
హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) పేరు చెప్పగానే తెలుగు, తమిళ, హిందీలో బోలెడన్ని సినిమాలు గుర్తొస్తాయి. టీనేజీలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. తాజాగా నటిగా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల 2 (Odela 2 Movie).. విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్బంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
(ఇదీ చదవండి: వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?)
'ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 20 ఏళ్లు అవుతోంది. ఎంతో సంతోషంగా ఉంది. నటిగా కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఇంతవరకు వస్తానని అనుకోలేదు. అయితే నాకు 21 ఏళ్లున్నప్పుడు జరిగిన సంఘటనని మాత్రం అస్సలు మర్చిపోలేను. పుట్టినరోజు అని ఇంట్లోనే ఉన్నా. అలా న్యూస్ పేపర్స్ తిరగేస్తుంటే.. తమిళంలో నం.1 నటి అనే నా గురించి ఆర్టికల్ ఉంది. ఇది చూసేసరికి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాను. నటించడం ఓ బాధ్యతగా తీసుకున్నాను. ఈ స్థాయికి చేరుకున్నాను' అని తమన్నా చెప్పుకొచ్చింది.
సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వ పర్యవేక్షణలో తీసిన ఓదెల 2 సినిమాలో శివశక్తి పాత్రలో తమన్నా నటించింది. ఏప్రిల్ 17న రిలీజయ్యే ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి మిల్కీబ్యూటీ హిట్ కొడుతుందో లేదో చూడాలి?
(ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)