Sundar C
-
పార్టీ ఇచ్చిన ఖుష్బూ.. హాజరైన తమిళ స్టార్స్ (ఫోటోలు)
-
సుందర్ డైరెక్షన్లో...
నయనతార, ఆర్జే బాలాజీ లీడ్ రోల్స్‌లో నటించిన తమిళ ఫ్యాంటసీ కామెడీ ఫిల్మ్ ‘ముకుత్తి అమ్మన్’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి’). ఆర్జే బాలాజీ, ఎన్జే శరవణన్ కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020 నవంబరులో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, విశేష ప్రేక్షకాదరణను దక్కించుకుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ముకుత్తి అమ్మన్ 2’ రానుందని, ఇందులోనూ నయనతార లీడ్ రోల్లో నటిస్తారని, ఈ ఏడాది జూలైలో వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. కానీ ఆ సమయంలో దర్శకుడి పేరును వెల్లడించలేదు.తాజాగా ‘ముకుత్తి అమ్మన్ 2’ సినిమాకు సుందర్. సి దర్శకత్వం వహించనున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రంలో సుందర్. సి ఓ పాత్ర చేసే చాన్స్ కూడా ఉందట. కాగా ‘ముకుత్తి అమ్మన్ 2’కు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తారని, త్రిష లీడ్ రోల్లో నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే తొలి భాగంలో లీడ్ రోల్లో నటించిన నయనతారనే మలి భాగంలోనూ లీడ్ రోల్ చేయనున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఆర్జే బాలాజీ స్థానంలో దర్శకుడిగా మాత్రం సుందర్. సి వచ్చారు. ఇలా ‘ముకుత్తి అమ్మన్ 2’ డైరెక్టర్ మారారు. త్వరలోనే చిత్రీకరణ ఆరంభం కానుంది. -
హిట్ సినిమాకు సీక్వెల్.. దర్శకుడిని మార్చేసిన మేకర్స్
కోలీవుడ్‌లో 'ముకుత్తి అమ్మన్ (2020)' (తెలుగులో ‘అమ్మోరు తల్లి’) సినిమా సీక్వెల్‌కు అంతా సిద్ధం అయింది. ఇందులో కూడా నయనతార ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే, సీక్వెల్ కోసం దర్శకుడిని తాజాగా మార్చేశారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ‘ముకుత్తి అమ్మన్ 2’ చిత్రాన్ని తమిళ దర్శకుడు సుందర్. సి డైరెక్షన్ చేస్తారని తాజాగా ప్రకటించారు. నయనతార, ఆర్జే బాలాజీ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ముకుత్తి అమ్మన్’. ఆర్జే బాలాజీ, ఎన్జే శరవణన్ కలిసి దర్శకత్వం వహించిన ఈ ఫ్యాంటసీ కామెడీ సినిమా 2020లో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.ఈ సినిమాకు సీక్వెల్‌ను కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. ఇందులో కూడా నయనతారయే లీడ్ రోల్ చేస్తారని, వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ గతంలో ప్రకటించింది. అయితే, డైరెక్టర్ పేరును మాత్రం ఆ సమయంలో రివీల్ చేయలేదు. అయితే తాజాగా నటుడు–దర్శకుడు సుందర్. సి ఈ సినిమాను తెరకెక్కించనున్నారని ఒక పోస్టర్‌తో మేకర్స్ తెలిపారు. అరణ్మనై-4 తెలుగులో (బాకు) సినిమాతో రీసెంట్గా ఆయన సూపర్ హిట్ అందుకున్నారు. -
నా పెళ్లి విషయం తెలిసి ఆ హీరో ఏడ్చాడు: ఖుష్బూ
ఒకప్పుడు హీరోయిన్గా తనదైన నటనతో ఆకట్టుకున్న ఖుష్భూ.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా,టీవీ యాంకర్‌గా బిజీ అయింది. అప్పట్లో ఖుష్భూకి తమిళ్లోనే కాదు టాలవుడ్లోనూ ఫుల్ ప్యాన్ ఫాలోయింగ్ ఉండేది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘కలియుగ పాండవులు’అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే సూపర్ హిట్. ఆ తర్వాత తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 200పైగా సినిమాల్లో నటించారు. అప్పట్లో తమిళనాడులో అభిమానులు ఖుష్భూకి ఓ గుడినే కట్టించారంటే..ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే 2000 సంవత్సరంలో డైరెక్టర్ సుందర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుందర్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ముఱై మామన్’లో ఖుష్బూ హీరోయిన్. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు.ఈ దంపతులకు అవంతిక, అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ తన పెళ్లిలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి చెప్పింది. ‘నేను, సుందర్ ప్రేమలో ఉన్న విషయం చాలా కాలం పాటు ఎవరికి చెప్పలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోబుతున్నామనే విషయం మొదటగా హీరో కార్తీక్‌కి సుందర్ చెప్పాడు. విషయం తెలిసిన వెంటనే కార్తీక్ నాకు ఫోన్ చేసి సంతోషంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే మా పెళ్లికి కూడా వచ్చాడు. అప్పుడు మేమిద్దరం ఆయన కాళ్లపై నమస్కరించి ఆశిస్సులు తీసుకున్నాం. ఆ సమయంలో కార్తీక్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు’ అని ఖుష్భూ చెప్పుకొచ్చింది. -
ఓటీటీలో రూ. 100 కోట్ల హారర్ మూవీ.. అఫీషియల్ ఫ్రకటన
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం 'బాక్'. తమిళ్లో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై 4' నుంచి వచ్చిన 4వ చిత్రమిది. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. మే 3న విడుదలైన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. ఇదే విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.తమిళ్లో 'అరణ్మనై 4' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'బాక్' టైటిల్‌తో విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే, ఈ సినిమా త్వరలో హాట్‌స్టార్‌లో విడుదల కానుందని ఆ సంస్థ ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించకుండా త్వరలో రిలీజ్ చేస్తామని హాట్‌స్టార్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. விரைவில் 🔥Aranmanai 4 Coming Soon On Disney + Hotstar#Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/DsYnNrZ3d2— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 2, 2024 కానీ, జూన్ 7న బాక్ విడుదల కానున్నట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్, కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. -
తెలుగు వాళ్లు నా సినిమాలు కాపీ కొట్టారు: తమిళ డైరెక్టర్
తమిళ సినీ ఇండస్ట్రీలో సుందర్ సి పేరు మోసిన దర్శకుడు. అతడు తెరకెక్కించిన అరణ్మనై 4 సినిమా మే 3న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సుందర్. ఈ సందర్భంగా అతడు ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్‌పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ రేంజ్లో కాపీ కొడతారా?సుందర్ మాట్లాడుతూ.. నేను ఓ తెలుగు సినిమా చూసి షాకయ్యాను. నేను తీసిన సినిమాలోని కంటెంట్‌నే కాపీ కొట్టారు. మరో నాలుగు మూవీస్ చూశాను.. అందులో కూడా తమిళ సినిమాల వాసనలు కనిపించాయి. ఈ రేంజ్లో కాపీ కొడతారా? అని ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. ఎనిమిది తెలుగు సినిమాలను కాపీ కొట్టి మిక్స్ చేసి విన్నర్ (2003) మూవీ తెరకెక్కించాను అని చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలేంటన్నవి మాత్రం..అయితే ఆ సినిమాలేంటన్నవి మాత్రం ప్రస్తావించలేదు. ఇకపోతే అరుణ్మనై మూవీలో సుందర్ ప్రధాన పాత్రలో నటించాడు. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం తెలుగులో బాక్ పేరిట విడుదల కానుంది. ఇందులో యోగి బాబు, కోవై సరళ, సంతోష్ ప్రతాప్ ముఖ్య పాత్రలు పోషించారు.చదవండి: 15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న రాజమౌళి! -
నవ్వు... భయం
తమన్నా, సుందర్ సి, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బాక్’. సుందర్ సి. దర్శకత్వం వహించారు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తమిళ్, తెలుగులో ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీగా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో శివానీ పాత్రలో తమన్నా, శివ శంకర్‌గా సుందర్ సి. నటించారు. వారి పాత్రలను పరిచయం చేస్తూ లుక్స్ రిలీజ్ చేశారు. ‘‘హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బాక్’’ అన్నారు మేకర్స్. -
మళ్లీ వచ్చేస్తున్న హారర్ మూవీ.. ట్రైలర్ చూశారా?
దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం అరణ్మణై–4. ఇంతకుముందు ఈయన తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అరణ్మణై–4 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్‌కుమార్‌కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా, యోగిబాబు, కోవై సరళ, వి.టీవీ గణేష్ ముఖ్యపాత్రలు పోషించారు. అప్పట్లో ఆ ఆలోచనే లేదు హిప్ హాప్ ఆది సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని నిర్వహించారు. హీరో సుందర్ సి మాట్లాడుతూ.. అరణ్మణై చిత్రం తొలిభాగం తన కెరీర్లో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. దానికి సీక్వెల్స్ రూపొందించాలన్న ఆలోచన తనకు అప్పట్లో లేదన్నారు. మంచి ఐడియాలు రావడం వల్లే సీక్వెల్స్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. వేరే చిత్రానికి సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నప్పుడు తన కోరైటర్ ఒక విషయాన్ని చెప్పారన్నారు. రాజులే భయపడ్డారు అది కొత్తగా ఉండడంతో ఈ అరణ్మణై –4 చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమైనట్లు చెప్పారు. 'ఇండియాలోని పలు భాగాలను పాలించడానికి అప్పట్లో పలువురు రాజులు దండెత్తి వచ్చారు. అయితే వారెవరూ ఈస్ట్ భాగంలోని బ్రహ్మపుత్ర నదిని దాటి వెళ్లడానికి సాహసించలేదు. అందుకు పలు కారణాలు ఉండగా.. అందులో ఒకటి దెయ్యం! ఆ ప్రాంతంలో బాగ్ అనే మానవశక్తిని మించిన శక్తి కలిగిన దెయ్యం ఉందనేది కథలు, కథలుగా చెప్పుకునేవారు. ఆ అంశాన్ని కథగా మలుచుకుని రూపొందించిన చిత్రమే అరుణ్మణై–4' అని చెప్పారు. ఇప్పటి వరకు గ్లామర్, యాక్షన్ పాత్రల్లో చూసిన తమన్నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చదవండి: సాధారణ వ్యక్తి ప్రేమలో 'పూజా హెగ్డే'.. ఫోటోలు వైరల్ -
ఆ మూవీ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడా? కారణం ఇదేనా!
సుందర్ సీ దర్శకుడిగా, నటుడిగా వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన కాఫీ విత్ కాదల్ చిత్రం యూత్‌ను బాగానే ఆలరించింది. ఇప్పుడు ఓ హార్రర్ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించేందుకు రెడీ అయ్యారు. గతంలో ఆయన దర్శకత్వం వహించి ముఖ్య పాత్ర పోషించిన అరణ్మణై పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చిత్రాలు మంచి విజయాన్ని పొందడంతో తాజాగా వాటికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది కూడా హార్రర్ జానర్లో సాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. చదవండి: నటి హేమ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో! కాగా ఇందులో విజయ్ సేతుపతి, సంతానం కథానాయకులుగా నటించనున్నట్లు ఇంతకు ముందు ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విజయ్ సేతుపతి వైదొలిగినట్లు సమాచారం. ఇప్పుడు ఆయన తెలుగు, తమిళం, హిందీ, భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దీంతో కాల్ షీట్స్ సమస్య తలెత్తడంతో అరణ్మణై 4 చిత్రం నుంచి వైదొలగినట్లు సమాచారం. దీంతో ఆయన పాత్రలో సుందర్.సీనే నటించడానికి సిద్ధమవుతున్నారట. అవ్నీ సినిమా పతాకంపై నటి కుష్బూ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం -
కమల్ హాసన్ 'రంభంభం..' రీమిక్స్ సాంగ్ విన్నారా?
ఏ విభాగానికి చెందిన కథా చిత్రాన్ని అయినా తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను అలరింపచేసే దర్శకుడు సుందర్ సీ. ఇటీవల అరణ్మణై –3 చిత్రంతో హిట్ కొట్టిన ఈయన తాజాగా కాఫీ విత్ కాదల్ చిత్రంతో వినోదం పెంచడానికి సిద్ధం అవుతున్నారు. అవ్నీ సినీ మ్యాక్స్, కుష్భు బెంజ్ మీడియా ఏసీఎస్ అరుణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జీవా, శ్రీకాంత్, జయ్, అమృత అయ్యర్, మాళవిక శర్మ, రైసా విల్సన్, ఐశ్వర్య దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టులో తెరపైకి రానుంది. కాగా కమలహాసన్, కుష్భు నటించిన మైఖేల్ మదన కామరాజ్ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, చిత్ర పాడిన రంభంభం...ఆరంభం పాటను కాఫీ విత్ కాదల్ చిత్రం కోసం రీమిక్స్ చేసినట్లు దర్శకుడు తెలిపారు. చదవండి: హీరో విశాల్‌కు గాయాలు.. నిలిచిపోయిన సినిమా షూటింగ్ పెళ్లిళ్లు బాధాకరంగా ఉండేందుకు మీరే కారణం: సమంత -
వరుస హత్యలు చేసే సైకో కథే.. పట్టాంపూచ్చి
పట్టాంపూచ్చి చిత్రం తెరపైకి రానుంది. దర్శకుడు సుందర్.సీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నటుడు జయ్ ప్రతి నాయకుడిగా నటించడం విశేషం. నటి హనీరోస్ నాయకిగానూ, ఇమాన్ అన్నాచ్చి, బేబీ మానస్వీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అవ్నీ టెలీ మీడియా పతాకంపై నటి కుష్భూ సుందర్.సీ నిర్మించారు. కథ, దర్శకత్వం బద్రీ నిర్వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ 1980 ప్రాంతంలో జరిగే కథాంశంతో రూపొందించిన చిత్రం ఇదన్నారు. సుందర్.సీ పోలీస్ అధికారిగానూ, జయ్ సైకో గానూ నటించారని తెలిపారు. టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో నేరస్తులను పట్టుకోవడం అంత సులభం కాదని, అలాంటిది వరుస హత్యలు చేసే సైకోను ఓ పోలీస్ అధికారి పట్టుకుని చట్టానికి అప్పగించారా..? లేదా..? అన్న ఇతి వృత్తంతో తెరకెక్కించిన చిత్రం పట్టాంపూచ్చి అని తెలిపారు. సైకోను పట్టుకోవడానికి ఫైట్స్ లాంటివి ఉండవని, ఇది మైండ్ గేమ్‌తో సాగే చిత్రంగా ఉంటుందని సుందర్.సీ తెలిపారు. ఇప్పటి వరకూ ఉన్న లవర్‌బాయ్ ఇమేజ్ నుంచి బయట పడటానికే ఇందులో సైకోగా నటించడానికి అంగీకరించినట్లు జయ్ తెలిపారు. 80 ప్రాంతంలో జరిగే కథ కావడంతో చిత్రానికి సీసీ వర్క్‌ను ఎక్కువగా వాడినట్లు చెప్పారు. దీనికి నవనీత్ సుందర్ సంగీతాన్ని, కృష్ణసామి ఛాయాగ్రహణను అందించారు. చదవండి: రియాలిటీ షోలో బుల్లితెర నటికి గాయాలు అప్పటినుంచి సర్కారువారి పాట ఉచితంగా చూడొచ్చు -
తొలి సినిమా డైరెక్టర్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
Senior Heroine Malavika Re Entry With Director Sundar C Movie: ప్రముఖ డైరెక్టర్, దివగంత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన 'చాలా బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మాళవిక. శ్రీకాంత్, నవీన్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో అలరించిన మాళవిక కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది. 1999లో సుందర్. సి డైరెక్షన్లో అజిత్ హీరోగా 'ఉన్నై తేడి' మూవీతో కోలీవుడ్‌కు పరిచయమైంది మాళవిక. తర్వాత 2007లో సురేష్ మేనన్ అనే వ్యక్తిని వివాహమాడి వైవాహిక జీవితానికే పరిమితమైంది. ఇప్పుడు తాజాగా ఆమె మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. చదవండి: 'పేరెంట్స్ కోప్పడ్డారు..ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా' కోలీవుడ్‌కు ఏ డైరెక్టర్‌తో పరిచయమైందో ఆయన దర్శకత్వంలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది మాళవిక. ఈ సినిమాలో ఆమె 'మంగమ్మ' అనే పాత్రలో అలరించనుంది. ఇందులో మాళవికకు జోడిగా దర్శకుడు మనోబాలా కనిపించనున్నారు. హీరోలుగా జై, జీవా, శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్, రైజా విల్సన్, ఐశ్వర్య దత్తా హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్లో పాల్గొన్న మాళవిక ఫొటోలను సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. pic.twitter.com/VoZNpvLkRx — Manobala (@manobalam) April 2, 2022 చదవండి: ఆమె బయోపిక్‌లో నటించాలనుంది: మాళవిక మోహనన్ -
యాక్షన్ సీన్స్‌లో విశాల్, తమన్నా అదుర్స్
విశాల్ హీరోగా తెరకెక్కిన తాజా తమిళ చిత్రం ‘యాక్షన్’. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం దీపావళి సందర్భంగా విడుదల చేసింది. టర్కీ, అజర్బైజాన్లో విశాల్, తమన్నా కలిసి విలన్లను పట్టుకునేందుకు చేస్తున్న సాహసాలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. యాక్షన్ సీన్స్‌లో విశాల్‌తో సహా తమన్నా కూడా అదరగొట్టిందంటూ యాక్షన్ లవర్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం టర్కీలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ యాక్షన్ ఎపిసోడ్లో భాగంగా విశాల్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇక తమిళంలో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలవడం పట్ల విశాల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా విశాల్- సుందర్. సి కాంబినేషన్లో ఇంతకుముందు ‘అంబల, మదగజరాజా’ అనే సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
అదిరిపోయిన ‘యాక్షన్’ టీజర్
వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న యంగ్‌హీరో విశాల్.. మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు రెడీఅవుతున్నాడు. రీసెంట్ టెంపర్ రీమేక్‌గా తెరకెక్కించిన ఆయోగ్య మూవీతో సూపర్ హిట్ అందుకున్న విశాల్.. మరో ఫుల్‌లెంగ్త్ ‘యాక్షన్’ మూవీతో మన ముందుకు వచ్చేందుకు సిద్దంగాఉన్నాడు. సుందర్ సి దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమా టీజర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. అద్భుతమైన పోరాట సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి హిప్హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. Proudly Presenting the Teaser of my next Movie, #Action https://t.co/1OXUZpMYvK #ActionTeaser#SundarC @tridentartsoffl @tamannaahspeaks @AishwaryaLeksh4 @iYogiBabu @hiphoptamizha @puri_akanksha @Kabirduhansingh @dudlyraj @johnsoncinepro @Muzik247in — Vishal (@VishalKOfficial) September 13, 2019 -
విశాల్‌తో మరోసారి..!
విశాల్‌తో మిల్కీబ్యూటీ మరోసారి రొమాన్స్‌కు రెడీ అవుతోందా? దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈ అమ్మడికి కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయనే ప్రచారం హోరెత్తుతున్న విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్‌తో నటించిన కన్నెకలైమానే చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలాకాలంగా విడుదల కోసం ఎదురుచూస్తోంది. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు టైమ్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. తమన్నా తమిళంలో నటించిన చివరి చిత్రం అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్. శింబుతో జత కట్టిన ఈ చిత్రం ఫ్లాప్ అవడంతో తమన్నాను కోలీవుడ్ పక్కన పెట్టిందనే అనుకున్నారు. అలాంటిది ప్రస్తుతం ఈ జాణ ప్రభుదేవాతో దేవి–2లో రొమాన్స్ చేస్తోంది. తాజాగా మరో అవకాశం తమన్నా తలుపు తట్టిందనే టాక్ వినిపిస్తోంది. నటుడు విశాల్‌తో మరోసారి జత కట్టబోతోందని సమాచారం. విశాల్ ప్రస్తుతం అయోగ్య చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు.ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరిలో పూర్తి చేసుకుంటుంది. దీంతో విశాల్ తదుపరి సుందర్.సీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. వీరి కాంబినేషన్లో ఇప్పుటికే రెండు చిత్రాలు రూపొందాయన్నది గమనార్హం. అయితే అందులో తొలి చిత్రం మదగజరాజా ఇప్పటికీ తెరపైకి రాలేదు. ఇక అంబల చిత్రం విడుదలై సక్సెస్ అయ్యింది. తాజాగా మూడోసారి కలుస్తున్న విశాల్, సుందర్.సీ కూటమిలో తమన్నా చేరనుందని తెలిసింది. ఈ చిత్ర షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుందని తెలిసింది. తమన్నా ఇంతకు ముందు సండైకత్తి చిత్రంలో విశాల్‌తో రొమాన్స్ చేసింది. -
దెయ్యం లేని హారర్ చిత్రం
మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు. పులిహోరలో పులి కనిపించదు. అలాగే మా దెయ్యం సినిమాలో దెయ్యం ఉండదు అంటున్నారు ‘ఇరుట్టు’ చిత్రదర్శకుడు వీజెడ్ దొరై. సుందర్ .సి ముఖ్య పాత్రలో రూపొందుతోన్న హారర్ చిత్రం ‘ఇరుట్టు’. ఇందులో దర్శకుడు సుందర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. 85 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం గురించి దర్శకుడు దొరై మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ఎటువంటి కామెడీ ఉండదు. చాలా సీరియస్‌గా ఉత్కంఠగా సాగుతుంది. ఇప్పటి వరకూ ప్రేక్షకులు చూసిన హారర్ సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుంది. దెయ్యం లేని ఓ హారర్ చిత్రం రూపొందించాలనుకున్నాను. అనుకున్నట్టుగానే వస్తుంది’’ అని పేర్కొన్నారు. -
మామియార్ వీట్టుక్కు...
అత్తను తీసుకురావడానికి మేనల్లుడు శింబు తన ప్రయత్నాలను మొదలెట్టేశారు. మరి అత్తను తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఎలాంటి పథకాలను రచిస్తున్నాడు? అత్తారింటికి దారిని ఎలా కనుక్కున్నాడో తెలుగు సినిమా చూసినవాళ్లకు తెలుసు. తమిళంలో మామియార్ వీట్టుకు (అత్తారింటికి) అడ్రస్ ఎలా కనిపెడతాడో చూడాలి. శింబు హీరోగా సుందర్ సి. దర్శకత్వంలో తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మేఘా ఆకాశ్ కథానాయిక. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జార్జియాలో ఆరంభమైంది. ఇందులో శింబుకు అత్తగా అప్పటి స్టార్ హీరోయిన్, దర్శకుడు సుందర్ భార్య ఖుష్బు యాక్ట్ చేయనున్నారట. చిత్రబృందం మాత్రం ఆ విషయంలో అప్డేట్ ఇవ్వలేదు. -
జనవరిలో అత్తారింటికి!
అత్తారింటికి అడ్రస్ వెతుకుతున్నారు శింబు. పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయా? అంటే కాదు. తెలుగు సినిమా ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌లో శింబు హీరోగా నటించడానికి వర్క్స్ మొదలయ్యాయి. సుందర్. సి దర్శకత్వం వహించనున్నారు. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ‘‘సుందర్ డైరెక్షన్లో శింబు హీరోగా ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు లైకా ప్రొడక్షన్స్ ప్రతినిథులు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న పొలిటికల్ మూవీ ‘మానాడు’లో నటిస్తున్నారు శింబు. ‘అత్తారింటికి దారేది’ రీమేక్ జనవరిలో రిలీజ్ అంటే.. ఈ రెండు సినిమాల చిత్రీకరణలతో శింబు బిజీగా ఉంటారన్న మాట. -
‘సంఘమిత్ర’ మొదలవుతోంది..!
బాహుబలి సక్సెస్ తరువాత తమిళ చిత్ర వర్గాలు అదే స్థాయిలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. దర్శకుడు సుందర్.సి సంఘమిత్ర పేరుతో భారీ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశారు. ముందుగా టాప్ స్టార్స్‌తో సినిమా రూపొందించాలని ప్రయత్నించిన డేట్స్ అడ్జెస్ట్ కాకపోవటంతో జయం రవి, ఆర్య కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుందని ప్రకటించారు. టైటిల్ రోల్‌కు శృతి హాసన్‌ను ఎపింక చేసి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో గ్రాండ్‌గా పోస్టర్స్ రిలీజ్ చేశారు. కానీ కొద్ది రోజులకే శృతిహాసన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. దీంతో సంఘమిత్ర ఆగిపోయినట్టే భావించారు. కానీ తాజాగా సంఘమిత్ర చిత్రయూనిట్ షూటింగ్ ప్రారభించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. లోఫర్ ఫేం దిశా పటాని టైటిల్ రోల్లో సినిమాను తెరకెక్కించేందుకు సుందర్.సి రెడీ అవుతున్నారట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. -
ఆ భారీ చిత్రం ఆగిపోయిందా..?
బాహుబలి ఘనవిజయం సాధించిన తరువాత కోలీవుడ్ నుంచి అదే స్థాయిలో మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తమిళ నటుడు, దర్శకుడు సుందర్ సి ఏకంగా 250 కోట్ల బడ్జెట్ తో సంఘమిత్ర అనే భారీ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశాడు. భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు. అయితే ఈ సినిమా ఎనౌన్స్మెంట్ దగ్గర నుంచే కష్టాలు మొదలయ్యాయి. దర్శకుడు అనుకున్న హీరోలు సినిమా చేసేందుకు అంగీకరించకపోవటంతో జయం రవి, ఆర్యలతో సరిపెట్టుకున్నాడు. ఇక టైటిల్ రోల్ కు ఫైనల్ చేసిన శృతి హాసన్ చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వటంతో సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండా ఆగిపోయింది. ప్రస్తుతం సంఘమిత్ర పాత్రకు నటి కోసం అన్వేషిస్తున్నారు. హన్సిక చేస్తుందన్న ప్రచారం జరిగినా.. ఆమె కూడా తాను ఈ ప్రాజెక్ట్ లో లేనని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఆలోచనలో పడ్డ దర్శకుడు సుందర్ సి, సంఘమిత్ర కన్నా ముందు మరో సినిమా చేసే ఆలోచన చేస్తున్నాడట. సంతానం లీడ్ రోల్ లో తానే తెరకెక్కించిన కలకళప్పు సినిమాకు సీక్వల్ రూపొందించే ఆలోచనలో ఉన్నాడు సుందర్. సుందర్ ఈ సీక్వల్ ను గనుక ప్రారంభిస్తే సంఘమిత్ర మరింత ఆలస్యమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. -
హన్సిక ఖాతాలో భారీ ఆఫర్..?
బాహుబలి తరువాత అంతటి భారీ చిత్రంగా తెరకెక్కుతున్న సౌత్ సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్.సి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముందుగా టాలీవుడ్, కోలీవుడ్ టాప్ హీరోలతో ఈ సినిమాను తెరకెక్కించాలని భావించిన చిత్రయూనిట్, అది కుదరకపోవటంతో జయం రవి, ఆర్యలతో సరిపెట్టుకున్నారు. టైటిల్లో రోల్లో శృతిహాసన్ నటిస్తుందంటూ ప్రకటించారు. శృతి కూడా సినిమా కోసం యుద్ధ విద్యలు నేర్చుకునే పని మొదలు పెట్టింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సినిమాను భారీగా లాంచ్ చేసిన తరువాత శృతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో నిర్మాతలు మరోసారి హీరోయిన్ కోసం వెతకటం ప్రారంభించారు. నయనతార, అనుష్కల పేర్లు ప్రముఖంగా వినిపించినా.. దర్శకుడు సుందర్.సి మాత్రం హన్సికకే ఓటు వేశాడట. ఇప్పటికే హన్సికతో చంద్రకళ, కళావతి సినిమాలు తెరకెక్కించిన సుందర్, మరోసారి ఆమెతోనే వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. త్వరలోనే సంఘమిత్ర హీరోయిన్‌పై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వనుంది. -
సంఘమిత్ర నాయకి నయనేనా?
ప్రారంభానికి ముందే పలు సంఘటనలతో మీడియాలో హెడ్‌లైన్స్‌తో విశేష ప్రచారాన్ని పొందుతున్న చిత్రం సంఘమిత్ర. బాహుబలి చిత్రం తరహాలో చారిత్రక కథాంశంతో అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కించడానికి శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్నారు. సుందర్.సీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో తారాగణం కోసం చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. మొదట్లో విజయ్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పేర్లు వినిపించాయి. ఆ తరువాత అజిత్ పేరు ప్రచారంలో నానింది. చివరికి జయంరవి, ఆర్య ఎంపికయ్యారు. ఇక హీరోయిన్ విషయంలోనే చాలా తర్జన భర్జనలు జరిగాయి. పలువురు ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నా తుదికి క్రేజీ నటి శ్రుతీహాసన్‌ను ఎంపిక చేశారు. ఇందుకోసం ఆ బ్యూటీ కత్తిసాములో కూడా శిక్షణ పొందారు. కాన్స్ చిత్రోత్సవాల్లోనూ చిత్ర యూనిట్‌తో కలిసి శ్రుతీహాసన్ సందడి చేశారు. ఇక చిత్రం సెట్‌కు వెళ్లడమే తరువాయి అనుకున్న తరుణంలో శ్రుతీ చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలనానికి కేంద్రబిందువు అయ్యారు. ఈ సంఘటన గురించి ఇప్పటికీ రకరకాల ప్రచారం హల్చల్ చేస్తూనే ఉన్నాయి. కాగా ఇలాంటి పరిస్థితిలో తాజాగా నేటి అగ్రనాయకి నయనతార సంఘమిత్రలో యువరాణిగా మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతుండడం విశేషం. నయనతారను సంఘమిత్ర చిత్రంలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ బ్యూటీ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే సంఘమిత్ర చిత్రం రేంజ్ పలు రెట్లు పెరగడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు. -
శృతి తప్పుకోవటంపై సంఘమిత్ర టీం క్లారిటీ
బాహుబలి రిలీజ్ తరువాత అంతకన్న భారీగా తెరకెక్కుతున్న సౌత్ సినిమాగా భారీ ప్రచారం పొందిన సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇటీవం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఘనంగా లాంచ్ చేశారు. ప్రధాన పాత్రల్లో శృతిహాసన్, జయం రవి, ఆర్యలు నటిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఈ సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. సంఘమిత్ర కోసం విదేశాల్లో కత్తి యుద్థాలు సైతం నేర్చుకున్న శృతిహాసన్ సడన్‌గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది. నిర్మాతలు సరిగా కమ్యూనికేట్ చేయటం లేదన్న కారణంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది శృతి. అయితే దర్శకుడు సుందర్.సి వచ్చిన విభేదాల కారణంగానే శృతిహాసన్ సంఘమిత్ర నుంచి తప్పుకుందన్న టాక్ కోలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్ శృతి తప్పుకోవడానికి దర్శకుడు కారణం కాదంటూ క్లారిటీ ఇచ్చింది. -
సంఘమిత్ర నుంచి శ్రుతి తప్పుకొందా?
ప్రతిష్ఠాత్మకంగా రాబోతున్న సంఘమిత్ర ప్రాజెక్టు నుంచి హీరోయిన్ శ్రుతి హాసన్ తప్పుకొన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సుందర్ సి. దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీత సారథ్యంలో టాప్ టెక్నీషియన్లతో వస్తున్న ఈ సినిమాలో నటించడం అంటే చిన్న విషయం కాదు. తమిళ దర్శకుడు సుందర్ .సి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాలో శ్రుతి ఫస్ట్ లుక్‌ను ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదల చేశారు. సోషియో ఫాంటసీ డ్రామాలలో శ్రుతి నటించి కూడా చాలా కాలమైపోయింది. ఇన్నాళ్లూ స్వీట్ అండ్ ఇన్నోసెంట్, లేదంటే... బ్యూటిఫుల్ అండ్ బబ్లీ హీరోయిన్గా ఎక్కువ సినిమాల్లో శ్రుతి చేసింది. ఇప్పుడు ఆమెకు ఇది ఒక మంచి అవకాశమని, వారియర్ ప్రిన్సెస్‌గా తనను తాను ప్రూవ్ చేసుకుంటుందని, టైటిల్ రోల్‌కు శ్రుతి అయితేనే పెర్ఫెక్ట్గా సూట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు గానీ, ఆ సినిమా నుంచి ఆమె బయటకు వచ్చేసిందని టాక్ గట్టిగా వచ్చింది. దాంతో ఏమీ చేయలేని చిత్ర యూనిట్ మరో హీరోయిన్ను వెతుక్కునే పనిలో పడిందట. -
11 దేశాల్లో సుందర్.సి సంఘమిత్ర
నటన, దర్శకత్వం అంటూ మార్చిమార్చి విజయాలను అందుకుంటున్న దర్శక నటుడు సుందర్.సి. ఈయన తాజాగా ఒక భారీ చారిత్రక కథా చిత్రాన్ని హ్యాండిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ శత చిత్రంగా అత్యంత భారీ వ్యయంతో నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంఘమిత్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో హీరో పాత్రలకు సూర్య, విజయ్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు వంటి నటుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆ స్టార్ నటులనెవరినీ తాము సంప్రదించలేదని దర్శకుడు సుందర్.సి స్పష్టం చేశారు. అయితే అంతర్జాతీయ ఫ్లేవర్‌తో రూపొందించనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్, చాయాగ్రాహకుడు సుదీప్ చటర్జీ, కళా దర్శకుడు సాబు శిరిల్, సీజీ గ్రాఫిక్స్‌కు కమలకన్నన్ లాంటి సాంకేతిక నిపుణులు అవసరం అయ్యారని తెలిపారు. ఈ చిత్ర కథ పలు దేశాలల్లో నడుస్తోందన్నారు. ఆ గ్రాండీయర్ కోసం పైన చెప్పిన సాంకేతిక వర్గం పని చేయనున్నారని చెప్పారు. అయితే ఇంకా నటవర్గాన్ని ఎంపిక చేయలేదని తెలిపారు. కథకు తగ్గ ప్రముఖ నటీనటులే ఉంటారని అన్నారు. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని చెప్పారు. కాన్సెప్ట్ డిజైనింగ్ ప్రాసస్ జరుగుతోందని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను ఇండియా, అమెరికా, డెన్మార్క్, ఉక్రెయిన్, ఇరాన్ తదితర 11 దేశాల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. -
భారీ చిత్రానికి నో చెప్పిన మహేష్
బాహుబలి, రోబో లాంటి చిత్రాలతో దక్షిణాది సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలోనే కాదు, బడ్జెట్ విషయంలో కూడా బాలీవుడ్ సినిమాను సవాల్ చేశాయి. దీంతో మళ్లీ సౌత్‌లో ఈ స్థాయి సినిమాలు రావడానికి చాలా సమయం పడుతుందని భావించారు. కానీ తమిళ దర్శకుడు సుందర్ సి బాహుబలి, రోబోల కన్నా భారీగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. 300 కోట్ల బడ్జెట్‌తో మూడు భాషల్లో ప్రతిష్టాత్మకంగా ఓ చారిత్రక చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేశాడు. ఈ సినిమాను తమిళ్లో ఇలయదళపతి విజయ్, తెలుగులో మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు సుందర్. అయితే ముందు ఈ సినిమాలో నటించడానికి ఇంట్రస్ట్ చూపించిన టాలీవుడ్ సూపర్ స్టార్, తాజాగా ఆ ఆలోచన విరమించుకున్నాడట. బ్రహ్మోత్సవం సినిమా నిరాశపరచటంతో నెక్ట్స్ సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని భావించిన మహేష్, ఒక్క మురుగదాస్ సినిమా మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే భారీ రెమ్యూనరేషన్‌ను కూడా కాదని సుందర్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడు. -
ఇక్కడ మహేశ్..అక్కడ విజయ్..350 కోట్ల బడ్జెట్!!
