ఖుషీఖుషీగా హన్సిక | Hansika has become my lucky charm: Sundar C | Sakshi
Sakshi News home page

ఖుషీఖుషీగా హన్సిక

Published Sun, Dec 28 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

ఖుషీఖుషీగా హన్సిక

ఖుషీఖుషీగా హన్సిక

  హన్సిక యమ ఖుషీగా ఉన్నారు. అందుకు కారణం ఆమెకు వరిస్తున్న విజయాలే. ఈ లక్కీ హీరోయిన్ నటించిన అరణ్మణై ఇటీవల విడుదలై విజయాన్ని సాధించింది. హన్సిక ఆ సంతోషాన్ని అనుభవిస్తుండగానే ఆమె నటించిన తాజా చిత్రం మెగామాన్ ఈ శుక్రవారం తెరపైకి వచ్చి విశేష ప్రజాదరణను చూరగొంటోంది. దీంతో  హన్సిక ఆనందం రెట్టింపు అయ్యింది. క్రిస్మస్‌కు మెగామాన్ విడుదలై ప్రజాదరణ పొందగా సంక్రాంతికి విశాల్‌తో జత కట్టిన ఆంబళ చిత్రం తెరపైకి రానుంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్ర విజయంపై హన్సిక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సుందరిని టాలీవుడ్ కూడా ఆనందంలో ముంచెత్తుతోంది.
 
 హన్సిక తెలుగులో ఆ మధ్య రవితేజతో నటించిన పవర్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో సక్సెస్ అయిన అరణ్మణై చిత్రం తెలుగులో చంద్రకళ పేరుతో అనువాదమై వసూళ్లు కురిపిస్తోందట. ఈ చిత్రం తొలి వారంలోనే కోటి 25 లక్షలు వసూలు చేసిందని హన్సిక  సన్నిహితులు పేర్కొన్నారు. విశాల్ సరసన నటిస్తున్న ఆంబళ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచిచూడాల్సిందే. ప్రస్తుతం నటిస్తున్న వాలు, ఉయిరే ఉయిరే, వేట్టైమన్నన్ చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అలాగే జయంరవితో రోమియో జూలియట్, విజయ్ సరసన గరుడ చిత్రాలలో నటిస్తూ హన్సిక బిజీగా ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement