వానరాలు, శునకాలు ప్రధాన ఇతివృత్తాలతో పలు చిత్రాలను చూశాం. ఇప్పుడు మార్జాలం ఇతివృత్తంతో మియావ్ అనే వైవిధ్యభరిత చి త్రాన్ని చూడబోతున్నాం. గ్లోబల్‌వుడ్‌స మూవీస్ పతాకంపై అడైక్కల్ రాజ్ నిర్మిస్తున్న చిత్రం మి యావ్. పలు వాణిజ్య ప్రకటనలను తెరకెక్కిం చిన చిన్నాస్ పళనీసామి దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇది. రాజా, సంజయ్ విక్కీ, హైడన్, ఊర్మిళ గాయత్రి, షైయానీ, డెలియోన్‌రాజా, డే నియల్, సారుుగోపి ప్రధాన పాత్రలు పోషించి న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సో మవారం సాయంత్రం చెన్నైలో జరిగింది. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి.ఎస్.థా ను ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చిన్నాస్ పళనీసామి మాట్లాడుతూ భారతీయ సినీ చరిత్రలోనే పిల్లి ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న తొలి చిత్రం మియావ్ అని చెప్పవచ్చన్నారు.
ఇది హారర్, థ్రిల్లర్ కథా చిత్ర మన్నారు. ఇంతకు ముందు త్రిష, హన్సిక లాం టి తారలు నటించిన హారర్ కథా చిత్రాలు చూ సిన ప్రేక్షకులకు మియావ్ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. ఈ చిత్రంలో పర్షియన్ క్యా ట్‌ను నటింపజేశామని తెలిపారు.అరుుతే కుక్క ల మాదిరి పిల్లులకు ట్రైనింగ్ ఇవ్వలేమని, అం దువల్ల అధిక భాగం సీజీ టెక్నాలజీని ఉపయోగించుకున్నట్లు తెలిపారు. ఇక కథ గురించి చెప్పాలంటే ప్రేమ పేరుతో ఒక యువకుడు, ఒక అమ్మారుుని తన స్నేహితులు అత్యాచారానికి గురి చేస్తాడన్నారు. వారి అఘారుుత్యానికి బలైన ఆ యువతి ఆత్మ ఒక పిల్లిలో ప్రవేశించి ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. ఆ ప్రతీకారం అనేది చాలా వైవిధ్యంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం ద్వారా ప్రేమలో పడ్డ యువతులు ఎవరినీ గుడ్డిగా నమ్మరాదనే సందేశాన్నివ్వనున్నట్లు దర్శకుడు చెప్పారు. మియావ్ చి త్రాన్ని డిసెంబర్ 30వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
పిల్లి ఇతివృత్తంతో మియావ్
Published Wed, Nov 30 2016 2:58 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
Advertisement