
ఖుష్బూ సుందర్ భర్త, ప్రముఖ దర్శకుడు సుందర్.సితో స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara) గొడవ పడిందనే రూమర్ గత మూడు,నాలుగు రోజులుగా తమిళ్ ఇండస్ట్రీలో బాగా వినిపించింది. సుందర్.సి దర్శకత్వంలో నయన్ ‘మూకుతీ అమ్మన్ 2’ అనే సినిమా చేస్తోంది. అయితే ఈ సినిమా సెట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌కు, నయనతారకు గొడవ జరిగిందని, దీంతో సుందర్.సి షూటింగ్ నిలివేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు సుందర్‌తో కూడా నయన్ గొడవకు దిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై సుందర్ సతీమణి, నటి ఖుష్భూ(Khushbu Sundar) క్లారిటీ ఇచ్చింది.
‘మూకుతీ అమ్మన్ 2’(Mookuthi Amman 2) సినిమా గురించి సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్‌ను ప్రచారం చేసేవారు కాస్త ఆగమని కోరుతున్నా. సినిమా షూటింగ్ సాఫీగా జరుగుతోంది, ప్లాన్ చేసినట్లుగానే చిత్రీకరణ పూర్తవుతోంది. సుందర్ ఇలాంటి రూమర్స్‌ను ఎప్పుడూ పట్టించుకోరని అందరికీ తెలిసిందే. నయనతార అద్భుతమైన నటి, గతంలో ఆమె పోషించిన పాత్రను మళ్లీ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. దయచేసి ఈ సినిమా గురించి ఆధారం లేని రూమర్స్‌ను ఆపండి. అభిమానులు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు. మీ మద్దతు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నా. సుందర్.సి నుంచి మరో హిట్ కోసం ఎదురుచూడండి’ అని సుందర్ పోస్ట్ చేశారు. ఖుష్భూ ట్వీట్‌తో గత కొద్ది రోజులుగా వస్తున్న రూమర్స్‌కి అడ్డుకట్ట పడింది.
'మూకుత్తి అమ్మన్ 2' విషయానికొస్తే.. 2020లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘మూకుత్తి అమ్మన్'(తెలుగులో అమ్మోరు తల్లి) సినిమాకు సీక్వెల్ ఇది. ‘మూకుత్తి అమ్మన్' చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా.. సీక్వెల్‌ని సుందర్.సి తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో నయనతారతో పాటు ఇనియా, రెజీనా కసెండ్రా, మైనా నందిని, దునియా విజయ్, సింగం పులి, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
To all the wellwishers of #SundarC Sir. Too many unwanted rumors are floating about ##MookuthiAmman2 . Please loosen up. Shoot is underway smoothly and going as planned. Everyone knows Sundar is a no nonsense person. #Nayanthara is a very professional actor who has proved her…
— KhushbuSundar (@khushsundar) March 25, 2025