
లాస్‌ఏంజెలెస్: అమెరికాను మంచుతుపాను అతలాకుతలం చేస్తోంది. కాలిఫోర్నియాను శనివారం మధ్యాహ్నానికి ఎన్నడూ లేనంతటి వరదలు, తీవ్ర మంచు తుపాను చుట్టుముట్టే ప్రమాదముందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లాస్‌ఏంజెలెస్ కొండ ప్రాంతాల్లో 5 అడుగుల మేర మంచు కురియవచ్చని, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
ఇళ్లకే పరిమితం కావాలని కోరింది. మంచు తుపాను ఈ వారమంతా కొనసాగుతుందని పేర్కొంది. ఒరెగాన్ నగరంలో చాలా భాగం అడుగు మేర మంచు కురిసింది. పోర్ట్‌లాండ్‌లో అకస్మాత్తుగా కురిసిన మంచుతో ట్రాఫిక్ జామైంది. కరెంటు లైన్లు తెగిపోవడంతో సరఫరా నిలిచింది.
స్కూళ్లు మూత బడ్డాయి. 10 లక్షల నివాసాలు, వ్యాపార సంస్థలు చీకట్లో మగ్గాయి. మిషిగన్, ఇలినాయీ, కాలిఫోర్నియా, న్యూయార్క్, విస్కాన్సిన్‌ల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా రెండు వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment