సినిమా ఏదైనా గ్లామర్‌ ఉండాల్సిందే! | Tamannaah Bhatia, Raashi Khanna Glamour in Aranmanai 4 Movie | Sakshi
Sakshi News home page

హారర్‌ కామెడీకి సీక్వెల్‌.. అప్పుడే రిలీజ్‌

Mar 28 2024 2:09 PM | Updated on Mar 28 2024 3:12 PM

Tamannaah Bhatia, Raashi Khanna Glamour in Aranmanai 4 Movie - Sakshi

ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నాలే హైలైట్‌. అందాలు ఆరబోయడంలో ఒకరితో ఒకరు పోటీపడినట్లు కనిపిస్తోంది. మరో విషయం ఏమిటంటే తమిళంలో ప్రస్తుతం వీరి చేతిలో ఉన్న ఒకే ఒక్క చిత్రం ఇదే. నిర్మాణ కార్యక్రమాలను

సినిమా జానర్‌ ఏదైనా గ్లామర్‌ తప్పని సరిగా మారుతోందిప్పుడు. దర్శకుడు సుందర్‌.సీ చిత్రాల్లో కామెడికీ, గ్లామర్‌కు కొదవే ఉండదు. అలా సుందర్‌.సీ ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం అరణ్మణై చిత్రం. దీన్ని ఆయన సతీమణి, నటి కుష్బూ నిర్మించారు. హారర్‌ కామెడీ జానర్‌లో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో వరుసగా మరో రెండు సీక్వెల్స్‌ను తెరకెక్కించారు. అవీ హిట్‌ కావడంతో తాజాగా నాలుగో సీక్వెల్‌ను తెరకెక్కించారు. దీని పేరు అరణ్మణై 4.

హారర్‌ + కామెడీ
సుందర్‌.సీతో పాటు తమన్నా, రాశీఖన్నా, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో కోవైసరళ, గరుడ రామ్, దర్శకుడు కేఎస్‌.రవికుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. హిహ్‌ హాప్‌ తమిళా సంగీతం, ఇ.కృష్ణస్వామి ఛాయాగ్రహణం అందించారు. దీనికి బెంజ్‌ మీడియా అధినేత ఏసీఎస్‌ అరుణ్‌కుమార్‌ సమర్పకులుగా వ్యవహరించారు. ఇది కూడా గత సీక్వెల్స్‌ మాదిరిగానే హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందడం విశేషం.

ఆ ఇద్దరే హైలైట్‌
ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నాలే హైలైట్‌. అందాలు ఆరబోయడంలో ఒకరితో ఒకరు పోటీపడినట్లు కనిపిస్తోంది. మరో విషయం ఏమిటంటే తమిళంలో ప్రస్తుతం వీరి చేతిలో ఉన్న ఒకే ఒక్క చిత్రం ఇదే. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అరణ్మణై 4 నిజానికి ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సింది. పలు కారణాల రీత్యా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు యూనిట్‌ వర్గాలు వెల్లడించాయి.

చదవండి: చిరంజీవి, మోహన్‌బాబు మధ్య గొడవ.. వాళ్లకు ఎప్పుడూ అదే పని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement