విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై! | Vijay Sethupathi and Amy Jackson said to be in talks for Gokul's film | Sakshi
Sakshi News home page

విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై!

Published Mon, Mar 13 2017 2:26 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై!

విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై!

విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు బ్రిటీష్‌ బ్యూటీ ఎమీ సై అన్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం యువ కథానాయకుల్లో వరస విజయాలతో దూసుకుపోతున్న నటుడు విజయ్‌సేతుపతి. 2016లో ఈయన నటించిన కాదలుం కడందుపోగుమ్, సేతుపతి, ధర్మదురై, రెక్క, ఆండవన్‌ కట్టళై చిత్రాలు విడుదలై విశేష ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కేవీ.ఆనంద్‌ దర్శకత్వంలో నటిస్తున్న కవన్‌ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా మరో నూతన చిత్రానికి విజయ్‌సేతుపతి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 2013లో ఈయన నటించిన ఇదర్కుదానే ఆశైపట్టాయ్‌ బాలకుమరా చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.

ఆ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కనుందనే ప్రచారం చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఇదర్కుదానే ఆశైపట్టాయ్‌ బాలకుమారా చిత్రం దర్శకుడు గోకుల్‌ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి మరోసారి నటించడానికి సిద్ధమవుతున్నారు.అయితే ఇది ఇదర్కుదానే ఆశైపట్టాయ్‌ బాలకుమారా చిత్రానికి సీక్వెలా? వేరే కథా అన్నది వెల్లడించలేదు గానీ ఈ హిట్‌ కాంబినేషన్‌లో చిత్రం మాత్రం ఖరారయ్యింది.

 కార్తీ హీరోగా కాష్మోరా చిత్రం తరువాత దర్శకుడు గోకుల్‌ ఈ చిత్ర కథను తయారు చేయడంపై దృష్టి సారించారు. ఇందులో విజయ్‌సేతుపతికి జంటగా ఇంగ్లీష్‌ భామ ఎమీజాక్సన్‌ నటించనున్నారన్నది కోలీవుడ్‌ టాక్‌. వీరి కలయికలో తెరకెక్కనున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. సూపర్‌స్టార్‌కు జంటగా 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసిన ఎమీ తదుపరి చిత్రం ఏమిటని ఎదురు చూస్తున్న ఆమె అభిమానులకిది శుభవార్తే అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement