సింగర్‌గా | Sandeep Kishan Turns Singer | Sakshi
Sakshi News home page

సింగర్‌గా

Published Thu, Feb 27 2014 10:46 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

సింగర్‌గా - Sakshi

సింగర్‌గా

 హీరో సందీప్ కిషన్ సింగర్‌గా కొత్త అవతారం ఎత్తారు. ‘పిజ్జా’ ఫేమ్ విజయ్ సేతుపతి, స్వాతి జంటగా తమిళంలో రూపొందిన ఓ చిత్రం తెలుగులో ‘ఇదేగా ఆశపడ్డావ్ బాల-కృష్ణ’ పేరుతో అనువాదమవుతోంది.  ఈ సినిమా కోసం ‘నీ బెస్ట్ ఫ్రెండ్‌కి’ అనే పాటను సందీప్‌కిషన్ ఆలపించారు. నిర్మాతలు సుజన్, సమన్యరెడ్డి మాట్లాడుతూ -‘‘నాలుగు నిమిషాల ఈ పాటను సందీప్ కిషన్ పాడడంతో పాటు, గీత రచయిత సామ్రాట్‌తో కలిసి పాట రచనలో కూడా పాలుపంచుకున్నారు. సెటైరికల్ కామెడీతో సాగే ఈ ఎమోషనల్ సాంగ్‌కు మంచి స్పందన వస్తుంది. మార్చి మొదటి వారంలో పాటలు విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్థ్ విపిన్, దర్శకత్వం: గోకుల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement