horror
-
సాలీళ్లు బాబోయ్! సాలీళ్లు! ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి..
ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటిష్ రాజ్యాన్ని ఇప్పుడు సాలీళ్లు గడగడలాడిస్తున్నాయి. సాలీడు పేరు చెబితేనే బ్రిటిష్ ప్రజలు భయంతో వణుకుతున్నారు. సాలీళ్లలో ‘ఫెన్ రాఫ్ట్ స్పైడర్’ జాతికి చెందిన భారీ సాలీళ్లు ఇళ్లల్లోకి చొరబడి గూళ్లు ఏర్పాటు చేసుకుంటూ, జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. మామూలు సాలీళ్లలా ఇవి చిన్నగా ఉండవు. ఏకంగా అరచేతి పరిమాణంలో ఉంటాయి. బ్రిటన్‌లోని సఫోక్, ససెక్స్, నార్ఫోక్ ప్రాంతాల్లో ఈ భారీ సాలీళ్ల బెడద కొద్దిరోజులుగా ఎక్కువైంది. నీటి ఉపరితలంలోను, నేల మీద కూడా జీవించగలిగే ఫెన్ రాఫ్ట్ స్పైడర్ సాలీళ్లలో అరుదైన జాతి. జలాశయాల పర్యావరణాన్ని ఇవి కాపాడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సాలీళ్లు కీటకాలతో పాటు చిన్న చిన్న చేపలను కూడా తింటాయి. ఇదివరకు ఇవి జలాశయాల పరిసరాల్లోనే కనిపించేవి. ఇప్పుడివి ఇళ్లల్లోకి కూడా చొరబడటమే బెడదగా మారింది.నల్లులతో నానా యాతన..!అగ్రరాజ్యం అమెరికాను నల్లులు హడలెత్తిస్తున్నాయి. అమెరికాలోని దాదాపు ఇరవై రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో నల్లుల బెడద విపరీతంగా పెరిగింది. చాలా చోట్ల ఇళ్లు, హోటళ్లు తదితర ప్రదేశాల్లోని మంచాలు, కుర్చీలు, సోఫాల్లోకి చేరిన నల్లులు జనాలను కుట్టి చంపుతున్నాయి.అమెరికాలో ఎక్కువగా ‘ఆసియన్ లాంగ్హార్న్డ్ టిక్’ జాతికి చెందిన నల్లులు కొద్దికాలంగా విజృంభిస్తున్నాయి. అమెరికాలో ఈ జాతి నల్లులను తొలిసారిగా 2017 సంవత్సరంలో ఓక్లహామాలో గుర్తించారు. వీటి నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఇవి అన్నింటినీ తట్టుకుంటూ ఇప్పుడు ఇరవై రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ నల్లులు వ్యాప్తి చేసే లైమ్ వ్యాధి ఇప్పటికే పలువురి ప్రాణాలను బలిగొంది. ఈ నల్లులు లైమ్ వ్యాధికి కారణమయ్యే పరాన్నజీవులను వ్యాప్తి చేస్తాయని అమెరికా పర్యావరణ పరిరక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నల్లి కాటుకు గురైన వారిలో లైమ్ వ్యాధికి గురై, దాదాపు 15 శాతం మంది మృతిచెందినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. -
చీకట్లో ఉరిమిన చిరు స్వరం
ఒక్క పిలుపు ఇవ్వగానే వేలాదిమంది మహిళలు అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆమె ప్రఖ్యాత ఉద్యమ నాయకురాలు, రాజకీయ నాయకురాలు కాదు. సాధారణ మహిళ. కోల్‌కత్తాలోని జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై 29 ఏళ్ల రిమ్జిమ్ సిన్హా ఫేస్బుక్ పోస్ట్ వైరల్ కావడమే కాదు అర్ధరాత్రి వేళలో ఉద్యమ స్వరమై ప్రతిధ్వనించింది...కోల్కత్తా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణ హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌తో పాటు ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది మహిళలు ఆగస్ట్ 14 అర్ధరాత్రి వీధుల్లోకి వచ్చారు. ‘రీక్లెయిమ్ ది నైట్: ది నైట్ ఈజ్ అవర్’ కాప్షన్‌తో రిమ్జిమ్ సిన్హా ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. అర్ధరాత్రి వేళ మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన గళం వినిపించేలా చేసింది.‘మహిళల కొత్త స్వాతంత్య్ర పోరాటం’గా ‘రీక్లెయిమ్ ది నైట్’ క్యాంపెయిన్‌ను అభివర్ణించింది రిమ్జిమ్ సిన్హా. రీక్లెయిమ్ ది నైట్’ చిహ్నమైన నెలవంక పట్టుకున్న ఎర్ర చేతి పోస్టర్ వైరల్ అయింది.రిమ్జిమ్ సిన్హా కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సోషల్‌సైన్స్ రిసెర్చర్. జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నన్ను బాధ పెట్టడమే కాదు అభధ్రతాభావానికి గురి చేసింది. నగరాల్లో మహిళలు ఎంత సురక్షితంగా ఉన్నారు? అని ఆలోచిస్తేనే భయంగా ఉంది. వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు కోరుతూ ఆగస్ట్ 14 అర్ధరాత్రి నిరసన ప్రదర్శన చేయాలనుకున్నాను. రాత్రిపూట బయటకు వెళ్లే హక్కు మహిళలకు ఎందుకులేదు?’ అంటున్న రిమిజిమ్ సిన్హా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది మహిళలను ఐక్యం చేసింది.మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై రిమ్జిమ్ సిన్హా మండిపడింది. ‘జూనియర్ డాక్టర్ ఒంటరిగా సెమినార్ హాల్‌కు ఎందుకు వెళ్లింది?’ అని ఆయన ప్రశ్నించాడు.‘బాధితురాలిపై నిందలు మోపే కుసంస్కారాన్ని అంగీకరించబోము. రాత్రివేళ బయట ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు’ అంటుంది సిన్హా. తన పిలుపు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, దేశవ్యాప్తంగా వేలాది మంది అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వస్తారని ఆమె ఊహించలేదు.‘వందమంది వరకు వస్తారనుకున్నాను. ఒకవేళ ఎవరూ రాకుంటే నేను ఒక్కదానినే బయటికి రావాలనుకున్నాను. ఇంతమంది మహిళలు అర్ధరాత్రి ఇల్లు దాటి బయటికి వస్తారని నేను ఊహించలేదు. వారి స్పందన నాకు సంతృప్తిని ఇచ్చింది’ అంటుంది సిన్హా. రిమ్జిమ్ సిన్హా పేరు సంచలనం కావడం మాట ఎలా ఉన్నా ఎంతోమంది రాజకీయ నాయకులకు టార్గెట్‌గా మారింది. ‘రీక్లయిమ్ ది నైట్’ ఉద్యమ చిహ్నానికి రకరకాలుగా భాష్యం చెబుతూ విమర్శిస్తున్నవారు కూడా ఉన్నారు.‘అర్ధరాత్రిపూట బయటకు వస్తున్నారు. మీకేమైనా అయితే పూచీ మాది కాదు’ అంటున్న రాజకీయ నాయకులు ఉన్నారు. జాదవ్పూర్లోని 8బీ బస్‌స్టాండ్‌కు దగ్గర జరిగిన సభకు హాజరమైన రిమ్జిమ్ సిన్హా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన గురించి మాత్రమే కాదు రాత్రివేళలో మహిళలకు ఎదురయ్యే ట్సాన్స్పోర్ట్ సమస్యలు, పని ప్రదేశంలో మహిళలకు సెపరేట్ టాయిలెట్లు, బడులలో లింగ సమానత్వంపై ΄ాఠ్యాంశాలు, రాత్రి విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగులకు సురక్షితమై విశ్రాంతి గదులు... మొదలైన వాటి గురించి మాట్లాడింది. ‘రీక్లయిమ్ ది నైట్: ది నైట్ ఈజ్ అవర్స్’ను దృష్టిలో పెట్టుకొని ‘ఇది మహిళల కొత్త స్వాతంత్య్ర ΄ోరాటం’ అంటున్న రిమ్జిమ్ సిన్హా ఆ ΄ోరాటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. -
ఆ పేరు వినబడితే చాలు.. వెన్నులోంచి వణుకొస్తుందట!!
గోవా అనగానే గుర్తొచ్చేది అందమైన సముద్ర తీరాలు.. అంతులేని సరదాలే! అయితే వాటితోపాటు హారర్ దృశ్యాలూ అక్కడ కామనే! వాటిల్లో ‘సాలిగావ్ మర్రిచెట్టు’ ఒకటి. సాలిగావ్ పేరు వినబడితే చాలు గోవన్లకు వెన్నులోంచి వణుకొస్తుందట. పనాజీ నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న సాలిగావ్.. హడలెత్తించే దయ్యం కథలకు ప్రసిద్ధి.‘మే డి డ్యూస్’ క్యాథలిక్ చర్చ్‌కి సమీపంలోని ఓ పెద్ద మర్రిచెట్టు వెనుక.. సుమారు 72 ఏళ్లనాటి బెదరగొట్టే హారర్ స్టోరీ ఉంది. అందుకే రాత్రి పూట ఆ చెట్టు వైపు చూడాలన్నా ఆ ఊరివారు భయపడుతుంటారు. దడపుట్టించే ఈ కథ 1952లో వినపడటం మొదలైంది.ఆ ఏడాది చివరిలో సాలిగావ్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిలెర్నేలో క్రిస్టియన్ సెమినరీ (క్రైస్తవ మతబోధనలు జరిగే విద్యాలయం) నిర్మాణం మొదలైంది. దానికి ఇనాషియో లారెంకో పెరీరా అనే పోర్చుగీస్ ఫాదర్.. మేనేజర్‌గా నియమితుడయ్యాడు. అతను సాలిగావ్లో నివాసం ఉంటూ.. సెమినరీ పనులను పర్యవేక్షిస్తూ ఉండేవాడు.ఒక ఆదివారం ఉదయాన్నే సెమినరీకి వెళ్లి తిరిగి రాలేదు. మరునాడు కూడా అతని జాడ లేకపోవడంతో.. అతని కోసం స్థానికులు, చర్చ్ ఫాదర్స్ ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. ఆ గాలింపులో పెరీరా సాలిగావ్‌లోని మర్రిచెట్టు పక్కనే బురదలో అపస్మారకస్థితిలో కనిపించాడు. అతనిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ రాత్రే అతను సృహలోకి వచ్చినా 4 రోజుల పాటు మౌనంగానే ఉండిపోయాడు. ఐదోరోజు ఉదయాన్నే అతను ఆడ గొంతుతో కొంకణీ భాషలో మాట్లాడటం మొదలుపెట్టాడు.పెరీరాకు దయ్యం పట్టిందని గుర్తించిన క్రైస్తవ గురువులు.. ఆ మర్రిచెట్టుకు.. జీసస్ శిలువను రక్షణగా కట్టారు. వైద్యం అందిస్తున్నా పెరీరా ఆరోగ్యస్థితి మెరుగుపడలేదు. మరింత క్షీణించసాగింది. మధ్యమధ్యలో అతను ‘క్రిస్టలీనా’ అని అరవసాగాడు. దాంతో పెరీరాకు పట్టిన దయ్యం పేరు ‘క్రిస్టలీనా’ అని అక్కడివారు నిశ్చయించుకున్నారు.ఆధునిక వైద్యం కోసం అతనిని స్వదేశమైన పోర్చుగల్‌కు పంపించేశారు. ఇక పెరీరా తిరిగి రాలేదు. సరిగ్గా ఐదేళ్లకు అంటే 1957లో ఆ మర్రిచెట్టుకు కట్టిన శిలువ సగభాగం మాయమైపోయింది. దాంతో క్రిస్టలీనా దయ్యం తిరిగి ఆ మర్రిచెట్టును చేరుకుందని ఆ ఊరి వారు నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ దయ్యం అక్కడే ఉందని విశ్వసిస్తారు. దాంతో అటు హిందువులు.. ఇటు క్రైస్తవులు కూడా క్రిస్టలీనాను శాంతపరచే పూజలు చేస్తూ.. రాత్రిపూట ఆ మర్రిచెట్టు దరిదాపుల్లోకి పోకుండా జాగ్రత్తపడుతున్నారు.ఆ చెట్టు గోవా మొత్తానికీ ఆత్మలు గుమిగూడే ప్రదేశమని.. అక్కడ దయ్యాలు, అతీంద్రియశక్తులు కొలువుంటాయని స్థానికుల గట్టి నమ్మకం. అందుకే అటువైపు ఎవ్వరూ పోయే సాహసం చెయ్యరు. మరి ఆ మర్రిచెట్టులో క్రిస్టలీనా ఆత్మ ఉందా? అసలు ఆమె ఎవరు? ఎందుకు పెరీరాను పీడించింది? అసలు పెరీరా ఏమయ్యాడు? ఇలాంటి సందేహాలకు నేటికీ సమాధానం లేదు. అందుకే ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
డెవిల్స్ పూల్! ఆ నీళ్లల్లో అడుగుపెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదట!!
క్వీన్స్లండ్, ఆస్ట్రేలియన్ బుష్‌లో ‘బబిందా బౌల్డర్స్ పూల్’ అనే విస్తారమైన ఈత కొలను.. సహజ అందాలకు కొలువు. కానీ ఆ నీళ్లల్లో అడుగుపెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదట. 1959 నుంచి ఇప్పటి వరకు ఆ కొలనులో పడి సుమారు 21 మందికి పైగా చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొన్ని మృతదేహాలు ఇంకా దొరకను కూడా లేదు. ఆ కొలను రాళ్ల మధ్య ఉంటుంది. అక్కడ నీరు ఉన్నట్టుండి పెరుగుతుంది, అకస్మాత్తుగా తగ్గుతుంది.కాలాన్ని బట్టి.. సమయాన్ని బట్టి మారుతుంది. పైగా ఆ రాతికొండలకు లోతైన గోతులు, గుంతలు ఉంటాయి. వాటిల్లో నీళ్లు నిండి.. కొన్ని చోట్ల ఆ గుంతలు కనిపించను కూడా కనిపించవు. ఆ క్రమంలోనే అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఆ గోతుల్లో ఇరుక్కుని.. బయటికి రాలేక చనిపోతున్నారు. ఆ కొలనులో నీరు నిండుగా ఉన్నా.. నేల మట్టానికి చేరుకున్నా.. కళ్లు చెదిరే అందం అక్కడి ప్రకృతి సొంతం. అందుకే ఆ అందాలను చూడటానికి, ఈత కొట్టడానికి జనాలు ఎగబడుతుంటారు. కొన్ని డేంజర్ జోన్స్‌ని సూచిస్తూ హెచ్చరికలు, గమనికలు ఉన్న బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. అయినా ప్రమాదాలు ఆగడంలేదు.అక్కడికి వచ్చే వారిలో ఒకరిని ఆ కొలను దగ్గరుండే దయ్యం ఎన్నుకుంటుందని.. వారిని చావుకు ఆహ్వానిస్తుందని.. బాధితులంతా అలా చనిపోయినవారేనని కొందరు స్థానికుల నమ్మకం. ఆ తరహాలోనే.. సమీపంలో నివసించే ఆదివాసులు.. హడలెత్తించే విషాద గాథనూ వినిపిస్తుంటారు. కొన్నేళ్ల క్రితం యిండింజి తెగకు చెందిన ఊలానా అనే అందమైన యువతి.. వరూనూ అనే ఆ జాతి పెద్దను వివాహం చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించిందట.అయితే వివాహమైన కొన్నాళ్లకి ఊలానా జీవితంలోకి మరొక తెగకు చెందిన డైగా అనే యువకుడు రావడంతో.. అది వారి మధ్య ప్రేమకు దారితీసింది. కొంతకాలం గుట్టుగా సాగిన ఆ బంధం.. ఉన్నట్టుండి బంధువుల మధ్య పంచాయతీకి రావడంతో అవమానాన్ని తట్టుకోలేక ఊలానా.. బబిందా బౌల్డర్స్ పూల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుందట. అయితే ఆమె ఆ కొలనులోకి దూకే క్రమంలోనే ‘డైగా డైగా’ అని అరిచిందట. ఆ అరుపులకు డైగా కూడా అదే కొలనులో దూకి చనిపోయాడు.అయితే డైగా దూకడం, చనిపోవడం అంతా.. ఊలానా చనిపోతూనే కళ్లరా చూసిందట. తాను చనిపోతున్న సమయంలోనే.. తన ప్రియుడి చావుని చూస్తూ.. భీకరంగా ఏడ్చిందట. ఆ కన్నీరే ఆ కొలను నీటిమట్టాన్ని పెంచిందని.. కొలనులో ప్రమాదకరమైన గుంతలను ఏర్పరచిందని వారంతా చెబుతారు. అందుకే ఆ ప్రాంతాన్ని వారు హాంటెడ్ ప్రదేశంగా నమ్మి.. అటువైపు పోవద్దని హెచ్చరిస్తుంటారు.మొదట బాధితుడు లేదా బాధితురాలి శరీరంలోకి డైగా ఆత్మ చేరుతుందని.. నీటిలో ఉన్న ఊలానా ఆత్మ.. ప్రేమగా ‘డెగా డైగా’ అని పిలవగానే.. బాధితులు తమపై తాము నియంత్రణ కోల్పోయి.. నీటిలో ఇరుక్కునేలా డైగా ఆత్మ చేస్తుందని.. అలా ఆత్మల ప్రేమకు అమాయకులు బలవుతున్నారనేది స్థానికుల మాట.మరోవైపు 1940లో జాన్ డొమినిక్ అనే ఎనిమిదేళ్ల బాలుడు ఆ నీటిలో మునిగి చనిపోయాడు. అతడి కుటుంబం అక్కడే అతడి పేరున స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ ఫలకాన్ని తన్నిన ఓ యువకుడు.. ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడని, డొమినిక్ ఆత్మే అతడ్ని మాయం చేసిందనే మరో హారర్ స్టోరీ వినిపిస్తూ ఉంటుంది.ఒకానొక సాయంత్ర వేళ ఒక జంట ఆ కొలను అందాలు చూడటానికి వెళ్తే.. ఉన్నట్టుండి నీళ్లు అనకొండలా పైకి లేచి.. రాళ్ల మీదున్న వారిని కొలనులోకి లాక్కెళ్లడం ఓ వ్యక్తి కళ్లారా చూశాడట. అప్పటి నుంచి ఆ కొలనుపై పుకార్లు మరింతగా పెరిగిపోయాయి. ఏదిఏమైనా ఆ ప్రదేశంలో ఏ శక్తి ఉంది? ఎందుకు అంతమంది చనిపోతున్నారు? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన -
ఒక్క రాత్రిలో భయపెట్టే ది స్ట్రేంజర్స్ : ప్రే ఎట్ నైట్.. ఎలా ఉందంటే?
టైటిల్: ది స్ట్రేంజర్స్ : ప్రే ఎట్ నైట్నటీనటులు: బైలీ మాడిసన్, లెవిస్ పుల్మాన్, క్రిస్టియానా హెండ్రిక్స్, ఎమ్మా బెలోమి, మార్టిన్ హెండర్సన్, డామియన్ మాఫీ, లీ ఎన్స్లిన్ తదితరులుడైరెక్టర్: జోహన్నెస్ రాబర్ట్స్జోనర్: హారర్‌ఓటీటీ: అమెజాన్ ప్రైమ్రన్టైమ్: 1 గంట 25 నిమిషాలుసినీ ప్రేక్షకులు హారర్ చిత్రాలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ జోనర్ చిత్రాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా హాలీవుడ్లో హారర్ చిత్రాలకే కొదువే లేదు. ప్రస్తుతం ఓటీటీలు వచ్చాక నచ్చిన సినిమాను ఇంట్లోనే చూసేస్తున్నారు. దీంతో ఆడియన్స్‌కు ఒళ్లు గగుర్పొడ్చేలా లాంటి సినిమాలు సైతం ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటి ది స్ట్రేంజర్స్ ముందువరుసలో ఉంటుంది. అలా 2008లో వచ్చిన చిత్రం ది స్ట్రేంజర్స్. ఈ సినిమాకు సీక్వెల్‌గా 2018లో ది స్ట్రేంజర్స్: ప్రే ఎట్ నైట్ తెరకెక్కించారు. రియల్ స్టోరీ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంతవరకు భయపెట్టిందో రివ్యూలో చూద్దాం.కథంటేంటే..బైలీ మాడిసన్, లెవిస్ పుల్మాన్, క్రిస్టియానా హెండ్రిక్స్, మార్టిన్ హెండర్సన్ నలుగురు సభ్యులు ఓకే కుటుంబం. వీరంతా కలిసి విహారయాత్రకు వెళ్తారు. అక్కడికెళ్లిన వీరికి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఫ్యామిలీ కలిసి సరదాగా వేకేషన్ ఎంజాయ్ చేద్దామనుకున్న వీరిని ముసుగులు ధరించి ఉన్న ముగ్గురు వెంబడిస్తారు. అయితే ఆ ముగ్గురు ఎవరు? అసలు వీళ్లను ఎందుకు చంపడాయనికి వచ్చారు? వీరి నుంచి ఆ ఫ్యామిలీ తప్పించుకుందా? నలుగురు ప్రాణాలతో బయటపడ్డారా? తెలియాలంటే 'ది స్ట్రేంజర్స్ :ప్రే ఎట్ నైట్' చూడాల్సిందే.కథ విశ్లేషణ..హారర్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చేది దెయ్యం, భూతం లాంటివే. ఆ జోనర్లో చిత్రాలన్నీ దాదాపు అలాగే ఉంటాయని భావిస్తారు. కానీ ఇందులో మాత్రం ప్రేక్షకులకు సరికొత్త సస్పెన్స్ థ్రిల్‌ను అందించాడు. సినిమా ప్రారంభం నుంచే అసలు అవీ దెయ్యాలా? లేక మనుషులా అనే సస్పెన్స్ ఆడియన్స్‌కు కలిగేలా చూపించాడు. కథ మొత్తం ఆ నలుగురు కుటుంబ సభ్యులు, ముసుగులో ఉన్న ముగ్గురి చుట్టే తిరుగుతుంది.ఆ కుటుంబం వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వచ్చే వయొలెంట్ సీన్స్ వెన్నులో వణుకు పట్టిస్తాయి. క్షణం క్షణం ఏం జరుగుతుందో అనే ఆసక్తిని ఆడియన్స్‌కు కలిగించాడు. ఒకవైపు ప్రాణభయం.. మరోవైపు అంతా చీకటి.. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. ఈ సినిమా చూసేటప్పుడు ఒక్క రాత్రి ఇంత భయంకరంగా ఉంటుందా? అనే ఫీలింగ్ ఆడియన్స్‌కు రావడం ఖాయం. ఒక రాత్రిని ఓ యుగంలా మార్చిన డైరెక్టర్.. సరికొత్త హారర్ థ్రిల్‌ను అందించాడు. ఇది సీక్వెల్ కావడంతో.. ప్రీక్వెల్ చూసిన వారికి మరింత ఆసక్తిగా ఉంటుంది. చివరగా.. హారర్ జోనర్ ఇష్టపడే సినీ ప్రియులకు ది స్ట్రేంజర్స్: ప్రే ఎట్ నైట్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తక్కువ నిడివిలో హారర్ ఇష్టపడేవారు ఈ సినిమాను ట్రై చేయొచ్చు. అయితే ఈ సినిమా కేవలం ఇంగ్లీష్, హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. హారర్ చిత్రాల్లో ఎక్కువగా డైలాగ్స్ ఉండవు కాబట్టి.. సబ్‌టైటిల్స్‌తోనే చూసేయొచ్చు. -
ఆ శబ్దం వారికే వినిపిస్తుంది, వెంటాడుతుంది! వేలల్లో కేసులు నమోదు!
మీరెప్పుడైనా రాత్రి పూట చెవి చుట్టూ దోమ తిరగడం గమనించారా? అది తిరిగిన కాసేపు చిర్రెత్తుకొస్తుంది. లైటు వేసి దాన్ని చంపేదాకా నిద్రపట్టదు. కానీ ప్రపంచంలో చాలామందికి ఓ విచిత్రమైన కొత్తశబ్దాన్ని.. అసంబద్ధంగా వింటూ.. నిద్రకు దూరమవుతున్నారట. లైట్ తీసినా, వేసినా.. మెలకువగా ఉన్నా.. నిద్రపోయినా.. పోనీ ఆ చోటుని వదిలి ఎంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వారు వినే ఆ శబ్దం.. తమ వెంట ఉన్నవారికి కూడా వినిపించకపోవచ్చు. అదే ‘ది హమ్’ మిస్టరీ. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఈ కేసులు వేలల్లో నమోదయ్యాయి. శబ్దానికి, నిశ్శబ్దానికి మధ్య అస్పష్టమైన ఓ అలికిడి ఉంటుందని.. రాత్రివేళ దాన్ని స్పష్టంగా వింటున్నామని చెప్పే వాళ్లే ఈ మిస్టరీకి సృష్టికర్తలు. వీరిని ‘ది హియర్స్’ అంటారు. సాధారణంగా మనిషి చెవులు.. 20 ఏ్డ (తక్కువ పిచ్) నుంచి 20 జుఏ్డ (అత్యధిక పిచ్) మధ్య ఫ్రీక్వెన్సీలను గ్రహిస్తాయి. కానీ ‘ది హియర్స్’ మాత్రం తమకు ఇంకాస్త తక్కువ ఫ్రీక్వెన్సీలో అస్పష్టమైన నాయిస్ వినిపిస్తోందని వాదిస్తారు. వారు వినే శబ్దాన్ని.. అతి తక్కువ–ఫ్రీక్వెన్సీ హమ్మింగ్లా, రంబ్లింగ్ (దూరంగా ఉన్న పెద్దపెద్ద వాహనాల నుంచి వచ్చే ప్రతిధ్వని) నాయిస్‌గా భావించారు నిపుణులు. ప్రశాంతమైన నగరాల్లో, పల్లెటూళ్లలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఈ హమ్మింగ్‌కి బ్రిస్టల్ హమ్, టావోస్ హమ్, విండ్సర్ హమ్ వంటి పలు పేర్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. బ్రిస్టల్ హమ్.. ఇంగ్లాడ్‌లోని బ్రిస్టల్‌లో 1970లో తొలి కేసు నమోదైంది. అక్కడి నివాసితులు కొందరు.. రాత్రి పూట ఏదో శబ్దం నిద్రకు భంగం కలిగిస్తోందని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. మొదట్లో ఈ హమ్ సమీపంలోని ఫ్యాక్టరీలు, ఎలక్ట్రిక్ పైలాన్లు కారణం అయ్యి ఉండొచ్చని భావించారట. అయితే మరికొందరు నివాసితులు.. ఆ శబ్దాలన్నీ గ్రహాంతర అంతరిక్ష నౌకల నుంచి వస్తున్నాయని భావించారు. ఇంకొందరైతే.. రహస్య సైనిక చర్యల్లో భాగం కావచ్చని నమ్మారు. అయితే చాలామంది ఈ హమ్ ఈ లోకానికి చెందినది కాదని, మరో లోకానికి సంబంధించిందని ప్రచారం చేశారు. కొన్ని నెలలకు ఆ హమ్ హఠాత్తుగా ఆగినట్లే ఆగి.. బ్రిట¯Œ లోని ఇతర ప్రదేశాలకు వినిపించడం మొదలైంది. అదే హమ్ని ఇప్పటికీ చాలామంది వింటూనే ఉన్నారట. టావోస్ హమ్.. ఇక అమెరికాలోని న్యూ మెక్సికోలో 1990లో ఈ హమ్ ఫిర్యాదులు మొదలయ్యాయి. అయితే ఈ హియర్స్ ఒకే రకమైన శబ్దాన్ని వినడం లేదని అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరూ ఒక్కో ప్రత్యేకమైన శబ్దాన్ని వింటున్నట్లు వివరించడం మొదలు పెట్టారు. దాంతో శాస్త్రవేత్తలు వారు నివేదించిన శబ్దాలను వినేందుకు.. వారి వారి ఇళ్లల్లో.. ప్రత్యేకమైన పరికరాలను కూడా అమర్చారు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. శాస్త్రవేత్తలకు ఎలాంటి అసాధారణ కంపనాలు చిక్కలేదు. విండ్సర్ హమ్.. ఇంగ్లాడ్‌లోని విండ్సర్‌లో వినిపించే ఈ హమ్.. మొదటిగా ఎప్పుడు గుర్తించారో తెలియదు కానీ.. 