హన్సిక భయపెడుతుందట! | Aranmanai star Hansika talks about acting in her first horror | Sakshi
Sakshi News home page

హన్సిక భయపెడుతుందట!

Published Tue, Nov 25 2014 10:35 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

హన్సిక భయపెడుతుందట!

హన్సిక భయపెడుతుందట!

 హారర్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తమిళంలో రూపొందిన చిత్రం ‘అరన్మణి’. హన్సిక ప్రధాన పాత్రలో సుందర్.సి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘చంద్రకళ’గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత సి.కల్యాణ్. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ -‘‘ఇప్పటికి తమిళనాడులో 24 కోట్ల రూపాయలు వసూలు చేసిందీ సినిమా. తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం. అందుకే... ఎంతమంది పోటీకి వచ్చినా.. ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి ఈ చిత్రం అనువాద హక్కులు తీసుకున్నాను.
 
 ఆద్యంతం హైదరాబాద్‌లోనే రూపొందిన ఈ చిత్రం గ్రాఫిక్స్ హైలైట్‌గా నిలుస్తాయి. ‘చందమామ’ తర్వాత మా సంస్థ పేరు నిలబెట్టే సినిమా ఇది. కార్తీక్‌రాజా, భరద్వాజ్ కలిసి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ తొలివారంలో విడుదల చేసి, అదే నెల మూడో వారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, కెమెరా: సెంథిల్‌కుమార్, సహ నిర్మాత: పద్మాకరరావు వాసిరెడ్డి, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement