Bali
-
బాలిలో డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ చిల్.. బీచ్ ఒడ్డున అలా!
-
10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు
ఇండోనేషియా బాలీలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో బూడిద కమ్ముకుని పలు విమానాలు రద్దయ్యాయి. బాలీలోని ‘మౌంట్ లెవోటోబి లకీ-లకీ’ అనే అగ్నిపర్వతం రెండోసారి పేలడంతో దాదాపు 10 కిలోమీటర్ల(32,808 అడుగులు) ఎత్తులో దట్టంగా బూడిద కమ్ముకుందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు ప్రమాదకరమని చెప్పారు. దాంతో కొన్ని సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసినట్లు పేర్కొన్నారు.బాలీలోని ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో ఉన్న మౌంట్ లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం నవంబర్ 3న మొదట విస్ఫోటనం చెందింది. తిరిగి మంగళవారం పలుమార్లు భారీ స్థాయిలో బద్దలవ్వడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఇండిగో ప్రకటన విడుదల చేసింది. ‘బాలీలో ఇటీవలి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాంతో వాతావరణంలో భారీగా బూడిద మేఘాలు ఏర్పడ్డాయి. దానివల్ల ఆ ప్రాంతానికి వచ్చిపోయే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని తెలిపింది. ఇండిగో సంస్థ బెంగళూరు నుంచి ఇండోనేషియా బాలీకి రోజువారీ సర్వీసు నడుపుతోంది.ఢిల్లీ-ఇండోనేషియా మధ్య ప్రయాణించే రోజువారీ విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ధ్రువీకరించింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా బుధవారం ఇండోనేషియాకు ప్రయాణించే విమాన ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.ఇదీ చదవండి: గుడ్‌బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటనబాలీ నుంచి దాదాపు 800 కి.మీ దూరంలో ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో నవంబర్ 3న లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం మొదట విస్ఫోటనం చెందింది. దానివల్ల తొమ్మిది మంది మరణించారు. తాజాగా మంగళవారం మళ్లీ పలుమార్లు విస్ఫోటనం చెందింది. మొదటిసారి ఘటన జరిగిన సమయంలో నవంబర్ 4 నుంచి 12 వరకు సింగపూర్, హాంకాంగ్, కొన్ని ఆస్ట్రేలియన్ నగరాల నుంచి బాలీకి ప్రయాణించే 80 విమానాలు రద్దు చేశారు. -
నెచ్చెలులతో మల్లు బ్యూటీ ‘అహనా కృష్ణ’ ఊయల ఉల్లాసం (ఫొటొలు)
-
ఒడిస్సీ బాలినీస్ నృత్యాల వందేమాతర సంగమం!
బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ విరచిత ‘వందేమాతరం‘ ఖ్యాతి మరోసారి విశ్వ యవనికపై తొణికిసలాండింది! వియత్నాంలోని బాలీలోని భారతీయ దౌత్య కార్యాలయం దీనికి వేదికైంది. భారత నృత్య శైలుల్లో ఒకటైన ఒడిస్సీకి బాలినీస్ శైలి కూడా తోడైంది. వందేమాతరమంటూ.. పదాలు సొగసుగా కదిలాయి. హావభావాలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారింది. పలువురి అభిమానాన్ని చూరగొంటోంది. ఎందుకు? ఏమిటి? ఎలా? చూసేయండి మరి! కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బాలిలో వందేమాతరం పాటకు ప్రత్యేక శైలిలో నృత్య ప్రదర్శన జరిగింది. భారతదేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బాలిలో నిర్వహించారు. ఇది ఒడిస్సీ, బాలినీస్ సంప్రదాయ నృత్యాలను మిక్స్ చేసిన నృత్య ప్రదర్శన. ఇది ఎంతగా ఆకట్టుకుంటుందంటే..ప్రేక్షకులు మైమరిచి చూస్తుండి పోయేంతగా! ఆ యువతులిద్దరూ చాలా చక్కటి అభినయంతో చేశారు. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ రాసిన జాతీయ గీతం వందేమాతరం పాట ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగేలే చేస్తుంది. తెలియని అనుభూతి కలిగుతుంది. అలాంటి అద్భుతమైన గీతానికి చక్కటి నృత్యంతో అబ్బురపరిచారు ఆ యువతులు. ఈ నృత్య ప్రదర్శన ఇచ్చిన ఇద్దరు యువతుల్లో ఒకరు బాలిలో ఒడిస్సీ టీచర్ డా పాంపిపాల్ కాగా, మరోకరు బాలినీస్ డ్యాన్సర్ మెలిస్సా ఫ్టోరెన్స్ షిల్లెవోర్ట్. ఇద్దరు వేర్వేరు డ్యాన్సర్లు కలిసి ఒక దేశ భక్తి పాటకు ఇచ్చి ఈ ప్రదర్శన అద్భుతః ! అన్నంతగా నెటిజన్లను ఆకట్టుకుంది. Vandhe Maatram - Odissa & Bali dancers pic.twitter.com/hzj4bSv26o — Aviator Anil Chopra (@Chopsyturvey) April 11, 2024 (చదవండి: అత్యంత ఖరీదైన టీకప్పు..ధర వింటే షాకవ్వుతారు!) -
పెళ్లి సెలవును ఎగతాళి చేసిన బాస్.. ఉద్యోగి షాకింగ్ నిర్ణయం!
ఉద్యోగ జీవితం ఎంత ముఖ్యమో వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యం. దీనికి విఘాతం కలిగినప్పుడు కొంత మంది ఉద్యోగులు ధైర్యంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి ఓ ఉద్యోగి తన సోదరుడి పెళ్లి కోసం సెలవు అడిగితే ఇవ్వకపోగా ఎగతాళి చేసిన బాస్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. ఇంతకీ అతను తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.. ఆస్ట్రేలియాలో నోయెల్ అనే ఉద్యోగి బాలీలో సోదరుడి పెళ్లి కోసం సెలవుకు దరఖాస్తు పెట్టకున్నాడు. అయితే అతని బాస్ సెలవును రద్దు చేయడంతోపాటు ఎగతాళి చేస్తూ పంపిన సందేశం చూసిన తర్వాత నోయెల్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. సోదరుడి పెళ్లికి వెళ్లకపోవడం కంటే ఉద్యోగం వదిలేయడమే మేలని నిశ్చయానికి వచ్చాడు. ఆ బాస్ అంతలా ఏమి ఎగతాళి చేశాడు.. ఉద్యోగికి బాస్‌కి మధ్య జరిగిన సంభాషణపై మైఖేల్ సాంజ్ బిజినెస్‌మన్, ఔట్సోర్సింగ్ ఎక్స్పర్ట్ టిక్‌టాక్‌లో ఓ వీడియోను షేర్ చేయడంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. "ఈ వ్యక్తి పనిముట్టులా ఉన్నాడు. ఎటువంటి సంభాషణ లేకుండా ఆటోమేటిక్‌గా సెలవును రద్దు చేస్తున్నాడు" అంటూ జోడించారు. నిక్ అనే బాస్, అతని ఉద్యోగి నోయెల్ మధ్య సంభాషణ ఇలా ఉంది.. మరొక ఉద్యోగి రాజీనామా చేస్తున్నందున నోయెల్ సెలవు రద్దు చేస్తున్నట్లు బాస్ తెలియజేశాడు. ఇప్పటికే బాలీకి విమానాలకు టికెట్ల బుకింగ్ అయిపోయిందని, తన పిల్లలు వివాహ పార్టీలో ఉన్నారని తన సెలవులను రద్దు చేయొద్దని నోయెల్ బాస్‌ని వేడుకున్నాడు.ఏడు నెలల క్రితమే టికెట్లు బుక్ చేశానని కాబట్టి రద్దు చేయడం వీలు కాదని అభ్యర్థించాడు. అయినప్పటికీ, బాలిని గమ్యస్థానంగా ఎగతాళి చేస్తూ సెలవును మూడు వారాల నుంచి మూడు రోజులకు తగ్గించుకోవాలని నోయెల్‌కు సూచించాడు. దీంతో కలత చెందిన నోయెల్.. ఇతర దేశాలను ఎగతాళి చేసే ఇలాంటి కంపెనీలోనా తాను పనిచేస్తున్నది అంటూ తాను ఈ రోజు నుంచే సెలవు తీసుకుంటున్నాని అంటే జాబ్ మానేస్తున్నానని బదులిచ్చాడు. బాస్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా ప్రతిస్పందించారు. నోయెల్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. -
శివపదం గీతాలకు ఇండోనేషియా బాలిలో నృత్య ప్రదర్శన
శివపదం గ్లోబల్ ఫ్యామిలి భారతీయ నృత్య ప్రదర్శనకు సరిహద్దులు లేవని చాటిచెప్పారు. అమెరికాలో పుట్టి పెరిగిన 45 మంది భారతీయ విద్యార్థులు ఇండోనేషియా బాలిలో కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ వంటి సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. శివపదం గీతాలకు వాణి గుండ్లాపల్లి (నో యువర్ రూట్స్, యూ. ఎస్. ఏ.), దినేష్ కుమార్ (సంగమం అకాడమీ, ఇండియా) నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. డా.సామవేదం షణ్ముఖ శర్మ రచించిన శివపదం సాహిత్య పద్యాలతో పాటు త్యాగరాజు, అన్నమయ్య, మైసూర్ వాసుదేవాచార్యులు రచించిన సాహిత్యాలకు నృత్య ప్రదర్శన చేశారు. అలాగే శివాష్టకం, దుర్గా దేవిస్తోత్రం వంటి వేద స్తోత్రాలను అనేక నృత్య కళారూపాలలో ప్రదర్శించారు.మైత్రీమ్ భజత అనే గీతాన్ని కూడా అందమైన నృత్య రూపంతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా నవీన్ మేఘ్వాల్ (బాలిలోని ఐ.సి.సి.ఆర్ – ఎస్.వి.సి.సి డైరెక్టర్), డైరెక్టర్: ప్రొఫెసర్ డా. ఐ వాయన్ అద్న్యానా ఇసి, డెన్పాసర్లతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కళలకు ఎల్లలు లేవని చాటిచెప్పడానికే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. -
వెకేషన్లో చిల్ అవుతున్న సమంత, షార్ట్ హెయిర్‌తో క్యూట్ (ఫొటోలు)
-
సమంత వేసుకున్న ఈ డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సెలబ్రిటీలను చాలామంది ఫాలో అవుతుంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వాళ్లు వేసుకున్న డ్రెస్సులు, వాచీలు, గాడ్జెట్స్‌పై జనాలు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. వాళ్లు ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా ఆ వార్తలు క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత వేసుకున్న డ్రెస్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఆ స్టోరీ ఏంటన్నది ఇప్పుడు చూసేద్దాం. సమంత ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలోనూ సామ్ అవుట్‌ఫిట్స్ సూపర్ ట్రెండ్ అయ్యాయి. ప్రస్తుతం సామ్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలె మయోసైటిస్ నుంచి బయటపడిన సమంత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించదని టాక్. పలు నివేదికల ప్రకారం, ఆగస్ట్ 2023 మొదటి వారంలో సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం యూఎస్ వెళ్లనుంది. బ్రేక్ ప్రకటించిన వెంటనే ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్‌కు వెళ్లిన సమంత తాజాగా బాలికి వెకేషన్‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటుంది. రీసెంట్గా సమంత వేసుకున్న ఓ డ్రెస్ డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో ఓ డ్రెస్‌లో సమంత క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది. ఇక ఆ డ్రెస్ కాస్ట్ తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. కల్ట్ గయా కామెరూన్ నిట్ బ్రాండ్‌కు చెందిన గ్రీన్ కలర్ డ్రెస్‌లో సమంత స్టైలిష్‌గా దర్శనమిచ్చింది. ఆ డ్రెస్ ఖరీదు సుమారు రూ. 37, 790 రుపాయలు అని తేలింది. దీంతో ఇంత సింపుల్ డ్రెస్ అంత ఖరీదా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
‘ఈ ‘డర్టీ పాస్‌పోర్ట్’ పాస్ చేయాలంటే రూ. 82 వేలు కట్టాల్సిందే’.. యువతికి వేధింపులు!
ఎవరైనా సరే తమకు సంబంధించిన ముఖ్యమైన ధృవీకరణ పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే సమస్యల్లో పడతారు. ఇటువంటి నేపధ్యంలోనే అస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఎయిర్‌పోర్టు కౌంటర్లో.. బాలీ విమానాశ్రయం అధికారులు ఒక ఆస్ట్రేలియా యువతి దగ్గరున్నది ‘డర్టీ పాస్‌పోర్ట్’ అని ఆరోపిస్తూ, రూ. 1000 డాలర్లు వసూలు చేశారు. అధికారులు ఆమె దగ్గరున్న ‘డర్టీ పాస్ట్‌పోర్ట్’ను స్వీకరించలేమని పేర్కొన్నారు. న్యూయార్క్ పోస్ట్ రిపోర్టును అనుసరించి 28 ఏళ్ల యువతి తన తల్లితోపాటు సెలవుల్లో ఎంజాయ్ చేసేందుకు ఇండోనేషియా వెళుతోంది. బాటిక్ ఎయిర్‌పోర్టు కౌంటర్లో ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె దగ్గరున్న పాస్‌పోర్ట్ పాతబడిపోవడంతో ఆమె కొత్తగా ఒక ఫారం నింపాల్సి వచ్చింది. 7 సంవత్సరాల క్రితంనాటిది కావడంతో.. ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెచేత ఒక ప్రత్యేకమైన నీలిరంగు ఫారం మీద సంతకం చేయించారు. దానిని తనతో ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ పత్రానికి సంబంధించిన ప్రక్రియతోపాటు ఇమిగ్రేషన్ పూర్తయిన తరువాత వారికి విమానం ఎక్కేందుకు అనుమతి లభించింది. ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం ఆ పాస్‌పోర్ట్ 7 సంవత్సరాల క్రితంనాటిది. దీంతో అది కాస్త మురికిగా తయారయ్యింది. ‘నన్ను ఎగతాళి చేశారు’ ఆమె తన అనుభవాన్ని వివరిస్తూ ‘మాకు నిజమైన ఇబ్బంది బాలీ ఎయిర్‌పోర్టులో ఎదురయ్యింది. బాలీ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్‌కు ముందు అధికారులు నన్ను గంటపాటు ప్రశ్నించారు. వారు నన్ను చూసి నవ్వారు. చట్టాన్ని అతిక్రమించానని ఆరోపించారు. నా పాస్‌పోర్ట్ డ్యామేజ్ అయ్యిందంటూ ఎగతాళి చేశారు. 1000 డాలర్లు కడితే నా సమస్య పరిష్కారం అవుతుందని, లేనిపక్షంలో పాస్‌పోర్ట్ తిరగి ఇవ్వబోమని తెలిపారు. పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వబోమంటూ.. ఇటీవలే నేను ఉద్యోగాన్ని కోల్పోవడం వలన అంత మెత్తం చెల్లించలేనన్నాను. వెంటనే అధికారులు మా అమ్మతో మాట్లాడి, తన డర్టీ పాస్‌పోర్ట్ చెల్లుబాటుకు అనుమతినివ్వాలంటే 1000 డాలర్లు చెల్లించాలని మరోమారు తెలిపారు. అయితే ఆమె కూడా ఇందుకు సమ్మతించలేదు. దీంతో అధికారులు తన పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వబోమని హెచ్చరించారు. మరోమార్గం లేక అధికారులకు వారు అడిగినంత మొత్తం చెల్లించామని, అప్పుడు తమ ప్రయాణానికి ఏర్పడిన ఆటంకం తొలగిపోయిందని’ ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?
ప్రముఖ సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ సహా సుమారు 11 భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించాడు. పోకిరీ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన.. ఇటీవలే దాదాపు 57 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బరువాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఇప్పటికే మొదటి భార్యకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. కోల్‌కతాలో జరిగిన వీరి పెళ్లికి అత్యంత సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. (ఇది చదవండి: Bigg Boss Telugu 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. మేకర్స్ ఏం చెప్పారంటే) అయితే ప్రస్తుతం ఈ జంట హనీమూన్ ట్రిప్‌లో ఉన్నారు. ఇండోనేషియాలో బాలిలో ఈ జంట చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలను రూపాలి బరువా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. పచ్చదనం, ఆహ్లాదకరమైన కొండల మధ్య దిగిన ఫోటోను షేర్ చేశారు. గత నెలలో కూడా ఈ జంట సింగపూర్‌లో విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం. అయితే లేటు వయసులో పెళ్లి చేసుకోవడంతో ఆశిష్ విద్యార్థి ట్రోల్స్‌కు గురయ్యారు. ఆ వయసులో అవసరమా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కాగా.. ఆశిష్ విద్యార్థి మొదటి భార్య పిలూకు 2022లో విడాకులిచ్చారు. ప్రస్తుతం ఆశిష్ తదుపరి చిత్రం ఖుఫియాలో కనిపించనున్నారు. (ఇది చదవండి: నా కంటే 30 ఏళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకుంటే: ప్రముఖ సింగర్) View this post on Instagram A post shared by Rupali Barua (@ru.pa.li.73) -
చలికాలం ఈ భార్యాభర్తలను రూ. కోట్ల వ్యాపారవేత్తలను చేసింది
చండీఘర్‌కు చెందిన మోహిత్ అహ్లువాలియా, జగజ్యోత్ కౌర్ భార్యాభర్తలు. 2017 శీతాకాలంలో బాలికి విహారయాత్ర కోసం వెళ్లారు. ఈ వెకేషన్ వీరికి అద్భుతమైన జ్ఞాపకాలను అందించడమే కాకుండా కొత్త ఆలోచనను రేకెత్తించింది. నూతన ఆశ, ఆశయాలతో ఇంటికి వెళ్లిన ఆ దంపతులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టి సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. మోహిత్ అహ్లువాలియా సేల్స్ ప్రొఫెషనల్‌గా, జగజ్యోత్ కౌర్ హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేసేవారు. ఈ చండీగఢ్ జంట 2019లో ‘రామే’ (raamae) అనే పేరుతో గృహపయోగ, జీవనశైలి వస్తువుల వ్యాపార సంస్థను స్థాపించారు. ఇది శిక్షణ పొందిన కళాకారులు తయారు చేసిన హ్యాండ్-బ్లాక్ ప్రింటెడ్ వస్తువులైన కుషన్ కవర్లు, టోట్ బ్యాగ్‌లు, క్విల్ట్‌లు, పర్సులను విక్రయిస్తుంది. రామే అనేది బాలినీస్ పదం. బాలినీస్ ప్రజల జీవన విధానాన్ని ఇది సూచిస్తుంది. రద్దీ, అస్తవ్యస్తమైన ప్రపంచంలో నివసిస్తున్నప్పటికీ ఆనందాన్ని పొందడం దీని అర్థం. బాలి పర్యటనతో మలుపు ‘కొన్ని సంవత్సరాల క్రితం నేను చేసిన బాలి పర్యటన నా జీవితానికి మలుపు. అక్కడ స్థానికులు చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న ఆదరణను గమనించాను. భారత్‌లోనూ హస్తకళా ఉత్పత్తులు అనేకం ఉన్నాయి. అయితే విదేశాల్లో హస్తకళా ఉత్పత్తులకు ఉన్నంత ఆదరణ భారత్‌లో ఎందుకు ఉండటం లేదో ఆశ్చర్యంగా ఉంది’ అని జగజ్యోత్ కౌర్ ‘షి ద పీపుల్’ అనే ఆన్లైన్ మ్యాగజైన్‌తో పేర్కొన్నారు. బ్లాక్ ప్రింటింగ్‌తో రూపొందించిన భారతీయ వస్త్రాలకు ఎంతటి ఆదరణ ఉందో బాలిలోని వీధుల్లో తిరుగుతున్నప్పుడు తెలుసుకున్నట్లు మోహిత్ ‘ది బెటర్ ఇండియా’తో చెప్పారు. డబ్బు పరంగానే కాకుండా కస్టమర్ల గౌరవం కూడా వాటికి అదే స్థాయిలో ఉందన్నారు. బాలిలో వాటికి గణనీయమైన డిమాండ్ ఉన్నప్పటికీ, ఆ ఉత్పత్తులకు భారత్‌లో ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ జంట చేతివృత్తుల జీవనోపాధికి మద్దతు ఇవ్వాలని, బ్లాక్ ప్రింటింగ్‌ను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. పదేళ్లకు పైగా ఉన్న తమ కార్పొరేట్ కెరీర్‌ను విడిచిపెట్టారు. 2018లో జైపూర్ వెళ్లి స్థానిక కళాకారుల వద్ద బ్లాక్ ప్రింటింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. తర్వాత 2019లో రామే సంస్థను స్థాపించారు. ప్రస్తుతం వారు క్విల్ట్‌లు, పర్సులు, పర్సులు, పిల్లో కవర్లతో సహా 60 విభిన్న ఉత్పత్తులను దేశ విదేశాల్లో విక్రయిస్తున్నారు. రూ. 4 లక్షలతో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు ప్రతి నెలా రూ.18 లక్షలు, ఏటా రూ. 2.16 కోట్ల మేర వ్యాపారం సాగిస్తోంది. రాజస్థాన్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, మైసూర్, గోవా, కేరళ, ఇంఫాల్, అస్సాం, మిజోరాం ప్రాంతాల నుంచి వీరికి ఆర్డర్లు వస్తున్నాయి. యూఏఈ, అమెరికా వంటి దేశాల నుంచి కూడా వీరికి కస్టమర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Raamaé - Home Baby Lifestyle (@raamae_life) -
చిత్రకారుడు బాలి తనయుడు మంచు తుపానులో మృతి
సాక్షి, తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత, చిత్రకారుడు, బొమ్మల శిల్పి బాలి కుమారుడు మేడిశెట్టి గోకుల్ (45) అమెరికాలో మంచు తుపానులో చిక్కుకుని మరణించాడు. అమెరికాలో గుంటూరుకు చెందిన దంపతులను రక్షించబోయి గోకుల్ ప్రమాదంలో చిక్కుకుని మరణించాడు. ఆ సమయంలో గోకుల్ భార్య శ్రీదేవి, కూతురు మహతి ఒడ్డునే ఉన్నారు. వారి కళ్లెదుటే దుర్ఘటన జరగడంతో వారు కుప్పకూలిపోయారు. గోకుల్ కుటుంబం గత 15 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడింది. ఈయన అమెరికాలో ఓ ప్రముఖ బీమా కంపెనీలో అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. గోకుల్ మరణ వార్త తెలియడంతో ఇక్కడ బాలి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. చదవండి: (సీపీ టు డీజీపీ.. 36 ఏళ్లలో పని చేసిన 21 మంది) -
మార్కాపురం కుర్రాడు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి, మిస్టర్ ఇండియా విజేత.. ఇప్పుడేమో ఏకంగా
Bali Mr Universe Tourism 2023- Sai Bharadwaja Reddy: తనుబుద్ధి సాయి భరద్వాజ రెడ్డి... 21 ఏళ్ల కుర్రాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ నెల ఒకటవ తేదీన ఒడిశా రాష్ట్రం, పూరి పట్టణంలో జరిగిన మిస్టర్ ఇండియా పోటీల్లో విజేత. వచ్చే ఏడాది మార్చి 12 నుంచి 21 వరకు ఇండోనేషియా, ‘బాలి’ దీవిలో జరిగే ‘మిస్టర్ యూనివర్స్ టూరిజమ్ –2023’ పోటీల్లో మనదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా భరద్వాజ తన విజయరహస్యాన్ని సాక్షితో పంచుకున్నాడు. ‘‘మాది ప్రకాశం జిల్లా మార్కాపురం. నాన్న వ్యాపార రీత్యా విజయవాడలో పెరిగాను. నాకు ఫ్యాషన్ ప్రపంచం మీద చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది. ఫొటోజెనిక్‌గా కనిపించాలనే కోరిక ఉండేది. మంచి దుస్తులు ధరించడం, ఫొటోలు తీసుకోవడం ఇష్టం. బిడియపడకుండా కెమెరాను ఫేస్ చేయడం నన్ను విజేతగా నిలవడానికి కలిసి వచ్చిన ఒక అంశం. ఈ విజయం వెనుక ఐదేళ్ల కఠోరశ్రమ ఉంది. బీటెక్‌లో తొలి ప్రయత్నం మిస్ ఇండియా పోటీలలాగానే మిస్టర్ ఇండియా పోటీలు కూడా ఉంటాయని ఇంటర్లో ఉండగా తెలిసింది. బీటెక్‌లో యూనివర్సిటీ వేడుకల సందర్భంగా ఫ్యాషన్ కాంపిటీషన్ పాల్గొనడం, గెలవకపోవడం జరిగిపోయాయి. అప్పటి వరకు పోటీలను లైట్‌గా తీసుకున్నాను. పోటీని తేలిగ్గా తీసుకోరాదని అవగాహన వచ్చిన సందర్భం అది. డిప్రెషన్‌కి లోనయ్యాను కూడా. ఓటమిని జీర్ణించుకోలేని మానసిక స్థితిలో ఉన్నాననే సంగతిని నేను గ్రహించిన సందర్భం కూడా అదే. ఆ ఓటమి నాకు చాలా మంచి చేసిందనే చెప్పాలి. అప్పటి నుంచి బాడీ లాంగ్వేజ్‌ని కూడా ఈ పోటీలకు అనుగుణంగా మార్చుకున్నాను. నడవడం, నిలబడడం అన్నింటికీ ఓ లాంగ్వేజ్ ఉంటుంది. ప్రాక్టీస్ చేసేకొద్దీ నాలో ఆత్మవిశ్వాసం మెరుగవడం కూడా నాకే స్పష్టంగా తెలిసింది. ఈ పోటీలకు బాడీ బిల్డింగ్ అవసరం లేదు, ఫిట్‌గా ఉండడమే ప్రధానం. బాడీ, మైండ్, స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి. ప్రకటన లేని రెండో ప్రయత్నం సెకండ్ అటెంప్ట్‌కి చాలా పక్కాగా సిద్ధమయ్యాను. గెలిచాను కూడా. అయితే కోవిడ్ కారణంగా అకస్మాత్తుగా ఫలితాల ప్రకటన లేకుండా ఆ పోటీలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. ఇక మూడవ ప్రయత్నంలో ’మిస్టర్ క్లూ’గా ఎంపికయ్యాను. అయితే అది ఆన్లైన్ పోటీ. నాలుగవ ప్రయత్నంలో ఫైనల్స్‌కి ఎంపికయ్యాను, కానీ ఆర్థికపరమైన అడ్డంకి కారణంగా ఫైనల్స్‌లో పాల్గొనలేకపోయాను. నా ఫ్యాషన్ పోటీల్లో ఐదవ ప్రయత్నం ఈ ‘మిస్టర్ ఇండియా’ పోటీలు’’ అని వివరించాడు భరద్వాజ. విజేత బాధ్యత ఇది ఈ పోటీలను గ్లోబల్ మోడల్ ఇండియా ఆర్గనైజేషన్ నిర్వహించింది. ఇప్పటి వరకు మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్న విజేతల్లో చిన్నవాడు భరద్వాజ. వచ్చే ఏడాది బాలిలో మిస్టర్ యూనివర్స్ టైటిల్ కోసం పోటీ పడుతున్న అనేక దేశాల ‘మిస్టర్’లలో కూడా చిన్నవాడు. మిస్టర్ ఇండియా టూరిజమ్ టైటిల్ విజేతగా... అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ భారతీయ సంస్కృతి, పర్యాటకం పట్ల అవగాహన కల్పించడం అతడి బాధ్యత. ఈ సందర్భంగా దక్షిణాది పట్ల ఉత్తరాది వారికి ఉన్న చిన్నచూపును రూపుమాపడానికి కృషి చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. నాకు నేనే అన్నీ! పోటీదారులు ఎప్పుడూ మరొకరిలాగా కనిపించాలని అనుకరించకూడదు. నేను నాలాగే ఉన్నాను కాబట్టి విజేతనయ్యాను. మరో విషయం... నిపుణులైన కోచ్ శిక్షణ, డైటీషియన్ సలహాలు ఏవీ లేవు. ఉద్యోగం చేసుకుంటూనే ప్రాక్టీస్ చేశాను. ఉదయం ఐదింటికి లేచి జిమ్ చేసేవాడిని. ఓట్స్, ఎగ్స్ ప్రధానంగా సొంతవంట. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మళ్లీ ఎక్సర్సైజ్. మొత్తానికి నేను అనుకున్నది సాధించాను. ‘మిస్టర్ ఇంటర్నేషనల్’ టైటిల్‌ని మనదేశానికి తీసుకురావాలనేది ప్రస్తుత లక్ష్యం. – టి. సాయిభరద్వాజ రెడ్డి, మిస్టర్ ఇండియా 2022. – వాకా మంజులారెడ్డి చదవండి: Woolen Art: ఊలుతో అల్లిన చిత్రాలు.. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు రేణు ది గ్రేట్ -
ఇది అలాంటి శకం కాదు! మళ్లీ మోదీ మాటే ప్రధానంగా..
బాలి: ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యా తక్షణమే ముగింపు పలకాలని జీ20 సదస్సు నాయకులు పిలుపునిచ్చారు. ఇది యుద్ధాలు చేసుకునే శకం కాదని నినదించారు. ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాటలే జీ–20 సదస్సులో కూడా ప్రతిధ్వనించాయి. ఇది యుద్ధాల శకం కాదంటూ నాడు పుతిన్‌తో మోదీ చెప్పిన హితవచనాలనే జీ–20 సదస్సు ముగింపు రోజు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన రెండు రోజుల సదస్సులో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర, ప్రపంచ దేశాలపై దాని ప్రభావంపైనే ఎక్కువగా చర్చ జరిగింది. ‘‘శాంతి స్థాపన, కాల్పుల విరమణ, ఉద్రిక్తతల నివారణకే జీ–20 దేశాలు పిలుపునిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో అరాచకాలకు, యుద్ధానికి తెరపడాలి. ఈ యుద్ధం ఇంకా కొనసాగితే ఆహార, ఇంధన భద్రతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది’’ అని ఆ డిక్లరేషన్ పేర్కొంది. ‘‘ఘర్షణల శాంతియుత పరిష్కారం, సంక్షోభ నివారణకు కృషి, దౌత్యం, చర్చలు ఇవన్నీ ఇప్పుడు కీలకమే. ఇది యుద్ధాలు చేసుకునే శకం కాదు’’ అని ఆ డిక్లరేషన్‌లో సభ్యదేశాలు మూకుమ్మడిగా నినదించాయి. ఉక్రెయిన్ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై జీ–20 సదస్సులో సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అంతర్జాతీయ చట్టాలను అందరూ కట్టుబడి ఉండాలని సదస్సు గట్టిగా చెప్పింది. సంక్షోభంలో చిక్కుకున్న పౌరుల రక్షణ కూడా అత్యంత ముఖ్యమైనదేనని స్పష్టం చేసింది. సదస్సులో పాల్గొన్న అత్యధిక సభ్య దేశాలు రష్యా యుద్ధాన్ని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలను యదేచ్ఛగా ఉల్లంఘిస్తూ రష్యా చట్టవిరుద్ధంగా అన్యాయంగా చేస్తున్న యుద్ధం ఫలితంగా ప్రపంచం ఆర్థికంగా కోలుకోలేకుండా ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. శాంతి, స్థిరత్వాలను పరిరక్షించే అంతర్జాతీయ చట్టాలను అన్ని దేశాలు పాటించేలా చూడాలని పేర్కొన్నాయి. అణ్వాయుధాలను ప్రయోగిస్తామని రష్యా చేస్తున్న బెదిరింపులు ఆమోద యోగ్యం కాదని, ఈ యుద్ధంతో మానవీయ సంక్షోభంతో పాటు ఆర్థిక భారం కూడా ప్రపంచ దేశాలు మోయాల్సి ఉంటుందని వీలైనంత త్వరంగా యుద్ధానికి ముగింపు పలకాలని పేర్కొన్నాయి. కొన్ని దేశాలు మాత్రం అన్ని అంశాలను తులనాత్మకంగా బేరిజు వేసుకోవాలని తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. భారత్‌ది కీలక పాత్ర డిక్లరేషన్ రచనలో భారత్ ఇతర వర్ధమాన దేశాలతో కలిసి కీలకంగా వ్యవహరించింది. అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడానికి , ఒకే తాటిపై నిలబడడానికి భారత దౌత్య బృందానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తూ ప్రధాని మోదీ ప్రముఖ పాత్ర పోషించారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. ‘‘భారత్ తనకున్న , సానుకూల, నిర్మాణాత్మక వైఖరితో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న దేశంగా ఎదిగింది. పరిష్కార మార్గాలను చూపించడంలోనూ, అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయాలను సాధించడంలోనూ ముందుంది’’ అని జీ–20 డిక్లరేషన్ భారత్‌ను కొనియాడింది. ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడాలి ఉగ్రవాదానికి నిధులందించే కార్యకలాపాల కట్టడికి దేశాలన్నీ కలిసి రావాలని జీ 20 సభ్య దేశాలు పిలుపునిచ్చాయి. మనీ లాండరింగ్‌ని నిరోధించడం, ఉగ్రవాద సంస్థలకి నిధులు అందకుండా వ్యూహాత్మక వ్యవహరించడంతో చిత్తశుద్ధి ప్రదర్శించాలని సంయుక్త ప్రకటన పేర్కొంది. ఉగ్రవాద ముప్పు లేకుండా అన్ని దేశాలు కృషి చేయాలని ఆ ప్రకటన స్పష్టం చేసింది. మరోవైపు కరోనాతో కుదేలైన పర్యాటక రంగానికి ఊతమిచ్చే చర్యలపై కూడా సమావేశం దృష్టి సారించింది. భారత్‌కు జీ 20 అధ్యక్ష బాధ్యతలు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కూటమి జీ 20 అధ్యక్ష బాధ్యతల్ని భారత్ స్వీకరించింది. బాలిలో జరిగిన ముగింపు సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీకి ఇండొనేసియా అధ్యక్షుడు జోకో విడోడో లాంఛనంగా అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించారు. వచ్చే ఏడాది సదస్సు భారత్ ఆధ్వర్యంలో జరగనుంది. జీ 20 అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని మోదీ అన్నారు. ‘‘ఇవి అత్యంత ప్రతిష్మాత్మక బాధ్యతలు. సభ్య దేశాల సహాయ సహకారాలతో ప్రపంచ సంక్షేమానికి జీ 20 సదస్సును వేదికగా మారుస్తాం. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం, ఆహారం, ఇంధన ధరల పెరుగుదల వంటి సమస్యల నేపథ్యంలో కూటమి సారథ్య బాధ్యతలు స్వీకరిస్తున్నాం. అన్ని దేశాలు జీ 20 వైపే ఆశగా చూస్తాయి. భారత్ ఆధ్వర్యంలో జీ 20 అందరినీ కలుపుకొని పోతూ నిర్ణయాత్మకంగా, చర్యలు తీసుకునేలా ఉంటుంది. వచ్చే ఏడాదిలోగా జీ 20 కొత్త కొత్త ఆలోచనలు చేసి, సమష్టి నిర్ణయాలు తీసుకునేలా తీర్చిదిద్దుతాం’’ అని అన్నారు. 2024లో బ్రెజిల్‌లోనూ, ఆ తర్వాత ఏడాది 2025లో దక్షిణాఫ్రికాలోనూ జీ 20 సదస్సు జరగనుంది. -
G-20 Summit: మళ్లీ దారిమళ్లిన జీ–20
వర్తమానం యుద్ధశకంగా మారకూడదని, రష్యా–ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు అంతమొందించటానికి అన్ని పక్షాలూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిస్తూ రెండురోజులపాటు ఇండొనేసియా లోని బాలిలో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సు బుధవారం ముగిసింది. దేశాలమధ్య ఆర్థిక సహకారం పెంపొందించటం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరచాలన్న సంకల్పంతో 23 ఏళ్లక్రితం ఈ సంస్థ ఏర్పడింది. కానీ ఆరంభం నుంచీ ఇతరేతర సంక్షోభాలు దాన్ని ముసురుకుంటున్నాయి. పర్యవసానంగా శిఖరాగ్ర సదస్సు ఎజెండాపై కాక ఎప్పటికప్పుడు ముంచుకొచ్చే క్లిష్ట సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించక తప్పడం లేదు. జీ–20 సామాన్యమైనది కాదు. ప్రపంచ స్థూల ఉత్పత్తిలో ఈ సంస్థ సభ్య దేశాల వాటా 80 శాతం. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం ఈ దేశాలదే. ఇక జనాభారీత్యా చూస్తే దాదాపు మూడింట రెండువంతుల మంది ఈ దేశాల్లోనే నివసిస్తున్నారు. బాలి శిఖరాగ్ర సదస్సు ఎదుట పెద్ద ఎజెండాయే ఉంది. దాదాపు ఏణ్ణర్థంపాటు కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలన్నిటినీ తీవ్రంగా దెబ్బతీసిన నేపథ్యంలో భవిష్యత్తు సంక్షోభాలను ఎదుర్కొనడానికి అంతర్జాతీయంగా పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ రూపకల్పనపై సమాలోచనలు ఈ సదస్సు లక్ష్యం. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరింత సమర్థవంతంగా అమలయ్యేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని కూడా ముసాయిదా తెలిపింది. స్వచ్ఛ ఇంధన వనరుల వినియోగం పెరిగేలా, ప్రపంచ దేశాలు ఆ దిశగా మళ్లేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించాలని కూడా సంకల్పించారు. స్వచ్ఛ ఇంధన వనరుల కోసం భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. అందు కోసం సంపన్న దేశాలు ఏం చేయాలో కూడా ఈ సదస్సులో చర్చించాల్సి ఉంది. కానీ రెండురోజుల సదస్సునూ గమనిస్తే నిరాశే మిగులుతుంది. నిరుడు అక్టోబర్‌లో ఇటలీలోని రోమ్‌లో జీ–20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ ఏడాది కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. జీ–20 సభ్య దేశాల్లో కోవిడ్ పర్యవసానంగా ఉత్పాదకత గణనీయంగా పడిపోయింది. మన దేశం వరకూ చూస్తే ఉత్పాదకతలో 14 శాతం క్షీణత కనబడుతోంది. అందరికన్నా అధికంగా నష్టపోయింది మనమే. మొన్న ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగకపోయివుంటే ఆర్థిక వ్యవస్థలు ఇంత చేటు నష్టపోయేవి కాదేమో! కానీ దురాక్రమణ, అనంతరం రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు తీసుకొచ్చిన అనిశ్చితి ద్రవ్యోల్బణాన్ని అమాంతం తారస్థాయికి చేర్చింది. పర్యవసానంగా వేరే దేశాల మాటేమోగానీ పశ్చిమ దేశాల కొనుగోలు శక్తి పడిపోయింది. వృద్ధిని అది కోలుకోలేని దెబ్బతీసింది. ఈ గండంనుంచి గట్టెక్కేందుకు చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి. ఇది సహజంగానే ఆర్థిక కార్య కలాపాలపై ప్రభావం చూపింది. అమెరికా, బ్రిటన్లు ఆర్థిక మాంద్యంలోకి జారుకునే సూచనలు కనబడుతున్నాయి. యూరోప్ దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగమనం నుంచి స్తంభించే దిశగా కదులుతున్నాయంటున్నారు. ఆకలి, నిరుద్యోగం ఇప్పటికే చాలా దేశాలను చుట్టుముట్టాయి. ఇక ప్రపంచ ఆర్థిక చోదక శక్తుల్లో ఒకటైన చైనాను రియల్ ఎస్టేట్ సంక్షోభం పీడిస్తోంది. దాంతో ఆ దేశ జీడీపీ బాగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. దీన్నుంచి బయటపడటం మాట అటుంచి కనీసం తక్కువ నష్టంతో గట్టెక్కాలన్నా జీ–20 దేశాలమధ్య సహకారం, సమన్వయం, ఐక్యత అవసరం. ఈ శిఖరాగ్ర సదస్సు ఎజెండాలోని అంశాల మాట అటుంచి కనీసం సభ్య దేశాల ఐక్యతకు అనువైన కార్యాచరణ రూపొందించగలిగితే బాగుండేది. కానీ అది సాధ్యపడినట్టు కనబడటం లేదు. ఈమధ్య ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదిక ఒక ముఖ్యమైన సూచన చేసింది. జీ–20 దేశాలన్నీ సమష్టిగా కదలి, గట్టి కార్యాచరణకు పూనుకొంటే ప్రస్తుత సంక్షోభంనుంచి ప్రపంచం గట్టెక్కుతుందని తెలిపింది. ఇందుకు శాంతి నెలకొనడం అవసరమని వివరించింది. కానీ వినేదెవరు? సదస్సు మొదటి రోజున కూడా ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై రష్యా క్షిపణి దాడులు చేసింది. నాటో సభ్యదేశమైన పోలాండ్‌లో రష్యా క్షిపణి ఒకటి పేలి ఇద్దరు పౌరులు మరణించారు. ఇది ఉద్దేశపూర్వకమా, పొరపాటా అన్నది నిర్ధారణ కాలేదు. ఆ క్షిపణి రష్యా భూభాగంనుంచి ప్రయోగించివుండకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెబుతున్నారు. రష్యా ఉద్దేశపూర్వ కంగా చేసివుంటే అది నాటోకు తొలి హెచ్చరిక పంపినట్టే అనుకోవాలి. ఈసారి జీ–20 సదస్సు మొత్తం రష్యా–ఉక్రెయిన్ లడాయిపైనే కేంద్రీకరించక తప్పని స్థితి ఏర్ప డింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సదస్సుకు రాలేదన్న మాటేగానీ సదస్సు మొత్తం ఆయన చుట్టూ, ఆయన మున్ముందు వేయబోయే అడుగుల చుట్టూ తిరిగింది. ఏతావాతా ప్రచ్ఛన్న యుద్ధ కాలానికి ప్రపంచం తిరోగమించిందనే చెప్పుకోవాలి. రష్యా–పాశ్చాత్య దేశాల వైషమ్యాలు పెచ్చుమీరాయి. దీనికి చైనా తలనొప్పి అదనం. అందువల్లనే ప్రధాన ఎజెండా మాట అటుంచి అసలు రష్యా దురాక్రమణను ఖండిస్తూ జీ–20 ఒక సంయుక్త ప్రకటనైనా విడుదల చేయగలదా అన్న సందేహాలు తలెత్తాయి. అనుకున్నట్టే ఆ ప్రకటనలో హితబోధలే ధ్వనించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 1న జీ–20 సారథ్య బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రెండు ప్రపంచ యుద్ధాల పర్యవసానంగా మానవజాతి మనుగడకు ఏర్పడిన ముప్పును గుర్తుంచుకునైనా సంపన్న రాజ్యాలు కయ్యానికి కాలుదువ్వే పోకడలకు స్వస్తిపలకాలి. శాంతి నెలకొనడానికి దోహదపడాలి. -
బైడెన్‌తో మీట్.. సునాక్‌తో ముచ్చట్లు.. ఆయనతో షేక్‌హ్యాండ్
బాలి: జీ20 సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అమెరికాతో భారత సంబంధాలపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ లోతైన చర్చలు జరిపారు. సమీప భవిష్యత్తులో అత్యంత కీలకంగా మారనున్న పలు అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానాల వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు పురోగతిని సమీక్షించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపైనా చర్చించారు. జీ 20 సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు మంగళవారం విడిగా సమావేశమయ్యారు. అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలపైనా బైడెన్‌తో మోదీ చర్చించినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘‘క్వాడ్, ఐ2యూ2 తదితర నూతన గ్రూపుల్లో భారత్, అమెరికా సన్నిహిత సంబంధాల పట్ల ఇరువురూ సంతృప్తి వెలిబుచ్చారు. ఇండో–యూఎస్ బంధాన్ని బలోపేతం చేసేందుకు మద్దతుగా నిలుస్తున్నందుకు బైడెన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది భారత సారథ్యంలో జరిగే 18వ జీ 20 సదస్సు సందర్భంగా కూడా ఈ సహకారం ఇలాగే కొనసాగుతుందని విశ్వాసం వెలిబుచ్చారు’’ అని వివరించింది. ఇరువురి మధ్య ప్రయోజనాత్మక చర్చలు జరిగినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. గత వారం కాంబోడియా రాజధాని నాంఫెన్‌లో ఆసియాన్ ఇండియా శిఖరాగ్రం సందర్భంగా భారత, అమెరికా విదేశాంగ మంత్రులు చర్చలు జరపడం తెలిసిందే. జిన్‌పింగ్‌తో కరచాలనం జీ20 సదస్సు సందర్భంగా బాలిలో మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కరచాలనం చేసుకోవడం దేశాధినేతలతో సహా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇండోనేíషియా అధ్యక్షుడు ఏర్పాటు చేసిన స్వాగత విందు ఇందుకు వేదికైంది. అటుగా వెళ్తున్న జిన్‌పింగ్ ఆగి మోదీకి షేక్‌హ్యాండిచ్చారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ కన్పించారు. అధికారిక భేటీ కూడా ఉంటుందని ప్రచారమైనా అలాంటిదేమీ జరగలేదు. భారత్, చైనా మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు పెరగడం తెలిసిందే. 2020లో గాల్వన్ లోయలో చైనా సైన్యం భారత సైనికులపై దొంగ దెబ్బ తీసి 20 మందికి పైగా పొట్టన పెట్టుకున్న తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలొచ్చాయి. అప్పటినుంచీ మోదీ, జిన్‌పింగ్‌ల ముఖాముఖి జరగలేదు. సెప్టెంబర్‌లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ వార్షిక శిఖరాగ్రం సందర్భంగా ఇరువురూ కలుసుకున్నారు. సునాక్‌తో మోదీ ముచ్చట్లు కొంతకాలంగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. గత నెలలో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై, ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. బాలిలో జీ 20 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించారు. సునాక్ పీఎం అయ్యాక వారిరువురూ భేటీ కావడం ఇదే తొలిసారి. నేతలిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారంటూ ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ, ఇతర దేశాధినేతలు, ఐఎంఎఫ్ చీఫ్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు తదితరులతోనూ మోదీ ముచ్చటించారు. రిషి, మాక్రాన్, విడొడొతో బుధవారం ఆయన సుదీర్ఘ చర్చలు జరపనున్నారు. -
ప్రపంచ శాంతి కోసం.. చేతులు కలుపుదాం
బాలి: ప్రపంచ శాంతి కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ–20 దేశాల అధినేతలకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్–రష్యా ఘర్షణకు త్వరగా ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. సమస్య పరిష్కారంపై తక్షణమే దృష్టి పెట్టాలని.. ఈ దిశగా కాల్పుల విరమణతోపాటు దౌత్య మార్గం కోసం అన్వేషించాలని చెప్పారు. ఇంధన దిగుమతుల విషయంలో భారత్‌పై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని పశ్చిమ దేశాలకు సూచించారు. ఆంక్షలను తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇండోనేషియాలోని బాలిలో జీ–20 శిఖరాగ్ర సదస్సులో మంగళవారం సభ్యదేశాల అధినేతలను ఉద్దేశించి ప్రధాని మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వాతావరణ మార్పులు, కోవిడ్–19 మహమ్మారి, ఉక్రెయిన్–రష్యా యుద్ధం వంటివి ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయని అన్నారు. గ్లోబల్ సప్లై చైన్లు దెబ్బతిన్నాయని, ఫలితంగా అన్ని దేశాల్లో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సదస్సులో నరేంద్ర మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. పేదలకు నిత్య జీవితమే ఒక పోరాటం ‘‘వచ్చే ఏడాది జీ–20 కూటమికి భారత్ నాయకత్వం వహించబోతోంది. గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ జన్మించిన పవిత్రమైన గడ్డపై మనం కలుసుకోబోతున్నాం. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి మనమంతా ఒక అంగీకారానికి రావాలి. కీలకమైన అంశాలపై ప్రపంచ దేశాల నడుమ ఏకాభిప్రాయం కోసం భారత్ పనిచేస్తుంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార, ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. అత్యవసర, నిత్యవసర సరుకులు అందరికీ అందడం లేదు. అన్ని దేశాల్లో పేదల అగచాట్లు మరింతగా పెరిగిపోతున్నాయి. నిత్య జీవితం వారికి ఒక పోరాటంగా మారిపోయింది. సవాళ్లను ఎదుర్కొనేందుకు అసవసరమైన ఆర్థిక సామర్థ్యం వారికి లేదు. పేదల సమస్యలకు ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా పరిష్కారం చూపడం లేదన్న నిజాన్ని గుర్తించడానికి సంకోచించాల్సిన పనిలేదు. బడుగు వర్గాలకు తోడ్పడే సంస్కరణలను తీసుకురావడంలో విఫలమవుతున్నాం. జీ–20పై ప్రపంచానికి ఎన్నో ఆశలున్నాయి. మన కూటమికి ప్రాధాన్యం ఎన్నోరెట్లు పెరిగింది. క్లీన్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపు పొందింది. ప్రపంచం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే భారత్‌లో ఇంధన భద్రత ఉండడం చాలా ముఖ్యం. అందుకే ఇంధన సరఫరాపై ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడాలి. ఎనర్జీ మార్కెట్లో స్థిరత్వం సాధించాలి. క్లీన్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంది. ‘న్యూ వరల్డ్ ఆర్డర్’ సృష్టించాలి ఉక్రెయిన్‌లో శాంతి కోసం అందరూ చొరవ చూపాల్సిన సమయం వచ్చింది. ‘న్యూ వరల్డ్ ఆర్డర్’ను సృష్టించే బాధ్యత మన భుజస్కందాలపై ఉంది. భూగోళంపై శాంతి, సామరస్యం, భద్రత కోసం ఉమ్మడి కృషి సాగించాలి. డ్రాఫ్ట్ స్టేట్మెంట్ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఖండిస్తూ జీ–20 సదస్సులో ఒక ముసాయిదా నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికపై సదస్సులో చర్చ జరిగింది. ఉక్రెయిన్ నుంచి రష్యా తన సైన్యాన్ని బేషరతుగా పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌ను ప్రస్తావించారు. జీ–20 సదస్సుకు రష్యా తరపున విదేశాంగ మంత్రి లావ్రోవ్ హాజరయ్యారు. ప్రవాస భారతీయులతో మోదీ భేటీ ఇప్పటి ఇండియాకు, 2014 ముందు నాటి ఇండియాకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఊహించలేనంత వేగంతో ఇప్పుడు భారత్ అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఆయన మంగళవారం ఇండోనేషియాలోని బాలిలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. మోదీ, మోదీ అంటూ బిగ్గరగా నినదిస్తూ వారు ఆయనకు స్వాగతం పలికారు. 21వ శతాబ్దంలో ప్రపంచానికి భారత్ ఒక ఆశారేఖగా మారిందని మోదీ వివరించారు. డిజిటల్ టెక్నాలజీ, ఆర్థికం, ఆరోగ్యం, టెలికాం, అంతరిక్షం తదితర రంగాల్లో భారత్ సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్ గొప్పగా ఆలోచిస్తోందని, గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుంటోందని వెల్లడించారు. మా గెలుపునకు మలుపు: జెలెన్స్కీ ఖెర్సన్ నగరాన్ని విముక్తం చేయడం రష్యాతో జరిగే యుద్ధంలో కీలక మలుపు కానుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర పక్షాల సైన్యాలు ఫ్రాన్సులోని నార్మండీలోకి ప్రవేశించిన డీ–డేతో దీనిని ఆయన పోల్చారు. జెలెన్స్కీ మంగళవారం జి–20 భేటీని ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. రష్యా దురాగతాలపై ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జి–20 వేదికను రష్యాలేని జి–19గా మార్చాలని కోరారు. సందడిగా జీ–20 శిఖరాగ్ర సదస్సు జీ 20 శిఖరాగ్ర సదస్సులో బాలిలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యింది. కూటమిలోని సభ్యదేశాల అధినేతలు హాజరయ్యారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అతిథ్య దేశం ఇండోనేషియా ప్రధాని జోకో విడొడో ఘనంగా స్వాగతం పలికారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను అందరూ పాటించాలని ప్రపంచ దేశాలకు విడొడో విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి త్వరగా తెరపడాలని ఆకాంక్షించారు. జీ–20 అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా నుంచి భారత్ స్వీకరించనుంది. 2023లో కూటిమికి భారత్ నాయకత్వం వహించనుంది. భారత ప్రధాని మోదీ బుధవారం ఇండోనేషియా ప్రధాని విడొడో, స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌తో సమావేశం కానున్నారు. -
G20: ఇప్పుడు మన వంతు వచ్చింది: ప్రధాని మోదీ
జకార్త: ఇండోనేషియా బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ మీద కీలక ప్రసంగం చేశారాయన. ఆ సమయంలో ఉక్రెయిన్ పరిణామంపై స్పందించిన ఆయన.. కాల్పుల విరమణ, దౌత్యవేత్తం దిశగా ప్రపంచం ఓ మార్గాన్ని వెతకాల్సిన అవసరం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గత శతాబ్దంలో.. రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచ విధ్వంసానికి కారణమైంది. ఆ తర్వాత.. శాంతి బాట పట్టేందుకు అప్పటి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. ఈ సమయంలో ప్రపంచ శాంతి, సామరస్యం, భద్రతను నిర్ధారించడానికి.. ఖచ్చితమైన, సామూహిక సంకల్పాన్ని ప్రదర్శించడం అవసరం. వచ్చే ఏడాది బుద్ధుడు, గాంధీల పవిత్ర భూమిలో(భారత్‌లో జరగబోయే సమావేశాన్ని ఉద్దేశించి..) G20 సమావేశమైనప్పుడు.. మనమంతా ప్రపంచ శాంతి అనే బలమైన సందేశం తెలియజేయడానికి అంగీకరిస్తామని నేను విశ్వసిస్తున్నా.. అంటూ ఆయన సలహా పూర్వక ప్రసంగం కొనసాగించారు. అలాగే.. ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు, కరోనా లాంటి పరిణామాలు ప్రపంచ ఉత్పత్తుల మీద తీవ్ర ప్రభావం చూపెట్టాయని, ప్రపంచం మొత్తం మీద ఈ సంక్షోభం కొనసాగుతోందని, ముఖ్యంగా దాదాపు అన్ని దేశాల్లో పేదలకు పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని భారత ప్రధాని మోదీ అన్నారు. ఇక భారత్‌లో ఆహార భద్రతను ప్రస్తావించిన ప్రధాని మోదీ.. రాబోయే రోజుల్లో ఫెర్టిలైజర్స్ కొరత.. ఆహార సంక్షోభానికి దారి తీయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభావవంతమైన గ్లోబల్ బ్లాక్ భారత్ తరపున.. అన్ని ముఖ్యమైన సమస్యలపై ప్రపంచ ఏకాభిప్రాయాన్ని సాధించడానికి కృషి చేయడం జరుగుతుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. PM Modi attends #G20Indonesia Working Session on food & energy security. In his intervention, he underlined the criticality of resilient supply chains for food, fertilizers & energy, the need for affordable finance for a smooth energy transition for the Global South: MEA pic.twitter.com/GhHvGFxBZ8 — ANI (@ANI) November 15, 2022 అంతకు ముందు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును తిరిగి పట్టాలెక్కించడం, ఆహార, ఇంధన భద్రత తదితర కీలకాంశాలపై పలువురు దేశాధినేతలతో లోతుగా చర్చస్తానని బాలి పర్యటనకు బయల్దేరే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పలు రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతి, గ్లోబల్ వార్మింగ్ తదితర ప్రపంచ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో చేస్తున్న కృషిని జీ 20 వేదికపై ప్రస్తావిస్తానని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రధాని పేర్కొన్నారు. వచ్చే ఏడాది భారత్ సారథ్యంలో జరిగే జీ20 సదస్సుకు ‘ఒకే భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు’ (వసుధైవ కుటుంబం) ప్రధాన నినాదంగా ఉండబోతోందని పేర్కొన్నారు. ఇండొనేసియా అధ్యక్షుడి నుంచి జీ 20 సారథ్య బాధ్యతలు భారత్ స్వీకరించనుండటాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. సదస్సు సందర్భంగా పలువురు దేశాధినేతలతో విడిగా భేటీ కానున్నారు. అమెరికా, చైనా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, షీ జిన్‌పింగ్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులు భేటీలో పాల్గొననున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో మోదీ భేటీ జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. -
Bali G20 Summit: జీ 20 సదస్సుకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ/బాలి: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండొనేసియా బయల్దేరి వెళుతున్నారు. ఇండొనేసియాలోని బాలిలో 15, 16 తేదీల్లో జరిగే 17వ జీ 20 శిఖరాగ్రంలో మూడు ముఖ్యమైన సెషన్స్‌లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కొల్జ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు కూడా హాజరవనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదు. అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు 20 దేశాల కూటమి అయిన జీ 20 18వ సదస్సుకు 2023లో భారత్ అధ్యక్షత వహించనుంది. బాలి సదస్సులో ఇండొనేసియా నుంచి సారథ్య బాధ్యతలను భారత్ అందుకోనుంది. సునాక్‌తో ప్రత్యేకంగా భేటీ! జీ 20 సదస్సుకు హాజరయ్యే దేశాధినేతలతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపే అవకాశాలున్నాయి. దీంతో అందరి దృష్టి భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో మోదీ భేటీపై ఆసక్తి నెలకొంది. అయితే వీరిద్దరి మధ్య భేటీ ఉంటుందో లేదో ఇరుపక్షాలు కూడా స్పష్టం చేయలేదు. -
జీ20 సదస్సుకు మోదీ
న్యూఢిల్లీ: జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇండోనేసియాలోని బాలీకి వెళ్లనున్నారు. నవంబర్ 14–16 తేదీల్లో సదస్సుకు హాజరవుతారు. అదే తేదీల్లో సదస్సుకు విచ్చేస్తున్న పలు దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బగ్చీ గురువారం ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ‘‘ సమిష్టిగా కోలుకుందాం. మరింతగా బలీయమవుదాం.. అనే ఇతివృత్తంతో కొనసాగే ఈసారి జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్, ప్రధాని మోదీ సహా భాగస్వామ్యదేశాల అగ్రనేతలు పాల్గొంటారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లతోపాటు ఆహారం, ఇంధన భద్రత, ఆరోగ్యంæ అంశాలపైనా చర్చిస్తారు. ఈ ఏడాది జీ20 సదస్సుకు నాయకత్వం వహిస్తున్న ఇండోనేసియా అధ్యక్షుడు జోకో సదస్సు చివరి రోజున తదుపరి నాయకత్వ పగ్గాలను మోదీకి లాంఛనంగా ఇవ్వనున్నారు’ అని బగ్చీ చెప్పారు. -
ఇండోనేషియా కొత్త వీసా: ‘సెకండ్ హోం’ అక్కడే పదేళ్లు పండగ!
న్యూఢిల్లీ: ఇండోనేషియా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు కొత్త వీసాను తీసుకొచ్చింది. ఇందుకోసం ‘సెకండ్ హెమ్ వీసా’ ప్రోగ్రామ్‌ను తీసు కొచ్చింది. ఈ వీసా ద్వారా పర్యాటకులు బాలిలో గరిష్టంగా 10 సంవత్సరాలు నివసించవచ్చు. అంతేకాదు ఈ వీసాతో, విదేశీయులు ఐదు లేదా పదేళ్ల పాటు పెట్టుబడి, ఇతర కార్యకలాపాలు వంటి వివిధ కార్యకలాపాలను నిర్వహించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సంపన్న వర్గాలు ఈ వీసా ద్వారా దీర్ఘకాలికంగా ఇక్కడ బస చేవయచ్చని ఇండోనేషియా తాజాగా ప్రకటించింది. బాలి సహా అనేక ఇతర పాపులర్ టూరిస్ట్ ప్రదేశాలకు వచ్చే విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే దీని లక్ష్యం అని ఇమ్మిగ్రేషన్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ విడోడో ఏకత్జాజానా మంగళవారం జారీ చేసిన ఆదేశాల్లో తెలిపారు. ఈ విధానం క్రిస్మస్ రోజున లేదా కొత్త నిబంధన జారీ చేసిన 60 రోజుల తర్వాత అమలులోకి వస్తుందని తెలిపారు. ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కొంతమంది విదేశీయులకు ఇది ఆర్థికేతర ప్రోత్సాహకమని విడోడో ఎకత్జాజానా వ్యాఖ్యానించారు. తాజా ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతాల్లో కనీసం 130,000 డాలర్లు (కోటి 60 లక్షల రూపాయలకు పైనే) ఉన్నవారు కొత్త “సెకండ్ హోమ్ వీసా” పొందడానికి అర్హులు. ఆ దేశ అధికారిక ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా నిబంధనలకు ప్రకారం ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు విమానయాన సంస్థ ఇండోనేషియా గరుడ అంతర్జాతీయ విమానాలను పునః ప్రారంభించడంతో ఇండోనేషియాకు విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పుంజు కోనుందని భావిస్తున్నారు. దీనికి తోడు బాలిలో నవంబర్‌లో జరిగే G-20 సమ్మిట్‌కు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రతినిధులు తరలి రానున్నారు. దీంతో భారీ ఆదాయాన్ని ఇండోనేషియా ఆశిస్తోంది. -
ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అరున్ బాలి(79)కన్నుమూశారు. మస్తీనియా గ్రావిస్ అనే అరుదైన నాడీ కండరాల వ్యాధితో బాధపడుతున్న బాలి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. 3 ఇడియట్స్, పీకే వంటి హిట్ సినిమాలతో పాటు అనేక సీరియళ్లు, సినిమాల్లో ఆయన నటించారు.ఇటీవలే విడుదలైన 'లాల్‌సింగ్ చద్దా' సినిమాలోనూ ఆయన కనిపించారు. బాలి మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యోగులకు బంపర్ ఆఫర్: ఖాళీలున్నాయా బాస్ అంటున్న నెటిజన్లు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇవ్వడం వైరల్‌గా మారింది. సిడ్నీకి చెందిన మార్కెటింగ్ సంస్థ సూప్ ఏజెన్సీ ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. మొత్తం ఉద్యోగులందరినీ చాలా ఖరీదైన ట్రిప్‌కు తీసుకెళ్లింది. అందులోనూ ఉద్యోగులలో ఒకరి 24వ పుట్టినరోజును కూడా ఘనంగా నిర్వహించింది. దీంతో కంపెనీ ఎండీ కాట్యా వకులెంకో, "వరల్డ్స్ బెస్ట్ బాస్" అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. అంతేకాదు ఈ రోజు సూప్ ఏజెన్సీ మూడో పుట్టినరోజును జరుపుకుంటోంది. తొందర్లోనే మరో యూరప్‌కు ట్రిప్‌ను ప్లాన్ చేస్తోందట కంపెనీ. View this post on Instagram A post shared by Soup Agency (@soup_agency) ఈ సంవత్సరం మేలో జరిగిన ఈ ట్రిప్పై నెటిజన్లులు కామెంట్ల వర్షం కురిపించారు. "లక్కీ ఉద్యోగులు...మనకు అదంతా కలే " అని ఒక యూజర్ వాపోయాడు. నాకు అలాంటి అద్భుతమైన ఏజెన్సీ, యజమానిని దొరికితేనా.. నా నా సామి రంగ అన్నట్టుగా మరొకరు కమెంట్ చేశారు. అంతేకాదు ఏమైనా వేకెన్సీలున్నాయా బాస్ అంటూ మరో యూజర్ కమెంట్ చేయడం విశేషంగా నిలిచింది. ఇండొనేసియాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బాలికి తన ఉద్యోగులందర్నీ హాలీడే ట్రిప్‌నకు పంపించింది ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన సూప్ ఏజెన్సీ ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా 2 వారాల పెయిడ్ లీవ్ ఇచ్చింది. అంతేకాదు విలాసవంతమైన హాలీడే ట్రిప్‌నకు అయ్యే ఖర్చులన్నీ తానే భరించింది. దీంతో ఉద్యోగులందరూ ఎగిరి గంతేసి మరీ పండగ చేసుకున్నారు. ఫ్యామిలీలతో బాలికి చెక్కేశారు. జాగింగ్లు, డ్రింక్స్‌తో అంటూ తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను జూన్ 9న కంపెనీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. బాలిలో ఉద్యోగులు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా కంపెనీ వెబ్సైట్ ప్రకారం, సూప్ ఏజెన్సీ సిడ్నీలో ఇండిపెండెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఇన్వెంటివ్, డేటా ఆధారిత ప్రచారాలకు అత్యుత్తమ ఫలితాలను సాధించిన కంపెనీగా పాపులర్ అయింది. కోవిడ్-19 సంక్షోభం సమయంలో ఉత్పాదకత ఎక్కువగానే ఉందని డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కుమి హో తెలిపారు. ఇది ఖచ్చితంగా జీవితంలో మరచిపోలేని అనుభవం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Soup Agency (@soup_agency) -
నగ్నంగా ఫొటో ఫోజులు.. మన్నించండి పెద్ద తప్పే చేశా!
జకార్తా: సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల అతి చేష్టలు ఒక్కోసారి హద్దు దాటిపోతుంటాయి. ఆ సమయంలో విమర్శలు వచ్చినా.. తమను తాము సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ తరుణంలో.. ఒకావిడకు అలాంటి అవకాశం లేకుండా చేశారు. ఏడు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఓ చెట్టును బాలి(ఇండోనేషియా) టబనన్ ప్రజలు పరమ పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి చెట్టు దగ్గర ఓ రష్యా జంట అత్యుత్సాహంతో వెకిలి పనులకు పాల్పడింది. నగ్నంగా ఫోట్ షూట్ చేసింది. బాబకన్ గుడిలోని ఆ మర్రిచెట్టు దగ్గర న్యూడ్ ఫోటోషూట్ చేసింది ఆ జంట. అలినా ఫజ్లీవా అనే ఇన్స్టాగ్రామ్ మోడల్ నగ్నంగా చెట్టు సమక్షంలో ఫోజులు ఇవ్వగా.. ఆమె భర్త అండ్రే ఫొటోలు తీశాడు. అంతటితో ఆగకుండా ఆ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇంకేం బాలినీస్ హిందూ వర్గాలకు చిర్రెత్తుకొచ్చింది. వాళ్ల దృష్టిలో పర్వతాలు, చెట్లు, సహజ వనరులను పవిత్రంగా భావిస్తుంటారు. ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం కాగా.. రష్యా ఇన్ఫ్లుయెన్సర్ అలినా ఫజ్లీవాను, ఆమె భర్తను బాలి నుంచి వెల్లగొట్టారు. శుక్రవారం వాళిద్దరినీ దగ్గరుండి సాగనంపారు పోలీసులు. ఇక ఈ ఘటనకుగానూ శిక్షగా ఆరు నెలలపాటు ఈ జంటను ఇండోనేషియాలో అడుగుపెట్టనివ్వరు. వెళ్లగొట్టే ముందు వాళ్లు ఫొటో షూట్ చేసిన పవిత్రమైన చోటుని.. వాళ్లతోనే శుభ్రం చేయించారు. తాము చేసిన పనికి క్షమాపణలు చెబుతూ అలీనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం ఉంచడంతో పాటు ఓ వీడియోను విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. ఇండొనేషియాలోనే పోయిన నెలలో కెనడా నటుడు ఒకడు.. నగ్నంగా బటూర్ పర్వతంపై సంచరించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో.. అతన్ని కూడా అరెస్ట్ చేయకుండా హెచ్చరించి అక్కడి నుంచి పంపించేశారు. -
అందుకే నా కుమారులతో కలిసి అశ్లీల వీడియోలు చూస్తా..!
జకార్తా: సాధారణంగా తల్లిదండ్రులందరు తమ పిల్లల కోసం పరితపిస్తుంటారు. తమ వారు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు. ఈ క్రమంలో పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ.. వారికి కావాల్సింది కొనిస్తారు. అయితే, కొంత మంది పిల్లలు ఆన్లైన్ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఆశ్లీల వీడియోలు చూస్తున్న సంఘటనలు తరచుగా వార్తల్లో చదువుతూనే ఉంటాం. కొంత మంది పిల్లలు పాశ్చాత్య పోకడలకు పోయి.. ప్రతి చిన్న విషయాలకు అబద్ధాలు చెబుతూ.. కన్న వారిని సైతం, మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. అయితే, ఈ తల్లి అందరిలా కాకుండా.. కాస్త వెరైటీగా ఆలోచించింది. ‘పిల్లలకు ఏది వద్దంటే.. అదే చేస్తారు’. కాబట్టి వారికి దాంట్లో మంచి..చెడులను చెప్పాలనుకుంది. అందుకే తన పిల్లలతో కలిసి పోర్న్ వీడియోలు చూస్తూ వారికి లైంగిక జీవితం పట్ల అవగాహన కల్పించింది. దీంతో ఈమె వార్తలలో నిలిచింది. వివరాలు.. ఇండోనేషియాకు చెందిన ప్రముఖ పాప్ స్టార్ యుని శరాకు ఇద్దరు కొడుకులు. ఈ మధ్య ఆమె ఒక యూట్యూబ్ ఇంటర్య్వూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. 47 ఏళ్ల వయసున్న యూనీ, తన ఇద్దరు కొడుకులు.. కెవిన్ సియాహన్, సెల్లో నియాహన్లతో కలిసి పోర్న్ వీడియోలు చూస్తానని బాంబ్ పేల్చింది. ప్రస్తుత స్మార్ట్ యుగంలో పిల్లలను చెడు వ్యవసనాల బారిన పడకుండా చూడటం దాదాపు అసాధ్యం. ఒకవేళ మనం వారిని దీనిపై కట్టడి చేస్తే.. మనకు తెలియకుండా ఎలాగైనా దొంగ చాటున చూసేస్తారు. అందుకే వారికి లైంగిక జీవితం పట్ల అవగాహన కల్పిస్తున్నానని యూనీ తెలిపింది. తన పిల్లలు శృంగారాన్ని ఓ బూతూలా కాకుండా.. ఓపేన్ మైండెడ్‌గా ఆలోచించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. కాగా, పిల్లలకు లైంగిక జీవితం పట్ల సరైన అవగాహన కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పింది. అయితే, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నెటిజన్లు.. ‘నీకేమైన బుద్ధుందా.. ఇదేం పైత్యం’ అంటూ.. తిట్టిపోస్తూంటే.. మరికొందరు ‘ఆమె చేస్తుంది సరైన పనే’ అంటూ యూని శరాను సపోర్ట్ చేస్తున్నారు. చదవండి: మనుషుల కంటె ఏనుగులే నయం.. వైరల్ వీడియో.. View this post on Instagram A post shared by WahyuSetyaningBudi✨ (@yunishara36)