thriller
-
ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ది కేరళ స్టోరీ ఫేమ్ ఆదా శర్మ, విశ్వంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్). ఈ ఏడాది మే 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంత చేసుకుంది. ఈ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి కృష్ణ అన్నం దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నెల 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా.. దెయ్యం కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కిచారు. రిలీజైన దాదాపు ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. -
ఓటీటీకి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. అది కూడా నెల రోజుల్లోపే!
ఓటీటీల్లో హారర్, యాక్షన్ థ్రిల్లర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తారు. అందుకే ఇటీవల అలాంటి కంటెంట్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా మరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. అదే తమిళంలో తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ కడైసీ ఉలగ పోర్. హిప్ హాప్ తమిళ ఆది స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు కథ అందించడంతోపాటు డైరెక్షన్, ప్రొడ్యూసర్, హీరో అన్నీ అతడే కావడం విశేషం.ఈ తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. గతనెల సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో నాజర్, నట్టీ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్ల వద్ద పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఓటీటీలోనూ అలరిస్తుందేమో వేచి చూడాల్సిందే. Directing a movie changes your perspective on various things. #KadaisiUlagaPor was one such experience. pic.twitter.com/NNsn7H9dEv— Hiphop Tamizha (@hiphoptamizha) September 29, 2024 -
మరో ఓటీటీకి వచ్చేసిన సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ లెవెల్ క్రాస్. జూలైలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలో దర్శనమిచ్చింది.తాజాగా ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఆసిఫ్ అలీ హీరోగా నటించారు. ఈ మూవీకి అర్బాజ్ అయూబ్ దర్శకత్వం వహించారు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు లెవెల్ క్రాస్ సినిమా చూసేయండి.Unlikely love. Shattered trust. Eternal consequences. Stream #LevelCross on #Aha ▶️https://t.co/NCGmg0REO0 pic.twitter.com/0H57F28kFt— ahavideoin (@ahavideoIN) October 15, 2024 -
ఓటీటీకి సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'శాకాహారి'. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగాయన రఘు ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. కన్నడలో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.ఈనెల 24 నుంచి ఆహా స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు గొప్పరాజు రమణ ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఓటీటీ ప్రియులను మెప్పించేందుకు వచ్చేస్తోంది. ఈ చిత్రంలో గోపాలకృష్ణ దేశ్ పాండే .. వినయ్ .. నిధి హెగ్డే, హరిణి శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. Crime, emotions, and unexpected turns - #Shakhahaari has it all! Premiering on aha on Aug 24. pic.twitter.com/oortLZG2nH— ahavideoin (@ahavideoIN) August 21, 2024 -
ఓటీటీలో హైజాక్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి సరికొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. సముద్రంలో షిప్పులను హైజాక్ చేసే నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. రెండేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభించిన లూటేరే వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం రెండు ఎపిసోడ్లను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ హైజాక్ థ్రిల్లర్ సిరీస్ లూటేరే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రధానంగా షిప్ హైజాక్ నేపథ్యంలోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. సోమాలియా సముద్రపు దొంగల చుట్టూ తిరిగే ఈ సిరీస్‌పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వచ్చే వారంలో మిగిలిన ఎపిసోడ్లను కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. లూటేరే వెబ్ సిరీస్‌ను ప్రముఖ డైరెక్టర్ హన్సల్ మెహతా క్రియేట్ చేయగా.. ఆయన తనయుడు జై మెహతా డైరెక్షన్లో తెరకెక్కించారు . సోమాలియా పైరేట్స్ ఓ షిప్‌ను హైజాక్ చేయడం.. దానిని విడిపించడానికి జరిగే ప్రయత్నాలు చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, ప్రీతికా చావ్లా, చందన్ రాయ్ సన్యాల్ ప్రధాన పాత్రలు పోషించారు. Time to drop the anchor! ⚓🚢#HotstarSpecials #Lootere is now streaming. Watch now: https://t.co/KnAtofkAqW pic.twitter.com/NSqwm5GUnG — Disney+ Hotstar (@DisneyPlusHS) March 21, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం
గత కొన్ని నెలలుగా మలయాళ ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. వాటిలో ఎక్కువగా థ్రిల్లర్, సస్పెన్స్ చిత్రాలే ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా, మరో మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. మలయాళ చిత్ర పరిశ్రమలో విమర్శకుల ప్రశంసలను పొందిన 'ఆట్టం' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది జనవరి 5న విడుదల అయిన చిత్రం బాక్సాఫీస్ వద్ద దమ్మురేపింది. ఆట్టం సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి ఈ చిత్రం మలయాళం భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉండటంతో చాలామంది ఈ చిత్రాన్ని చూస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులను ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా కథ ఉండటంతో ఓటీటీలో కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.ఆట్టం చిత్రంలో జరీన్ షిహాబ్, కళాభవన్ షరోజాన్, వినయ్ ఫోర్ట్, జాలీ ఆంథోనీ, మదన్ బాబు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఆనంద్ ఏకర్ డైరెక్ట్ చేశారు. బాసిల్ సీజే సంగీతం అందించగా జాయ్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై అజిత్ జాయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అట్టం కథ, కథనంలో సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగా ఉండటంతో పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ఈ చిత్రం ప్రదర్శితమైంది. నాటకాలు ప్రదర్శించే ఒక టీమ్‌లో 12 మంది పురుషులు ఉండగా.. అందులో ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. కానీ ఆ అమ్మాయిపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో వారి గ్రూపులో విభేదాలు వస్తాయి. ఆ నేరం ఎవరు చేశారు అనే విషయంలో పలు నాటకీయత అంశాలు తెరపైకి వస్తాయి. ఫైనల్‌గా ఆ అమ్మాయిపై లైంగిక దాడి చేసింది ఎవరు..? అని కనుగునే క్రమంలో కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. -
మార్చిలో తంత్ర
అనన్య నాగళ్ల లీడ్ రోల్లో నటించిన ‘తంత్ర’ చిత్రం విడుదల తేదీ ఖరారు అయింది. మార్చిలో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్ రఘుముద్రి, సలోని, ‘టెంపర్’ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మించారు. ఈ మూవీని మార్చి 15న విడుదల చేయనున్నట్లు పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘హారర్ నేపథ్యంతో రూపొందిన ‘తంత్ర’ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందనే నమ్మకం ఉంది. పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా అనన్య నాగళ్ల చక్కగా నటించారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సహ నిర్మాత: తేజ్ పల్లి, కెమెరా: సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల, సంగీతం: ఆర్ఆర్ ధృవన్. -
భయపెట్టే తంతిరం
భార్యాభర్తల మధ్యలో ఓ ఆత్మ ప్రవేశించడం వల్ల వారి దాంపత్య జీవితం ఎలా ప్రభావితమైంది? అనే కథాంశంతో రూపొందిన హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘తంతిరం’. శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించారు. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వంలో శ్రీకాంత్ కంద్రగుల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఆడియన్స్‌కు గుర్తుండిపోయే చిత్రం ఇది’’ అన్నారు శ్రీకాంత్ గుర్రం. ‘‘ఈ సినిమా చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతారు’’ అన్నారు మెహర్ దీపక్. ‘‘బడ్జెట్ ఎక్కువ అవుతున్నా రాజీ పడకుండా నిర్మించాం. ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేయాలి’’ అన్నారు శ్రీకాంత్ కంద్రగుల. -
థ్రిల్లర్ మూవీతో వస్తోన్న సిద్ధార్థ్.. ఇప్పుడైనా కమ్ బ్యాక్ ఇస్తాడా?
తమిళ స్టార్ నటుడు సిద్ధార్థ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం చిత్తా. ఈ మూవీకి ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇటకీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సిద్ధార్థ్ నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నిమిషా నటించగా.. అంజలీ నాయర్ ముఖ్యపాత్రలో కనిపించనుంది. దీపు నినన్, థామస్, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. తమిళంలో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్, దర్శకుడు అరుణ్‌కుమార్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇది కిడ్నాప్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చాలా సహజత్వంగా అదే సమయంలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయని తెలిపారు. తాను 25 ఏళ్లుగా ఇలాంటి చిత్రం కోసమే ఎదురు చూశానన్నారు. ఇది తనకు కమ్ బ్యాక్ చిత్రం అవుతుందన్నారు. బాబాయికి.. చిన్నారికి మధ్య జరిగే కథా చిత్రంగా చిత్తా ఉంటుందన్నారు. దర్శకుడు అద్భుతంగా చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని సిద్ధార్థ్ అన్నారు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. కాగా.. ఈ నెల 28వ తేదీన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది. -
ధీమహి చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11PM చిత్రం ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా 'ధీమహి'. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులు. ఇందులో నిఖిత చోప్రా హీరోయిన్. షారోన్ రవి సంగీతం అందించారు. షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: కుమారుడి కోసం ఏడ్చేవాడు.. రఘువరన్ మృతిపై తొలిసారి మాట్లాడిన సోదరుడు) అనంతరం చిత్ర యూనిట్ మాట్లాడుతూ 'ధీమహి చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. 7:11 చిత్రంలో నటించిన సాహస్ పగడాల ఈ చిత్రంలో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించారు. ఇది ఒక థ్రిల్లర్ చిత్రం. షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మా చిత్రంలోని పాటలను త్వరలో జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేస్తాము. ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉన్నాము. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, త్వరలోనే ట్రైలర్‌తో మీముందుకు వస్తాం. ఆపై రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటిస్తాం.' అని తెలిపారు. -
ఈ నెలలో నేనేనా
రెజీనా ప్రధాన పాత్రలో నటించిన ఫ్యాంటసీ థ్రిల్లర్ తమిళ చిత్రం ‘సూర్పనగై’ (తెలుగులో ‘నేనేనా’). కార్తీక్ రాజు దర్శకత్వంలో ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రోడక్షన్ నిర్మించిన చిత్రం ఇది. అక్షరా గౌడ, అలీ ఖాన్ , జై ప్రకాష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఈ నెల 18న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. 19వ శతాబ్దంతో పాటు ప్రస్తుత కాలంతో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రెజీనా రెండు పాత్రలు చేశారు. ఓ పాత్రలో ఆమె పురావస్తు శాస్త్రవేత్తగా కనిపిస్తారట. -
ఆహాలో అలరిస్తున్న మందాకిని సీరియల్.. ఫ్రీగా చూసేయండి
సరికొత్త కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు ఓటీటీలో బోలెడంత ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది ఆహా. డ్యాన్స్, సింగింగ్ షోలతో పాటు సీరియల్స్‌ను కూడా పరిచయం చేశారు. ఇప్పటికే ఆహాలో మిస్టర్ పెళ్ళాం సీరియల్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా 'మందాకిని'అనే సీరియల్ స్ట్రీమింగ్ అవుతోంది. సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సీరియల్లోని మొదటి నాలుగు ఎపిసోడ్స్ ఈ నెల 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుందట. థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడే వాళ్ల కోసం ప్రత్యేకంగా ఈ డైలీ సీరియల్‌ను సిద్ధం చేశారు మేకర్స్.అంతేకాకుండా లి ఎనిమిది ఎపిసోడ్స్ ను ఉచితంగా చూసే అవకాశాన్ని ఆహా సంస్థ కల్పిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆసక్తి రేపుతున్న మందాకిని సీరియల్‌ని మీరూ చూసేయండి మరి. -
సంచలనాల వరల్డ్‌కప్‌లో థ్రిల్లింగ్ మ్యాచ్‌లు ఇవే.. జాబితా విడుదల చేసిన ఐసీసీ
టీ20 వరల్డ్‌కప్-2022లో ఇప్పటి దాకా (సూపర్-12 దశ) జరిగిన మ్యాచ్‌ల్లో ఉత్తమ మ్యాచ్‌ల జాబితాను ఐసీసీ ఇవాళ (నవంబర్ 7) ప్రకటించింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్ ఉండగా.. భారత్-పాక్ మ్యాచ్ రెండో ప్లేస్‌లో, ఆతర్వాత ఇంగ్లండ్-ఐర్లాండ్, పాకిస్తాన్-జింబాబ్వే, బంగ్లాదేశ్-జింబాబ్వే, ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్, ఇండియా-సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్‌లు వరుసగా 3 నుంచి 8 స్థానాల్లో ఉన్నాయి. క్రికెట్ పసికూన నెదర్లాండ్స్.. తమ ఆఖరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు షాకిచ్చి, ఆ జట్టు సెమీస్ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో ఐసీసీ ఈ మ్యాచ్‌కు టాప్ రేటింగ్ ఇచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆఖరి బంతి వరకు సాగిన భారత్-పాక్ మ్యాచ్ ఫ్యాన్స్‌కు అసలుసిసలు పొట్టి క్రికెట్ మజాను అందించింది. కోహ్లి చారిత్రక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు మరపురాని విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌కు రెండో స్థానం దక్కింది. క్వాలిఫయర్ దశలో వెస్టిండీస్‌ను ఖంగుతినిపించి సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచిన ఐర్లాండ్.. సూపర్-12 స్టేజ్‌లో వరుణుడు సహకరించడంతో ఇంగ్లండ్‌కు షాకిచ్చి, ఐసీసీ బెస్ట్ మ్యాచెస్ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఆఖరి బంతి వరకు హైడ్రామా నడిచిన జింబాబ్వే-పాకిస్తాన్ మ్యాచ్‌కు నాలుగో స్థానం దక్కింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే.. పాక్‌పై సంచలన విజయం సాధించి, ఆ జట్టు నైతిక స్థైర్యాన్ని దెబ్బకొట్టింది. అనూహ్య మలుపుల మధ్య ఆఖరి బంతి వరకు సాగిన బంగ్లాదేశ్-జింబాబ్వే మ్యాచ్‌కు ఈ జాబితాలో ఐదో స్థానం దక్కింది. ఈ మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో తడబడ్డ జింబాబ్వే.. మరో సంచలన విజయం నమోదు చేసే అవకాశాన్ని చేజేతులారా నాశనం చేసుకుంది. ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్ ఆరో స్థానం దక్కించుకుంది. ఛేదనలో రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ వెన్నులో వణుకు పుట్టించాడు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన భారత్-సౌతాఫ్రికా మ్యాచ్‌కు ఏడో స్థానం లభించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ.. స్వల్ప లక్ష్యాన్ని ఆఖరి ఓవర్ వరకు కాపాడుకుని ప్రొటీస్‌ను భయపెట్టింది. ఆసీస్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సూపర్-12 ఆరంభ మ్యాచ్ ఐసీసీ ఉత్తమ మ్యాచ్‌ల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగడంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగానే సాగినప్పటికీ.. క్రికెట్ ఫ్యాన్స్‌కు కావాల్సినంత మజాను అందించింది. ఇవే కాక క్వాలిఫయర్ దశలో మరో రెండు ఆసక్తికర మ్యాచ్‌లు జరిగాయి. నమీబియా.. శ్రీలంకకు షాకివ్వడం, స్కాట్లాండ్.. విండీస్‌ను మట్టికరిపించడం లాంటి సంచలనాలు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో నమోదయ్యాయి. -
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా దివ్య
తమిళసినిమా: ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందుతున్న చిత్రం దివ్య. నియాన్ సీ ఫిలి మ్స్ పతాకంపై శ్రీజేష్ వల్సన్ నిర్మిస్తున్న ఈ చి తం ద్వారా సనీఫ్ సుకుమారన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సాశ్వీబాలా, మిథున్, సంపత్ రామ్, మ్యాథ్యూస్ వర్గీస్, ప్రవీణ్, అఖిల్ కృష్ణజిత్, మురుగన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విపిన్‌రాజ్ చాయాగ్రహణం, రెజీమోన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని దర్శకుడు తెలిపారు. తమిళంలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథా చిత్రాలు అరుదుగానే వస్తున్నాయని, ఆ కోవలో మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగే చిత్రంగా దివ్య ఉంటుందన్నారు. కొత్త ప్రదేశాలను సందర్శించాలి, కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోవాలని భావించే ఒక యువతి తన బాయ్ ఫ్రెండ్‌తో పరిచయం లేని ప్రాంతానికి వెళ్లగా ఎలాంటి సంఘటన ఎదురైంది? అది ఏంటి? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా ఇది ఉంటుందన్నారు. త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. చదవండి: Raksha Bandhan Vs Laal Singh Chaddha: ఆమిర్‌తో పోటీపడుతున్న అక్షయ్.. పెద్ద సాహసమే! -
థ్రిల్లింగ్‌గా 'అమెజాన్ ఒరిజినల్స్' వెబ్ సిరీస్‌లు..
Best 4 Amazon Originals Thriller Web Series: డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో వచ్చే వెబ్ సిరీస్‌లు, సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి ఓటీటీలు. మూవీ లవర్స్ కాకుండా సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఒక్కో తరహా జోనర్లను చూసేందుకు ఇష్టపడతారు. కొందరికి హార్రర్స్ నచ్చితే మరికొందరికని సస్పెన్స్ థ్రిల్లర్స్ ఆకట్టుకుంటాయి. ఇంకొందరు ఫాంటసీ, స్కైఫై జోనర్స్‌కు ఓటు వేస్తారు. ఇలా ప్రేక్షకులకు మెచ్చేలా వైవిధ్యమైన కథాంశాలు, విభిన్నమైన జోనర్స్‌తో అలరిస్తోంది ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో. అమెజాన్ ఒరిజినల్స్ పేరుతో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఆడియెన్స్‌కు అందించింది అమెజాన్ ప్రైమ్ వీడియో. అందులో విభిన్నమైన జోనర్స్ ఉన్నాయి. మూవీ ప్రేక్షకుల కోసం అమెజాన్ ఒరిజినల్స్ నుంచి వచ్చిన 4 డిఫరెంట్ టైప్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లను ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో సహా అందిస్తున్నాం. మరీ ఆ వెబ్ సిరీస్‌లు ఏంటో తెలుసుకుని చూసేయండి. 1. రీచర్ (Reacher): క్రైమ్ థ్రిల్లర్ (రేటింగ్ 8.1) 2. టామ్ క్లాన్సీస్ జాక్ రేయాన్ (Tom Clancy's Jack Ryan): పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ (రేటింగ్ 8.0) 3. ఔటర్ రేంజ్ (Outer Range): సైన్స్ ఫిక్షన్ నియో-వెస్ట్రన్ మిస్టరీ థ్రిల్లర్ (రేటింగ్ 7.4) 4. ది లాస్ట్ అవర్ (The Last Hour): సూపర్నాచురల్ క్రైమ్ థ్రిల్లర్ (రేటింగ్ 7.2) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పదకొండు భాషల్లో థ్రిల్లర్
థియేటర్స్ లేకపోవడంతో సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఓటీటీల కోసమే సినిమాలు తయారు చేస్తున్నారు. లాక్ డౌన్ సమయం నుంచి పలు సినిమాలను ‘పే అండ్ వ్యూ’ (ఆన్లైన్లో డబ్బు చెల్లించి సినిమా చూసే విధానం) పద్ధతిలో విడుదల చేస్తున్నారు. తాజాగా ‘థ్రిల్లర్’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్సరా రాణి, రాకీ కచ్చి జంటగా నటించిన ఈ సినిమా ఆర్జీవీ వరల్డ్, శ్రేయాస్ ఈటీ ద్వారా ఆగస్ట్ 14 రాత్రి 9 గంటలకు విడుదల కానుంది. 200 రూపాయిలు చెల్లించి ఈ సినిమాను చూడొచ్చు. 11 భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, భోజ్ పురి, గుజరాతి, ఒడియా తదితర భాషలు) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ –‘ఒక ఇంట్లోనే జరిగే కథతో తీసిన సినిమా ‘థ్రిల్లర్’. ఎరోటిక్ జానర్ లో కొన్ని చిత్రాలు చేయాలని ప్లాన్ చేశాను. అందులో ఒకటి ఈ ‘థ్రిల్లర్’ చిత్రం. ఒక రాత్రి ఓ పెద్ద బంగ్లాలో ఓ అమ్మాయికి ఎదురయ్యే సంఘటనలే ఈ చిత్ర కథాంశం. నేను అనుకున్న పాత్రకు అప్సరా రాణి చక్కగా సరిపోయింది’’ అన్నారు. అలాగే వర్మ నుంచి ‘డేంజరస్లీ క్రై ం’, అర్నబ్, అల్లు’ అనే చిత్రాలు రానున్నాయి. ‘‘పవర్ స్టార్, అల్లు, అర్నబ్’ చిత్రాలు ఆయా వ్యక్తులను ప్రొవోక్ (రెచ్చగొట్టే విధంగా) చేయడానికేనా’’ అని అడిగితే ‘కచ్చితంగా అందుకే’ అన్నారు వర్మ. -
థ్రిల్లర్ కథాంశంతో ఎన్ పేర్ ఆనందన్
తమిళసినిమా:హర్రర్ కథా చిత్రాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటోంది. దీంతో ఆ తరహా చిత్రాలు వరస కడుతున్నాయి. తాజాగా ఎన్ పేర్ అనందన్ అనే చిత్రం తెరకెక్కుతోంది. కావ్యా ప్రొడక్షన్స్ గోపి కృష్ణప్ప, సవితా సినీ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి శ్రీధర్ వెంకటేశ్ దర్శకత్వం వహిస్తూ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శిస్తున్న 6 అధ్యాయం చిత్రంలో ఒక అధ్యాయమైన చిత్రం కొల్లుదడీకి దర్శకత్వం వహించారు. ఇందులో కథై తిరైకతై వచనం ఇయక్కం, దాయం చిత్రాల ఫేమ్ సంతోష్ ప్రతాప్ హీరోగా, అతుల్యరవి హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఇప్పటి వరకూ వచ్చిన థ్రిల్లర్ కథా చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. చిత్రంలో కొన్ని యాథార్ధ సంఘటనలు ఉంటాయన్నారు. ఇందులో తుది ఘట్టంలో 12 నిమిషాలతో కూడిన పాట ఉందన్నారు. ఈపాట భావోద్వేగంతో సాగుతుందన్నారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ చిత్రాల తరహాలో నిర్మించడానికి ఒక కొత్త ప్రయత్నం చేశామన్నారు. అయితే తమిళ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను మధురై, తిరువణ్ణామలై, చెన్నై ప్రాంతాల్లో చిత్రీకరించామన్నారు. ఈ చిత్రాన్ని చూసిన కొందరు సినీ ప్రముఖులు ఆ మధ్య వచ్చిన అరువి చిత్రం ఎలాగైతే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందో అలాగే మంచి పేరు తెచ్చుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న చిత్రానికి జేమ్స్ ప్రాంకింగ్ సంగీతం, మనోజ్ ఛాయాగ్రహణను అందిస్తున్నారన్నారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
పిల్లి ఇతివృత్తంతో మియావ్
వానరాలు, శునకాలు ప్రధాన ఇతివృత్తాలతో పలు చిత్రాలను చూశాం. ఇప్పుడు మార్జాలం ఇతివృత్తంతో మియావ్ అనే వైవిధ్యభరిత చి త్రాన్ని చూడబోతున్నాం. గ్లోబల్వుడ్స మూవీస్ పతాకంపై అడైక్కల్ రాజ్ నిర్మిస్తున్న చిత్రం మి యావ్. పలు వాణిజ్య ప్రకటనలను తెరకెక్కిం చిన చిన్నాస్ పళనీసామి దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇది. రాజా, సంజయ్ విక్కీ, హైడన్, ఊర్మిళ గాయత్రి, షైయానీ, డెలియోన్రాజా, డే నియల్, సారుుగోపి ప్రధాన పాత్రలు పోషించి న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సో మవారం సాయంత్రం చెన్నైలో జరిగింది. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి.ఎస్.థా ను ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చిన్నాస్ పళనీసామి మాట్లాడుతూ భారతీయ సినీ చరిత్రలోనే పిల్లి ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న తొలి చిత్రం మియావ్ అని చెప్పవచ్చన్నారు. ఇది హారర్, థ్రిల్లర్ కథా చిత్ర మన్నారు. ఇంతకు ముందు త్రిష, హన్సిక లాం టి తారలు నటించిన హారర్ కథా చిత్రాలు చూ సిన ప్రేక్షకులకు మియావ్ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. ఈ చిత్రంలో పర్షియన్ క్యా ట్ను నటింపజేశామని తెలిపారు.అరుుతే కుక్క ల మాదిరి పిల్లులకు ట్రైనింగ్ ఇవ్వలేమని, అం దువల్ల అధిక భాగం సీజీ టెక్నాలజీని ఉపయోగించుకున్నట్లు తెలిపారు. ఇక కథ గురించి చెప్పాలంటే ప్రేమ పేరుతో ఒక యువకుడు, ఒక అమ్మారుుని తన స్నేహితులు అత్యాచారానికి గురి చేస్తాడన్నారు. వారి అఘారుుత్యానికి బలైన ఆ యువతి ఆత్మ ఒక పిల్లిలో ప్రవేశించి ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. ఆ ప్రతీకారం అనేది చాలా వైవిధ్యంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం ద్వారా ప్రేమలో పడ్డ యువతులు ఎవరినీ గుడ్డిగా నమ్మరాదనే సందేశాన్నివ్వనున్నట్లు దర్శకుడు చెప్పారు. మియావ్ చి త్రాన్ని డిసెంబర్ 30వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
కామెడీ థ్రిల్లర్‌గా సైవ కోమాళి
కామెడీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం సైవ కోమాళి అని ఆ చిత్ర దర్శకుడు సెరేశ్ శాంతారామ్ తెలిపారు. దర్శకుడు ధరణీ, జగన్, బాలుశివన్, శాంతకుమార్‌ల వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇది. ఎస్ఎంఎస్.మూవీస్ పతాకంపై ఏసీ.సురేశ్, మహేంద్రన్, సారుుమహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సైవ కోమాళి చిత్రంలో నడువుల కొంచెం పక్కల్తై కానోమ్ చిత్రం ఫేమ్ రాజ్‌కుమార్, రెహానా, నాన్‌కడవుల్ రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో పవర్‌స్టార్ జీఎం.కుమార్, టీబీ.రాజేంద్రన్, రంజిత్, సూపర్‌గుడ్ లక్ష్మణన్, క్రేన్‌మనోహర్, కృష్ణమూర్తి, టీకే.కళ, గాయత్రి, వనిత తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ కామెడీ థ్రిల్లర్ అంశాలతో రూపొందిస్తున్న చిత్రం సైవ కోమాళి అని తెలిపారు. ప్రతి మనిషిలో సైకో ఉంటాడు. అమాయకుడు ఉంటారన్నారు. సమాజ తీరును బట్టి ఆ మనిషి ప్రవర్తన ఉంటుందని చెప్పే చిత్రంగా సైవ కోమాళి ఉంటుందన్నారు. అదే విధంగా సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న దురాగతాలు, వాటిని ఎలా ఎదుర్కొవాలన్న అంశాలు చిత్రంలో చోటు చేసుకుంటాయన్నారు. 108 అంబులెన్స ప్రాధాన్యతను సైవ కోమాళి చిత్రంలో చెప్పనున్నట్లు చెప్పారు. దీనికి కే.బాల ఛాయాగ్రహణ, గణేశ్ రాఘవేంద్ర సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఇందులోని పాటలను గానాబాలా రాసి పాడటం విశేషం అని దర్శకుడు పేర్కొన్నారు. -
థ్రిల్లర్మూవీ ‘ఎల్ 7’
అక్కయ్యపాలెం: రాహుల్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఎల్ 7’ సినిమా ఫాంటసీ, థ్రిల్లర్, హర్రర్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత ఓబుల సుబ్బారెడ్డి అన్నారు. నగరంలోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ ప్రమోషన్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో మనిషిని పోలినవారు ఏడుగురు ఉంటారని, ఒకే పోలిక ఉన్న 7 గురు తారసపడితే ఏ విధంగా ఉంటుందో చిత్ర దర్శకుడు ముకుంద్ పాండే అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. సినిమా ప్రమోషన్లో భాగంగా చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా రక్త దాన శిబిరాల ద్వారా ఇప్పటి వరకు వెయ్యికి పైగా యూనిట్ల రక్తం సేకరించి రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుకు అందజేశామని తెలిపారు. సినిమా హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ విశాఖలో చదివిన రోజుల్లో జగదాంబ థియేటర్లో సినిమాలు ఎక్కువగా చూసే వాడినని, అపుడే సినిమాలలో నటించాలన్న కోరిక ఏర్పడిందన్నారు. కథ, వీకెండ్‌లవ్, తుంగభద్ర, నవ మన్మ«థుడు సినిమాలలో నటించానన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ముకుంద్ పాండే, నటీనటులు మనాలి రాథోడ్, సవేరి, అపూర్వ పాల్గొన్నారు. -
ప్రేమలో ఏడు కోణాలు
‘మనం’, ‘ఇష్క్’ చిత్రాలకు కథా సహకారం అందించిన ముకుంద్ పాండే తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎల్ 7’. అరుణ్ అదిత్, పూజా జవేరి జంటగా బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం లోగోను దర్శకుడు విజయ్ కుమార్ కొండా, ట్రైలర్‌ను నిర్మాతలు గొట్టిముక్కల పద్మారావు, డీఎస్ రావు విడుదల చేశారు. గొట్టిముక్కల పద్మారావు మాట్లాడుతూ- ‘‘ భోజ్‌పురిలో స్టార్ హీరోలతో చిత్రాలు తీసి, బడా నిర్మాతగా పేరు తెచుకున్నారు ఓబుల్ సుబ్బారెడ్డి. తెలుగులో ఆయనకు ‘ఎల్ 7’ రెండో చిత్రం. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తోంది. దర్శకుడు మంచి ప్రతిభ ఉన్నవాడు. బాగా తెరకెక్కించాడు’’ అని పేర్కొన్నారు. ‘‘ప్రేమలోని ఏడు కోణాలను ఇందులో చూపించాడు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని విజయ్ కుమార్ కొండా పేర్కొన్నారు. ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ- ‘‘భోజ్‌పురిలో మంచి చిత్రాలు నిర్మించి విజయాలను అందుకున్నా. తెలుగులో కూడా మంచి నిర్మాత అనిపించుకోవాలని ఉంది. ముకుంద్ చెప్పిన కథ నచ్చడంతో తననే దర్శకత్వం వహించమన్నా. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ వంటి అన్ని అంశాలు ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం. కిశోర్, సహ నిర్మాతలు: మోహనరావు.బి, సతీష్ కొట్టె, కె.పున్నయ్య చౌదరి, సమర్పణ: మాస్టర్ ప్రీతమ్. -
ఐదుగురు భామలతో జైఆకాశ్ రొమాన్స్
మంచి విజయం కోసం పోరాడుతున్న నటుల్లో జైఆకాశ్ ఒకరు. అందుకు ఆయన చేస్తున్న తాజా ప్రయత్నం అమావాసై చిత్రం. జైఅకాశ్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. దీంతో ఆయన చిత్రాలు చాలా వరకు బహుభాషా చిత్రాలుగానే ఉంటాయి. ఈ అమావాసై చిత్రాన్ని కూడా తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో జైఆకాశ్ ఏకంగా ఐదుగురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయడం విశేషం. జయా ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి రాజేశ్ సావంత్ కథ, దర్శకత్వం, నిర్మాత బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. మాటలను బాబా రాయగా సంగీతాన్ని బాలీవుడ్ సంగీత దర్శకుడు సయ్యద్ అహ్మద్, చాయాగ్రహణంను డేవిడ్ బాసు అందిస్తున్నారు. ఇందులో జైఆకాశ్ సరసన సాక్షి, శోగన్, ప్రీతీసింగ్, తాన్యామౌర్య, ముమైత్‌ఖాన్ నటించారు.ఇతర పాత్రల్లో నుపూర్‌మేతా, రాజేశ్‌వివేక్, జీవా, శ్రావణ్ నటించిన ఈ చిత్రంలో ముఖ్య పాత్రను కోటాశ్రీనివాసరావు పోషించారు. చిత్రం గురించి దర్శక నిర్మాత రాజేశ్ సావంత్ తెలుపుతూ ఇది హారర్ నేపథ్యంంతో సాగే మ్యూజికల్ థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. చిత్ర షూటింగ్‌ను రాజస్తాన్, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, చెన్నై ప్రాంతాల్లో నిర్వహించామని వివరించారు. భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్న ఈ అమావాసై చిత్ర నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు. చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు రాజేశ్ సావంత్ వెల్లడించారు. -
హారర్ నేపథ్యంగా లైట్స్అవుట్
ఈ ఏడాది భారతీయ సినీపరిశ్రమలో హాలీవుడ్ చిత్రాలదే హవా అని సినీ పండితులంటున్నారు. ఇటీవల తెరపైకి వచ్చిన ది జంగిల్‌బుక్, కంజూరింగ్-2 చిత్రాలు ఇక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, కంజూరింగ్, కంజూరింగ్-2 వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్స్ బ్రదర్స్ తాజా చిత్రం లైట్స్ అవుట్. హారర్, థ్రిల్లర్ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రాన్ని డేవిడ్.ఎఫ్.శాండ్‌బెర్గ్ తెరకెక్కించారు. చిత్ర కథ విషయానికి వస్తే చిన్న తనంలోనే భయాందోళనలతో ఇల్లు విడిచి వెళ్లిపోయిన ఒక యువతి పెద్ద అయిన తరువాత తనకు ఎదురైన సమస్యలే తన తమ్ముడికి ఏర్పడతాయని తెలిసి ఎలాగైనా ఆ సమస్య నుంచి తన తమ్ముడిని కాపాడుకోవాలని ప్రయతిస్తుంది. అయితే ఈ సమస్యలకు కారణం తన తల్లి శరీరంలో ప్రవేశించిన ఒక ఆత్మనేనని తెలియడంతో తను ఏమి చేసింది? చివరకు వారు రక్షించబడ్డారా? లేదా? ఇలాంటి పలు భయబ్రాంతులకు గురిచేసే సన్నివేశాల సమాహారమే లైట్స్ అవుట్ చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపారు. ఇది పూర్తిగా చీకటిలో జరిగే భయోత్పాదక సన్నివేశాలతో కూడిన చిత్రం అని పేర్కొన్నారు. చిత్రాన్ని త్వరలో తమిళం, ఆంగ్గ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. -
ఆ చావుల వెనక మర్మం ఏమిటి?
హాలీవుడ్ థ్రిల్లర్/ ది కాలింగ్ (2014) పోలీస్ స్టేషన్లో కొన్ని మృతదేహాల ఫొటోలు వేలాడుతున్నాయి. ప్రతి చావులో ఒక భయం. ప్రతి ఆర్తనాదంలో ఓ అర్థం. ముఖాలు వికృతంగా మారిపోయి ఉన్నాయి. తెరుచుకున్న నోళ్లు చిత్రవిచిత్రంగా వంకరలు తిరిగి ఉన్నాయి. చనిపోయినవారందరూ దాదాపు వయసు మళ్లినవాళ్లే. అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్లే. అంత దయాదాక్షిణ్యం లేకుండా చంపుతున్న ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? చనిపోయినవారి ముఖాల్లోని ఆ విచిత్ర భావాలకు అర్థమేంటి? పేరుకి ఇంగ్లిష్ భాష ఒకటే అయినా, దేశ దేశానికి సాహిత్యపు అభిరుచులు వేరు. అమెరికా, బ్రిటన్ దేశాల్లో రకరకాల అంశాల మీద కథలు, నవలలు వస్తుంటాయి. కెనడా సాహిత్యంలో క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్లకు పెద్ద పీట వేస్తుంటారు. 1999లో ‘ది కాలింగ్’ అనే నవల కెనడాలో, నార్త్ అమెరికాలో, యు.కె.లో విడుదలైంది. రచయిత పేరు ‘ఇంగర్ యాష్ వూల్ఫ్’. అయితే అది ఆ రచయిత కలం పేరు. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఆ నవల అమ్మకాల్లో సంచలనం సృష్టించింది. పబ్లిషర్లు కూడా ఓ ప్రముఖ రచయిత కలం పేరుతో ఈ నవల రాశాడని ప్రచారం చేయడంతో మార్కెట్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ముసలి కాన్సర్ పేషెంట్‌ని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఓ సీరియల్ కిల్లర్, అతణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నం చేసే ఓ లేడీ పోలీసాఫీసర్ మధ్య సాగే కథ ఈ నవల. ఆ రచయిత అసలు పేరు మైఖేల్ రెడ్‌హిల్. ఓ ప్రముఖ పత్రికా సంపాదకుడు. కారణాలు ఏమైనా కానీ ‘ఇంగర్ యాష్ వూల్ఫ్’ కలం పేరుతో 2008తో రచనలు ప్రారంభించినా రెడ్‌హిల్ 2012 వరకూ తన ఐడెంటిటీ బయటపెట్టలేదు. ఆ కలం పేరుతో అదే డిటెక్టివ్ క్యారెక్టర్‌తో వరుసగా నాలుగు నవలలు రాశాడు. 2008లో రాసిన ఈ నవల 2012లో వెర్టికల్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థ దృష్టిలో పడింది. ఏడాదికి 24 సినిమాలు రిలీజ్ చేయాలని తహతహలాడిన ఆ నిర్మాణ సంస్థ ‘ది కాలింగ్’ సినిమాని తెరకెక్కించడానికి ప్రయత్నించింది. దర్శకుడు జేసన్ స్టోన్‌కి ఇది తొలి చిత్రం. కథ విషయానికొస్తే - ఇన్స్పెక్టర్ హెజెల్ మిక్లిఫ్ ఓ చిన్న పట్టణంలోని లేడీ పోలీసాఫీసర్. ఓ ముసలావిడని ఎవరో చంపేశారని కబురు రావడంతో ఆ ఇంటికెళ్తుంది. ఆ వృద్ధురాలి ముఖాన్ని పక్కకి విరిచి మరీ చంపారు. మరొకతన్ని అయితే చంపేసి, కుక్కలకి ఆహారంగా పడేశారు. అతని ముఖమూ అంతే. బాధతో అరుస్తుంటే, మెడ విరిచేసినట్లుగా ఉంది. ఇలా ప్రతీ శవం... విచిత్రమైన, వికృతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో! అయితే వాటి వెనక ఉన్న అర్థం వేరు. ఆ వికృతమైన ముఖాలు కలిపితే ఏర్పడ్డ పదం లిబెరా (ఔఐఆఉఖఅ). అదో లాటిన్ పదం. క్రైస్తవ మత సంప్రదాయాల్లో ఆ పదానికి ఓ పవిత్రత ఉంది. హెజెల్ ఈ లాటిన్ పదం, దాని వెనక ఉన్న కారణం తెలుసుకోవడానికి ఓ చర్చి ఫాదర్‌ని కలుస్తుంది. చనిపోయినవారి మృతదేహాలు ఖననం చేసే ముందు, వారి ఆత్మలకి శాంతి కలగాలని, భయంతో వణుకుతున్న వారి తప్పులని క్షమించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ తోటి క్రైస్తవులు ఆలపించే గీతమే ‘లిబెరా మీ’. ఆ సీరియల్ కిల్లర్ ఈ మాట ఎందుకు వాడాడు? ఈ హత్యల వెనక అతని ఆంతర్యం ఏమిటి? ఒక్కో ముఖంలో భావం ఒక్కో ఇంగ్లిష్ అక్షరాన్ని సూచిస్తోంది. ఆ 12 మంది ముఖాల్లోని భావాలు కలిపితే, 12 అక్షరాల పదం ఏర్పడుతుంది. రిసరెక్షన్ అంటే ‘పునరుత్థానం’ అని అర్థం. గుడ్ ఫ్రైడే నాడు శిలువ వేయబడ్డ జీసస్ ఆదివారం ఈస్టర్ రోజున పునరుత్థానం చెందారు. 12 మంది ఆత్మత్యాగం చేయడం వల్ల జీసస్ పునరుత్థానం సంభవించిందని ఆ కిల్లర్ భావిస్తున్నట్లు చర్చి ఫాదర్ చెప్పాడు. ఈ 12 మంది చనిపోవడం వల్ల ఎవరు తిరిగి బతుకుతారు? ఆ సీరియల్ కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఆ ఊరిలో కొత్తగా ఓ వ్యక్తి ఎంటరయ్యాడు. అతని పేరు సైమన్. అతనే హంతకుడని, అతని అసలు పేరు పీటర్ అని పోలీసాఫీసర్ హెజెల్ తెలుసుకుంటుంది. ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తన సోదరుణ్ణి తిరిగి బతికించాలనే ప్రయత్నంలో ఈ 12 హత్యలకి పాల్పడ్డాడనే విషయం హెజెల్ తెలుసుకుంటుంది. సోదరుడి శవాన్ని తన వెహికల్లో ఉంచుకుని తిరుగుతుంటాడు పీటర్. చివరికి చర్చి ఫాదర్‌ని కూడా చంపడానికొస్తాడు. ఫాదర్ ఆత్మత్యాగానికి సిద్ధపడ్డా, తాను చేస్తున్నది సరైనదా కాదా అనే సందేహంలో పడతాడు. పోలీసాఫీసర్ తెలుసుకుని వచ్చేటప్పటికి చర్చి ఫాదర్ చనిపోతాడు. ఫాదర్ చావుతో మొత్తం 11 మంది చనిపోయారు. ఇక 12వ వ్యక్తి ఎవరు? పీటర్ ఫైనల్ టార్గెట్ ఎవరో తెలుసుకుంటుంది హెజెల్. అతణ్ణి కాపాడటానికి ఏర్పాట్లు చేసి, ఇంటికొచ్చేటప్పటికి పీటర్ ఆమె కోసం ఎదురుచూస్తుంటాడు. హెజెల్కి మత్తుమందులు ఇచ్చి, తన సోదరుడి కోసం చనిపొమ్మని అడుగుతాడు పీటర్. హెజెల్ విషం తాగడానికి సిద్ధపడి, చివరి నిమిషంలో మనసు మార్చుకుంటుంది. పీటర్ తన 12వ వ్యక్తిగా తనని తానే చంపుకుంటాడు. పీటర్ సోదరుడి శవం ఉన్న వెహికల్ మీద పోలీసులు రెయిడ్ చేస్తే, అది ఖాళీగా ఉంటుంది. నిజంగానే అతను తిరిగి బతికాడా అనే ప్రశ్నార్థకంతో సినిమా పూర్తవుతుంది. - తోట ప్రసాద్ క్రైస్తవ మతం నేపథ్యంలో హాలీవుడ్లో కొన్ని థ్రిల్లర్లు వచ్చాయి. వాటిలో 1995లో వచ్చిన ‘సెవెన్’ సినిమా ఒకటి. బైబిల్లో సెవెన్ సిన్స్ (ఏడు తప్పులు)కి ఏయే శిక్షలుంటాయో పేర్కొనడం జరిగింది. ఓ ఉన్మాది దాని ప్రకారం శిక్షలు విధించి, చంపడమే ‘సెవెన్’ సినిమా కథ. ప్రసిద్ధ దర్శకుడు శంకర్ హీరో విక్రమ్‌తో తీసిన ‘అపరిచితుడు’ సినిమాలో ‘గరుడ పురాణం’ ప్రకారం పాపులకు శిక్ష విధించడం వెనక ‘సెవెన్’ ప్రభావం ఉంది. ‘సెవెన్’ సినిమాలో నేరస్థుడికి శిక్ష విధించిన తర్వాత గోడమీద బైబిల్లోని వాక్యాలు రాస్తుంటాడు హంతకుడు. అలాగే ‘అపరిచితుడు’ చంపాక, ఆ శవాల దగ్గర ‘గరుడ పురాణం’లోని శిక్షలు రాసి ఉంటాయి. -
ఈ వారం youtube హిట్స్
10 క్లోవర్ఫీల్డ్ లేన్ : థ్రిల్లర్ నిడివి : 2 ని. 43 సె. హిట్స్ : 45,01,742 పిక్చర్ విడుదల కావడానికి ఏడాది సమయం ఉండగానే రిలీజ్ అయిన ‘ట్రైలర్’ ఇది. చిత్రం పేరు ‘10 క్లోవర్ఫీల్డ్ లేన్’. ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. తనకు తెలియకుండా ఎలాగో ఓ అండర్‌గ్రౌండ్ సెల్లార్లోకి వచ్చి పడుతుంది. అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఆ క్రమంలో జరిగే ఉత్కంఠభరితమైన ఘటనలను, సన్నివేశాలను ట్రైలర్లో శాంపిల్‌గా చూడొచ్చు. 2008లో వచ్చిన మాన్స్టర్ హారర్ ఫిల్మ్ ‘క్లోవర్ఫీల్డ్’తో ఈ సినిమాకు ‘రక్త సంబంధం’ అందని నిర్మాత జె.జె.అబ్రామ్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కెన్ సెలబ్స్ పాస్? స్పెల్లింగ్ టెస్ట్ నిడివి : 2 ని. 11 సె. హిట్స్ : 8,51,807 ‘బజ్‌ఫీడ్’ అనేది అమెరికన్ ఇంటర్నెట్ మీడియా కంపెనీ. సామాజిక పరిణామాలను, వినోదాన్ని మేళవించి కొత్త కొత్త కార్యక్రమాలను రూపొందిస్తుంటుంది. లేటెస్టుగా బజ్‌ఫీడ్ అప్లోడ్ చేసిన వీడియో.. ‘కెన్ సెలబ్స్ పాస్ ఎ ఫిఫ్త్ గ్రేడ్ స్పెల్లింగ్ టెస్ట్?’. ఇదేంటో ఇప్పటికే మీకు అర్థమైయుంటుంది. ప్రముఖులకు ఇంగ్లీషు పదాల స్పెల్లింగులపై ఎంత పట్టు ఉందో తెలుసుకునేందుకు బజ్‌ఫీడ్ చేసిన ప్రయత్నం ఇది. ఒక ఆటలా సాగిన ఈ వీడియోలో స్పెల్లింగ్ కరెక్టుగా చెప్పిన, చెప్పలేకపోయిన ప్రముఖుల హావభావాలు, ఉద్వేగాలు సరదాగా ఉన్నాయి. లైఫ్హ్యాక్ : కిడ్స్ బూట్స్ నిడివి : 15 సె. హిట్స్ : 1,55,856 ‘లైఫ్హ్యాక్’ అంటే జీవన నైపుణ్యం. రోజువారీ పనులను కష్టపడకుండా అవలీలగా, ఒడుపుగా చేయగల టెక్నిక్. ఈ వీడియోలో ఒక తండ్రి తన చిన్న కూతురు తొడుక్కుని ఉన్న బూట్లను ఇంట్లోకి రాగానే ఎంత తేలిగ్గా, ఫన్నీగా తొలగించాడో చూడవచ్చు. ‘మంచు కురిసే రుతువులో కాలి బూట్లను తియ్యడం ఎంతో కష్టం. అయితే నేను నా కూతురి బూట్లను కనీసం నా చేతులు కూడా ఉపయోగించకుండా తీసి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాను చూడండి’ అంటూ చిన్న లైఫ్హ్యాక్తో ఆ తండ్రి మనల్ని ఆశ్చర్యపరుస్తాడు గిలిగింతలు పెడతాడు. మీరూ తప్పక చూడండి.