పోలీస్ అధికారిగా నయన్ | Nayanthara plays top cop in Imaikaa Nodigal | Sakshi
Sakshi News home page

పోలీస్ అధికారిగా నయన్

Published Fri, Sep 2 2016 2:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

పోలీస్ అధికారిగా నయన్

పోలీస్ అధికారిగా నయన్

గ్లామర్ రోల్స్తో పాటు లేడి ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్న నయనతార, మరో ఆసక్తికరమైన పాత్రకు రెడీ అవుతోంది. ఇప్పటికే మాయ, అనామిక లాంటి సినిమాలతో మంచి విజయాలు సాధించిన ఈ బ్యూటి  ఇమైకా నోడిగల్ అనే సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించనుంది. అథర్వ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

అయితే ఈ సినిమాలో నయన్, అధర్వకు జంటగా నటించటంలేదు. సినిమాలో కీలకమైన పోలీస్ అధికారి పాత్రను మాత్రమే చేస్తోంది. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు కథ రాసే సమయంలోనే నయనతారను దృష్టిలో పెట్టుకొని ఈ పాత్రను తీర్చిదిద్దాడట. నయన్కు కూడా ఈ క్యారెక్టర్ నచ్చటంతో వెంటనే ఓకె చెప్పేసింది. ప్రస్తుతం నయనతార హీరోయిన్గా నటించిన ఇరుముగన్ రిలీజ్కు రెడీ అవుతుండగా మరికొన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ మీద ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement