hijack
-
నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై తీవ్ర అభ్యంతరం.. ఇకపై తప్పు జరగదన్న మేకర్స్!
ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సరికొత్త వెబ్ సిరీస్ 'ఐసీ 814: కాందహార్ హైజాక్'. ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సిరీస్‌లోని కొన్ని సన్నివేశాలపై పెద్దఎత్తున వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే సిరీస్‌పై మండిపడ్డ కేంద్రం వివరణ ఇవ్వాలంటూ మేకర్స్‌కు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ వివాదంపై నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ కేంద్ర, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారుల ముందు హాజరయ్యారు.ఇకపై కంటెంట్ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కంటెంట్‌ను ప్రసారం చేస్తామని హామీ ఇచ్చారు. చిన్నారులకు సంబంధించిన కంటెంట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని ఓటీటీ సంస్థ అంగీకరించింది.అసలేంటీ వివాదం..1999లో భారత విమానాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసిన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్‌లో హైజాకర్ల పేర్లను శంకర్, భోలా అని మార్చి చూపించడమే కాకుండా.. వారిని మానవత్వమున్న వ్యక్తులుగా చిత్రీకరించారు. దీంతో హైజాకర్లు తమ మత గుర్తింపు దాచిపెట్టేందుకే మారుపేర్లు పెట్టుకున్నారని.. ఈ సిరీస్ రూపొందించిన వారు కావాలనే ఆ పేర్లనే క్యారెక్టర్స్‌కు పెట్టారని భాజపా ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. ఈ క్రమంలోనే కేంద్రం దీన్ని తీవ్రంగా పరిగణించి సమన్లు జారీ చేసింది. -
ఓటీటీలో హైజాక్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి సరికొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. సముద్రంలో షిప్పులను హైజాక్ చేసే నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. రెండేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభించిన లూటేరే వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం రెండు ఎపిసోడ్లను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ హైజాక్ థ్రిల్లర్ సిరీస్ లూటేరే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రధానంగా షిప్ హైజాక్ నేపథ్యంలోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. సోమాలియా సముద్రపు దొంగల చుట్టూ తిరిగే ఈ సిరీస్‌పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వచ్చే వారంలో మిగిలిన ఎపిసోడ్లను కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. లూటేరే వెబ్ సిరీస్‌ను ప్రముఖ డైరెక్టర్ హన్సల్ మెహతా క్రియేట్ చేయగా.. ఆయన తనయుడు జై మెహతా డైరెక్షన్లో తెరకెక్కించారు . సోమాలియా పైరేట్స్ ఓ షిప్‌ను హైజాక్ చేయడం.. దానిని విడిపించడానికి జరిగే ప్రయత్నాలు చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, ప్రీతికా చావ్లా, చందన్ రాయ్ సన్యాల్ ప్రధాన పాత్రలు పోషించారు. Time to drop the anchor! ⚓🚢#HotstarSpecials #Lootere is now streaming. Watch now: https://t.co/KnAtofkAqW pic.twitter.com/NSqwm5GUnG — Disney+ Hotstar (@DisneyPlusHS) March 21, 2024 -
తోకముడిచిన సోమాలియా పైరేట్లు
న్యూఢిల్లీ: భారతీయ సిబ్బందితో కూడిన లైబీరియా సరుకు నౌకను హైజాక్ చేసేందుకు సోమాలియా సముద్రపు దొంగలు చేసిన ప్రయత్నాన్ని భారత నేవీ కమాండోలు చాకచక్యంగా తిప్పికొట్టారు. అందులోని 15 మంది భారతీయ సిబ్బంది సహా మొత్తం 21 మందిని కాపాడారు. ఎంవీ లిలా నార్ఫోక్ అనే ఓడను ఈ నెల 4వ తేదీన అరేబియా సముద్ర జలాల్లో ఉండగా సాయుధ దుండగులు హస్తగతం చేసుకున్నారు. ఆపదలో ఉన్నామని, ఆదుకోవాలంటూ ఓడ సిబ్బంది యునైటెడ్ కింగ్డమ్ మారిటైం ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీవో)పోర్టల్‌కు సమాచారం అందించారు. అందులో 15 మంది వరకు భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలియడంతో భారత నేవీ అప్రమత్తమైంది. ఆ ప్రాంతానికి ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకను హుటాహుటిన పంపించింది. పైరేట్లను లొంగిపోవాలని హెచ్చరికలు చేస్తూ ఎంవీ లిలా నార్ఫోక్ను శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఐఎన్ఎస్ చెన్నై అడ్డగించింది. సుశిక్షితులైన కమాండోలతో కూడిన అత్యాధునిక గస్తీ హెలికాప్టర్ పి–81ను సైతం అధికారులు సిద్ధంగా ఉంచారు. నౌకలోని పరిస్థితులను దగ్గర్నుంచి అంచనా వేసేందుకు అత్యాధునిక ఎంక్యూ9బీ ప్రిడేటర్ డ్రోన్‌ను రంగంలోకి దించారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పైఅధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే కమాండోలు ఎంవీ లిలా నార్‌ఫోక్‌లోకి మెరుపు వేగంతో ప్రవేశించారు. వారిని చూసి పైరేట్లు తోకముడిచారు. గస్తీ సిబ్బంది ఇచ్చిన గట్టి హెచ్చరికలతోనే వారు భయపడి, నౌకను హైజాక్ చేసే ప్రయత్నాన్ని విరమించుకుని, పలాయన మంత్రం పఠించారని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ చెప్పారు. నౌకలో విద్యుత్ వ్యవస్థను, చోదక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. అన్నీ పూర్తయ్యాక నౌక ప్రయాణాన్ని మళ్లీ కొనసాగించనుందన్నారు. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకల స్వేచ్ఛా యానానికి అనువైన వాతావరణం కల్పించేందుకు ఇతర దేశాల భాగస్వామ్యంతో పనిచేసేందుకు నేవీ కట్టుబడి ఉంటుందని వివరించారు. సముద్ర దొంగల బారి నుంచి తమ నౌకను రక్షించిన భారత నేవీకి లిలా గ్లోబల్ సీఈవో స్టీవ్ కుంజెర్ ధన్యవాదాలు తెలిపారు. ఇలా ఉండగా, ఇజ్రాయెల్–హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం నౌకా రవాణాపైనా పడింది. 21 మంది భారతీయ సిబ్బందితో కూడిన లైబీరియాకు చెందిన ఎంవీ చెమ్ ప్లుటో నౌకపై డిసెంబర్ 23న భారత పశ్చిమ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. భారత్ వైపు చమురుతో వస్తున్న మరో నౌకపై ఎర్ర సముద్రంలో డ్రోన్ దాడి జరిగింది. మాల్టాకు చెందిన ఎంవీ రుయెన్ అనే నౌకను పైరేట్లు డిసెంబర్ 14న హైజాక్ చేశారు. -
అరేబియా సముద్రంలో నౌక హైజాక్ !
న్యూఢిల్లీ: మాల్టా దేశానికి చెందిన సరుకు రవాణా నౌక ఒకటి అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైంది. ఈ ఘటన జరిగినపుడు నౌకలో 18 మంది సిబ్బంది ఉన్నారు. హైజాక్ విషయం తెల్సుకున్న భారత నావికాదళాలు వెంటనే స్పందించి ఆ వైపుగా పయనమయ్యాయి. సముద్రపు దొంగలు ఆ నౌకను తమ అ«దీనంలోకి తీసుకుని నడుపుతుండగా భారత యుద్ధనౌక దానిని విజయవంతంగా అడ్డుకుంది. అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు భారత నావికాదళం శనివారం తెలిపింది. ప్రస్తుతం నౌక సోమాలియా తీరం వైపుగా వెళ్తోంది. సంబంధిత వివరాలను ఇండియన్ నేవీ వెల్లడించింది. అరేబియా సముద్ర జలాల్లో గురువారం ‘ఎంవీ రుయెన్’ నౌకను ఆరుగురు సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. పైరేట్లు నౌకలోకి చొరబడుతుండగానే నౌకలోని సిబ్బంది ఆ విషయాన్ని బ్రిటన్ సముద్ర రవాణా పోర్టల్‌కు అత్యవసర సందేశం(మేడే)గా తెలియజేశారు. హైజాక్ విషయం తెల్సిన వెంటనే భారత నావికా దళాలు అప్రమత్తమయ్యాయి. అదే ప్రాంతంలో గస్తీ కాస్తున్న భారత గస్తీ విమానం, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వద్ద విధుల్లో ఉన్న భారత నావికాదళ యాంటీ–పైరసీ పెట్రోల్ యుద్ధనౌకలు రంగంలోకి దిగాయి. హైజాక్‌కు గురైన నౌక ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అటుగా దూసుకెళ్లి ఆ నౌకను శనివారం ఉదయం విజయవంతంగా అడ్డుకున్నాయి. ‘ రవాణా నౌకల సురక్షిత ప్రయాణానికి భారత నావికాదళం కట్టుబడి ఉంది. అంతర్జాతీయ భాగస్వాములు, మిత్ర దేశాలకు సాయపడటంతో ఎప్పుడూ ముందుంటుంది’ అని భారత నేవీ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైజాక్ కలకలం
శంషాబాద్: ఓ తప్పుడు ఈ మెయిల్ సందేశంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. మరి కొద్ది నిమిషాల్లో టేకాఫ్ తీసుకునే విమానం సైతం రద్దు కావడంతో ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు.. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి 8 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–951 విమానం 111 మంది ప్రయాణికులతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైంది. మరికాసేపట్లో టేకాఫ్ తీసుకునే సమయంలో ఎయిర్‌పోర్టుకు ఈ మెయిల్లో ఓ సందేశం వచ్చింది. అందులో బాదినేని తిరుపతయ్య అనే వ్యక్తి ఐఎస్ఐకు ఇన్ఫార్మర్గా ఉన్నాడని అతడు కాసేపట్లో విమానాన్ని హైజాక్ చేయనున్నాడని సాధ్యమైతే వెంటనే అతడిని ఆపాలని పేర్కొన్నారు. అంతేకాకుండా అతడికి సహకరించే వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతాధికారులు వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందంతో విమానంలోకి వెళ్లి ప్రయాణికులందరి తనిఖీ చేశారు. ప్రయాణికులను అందులోంచి దించి వేసి, విమానాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. మెయిల్లో పేర్కొన్న తిరుపతయ్యతో పాటు వినోద్‌కుమార్, రాకేష్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురు నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. దుబాయ్ మీదుగా వీరు ఇరాక్ వెళుతున్నట్లు సమాచారం. తిరుపతయ్యతో సన్నిహితంగా ఉండే ఓ మహిళే అతడి ప్రయాణాన్ని అడ్డుకునేందుకు మెయిల్ పంపినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద మెయిల్ ఉన్న సమాచారం నిజం కాదని నిర్ధారించుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది...? ఎవరు పంపారు..? అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. మెయిల్ పంపిన వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ రాంచందర్‌రావు తెలిపారు. -
సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్..
బెంగళూరు: ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి టమాటాను దోపిడీ చేసిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. పంటపై ఉండగానే రాత్రికి రాత్రే.. పొలంలోనే టమాటాలను మాయం చేసిన సందర్భాలు కూడా ఎదురయ్యాయి. తాజాగా బెంగళూరులో సినిమాని సీన్‌ని తలపించే ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన దంపతులు పక్కా స్కెచ్‌తో యాక్సిడెంట్ కట్టుకథ అల్లి.. రైతు దగ్గర నుంచి రూ. 2.5 లక్షల విలువ చేసే 2.5 టన్నుల టమాటా లారీని హైజాక్ చేశారు. చిత్రదుర్గ జిల్లాలోని ఉరయూరుకు చెందిన వ్యక్తి మల్లేష్. టమాటా లారీ లోడ్‌ను జులై 8న కొలార్‌కు తీసుకువెళ్తున్నాడు. లారీ బెంగళూరుకు రాగానే ఓ దంపతులు లారీని అడ్డగించారు. లారీ తమ కారుకు తాకిందని కట్టుకథ సృష్టించి డబ్బులు డిమాండ్ చేశారు. మల్లేష్ అందుకు నిరాకరించాడు. దీంతో లారీ నుంచి మల్లేష్‌ను బయటుకు లాగి లారీతో హుడాయించారు. చేసేదేమీ లేక మల్లేష్ స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. లారీ వెళ్లిన మార్గాన్ని ట్రాక్ చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితులను వెల్లూరుకు చెందిన దంపతులు భాస్కర్(28), సింధుజా(26)గా గుర్తించి అరెస్టు చేశారు. వీరు ఓ దారిదోపిడీ దొంగల ముఠాలో సభ్యులుగా కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. క్షణాల్లోనే.. -
గూడ్స్ రైలుని హైజాక్ చేసిన మావోయిస్టులు
సాక్షి, విశాఖపట్నం: దంతెవాడ–కిరండూల్ సెక్షన్లో వెళ్తోన్న కేవీఎస్ 11 నంబర్ గూడ్స్ రైలుని మావోయిస్టులు ఆదివారం సాయంత్రం 10 నిమిషాల పాటు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. బచెలి–భాన్సీ బ్లాక్ సెక్షన్ 433 కి.మీ సమీపంలో గూడ్స్ వెళ్లే ట్రాక్ పైకి 50 మంది మావోయిస్టులు చేరుకున్నారు. ట్రాక్‌కి అడ్డంగా నిలబడి రెడ్ క్లాత్ చూపుతూ..ట్రైన్‌ని నిలిపివేయాలని ఆదేశించారు. అప్రమత్తమైన సిబ్బంది.. ఎమర్జెన్సీ బ్రేక్ వేసి. రైలుని ఆపారు. ట్రైన్‌లోకి మారణాయుధాలతో మావోయిస్టులు ప్రవేశించి డ్రైవర్, ఇతర సిబ్బంది, వెనుక భాగంలో ఉండే గార్డ్ నుంచి వాకీ టాకీలు తీసుకున్నారు. మిగిలిన కొందరు ట్రాక్‌పై కాపలా కాయగా..కొంతమంది లోకోమోటివ్‌కి బ్యానర్ కట్టారు. అనంతరం కొన్ని కరపత్రాల్ని గూడ్స్ రైలు సిబ్బందికి ఇచ్చి దంతెవాడ వరకూ వెళ్లి అక్కడ పంపిణీ చేయాలని ఆదేశించారు. 10 నిమిషాల తర్వాత రైలు దిగి మావోయిస్టులు అడవిలోకి వెళ్లడంతో అక్కడి నుంచి రైలు బయలుదేరి భన్సీకి చేరుకుంది. వాల్తేరు డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి ఆ సెక్షన్ పరిధిలో మిగిలిన రైళ్ల రాకపోకల్ని నిలిపివేయాలని ఆదేశించారు. కోరస్ కమాండో బృందాన్ని ఆయా ప్రాంతాలకు పంపించారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామని వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టి..రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరిస్తామని డీఆర్ఎం తెలిపారు. కాగా, సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు 18వ క్రాంతి కారీ వార్షికోత్సవాన్ని దేశమంతా నిర్వహిస్తున్నామని, దాన్ని విజయవంతం చేయాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. -
Visakhapatnam: ఎయిర్ పోర్టులో ఉత్కంఠ.. విమానం హైజాక్ వేళ..
సాక్షి, గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో యాంటీ–హైజాక్ మాక్ డ్రిల్ ఆద్యంతం ఉత్కంఠ∙రేకెత్తించింది. గురువారం ఎయిర్‌పోర్టు ఐఎన్ఎస్ డేగాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. విమానం హైజాక్‌కు గురి కాకుండా ఏ విధంగా అడ్డుకోవాలో ఇక్కడ ప్రదర్శించారు. తమ సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు ఈ ప్రక్రియ దోహద పడుతుందని అధికారులు తెలిపారు. ఈ మాక్ఎక్సర్సైజ్ మెరైన్ కమాండోలు (మార్కోస్), సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో నిర్వహించాయి. క్షతగాత్రుల తరలింపు భారత నౌకాదళ డోర్నియర్ ఉపయోగించి రూపొందించిన మాక్ హైజాక్ ఆధారంగా కార్యక్రమం ప్రదర్శించారు. ఐఎన్ఎస్ డేగా కమాండింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏరోడ్రోమ్ కమిటీ స్టాండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీఎస్) ప్రకారం మాక్ఎక్సర్సైజ్ కార్యక్రమం చేపట్టారు. డేగా ఏటీసీ, క్విక్ రియాక్షన్ టీమ్ (క్యూఆర్టీ), మెరైన్ కమాండో, సీఐఎస్ఎఫ్, ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం త్వరతిగతిన స్పందించే తీరును నేషనల్ సెక్యూరిటీ గార్డు, ఎస్‌వోపీఎస్ అధికారులు పరిశీలించారు. భవిష్యత్తులో సంభవించే ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనే నైపుణ్యం సామర్థ్యం కలిగి ఉన్నారని నిర్ధారించారు. హైజాక్‌ను ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్న సైనికులు -
‘నా భార్యతో గొడవపడ్డాను.. పీఎంతో మాట్లాడాలి’
ఢాకా : గన్‌తో కాక్‌పిట్‌లోకి ప్రవేశించి.. విమనాన్ని హై జాక్ చేసేందుకే ప్రయత్నించిన వ్యక్తిపై కాల్పులు జరిపి ప్రయాణికులను రక్షించారు భద్రతాసిబ్బంది. బంగ్లాదేశ్‌లో ఆదివారం జరిగింది ఈ సంఘటన. వివరాలు.. 148 మంది ప్రయాణికులతో ఢాకా నుంచి దుబాయ్ వెళ్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్ విమానాన్ని మార్గమధ్యంలో దారి మళ్లించేందుకు ప్రయత్నించాడు హైజాకర్. ఛత్రోగ్రామ్ విమానాశ్రయం నుంచి విమానం బయల్దేరిన కాసేపటికే ప్రయాణికుల్లోని ఓ వ్యక్తి తన వద్ద గన్, పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరిస్తూ కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. భార్యతో తనకు గొడవలున్నాయని, ఈ విషయమై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో తనను వెంటనే మాట్లాడించాలంటూ నిందితుడు విమాన సిబ్బందిని డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని ఛత్రోగ్రామ్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం ఉన్నతాధికారులు హైజాకర్‌తో చర్చలు జరిపి.. ప్రయాణికులను విమానం నుంచి దింపేయాలని అడగగా అందుకు హైజాకర్ ఒప్పుకున్నాడు. దాంతో వారిని అత్యవసర ద్వారం గుండా బయటకు తీసుకొచ్చారు. అనంతరం కమాండోలు రంగ ప్రవేశం చేసి లొంగిపోవాలని హైజాకర్‌ను హెచ్చరించారు. కానీ అతడు నిరాకరించడంతో కాల్పలు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హైజాకర్ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని బంగ్లాదేశ్‌కు చెందిన మహదిగా గుర్తించారు అధికారులు. ఈ విషయం గురించి దర్యాప్తు చేసిన అధికారులు ఈ ఘటన వెనుక ఎలాంటి ఉగ్రకోణం లేదని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే నిందితుడు విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. భార్యతో మనస్పర్థల కారణంగానే సదరు వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోందని అధికారులు తెలిపారు. అయితే అతడి వద్దకు పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి.. వాటిని విమానంలోకి ఎలా తీసుకొచ్చాడన్నది మాత్రం తెలియరాలేదని తెలిపారు. నిందితుడు మానసిక స్థితి సరిగ్గా లేదని చర్చల సమయంలో తాము గుర్తించినట్లు అధికారులు తెలిపారు. -
చైనాలో బస్సు ప్రమాదం
-
‘నో ఫ్లై లిస్ట్’లో బంగారం వ్యాపారి
న్యూఢిల్లీ: ప్రియురాలిని ఉద్యోగం మాన్పించి.. తనతో పాటు తీసుకెళ్లేందుకు గతేడాది అక్టోబర్‌లో జెట్ ఎయిర్ వేస్ విమానంలో హైజాక్ డ్రామా ఆడిన బంగారం వ్యాపారి బిర్జూ కిషోర్ సల్లా(37)ను విమానాలు ఎక్కకుండా నిషేధిస్తూ ( నో ఫ్లై లిస్ట్) డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో చేరిన తొలి సాధారణ పౌరుడిగా కిషోర్ సల్లా రికార్డు సృష్టించాడు. కానీ నిషేధం ఎంతకాలం అమల్లో ఉంటుందో డీజీసీఏ స్పష్టత ఇవ్వలేదు. అప్పటి విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సూచన మేరకు ఆయన్ను నిషేధిత జాబితాలో చేర్చామని సంస్థ పేర్కొంది. గతేడాది అక్టోబర్ 30న ముంబై నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో హైజాకర్లు ఉన్నారు..ఢిల్లీలో విమానాన్ని ల్యాండ్ చేస్తే పేల్చేస్తామని కిషోర్ టాయిలెట్లో లెటర్ పెట్టాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌లో ల్యాండ్ చేశారు. -
హైజాక్ అన్నాడు.. ఇంక విమానం ఎక్కలేడు!
ముంబై : విమానం హైజాక్ అయిందంటూ.. తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేసిన వ్యక్తిపై జెట్ ఎయిర్వేస్ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. గతేడాది అక్టోబర్ 30న ముంబై-ఢిల్లీ జెట్ ఎయిర్వేస్లో ముంబైకి చెందిన అభరణాల వ్యాపారి బిర్జూ కిశోర్ సల్లా ప్రయాణించాడు. ఈ సందర్భంగా అతడు భద్రత నిబంధనలు ఉల్లఘించి.. విమానం హైజాక్ అయిందంటూ తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో జెట్ అధికారులు అతనిపై చర్యలకు ఉపక్రమించారు. విమానాల్లో దురుసుగా ప్రవర్తించే వారిపై నిషేధం విధించాలనే ఉద్దేశంతో గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నో ఫ్లై లిస్ట్(ఎన్ఎఫ్ఎల్) నిబంధనను తీసుకొచ్చింది. ఎన్ఎఫ్ఎల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ జాబితాలో చేరిన తొలి వ్యక్తి సల్లానే. సల్లా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో టాయిలెట్‌కు వెళ్లి అక్కడ ఓ కాగితాన్ని వదిలేసి వచ్చాడు. అందులో ‘విమానాన్ని హైజాక్ చేశాం. దీనిని పాక్ అక్రమిత కశ్మీర్‌కు తరలించాలి. విమానంలో 12 మంది హైజాకర్లు ఉన్నారు. మీరు ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తాయి. దీనిని తేలికగా తీసుకోవద్దు.. కార్గోలో బాంబులు కూడా ఉన్నాయి. మీరు ఢిల్లీలో ల్యాండ్ చేయాలని చూస్తే విమానాన్ని పేల్చేస్తాం’ అని రాసి ఉంది. దీంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది విమానాన్ని అహ్మాదాబాద్‌కు మళ్లించారు. విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన బాంబ్ స్క్వాడ్ బృందం ఆ కాగితంలో ఉన్నది తప్పుడు సమాచారంగా తేల్చింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన జెట్ ఎయిర్వేస్ అధికారులు సల్లా చేసిన పనిని మూడో లెవల్ తప్పుగా(అతి పెద్దదిగా) నిర్ధారించారు. భద్రత నిబంధనలు ఉల్లఘించిన కారణంగా.. సల్లాపై ఐదేళ్ల పాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించి.. అతన్ని నో ఫ్లై లిస్ట్‌లో చేర్చారు. గతేడాది నవంబర్ నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. -
హైజాకైన భారతీయులకు విముక్తి
న్యూఢిల్లీ : హైజాక్‌కు గురైన వాణిజ్య నౌకలోని 22 మంది భారతీయులకు విముక్తి కలిగిందని విదేశాంగ మంత్రి సుస్మా స్వరాజ్ మంగళవారం తెలిపారు. ఆంగ్లో ఈస్ట్రన్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఓడ ఆయిల్ రవాణా చేస్తుండగా పశ్చిమాఫ్రికా దేశం బెనిన్ సముద్ర తీరం వద్ద హైజాక్‌కు గురైంది. సముద్రపు దొంగలు ఓడలోని నౌకా సిబ్బందిని తమ బందీలుగా చేసుకున్నారు. శుక్రవారం నుంచి ఓడ జాడ తెలియకుండాపోయింది. ఈ విషయం భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు తెలియడంతో ఆమె నైజీరియా, బెనిన్ దేశాల అధికారులకు చెప్పారు. ఈ విషయంలో సహాయం చేయాలని అర్దించారు. అప్రమత్తమైన అక్కడి అధికారులు నౌకా సిబ్బందిని విడిపించడంతో ప్రత్యేక పాత్ర పోషించారు. ఓడలో ఉన్న 13,500 టన్నుల ఆయిల్ కూడా సురక్షితంగా ఉంది. అక్కడి అధికారులు సముద్రపు దొంగలకు డబ్బులేమైనా చెల్లించారా అనేది తెలియాల్సి ఉంది. భారతీయులు విడుదల కావడం పట్ల ఆనందంగా ఉందని ట్విటర్ ద్వారా విదేశాంగ శాఖ మంత్రి సుస్మాస్వరాజ్ తెలిపారు. -
హమ్మయ్యా.. ఆ 22మంది భారతీయులు సేఫ్
సాక్షి, న్యూఢిల్లీ : సముద్రపు దొంగల చెర నుంచి 22 మంది భారతీయులు విడుదలయ్యారు. దీంతో ఆ భారత సెయిలర్ల కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఓడలో ఐదు రోజుల చెర అనంతరం దొంగలు వీరిని విడిచి పెట్టినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ మలిని శంకర్ మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం ఓడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగిస్తున్నట్లు సమాచారం. రూ. 52 కోట్లు విలువైన గ్యాసోలిన్‌ను రవాణా చేస్తున్న భారతీయ ఓడ గత ఐదు రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన విషయం తెలిసిందే. వాయవ్య ఆఫ్రికా తీరంలోని బెనిన్ ఓడరేవు నుంచి బయల్దేరిన ఎంటీ మెరైన్ ఎక్స్‌ప్రెస్ బెనిన్లోని గినియా తీరంలో హైజాక్ అయింది. ఈ ఓడలో 22 మంది భారత సిబ్బంది ఉన్నారు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో గ్యాసోలిన్‌ను చోరి చేసేందుకే షిప్‌ను హైజాక్ చేసివుంటారని అధికారులు భావించారు. ఆచూకీ లేకుండా పోయిన ఓడ కోసం నైజీరియా, బెనిన్ దేశాల సాయంతో భారత్ గాలింపు చర్యలు చేపట్టగా చివరికి సముద్రపు దొంగలు ఓడ సిబ్బందిని విడిచిపెట్టారు. కాగా, గత నెలలో ఇదే ప్రాంతంలో ఓ భారతీయ నౌక హైజాక్‌కు గురైంది. ఏమైనా భారీ మొత్తంలో నగదు చెల్లించిన తర్వాత బంధీలను దొంగల ముఠా విడిచిపెట్టి ఉండొచ్చునని ప్రచారం జరుగుతోంది. -
భారతీయ ఓడ హైజాక్..!
సాక్షి, ముంబై : రూ. 52 కోట్లు విలువైన గ్యాసోలిన్‌ను రవాణా చేస్తున్న భారతీయ నౌక రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయింది. ఈ నౌకలో 22 మంది సైలర్లు ఉన్నారు. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ ఓడరేవు నుంచి బయల్దేరిన ఎంటీ మెరైన్ ఎక్స్‌ప్రెస్ నుంచి 48 గంటలుగా ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఓడ హైజాక్‌కు గురై ఉంటుందని అనుమానిస్తున్నారు. గత నెలలో ఇదే ప్రాంతంలో ఓ భారతీయ నౌక హైజాక్‌కు గురైంది. గ్యాసోలిన్‌ను చోరి చేసేందుకే షిప్‌ను హైజాక్ చేసివుంటారని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఆచూకీ లేకుండా పోయిన నౌక కోసం నైజీరియా, బెనిన్ దేశాల సాయంతో భారత్ గాలింపు చర్యలు చేపట్టింది. -
ఎయిర్‌హోస్టెస్ కోసం హైజాక్ ప్లాన్
అహ్మదాబాద్: జెట్ ఎయిర్వేస్ విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఓ ఎయిర్‌హోస్టెస్‌కు దగ్గరయ్యేందుకు ఏకంగా హైజాక్ కుట్రపన్నాడో ప్రబుద్ధుడు. జెట్ ఎయిర్వేస్ ప్రతిష్టను దెబ్బతీసి ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం పోగొడితే ఆమె కొలువు కోసం తన వద్దకు వస్తుందని వింత వ్యూహం పన్నాడు. అందుకోసం విమానంలో బాంబులు, హైజాకర్లు ఉన్నారంటూ వాష్‌రూమ్‌లో ఓ కాగితం ముక్క ఉంచి అందరినీ హడలెత్తించాడు. గుజరాతీ సంపన్న కుటుంబానికి చెందిన బిర్జూ కిశోర్ సల్లా ముంబైలో నివసిస్తూ వజ్రాభరణాల వ్యాపారం చేస్తుంటాడు. జెట్ ఎయిర్వేస్ విమానాల్లో తరచుగా ప్రయాణించే అతను ఓ ఎయిర్‌హోస్టెస్‌ను చూసి ఇష్టపడ్డాడు. ఆమెను ఎలాగైనా తన వద్దకు రప్పించుకోవాలనీ, అందుకోసం ఆమె ఉద్యోగం పోగొట్టాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం గతంలో విమానంలోకి బొద్దింకను తీసుకొచ్చి, తనకు వడ్డించిన భోజనంలో అతనే బొద్దింకను వేసుకుని జెట్ ఎయిర్వేస్ సిబ్బందితో తీవ్రంగా గొడవపడ్డాడు. తాజాగా సోమవారం ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న 9డబ్ల్యూ 339 నంబరుగల విమానమెక్కాడు. విమానం 115 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో తెల్లవారుజామున 2.55 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అనంతరం వాష్‌రూమ్‌కు వెళ్లిన సల్లా ‘ప్లేన్‌లో 12 మంది హైజాకర్లు, బాంబులు ఉన్నాయి. ఢిల్లీకి కాకుండా నేరుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు విమానాన్ని తీసుకెళ్లాలి. ఇంకెక్కడైనా ల్యాండింగ్‌కు యత్నిస్తే విమానం పేలిపోతుంది’ అని ఉర్దూలో, ఇంగ్లిష్‌లో రాసిన ఓ బెదిరింపు కాగితం ముక్కను అక్కడ ఉంచాడు. దానిని చూసిన సిబ్బంది వెంటనే పైలట్‌కు సమాచారం అందించడంతో హైజాక్ అలర్ట్ బటన్ నొక్కి అత్యవసరంగా అహ్మదాబాద్ విమానాశ్రయంలో 3.45 గంటలకు దించివేశారు. అనంతరం పోలీసులు ప్రయాణికులను కిందకు దింపి, విమానం మొత్తాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసి ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు విమానం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. కిశోర్ సల్లాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతను ఇకపై విమానాల్లో ఎక్కేందుకు అనుమతించకుండా నిషేధం విధించాలని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఆదేశించారు. ఈ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేపట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గుజరాత్ పోలీసులు హైజాక్ వ్యతిరేక చట్టం కింద కేసును నమోదు చేస్తే తాము విచారణ చేపడతామని ఎన్ఐఏ చీఫ్ వైసీ మోదీ చెప్పారు. -
రైలును హైజాక్ చేసిన మావోయిస్టులు
పాట్నా: సుమారు 40 మంది మావోయిస్టులు రైల్వేస్టేషన్‌పై దాడి చేసి ఓ రైలును హైజాక్ చేశారు. ఈ సంఘటన బీహార్‌లోని జమూయి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. దనాపూర్ దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లోకి ప్రవేశించిన మావోయిస్టులు రైల్వే గార్డును అదుపులోకి తీసుకొన్నారు. రైలును షాహిద్ జితేంద్ర స్టాప్ వద్ద నిలిపి వేసినట్లు సమాచారం. -
ఇండియన్ షిప్ హైజాక్
న్యూఢిల్లీ: ఇండియన్ కార్గో షిప్ హైజాక్‌కు గురవడం కలకలం రేపుతోంది. 11 మంది సిబ్బందితో షిప్ దుబాయ్ నుంచి యెమెన్ వెళ్తుండగా.. సోమాలియా సముద్రపు దొంగలు దాడి చేసి హైజాక్ చేశారు. ఏప్రిల్ 1న షిప్ హైజాక్‌కు గురైనట్లు అధికారులు నిర్థారించారు. సముద్రపు దొంగల చేతిలో బంధీలుగా ఉన్న 11 మంది కూడా ముంబైలోని మాండ్వీ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. హైజాక్ విషయాన్ని షిప్ కెప్టెన్ దుబాయ్‌లోని అధికారులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హైజాక్ ఘటనను ధృవీకరించింది. షిప్‌లోని సిబ్బందిని రక్షించడానికి చర్యలు చేపడుతున్నట్లు భారత నేవీ అధికారులు వెల్లడించారు. -
విమానం హైజాక్ సుఖాంతం
లిబియాలో హైజాక్.. మాల్టాలో ప్రత్యక్షం మాల్టా ఆర్మీ చొరవతో ప్రయాణికులు సురక్షితంగా విడుదల.. అనంతరం లొంగిపోయిన హైజాకర్లు వలెటా: లిబియాలోని సభా నుంచి రాజధాని ట్రిపోలీకి అఫ్రికియా ఎయిర్వేస్ విమానం (ఎయిర్‌బస్ ఏ 320) శుక్రవారం ఉదయం బయలుదేరింది.. షెడ్యూల్ ప్రకారం కాసేపట్లో ట్రిపోలీ చేరుకోవాల్సిన విమానం.. దారి మళ్లిందనే సమాచారం కలకలం రేపింది. విమానంలో 118 మంది ప్రయాణికులతోపాటు సిబ్బంది ఉన్నారు. కాసేపటికి విమానం హైజాక్ అయిందనే సమాచారం లిబియా ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది. అయితే హైజాకర్లు విమానాన్ని మధ్యదరాసముద్ర ద్వీప దేశమైన మాల్టాలోని వలెటా విమానాశ్రయంలో ల్యాండ్ చేయటం.. అక్కడి మిలటరీ రంగంలోకి దిగి ప్రయాణికులను రక్షించటంతో కథ సుఖాంతమైంది. అనంతరం ఇద్దరు హైజాకర్లూ లొంగిపోయారు. వారు దివంగత లిబియా నేత గఢాఫీ అనుచరులని.. వారిద్దరూ మాల్టాలో రాజకీయ ఆశ్రయం కావాలని కోరినట్లు తెలిసింది. అసలేం జరిగింది?.. సభా నుంచి విమానం బయలుదేరిన కాసేపటికే ఇద్దరు అగంతకులు విమానంలోకి కాక్‌పిట్‌లోకి చొరబడ్డారు. చేతిలో గ్రనేడ్లు పట్టుకుని.. విమానాన్ని పేల్చేస్తామని బెదిరించారు. దీంతో పైలెట్లతోపాటు విమానంలో ఉన్నవారిలోనూ ఆందోళన నెలకొంది. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థమయ్యేలోపునే విమానం దారి మళ్లింది. ఈ సమయంలో విమానంలో 28 మహిళలు, ఓ చిన్నారితో సహా 118 మంది ప్రయాణికులున్నారు. దీంతో లిబియా ప్రభుత్వం అప్రమత్తమైంది. హైజాకర్లు విమానాన్ని మాల్టాకు దారి మళ్లించారు. రన్‌వేపైనే గంటసేపు విమానాన్ని నిలిపి ఉంచారు. దీంతో ఆందోళన చెందిన విమానాశ్రయాధికారులు.. పలు విమానాలను ఇటలీకి దారిమళ్లించారు. మరికొన్ని మొదట వాయిదా పడ్డా.. తర్వాత మొదటి రన్‌వే ద్వారా ల్యాండ్ అయ్యాయి. అటు విమానాశ్రయాధికారుల సూచనతో రంగంలోకి దిగిన మాల్టా ఆర్మీ ఎయిర్‌బస్‌ను చుట్టుముట్టింది. బందీలను వదిలిపెట్టాలని హైజాకర్లకు సూచించింది. రెండున్నర గంటల చర్చల తర్వాత.. ప్రయాణికులను క్షేమంగా హైజాకర్లు వదిలిపెట్టేందుకు అంగీకరించారు. ‘విమాన సిబ్బంది కూడా క్షేమంగా బయటకు వచ్చేశారు. హైజాకర్లు లొంగిపోయారు. వారిని అదుపులోకి తీసుకున్నాం’ అని మాల్టా ప్రధాని జోసెఫ్ మస్కట్ ట్వీట్ చేశారు. దీంతో కథ సుఖాంతమైనట్లు అధికారిక సమాచారం అందింది. కాగా, ఇద్దరు హైజాకర్లు గఢాఫీ అనుకూల పార్టీ పెట్టనున్నట్లు తెలిపారని లిబియా విదేశాంగ మంత్రి వెల్లడించారు. -
విమానం హైజాక్ కలకలం
మనీలా: సౌదీ అరేబియా విమానం హైజాక్ కు గురైందన్న సమాచారంతో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో కలకలం రేగింది. 300 మందితో జెడ్డా నుంచి మనీలాకు వచ్చిన ఎస్ వీ 872 విమానం నినోయ్ విమానాశ్రయంలో దిగగానే పోలీసులు చుట్టుముట్టారు. ఏం జరుగుతుందో తెలియక విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఆందోళన చెందారు. విమానం హైజాక్ కు గురైందన్న సమాచారంతో పోలీసులు విమానాన్ని చుట్టుముట్టారు. విమానానికి ముప్పు ఉందని ఎయిర్ పోర్టు కంట్రోల్ రూముకు పైలట్ సమాచారం అందించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాన్ని ప్రత్యేక స్థలంలో కిందకు దించారు. పైలట్ పొరపాటున ’పానిక్ బటన్’ నొక్కాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ రెండుసార్లు పానిక్ బటన్ నొక్కడంతో కలకలం రేగిందని ఎయిర్ పోర్ట్ జనరల్ మేనేజర్ ఎడ్మండ్ మోనేరల్ తెలిపారు. భద్రత చర్యల్లో భాగంగా విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశామని చెప్పారు. పైలట్ ను ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు. ప్రయాణికుల్లో చాలా మంది హజ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్నారు. -
మలేసియా విమానాన్ని హైజాక్ చేశారా?
సిడ్నీ: రెండేళ్ల క్రితం మలేసియా ఎయిర్ లైన్స్ ఎంహెచ్ 370 విమానం అదృశ్యమైన ఘటన మిస్టరీగానే మిగిలిపోయింది. విమాన ప్రమాదానికి గల కారణాలేంటి? ఎక్కడ కూలిపోయింది? వంటి విషయాలు ఇప్పటికీ తేలలేదు. విమానంలోని ప్రయాణికులు హైజాక్ చేశారన్న వాదన కొత్తగా వినిపిస్తోంది. కొందరు విదేశీయులు విమానాన్ని దారి మళ్లించారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా ఈ విమానం హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్టు మలేసియా అధికారులు భావిస్తున్నా.. ప్రమాదానికి కచ్చితమైన కారణమేంటన్నది ఇంకా నిర్ధారించలేదు. విమానంలోని ప్రయాణికులు ఒకరు లేదా ఎక్కువ మంది హైజాక్ చేసిఉంటారన్న వార్తలు ఇటీవల వచ్చాయి. తప్పుడు పాస్ట్ పోర్టులతో ఇద్దరు ఇరాన్ దేశస్తులు ప్రయాణించడం అనుమానాలకు తావిస్తోంది. అయితే వీరిద్దరికీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు లేవని విచారణాధికారులు స్పష్టం చేశారు. బీజింగ్‌కు వెళ్లాల్సిన విమానాన్ని విదేశీయులు దారి మళ్లించారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. విమానం ఆచూకీ కనుగొనేందుకు నియమించిన దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో చీఫ్ కమిషనర్ మార్టిన్ డొలాన్ ఈ ఆరోపణలను ఖండించారు. కొందరు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, అయితే అంతుచిక్కని మిస్టరీగా మారిన విమాన అదృశ్యానికి గల కారణాలు కచ్చితంగా తెలియరాలేదని వెల్లడించారు. ఇదిలావుండగా, హిందూ మహాసముద్రంలో డీగో గార్కియాలోని అమెరికా సైనిక స్థావరం వైపు వెళ్తున్న ఈ విమానాన్ని.. దాడి చేసేందుకు వస్తోందని భావించి అమెరికా దళాలు కూల్చివేశాయని గతంలో ఓ కథనం వెలువడింది. అయితే దీన్ని అమెరికా తోసిపుచ్చింది. 2014 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు 239 మందితో వెళ్తున్న బోయింగ్ 777 అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ విమానానికి చెందినవిగా భావిస్తున్న శకలాలను గుర్తించారు. గతేడాది హిందూ మహాసముద్రంలోని రీయూనియన్ దీవిలో, ఇటీవల మొజాంబిక్ సముద్రతీరంలో మరో శకలాన్ని గుర్తించారు. కాగా మలేసియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ సిబ్బందిని రంగంలోకి దింపి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా విమానం కూలిన ప్రాంతాన్ని గుర్తించలేకపోయాయి. -
విమానంలో ఆ రోజు ఏం జరిగిందీ....?
న్యూఢిల్లీ: పాన్ అమెరికా ఎయిర్వేస్ విమానంలో అటెండెంట్‌గా పనిచేస్తున్న నీర్జా భానోత్ టెర్రరిస్టుల బారి నుంచి 359 మంది ప్రయాణికులను రక్షించేందుకు తన ప్రాణాలను అర్పించిన యదార్థ సంఘటనపై సోనమ్ కపూర్ నటించిన హిందీ సినిమా ‘నీర్జా’ బాక్సాఫీసు వద్ద హిట్ అయిన విషయం తెల్సిందే. అసలు ఆ రోజు విమానంలో ఏం జరిగింది ? విమానంలోకి టెర్రరిస్టులు ఎలా ప్రవేశించారు? ప్రయాణికులను ఎలా చంపారు? అన్న అంశాలను ఆ రోజు విమానం నుంచి ప్రాణాలతో బయటపడ్డ సంగీత విద్వాంసుడు నయన్ పాంచోలి చెప్పిన కథనం ఇదీ... ‘అది 1986, సెప్టెంబర్ 5, అహ్మదాబాద్‌కు చెందిన మ్యూజిక్ కంపోజర్స్. గాయనీ గాయకులతో కూడిన బృందం మాది. అమెరికాలోని పలు నగరాల్లో సంగీత విభావరి నిర్వహించేందుకు మేము వెళుతున్నాం. పాన్ ఏఎంకు చెందిన ముంబై నుంచి కరాచి, ఫ్రాంక్‌ఫర్ట్‌ల మీదుగా న్యూయార్క్ వెళ్లే విమానంలో ఎక్కాం. అప్పుడు నాకు 21 ఏళ్లు. మా విమానం ముంబై నుంచి బయల్దేరి తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో కరాచి విమానాశ్రయంలో దిగింది. కొంతమంది ప్రయాణికులు కరాచిలో దిగి పోయారు. విమానాన్ని క్లీనర్లు విమానం ఎక్కి తమ పని ముగించుకొని వెళ్లడానికి సిద్ధమయ్యారు. అంతలో విమానాశ్రయం సెక్యూరిటీ దుస్తుల్లో ఉన్న నలుగురు సాయుధులు బిజినెస్ క్యాస్ వైపునున్న ద్వారం గుండా లోపలికి ప్రవేశించారు. అటువైపు నుంచి అరుపులు, కేకలు వినిపించాయి. గాలిలోకి మూడు, నాలుగు సార్లు కాల్పులు జరిపిన శబ్దాలు వినిపించాయి. ముందు భాగానికి, వెనక భాగానికి ఇద్దరు చొప్పున సాయుధులు విడిపోయారు. వారిలో ఒకరి వద్ద మిషన్ గన్ ఉండగా, మిగతా వారి వద్ద పలు తుపాకులు, గ్రెనేడ్లు ఉన్నాయి. ప్రతి ప్రయాణికుడు తన నెత్తికి రెండు చేతులు పెట్టుకోవాలని వారు ఆదేశించారు. నాతో సహా ప్రయాణికులందరం అలాగే చేశాం. అదే సమయంలో వెంటనే స్పందించిన సీనియర్ ఫ్లైట్ అటెండెంట్ నీర్జా భానోత్ కాక్‌పిట్‌లోకి వెళ్లి కెప్టెన్, కోపైలట్, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే విమానాన్ని టేకాఫ్ చేయాల్సిందిగా సూచించారు. కానీ వారంతా విమానం దిగి పారిపోయారు. ఈలోగా నీర్జాను మినహా మిగతా ఫ్లైట్ అటెండర్లందరిని టెర్రరిస్టులు బంధించారు. ఎయిర్‌వేస్‌తో మాట్లాడేందుకు నీర్జాను బంధించలేదు. ప్రయాణికులను భయపెట్టేందుకు రాకేష్ కుమార్ అనే వ్యక్తిని ముందుగా కాల్చి చంపారు. అతని శవాన్ని విమానం నుంచి బయట పడేశారు. ప్రయాణికుల పాస్‌పోర్టులను సేకరించడం మొదలు పెట్టారు. ఈలోగా కొంత మంది అమెరికా పౌరుల పాస్‌పోర్టులను నీర్జా తీసుకొని సీట్ల కింద దాచిపెట్టారు. మమ్మల్ని భయపెడుతూ టెర్రరిస్టులు అరబిక్ భాషలో అరపులు, కేకలు వేశారు. మధ్యాహ్నం శాండివిచ్‌లు ఆఫర్ చేశారు. ఆ పరిస్థితిలో ఎవరికీ తినేందుకు మకస్కరించలేదు. సాయంత్రం నెత్తిమీద చేతులు పెట్టుకొని నిలబడాల్సిందిగా ఆదేశించి ప్రయాణికులు క్యూలో టాయ్లెట్లకు వెళ్లేందుకు అనుమతించారు. విమానాన్ని హైజాక్ చేసిన 17 గంటలకు విమానంలోని ఇంధనం ఖాళీ అయింది. దాంతో జనరేటర్ నడవక విమానంలో లైట్లన్నీ ఆరిపోయాయి. భయపడిన టెర్రరిస్టులు ప్రయాణికులపై గుడ్డిగా కాల్పులు జరపడం ప్రారంభించారు. ఎంతో మంది చావు కేకలు వినిపించాయి. నీర్జా భానోత్ (23 ఏళ్లు)తో పాటు నా ట్రూప్‌నకు చెందిన ఇద్దరు కాల్పుల్లో మరణించారు. గ్రెనేడ్లు కూడా విసిరారు. ప్రాణాలు రక్షించుకోవడం కోసం నేను నా పక్కనే ఉన్న ఎమర్జెన్సీ డోర్‌ను తీసుకొని బయటకు దూకుతుండగా, ఓ గ్రెనేడ్ శకలాలు వచ్చి నా ఎడమ కంటికి తాకాయి. అలాగే కింద పడిపోయాను. నన్ను కరాచి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. 48 గంటల తర్వాత ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ముంబై తీసుకెళ్లారు. అక్కడ కంటికి చికిత్స చేయించుకున్నా లాభం లేకపోయింది. అమెరికాలోని చికాగో ఆస్పత్రికి వెళ్లాను. అక్కడా నా కంటి చూపును ఎవరూ పునరుద్ధరించలేక పోయారు. ఆ రోజును ఇప్పటికీ మరచిపోలేను. మానవత్వానికి చీకటి రోజు. ప్రయాణికులు జాతి,కుల, మత విభేదాలను విస్మరించిన రోజు. ఒకరి పట్ల ఒకరు మానవత్వంతో వ్యయహరించిన రోజు’ అంటూ ఆ నాటి సంఘటనను వివరించారు. -
విమానాన్ని హైజాక్ చేశారా?
♦ ఉత్కంఠ రేపిన మాక్‌డ్రిల్ ♦ నాలుగు గంటల సేపు అప్రమత్తం ♦ ఎన్ఎస్ డేగాలో భద్రతా బలగాల మోహరింపు గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయంలో విమానాన్ని హైజాక్ చేశారా... ఇదీ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఆనోటా ఈనోటా సాగిన వదంతులు. మధ్యాహ్నం మూడుగంటలు...రయ్..రయ్ మంటూ అనేక వాహనాలు విశాఖ విమానాశ్రయం వైపు దూసుకు వచ్చాయి. అందులో అనేక శాఖల భద్రతా బ లగాలు, వారి వెంట జిల్లా పోలీసు యంత్రాంగం, వీరందర్నీ అనుసరిస్తూ అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలు. విమానాశ్రయం లోపల విమాన సంస్థల అధికారులు, ఉద్యోగులు ఉరుకులూపరుగులూ. అసలేం జరుగుతోంది...ఇవన్నీ ఏంటని ప్రయాణికులు, సందర్శకుల్లో ఉత్కంఠ. తీవ్రవాదులు హైజాక్ చేసిన విమానం ఇక్కడ వాలిదంటూ మరి కొద్ది సేపట్లో ఎవరి నుంచో వర్తమానం. ఉదయం డ్యూటీలు ముగించుకుని వెళ్లిపోయిన సీఐఎస్ఎఫ్ బలగాలు తిరిగి హుటాహుటిన విధుల్లో చేరిపోయి విమానాశ్రయ పరిసరాల్లో అడుగడుగునా కాపలా...సెక్యూరిటీ గేటు వద్ద అణువణువునా తనిఖీలు...ఇలా రాత్రి ఏడు గంటల వరకూ భద్రతాబలగాల హైరానాతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరికి ఇదంతా ఎయిర్‌క్రాఫ్ట్ యాన్టీ హైజాకింగ్ మాక్‌డ్రిల్‌గా భద్రతా అధికారులు వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేశంలో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో భారత వైమానిక దళాలు, ఎయిర్‌పోర్టు అథారిటీ సీఐఎస్ఎఎఫ్ భద్రతా బలగాలతో అంతర్గత భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేయడానికే ఈమాక్ డ్రిల్ జరిపారని అధికారులు తెలిపారు. -
అధికార పార్టీ నేతల.. ఇంజినీ‘రింగ..రింగా’..!
ఇంజినీరింగ్ కళాశాల ప్రతిపాదనను హైజాక్ చేసే యత్నం తమ పరిధిలో ఏర్పాటు చేయాలని అంబేద్కర్ వర్సిటీ విజ్ఞప్తి అందుబాటులో 21వ శతాబ్ది గురుకుల భవనాలు రూసా నిధుల మంజూరుకూ అవకాశం ఇవన్నీ కాదని టెక్కలి ప్రాంతంలో ప్రైవేట్‌రంగంలో ఏర్పాటుకు ఒత్తిడి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లా ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలన్న ప్రతిపాదన విషయంలో అధికార పార్టీ నేతల వైఖరి రెండు విధాలా నష్టం కలిగించేలా ఉంది. ఇంజినీరింగ్ కళాశాలను టెక్కలి ప్రాంతంలో ఏర్పాటు చేయించాలని కొందరు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. దీనివల్ల ప్రభుత్వరంగంలో ఏర్పాటు కావాల్సిన కళాశాల ప్రైవేటురంగానికి మరలిపోతుంది. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్ష అభియాన్(రూసా) నిధులు మంజూరు కావు. అదే విధంగా ప్రస్తుతం బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సమీపంలో నిరుపయోగంగా ఉన్న 21 శతాబ్ది గురుకుల భవనాలు వినియోగంలోకి రాకుండాపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కొన్నాళ్లుగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దాన్ని వర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని అంబేద్కర్ వర్సిటీ అధికారులు ప్రభుత్వాన్ని ఇప్పటికే రాతపూర్వకంగా కోరారు. మరోవైపు జేఎన్టీయూ కూడా ఇంజినీరింగ్ కళాశాల నిర్వహణకు ముందుకొచ్చింది. ఈ రెండింటిలో ఏ ప్రతిపాదన ఆమోదం పొందినా ప్రభుత్వపరంగా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటవుతుంది. ప్రస్తుతం వృథాగా ఉన్న 21 శతాబ్ది గురకుల భవనాల్లో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నది అంబేద్కర్ వర్సిటీ అధికారుల ఆలోచన. అందుబాటులో గురుకుల భవనాలు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు 21 శతాబ్ది గురుకులాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఎచ్చెర్లలోని అంబేద్కర్ యూనివర్సిటీ పక్క నే 50 ఎకరాల స్థలంలో 8 బ్లాకులతో గురుకులానికి భవనాలు నిర్మించారు. అయితే గురుకులాలు ప్రారం భం కాకపోవడంతో మొదట్లో ఈ భవనాలను యూని వర్సిటీకి అప్పగించారు. కొన్నాళ్లు వాటిని వర్సిటీయే నిర్వహించేది. ఆ తర్వాత వీటిలో రాజీవ్ యువకిరణాలు పథకం కింద నిరుద్యోగులకు ఉపాధి శిక్షణలు నిర్వహించడం ప్రారంభించారు. అప్పటినుంచి క్రమం గా ఈ భవనాలు వర్సిటీ పరిధి నుంచి జిల్లా అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. 2013 తర్వాత శిక్షణలు కూడా నిలిచిపోవడంతో భవనాలు నిరుపయోగంగా ఉండిపోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రతిపాదన వచ్చింది. గురుకుల భవనాలను తమకు అప్పగిస్తే తమ ఆధీనంలోనే ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని, దీని వల్ల వసతి సమస్య తీరడంతోపాటు గురుకుల భవనాలు వినియోగంలోకి వస్తాయని, ఇంజినీరింగ్ కళాశాల వల్ల ఏడాదికి ఎలా లేదన్నా రూ.30 లక్షల వస్తుం దని.. అది వర్సిటీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని బీఆర్‌ఏయూ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. నేతల వ్యూహాలు అయితే స్వార్థంతో ఆలోచిస్తున్న అధికార పార్టీ నేతలు ఈ ప్రయోజనాలన్నింటికీ గండికొట్టేలా పలాస-టెక్కలి మధ్య ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. ఇందుకోసం భూ సేకరణకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ సంస్థలకు కళాశాల మంజూరు చేస్తే ‘రూసా’ నిధులు మం జూరయ్యే అవకాశం ఉండదు. పైగా విద్యార్థులకు ప్రభుత్వపరంగా అందే రాయితీలు ఇతర సౌకర్యాలు అందకుండాపోతాయి. ప్రైవేట్ కళాశాలలో ఫీజుల భారం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ వర్సీటీకే ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలన్న డిమాండ్ విద్యార్థివర్గాల నుంచి పెరుగుతోంది. యూనివర్సిటీ పరిధిలోనే ఉండాలి గత చైర్మన్ కె.సి.రెడ్డి హయాంలో గురుకుల నిర్వహణ యూనివర్సిటీ పరిధిలోనే ఉండేది. తర్వాత ప్రభుత్వానికి అప్పగించారు. వర్సిటీ అనుబంధంగా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే దానికి గురుకుల భవనాలు ఉపయోగపడతాయి. దానివల్ల ఏడాదికి ఎలా లేదన్నా రూ.30 లక్షల ఆదాయం వస్తుంది. వర్సిటీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే ఇంజినీరింగ్ కళాశాల ఉండాలన్నదే మా ప్రతిపాదన. ప్రభుత్వానికి కూడా నివేదించాం. కళాశాల మంజూరు విషయంలో నేతలు చొరవ చూపాలి. -హెచ్.లజపతిరాయ్, ఉప కులపతి, బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ -
కాక్ పిట్ నే టాయ్ లెట్ అనుకుని.....
పెళ్లాం వదిలేసింది.... ఆమె అజా అయిపూ లేదు....దాంతో ఏదో మందు వేసుకున్నాడు. ... డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు..... కుడి ఎడమ తెలియలేదు. విమానం కాక్ పిట్ ను చూశాడు. మంచి టాయ్ లెట్ అనుకున్నాడు... అంతే బలవంతంగా కాక్ పిట్ తలుపు తెరిచి 'ఆ పని' చేసేద్దామనుకున్నాడు. అదీ శుక్రవారం నాడు ఆస్ట్రేలియన్ విమానం హైజాక్ డ్రామా అసలు కథ! శుక్రవారం ఆస్ట్రేలియాకి చెందిన ఒక విమానం హైజాక్ అనుమానాలతో అత్యవసరంగా ఇండోనీషియాలోని బాలి ద్వీపంలోని డెన్ పసార్ ఎయిర్ పోర్టులో దిగడంతో హడావిడి మొదలైంది. మొదట్లో బ్రిస్బేన్ నుంచి బాలి వెళ్లాల్సిన ఈ విమానాన్ని హైజాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అదంతా డిప్రెషన్ లో ఉన్న ఓ వ్యక్తి సృష్టించిన హై డ్రామా అని తేలిపోయింది. మత్తులో ఉన్న మాట్ క్రిస్టఫర్ లాక్లీ అనే ప్రయాణికుడు విమానం కాక్ పిట్ లోకి బలవంతంగా చొరబడేందుకు యత్నించాడు. దీనితో సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. డెన్ పసార్ విమానాశ్రయంలో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో తేలిందేమిటంటే ఇండోనీసియాకి చెందిన అతని భార్య అతడిని వదిలేసింది. ఆమెను వెతుక్కుంటూ ఇండోనీషియాకి బయలుదేరాడు. త్రీఫోర్త్ నిక్కరు, టీ షర్టు వేసుకుని విమానం ఎక్కేశాడు. ఏవో పెయిన్ కిల్లర్లు వేసుకున్నాడు. ఓ రెండు కోక్ లు పట్టించాడు. అవన్నీ యాక్షన్, రియాక్షన్ మొదలుపెట్టాయి. దాంతో 'పని' కావించేందుకు టాయ్ లెట్ వెళ్లాలనుకున్నాడు. కాక్ పిట్ నే టాయిలెట్ అనుకుని తలుపులు తీయబోయాడు. తలుపులు తెరుచుకోలేదు. దాంతో దబదబా బాదేశాడు. ఆదీ సంగతి.