ఆకాశంలో తాగుబోతు వీరంగం, హైజాక్ అనుమానాలు | Australian plane hijacked | Sakshi
Sakshi News home page

ఆకాశంలో తాగుబోతు వీరంగం, హైజాక్ అనుమానాలు

Published Fri, Apr 25 2014 1:21 PM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM

ఆకాశంలో తాగుబోతు వీరంగం, హైజాక్ అనుమానాలు

ఆకాశంలో తాగుబోతు వీరంగం, హైజాక్ అనుమానాలు

* తాగి కాక్ పిట్ లోకి చొరబడ్డ ప్రయాణికుడు
*  ప్రయాణికుడి హడావిడితో హైజాక్ భయం
*  అత్యవసరంగా డెన్ పసార్ లో దిగిన విమానం
*  బాటిల్ బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు


ఆస్ట్రేలియాకి చెందిన ఒక విమానం హైజాక్ అనుమానాలతో అత్యవసరంగా ఇండోనీషియాలోని బాలి ద్వీపంలోని డెన్ పసార్ ఎయిర్ పోర్టులో దిగింది. బ్రిస్బేన్ నుంచి బాలి వెళ్లాల్సిన ఈ విమానాన్ని హైజాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఓ తాగుబోతు సృష్టించిన హై డ్రామా అని త్వరలో తేలిపోయింది.

మద్యం మత్తులో ఉన్న ఒక ప్రయాణికుడు విమానం కాక్ పిట్ లోకి బలవంతంగా చొరబడేందుకు యత్నించాడు. దీనితో సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. డెన్ పసార్ విమానాశ్రయంలో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక సోమాలియా విమానం హైజాక్ కి గురైంది. ఆస్ట్రేలియన్ విమానం హైజాక్ అయినట్టు మొదట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాగిన మైకంలో ఉన్న ఒక ప్రయాణికుడు చేసిన హడావిడే ఈ అనుమానాలకు కారణమని తరువాత వెల్లడైంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement