కార్తీ సినిమాకు కత్తి లాంటి కెమెరా!
చెన్నై: తమిళంలో కార్తీ, నయనతార జంటగా నటిస్తున్న 'కాష్మోరా' సినిమాకు అత్యంత అధునాతనమైన కెమెరాను వాడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు గోగుల్ ప్రకటించారు. భారతదేశంలో మొట్టమొదటి సారిగా 360 డిగ్రీ ఆమ్నిడైరెక్షనల్ కెమెరా పరికరాన్ని వాడుతున్నట్లు తెలిపారు.
కొన్ని ప్రత్యేకమైన దృశ్యాల చిత్రకీరణకు ఈ కెమెరాను ఉపయోగిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. అయితే అందుబాటులో ఉన్న టెక్నాలజీతో షూటింగ్ చేద్దామని అనుకున్నా, క్వాలిటీలో ఎక్కడా రాజీపడకూడదనే ఈనిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పనోరమా ఫోటోగ్రఫీ లాగానే ఉన్నా 360 డిగ్రీ ఆమ్నిడైరెక్షనల్ కెమెరా ద్వారా మరింత నాణ్యంగా చాలా దూరంగా ఉన్న దృశ్యాలను కూడా చాలా స్పష్టంగా చూపించడం దీని ప్రత్యేకత అని గోకుల్ పేర్కొన్నారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలను, ఒక పాటను ఈ కెమెరా ద్వారా చిత్రీకరించినట్టు సినిమా వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో తెలుగు నటి శ్రీదివ్య కూడా ముఖ్య భూమికను పోషిస్తోంది.