‘ఒక్కడు’, ‘పోకిరి’.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కెరీర్లో బ్లాక్‌బస్టర్ సినిమాలు. తమిళ హీరో విజయ్ ఈ సినిమాలను కోలీవుడ్‌లో రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. ఇప్పుడీ స్టార్ హీరోలిద్దరితో ఒకే సినిమా తీయాలని తమిళ దర్శకుడు సుందర్.సి ప్రయత్నిస్తున్నారట. చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం బడ్జెట్ 350 కోట్ల రూపాయలు. సంగీతం సలచలనం ఏఆర్ రెహమాన్, ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు కమల్‌కణ్ణన్ తదితర హేమాహేమీలు ఈ సినిమాకి పనిచేయనున్నారు. అయితే.. ఇది మల్టీస్టారర్ సినిమా కాదు. తెలుగు వెర్షన్లో మహేశ్‌బాబు, తమిళ వెర్షన్లో విజయ్ హీరోలుగా నటిస్తే బాగుంటుందని దర్శకుడి ఆలోచన. ఈ ఇద్దర్నీ కలసి కథ కూడా వినిపించారని కోలీవుడ్ టాక్. మరి, హీరోలు అంగీకరించారో? లేదో? తెలియదు. హిందీలో కూడా తీస్తారట. బాలీవుడ్లో ఇంకా ఎవరికీ కథ చెప్పలేదు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఆ సంస్థకు ఇది నూరవ చిత్రం. దాంతో ఖర్చుకు వెనుకాడకుండా భారీగా నిర్మించాలనుకుంటున్నారు. తెలుగులో మహేశ్, తమిళంలో విజయ్ హీరోలుగా ‘3 ఇడియట్స్’ను రీమేక్ చేయాలని దర్శకుడు శంకర్ గతంలో ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. ఈసారి ఏం జరుగుతుందో!! -
అరణ్మణై సీక్వెల్లో ఆ ముగ్గురూ
చిత్ర పరిశ్రమలో ఒక్కో సీజన్లో ఒక్కో ట్రెండ్ నడుస్తుందనే వారి మాటల్ని కొట్టిపారేయలేము. అలా ప్రస్తుతం హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రాల హవా సాగుతోందని చెప్పవచ్చు. అలాగే సీక్వెల్ సీజన్ నడుస్తోందన్నది గమనార్హం. తమిళంలో మునికి సీక్వెల్‌గా లారెన్స్ తెరకెక్కించిన రెండు చిత్రాలు (కాంచన, కాంచన-2) చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి. యామెరుక్క భయమే చిత్రం విజయం సాధించింది. దీనికి సీక్వెల్ రూపొందిస్తానంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు, కాగా సుందర్ సి దర్శకత్వం వహించిన అరణ్మణై చిత్రం హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపు తెరకెక్కనుంది. విశేషం ఏమిటంటే ఇవన్నీ హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రాలే. ఇక అరణ్మణై చిత్ర విషయానికొస్తే సుందర్ సి దర్శకత్వం వహించి, ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రంలో హన్సిక, ఆండ్రియా, రాయ్‌లక్ష్మి అంటూ ముగ్గురు హీరోయిన్లు నటించారు. దీన్ని నటి కుష్భు తన అల్కి సినీ మాక్స్ పతాకంపై నిర్మించారు. గత ఏడాది తెరపైకి వచ్చిన ఈ చిత్రం విశేష ప్రజాదరణను పొందింది. సీక్వెల్‌కు సిద్ధం : కాగా ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సుందర్ సి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంతో సిద్ధార్థ్ హీరోగా నటించనున్నారని సమాచారం. ఆయనకు జంటగా నటి త్రిష నటించనున్నట్టు ఇప్పటికే ఆమె తన ట్విట్టర్లో వెల్లడించారు. తన డార్లింగ్ కుష్భు నిర్మించే చిత్రంలో తాను నటించనుండడం సంతోషంగా ఉందని త్రిష పేర్కొన్నారు. తాజాగా అరణ్మణై చిత్రంలో నటించిన హన్సిక దానికి కొనసాగింపులోను నటించనున్నారట. ఈ విషయం గురించి కుష్భు తన ట్విట్టర్లో పేర్కొంటై అరణ్మణై-2లో హన్సిక లేకపోతే ఆ చిత్రం పరిపూర్ణం కాదని అన్నారు. హన్సిక కూడా తన ఫేవరెట్ దర్శకుడు చిత్రంలో నటించనుండ డం సంతోషంగా ఉందని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఆమె సుందర్ సి దర్శకత్వంలో తీయవిలై సెయ్యనుమ్ కుమారా, అరణ్మణై, ఆంబళ చిత్రంలో నటించారు. ఈ మూడు చిత్రాలు సక్సెస్ అయ్యాయన్నది గమనార్హం. ఇప్పుడు నాలుగోసారి నటించడానికి హన్సిక సిద్ధం అవుతున్నారన్నమాట. కాగా అరణ్మణై చిత్రంలో మాదిరిగానే దాని సీక్వెల్ చిత్రంలోను ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. ఆ మూడవ హీరోయిన్ నటి కాజల్ అగర్వాల్‌ను నటింపచేయాలని సుందర్ సి భావిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమెతో చర్చించడానికి సుందర్ సి రెడీ అవుతున్నట్లు సమాచారం. అరణ్మణై చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుందని యూనిట్ వర్గాలు తెలిపారు. సుందర్ సి చిత్రాలంటే హాస్యం అలరించే స్థాయిలో ఉంటుంది. అది ఈ కొనసాగింపులో కాస్త అధికంగానే ఉంటుందంటున్నారు చిత్ర వర్గాలు. -
సుందర్ సి దర్శకత్వంలో రజనీ
సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను డెరైక్ట్ చేయడానికి సుందర్ సి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగా. ఈ చిత్రం రిజల్ట్స్ ఎలా వున్నా ఆయనకు మాత్రం భరించలేనంత తలనొప్పిని కలిగించిందని చెప్పక తప్పదు. సూపర్‌స్టార్ తదుపరి చిత్రం ఏమిటన్నది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే రజనీ తాజా చిత్రం గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. శంకర్ ఎందరిన్-2 కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయమై ఇటు శంకర్ నుంచి గానీ అటు రజనీకాంత్ తరపు నుంచి గాని ఎలాంటి సమాచారం లేదు. అదే విధంగా కె ఎస్వ్రికుమార్, ఎ ఆర్ మురుగదాస్, శంకర్ ఎవరో ఒకరు రజనీ చిత్రానికి దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో లేటెస్ట్గా సుందర్ సి రజనీకాంత్‌ను దర్శకత్వం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం తెరపైకొచ్చింది. వీరిద్దిరి కాంబినేషన్లో 1997లో అరుణాచలం చిత్రం రూపొంది ఘన విజయం సాధించింది. సుమారు 18 ఏళ్ల తరువాత సూపర్‌హిట్ కాంబినేషన్లో ఒక చిత్రం రానుందంటే సూపర్‌స్టార్ అభిమానులకు సంతోషకరమైన వార్తే అవుతుంది. రజనీ ఇటీవల సీరియస్‌తో కూడిన యాక్షన్ కథా చిత్రాలు చేశారు. అందువలన ఇప్పుడు పూర్తిగా ఎంటర్టైన్మెంట్తో కూడిన కమర్షియల్ చిత్రం చేయాలని ఆశిస్తున్నట్లు సమాచారం. ఆ తరహా చిత్రాలు చేయడంలో సుందర్ సి సిద్ధహస్తుడు. అందుకే తన తదుపరి చిత్ర బాధ్యతలను రజనీ ఆయనకు అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికార పూర్వక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం వున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. -
స్నేహితులను ఆహ్వానించను
ఇకపై తన సినిమా వేడుకలకు స్నేహితులను ఆహ్వానించనంటున్నారు నటుడు, నిర్మాత విశాల్. తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై తాజాగా నిర్మించి, నటించిన చిత్రం ఆంబళ. సంక్రాంతికి తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రజాదరణ పొందడంతో సోమవారం వడపళనిలోని హోటల్లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. విశాల్ మాట్లాడుతూ ఆంబళ చిత్రం విజయవంతమవడం ఒక ఎత్తు అయితే తన కోరికను నెరవేర్చిన చిత్రంగా చాలా సంతోషం కలిగించిందన్నారు. ఈ విజయాన్ని ఇంతకుముందే జరుపుకోవాల్సి ఉన్నా జరగలేదన్నారు. 2012లో సుందర్‌సి దర్శకత్వంలో తాను నటించిన మదగజరాజ (ఎంజిఆర్) చిత్రాన్ని అప్పట్లో సంక్రాంతికి విడుదల చేయాలని కోరుకున్నామన్నారు. ఆ చిత్ర విడుదల అనివార్య కారణాల వలన వాయిదా పడటంతో ఆ బాధ ఇప్పటి వరకు తనను వెంటాడుతూ వచ్చిందన్నారు. ఈ సంక్రాంతికి విడుదలై తన కోరికను తీర్చిన చిత్రం ఆంబళ అని అన్నారు. మరో విషయం ఏమిటంటే సంక్రాంతికి ఇతర చిత్రాలు ఏమేమి విడుదల కానున్నాయన్న విషయం నిజంగా తనకు తెలియదన్నారు. అలాంటిది ఎవరినైనా నరుక్కుంటూ పోతాను అని తాను అన్నట్టు ఆర్య ప్రచారం చేశారన్నారు. తానలా అనలేదన్నారు. ఇంతకుముందు నటి లక్ష్మీమీనన్‌తో కలుపుతూ నటుడు విష్ణు విశాల్ నాన్ శిగప్పు మనిదన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై చెప్పి వదంతులకు ఆస్కారం కలిగించారన్నారు. అందుకే ఇకపై తన సినిమా వేడుకలకు తన స్నేహితులను ఆహ్వానించనని అన్నారు. తదుపరి చిత్రాల వివరాలను తెలుపుతూ ప్రస్తుతం సుశీంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్నానని ఆ తరువాత లింగుస్వామి దర్శకత్వంలో సండకోళి-2 చిత్రం చేయనున్నట్లు వెల్లడించారు. దర్శకుడు సుందర్ సి మాట్లాడుతూ ఈ ఏడాది చివరిలో విశాల్‌తో ఉలగం చుట్రు వాలిబర్ చిత్రం తరహాలో బ్రహ్మాండమైన చిత్రం చేయనున్నట్లు తెలిపారు. -
సూపర్‌స్టార్ తదుపరి దర్శకుడెవరు?
సూపర్‌స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యార న్నది పరిశ్రమ వర్గాల సమచారం. అయితే దర్శకుడెవరన్న విషయంపైనే రకరకాల ప్రచారం జరుగుతోంది. కోచ్చడయాన్ 3డి యానిమేషన్ చిత్రం నిరాశపరచడంతో త్వరితగతిన మరో మంచి కమర్షియల్ చిత్రం చేయాలన్న రజనీ ఆలోచనకు తెరరూపమే లింగా చిత్రం. తన ఆలోచనలకు తగ్గట్టుగా చిత్రం రూపొందించగల దిట్ట కె ఎస్ రవికుమార్ అని భావించి లింగా చిత్ర బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆ చిత్రం నిర్మాతకు 200 కోట్లు వ్యాపారం చేసిందని సమాచారం. అయితే డిస్ట్రిబ్యూటర్లే భారీ నష్టాలకు గురయ్యామంటూ దీక్షలు, ఆందోళనలు చేశారు. ప్రస్తుతం ఈ విషయంలో నష్టపరిహారానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో రజనీకాంత్ తదుపరిచిత్రానికి దర్శకుడెవరన్న అంశంపై నలుగురైదుగురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో పి.వాసు, శంకర్, సురేష్‌కృష్ణ, సుందర్ సి, కెఎస్ రవికుమార్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పి.వాసు ఇప్పటికే రజనీతో చంద్రముఖి, కుచేలన్ చిత్రాలు తెరకెక్కించగా వాటిలో చంద్రముఖి అమోఘ విజయం సాధించగా కుచేలన్ ఆశించిన విజయం సాధించలేదు. ఆ తరువాత రజనీతో చంద్రముఖి-2 రూపొందించాలని పి.వాసు ఆశించారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. శంకర్ రజనీకాంత్ కలయికలో శివాజీ, ఎందిరన్ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. తాజాగా ఎందిరన్-2 ప్రయత్నం తెరపైకి కొచ్చింది. అయితే ఈ విషయమై శంకర్ నుంచి గానీ, రజనీ నుంచి గానీ సరైన క్లారిటీ రాలేదు. అదే విధంగా కెఎస్ రవికుమార్ రజనీతో ముత్తు, పడయప్పా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు తెరకెక్కించారు. లింగా చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం కె ఎస్ రవికుమార్ సుదీప్ హీరోగా నటించే చిత్రంలో బిజీగా ఉన్నారు. అదే విధంగా భాషా, అన్నామలై వంటి సెన్సేషనల్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు సురేష్‌కృష్ణ రజనీతో భాషా-2 చేయాలని ఆశిస్తున్నారు. దీనికి స్క్రిప్టును కూడా సిద్ధం చేసుకున్నారు. రజనీ ఎప్పుడు రెడీ అంటే అప్పుడే షూటింగ్ అనేలా ఉన్నట్లు సమాచారం. ఇక సూపర్‌స్టార్ అరుణాచలం వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సుందర్‌సి కూడా ఆయనతో మరో చిత్రం చేయడానికి రెడీగా ఉన్నట్లు కోడంబాక్కం టాక్. మరి వీరిలో ఎవరిపై రజనీ దృష్టి పడుతుందో వేచి చూడాల్సిందే. -
యాక్షన్ స్టార్ విశాల్
నటుడు విశాల్‌కు యాక్షన్ స్టార్ పట్టం కట్టారు. మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ, ఒకప్పుడు విజయకాంత్ చిత్రాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలుండేవన్నారు. ఆయనతో నటించినప్పుడు తాను చాలా దెబ్బలకు గురయ్యానని అన్నారు. అలా ప్రస్తుతం నటుడు విశాల్ యాక్షన్ కథా చిత్రాల్లో బాగా నటిస్తున్నారని అన్నారు. అందుకే ఆయన్ను యాక్షన్ స్టార్‌గా పేర్కొనట్లు అన్నారు. విశాల్ హీరోగా నటిస్తూ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలో నిర్మిస్తున్న తాజా చిత్రం ఆంబళ. హన్సిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు వైభవ్, రమ్యకృష్ణ, కిరణ్రాథోడ్ తదితరులు ముఖ్య పాత్రలు పోసిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా హిప్హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన్సూర్ అలీఖాన్ ప్రసంగించారు. అనంతరం నిర్మాత టి.శివ మాట్లాడుతూ ఆంబ ళ (మగాడు) చిత్రం టైటిల్ విశాల్‌కు కరెక్ట్‌గా నప్పుతుందన్నారు. ఆయన పైరసీని అరికట్టడానికి ఒంటరిగా పోరాడుతున్నారని ప్రశంసించారు. అలాగే ధైర్యంగా చిత్రాలు నిర్మిస్తూ విజయాలు సాధిస్తున్నారని అన్నారు. సుందర్ సి మొదట్లో పలు భారీ హిట్స్ చిత్రాలను అందించారని మధ్యలో కొంత వెనుకబడ్డా మళ్లీ వరుస విజ యాలతో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నారన్నారు. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ ఆంబళ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మ కం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నటి కుష్బు, హన్సిక, జి.కె.రెడ్డి, ఆర్కె సెల్వమణి, ఎస్ఎ చంద్రశేఖర్, తిరు, హిప్ హాప్ తమిళ్, ఆర్య, కె.ఇ.జ్ఞానవేల్ రాజా పాల్గొన్నారు. -
ఖుషీఖుషీగా హన్సిక
హన్సిక యమ ఖుషీగా ఉన్నారు. అందుకు కారణం ఆమెకు వరిస్తున్న విజయాలే. ఈ లక్కీ హీరోయిన్ నటించిన అరణ్మణై ఇటీవల విడుదలై విజయాన్ని సాధించింది. హన్సిక ఆ సంతోషాన్ని అనుభవిస్తుండగానే ఆమె నటించిన తాజా చిత్రం మెగామాన్ ఈ శుక్రవారం తెరపైకి వచ్చి విశేష ప్రజాదరణను చూరగొంటోంది. దీంతో హన్సిక ఆనందం రెట్టింపు అయ్యింది. క్రిస్మస్కు మెగామాన్ విడుదలై ప్రజాదరణ పొందగా సంక్రాంతికి విశాల్‌తో జత కట్టిన ఆంబళ చిత్రం తెరపైకి రానుంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్ర విజయంపై హన్సిక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సుందరిని టాలీవుడ్ కూడా ఆనందంలో ముంచెత్తుతోంది. హన్సిక తెలుగులో ఆ మధ్య రవితేజతో నటించిన పవర్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో సక్సెస్ అయిన అరణ్మణై చిత్రం తెలుగులో చంద్రకళ పేరుతో అనువాదమై వసూళ్లు కురిపిస్తోందట. ఈ చిత్రం తొలి వారంలోనే కోటి 25 లక్షలు వసూలు చేసిందని హన్సిక సన్నిహితులు పేర్కొన్నారు. విశాల్ సరసన నటిస్తున్న ఆంబళ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచిచూడాల్సిందే. ప్రస్తుతం నటిస్తున్న వాలు, ఉయిరే ఉయిరే, వేట్టైమన్నన్ చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అలాగే జయంరవితో రోమియో జూలియట్, విజయ్ సరసన గరుడ చిత్రాలలో నటిస్తూ హన్సిక బిజీగా ఉన్నారు. -
హారర్ నేపథ్యంలో కుటుంబ కథ
హన్సిక ముఖ్య పాత్రధారిణిగా సుందర్.సి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘అరన్మణి’. ఈ చిత్రం ‘చంద్రకళ’ పేరుతో ఈ నెల 19న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు ఈ అనువాద చిత్రానికి నిర్మాతలు. ఈ సినిమా గురించి సమర్పకుడు సి.కల్యాణ్ చెబుతూ -‘‘హారర్ నేపథ్యంలో సాగే కుటుంబ కథాచిత్రమిది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా. తమిళంలో 30 కోట్లు వసూలు చేసి సంచలన విజయంగా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. లక్ష్మీ రాయ్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్ కుమార్, మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, సంగీతం: కార్తీక్‌రాజా, భరద్వాజ్, సహనిర్మాత: పద్మాకరరావు వాసిరెడ్డి. -
తేనెటీగ కుట్టినా షూటింగ్ ఆపలేదు
చిన్న చీమ కుడితేనే చిమచిమలాడుతుంది. అలాంటి తేనెటీగ కుడితే అమ్మో అది యమబాధనే. అలాంటి తేనెటీగ అందమైన హీరోయిన్ను కుడితే ఇంకేమైనా ఉందా? ప్రథమ చికిత్స, విశ్రాంతి, షూటింగ్‌కు అంతరాయం అంటూ పెద్ద ఇష్యూ అయిపోదు. అలాంటి తేనెటీగ, ముట్టుకుంటే కందిపోయే అందాలభామ హన్సికను కుట్టింది. అయినా పైన చె ప్పినవేవీ జరగలేదు. అయితే బాధను మాత్రం భరించింది ఈ ముద్దుగుమ్మ. షూటింగ్‌కు మాత్రం అంతరాయం కలగనీయలేదు. బహుభాషా నటి హన్సిక ఒక్క తమిళంలో చేతినిండా చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విశాల్ సరసన ఆంబళ చిత్రంలో నటిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఊటీలో జరుగుతోంది. ఆ అడవి ప్రాంతంలో హన్సిక చేతిపై తేనెటీగ కుట్టిందట. వెంటనే ప్రథమ చికిత్స అందించినా నొప్పి మాత్రం తగ్గలేదు. ఆ నొప్పిని భరిస్తూనే షూటింగ్లో పాల్గొన్నారు. చిత్ర యూనిట్ విశ్రాంతి తీసుకోమని చెప్పినా అదే తగ్గిపోతుందిలే అంటూ షూటింగ్‌కు అంతరాయం కలగకుండా నటించినట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెప్పాయి. వృత్తిపై హన్సికకు ఎంత అంకితభావం అంటూ సహచరులు మెచ్చుకోకుండా ఉండలేకపోయారట. దటీజ్ హన్సిక. మరో విషయం ఏమిటంటే ఈ బ్యూటీ ఆదివారం హైదరాబాద్ వెళ్లి, అక్కడ విశాఖ ప్రాంత వరద బాధితుల కోసం నిధిని సేకరించే కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిసింది. అటు నుంచి హన్సిక ముంబయి వెళ్లి తన దత్తపుత్రిక, పుత్రులతో దీపావళి పండుగ జరుపుకుని వారి జీవితాల్లో సంతోషాన్ని నింపి ఆ తరువాత చెన్నైకు చేరుకుని రోమియో జూలియట్ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. -
విశాల్ చిత్రంలో రమ్యకృష్ణ
చెన్నై: తన దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ ముఖ్య భూమిక పోషించనున్నారని ఆ చిత్ర దర్శకుడు సుందర్. సి బుధవారం చెన్నైలో వెల్లడించారు. ఆ చిత్రం త్వరలో హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుందని చెప్పారు. ఆ షూటింగ్లో రమ్య పాల్గొంటారని తెలిపారు. తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా రమ్యకృష్ణ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. 1990లో తమిళంలో తెరకెక్కిన కుట్టి పిశాసు చిత్రం ఆమె నటించిన అఖరి చిత్రమని సుందర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బహుబలిలో నటిస్తు రమ్యకృష్ణ మహా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
అతీంద్రియ శక్తులతో...
మాయలెరిగిన నాయిక అనగానే, ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’లో శ్రీదేవే గుర్తొస్తారు. ఆ సినిమాలో ఆమె ఇంద్రజ. తనకున్న అతీంద్రియ శక్తులతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేశారు శ్రీదేవి. అలాంటి పాత్రనే ఇప్పుడు హన్సిక పోషిస్తున్నారు. అయితే... శ్రీదేవిలా దివి నుంచి భువికి దిగే పాత్ర కాదు హన్సికది. భువిపైనే పుట్టిన దేవకుమార్తె అన్నమాట. తనకున్న దైవశక్తులతో రోగాలను నయం చేసేస్తుంటుంది. భవిష్యత్తులో జరగబోయేది కూడా చెప్పేస్తుంటుంది. ఇంతకీ ఏ సినిమాలో హన్సిక ఇలా కనిపించేది? అనేగా మీ ప్రశ్న. అది తెలుగు సినిమా కాదు. తమిళ సినిమా. సుందర్.సి నటిస్తూ... దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పేరు ‘అరణ్మణై’. తన కెరీర్లోనే చెప్పుకోదగ్గ పాత్ర ఇదని చెబుతున్నారు హన్సిక. ఇటీవల ఈ పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ -‘‘సుందర్సార్ కథ చెప్పినప్పుడు భిన్నంగా అనిపించింది. నా కెరీర్లో ఇప్పటివరకూ చేసిన పాత్రల్లో ఇది భిన్నమైన పాత్ర. అడుగడుగునా మలుపులతో నా పాత్రను డిజైన్ చేశారు. ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు హన్సిక.