ఎమీ కొత్త అవతారం | Vijay Sethupathi and Amy Jackson to team up for a film? | Sakshi
Sakshi News home page

ఎమీ కొత్త అవతారం

Published Wed, Apr 5 2017 2:27 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

ఎమీ కొత్త అవతారం

ఎమీ కొత్త అవతారం

ఇంగ్లీష్‌ బ్యూటీ ఎమీజాక్సన్‌ కొత్త అవతారం ఎత్తనుందట. కొత్త అవతారం అనగానే చిత్రంలో వెరైటీ గెటప్‌ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ అందాల భామ నిర్మాతగా మారుతున్నారు. చిత్రం అంటే అది కమర్షియల్‌ కథా చిత్రం కాదట. మూగజీవాల సంరక్షణ ఇతి వృత్తంతో లఘు చిత్రాన్ని నిర్మించనున్నారట. దీని గురించి ఎమీ తెలుపుతూ మూగజీవాల చిత్రవధ పెద్ద సమస్యగా మారింది. అలాంటి వధను నిలువరించే విధంగా ఒక అవగాహన కల్పించే విధంగా లఘు చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించింది.

 అందులో తాను నటించనని, నిర్మాత అనుభవాన్నే పొందాలనుకుంటున్నానని చెప్పింది. ఈ చిత్ర షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. మరో విషయం ఏమిటంటే ఇప్పటి వరకూ నక్షత్ర హోటళ్లలో బస చేస్తూ నిర్మాతల పెద్ద భారంగా మారిన ఎమీ తాజాగా చెన్నైలో సొంతంగా నివాసాన్ని ఏర్పరచుకుందట. ఇక నిర్మాతలకు తన హోటళ్ల ఖర్చు తగ్గడంతో అవకాశాలు పెరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

 అలాగే పారితోషికాన్ని కూడా కాస్త తగ్గించుకుంటే బాగుంటుందంటున్నారు చిత్ర వర్గాలు. రజనీకాంత్‌కు జంటగా 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసి ఖాళీగా ఉన్న ఎమీజాక్సన్‌ త్వరలో గోకుల్‌ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి సరసన నాయకిగా నటించడానికి సిద్ధమవుతోంది. అంతకు ముందే నిర్మాతగా లఘు చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటోందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement