కాలిఫోర్నియాలో అమ్ముడుపోయిన మెగా మిలియన్స్ లాటరీ టికెట్
వాషింగ్టన్: అమెరికాలో గుర్తు తెలియని వ్యక్తి జీవితంలోకి కొత్త సంవత్సరం అప్పుడే వచ్చేసింది. 3, 7, 37, 49, 55 నంబర్లు ఉన్న తెలుపు బంతులు, ఆరో నంబర్ ఉన్న బంగారు మెగా బంతి సరిపోలిన లాటరీ టికెట్‌కు 1.22 బిలియన్ డాలర్లు( దాదాపు రూ.10,418 కోట్లు) భారీ జాక్‌పాట్ తగిలింది. కాలిఫోర్నియాలో ఈ టికెట్ అమ్ముడుపోయిందని మెగా మిలియన్స్ లాటరీ సంస్థ శనివారం ప్రకటించింది.
అమెరికా మెగా మిలియన్స్ లాటరీల చరిత్రలోనే ఇది మూడో అతిపెద్ద లాటరీ మొత్తంగా రికార్డ్ సృష్టించింది. గత మూడు నెలలుగా లాటరీ తీస్తున్న ప్రతిసారీ ఏ ఒక్కరికీ విన్నింగ్ నంబర్ మ్యాచ్ కాకపోవడంతో టికెట్ల అమ్మకాలు కొనసాగించారు. దాంతో గెలుపు మొత్తం అలా కొండలా పెరిగి చివరకు రూ.10,000 కోట్లను దాటేసింది. కాటన్‌వుడ్ సిటీలోని రోండారోడ్‌లోని సర్కిల్ కె(సన్‌షైన్ ఫుడ్ అండ్ గ్యాస్)స్టోర్‌లో ఈ గెలుపు టికెట్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కొన్నారు. టికెట్ గెలిచింది ఎవరనేది సంస్థ ఇంకా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment