దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం అరణ్మణై–4. ఇంతకుముందు ఈయన తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అరణ్మణై–4 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్‌కుమార్‌కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా, యోగిబాబు, కోవై సరళ, వి.టీవీ గణేష్ ముఖ్యపాత్రలు పోషించారు.
అప్పట్లో ఆ ఆలోచనే లేదు
హిప్ హాప్ ఆది సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని నిర్వహించారు. హీరో సుందర్ సి మాట్లాడుతూ.. అరణ్మణై చిత్రం తొలిభాగం తన కెరీర్లో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. దానికి సీక్వెల్స్ రూపొందించాలన్న ఆలోచన తనకు అప్పట్లో లేదన్నారు. మంచి ఐడియాలు రావడం వల్లే సీక్వెల్స్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. వేరే చిత్రానికి సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నప్పుడు తన కోరైటర్ ఒక విషయాన్ని చెప్పారన్నారు.
రాజులే భయపడ్డారు
అది కొత్తగా ఉండడంతో ఈ అరణ్మణై –4 చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమైనట్లు చెప్పారు. 'ఇండియాలోని పలు భాగాలను పాలించడానికి అప్పట్లో పలువురు రాజులు దండెత్తి వచ్చారు. అయితే వారెవరూ ఈస్ట్ భాగంలోని బ్రహ్మపుత్ర నదిని దాటి వెళ్లడానికి సాహసించలేదు. అందుకు పలు కారణాలు ఉండగా.. అందులో ఒకటి దెయ్యం! ఆ ప్రాంతంలో బాగ్ అనే మానవశక్తిని మించిన శక్తి కలిగిన దెయ్యం ఉందనేది కథలు, కథలుగా చెప్పుకునేవారు. ఆ అంశాన్ని కథగా మలుచుకుని రూపొందించిన చిత్రమే అరుణ్మణై–4' అని చెప్పారు. ఇప్పటి వరకు గ్లామర్, యాక్షన్ పాత్రల్లో చూసిన తమన్నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు.
చదవండి: సాధారణ వ్యక్తి ప్రేమలో 'పూజా హెగ్డే'.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment