మా మధ్య నో లవ్.. ఓన్లీ యాక్షన్..- హీరో కార్తీ | Karthi Kashmora Movie Released on Friday | Sakshi
Sakshi News home page

మా మధ్య నో లవ్.. ఓన్లీ యాక్షన్..- హీరో కార్తీ

Published Thu, Oct 27 2016 12:22 AM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

మా మధ్య నో లవ్.. ఓన్లీ యాక్షన్..- హీరో కార్తీ - Sakshi

మా మధ్య నో లవ్.. ఓన్లీ యాక్షన్..- హీరో కార్తీ

 ‘‘రెండు చిత్రాలు తీసిన గోకుల్‌తో ఏ నమ్మకంతో ‘కాష్మోరా’ వంటి చిత్రం చేశారని తమిళ నటుడు వివేక్ నన్నడిగారు. ఇలాంటి సినిమాలను దర్శకులపై నమ్మకంతో చేయాలి. నా కెరీర్ ప్రారంభంలో ‘పరుత్తివీరన్’, ‘యుగానికొక్కడు’ వంటి చిత్రాలు డెరైక్టర్లు నాపై నమ్మకంతో తీశారు. వారి నమ్మకం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’’ అని హీరో కార్తీ చెప్పారు.
 
 కార్తీ, నయనతార, శ్రీదివ్య ముఖ్య పాత్రల్లో గోకుల్ దర్శకత్వంలో పీవీపీ సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ‘కాష్మోరా’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే, ఎస్‌ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మాతలు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. ‘బాహుబలి’ చూశాక మా చిత్రాన్ని మరికొంత నాణ్యతగా తీర్చిదిద్దేందుకు కొంత సమయం తీసుకున్నాం.
 
  ‘మగధీర’ చిత్రంలానే చారిత్రక నేపథ్యం ఉంటుంది. ‘కాష్మోరా’ లో రెండు పాత్రలు చేస్తున్నప్పుడు ‘దశావతారం’లో కమల్‌హాసన్‌గారు గుర్తొచ్చారు. ఈ చిత్రంలో నాకు, నయనతారకు మధ్య లవ్ సీన్స్ ఉండవు. యాక్షన్ సన్నివేశాలు మాత్రమే ఉంటాయి’’ అన్నారు. ‘‘ఊపిరి’ తర్వాత కార్తీ, నా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. సోషియల్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. రెండు విభిన్న పాత్రలు చేసేందు కు కార్తీ చాలా కష్టపడ్డాడు. సినిమా మొత్తం తెలుగుదనంతో ఉంటుంది’’ అని ప్రసాద్ వి.పొట్లూరి అన్నారు. హీరోయిన్ శ్రీదివ్య పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement