22న కొంచెం కొంచెం..
తమిళసినిమా: కాలం కొంచెంకొంచెం మారుతూ వస్తోంది. దాని తో సమాజంలో జరుగుతున్న మార్పులు మాత్రం చాలానే. అయి తే ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. అన్నీ దాటి పోతాయి అనే చక్కని సందేశంతో కూడిన జనరంజక చిత్రంగా కొంచెం కొంచెం చిత్రం ఉంటుందని ఈ చిత్ర దర్శకుడు ఉదయశంకర్ అంటున్నారు. ఆయన ప్రముఖ మలయాళ దర్శకుడు లోహితాదాస్ శిష్యుడు అన్నది గమనార్హం. మలయాళంలో 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉదయశంకర్ తమిళ ప్రేక్షకులు ప్రతిభకు, నవ్యతకు పట్టం కడతారనే నమ్మకంతో చేసిన తమిళ చిత్రం ఇదని పేర్కొన్నారు.
తన అక్కల కోసం తమ్ముడు ఎలాంటి త్యాగం చేశా డు? దాని పర్యావసానం ఏమిటీ లాంటి పలు ఆసక్తికరమైన సం ఘటనలతో ప్రేమ, పాశం, వినోదం వంటి జనరంజక అంశాలతో కూడిన చిత్రంగా కొంచెం కొంచెం ఉంటుందని ఆయన తెలిపారు. గోకుల్ హీరోగానూ నీణు హీరోయిన్‌గానూ నటించిన ఇందులో అప్పుకుట్టి ప్రధాన పాత్రను పోషించారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రియామోహన్, మన్సూర్ అలీఖాన్, మధుమిత, తవసీ, శివథా ను నటించారు. ఆర్.విక్కీకన్నన్ ఛాయాగ్రహణం, వల్లవన్ సంగీ తాన్ని అందించిన ఈ చిత్రాన్ని మిమోచర్ ప్రొడక్షన్స్ పతాకంపై సీకే.ఆర్.మోహన్ నిర్మిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ను పొల్లాచ్చి, తేని, కేరళ ప్రాంతాల్లో 36 రోజుల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు దర్శకుడు తెలిపారు. కొంచెం కొంచెం చిత్రాన్ని ఈ నెల 22వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.