2012 నుంచి ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. విన్నవారంతా ఇది ఎక్కువ సేపు వినిపిస్తోందని.. బిగ్గరగా వినిపిస్తోందని వాపోతుంటారు. ఈ శబ్దం కిటికీలను కదిలిస్తోందని.. పెంపుడు జంతువుల్ని భయపెడుతోందని ఆరోపించారు. ఇది మానసికస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని మొరపెట్టుకు న్నారు. ఈ శబ్దాన్ని దూరం చేసుకోవడానికి చాలామంది ఇతర ప్రదేశాలకు ప్రయాణాలు చేసినా.. ఆ శబ్దం వారిని వెంటాడుతూనే ఉందట. ఈ హమ్ కేసులో స్త్రీ పురుషులు సమానంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు.. తాము హమ్ కేసును పరిష్కరించామని.. అది ఎక్కడ నుంచి వస్తుందో తెలుసునని చెప్పారు. పెద్ద పెద్ద అలల కారణంగా సముద్రపు అడుగుభాగం కంపించడమే ఈ హమ్మింగ్‌కు మూలమని ప్రకటించారు. అయితే ఆ వాదనను మరికొందరు శాస్త్రవేత్తలు ఖండించారు. సముద్రం లేని చోట కూడా ఇలాంటి ధ్వనులు వినిపిస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయంటూ కొట్టిపారేశారు. ఇది ఒక మానసికమైన సమస్య అని కొందరు వైద్యులు చెబితే.. ఇది దూరంగా నడిచే ట్రాఫిక్ నుంచి కానీ, విమానాశ్రయాల నుంచి కానీ, నౌకాయానాల నుంచి కానీ, గాలి మరల నుంచి కానీ కావచ్చు అని కొందరు నిపుణులు అంచనా వేశారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. ఈ శబ్దానికి మిడ్‌షిప్‌మ్యాన్ ఫిష్ లేదా టోడ్ ఫిష్‌లు కారణం కావచ్చని భావించారు. ఈ చేపలు తన సహచరిని సంభోగానికి పిలుపునిచ్చినప్పుడు కొన్నిసార్లు చిన్నగానే హమ్మింగ్ చేస్తాయి కానీ.. కొన్నిసార్లు చాలా పెద్దగా ఎక్కువ సేపు హమ్మింగ్ చేస్తుంటాయట. అది సుమారు గంట ప్రక్రియ అని.. ఆ శబ్దాలే.. ఈ హియర్స్ చెవిన పడుతున్నాయని వాదించారు. మరోవైపు ఈ హమ్మింగ్ బాధితులకు కేవలం ఒత్తిడి, ఆందోళనల వల్లే అలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయని ఇంకొందరు శాస్త్రవేత్తలు సిద్ధాంతీకరించారు. ఏది ఏమైనా ఈ హమ్(శబ్దం) ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా వినిపిస్తోంది? అనేది వినేవాళ్లకు కూడా తెలియకపోవడంతో మిస్టరీగానే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’.. -
ఐదేళ్లుగా శవం పక్కనే : పోలీసులే షాక్ అయిన దృశ్యాలు
ఇంటినిండా చెత్తా. చెదారం..ఎలుకలు, మానవ వ్యర్థాల గుట్టలు, కుళ్లిపోయిన అస్తి పంజరం, ఎముకలు ఇదంతా.. ఇదేదో హారర్ హౌస్ దృశ్యాలు అనుకుంటున్నారా? కానే కాదు శవంతో ఐదేళ్ల పాటు జీవించిన జీవించిన మహిళ దుర్భర స్థితి. వివరాలు.. ఆస్ట్రేలియాకు చెందిన వృద్ధురాలు (70) తన సోదరుడి కుళ్ళిన శవం పక్కన ఐదు సంవత్సరాలుగా ఉండి పోయింది. మెట్రో ప్రకారం జీలాంగ్‌లోని సంపన్న శివారు ప్రాంతంలోని ఇల్లు అది. దీంతో ఇల్లంతా చచ్చిపడిన ఎలుకల మయం. ఎక్కడ చూసినా మానవ వ్యర్థాలు, ఎలుకల విసర్జాలతో భరించలేని వాసన. అయినా ఇంట్లోంచి బయటికి రాకుండా లోపలే ఉండిపోయింది. ఒక వ్యక్తి అదృశ్యం కేసులో పోలీసులు నిందితురాలుగా 2022లో ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తరువాత పోలీసులు ఆమెను వదిలివేశారు. టాప్ డిటెక్టివ్ సీనియర్ సార్జెంట్ మార్క్ గుత్రీ సమగ్ర దర్యాప్తులో తాజా విషయాలు వెల్లడైనాయి. విచారణ నిమిత్తం వెళ్లినపుడు అక్కడి పరిస్థితి చూసి పోలీసులే ఖంగుతిన్నారు. విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్లు కూడా వణికిపోయారు. బయోహజార్డ్ సూట్లు ధరించి మరీ ఫోరెన్సిక్ అధికారులు అక్కడికి వెళ్లారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు 2018లో చివరిసారిగా ఆ వ్యక్తిని సజీవంగా చూశారట. ఈ మహిళ మానసిక అనారోగ్యంపై అనేక ఫిర్యాదులొచ్చినా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి ఆరోపలు నమోదు కాలేదని, సోదరుడి మరణానికి గల కారణాన్ని విచారిస్తున్నారు పోలీసు అధికారులు -
మార్చిలో తంత్ర
అనన్య నాగళ్ల లీడ్ రోల్లో నటించిన ‘తంత్ర’ చిత్రం విడుదల తేదీ ఖరారు అయింది. మార్చిలో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్ రఘుముద్రి, సలోని, ‘టెంపర్’ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మించారు. ఈ మూవీని మార్చి 15న విడుదల చేయనున్నట్లు పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘హారర్ నేపథ్యంతో రూపొందిన ‘తంత్ర’ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందనే నమ్మకం ఉంది. పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా అనన్య నాగళ్ల చక్కగా నటించారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సహ నిర్మాత: తేజ్ పల్లి, కెమెరా: సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల, సంగీతం: ఆర్ఆర్ ధృవన్. -
తెలుగులోనూ బ్లాక్ అండ్ వైట్ హారర్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం భ్రమయుగం. మలయాళంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీని రాహుల్ సదాశివన్ దర్శకత్వం తెరకెక్కించారు. సరికొత్త పీరియాడిక్ హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందించిన ఈ మూవీపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో తెలుగు వర్షన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 23న సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తెలుగులో టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు వర్షన్ విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని త్వరలోనే కన్నడ, తమిళ, హిందీ భాషల్లోను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ నటించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. -
ఎవరీ మోలీ? నూటపాతిక ఏళ్ల నుంచి భయపెడుతూనే ఉంది!
అది అమెరికా, అలబామాలోని ఆబ్విల్ పట్టణం. అక్కడ సూర్యాస్తమయం తర్వాత.. పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఓ హెచ్చరిక జారీ అవుతుంది. ‘మోలీ వస్తోంది.. అల్లరి చేస్తే తీసుకెళ్లిపోతుంది, మోలీ వస్తోంది.. మాట వినకపోతే లాక్కుపోతుంది’ అని! మోలీ.. ఓ దయ్యం పేరు. ఆమె 7 అడుగుల ఎత్తుతో బలిష్ఠంగా ఉంటుందని.. నల్ల దుస్తులు ధరిస్తుందని చూసినవాళ్లు, తెలిసినవాళ్లు చెబుతుంటారు. ఆమె తలకు ముసుగు లేదా తలపాగా లేదా టోపీ పెట్టుకుని.. భయపెట్టే రూపంలో ఉంటుందని వర్ణిస్తుంటారు. చీకటి వేళ చల్లగాలిలో అమాంతం దూసుకొస్తుందట మోలీ. ఎంత వేగంగా పారిపోవడానికి ప్రయత్నించినా వెంటాడి పట్టుకోగలదట. ముఖ్యంగా ఆమె టార్గెట్ పిల్లలేనట. తరిమి తరిమి పట్టుకున్న తర్వాత గట్టిగా కౌగిలించుకుని.. చెవిలో చాలా పెద్దగా అరిచి.. అదృశ్యమవుతుందట. అంటే ‘ఆమె హానికరమైన దయ్యం కాదు’ అనేది అక్కడి వారి మాట. అయితే పిల్లల్ని అదుపు చేయడానికి పెద్దలు మాత్రం మోలీ పేరు చెప్పి బెదరగొడుతూంటారు. మోలీ ఎదురుపడిందంటూ.. రెండుమూడు రోజులు మంచం పట్టిన పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ మోలీ గతం గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మోలీ బాలింతగా ఉన్నప్పుడు.. తన పసిబిడ్డను కొంతమంది పిల్లలు ఎత్తుకుని, కౌగిలించుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ సోకి ఆ బిడ్డ చనిపోయిందని.. అప్పటి నుంచి పిచ్చిదైపోయిన మోలీ.. ఆ తర్వాత చనిపోయి, దయ్యమైందని చెబుతారు. ఆ దయ్యమే ఇలా పిల్లల వెంటపడుతుందని కొందరు నమ్ముతారు. అయితే మరికొందరు మాత్రం.. మోలీ ఒక స్కూల్లో ప్రొఫెసర్‌గా పనిచేసేదని.. ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టమని.. అందుకే చనిపోయిన తర్వాత దయ్యమై.. రాత్రి పూట పిల్లల్ని భద్రంగా కాపాడటానికి తాపత్రయపడుతుందని చెబుతుంటారు. 1900 సంవత్సరం నుంచి ఈ కథలు వినిపిస్తూనే ఉన్నాయి. అంటే మోలీ.. సుమారు నూటపాతిక ఏళ్ల నాటి దయ్యమన్నమాట. అయితే ఈ కథల్లో ఏది నిజం? ఎంతవరకు నిజం అనేదానిపై స్పష్టత లేదు. ఏది ఏమైనా.. మోలీ ఊసెత్తితే.. చాలామంది పెద్దలు కూడా ఉలిక్కిపడుతుంటారు. ఎందుకంటే తమ బాల్యంలో తమనూ మోలీ వెంటాడి పట్టుకుందని, చెవిలో గావుకేక పెట్టిందని చెబుతుంటారు. ఏదీ ఏమైనా నిజంగానే మోలీ ఆత్మ రూపంలో అక్కడ వీథుల్లో తిరుగుతోందా? లేక కేవలం భ్రమలు, పుకార్లేనా? అనేది నేటికీ మిస్టరీనే. (చదవండి: ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!) -
ఆ సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్ అవుతాయట!
కేలరీలు బర్న్ అవ్వాలని రకరకాల వ్యాయామాలు, ఏవేవో ఫీట్లు చేస్తుంటా. అంతా చేసిన కాస్తో కూస్తో బరువు తగ్గుతాం. కానీ ఆ సినిమాలు చూస్తే వందల కొద్ది కేలరీలు ఖర్చు అవ్వడమే గాక ఆకలి తగ్గి తెలియకుండానే మితంగా తింటమట. బరువు కూడా ఈజీగా తగ్గుతామని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అదెలా సాధ్యం పైగా కూర్చొని సినిమా చూస్తే కేలరీలు తగ్గిపోతాయా..? అనిపిస్తుంది కదా!. కానీ ఇది నిజం అని బల్లగుద్ది మరీ నమ్మకంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. హారర్ మూవీలు చూసే అలవాటు ఉంటే..ఇంకా మంచిది అంటున్నారు పరిశోధకులు. హాయిగా హారర్ మూవీలు చూస్తూ.. ఈజీగా కేలరీలు తగ్గించుకోండి అని అంటున్నారు. ఈ మేరకు వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం మూవీ రెంటల్ కంపెనీ సాయంతో సుమారు పదిమందిపై ఈ పరిశోధన చేశారు. వారంతా హారర్ మూవీలు చూస్తున్నప్పుడూ.. వారికి హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ తీసుకుని కార్బన్డయాక్సైడ్ని వదులుతున్న రేటును కొలిచే పరికరాలను కూడా అమర్చారు. ఈ పరిశోధనలో పాల్గొన్న ఆ పదిమందికి సినిమాలు చూస్తున్నప్పుడూ.. హృదయ స్పందన రేటు, జీవక్రియ రేటు పెరిగాయని, తత్ఫలితంగా ఎక్కువ కేలరీలు బర్న్ అయినట్లు కనుగొన్నారు. అంతేగాదు ఈ కేలరీలు బర్న్ అవ్వడం అనేది వ్యక్తిని బట్టి మారుతుందని అన్నారు. కాగా ఈ పరిశోధనలో 90 నిమిషాల భయానక చిత్రం సగటున 150 కేలరీలను బర్న్ చేస్తుందని తెలిపారు. అది దగ్గర దగ్గరగా.. మనం చేసే జాగింగ్ లేదా 30 నిమిషాల పాటు చేసే వాకింగ్‌లో తగ్గే కేలోరీలకు సమానం అని చెప్పారు. తమ అధ్యయనం పాల్గోన్న ఆ పదిమంది చూసిన మొదటి పది రకాల భయానక చిత్రాలు వరుసగా ఎన్ని కేలరీలను బర్న్ చేశాయో కూడా వివరించారు. ఒత్తిడి సమయంలో విడుదలయ్యే అడ్రినల్ వేగంగా విడుదలై ఆకలిని తగ్గించి, బేసల్ మెటబాలిక్ రేటును పెంచి అధిక స్థాయిలో కేలరీలను తగ్గిస్తుందని డాక్టర్ రిచర్డ్ మాకెంజీ అన్నారు. ఈ పరిశోధన రోజూవారి వ్యాయామాన్ని, సక్రమమైన ఆహారపు అలవాట్లను మానేయమని సూచించదని హెచ్చరించారు. ఆరోగ్యకరంగా బరువు, జీవనశైలి ఉండాలంటే హారర్ మూవీలు ఒక్కటే చూడటం సరిపోదని చెప్పారు. సులభంగా కేలరీలు తగ్గించే పరిశోధనల్లో భాగంగా ఈ కొత్త విషయాన్ని కనుగొన్నామే గానీ ఇదే సరైనదని చెప్పడం లేదన్నారు. (చదవండి: 'నాన్న బ్లడ్ బాయ్'! 71 ఏళ్ల తండ్రి వయసు ఏకంగా 25 ఏళ్లకు..) -
వచ్చే ఏడాది భ్రమ యుగం
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన హారర్–థ్రిల్లర్ ఫిల్మ్ ‘భ్రమ యుగం’. రాహుల్ సదాశివన్ రచన–దర్శకత్వంలో చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఏకకాలంలో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ‘‘ఈ ఏడాది ఆగస్టులోప్రారంభమైన ఈ సినిమాను ఓట్టపాలెం, కొచ్చి, అతిరాపల్లి వంటి లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
దెయ్యాల దీవి..అక్కడ నేల కింద ఏకంగా లక్షలకు పైగా
ఇదేదో హారర్ సినిమా పేరు కాదు. ఇటలీలో ఉన్న ఈ దీవి నిజంగానే దయ్యాల దీవిగా పేరు మోసింది. దాదాపు అర్ధశతాబ్దంగా ఇక్కడ నరమానవులెవరూ నివాసం ఉండటం లేదు. ఈ దీవిలోని నేల కింద 1.60 లక్షలకు పైగా శవాలు సమాధి అయి ఉన్నాయి. ఇటలీ ఉత్తర ప్రాంతంలో వెనిస్–లిడో నగరాల మధ్య ఉన్న ఈ దీవి పేరు పోవెగ్లియా. ప్రత్యేక అనుమతి ఉంటేనే తప్ప ఈ దీవిలో సందర్శకులెవరూ అడుగు పెట్టలేరు. ఒకప్పుడు ఈ దీవి మానసిక రోగుల చికిత్స స్థావరంగా ఉండేది. ఇక్కడి మానసిక చికిత్స కేంద్రంలో పనిచేసే ఒక డాక్టర్ రోగులపై క్రూరాతి క్రూరమైన ప్రయోగాలు చేసేవాడు. అప్పట్లో ఇక్కడ మరణించిన రోగులను ఇక్కడే పాతిపెట్టేశారు. ఇక్కడి మానసిక చికిత్స కేంద్రం 1968లో మూతబడిన తర్వాత ఈ దీవి పూర్తిగా ఖాళీ అయిపోయింది. మూతబడిన కొత్తలో కొందరు సాహసికులు ఈ దీవిలోకి వచ్చి, అంతా కలియదిరిగి వెళ్లిపోయేవారు. కొంతకాలానికి ఈ దీవిలోకి జనాల ప్రవేశాన్ని నిషేధించారు. ఇప్పటికీ ఈ నిషేధం అమలులో ఉంది. పరిశోధనల వంటి కారణాల కోసమైతే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొంది మాత్రమే ఇక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇటీవల బ్రిటిష్ పరిశోధకులు మ్యాట్ నాడిన్, ఆండీ థామ్సన్ ఇటలీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొంది, ఈ దీవిలోకి అడుగుపెట్టారు. శిథిలావస్థకు చేరుకున్న మానసిక రోగుల ఆస్పత్రి, చుట్టుపక్కల ఉన్న ఇతర శిథిల నిర్మాణాలు, చుట్టూ కీకారణ్యంలా పెరిగిన చెట్లు, మొక్కలు, కట్టడాల మధ్యలో మొలిచిన ఊడల మర్రిచెట్లు వంటివాటిని వీడియో తీసి తమ యూట్యూబ్ చానల్లో పెట్టడంతో ఈ దీవి కథ వైరల్‌గా మారింది. ఈ దీవిలో 1922లో మానసిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముందు 1793లో ఒకసారి, 1814లో మరోసారి ప్లేగు మహమ్మారి విజృంభించినప్పుడు ఈ దీవిని క్వారంటైన్ కేంద్రంగా నిర్వహించేవారు. ప్లేగుతో చనిపోయినవారిని, ఆ తర్వాత మానసిక చికిత్స కేంద్రంలో డాక్టర్ ప్రయోగాలకు ప్రాణాలు కోల్పోయినవారిని ఇక్కడి నేలలోనే పూడ్చిపెట్టేశారు. వారి ఆత్మలు ఇక్కడ సంచరిస్తుంటాయని ప్రచారం జరగడంతో ఇక్కడి మానసిక చికిత్స కేంద్రం మూతబడిన తర్వాత ఈ దీవి పూర్తిగా నిరుపయోగంగానే మిగిలిపోయింది. (చదవండి: బ్లాక్ యాపిల్ గురించి విన్నారా? ఒక్కొక్కటి ఏకంగా..) -
ఉజ్జయిని హర్రర్.. ‘భయంతో నా వెనక దాక్కుంది, ఆమెకు మాటిచ్చాం’
అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక ఉజ్జయిని రోడ్లపై సాయం కోసం తిరిగిన వీడియో మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈఘటనలో పోలీసులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఓ ఆటో డ్రైవర్‌తోపాటు మరోముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీనస్థితిలోని బాలిక సాయం కోసం తిరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సాయం కోసం 8 కిలోమీటర్లు నడిచి.. ఈ ఫుటీజీలో బాధితురాలు చెప్పులు లేకుండా సాయం కోసం 8 కిలోమీటర్లు నడిచినట్లు తేలింది. అరెస్ట్‌చేసిన ఆటో డ్రైవర్‌ను రాకేష్‌గా గుర్తించారు. బాధితురాలు జీవన్ ఖేరీ వద్ద ఈ ఆటోనే ఎక్కిందని, ఆ సీసీటీవీ వీడియో కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక ఆటోలు రక్తపు మరకలు కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆటోను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు వెల్లడించారు. అయితే అరెస్ట్ అయిన మిగతా ముగ్గురు కూడా ఆటో డ్రైవర్లనే తేలింది. వీడియో బయటకు రావడంతో.. అణ్యంపుణ్యం తెలియని పన్నెండేళ్ల బాలిక నీచుల చేతిలో అఘాయిత్యానికి గురై ఉజ్జయిని కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్నగర్ రోడ్డుపై అర్ధనగ్నంగా, రక్తమోడుతూ సాయం కోరుతూ కనిపించిన వీడియో అందరినీ కంట తడి పెట్టించిన విషయం తెలిసిందే. చిన్నారికి వచ్చి కష్టాన్ని చూసిన వారు దిగ్భ్రాంతికి లోనయ్యారే తప్ప సాయం చెయ్యడానికి ముందుకు రాలేని దారుణమైన ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బుధవారం బయటకు రావడంతో ఈ దారుణం గురించి తెలిసింది. చదవండి: యువతిపై స్పా యజమాని దాడి.. రోడ్డుపై జుట్టు లాగి, దుస్తులు చింపి సిట్ ఏర్పాటు.. బాలికను చూసిన కొందరు పొమ్మంటూ సైగలు కూడా చేయడం కూడా వీడియో కనిపించింది. చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుటకు రాగా రాహుల్ శర్మ అనే పూజారి గమనించి ఆమెకు దుస్తులు అందించాడు. బాధితురాలు నిస్సహక స్థితిలో ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలడంతో వెంటనే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆ బాలికకు ఇండోర్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నామని, ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా చెప్పారు. ఆ బాలిక ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అత్యాచారానికి గురి కావడంతో తీవ్రమైన షాక్‌లో ఉన్న ఆ బాలిక తను ఎక్కడ నుంచి వచ్చిందో, తల్లిదండ్రులు ఎవరో ఇంకా చెప్పలేకపోతోందని, ఆమె నుంచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఆ బాలికను నిరంతరం వైద్యులు, మానసిక నిపుణులు పరీక్షిస్తున్నారని కౌన్సెలింగ్ ఇస్తున్నారని తెలిపారు. He is Acharya Rahul Sharma, a priest in an Ashram in Ujjain. When a 12-year-old rape victim, went door to door, semi-naked, asking for help & no one came to her rescue, she eventually reached an Ashram. Then, Acharya Rahul Sharma covered her with a towel & rushed her to the… pic.twitter.com/3KlCiLFy6t — Anshul Saxena (@AskAnshul) September 28, 2023 నా దుస్తులు ఇచ్చి, పోలీసులకు కాల్ చేశా: పూజారి ఉజ్జయిని అత్యాచార బాధితురాలిని రక్షంచిన పూజారి రాహుల్ శర్మ.. బాలిక ఎదుర్కొన్న భయానక స్థితిని వివరించాడు. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఏదో పని నిమిత్తం ఆశ్రమం నుంచి బయటకు వస్తుండగా గేట్ల దగ్గర రక్తస్రావంతో అర్ధనగ్నంగా ఉన్న బాలికను గమనించినట్లు తెలిపారు. ఆమెకు తన బట్టలు ఇచ్చినట్లు చెప్పారు. రక్తం కారుతూ, కళ్ళు వాచిపోయాయి కనిపించాయని, ఏం మాట్లాడలేకపోయిందని పేర్కొన్నారు. వెంటనే డయల్ 100కి కాల్ చేసినట్లు తెలిపారు. మహంకాల్ పోలీసులు 20 నిమిషాల్లో ఆశ్రమానికి చేరుకొని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. భయంతో నా వెనక దాక్కుంది బాలిక తమతో ఏదో చెప్పిందుకు ప్రయత్నిస్తుంటే మాకు అర్థం కాలేదు. ఆమె పేరు, కుటుంబం గురించి ఆరా తీశాము. ఆమె సుక్షితంగా ఉందని, తనను జాగ్రత్తగా ఇంటి వద్దకు చేరుస్తామని భరోసా ఇచ్చాను. కానీ ఆమె చాలా భయపడుతూ కనిపించింది. బాలిక కేవలం మమ్మల్ని మాత్రమే నమ్మింది. వేరే వాళ్లు ఆమె వద్దకు వచ్చినప్పుడు భయపడి నా వెనుక దాక్కునేందుకు ప్రయత్నించింది. చివరికి పోలీసులు వచ్చి ఆమెను తమతో తీసుకెళ్లారు’ అని పేర్కొన్నారు. -
భయపెట్టే తంతిరం
భార్యాభర్తల మధ్యలో ఓ ఆత్మ ప్రవేశించడం వల్ల వారి దాంపత్య జీవితం ఎలా ప్రభావితమైంది? అనే కథాంశంతో రూపొందిన హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘తంతిరం’. శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించారు. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వంలో శ్రీకాంత్ కంద్రగుల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఆడియన్స్‌కు గుర్తుండిపోయే చిత్రం ఇది’’ అన్నారు శ్రీకాంత్ గుర్రం. ‘‘ఈ సినిమా చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతారు’’ అన్నారు మెహర్ దీపక్. ‘‘బడ్జెట్ ఎక్కువ అవుతున్నా రాజీ పడకుండా నిర్మించాం. ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేయాలి’’ అన్నారు శ్రీకాంత్ కంద్రగుల. -
ప్లాంట్ మాన్ ప్రయోగం
‘కాలింగ్ బెల్, రాక్షసి’ వంటి హారర్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు పన్నా రాయల్ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ప్లాంట్ మాన్’. డీఎం యూనివర్సల్ స్టూడియోస్ స్థాపించి కె. సంతోష్బాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు . పన్నా రాయల్. ‘‘సైంటిఫిక్ కామెడీ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఒక కొత్త తరహా ప్రయోగంతో పూర్తి వినోద ప్రధానంగా రూ΄పొందించాం’’ అన్నారు పన్నా రాయల్. ఇక ప్రస్తుతం పన్నా రాయల్ దర్శకత్వంలో రూ΄పొందిన ‘ఇంటి నెం.13’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్లాంట్ మాన్ పొస్టర్ -
మణిపూర్ ఘటన: అదే రోజు మరో ఇద్దరు యువతులపై దారుణం..
ఇంఫాల్: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో విచారకర ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు ఘటన జరిగిన రోజే మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్పోక్పి జిల్లాలో మరో ఇద్దరు యువతులపై అల్లరిమూకలు అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. కొనుంగ్ మమాంగ్ ప్రాంతంలో 21,24 ఏళ్ల బాధిత యువతులు కార్ల వాషింగ్ సెంటర్లో పనిచేస్తుండగా.. ఈ ఘటన జరిగింది. మహిళల నగ్నంగా ఊరేగింపు ఘటన జరిగిన ప్రాంతానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు వాషింగ్ సెంటర్లో పనిచేస్తుండగా.. కొంత మంది మహిళలతో కూడిన అల్లరి మూకలు వారిపై దాడి చేశారు. బాధిత మహిళలను గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేయాల్సిందిగా అల్లరి మూకల్లోని మహిళలే ప్రోత్సహించారని ప్రత్యక్ష సాక్షులు టైమ్స్ ఆఫ్ ఇండియా జరిపిన ఇంటర్య్వూలో తెలిపారు. గదిలోకి ఈడ్చుకెళ్లిన బాధిత మహిళల ఆర్తనాధాలు తమ చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయని, ఆ భయానక పరిస్థితుల గురించి వెల్లడించారు. ఇదీ చదవండి: Manipur: మానవ మృగాల కోసం గాలింపు ముమ్మరం.. జనాలకు మణిపూర్ పోలీసుల విజ్ఞప్తి అత్యాచార ఘటనల బాధితులు భయం కారణంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే.. చివరకు ఓ బాధిత యువతి తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుదారు కూతురుతో సహా మరో యువతిని అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేశారని ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికీ ఆ బాధిత యువతులు మృతదేహాలు లభ్యం కాలేదు. అల్లరి మూకలు 100 నుంచి 200 మంది వరకు ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో మణిపూర్ పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు ఎవ్వరిని అరెస్టు చేయలేదు. అయితే.. అల్లర్లలో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దోపిడీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. మణిపూర్‌లో మే3న అల్లర్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 125 మంది మరణించారు. 40,000 కుపైగా మంది రాష్ట్రాన్ని విడిచి వెళ్లారు. జాతుల మధ్య వైరంతో రెండునెలలుగా మణిపుర్ రాష్ట్రం భగ్గుమంటోంది. అప్పటి నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో భాగంగానే మే 4న ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలపై కొందరు వ్యక్తులు క్రూరత్వానికి ఒడిగట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేపింది. సరిగ్గా అదే రోజు ప్రస్తుత ఘటన జరగడం సంచలనంగా మారింది. ఇదీ చదవండి: మణిపూర్‌లో ఆరోజున జరిగింది ఇదే.. బాధితురాలు తల్లి ఆవేదన -
విహారం మిగిల్చిన విషాదం.. కళ్ళముందే ఘోరం..
ముంబై: ముంబై సాగారతీరంలో ఆటవిడుపుకు వెళ్లిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రలో భాగంగా బాంద్రా బాండ్ స్టాండ్ కు వచ్చిన ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఫోటోలు తీసుకుంటూ ఉండగా ఓ పెద్ద అల వచ్చి బలంగా తాకింది. దీంతో భర్త సురక్షితంగానే బయటపడగా భార్య మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది. పాపం ఆ పిల్లలు అమ్మా.. అమ్మా.. అని అరుస్తున్న వీడియో చూస్తే గుండె బరువెక్కుతుంది. ఒక్కోసారి సరదా కూడా విషాదకరంగా మారుతుందనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. వీడియో తీసుకోవాలన్న ఆ జంట కుతూహలం కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. మృతురాలు జ్యోతి సోనార్(32) భర్తతో కలిసి అక్కడున్న ఒక బండ రాతి మీద కూర్చుని ఫోజులు ఇస్తుండగా వారి పిల్లలు ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. అప్పటికే వెనుక పెద్ద పెద్ద అలలు వచ్చి కొడుతున్న దృశ్యాలతో భీతావహ వాతావరణం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. నిర్లక్ష్యమే కారణం.. ఇదేమీ పట్టించుకోకుండా వారిద్దరూ అలాగే కూర్చుని ఉన్నారు. అంతలోనే ఒక పెద్ద అల వచ్చి బలంగా కొట్టడంతో భర్త అక్కడే పడిపోగా జ్యోతి మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది. అంతా రెప్పపాటులో జరిగిపోవడంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమెను కాపాడేందుకు స్థానిక యువకుడు ఒకరు ప్రయత్నించగా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతను కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. అక్కడున్నవారు అప్రమత్తమై ఆ యువకుడినైతే కాపాడగలిగారు కానీ జ్యోతిని మాత్రం రక్షించలేకపోయారు. వీడియో తీస్తున్న పిల్లలు అమ్మా.. అమ్మా.. అని పిలుస్తున్న సన్నివేశం అత్యంత హృదయవిదారకంగా ఉంది. అంతకు ముందు వారు జుహు చౌపట్టి వెళ్లాల్సి ఉండగా అక్కడి వాతావరణం బాగుండకపోవడంతో అక్కడి భద్రతా సిబ్బంది వారిని అటు వెళ్లకుండా నివారించారు. దీంతో ఆ కుటుంబం ప్రణాలికను మార్చుకుని బాంద్రాకు వచ్చారు. అక్కడ ప్రమాదమని బాంద్రాకు వస్తే ఇక్కడ ఇలా జరిగింది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. This is so horrible How can a person risk their life for some videos.. The lady has swept away and lost her life in front of his kid.#bandstand #Mumbai pic.twitter.com/xMat7BGo34 — Pramod Jain (@log_kyasochenge) July 15, 2023 ఇది కూడా చదవండి: టమాటాలకు కాపలాగా ఎవరున్నారో చూశారా.. పెద్ద ప్లానే.. -
పరిస్థితి భయంకరం.. ఊపిరి తీసుకోరాలేదు.. ఎక్కడివాళ్లక్కడ పడిపోయారు
చండీగఢ్: పంజాబ్ లుధియానాలోని గియాస్పూరలో కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకై 11 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువ మంది వలస కార్మికులే ఉన్నారు. అయితే ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి అరవింద్ చౌబె.. ఉదయం గ్యాస్ లీకైనప్పుడు పరిస్థితి ఎలా ఉందో కళ్లకుగట్టినట్లు వివరించారు. ఊపిరి పీల్చుకోవడానికి స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని, ఎక్కడివాళ్లు అక్కడ స్పృహ తప్పిపడిపోయారని తెలిపారు. 'నేను మా సోదరుడు ఉదయం క్రికెట్ మ్యాచ్ ఆడాలనుకున్నాం. 7 గంటలకు గ్యాస్ లీకైందని నా సోదురుడు చెప్పాడు. వెంటనే మేం అక్కడకు చేరుకున్నాం. స్థానికులకు కాపాడేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. స్పృహ తప్పి పడిపోయిన వాళ్లలో ఒక వ్యక్తి బతికున్నాడని గమనించి వెంటనే అంబులెన్సు వరకు తీసుకెళ్లాం. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మేము ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిపడ్డాం. ప్రాణాలతో బతికున్నామంటే నిజంగా మా అదృష్టం.' అని అరవింద్ చెప్పారు. అరవింద్ సోదరుడు ఆశీశ్ మాట్లాడుతూ.. తమ వాళ్లను కాపాడుకునేందుకు వెళ్లే క్రమంలో కొంతమంది విషవాయువు పీల్చి రోడ్డుపైనే కుప్పకూలారని తెలిపారు. ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్న తన భార్యపై నీళ్లుచల్లుతూ సాయం కోసం పిలిస్తే దగ్గరకు వెళ్లానని, ఈలోగా అతను కూడా స్పృహ కోల్పోయాడని వివరించాడు. ఈ ప్రాంతమంతా పొగ అలుముకుందని, ఎవరికీ ఊపిరాడలేదని పేర్కొన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి వచ్చారని తెలిపారు. మరో ప్రత్యక్ష సాక్షి అర్జూ ఖాన్ మాట్లాడుతూ.. విషవాయువు పీల్చి తన 12 సోదరుడు చనిపోయాడని బోరున విలపించాడు. గ్యాస్ లీకైనప్పుడు అతను గదిలోనే ఉన్నాడని పేర్కొన్నాడు. ఘటనలో చనిపోయినవారంతా దాదాపు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారేనని పేర్కొన్నాడు. కాగా.. గ్యాస్ లీకైన ప్రాంతాన్ని విపత్తు నిర్వహణ దళాలు నిర్బంధించాయి. ఇళ్లలో ఉన్నవారికి ఆస్పత్రికి తరలించాయి. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ -
చెమటకే చెమటలు పట్టాయి!
గేమ్స్‌లో హారర్ గేమ్స్ మజాయే వేరయా... అంటారు. ‘మాడిసన్’ కూడా అలాంటిదే. ఈ ఫస్ట్ పర్సన్ సైకలాజికల్ హారర్ గేమ్‌లో ఎన్నో పజిల్స్ ఛేదిస్తూ ముందుకు సాగాలి. ప్రతి అడుగును పదివిధాలుగా ఆలోచించి వేయాలి. ఎవరి ఇంటి తలుపైనా తడితే...తలుపు తెరుచుకోవచ్చు. కానీ దెయ్యం కనిపించవచ్చు. డార్క్కార్నర్లో నీడలు వెంటాడవచ్చు. ప్రతి గదిలో గోడలకు వేలాడుతున్న బ్లాక్ అండ్ వైట్ఫోటోలు, హిడెన్ మెసేజ్‌లు! ఈ గేమ్‌లో ప్రతి క్యారెక్టర్ ఒక డిస్టర్బింగ్ స్టోరీ. దుష్టశక్తి నుంచి రక్షించుకోవడానికి ‘ఇన్స్టంట్ కెమెరా’ను మాత్రమే ఆయుధంగా వాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన కండ్లు చూడలేని దృశ్యాలను కెమెరా కన్ను చూస్తుంది. ప్రధాన పాత్ర ‘లూకా’గా మారతారా? సవాలుకు సై అంటే పదండి మరీ! ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 4, నిన్టెండో స్విచ్, ఎక్స్‌బాక్స్–1, మైక్రోసాఫ్ట్ విండోస్, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, సిరీస్ 5, ప్లే స్టేషన్ 5 -
ఆగస్టు 14: ప్రధాని మోదీ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 14న విభజన కష్టాల స్మృతి దివస్‌గా పాటించాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఇండియా విభజన సందర్బంగా ప్రజలు బాధలను, కష్టాలను ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తుచేసుకున్న ప్రధాని ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్‌గా జరుపుకోవాలని ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో విభజన కష్టాలను ఎన్నటికీ మర్చిపోలేమని, విభజన సమయంలో ప్రజల పోరాటం, త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా లక్షలాదిమంది సోదర సోదరీ మణులు విడిపోవాల్సి వచ్చింది. అప్పటి ద్వేషం, హింస కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారని ట్వీట్ చేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్‌గా జరుపు కోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా సామాజిక విభేదాలు, అసమానతలు అనే విషాన్ని తొలగించడంతోపాటు, ఏకత్వం, సామాజిక సామరస్యం, మానవ సాధికారతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవాల్సి అవసరం ఉందని ప్రధాని మోదీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. Partition’s pains can never be forgotten. Millions of our sisters and brothers were displaced and many lost their lives due to mindless hate and violence. In memory of the struggles and sacrifices of our people, 14th August will be observed as Partition Horrors Remembrance Day. — Narendra Modi (@narendramodi) August 14, 2021 -
రాకాసి పట్టణం... ఊరంతా సమాధులే.
-
దెయ్యాలను నిజంగా చూడాలనుకుంటున్నారా?
దెయ్యాలు ఉన్నాయా? లేవా? ఇది ఇప్పట్లో ఒడవని ముచ్చట. కానీ దెయ్యాల మీద వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను భయపెట్టించి మరీ కాసులు కురిపించాయి. ముఖ్యంగా హాలీవుడ్లో దెయ్యాల సినిమాలు అనగానే గుర్తుకువచ్చేవి ది ఎగ్జారిస్ట్, ది కంజ్యూరింగ్, అనబెల్లె. వీటికి సీక్వెల్స్ కూడా వచ్చాయి. అయితే "ది కంజ్యూరింగ్" సినిమా పుట్టుకకు కారణం.. పైన కనిపిస్తున్న భవనమే. ఇప్పుడీ భవనం లోపల ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు, మనమూ హారర్ సినిమాలో ఓ భాగమైనట్లు అనుభూతి చెందేందుకు ఓ కొత్త కార్యక్రమం రాబోతోంది. కొంతమంది ఈ ఇంట్లోకి వెళ్లి వారి ప్రతీ కదలికలను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. దాన్ని మనం ఇంట్లో నుంచే వీక్షించవచ్చు. చుక్కలు చూపించిన దయ్యాలు ఎన్నో యేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. అమెరికాలోని రోడ్ ఐలండ్‌లో తరతరాలుగా నివసిస్తున్న ఓ కుటుంబం ఆ ఇంట్లో నుంచి నిష్క్రమిద్దాం అనుకునే లోపే వారు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి అడుగుపెట్టినవారికి వింత అనుభవాలు ఎదురయ్యేవి. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దెయ్యాల పరిశోధకులు లోరెన్, ఎడ్ వారెన్ ఆ భవనంలోకి అడుగుపెట్టి సునితంగా అధ్యయనం చేశారు. అనంతరం అక్కడ దెయ్యాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. అదే సమయంలో వారి కుమార్తె ఆండ్రియా ఈ ఇంటి గురించి "హౌస్ ఆఫ్ డార్క్నెస్ హౌస్ ఆఫ్ లైట్: ద ట్రూ స్టోరీ" అనే పుస్తకం రాసింది. లైట్లు వెలుగుతూ.. ఆరిపోతూ.. ఆ తర్వాత 1970లో ఓ కుటుంబం ఆ ఇంట్లోకి దిగింది. అయితే నెమ్మదిగా అక్కడ ఉన్న దెయ్యాలు చుక్కలు చూపించడం మొదలు పెట్టాయి. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ వాళ్లు ఏడాదికే ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత అది ఎన్నో హారర్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచింది. హీన్జెన్ అనే వ్యక్తి గతేడాది ఆ ఇంట్లోకి వెళ్లినప్పుడు అతీత శక్తుల కదలిక ఉన్నట్లుగా గుర్తించాడు. ఆ మేరకు గదుల్లో అడుగుజాడలతోపాటు, తలుపు కొట్టుకుంటున్న శబ్ధాలు, లైట్లు వాటంతటవే వెలుగుతూ, ఆగిపోవడం కనిపించిందన్నారు. దీంతో కొంతమంది దెయ్యాల పరిశోధకులను ఇంట్లోకి పంపించి, వారి అనుభవాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. మే 9 నుంచి ఇంట్లోనే ఉంటూ వారం రోజులపాటు లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే మే 8న ద హౌస్ లైవ్ కార్యక్రమానికి సంబంధించి చిన్న ప్రివ్యూ కూడా వదలనున్నారు. దీన్ని డార్క్ జోన్ వెబ్సైట్ ఏర్పాటు చేస్తోంది. (ఈ ‘ఇంట్లో’కి వెళ్లొస్తే 14 లక్షల అవార్డు) నిజమైన దెయ్యాలను చూడవచ్చు ఇక ప్రేక్షకులు కంజ్యూరింగ్ హౌస్‌లో ఉన్నట్లుగా అనుభూతి చెందేదుకు ఆ ఇంట్లో పలు కెమెరాలను అమర్చనున్నారు. తద్వారా అతీత శక్తుల అలజడిని ప్రతి ఒక్కరూ స్వయంగా చూడగలరని డార్క్ జోన్ వెబ్సైట్ పేర్కొంటోంది. ఇంకేముందీ మీరూ సినిమా చూసేస్తామని రెడీ అయిపోకండి. ఎందుకంటే ఇది ఉచితమేమీ కాదు చిన్నపాటి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఒక్కరోజు లైవ్ స్ట్రీమింగ్ చూడటానికి నాలుగున్నర డాలర్లు, వారమంతా చూడటానికి పంతొమ్మిదిన్నర డాలర్లు ముట్టజెప్పాల్సి ఉంటుంది. అలా వచ్చిన డబ్బునంతా కోవిడ్-19 వ్యతిరేకంగా పనిచేసే చారిటీలకు ఇవ్వనున్నారు. టికెట్లు కొనుగోలు మే1 నుంచే ప్రారంభమైంది. ఇంకెందుకాలస్యం.. మరిన్ని వివరాలకు Darkzone వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసేయండి, టికెట్లు బుక్ చేసుకుని దెయ్యాలను కనులారా వీక్షించండి. -
ఈ ‘ఇంట్లో’కి వెళ్లొస్తే 14 లక్షల అవార్డు
