోపి, రాహుల్‌దేవ్, రాధారవి, రమేశ్‌ఖన్నా, వీటీవీ.గణేశ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి సంగీతం శ్యామ్ సీఎస్ అందించారు. 100 చిత్రాన్ని మే 3వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. కార్మికుల దినోత్సవం అయిన మేడే రోజున నటుడు గౌతమ్ కార్తీక్ నటించిన దేవరాట్టం, అరుళ్‌నిధి నటించిన కే 13 చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో రెండు రోజుల తరువాత అధర్వ, హన్సికల చిత్రం 100ను విడుదల చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ప్రస్తుతం హన్సిక మహా చిత్రంలో నటిస్తోంది. హీరోయిన్ సెంట్రిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆమెకు 50వ చిత్రం అన్నది తెలిసిందే. -
అందరినీ ఆకట్టుకునేలా ‘బూమరాంగ్’
బూమరాంగ్ చిత్రం జనరంజకంగా ఉంటుందని ఈ చిత్ర కథానాయకుడు అధర్వ పేర్కొన్నారు. ఈయనకు జంటగా ఇందుజా, మేఘాఆకాశ్ నటించారు. దర్శకుడు ఆర్.కన్నన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. రథన్ సంగీతాన్ని, సెల్వ ఛా యాగ్రహణం అందించిన ఈ చిత్రం 8న తెరపైకి రావడానికి ముస్తాబైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ఆర్.కన్నన్ మాట్లాడుతూ.. ఒక చిత్రం అనుకున్న విధంగా రూపొందించాలంటే హీరో సహకారం అవసరం అన్నారు. అలా ఈ చిత్రానికి నటుడు అధర్వ బలంగా నిలిచారని అన్నారు. అందుకే తాను అధర్వతో మరో చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. బూమరాంగ్ చిత్రానికి సహకారాన్ని అందించిన పంకజ్ మెహతా, అన్భుచెలియన్, రాంప్రసాద్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. బూమరాంగ్ చిత్రాన్ని మంచి తేదీలో విడుదల చేయడానికి సహకరించిన ట్రైడెంట్స్ ఆర్ట్స్ రవీంద్రన్‌కు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని దర్శక నిర్మాత ఆర్.కన్నన్ అన్నారు. చిత్ర కథానాయకుడు అధర్వ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభించామో, ఎప్పుడు పూర్తి చేశామో తెలియలేదన్నారు. అంతవేగంగా బూమరాంగ్ చిత్రాన్ని పూర్తి చేశామని తెలిపారు. బూమరాంగ్ అంటే కర్మ అని అర్థం అని, మనం ఏం చేశామో అదే మనకు తిరిగి వస్తుందని అన్నారు. ఈ చిత్రం కోసం ప్రచార బృందం అంటూ ఏమీ ఉండదన్నారు. ఈ చిత్రాన్ని తాము అంతా కలిసి జనరంజకంగా రావడానికి శ్రమించి పని చేశామని చెప్పారు. ఇందులో హీరోయిన్లుగా నటించిన మేఘాఆకాశ్, ఇందుజా ఇద్దరూ తమిళ భాష తెలిసిన నటీమణులనీ, వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందనీ అధర్వ పేర్కొన్నారు. -
వాల్మీకి కోసం కోలీవుడ్ హీరో..!
విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో వరుణ్ తేజ్. ఇటీవల అంతరిక్షం సినిమాతో ఆకట్టుకున్న వరుణ్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న వాల్మీకిలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో కీలక పాత్రకు తమిళ నటుడ్ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ పాత్రకు నాగశౌర్య, శ్రీ విష్ణులలో ఒకర్ని హీరోగా తీసుకోనున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు తమిళ హీరో అధర్వను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా అధర్వ ఈ వాల్మీకి తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటం కాయంగా కనిపిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. -
ఒక్కడే కానీ మూడు గెటప్స్
‘హృదయం’ ఫేమ్ మురళి గుర్తుండే ఉంటారు. మురళి కుమారుడు అథర్వా మురళి హీరోగా తమిళంలో వరుస సినిమాలతో మంచి బిజీగా ఉన్నారు. లవర్‌బాయ్‌గా లవ్‌స్టోరీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం అథర్వ నటిస్తున్న చిత్రాల్లో ‘బూమర్యాంగ్’ ఒకటి. ఈ సినిమా కోసం గుండు చేయించుకున్నారు. ఇందులో అథర్వ మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారట. అందులో ఈ గుండు పాత్ర ఒకటి. ‘‘ఈ పాత్ర కోసం గుండు చేయించుకుంటే వేరే సినిమాలకు ఇబ్బంది అవుతుంది అనుకున్నాను. కానీ అథర్వ అదేం ఆలోచించలేదు. వెంటనే గుండు చేయించుకున్నాడు. స్క్రిప్ట్‌కి చాలా ముఖ్యమైన సీన్స్ ఇవి’’ అని దర్శకుడు కన్నన్ పేర్కొన్నారు. -
ప్రియతో జోడీ కడుతున్న యువహీరో!
సాక్షి, తమిళసినిమా: ఒకవైపు సీనియర్ తారలు తెరమరుగవుతుంటే, కొత్త భామలు సత్తా చాటుతున్నారు. కోలీవుడ్‌లో యువ నటీమణుల జోరు కొనసాగుతోంది. ఈ కోవలోకి తాజాగా వర్ధమాన నటి ప్రియాభవానీశంకర్ చేరారు. ఆమెను వరుసగా విజయాలతోపాటు అవకాశాలు పలుకరిస్తున్నాయి. బుల్లితెర ద్వారా వెండితెరకు ప్రమోట్ అయిన ఈ బ్యూటీకి రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ‘మేయాదమాన్’ తో వెండితెరకు పరిచయమైన ప్రియ భవానీశంకర్.. ఆ చిత్రం విజయవంతం కావడంతో కోలీవుడ్‌లో అందరి దృష్టిలో పడ్డారు. ఆ తరువాత హీరో కార్తీకి జోడీగా నటించిన ‘కడైకుట్టిసింగం’ చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. దీంతో ప్రియకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా యువ నటుడు అధర్వకు జంటగా నటించే లక్కీఛాన్స్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. ‘కురుధి ఆట్టం’ చిత్రం కోసం వీరు జోడీ కట్టబోతున్నారు. దీనికి శ్రీగణేశ్ దర్శకత్వం వహించనున్నారు. ఈయనకిది రెండో సినిమా. అందరూ కొత్తవారితో శ్రీగణేశ్ తెరకెక్కించిన ‘8 తొట్టాగళ్’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మధురై నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్స్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా గ్యాఫ్ తరువాత నటుడు రాధారవి, ఆయన సోదరి, నటి రాధికాశరత్‌కుమార్ నటించబోతున్నారు. రాక్ ఫోర్ట్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ అధినేత టీ మురగానందం, బిగ్ ప్రింట్ పిక్చర్స్ ఐబీ కార్తీకేయన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
డబ్బింగ్ చెప్పానోచ్..
కొన్నిసార్లు మనసుకి నచ్చిన పాత్రలు చేసినప్పుడు డబ్బింగ్ వేరే వాళ్లు చెబితే నటిగా తమకు పరిపూర్ణత ఉండదని ఫీల్ అవుతుంటారు హీరోయిన్లు. అందుకే వాళ్ల పాత్రలకు వాళ్లే డబ్బింగ్ చెప్పుకుంటుంటారు. మేఘా ఆకాశ్ కూడా ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పుకున్నారు. అధర్వ మురళి, మేఘా ఆకాశ్ జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘బూమర్యాంగ్’. ఈ సినిమాలో మేఘ బాగా నటించారని, వేరేవాళ్లు డబ్బింగ్ చెబితే ఆ కంప్లీట్‌నెస్ పోతుందేమోనని దర్శకుడు కన్నన్ భావించారట. దాంతో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు మేఘ. ‘‘డబ్బింగ్ చెప్పడం సరదాగా అనిపించింది’’ అన్నారు మేఘ. నిజానికి మేఘ మాతృభాష తమిళ్. మరి.. మదర్ టంగ్‌లో డబ్బింగ్ చెబితే విశేషం ఏంటి అంటున్నారా? కొందరు నాయికలు మాతృభాషలో కూడా సొంత గొంతు వినిపించరు. వేరేవాళ్లు డబ్బింగ్ చెప్పాల్సిందే. -
పోజు ఓకే
ఎప్పుడూ ఒకళ్లు తీస్తే ఫొటోలు దిగడమేనా? నేనూ తీస్తా అని ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు హన్సిక. మెడలో కెమెరా వేసుకున్నారు. క్లిక్‌మనిపించారు. ప్చ్.. ఫొటో బాగా రాలేదు. మరోసారి ట్రై చేశారు. ఈసారి ఫ్రేమ్ అదిరింది. ఫొటో పసందుగా వచ్చింది. ఇంతకీ హీరోయిన్ హాన్సిక ఫొటో తీసింది ఎవర్ని అంటే... హీరో అధర్వని. అతను మాత్రం ఎందుకు కామ్‌గా ఉంటాడు. నాలోనూ ఓ ఫొటోగ్రాఫర్ ఉన్నాడంటూ కెమెరాతో హన్సికను క్లిక్‌మనిపించారు. ఫొటోగ్రఫీ తర్వాత హన్సిక హెయిర్ స్టైలిస్ట్‌గా మారారు. షూటింగ్ లొకేషన్లో తనతో పాటు ఉన్న అమ్మాయికి జడ వేశారు. స్టైల్‌గా ఉన్న ఆ జడ చూసి, ‘మీలో మంచి హెయిర్ స్టైలిస్ట్ ఉంది’ అని యూనిట్ సభ్యులు కితాబులిస్తే కిలకిలా నవ్వారు హన్సిక. అసలు షూటింగ్ స్పాట్లో యాక్షన్ చేయకుండా ఫొటోగ్రాఫర్, హెయిర్ స్టైలిస్ట్‌ల అవతరాలెత్తడం ఏంటి? ప్రొడ్యూసర్ డబ్బుని లెక్క చేయడంలేదు అనుకుంటున్నారా? ఈ సందడంతా షాట్ గ్యాప్‌లోనే. అధర్వ, హన్సిక జంటగా సామ్ ఆంటోని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ షూటింగ్ స్పాట్లోనే హన్సిక సరదాగా కెమెరామేన్, హెయిర్‌స్టైలిస్ట్ అవతారమెత్తారు. -
అవునా.. లవ్వా?
హన్సిక, అథర్వ మురళి జంటగా ఒక కొత్త సినిమా ప్రారంభమైంది. సామ్ ఆంటనీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరా సినిమాస్ నిర్మిస్తోంది. ఇదొక యాక్షన్ థ్రిలర్. ‘విక్రమ్ వేదా’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రానికి సంగీతం అందించిన సామ్ సి.యస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రీసెంట్గా ముహూర్తం జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం మొదలైంది. ఇదిలా ఉంటే.. హన్సిక, అథర్వ ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారని కోలివుడ్ కోడై కూస్తోంది. ఇద్దరూ ఆ వార్తలను ఖండించలేదు. మౌనం సమ్మతం అంటారా? ఈ విషయంపై ఇద్దరిలో ఎవరో ఒకరు రెస్పాండ్ అయితే కానీ ఈ వార్తకు ఫుల్స్టాప్ పడదు. -
నలుగురు నాయికలతో అధర్వ రొమాన్స్
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు కథానాయికలతో రొమాన్స్ చేస్తూ వస్తున్నారు యువ నటుడు అధర్వ. ఈటీ, కణిదన్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత అధర్వ కథా నాయకుడిగా నటిస్తున్న చిత్రం జెమినీగణేశనుం సురుళిరాజానుం. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అమ్మాక్రియేషన్స్ టీ. శివ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈయన సంస్థకు ఇది జూబ్లీ చిత్రం అవుతుంది. ఇందులో అధర్వకు జంటగా నటి ఐశ్వర్యారాజేశ్, రెజీనా, ప్రణీత, అతిథి ఇలా నలుగురు బ్యూటీస్ నటిస్తున్నారు. కథ డిమాండ్ మేరకే నలుగురు కథానాయికలను ఎంచుకున్నామన్నారు దర్శకుడు ఓడం ఇళవరసు. చిత్రంలో ఈయనే హీరో, వీళ్లే హీరోయిన్లు, వీళ్లే కమెడియన్లు అన్నదేమీ ఉండదని.. వారి వారి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. రొమాం టిక్ కామెడీ కథా చిత్రంలో నటించాలన్న అధర్వ కోరిక ఈ చిత్రంతో తీరనుందని చెప్పారు. చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని.. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తునట్లు తెలిపారు. ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీతం, శ్రీసరవణన్ ఛాయాగ్రాహణం అందిస్తున్నారు. -
పోలీస్ అధికారిగా నయన్
గ్లామర్ రోల్స్‌తో పాటు లేడి ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్న నయనతార, మరో ఆసక్తికరమైన పాత్రకు రెడీ అవుతోంది. ఇప్పటికే మాయ, అనామిక లాంటి సినిమాలతో మంచి విజయాలు సాధించిన ఈ బ్యూటి ఇమైకా నోడిగల్ అనే సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించనుంది. అథర్వ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో నయన్, అధర్వకు జంటగా నటించటంలేదు. సినిమాలో కీలకమైన పోలీస్ అధికారి పాత్రను మాత్రమే చేస్తోంది. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు కథ రాసే సమయంలోనే నయనతారను దృష్టిలో పెట్టుకొని ఈ పాత్రను తీర్చిదిద్దాడట. నయన్‌కు కూడా ఈ క్యారెక్టర్ నచ్చటంతో వెంటనే ఓకె చెప్పేసింది. ప్రస్తుతం నయనతార హీరోయిన్గా నటించిన ఇరుముగన్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా మరికొన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ మీద ఉన్నాయి. -
నలుగురు బ్యూటీస్‌తో అధర్వ
యువ నటుడు అధర్వ నలుగురు భామలతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. కనిదన్ చిత్రం తరువాత నటుడు అధర్వ నటిస్తున్న చిత్రం జెమినీగణేశనుమ్ సురుళిరాజనుమ్. ఇందులో ఆయన సరసన రెజీనా, ప్రణీత, ఐశ్వర్య రాజేశ్, ఆనంది నాయికలుగా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో సూరి, నాన్‌కడవుల్ రాజేంద్రన్ తదితరులు నటిస్తున్నారు. నిర్మాత టీ.శివ అమ్మా క్రియేషన్ పతాకంపై నిర్మిస్తున్న 25వ చిత్రం ఇది. కాగా ఓడమ్ ఇళవరసు కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇది రొమాంటిక్ లవ్, కామెడీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. అమ్మాయిల తొలి ప్రేమ వారి జీవితాల్లో ఎంత ప్రభావం చూపుతుందో అన్నది చాలా అందంగా చెప్పనున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను మధురైలో పూర్తి చేసినట్లు చెప్పారు. రెండో షెడ్యూల్‌ను ప్రస్తుతం ఊటీలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. చిత్రాన్ని డిసెంబర్లో తెరపై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు నిర్మాత టీ.శివ తెలిపారు. ఆయన ఈ చిత్రాన్ని 2ఎంబీ సంస్థ అధినేతలు రఘునందన్, పీఎస్ఆర్.చంద్రశేఖర్, ఆర్.శరవణన్‌లతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి బిగ్ ప్రింట్ పిక్చర్స్ అధినేతలు ఐబీ.కార్తీకేయదిలీపన్ సంగోటయ్య, డీ.పరంజ్యోతి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.