Gokul
-
చిత్రకారుడు బాలి తనయుడు మంచు తుపానులో మృతి
సాక్షి, తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత, చిత్రకారుడు, బొమ్మల శిల్పి బాలి కుమారుడు మేడిశెట్టి గోకుల్ (45) అమెరికాలో మంచు తుపానులో చిక్కుకుని మరణించాడు. అమెరికాలో గుంటూరుకు చెందిన దంపతులను రక్షించబోయి గోకుల్ ప్రమాదంలో చిక్కుకుని మరణించాడు. ఆ సమయంలో గోకుల్ భార్య శ్రీదేవి, కూతురు మహతి ఒడ్డునే ఉన్నారు. వారి కళ్లెదుటే దుర్ఘటన జరగడంతో వారు కుప్పకూలిపోయారు. గోకుల్ కుటుంబం గత 15 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడింది. ఈయన అమెరికాలో ఓ ప్రముఖ బీమా కంపెనీలో అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. గోకుల్ మరణ వార్త తెలియడంతో ఇక్కడ బాలి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. చదవండి: (సీపీ టు డీజీపీ.. 36 ఏళ్లలో పని చేసిన 21 మంది) -
స్వదేశీ సాహివాల్‌కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి
శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి: చేను, చెలకల్లో మళ్లీ స్వదేశీ గోజాతుల అంబారావాల సవ్వడి పెరిగిపోనుంది. అంతరించిపోతున్న అరుదైన దేశీ పశుసంపద సంరక్షణ బాధ్యతను తీసుకున్నవారితో పాటు, తాజాగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ కొత్త చరిత్రను తెరమీదకు తెస్తోంది. నూటికి నూరుశాతం సాహివాల్ జన్యు లక్షణాలు కలిగిన కోడె వీర్యాన్ని, ఆవు నుండి తీసిన అండాలను జగిత్యాల ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ ప్రయోగశాలలో ఫలదీకరణ చేసి ఆవుల గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా సాహివాల్ దూడలకు ఇటీవలే ఊపిరి పోశారు. కోస్నూరుపల్లె మూల మోహన్‌రెడ్డి, సింగారావుపేట బద్దం రాజశేఖరరెడ్డికి చెందిన ఆవులకు రెండు నెలల క్రితం పుట్టిన లేగదూడలు పూర్తి సాహివాల్ జన్యు లక్షణాలతో ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. గడిచిన ఆర్నెల్లలో వెటర్నరీ కళాశాల వైద్యులు ఈ విధంగా 172 అండాలు ఫలదీకరణ చేసి అందులో వంద వరకు ఆవుల గర్భంలో అమర్చారు. దీంతో వచ్చే రెండు మూడు నెలల్లో ఒక్క జగిత్యాల జిల్లాలోనే వందకు పైగా దేశీ సాహివాల్ దూడలు జన్మించనుండటం పశుసంపద రక్షణకు సంబంధించి గొప్ప మలుపు కానుంది. ఈ పద్ధతి (ఐవీఎఫ్)లో కాకుండా కృత్రిమ గర్భధారణ చేస్తే పూర్తి జన్యులక్షణాలతో దూడలు పుట్టేందుకు పదితరాలు (ముప్పై నుండి నలభై సంవత్సరాలు) సమయం తీసుకునే అవకాశం ఉండగా తాజా అద్దెగర్భ ప్రయోగం తొలి దశలోనే విజయవంతం కావడం స్వదేశీ పశు సంపద అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తోంది. యాభై స్వదేశీ జాతుల్లో..ప్రస్తుతం పదే! ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలోని బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రీసోర్సెస్ (బీఏజీఆర్) దేశంలో 50 స్వదేశీ గోవు జాతులను గుర్తించగా, అందులో మెజారిటీ జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. 2012–19 మధ్య కాలంలో స్వదేశీ గోవులు 8.94 శాతం అంతరించాయి. ఈ నేపథ్యంలో రైతులు, ప్రభుత్వ సంస్థల సంరక్షణ చర్యలతో.. ప్రస్తుతం ఒంగోలు, పుంగనూరు (ఆంధ్రప్రదేశ్), పొడతురుపు (తెలంగాణ), గిర్ (రాజస్తాన్), సాహివాల్ (పంజాబ్, రాజస్తాన్), తార్పార్కర్ (రాజస్తాన్), డివోని (కర్ణాటక, మహారాష్ట్ర), వేచూర్, కాసరగోడ్ (కేరళ), కాంక్రేజ్ (గుజరాత్, రాజస్తాన్) గోవు జాతులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో ఉన్నాయి. గోకుల్ మిషన్‌తో సంరక్షణ చర్యలు ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశీ జాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘గోకుల్ మిషన్’ను ప్రకటించింది. 2021 మొదలుకుని 2026 వరకు రాష్ట్రీయ పశుధాన్ వికాస్ యోజనను అమలు చేస్తోంది. అందులో భాగంగానే జగిత్యాల వెటర్నరీ కళాశాలలో రూ.5.26 కోట్లతో ఓ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిలో సాహివాల్ గోవుల సంరక్షణను ప్రారంభించింది. తెలంగాణ బ్రాండ్‌గా.. పొడతురుపు ‘పొడతురుపు’గోవులకు ఇటీవలే కేంద్రం తెలంగాణ బ్రాండ్‌గా గుర్తింపునిచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం ఇవి 15 వేల వరకు ఉన్నట్టు తేల్చారు. కొండల్లోనూ ఆహారం సంపాదిస్తాయి. క్రూర జంతువుల నుండి కాపాడుకుంటాయి. ఈ ఆవు పాలల్లో ఔషధ గుణాలుంటాయి. రోజంతా శ్రమించే గుణం ‘పొడతురుపు’సొంతం. జన్యుపరమైన గుర్తింపు రావటంతో ఈ జాతిని సంరక్షించే బాధ్యతను అధికార యంత్రాంగం చేపట్టింది. అంతటా చేపట్టాలి వెటర్నరీ కాలేజీలో ప్రయోగం విజయవంతం కావటం స్వదేశీ గోమిత్రుల్లో సంతోషం నింపుతోంది. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా జగిత్యాలకు 30 నుండి 40 కి.మీ దూరంలో ఉండే ప్రాంతాల్లోనే ఈ విధంగా చేసేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా, ఈ పరిజ్ఞానం విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలని ఇప్పటికే సొంతంగా స్వదేశీ గోజాతులను సంరక్షిస్తున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. (క్లిక్ చేయండి: వైఎస్సార్ రెండిస్తే.. నేను నలభై చేసిన) సేవ్ స్వదేశీ ఆవు దేశీ గోవులను యుద్ధ ప్రాతిపదికన సంరక్షించాలంటూ అల్లోల దివ్యారెడ్డి ఇటీవల సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన పిల్లలకు స్వచ్చమైన పాలను అందించేందుకు ఆమె పడిన తపన.. స్వదేశీ గో సంరక్షణ వైపు అడుగులు వేయించింది. సంగారెడ్డిలో వంద గోవులతో (గిర్) ప్రారంభమైన దివ్యారెడ్డి ఫామ్ ప్రస్తుతం 250 ఆవులు, కోడెలతో నిండిపోయింది. చాలాకాలంగా పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో స్వదేశీ ఆవులను విదేశీ బ్రీడ్‌తో కృత్రిమ గర్భధారణ చేస్తుండటంతో స్వదేశీ ఆవు జాతులు అంతరించి పోయాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశంలో 26 శాతం హైబ్రిడ్ , మరో 56 శాతం క్రాస్‌బ్రీడ్ గోవులున్నాయని వివరించారు. వీటి స్థానంలో స్వదేశీ జాతుల అభివృద్ధి కోసం తాను ఓ అడుగు ముందుకు వేశానని దివ్యారెడ్డి చెప్పారు. (క్లిక్ చేయండి: అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది) -
రాధమ్మ అల్లుడు
‘నటుడిగా నిరూపించుకోవాలనే ఆకాంక్ష ఉండాలే గాని అవకాశాలు ఏదో రూపంలో పలకరిస్తూనే ఉంటాయి. అది హీరోనా, విలనా.. అనే సందేహాలు పెట్టుకొని ఆగిపోవద్దు’ అంటారు బుల్లితెర నటుడు గోకుల్. తమిళ ఇంటి కుర్రాడు తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘జీ’ టీవీలో వచ్చే ‘రాధమ్మ కూతురు’లో లీడ్ రోల్ పోషిస్తున్న గోకుల్ మోడలింగ్ వైపు వెళ్లి, నటుడిగా ఎదుగుతున్న విధం గురించి ఇలా వివరించాడు... తమిళంలో విలన్ ‘పుట్టి పెరిగింది చెన్నైలో. నాన్నగారు ఉమామహేశ్వరన్. ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్క్ చేస్తున్నారు. అమ్మ జయప్రభ గృహిణి. మా బ్రదర్ సింగర్, కంపోజర్. నేను బి.టెక్ పూర్తి చేశాను. కాలేజీ తర్వాత మోడలింగ్‌లో చేరాను. ఆక్కణ్ణుంచే సీరియల్లో అవకాశం వస్తే ఈ ఇండస్ట్రీకి వచ్చాను. నా గడ్డం మీసాలు చూసి విలన్‌గా అయితే బాగుంటుందని ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అలా విలన్‌గా బుల్లితెరకు పరిచయం అయ్యాను. ఆ సమయంలోనే తెలుగు బుల్లితెర నుంచి ‘జ్యోతి’ సీరియల్లో లీడ్ రోల్‌కి ఆఫర్ వచ్చింది. వెంటపడితే చదివాను.. బి.టెక్ అంటే అస్సలు ఇష్టం లేదు. నా చిన్నప్పటి నుంచి ఒకటే కల నటుడిని అవ్వాలని. ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పినప్పుడు అందరూ కనీసం డిగ్రీ అయినా ఉండాలన్నారు. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం. ఆ విధంగా బిటెక్‌లో ఐటీ చేశాను. కానీ, జాబ్వైపుకు వెళ్లాలనిపించలేదు. ముందు అమ్మనాన్న కాస్త మౌనం వహించారు. కానీ, ఇప్పుడు నాకు వస్తున్న గుర్తింపు, హంగామా చూసి వాళ్లూ సంతోషిస్తుంటారు. నా గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడినప్పుడు గర్వంగా ఫీలవుతారు. రాధమ్మ కూతురు ఇప్పుడు ‘జీ టీవీ’లో వచ్చే రాధమ్మ కూతురులో హీరో క్యారెక్టర్ చేస్తున్నాను. దీనికి ముందు జ్యోతి సీరియల్లో రీప్లేస్ క్యారెక్టర్ చేశాను. ఈ సీరియల్ పూర్తవుతుండగా రాధమ్మ కూతురు టీమ్ నుంచి ఆడిషన్స్‌కు పిలిచారు. ఊళ్లో అప్పులు ఇచ్చి, వడ్డీ వసూలు చేసే బుజ్జమ్మ కొడుకు అరవింద్ క్యారెక్టర్ నాది. వడ్డీ వసూలుకు అరవింద్‌ను పింపిస్తుంటుంది బుజ్జమ్మ. తోడుగా ఓ ఐదారుగురు రౌడీలు ఉంటారు. అలాంటి సమయంలో ఓ రోజు హీరోయిన్ అక్షరను చూస్తాడు అరవింద్. అక్షరకు బుజ్జమ్మ అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకని, నేను బుజ్జమ్మ కొడుకుగా కాకుండా చిన్నాగా అక్షర ను పరిచయం చేసుకుంటాను. అబద్దం చెప్పి ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. ఒకరోజు నేనే బుజ్జమ్మ కొడుకును అనే విషయం తెలుస్తుంది. దీంతో నా మీద పగ పెంచుకుంటుంది. ఇలా ప్రేమ – పగలతో సీరియల్ నడుస్తుంటుంది. తెలుగు నేర్చుకున్నాను తెలుగు బుల్లితెరకు వచ్చి ఆరునెలలు అయ్యింది. ఈ ఆరునెలల్లో చాలా నేర్చుకున్నాను. అందరి మాటలు వింటూ, నేను మాట్లాడుతూ తెలుగు నేర్చుకున్నాను. ముందు నెల రోజులయితే చాలా ఇబ్బంది పడ్డాను. ఏ భాషలో నటుడిగా కొనసాగాలనుకుంటున్నామో ఆ భాష నేర్చుకుంటే ముందు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఆ ప్రయత్నంలో విజయం సాధించాను. సినిమా నటుడిని కావాలని ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను. రెండు సంక్రాంతులు టీవీ షో కోసం మొన్ననే ఓ సంక్రాంతి వేడుకలో పాల్గొన్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. పండక్కి చెన్నై వెళుతున్నాను. ఇక్కడ సంక్రాంతి అంటే తమిళ్లో పొంగల్ అంటారు. భోగి, పొంగల్, మట్టు(కౌ)పొంగల్ అని మూడు రోజులూ పండగ చేస్తాం. ఇంట్లో అమ్మ చేసే చక్రపొంగల్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ ఏడాది ఒకే పండగను వారం రోజుల్లో రెండు సార్లు జరుపుకోవడం హ్యాపీగా ఉంది. క్యారెక్టర్ని బట్టి.. క్యాస్టూమ్స్! ముందే టీమ్ సజేషన్స్ ఉంటాయి. ఎలాంటి క్యారెక్టర్‌కు ఎలాంటి క్యాస్టూమ్స్ బాగుండాలో డిస్కషన్స్ జరుగుతాయి. నా పాత్రకు తగ్గట్టు రెంగ్యులర్ పాయింట్ షర్ట్ లేదా కుర్తా పైజామా కాకుండా జీన్స్ ప్యాంట్ మీద షార్ట్ కుర్తా వేసుకుని ఉంటాను. ఈ గెటప్ నాకు బాగా నచ్చింది. చాలా మంది ఇండోవెస్ట్రన్ స్టైల్ బాగుందంటూ మెచ్చుకుంటూ ఉంటారు. సంగీతం అంటే ప్రాణం ఏ కాస్త సమయం దొరికినా మ్యూజిక్ వింటుంటాను. చిన్నప్పటి నుంచి ఇండోవెస్ట్రన్ మ్యూజిక్‌ని బాగా ఇష్టపడతాను. సినిమాలు కూడా బాగా చూస్తాను. ఒంటరిగానైనా సరే సినిమాలు చూస్తూనే ఉంటాను. రోజూ కంపల్సరీ ఫిట్నెస్ మీద శ్రద్ధ పెడతాను. అలాగే బైక్ మీద లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్లడం చాలా ఇష్టం. అవకాశాలు వస్తున్నంత కాలం సీరియల్ నటుడిగా కొనసాగుతుంటాను. నటనలో మెళకువలు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతీసారీ కొత్తగానే భావించి, క్యారెక్టర్లో లీనమైనప్పుడే మంచి పేరు వస్తుంది. అలా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. – నిర్మలారెడ్డి -
గోకుల్ మృతి కలచివేసింది : బాలకృష్ణ
ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ అభిమాని చిన్నారి గోకుల్ కన్నుమూశాడు. డెంగీతో బాధపడుతున్న గోకుల్ బెంగళూరులోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గోకుల్ మృతిపై బాలకృష్ణ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తమకు అభిమానుల కంటే విలువైనది మరోకటి ఉండదని బాలకృష్ణ పేర్కొన్నారు. తనంటే ప్రాణం ఇచ్చే చిన్నారి.. ఈరోజు ప్రాణాలతో లేడన్న నిజం మనసును కలచివేసిందన్నారు. గోకుల్ డైలాగ్‌లు చెప్పిన విధానం..హావభావాలు చూసి తనకు ఎంతో ముచ్చటేసేదని తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి.. ఇంత చిన్న వయసులో డెంగీ వ్యాధితో లోకాన్ని విడిచి వెళ్లడం బాధ కలిగించిందని చెప్పారు. చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అలాగే గోకుల్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, బాలకృష్ణ అభిమాని అయిన గోకుల్.. ఆయనను చక్కగా అనుకరించడమే కాకుండా పవర్ఫుల్ డైలాగ్‌లను కూడా అలవోకగా చెప్పగలడు. గోకుల్ బాలకృష్ణ డైలాగ్‌లు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. -
22న కొంచెం కొంచెం..
తమిళసినిమా: కాలం కొంచెంకొంచెం మారుతూ వస్తోంది. దాని తో సమాజంలో జరుగుతున్న మార్పులు మాత్రం చాలానే. అయి తే ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. అన్నీ దాటి పోతాయి అనే చక్కని సందేశంతో కూడిన జనరంజక చిత్రంగా కొంచెం కొంచెం చిత్రం ఉంటుందని ఈ చిత్ర దర్శకుడు ఉదయశంకర్ అంటున్నారు. ఆయన ప్రముఖ మలయాళ దర్శకుడు లోహితాదాస్ శిష్యుడు అన్నది గమనార్హం. మలయాళంలో 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉదయశంకర్ తమిళ ప్రేక్షకులు ప్రతిభకు, నవ్యతకు పట్టం కడతారనే నమ్మకంతో చేసిన తమిళ చిత్రం ఇదని పేర్కొన్నారు. తన అక్కల కోసం తమ్ముడు ఎలాంటి త్యాగం చేశా డు? దాని పర్యావసానం ఏమిటీ లాంటి పలు ఆసక్తికరమైన సం ఘటనలతో ప్రేమ, పాశం, వినోదం వంటి జనరంజక అంశాలతో కూడిన చిత్రంగా కొంచెం కొంచెం ఉంటుందని ఆయన తెలిపారు. గోకుల్ హీరోగానూ నీణు హీరోయిన్‌గానూ నటించిన ఇందులో అప్పుకుట్టి ప్రధాన పాత్రను పోషించారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రియామోహన్, మన్సూర్ అలీఖాన్, మధుమిత, తవసీ, శివథా ను నటించారు. ఆర్.విక్కీకన్నన్ ఛాయాగ్రహణం, వల్లవన్ సంగీ తాన్ని అందించిన ఈ చిత్రాన్ని మిమోచర్ ప్రొడక్షన్స్ పతాకంపై సీకే.ఆర్.మోహన్ నిర్మిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ను పొల్లాచ్చి, తేని, కేరళ ప్రాంతాల్లో 36 రోజుల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు దర్శకుడు తెలిపారు. కొంచెం కొంచెం చిత్రాన్ని ఈ నెల 22వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై!
విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు బ్రిటీష్ బ్యూటీ ఎమీ సై అన్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం యువ కథానాయకుల్లో వరస విజయాలతో దూసుకుపోతున్న నటుడు విజయ్‌సేతుపతి. 2016లో ఈయన నటించిన కాదలుం కడందుపోగుమ్, సేతుపతి, ధర్మదురై, రెక్క, ఆండవన్ కట్టళై చిత్రాలు విడుదలై విశేష ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న కవన్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా మరో నూతన చిత్రానికి విజయ్‌సేతుపతి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 2013లో ఈయన నటించిన ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమరా చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుందనే ప్రచారం చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా చిత్రం దర్శకుడు గోకుల్ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి మరోసారి నటించడానికి సిద్ధమవుతున్నారు.అయితే ఇది ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా చిత్రానికి సీక్వెలా? వేరే కథా అన్నది వెల్లడించలేదు గానీ ఈ హిట్ కాంబినేషన్లో చిత్రం మాత్రం ఖరారయ్యింది. కార్తీ హీరోగా కాష్మోరా చిత్రం తరువాత దర్శకుడు గోకుల్ ఈ చిత్ర కథను తయారు చేయడంపై దృష్టి సారించారు. ఇందులో విజయ్‌సేతుపతికి జంటగా ఇంగ్లీష్ భామ ఎమీజాక్సన్ నటించనున్నారన్నది కోలీవుడ్ టాక్. వీరి కలయికలో తెరకెక్కనున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. సూపర్‌స్టార్‌కు జంటగా 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసిన ఎమీ తదుపరి చిత్రం ఏమిటని ఎదురు చూస్తున్న ఆమె అభిమానులకిది శుభవార్తే అవుతుంది. -
'అద్భుతం సృష్టించామనే అనుకుంటున్నాం'
ఈ శుక్రవారం కాష్మోరా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన కార్తీ, తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇన్నాళ్లు లవర్ బాయ్, యాక్షన్ హీరోగా కనిపించిన కార్తీ ఈ సినిమాతో పూర్తి డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తెలుగులో వస్తున్న సినిమా కావటంతో తెలుగు మార్కెట్ మీద కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. 'దర్శకుడు గోకుల్ తో కలిసి తాము ఓ అద్భుతాన్ని సృష్టించామని భావిస్తున్నాం. ముఖ్యంగా నాకు ఒకే తరహా పాత్రల్లో నటించటం ఇష్టం ఉండదు. అలా చేయటం అంటే చావుతో సమానం. ఈ సినిమాతో కొత్తగా కనిపించే అవకాశం లభించింది. కాష్మోరా ఓ కాస్ట్యూమ్ డ్రామా. సినిమాలో కేవలం 30 నిమిషాలు మాత్రం పీరియడ్ డ్రామా ఉంటుంది. ఈ సినిమాలో కీలకమైన రాజనాయక్ పాత్ర కోసం చాలా శ్రమించాం. ఈ పాత్ర ఇప్పటి వరకు నేను చేసిన అన్న పాత్రలలో ప్రత్యేకమైనది' అని తెలిపారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన గోకుల్ తొలి ప్రయత్నంగా కాష్మోరా సినిమాను తెరకెక్కించారు. కథ కన్నాముందే కార్తీకి రాజనాయక్, కాష్మోరా పాత్రలను వివరించటంతో కార్తీ వెంటనే సినిమా చేయడానికి అంగీకరించారు. ఓ సక్సెస్ ఫుల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. హర్రర్, చేతబబి, ఫైట్స్ అన్నింటికీ మించి కామెడీ లాంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. రాజనాయక్ పాత్ర కోసం ఫిజికల్ గా కూడా కార్తీ చాలా కష్టపడ్డాడు. భారీ దేహంతో క్రూరుడిగా కనిపించేందుకు నెలతరబడి శిక్షణ తీసుకున్నాడు. పాత్ర పరంగా రాజనాయక్ స్త్రీలోలుడు అయినా తెర మీద ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువైందంటున్నారు చిత్రయూనిట్. కార్తీతో పాటు ఈ దీపావళికి ఆడియన్స్ ముందుకు వచ్చిన ధనుష్ కోడి సినిమాపై స్పందించిన కార్తీ... తనకు ఇండస్ట్రీలో ఎవరితో పోటి లేదని.. 'నా సినిమాకు నా గత సినిమాతోనే పోటి' అన్నాడు. కాష్మోరా షూటింగ్ 40 శాతానికి పైగా పూర్తయిన తరువాత బాహుబలి రిలీజ్ కావటంతో తప్పని సరి పరిస్థితుల్లో షూటింగ్ ఆపేసి తిరిగి కాస్ట్యూమ్స్ గ్రాఫిక్స్ లాంటి అంశాల మీద వర్క్ చేశామని తెలిపాడు. అయితే బడ్జెట్ పరంగా బాహుబలి స్థాయిలో తెరకెక్కించలేకపోయినా.. మా పరిథిలో సాధ్యమైనంత బెస్ట్ క్వాలిటీ సినిమాను రూపొదించామని, ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుండటం ఆనందాన్నిస్తుంది తెలిపారు. బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నప్పటికీ ఇప్పట్లో హిందీ సినిమా చేసే ఆలోచన లేదన్నారు. -
'కాష్మోరా' ఆడియో విడుదల
-
బాహుబలిలా శ్రమించాం
దర్శకుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో బెంచ్ మార్క్ పెట్టారని కాష్మోరా చిత్ర దర్శకుడు గోకుల్ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు రౌద్రం, ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజా చిత్రం కాష్మోరా. యువ నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన ఇందులో నయనతార, శ్రీదివ్య నాయకిలుగా నటించారు. ఈ చిత్రాన్ని డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మించారు. సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోకుల్, కథానాయకుడు కార్తీ, నిర్మాతల్లో ఒకరైన ఎస్ఆర్.ప్రభు టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిని, బాహుబలి చిత్రాన్ని పదే పదే ప్రస్తావించడం విశేషం.దర్శకుడు మాట్లాడుతూ హిస్టారికల్ అంశాలతో కూడిన పిరియడ్ కథా చిత్రం కాష్మోరా అని తెలిపారు. ఇందులో హిస్టారికల్ సన్నివేశాలు అవసరం అయ్యాయన్నారు. ఈ సన్నివేశాలను రూపొందించడనాకి సిద్ధం అయినప్పుడు బాహుబలి చిత్రం గుర్తు కొచ్చిందన్నారు. ఆ చిత్రంలో గ్రాఫిక్ సన్నివేశాల విషయంలో దర్శకుడు రాజమౌళి బెంచ్‌మార్క్ పెట్టారన్నారు. తాము అంతగా కాకపోయినా కనీసం 30 శాతం అయినా చేయాలని భావించామని తెలిపారు. ఈ చిత్రంలో కార్తీ మూడు విభిన్న పాత్రల్లో నటించారని చెప్పారు. అదే విధంగా నయనతార, శ్రీదివ్య చాలా బాగా నటించారని తెలిపారు. బాహుబలిలా శ్రమించాల్సి వచ్చింది చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ కాష్మోరా తన కేరీర్లో చాలా ముఖ్యమైన చిత్రం అని పేర్కొన్నారు. దర్శకుడు గోకుల్ ఈ చిత్రంలోని ఒక పాత్ర గురించి చెప్పినప్పుడే అందులో నటించగలనా అని భయమేసిందన్నారు. కాష్మో రా లాంటి చిత్రం చేయడానికి నిర్మాతలకు సినిమా ప్యాషన్ ఉండాలన్నారు. రెండేళ్ల పాటు చిత్ర యూనిట్ కఠిన శ్రమ కాష్మోరా అని పేర్కొన్నారు. చిత్రంలో హిస్టారికల్ సన్నివేశాలు చోటు చేసుకోవడంతో బాహుబలి చిత్రంలా శ్రమించాల్సివచ్చిందన్నారు. చిత్రాన్ని తమిళం,తెలుగు భాషలలో దీపావళికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చాలా కాలంగా కోరుకుంటున్న మోడరన్ పాత్రను పోషించే అవకాశం కాష్మోరాలో కలిగిందని శ్రీదివ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు సంతోష్నారాయణన్ పాల్గొన్నారు. అయితే షరామామూలుగానే నయనతార పాల్గొనలేదన్నది గమనార్హం. -
కార్తీ సినిమాకు కత్తి లాంటి కెమెరా!
చెన్నై: తమిళంలో కార్తీ, నయనతార జంటగా నటిస్తున్న 'కాష్మోరా' సినిమాకు అత్యంత అధునాతనమైన కెమెరాను వాడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు గోగుల్ ప్రకటించారు. భారతదేశంలో మొట్టమొదటి సారిగా 360 డిగ్రీ ఆమ్నిడైరెక్షనల్ కెమెరా పరికరాన్ని వాడుతున్నట్లు తెలిపారు. కొన్ని ప్రత్యేకమైన దృశ్యాల చిత్రకీరణకు ఈ కెమెరాను ఉపయోగిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. అయితే అందుబాటులో ఉన్న టెక్నాలజీతో షూటింగ్ చేద్దామని అనుకున్నా, క్వాలిటీలో ఎక్కడా రాజీపడకూడదనే ఈనిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పనోరమా ఫోటోగ్రఫీ లాగానే ఉన్నా 360 డిగ్రీ ఆమ్నిడైరెక్షనల్ కెమెరా ద్వారా మరింత నాణ్యంగా చాలా దూరంగా ఉన్న దృశ్యాలను కూడా చాలా స్పష్టంగా చూపించడం దీని ప్రత్యేకత అని గోకుల్ పేర్కొన్నారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలను, ఒక పాటను ఈ కెమెరా ద్వారా చిత్రీకరించినట్టు సినిమా వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో తెలుగు నటి శ్రీదివ్య కూడా ముఖ్య భూమికను పోషిస్తోంది. -
సింగర్‌గా
హీరో సందీప్ కిషన్ సింగర్‌గా కొత్త అవతారం ఎత్తారు. ‘పిజ్జా’ ఫేమ్ విజయ్ సేతుపతి, స్వాతి జంటగా తమిళంలో రూపొందిన ఓ చిత్రం తెలుగులో ‘ఇదేగా ఆశపడ్డావ్ బాల-కృష్ణ’ పేరుతో అనువాదమవుతోంది. ఈ సినిమా కోసం ‘నీ బెస్ట్ ఫ్రెండ్‌కి’ అనే పాటను సందీప్‌కిషన్ ఆలపించారు. నిర్మాతలు సుజన్, సమన్యరెడ్డి మాట్లాడుతూ -‘‘నాలుగు నిమిషాల ఈ పాటను సందీప్ కిషన్ పాడడంతో పాటు, గీత రచయిత సామ్రాట్‌తో కలిసి పాట రచనలో కూడా పాలుపంచుకున్నారు. సెటైరికల్ కామెడీతో సాగే ఈ ఎమోషనల్ సాంగ్‌కు మంచి స్పందన వస్తుంది. మార్చి మొదటి వారంలో పాటలు విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్థ్ విపిన్, దర్శకత్వం: గోకుల్.