దట్టమైన అడవి మధ్యలో నల్ల కాళ్ల జెర్రి లాంటి తారు రోడ్డుమీద వెళుతుంటే హఠాత్తుగా భారీ వర్షం రావడం, మార్గమధ్యంలో కారు చెడిపోవడం, అందులో ప్రయాణిస్తున్న నలుగురైదుగురు మిత్రులు ఆ రాత్రికి ఆశ్రయం వెతుకుతూ ఓ పాడు పడిన బంగళా వద్దకు వెళ్లడం, ఆ రాత్రికి భయం భయంగా అక్కడే పడుకోవడానికి ప్రయత్నించడం, అర్ధరాత్రి దాటాక భూత, ప్రేత, పిశాచాల అరుపులు, కేకలు వినిపించడం.... పాత్రలతోపాటు ప్రేక్షకులుగా మనమూ జడసుకోవడం చాలా ‘కైమ్ త్రిల్లర్’ చిత్రాలను చూడడం ద్వారా అనుభవించే ఉంటాం. అలాంటి భయానక అనుభవాలను సినిమాల్లోని పాత్రలకే కాకుండా మనకు కూడా అంతటి అనుభవాలను కలిగించేందుకు అమెరికాలోని టెన్నెస్సీ నగరంలో ‘మ్యాక్ కామే మానర్’ పేరిట ఓ ‘హారర్ హౌజ్’ను ఏర్పాటు చేశారు. అందులోకి వెళ్లి పది గంటలు గడిపి వచ్చిన వాళ్లకు 20 వేల డాలర్లు ( 14,20,000 రూపాయలు) బహుమతిగా అందజేస్తామని ‘మాక్ కామే మానర్’ యజమాని రస్ మాక్ కామే సవాల్ చేస్తున్నారు. ఇందులోకి వెళ్లి రావాలనుకుంటున్న సాహసికులకు చాలా షరతులు కూడా ఉన్నాయి. వారు సంపూర్ణ ఆరోగ్యంతోనే కాదు, 21 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. శారీరకంగా, మానసికంగా బలిష్టంగా ఉన్నట్లు కుటుంబ వైద్యుడి నుంచి సర్టిఫికెట్ తీసుకరావాలి. ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాలి. వచ్చాక కూడా హారర్ హౌజ్ నిర్వాహకులు సొంత వైద్యుల చేత ‘ఫిట్నెస్’ పరీక్షలు చేయిస్తారు. అందులో పాస్ కావాలి. ఓ డ్రగ్ పరీక్ష కూడా నిర్వహిస్తారు. దాన్ని కూడా తట్టుకోవాలి. లోపలికి వెళితే ఎలాంటి దశ్యాలు ఉంటాయో వెళ్లాలనుకుంటున్న సాహసికులకు ముందుగానే వీడియోల ద్వారా చూపిస్తారు. లోపలికి వెళితే ఏం జరుగుతుందో కూడా వివరిస్తారు. ఇంతకు ముందు అందులోకి వెళ్లిన వారి అనుభవాలను కూడా చూపిస్తారు. ఆ తర్వాతనే ధైర్యం చెప్పి లోపలికి పంపిస్తారు. కొన్నేళ్లుగా ఈ హారర్ హౌజ్‌ను నిర్వహిస్తున్నా ఇంతవరకు ఎవరు కూడా పది గంటల పాటు ఆ ఇంట్లో గడిపి వచ్చిన వారు, 20 వేల డాలర్లు అందుకున్న వారు లేరని రస్ మాక్ కామే తెలిపారు. ఇందులో వెళ్లి వచ్చిన వారికి ఎక్కడా చిన్న గాయం కూడా కాదని గ్యారంటీ కూడా ఇస్తున్నామని ఆయన చెప్పారు. మధ్యలోనే భయపడి బయటకు రావాలని కోరుకుంటున్న వారు నోటితో చెప్పినా, సైగలు చేసినా సురక్షితంగా భయటకు తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ భయానక హౌజ్‌ను నిర్వహించడం వెనక తమకు మంచి లక్ష్యమే ఉందని, ఈ అనుభవం కలిగిన వారు భవిష్యత్తులో సమాజంలోనే కాకుండా ప్రకృతిపరంగా ఎదురయ్యే ఎలాంటి భయానక అనుభవాలనైనా ధైర్యంగా ఎదుర్కోగలరని రస్ మాక్ తెలిపారు. హౌజ్‌లోకి వెళ్లిన వారిని కొన్ని నీళ్లు మాత్రమే ఉన్న చిన్న బాత్ టబ్‌లో కూర్చోబెట్టి ఆ నీటిలో ఓ పెద్ద షార్క్ ఉందని చెబుతామని, నిజంగానే అది ఉన్నట్లు భ్రమించి భయపడతారని ఆయన తెలిపారు. కానీ ఆ ఇళ్లంతా రక్తసిక్తమైన గోడలతో, పుర్రెలతో ఉంటుంది. దెయ్యాల మాస్క్‌లు ధరించి వచ్చే మనుషులు గొంతులు పట్టుకొని తలలు కోస్తున్నట్లు, చేతులు నరికేస్తున్నట్లు, రక్తం నిండిన బాత్ టబ్బుల్లో ముంచేస్తున్నట్లు నటిస్తారు. అలా మనుషులే నటిస్తారా? అవన్నీ వీడియో దశ్యాలా ? తెలియవు. అమెరికాలో ఎన్నో ఏళ్లుగా ఈ ‘హారర్ హౌజ్’ నడుస్తున్నప్పటికీ అంతగా ప్రజలకు దృష్టికి రాలేదు. ఇటీవల ‘నెట్‌ఫ్లిక్స్’, హంటర్స్–ఆర్ట్ ఆఫ్ ది స్కేర్’ పేరిట ఈ హౌజ్ గురించి చూపించడంతో ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. -
రెచ్చిపోయిన పోకిరీలు: వీడియో వైరల్
కోల్‌కతా: మాజీ మిస్ ఇండియా ఉషోషి సేన్‌గుప్తా (30)కు కోల్‌కతాలో చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది యువకులు ఆమె ప్రయాణిస్తున్న కారును అడ్డుకొని, దాడికి దిగారు. సోమవారం అర్థరాత్రి పశ్చిమ బెంగాల్ రాజధాని నడిబొడ్డున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనను మొత్తాన్ని వివరిస్తూ ఉషోసి సేన్‌గుప్తా ఫేస్బుక్లో వీడియోతో సహా పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయింది. ఉషోషి పోస్ట్‌లోని వివరాలు సంక్షిప్తంగా.. ‘పనిముగించుకుని కలిగ్తో కలిసి తిరిగి ఇంటికి వెళుతుండగా కొంతమంది ఆకతాయిలు నేను ప్రయాణిస్తున్న ఉబర్ కారును అడ్డుకున్నారు. డ్రైవరు తారక్‌ను బలవంతంగా బయటికి లాగి, విపరీతంగా కొట్టడం మొదలు పెట్టారు. దీన్ని అడ్డుకున్నాను. నిమిషాల్లో మరో పదిహేనుమంది యువకులు వీరికి తోడయ్యారు. ఈ ఘటనను ఫోన్లో రికార్డు చేస్తూనే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాను. దగ్గరలో ఉన్న మైదాన్ పోలీస్ స్టేషన్ అధికారిని సాయం చేయమని కోరా. ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ స్పందించేందుకు సదరు పోలీసు ఆధికారి నిరాకరించాడు. అయితే డ్రైవర్‌ను వాళ్లు చంపేస్తారని గట్టిగా అరవడంతో చివరకు వచ్చి వాళ్లను చెదరగొట్టి వెళ్లిపోయాడు. అంతా అయ్యాక అప్పుడు భవానిపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు అధికారులు వచ్చారు. అప్పటికి సమయం రాత్రి 12 గంటలు. ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సిందిగా డ్రైవర్‌ను కోరాను. అప్పుడు కూడా ఆ దుండగులు వదలకుండా ఫాలో అయ్యారు. అంతేకాదు మూడు బైకుల మీద వచ్చిన ఆరుగురు మరోసారి కారును అడ్డుకున్నారు. తీసిన వీడియోను డిలీట్ చేయాలంటూ గలాటా చేశారు. కారుపై రాళ్లు విసిరి, కారు ఆపి బ్యాగ్ లాగేశారు. ఫోన్ లాక్కుని దాన్ని పగలగొట్టాలని చూశారు. చివరికి అమ్మానాన్న, సోదరి సహాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఇలాంటి ఘటనలు రేపు మీకు ఎదురు కావచ్చు.. స్పందించి, నిందితులను గుర్తించాలి’ ఈ ఘటన తనను చాలా షాక్‌కు గురిచేసిందని, పోలీసులకు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారని ఉషోషి ఆరోపించారు. తన ఫిర్యాదు మాత్రమే తీసుకున్న అధికారులు ఉబెర్ డ్రైవర్ ఫిర్యాదును తీసుకోవడానికి అంగీకరించలేదని, అది చట్టానికి విరుద్ధమని, ఒకే కేసులో రెండు ఫిర్యాదులు తీసుకోలేమంటూ మాట్లాడారని ఆమె రాసుకొచ్చారు. హెల్మెట్ లేకుండా పది పదిహేను మంది యువకులు రోడ్లమీద హల్చల్ చేస్తోంటే పోలీసులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న తనకు జరిగిన అవమానాన్ని నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. వేధింపులతో జీవించలేని పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రతి అమ్మాయికి తన మద్దతు వుంటుందని తెలిపారు. అంతేకాదు ఫిర్యాదు చేసినప్పటికీ వేధిస్తున్న అబ్బాయిలపై చర్యలు తీసుకున్న దాఖలాలను తానెప్పుడూ చూడలేదని విమర్శించారు. మరోవైపు దీనిపై పోలీస్ విభాగం కూడా ట్విటర్లో స్పందించింది. ఈ సంఘటనను చాలా తీవ్రంగా తీసుకున్నామని, కేసు నమోదు చేసి ఏడుగుర్ని అరెస్టు చేశామని కోలకతా పోలీస్ కమిషనర్ తెలిపారు. సీనియర్ స్థాయి ఉద్యోగులతో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. అరెస్టయిన యువకుల్లో రోహిత్, ఫర్దిన్ ఖాన్, సబీర్ అలీ, గని, ఇమ్రాన్ అలీ, వసీం, అతిఫ్ ఖాన్‌లుగా గుర్తించారు. కాగా లాస్‌వెగాస్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2010లో సేన్‌గుప్తా ‘ఐ యామ్ షీ - మిస్ యూనివర్స్ ఇండియా’ టైటిల్ గెలుచుకున్నారు. Seven people were arrested, yesterday, by Kolkata police on harassment and assault charges. The complaint was filed by model and actor Ushoshi Sengupta, the driver of her cab had also been assaulted by the accused. Further probe underway. #WestBengal pic.twitter.com/iMx9jl8Wq8 — ANI (@ANI) June 19, 2019