Aranmanai
-
'అరణ్మణై 5' ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
హాలీవుడ్ తరహాలో దక్షిణాదిలో ఫ్రాంఛైంజీస్ కథా చిత్రాలు ఎక్కువగా హిట్ అయ్యింది లేదు. అయితే దాన్ని దర్శకుడు సుందర్.సి సాధ్యం చేశారు. ఆయన ఎంచుకున్న హార్రర్ కామెడీ బ్యానర్ బాగా కలిసొచ్చిందని చెప్పక తప్పదు. ఈయన ఈ బ్యానర్లో అరణ్మణై పేరుతో ఇప్పటి వరకూ 4 సీక్వెల్స్ చేశారు. ఇవన్నీ సూపర్ హిట్టే . చివరిగా ఈయన తెరకెక్కించిన అరణ్మణై 4 (బాకు) చిత్రం ఇటీవల విడుదలై రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఇందులో నటి తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించగా.. సుందర్.సి ప్రధాన పాత్రలో మెప్పించారు. అయితే, అరణ్మణై5 షూటింగ్ ప్రారంభమైందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై నటి ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు.అరణ్మణై5 ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా ఫేక్ అని ఆమె చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి తామె ఎలాంటి పోస్టర్స్ విడుదల చేయలేదని ఆమె తెలిపారు. ఇవ్వన్నీ రూమర్సే అంటూ చెప్పుకొచ్చారు. పార్ట్5 గురించి తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. అరణ్మణై5 ప్లాన్ చేసినప్పుడు స్వయంగా వెల్లడిస్తామని, అప్పటి వరకు వేచిఉండాలని ఖుష్బూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 2014లో విడుదలైన 'అరణ్మణై' మంచి విజయం అందుకోవడంతో దానికి సీక్వెల్‌గా 2016,2021,2024లో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. 'అరణ్మణై4' ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సుందర్.సి డైరెక్టర్‌గా నయనతార ప్రధాన పాత్రలో మూక్కుత్తి అమ్మన్ 2 (అమ్మోరు తల్లి2) చిత్రాన్ని చేస్తున్నారు. వడివేలుతో కలిసి గ్యాంగ్స్టర్స్ అనే మరో చిత్రాన్ని కూడా ఆయన తెరకెక్కిస్తున్నారు. అలాగే సుందర్.సి హీరోగా నటిస్తున్న ఒన్ 2 ఒన్, వల్లన్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్
థియేటర్లలో ఆల్రెడీ 'దేవర' హవా నడుస్తోంది. దీంతో ఈ వారం థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రావట్లేదు. ఉన్నంతలో స్వాగ్, రామ్ నగర్ బన్నీ, దక్షిణ, కలి, మిస్టర్ సెలబ్రిటీ అనే మూవీస్ వస్తున్నాయి. కానీ వీటిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. మరోవైపు ఓటీటీలో మాత్రం దాదాపు 27 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: సోనియా ఎలిమినేట్, ఏడ్చిన నిఖిల్.. చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగ్!)ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ విషయానికొస్తే.. '35 చిన్న కథ కాదు' మాత్రమే ఆసక్తి కలిగిస్తోంది. థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఓటీటీలో మరింత స్పందన తెచ్చుకోవడం గ్యారంటీ. దీనితోపాటు కంట్రోల్, బోట్ అనే చిత్రాలు కూడా ఉన్నంతలో ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 30- అక్టోబరు 06)అమెజాన్ ప్రైమ్బోట్ (తమిళ సినిమా) - అక్టోబరు 01హౌస్ ఆఫ్ స్పాయిల్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 03ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మెషీనా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03క్లౌడ్ మౌంటైన్ (చైనీస్ సినిమా) - అక్టోబరు 03ద ట్రైబ్ (హిందీ రియాలిటీ సిరీస్) - అక్టోబరు 04ఆహా35 చిన్న కథ కాదు (తెలుగు సినిమా) - అక్టోబరు 02బాలు గాని టాకీస్ (తెలుగు మూవీ) - అక్టోబరు 04నెట్ఫ్లిక్స్మేకింగ్ ఇట్ ఇన్ మార్బెల్లా (స్వీడిష్ సిరీస్) - అక్టోబరు 01టిమ్ దిల్లోన్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 01చెఫ్స్ టేబుల్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02అన్ సాల్వెడ్ మిస్టరీస్ వాల్యూమ్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02హార్ట్ స్టాపర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03నింజాగో: డ్రాగన్స్ రైజింగ్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03కంట్రోల్ (హిందీ మూవీ) - అక్టోబరు 04ఇట్స్ వాట్స్ ఇన్ సైడ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 04ద ఫ్లాట్ ఫామ్ 2 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 04రన్మ 1/2 (జపనీస్ సిరీస్) - అక్టోబరు 05ద సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ద అపాకలిప్స్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) - అక్టోబరు 06హాట్స్టార్ద సింప్సన్స్ సీజన్ 36 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 30జియో సినిమాఅరణ్మనై 4 (హిందీ డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 01అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ (హిందీ మూవీ) - అక్టోబరు 04మనోరమ మ్యాక్స్ఆనందపురం డైరీస్ (మలయాళ సినిమా) - అక్టోబరు 04సోనీ లివ్మన్వత్ మర్డర్స్ (మరాఠీ సిరీస్) - అక్టోబరు 04జీ5ద సిగ్నేచర్ (హిందీ సినిమా) - అక్టోబరు 04కలర్స్ ఆఫ్ లవ్ (హిందీ మూవీ) - అక్టోబరు 04ఆపిల్ ప్లస్ టీవీవేరే ఈజ్ వాండా (జర్మన్ సిరీస్) - అక్టోబరు 04(ఇదీ చదవండి: కూతురి ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్) -
ఆ ఇమేజ్ నుంచి రాశీ ఖన్నా బయటపడుతుందా.. ?
అందాలతో కనువిందు చేయడంలో అతి కొద్దిమంది హీరోయిన్లలో నటి రాశీఖన్నా ఒకరని చెప్పవచ్చు. తొలుత మెడ్రాస్ కఫే అనే హిందీ చిత్రంతో నట జీవితాన్ని ప్రారంభించిన బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ అంటూ తన పరిధిని విస్తరించుకుంటూ వచ్చింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఇమైకా నొడిగళ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. ఆ తరువాత అడంగా మరు, దుల్కర్ దర్బార్, తిరుచిట్రంఫలం, సర్దార్ మొదలగు చిత్రాల్లో నటించి తనకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల సుందర్.సీ దర్శకత్వంలో తమన్నతో పోటీ పడి (అందాలారబోతలో) నటించిన అరణ్మణై 4 (బాకూ) చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం హిందీలోనూ అనువాదమై విడుదల కావడం విశేషం. అయితే సాధారణంగా గ్లామర్ పాత్రల్లో నటిస్తే క్రేజ్ వస్తుందని అంటుంటారు. అయితే రాశీఖన్నా ఆలోచనలు ఇప్పుడు అందుకు భిన్నంగా ఉన్నట్లు సమాచారం. గ్లామరస్‌గా నటించి బోర్ కొట్టిందో ఏమోగానీ, అందాలారబోతను మాత్రమే నమ్ముకుంటే సినిమాలో ఉన్నత స్థాయికి చేరుకోవడం కష్టమని, అభిమానుల మనసుల్లో పది కాలాల పాటు నిలిచిపోవడానికి, అవకాశాలు పెరగడానికి వైవిద్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించడం ముఖ్యం అని ఈ అమ్ముడు ఇటీవల ఒక భేటీలో పేర్కొంది.సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్న రాశీఖన్నాకు నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఇప్పటికిప్పుడు రావడం అంటే ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్లామరస్ హీరోయిన్గా ముద్ర వేసుకున్న ఈమె ఆ ఇమేజ్ నుంచి బయట పడడానికి గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుందంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే రాశీఖన్నా ఇటీవల చీర ధరించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. అందులో ఆమె కట్టింది చీరే అయినా, మోడరన్ దుస్తులకు మించిన సొగసులు తొంగి చూస్తున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. -
ఓటీటీకి వచ్చేస్తోన్న తమన్నా హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అరణ్మైనై-4. ఈ సినిమాను తెలుగులో బాక్ పేరుతో విడుదల చేశారు. సుందర్ సి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. గత నెల మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తమిళంలో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై 4' నుంచి వచ్చిన 4వ చిత్రంగా నిలిచింది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం జూన్ 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, కోవై సరళ కీలక పాత్రలు పోషించారు.Oru semma Family entertainer!Aranmanai 4 Streaming From June 21 On Disney +Hotstar#Aranmanai4 #StreamingFromJune21 #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/9rz8wBBqNx— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 5, 2024 -
ఓటీటీలో రూ. 100 కోట్ల హారర్ మూవీ.. అఫీషియల్ ఫ్రకటన
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం 'బాక్'. తమిళ్లో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై 4' నుంచి వచ్చిన 4వ చిత్రమిది. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. మే 3న విడుదలైన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. ఇదే విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.తమిళ్లో 'అరణ్మనై 4' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'బాక్' టైటిల్‌తో విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే, ఈ సినిమా త్వరలో హాట్‌స్టార్‌లో విడుదల కానుందని ఆ సంస్థ ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించకుండా త్వరలో రిలీజ్ చేస్తామని హాట్‌స్టార్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. விரைவில் 🔥Aranmanai 4 Coming Soon On Disney + Hotstar#Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/DsYnNrZ3d2— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 2, 2024 కానీ, జూన్ 7న బాక్ విడుదల కానున్నట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్, కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ నటి..!
సీనియర్ నటి కోవై సరళ మీకు గుర్తుందా? ఆమె పేరు వినగానే కామెడీ వెంటనే గుర్తుకొచ్చేస్తోందా? కోవై సరళ- బ్రహ్మానందం జోడీ చేసే కామెడీ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ మెదలుతూనే ఉంటాయి. టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తమిళనాడుకి చెందిన కోవై సరళ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో నటించారు.ప్రస్తుతం చాలా తక్కువగా సినిమాల్లో కనిపిస్తున్నారు. చివరిసారిగా 2022లో వచ్చిన సెంబి చిత్రంలో కోవై సరళ నటించింది. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో సూపర్ హిట్ సిరీస్ అరణ్మనై పార్ట్-4 త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. బాక్ పేరుతో తెలుగులోనూ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌కు కోవై సరళ కూజా హాజరయ్యారు. సరికొత్త లుక్‌లో కనిపించి సందడి చేశారు. సినీ ప్రియులు గుర్తు పట్టలేని విధంగా ఆమె మారిపోయారు. కాగా.. ఈ చిత్రం మే3న థియేటర్లలో సందడి చేయనుంది. -
తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ బ్లాస్ట్.. పాటలో డోస్ పెంచిన బ్యూటీస్
దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం అరణ్మణై–4. ఇంతకుముందు ఈయన తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అరణ్మణై–4 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్‌కుమార్‌కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా, యోగిబాబు, కోవై సరళ, వి.టీవీ గణేష్ ముఖ్యపాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు మేకర్స్..అందులో తమన్నా, రాశీఖన్నా అందాల ప్రదర్శనతో పోటీ పడ్డారు అని చెప్పవచ్చు. హిప్ హాప్ ఆది అందించిన మ్యూజిక్కు వారిద్దరూ గ్లామర్‌తో మ్యాజిక్ చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన మూడు సీక్వెల్స్ భారీ హిట్‌ను అందుకున్నాయి. ఇప్పుడు నాలుగో పార్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నాలే హైలైట్. అందాలు ఆరబోయడంలో ఒకరితో ఒకరు పోటీపడినట్లు కనిపిస్తోంది. తెలుగులో 'బాక్' అనే పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అరణ్మణై 4 నిజానికి ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సింది. పలు కారణాల రీత్యా వాయిదా పడింది. ఫైనల్‌గా ఏప్రిల్ 26న ఈ చిత్రం కోలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల కానుంది. -
మళ్లీ వచ్చేస్తున్న హారర్ మూవీ.. ట్రైలర్ చూశారా?
దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం అరణ్మణై–4. ఇంతకుముందు ఈయన తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అరణ్మణై–4 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్‌కుమార్‌కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా, యోగిబాబు, కోవై సరళ, వి.టీవీ గణేష్ ముఖ్యపాత్రలు పోషించారు. అప్పట్లో ఆ ఆలోచనే లేదు హిప్ హాప్ ఆది సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని నిర్వహించారు. హీరో సుందర్ సి మాట్లాడుతూ.. అరణ్మణై చిత్రం తొలిభాగం తన కెరీర్లో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. దానికి సీక్వెల్స్ రూపొందించాలన్న ఆలోచన తనకు అప్పట్లో లేదన్నారు. మంచి ఐడియాలు రావడం వల్లే సీక్వెల్స్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. వేరే చిత్రానికి సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నప్పుడు తన కోరైటర్ ఒక విషయాన్ని చెప్పారన్నారు. రాజులే భయపడ్డారు అది కొత్తగా ఉండడంతో ఈ అరణ్మణై –4 చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమైనట్లు చెప్పారు. 'ఇండియాలోని పలు భాగాలను పాలించడానికి అప్పట్లో పలువురు రాజులు దండెత్తి వచ్చారు. అయితే వారెవరూ ఈస్ట్ భాగంలోని బ్రహ్మపుత్ర నదిని దాటి వెళ్లడానికి సాహసించలేదు. అందుకు పలు కారణాలు ఉండగా.. అందులో ఒకటి దెయ్యం! ఆ ప్రాంతంలో బాగ్ అనే మానవశక్తిని మించిన శక్తి కలిగిన దెయ్యం ఉందనేది కథలు, కథలుగా చెప్పుకునేవారు. ఆ అంశాన్ని కథగా మలుచుకుని రూపొందించిన చిత్రమే అరుణ్మణై–4' అని చెప్పారు. ఇప్పటి వరకు గ్లామర్, యాక్షన్ పాత్రల్లో చూసిన తమన్నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చదవండి: సాధారణ వ్యక్తి ప్రేమలో 'పూజా హెగ్డే'.. ఫోటోలు వైరల్ -
Tamannaah Latest Photos: తమన్నా బ్యూటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు (ఫోటోలు)
-
సినిమా ఏదైనా గ్లామర్ ఉండాల్సిందే!
సినిమా జానర్ ఏదైనా గ్లామర్ తప్పని సరిగా మారుతోందిప్పుడు. దర్శకుడు సుందర్.సీ చిత్రాల్లో కామెడికీ, గ్లామర్‌కు కొదవే ఉండదు. అలా సుందర్.సీ ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం అరణ్మణై చిత్రం. దీన్ని ఆయన సతీమణి, నటి కుష్బూ నిర్మించారు. హారర్ కామెడీ జానర్లో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో వరుసగా మరో రెండు సీక్వెల్స్‌ను తెరకెక్కించారు. అవీ హిట్ కావడంతో తాజాగా నాలుగో సీక్వెల్‌ను తెరకెక్కించారు. దీని పేరు అరణ్మణై 4. హారర్ + కామెడీ సుందర్.సీతో పాటు తమన్నా, రాశీఖన్నా, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో కోవైసరళ, గరుడ రామ్, దర్శకుడు కేఎస్.రవికుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. హిహ్ హాప్ తమిళా సంగీతం, ఇ.కృష్ణస్వామి ఛాయాగ్రహణం అందించారు. దీనికి బెంజ్ మీడియా అధినేత ఏసీఎస్ అరుణ్‌కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. ఇది కూడా గత సీక్వెల్స్ మాదిరిగానే హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందడం విశేషం. ఆ ఇద్దరే హైలైట్ ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నాలే హైలైట్. అందాలు ఆరబోయడంలో ఒకరితో ఒకరు పోటీపడినట్లు కనిపిస్తోంది. మరో విషయం ఏమిటంటే తమిళంలో ప్రస్తుతం వీరి చేతిలో ఉన్న ఒకే ఒక్క చిత్రం ఇదే. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అరణ్మణై 4 నిజానికి ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సింది. పలు కారణాల రీత్యా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. Some say this Mansion is very chill, and some say it is very chilling 👻 This April #Aranmanai4 is coming to give your summer a nice dose of laughter and a whole lot of chills and thrills... So are you ready? A Film by #SundarC A @hiphoptamizha Musical@khushsundar… pic.twitter.com/jUXWUssujV — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 27, 2024 చదవండి: చిరంజీవి, మోహన్‌బాబు మధ్య గొడవ.. వాళ్లకు ఎప్పుడూ అదే పని.. -
ఖుషీఖుషీగా హన్సిక
హన్సిక యమ ఖుషీగా ఉన్నారు. అందుకు కారణం ఆమెకు వరిస్తున్న విజయాలే. ఈ లక్కీ హీరోయిన్ నటించిన అరణ్మణై ఇటీవల విడుదలై విజయాన్ని సాధించింది. హన్సిక ఆ సంతోషాన్ని అనుభవిస్తుండగానే ఆమె నటించిన తాజా చిత్రం మెగామాన్ ఈ శుక్రవారం తెరపైకి వచ్చి విశేష ప్రజాదరణను చూరగొంటోంది. దీంతో హన్సిక ఆనందం రెట్టింపు అయ్యింది. క్రిస్మస్కు మెగామాన్ విడుదలై ప్రజాదరణ పొందగా సంక్రాంతికి విశాల్‌తో జత కట్టిన ఆంబళ చిత్రం తెరపైకి రానుంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్ర విజయంపై హన్సిక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సుందరిని టాలీవుడ్ కూడా ఆనందంలో ముంచెత్తుతోంది. హన్సిక తెలుగులో ఆ మధ్య రవితేజతో నటించిన పవర్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో సక్సెస్ అయిన అరణ్మణై చిత్రం తెలుగులో చంద్రకళ పేరుతో అనువాదమై వసూళ్లు కురిపిస్తోందట. ఈ చిత్రం తొలి వారంలోనే కోటి 25 లక్షలు వసూలు చేసిందని హన్సిక సన్నిహితులు పేర్కొన్నారు. విశాల్ సరసన నటిస్తున్న ఆంబళ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచిచూడాల్సిందే. ప్రస్తుతం నటిస్తున్న వాలు, ఉయిరే ఉయిరే, వేట్టైమన్నన్ చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అలాగే జయంరవితో రోమియో జూలియట్, విజయ్ సరసన గరుడ చిత్రాలలో నటిస్తూ హన్సిక బిజీగా ఉన్నారు. -
ప్రేమ విషయంలో ఇప్పటికే ఓడిపోయాను
ప్రేమలో ఒక్కసారి ఓడింది చాలు. మరోసారి ఆ చేదు అనుభవాన్ని ఎదుర్కోవాలనుకోవడం లేదంటున్నారు రాయ్‌లక్ష్మి. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఈ బ్యూటీకి అవకాశాలు అంతగా లేవు. ఆ మధ్య అధర్వ హీరోగా నటించిన ఇరుబుంబకుదిరై చిత్రంలో ఆయనకు స్నేహితురాలిగా ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్ర పోషించారు. అంతేకాదు ఆ చిత్రంలో అంగాంగ ప్రదర్శన చేసినప్పటికీ చిత్రం పరాజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఇటీవల హిట్ చిత్రం అరణ్మణైలో ఉన్నాననిపించుకున్నారంతే. ప్రస్తుతం ఒక చిత్రం కోసం బాగా శరీర కసరత్తులు చేస్తున్నారట. ప్రస్తుతానికి ప్రేమా గీమా జాన్తా నై అంటున్న రాయ్ లక్ష్మి ఇంకా ఏం చెబుతోందంటే... నూతన చిత్రం కోసం మూడు నెలలుగా ఏకధాటిగా జిమ్నాస్టిక్ నేర్చుకుంటున్నా. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నాలుగు షిప్టుల ప్రకారం శిక్షణా తరగతులకు హాజరవుతున్నాను. దీంతో ఇంతకుముందుకు ఎలా ఉన్నానో, ఇప్పడు ఎలా ఉన్నాన్నో పోల్చుకుని చూస్తే తనకే ఆశ్చర్యం వేస్తోంది. ప్రేమ, పెళ్లి గురించి అడుగుతున్నారు, ప్రేమ విషయంలో ఇప్పటికే ఒకసారి ఓడిపోయాను, మళ్లీ అలాంటి చేదు అనుభవాన్ని చవి చూడదలచుకోలేదు. ప్రస్తుతం తాను ప్రేమిస్తోంది సినిమాను మాత్రమే. ఈ రంగంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అయ్యింది. ఇకపై ప్రేమ కోసం దేన్ని కోల్పోదలచుకోలేదు అని చెబుతోంది రాయ్‌లక్ష్మి. -
అదంతా అసత్య ప్రచారం
నటి హన్సిక నటించిన తాజా చిత్రం మెగామాన్ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 25న విడుదలకు సిద్ధం అవుతోంది. ఆర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి మగిళ్ తిరువేణి దర్శకుడు. ఈ చిత్రంలో హన్సిక పోషిం చిన పాత్రపై పలు రకాల ప్రచారాలు హల్చల్ చేస్తున్నాయి. హన్సిక హీరోయిన్గా మంచి క్రేజ్ ఉంది. ఇటీవల విడుదలైన అరణ్మణై చిత్రంతో సహా వరుస విజయాలను అందుకుంటున్న నటి హన్సిక. అదే విధంగా విజయ్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. వ్యక్తిగతంగా కూడా పలువురు పిల్లలను దత్తత తీసుకోవడం వంటి పలు సేవా కార్యక్రమాలతో మంచి ఉదార స్వభావం గల నటిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి నటి మెగామాన్ చిత్రంలో పోషించిన పాత్ర చిన్న పిల్లలు మెచ్చేదిగా ఉండకపోవడమే కాకుండా వారిని భయపెట్టేదిగాను, ఆమె వ్యక్తిగతానికి పూర్తి విరుద్దమైనది గాను ఉంటుందనే ప్రచారం సోషల్నెట్ వర్క్స్‌లో జోరందుకుంది. దీనికి స్పందించిన హన్సిక అదంతా అసత్య ప్రచారం అని కొట్టి పారేశారు. తాను మెగామాన్ చిత్రంలో హీరోయిన్గా నటించానని తెలిపారు. దీన్ని ఎవరో కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. మెగామాన్ చిత్రం ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన చిత్రం అని అలాంటి చిత్రంలో పిల్లలను భయపెట్టే పాత్రగా తనకెందుకుంటుందని హన్సిక ప్రశ్నిస్తున్నారు. -
అన్నీ మంచి శకునములే!
‘‘శ్రీ శుభ శ్వేత ఫిలిమ్స్ సంస్థ మొదలుపెట్టాక మేం తొలుత విడుదల చేస్తున్న సినిమా ఇదే. ఏ ముహూర్తాన ఈ కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేశామో కానీ... అన్నీ మంచి శకునములే’’ అని సి.కల్యాణ్ అన్నారు. హన్సిక, లక్ష్మీరాయ్, ఆండ్రియా, సుందర్.సి ముఖ్య తారలుగా తమిళంలో రూపొందిన చిత్రం ‘అరణ్మణై’. ఈ చిత్రం ‘చంద్రకళ’గా తెలుగులో విడుదల కానుంది. శ్వేతలాన, వరుణ, తేజ, సి.వి.రావు నిర్మాతలు. సి.కల్యాణ్ ఈ చిత్రానికి సమర్పకుడు. నేడు సి.కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ నెల 19న సినిమాను విడుదల చేయనున్నట్లు సి.కల్యాణ్ తెలిపారు. చెన్నయ్‌లో ‘అరణ్మణై’ సినిమా పోస్టర్ చూడగానే తనకు ‘అరుంధతి’ సినిమా గుర్తొచ్చిందనీ, ఈ సినిమాను తెలుగులో తానే అనువదించాలనుకున్నానని నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి చెప్పారు. దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాతలు కొడాలి వెంకటేశ్వరరావు, వజ్జా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. -
హారర్ నేపథ్యంలో కుటుంబ కథ
హన్సిక ముఖ్య పాత్రధారిణిగా సుందర్.సి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘అరన్మణి’. ఈ చిత్రం ‘చంద్రకళ’ పేరుతో ఈ నెల 19న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు ఈ అనువాద చిత్రానికి నిర్మాతలు. ఈ సినిమా గురించి సమర్పకుడు సి.కల్యాణ్ చెబుతూ -‘‘హారర్ నేపథ్యంలో సాగే కుటుంబ కథాచిత్రమిది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా. తమిళంలో 30 కోట్లు వసూలు చేసి సంచలన విజయంగా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. లక్ష్మీ రాయ్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్ కుమార్, మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, సంగీతం: కార్తీక్‌రాజా, భరద్వాజ్, సహనిర్మాత: పద్మాకరరావు వాసిరెడ్డి. -
హన్సిక ప్రధాన పాత్రలో ‘చంద్రకళ’
-
హన్సిక భయపెడుతుందట!
హారర్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తమిళంలో రూపొందిన చిత్రం ‘అరన్మణి’. హన్సిక ప్రధాన పాత్రలో సుందర్.సి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘చంద్రకళ’గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత సి.కల్యాణ్. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ -‘‘ఇప్పటికి తమిళనాడులో 24 కోట్ల రూపాయలు వసూలు చేసిందీ సినిమా. తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం. అందుకే... ఎంతమంది పోటీకి వచ్చినా.. ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి ఈ చిత్రం అనువాద హక్కులు తీసుకున్నాను. ఆద్యంతం హైదరాబాద్‌లోనే రూపొందిన ఈ చిత్రం గ్రాఫిక్స్ హైలైట్‌గా నిలుస్తాయి. ‘చందమామ’ తర్వాత మా సంస్థ పేరు నిలబెట్టే సినిమా ఇది. కార్తీక్‌రాజా, భరద్వాజ్ కలిసి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ తొలివారంలో విడుదల చేసి, అదే నెల మూడో వారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, కెమెరా: సెంథిల్‌కుమార్, సహ నిర్మాత: పద్మాకరరావు వాసిరెడ్డి, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు. -
సంతోషంగా ఉన్నాను
తమిళసినిమా : తమిళం, తెలుగు చిత్రాలతో నేను చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నానంటున్నారు అందాల తార హన్సిక. ఇప్పటికే తమిళంలో యమ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా టాలీవుడ్ పైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ అమ్మడు నటించిన తమిళ చిత్రాలు డిసెంబర్ వరకు వరుసగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. వాటిలో హన్సిక తొలిసారిగా హారర్ పాత్ర పోషించిన అరణ్మణై చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. కాగా చక్క నమ్మ చిక్కినా అందమే అన్నట్లు బాగా బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యారు. అయితే కావాలని, కష్టపడి, నోరు కుట్టుకుని శారీరక వ్యాయమం చేసి బరువు తగ్గలేదన్నారు. తాను చాలా చిన్న వయసులోనే నటిగా రంగ ప్రవేశం చేశానన్నారు. 17, 18 ఏళ్ల ప్రాయంలో ఏ అమ్మాయి అయినా పుష్టిగా ఉంటారన్నారు. మళ్లీ 21 ఏళ్ల వయసు వచ్చే సరికి సన్నబడుతుంటారని చెప్పారు. ఇప్పుడు తన పరిస్థితి అలాంటిదేనన్నారు. అంతేకానీ బరువు తగ్గాలనే నిర్ణయాన్ని తానెప్పుడు తీసుకోలేదన్నారు. ఇక బాలీవుడ్ రంగ ప్రవేశం ఎప్పుడన్న ప్రశ్నకు హన్సిక బదులిస్తూ తాను తమిళం, తెలుగు చిత్రాలతో చాలా కంఫర్టబుల్‌గా ఉన్నానని అందువల్ల, బాలీవుడ్ రంగ ప్రవేశం గురించిన ఆలోచనే లేదని బదులిచ్చారు. హీరోయిన్గా తన కెరీర్‌ను దక్షిణాదిలోనే ప్రారంభించానన్నారు. ఇక్కడా అవకాశాలతో చాలా సంతోషంగా ఉన్నానన్నారు. ఇక బాలీవుడ్ స్టార్ అనిపించుకోవాలనే ఆశ తనకు లేదని హిందీ చిత్రాల్లో నటించడం తనకు ఇంపార్టెంట్ కాదని స్పష్టం చేశారు. హిందీలో చాలా అవకాశాలు వస్తున్నాయని అయితే వాటిలో ఏ ఒక్క అవకాశాన్ని అంగీకరించలేదని హన్సిక తెలిపారు. -
హన్సిక షూటింగ్లో దెయ్యం?
దెయ్యాలున్నాయా లేవా అన్న ప్రశ్నను కాసేపు పక్కన పెడితే హన్సిక షూటింగ్లో విచిత్రమైన సంఘటన జరిగింది. దెయ్యూలపై చాలామంది దర్శకులు చిత్రాలు తెరకెక్కించే స్తూ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం అరణ్మనై. సుందర్ సి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, ఆండ్రియ, లక్ష్మీరాయ్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హాస్యనటుడు సంతానం కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్లో నిజ దెయ్యం వినికిడి చేసిందే అంశం నెట్లో కలకలం సృష్టిస్తోంది. ఈ విషయంపై దర్శకుడు సుందర్ సి స్పందిస్తూ తన చిత్రాల్లో కథ పెద్దగా ఉండదు. కామెడీ మాత్రం ఫుల్‌గా ఉంటుందని తెలిపారు. సాధారణంగా మహిళలు, పిల్లలు టీవీల్లో దెయ్యం చిత్రాలనే ఆసక్తిగా చూస్తున్నారన్నారు. అందుకే దెయ్యాల నేపథ్యంలో రూపొందిన చంద్రముఖి, కాంచన వంటి చిత్రాలు పెద్ద విజయం సాధించాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తరహాలో రూపొందిస్తున్న హార్రర్ చిత్రమే అరణ్మనై అని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్‌ను హైదరాబాద్‌లో వేసిన ఒక బూత్బంగ్లా సెట్లో అధికభాగం నిర్వహించామని చెప్పారు. ఒక సన్నివేశాన్ని చిన్న పిల్లాడు ఎదురుగా ఎవరు లేకుండానే తనలో తానే మాట్లాడుకుంటాడన్నారు. ఆ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఎవరో పెద్దగా నిట్టూర్చిన శబ్దం వచ్చిందన్నారు. ఈ విషయాన్ని ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎడిటర్ గ్రహించారని తెలిపారు. అయితే అది నిజ దెయ్యం చర్యనా లేక ఏదైనా శబ్దమా? అన్నది తెలియలేదన్నారు. దీనికి ఆధారం మాత్రం తన వద్ద ఉందని దర్శకుడు సుందర్ సి పేర్కొన్నారు. -
అతీంద్రియ శక్తులతో...
మాయలెరిగిన నాయిక అనగానే, ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’లో శ్రీదేవే గుర్తొస్తారు. ఆ సినిమాలో ఆమె ఇంద్రజ. తనకున్న అతీంద్రియ శక్తులతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేశారు శ్రీదేవి. అలాంటి పాత్రనే ఇప్పుడు హన్సిక పోషిస్తున్నారు. అయితే... శ్రీదేవిలా దివి నుంచి భువికి దిగే పాత్ర కాదు హన్సికది. భువిపైనే పుట్టిన దేవకుమార్తె అన్నమాట. తనకున్న దైవశక్తులతో రోగాలను నయం చేసేస్తుంటుంది. భవిష్యత్తులో జరగబోయేది కూడా చెప్పేస్తుంటుంది. ఇంతకీ ఏ సినిమాలో హన్సిక ఇలా కనిపించేది? అనేగా మీ ప్రశ్న. అది తెలుగు సినిమా కాదు. తమిళ సినిమా. సుందర్.సి నటిస్తూ... దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పేరు ‘అరణ్మణై’. తన కెరీర్లోనే చెప్పుకోదగ్గ పాత్ర ఇదని చెబుతున్నారు హన్సిక. ఇటీవల ఈ పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ -‘‘సుందర్సార్ కథ చెప్పినప్పుడు భిన్నంగా అనిపించింది. నా కెరీర్లో ఇప్పటివరకూ చేసిన పాత్రల్లో ఇది భిన్నమైన పాత్ర. అడుగడుగునా మలుపులతో నా పాత్రను డిజైన్ చేశారు. ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు హన్సిక.