
తమిళ స్టార్ నటుడు సిద్ధార్థ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం చిత్తా. ఈ మూవీకి ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇటకీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సిద్ధార్థ్ నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నిమిషా నటించగా.. అంజలీ నాయర్ ముఖ్యపాత్రలో కనిపించనుంది. దీపు నినన్, థామస్, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. తమిళంలో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.
ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్, దర్శకుడు అరుణ్‌కుమార్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇది కిడ్నాప్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చాలా సహజత్వంగా అదే సమయంలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయని తెలిపారు. తాను 25 ఏళ్లుగా ఇలాంటి చిత్రం కోసమే ఎదురు చూశానన్నారు. ఇది తనకు కమ్ బ్యాక్ చిత్రం అవుతుందన్నారు. బాబాయికి.. చిన్నారికి మధ్య జరిగే కథా చిత్రంగా చిత్తా ఉంటుందన్నారు. దర్శకుడు అద్భుతంగా చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని సిద్ధార్థ్ అన్నారు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. కాగా.. ఈ నెల 28వ తేదీన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment