చిత్రకారుడు బాలి తనయుడు మంచు తుపానులో మృతి | Artist Bali Son Medisetti Gokul Died in America | Sakshi
Sakshi News home page

చిత్రకారుడు బాలి తనయుడు మంచు తుపానులో మృతి

Published Fri, Dec 30 2022 8:24 AM | Last Updated on Fri, Dec 30 2022 3:00 PM

Artist Bali Son Medisetti Gokul Died in America - Sakshi

సాక్షి, తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత, చిత్ర­కారుడు, బొమ్మల శిల్పి బాలి కుమారుడు మేడిశెట్టి గోకుల్‌ (45) అమెరికాలో మంచు తుపానులో చిక్కుకుని మరణించాడు. అమెరికాలో గుంటూరుకు చెందిన దంపతులను రక్షించబోయి గోకుల్‌ ప్రమాదంలో చిక్కుకుని మరణించాడు. ఆ సమయంలో గోకుల్‌ భార్య శ్రీదేవి, కూ­తురు మహతి ఒడ్డునే ఉన్నారు.

వారి కళ్లెదుటే దుర్ఘటన జరగడంతో వారు కుప్పకూ­లిపోయారు. గోకుల్‌ కుటుంబం గత 15 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడింది. ఈయన అమె­రి­కాలో ఓ ప్రముఖ బీమా కంపెనీలో అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. గోకుల్‌ మరణ వార్త తెలియడంతో ఇక్కడ బాలి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. 

చదవండి: (సీపీ టు డీజీపీ.. 36 ఏళ్లలో పని చేసిన 21 మంది) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement