
ఓటీటీలోకి సరికొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. సముద్రంలో షిప్పులను హైజాక్ చేసే నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. రెండేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభించిన లూటేరే వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం రెండు ఎపిసోడ్లను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ హైజాక్ థ్రిల్లర్ సిరీస్ లూటేరే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రధానంగా షిప్ హైజాక్ నేపథ్యంలోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. సోమాలియా సముద్రపు దొంగల చుట్టూ తిరిగే ఈ సిరీస్‌పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వచ్చే వారంలో మిగిలిన ఎపిసోడ్లను కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
లూటేరే వెబ్ సిరీస్‌ను ప్రముఖ డైరెక్టర్ హన్సల్ మెహతా క్రియేట్ చేయగా.. ఆయన తనయుడు జై మెహతా డైరెక్షన్‌లో తెరకెక్కించారు . సోమాలియా పైరేట్స్ ఓ షిప్‌ను హైజాక్ చేయడం.. దానిని విడిపించడానికి జరిగే ప్రయత్నాలు చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, ప్రీతికా చావ్లా, చందన్ రాయ్ సన్యాల్ ప్రధాన పాత్రలు పోషించారు.
Time to drop the anchor! ⚓🚢#HotstarSpecials #Lootere is now streaming.
Watch now: https://t.co/KnAtofkAqW pic.twitter.com/NSqwm5GUnG— Disney+ Hotstar (@DisneyPlusHS) March 21, 2024