కోలీవుడ్‌లో 'ముకుత్తి అమ్మన్ (2020)' (తెలుగులో ‘అమ్మోరు తల్లి’) సినిమా సీక్వెల్‌కు అంతా సిద్ధం అయింది. ఇందులో కూడా నయనతార ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే, సీక్వెల్ కోసం దర్శకుడిని తాజాగా మార్చేశారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ‘ముకుత్తి అమ్మన్ 2’ చిత్రాన్ని తమిళ దర్శకుడు సుందర్. సి డైరెక్షన్ చేస్తారని తాజాగా ప్రకటించారు.
నయనతార, ఆర్‌జే బాలాజీ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ముకుత్తి అమ్మన్’. ఆర్‌జే బాలాజీ, ఎన్‌జే శరవణన్ కలిసి దర్శకత్వం వహించిన ఈ ఫ్యాంటసీ కామెడీ సినిమా 2020లో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
ఈ సినిమాకు సీక్వెల్‌ను కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. ఇందులో కూడా నయనతారయే లీడ్ రోల్ చేస్తారని, వేల్స్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్ సంస్థ గతంలో ప్రకటించింది. అయితే, డైరెక్టర్ పేరును మాత్రం ఆ సమయంలో రివీల్ చేయలేదు. అయితే తాజాగా నటుడు–దర్శకుడు సుందర్. సి ఈ సినిమాను తెరకెక్కించనున్నారని ఒక పోస్టర్‌తో మేకర్స్ తెలిపారు. అరణ్మనై-4 తెలుగులో (బాకు) సినిమాతో రీసెంట్‌గా ఆయన సూపర్ హిట్ అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment