lottery ticket
-
కోట్లు పంచుకుందాం.. టికెట్ ఇవ్వండి
పారిస్: రూపాయి రూపాయి నువ్వేం చేయగలవంటే?. బంధాలు, బంధుత్వాలను తుంచేస్తా అని చెప్పిందట. డబ్బు ఉందన్న అహంతో కొందరు తమ ఆత్మియులను ఆమడ దూరం పెట్టేసిన వైనాలు మనందరం చూశాం. అయితే అదే డబ్బు శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుందని ఫ్రాన్స్‌లోని ఓ ఘటన నిరూపించింది. సాధారణంగా మన పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేసిన వాళ్లు మనకు కనబడితే చితకబాదుతాం. కానీ ఫ్రాన్స్‌లో 40 ఏళ్ల ఓ వ్యక్తి మాత్రం తన క్రెడిట్ కార్డును కొట్టేసిన వ్యక్తులను అక్కున చేర్చుకునేందుకు తహతహలాడుతున్నాడు. ఇందులో ఒక ఆర్థిక కోణం, నగదు ప్రేమ దాగి ఉంది. ఈయన దగ్గర కొట్టేసిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన ఒక లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. ఏ లక్షో రెండు లక్షలో కాకుండా ఏకంగా రూ.4,53,00,000ల జాక్‌పాట్ తగిలింది. టికెట్ ఎలా చేజిక్కించుకోవాలి? జాక్‌పాట్ తగిలిన టికెట్‌ను కౌంటర్లో ఇచ్చేసి నగదుగా మార్చుకునే అవకాశం ఆ దొంగలకు లేదు. ఎందుకంటే సంబంధిత టికెట్ కొనుగోలు పత్రాలు వాళ్ల వద్ద లేవు. ఆ టికెట్ కొనేందుకు ఉపయోగించిన క్రెడిట్ కార్డ్ వాళ్లది కాదు. దొంగతనం చేశారు కాబట్టి ఒకవేళ టికెట్ పట్టుకుని కౌంటర్ వద్దకు వస్తే పోలీసులు పట్టుకెళ్తారు. దీంతో దొంగలు ఆ రూ. 4.53 కోట్ల విలువైన లాటరీటికెట్ను నగదుగా మార్చుకునే అవకాశం కోల్పోయారు. కానీ ఆ అవకాశం క్రెడిట్ కార్డ్ యజమాని అయిన జీన్ డేవిడ్.ఈ అనే వ్యక్తికి ఉంది. కానీ అతని వద్ద టికెట్ లేదు. ఇందుకు ఆయనో పథకం వేశారు. క్రెడిట్ కార్డ్ కొట్టేసిన దొంగలపై ఎక్కడాలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ‘‘నా క్రెడిట్ కార్డులు దొంగలించిన మీపై నాకు ఇప్పుడు కోపం లేదు. గతంలో మీపై పోలీస్ కేసు పెట్టాను. కావాలంటే ఆ కేసును ఇప్పుడు ఉపసంహరించుకుంటా. అయితే మీరు ఆ లాటరీ టికెట్‌ను నాకు ఇచ్చేయండి. కావాలంటే అందులో సగం మొత్తాన్ని మీకు వాటాగా ఇచ్చేస్తా’’అని ఒక చక్కటి ఆఫర్ ఇచ్చారు. అయితే ఇంకా తమ కౌంటర్ వద్దకు ఎవరూ రాలేదని లాటరీ నిర్వహణ సంస్థ లా ఫ్రాంకైస్ డీస్ జీయక్స్(ఎఫ్‌డీజే) శనివారం ప్రకటించింది. ఆలసించిన ఆశాభంగం క్రెడిట్ కార్డ్ యజమాని జీన్ డేవిడ్ తన లాయర్ ద్వారా మరోసారి ఒక సవివరమైన ప్రకటన ఇప్పించారు. ‘‘ఆ ఇద్దరు దొంగలు లేకుండా ఈ లాటరీ విజయం సాధ్యమయ్యేదే కాదు. వాళ్లు టికెట్ కొన్నారు కాబట్టే ఇవాళ ఇంత సొమ్ము మన పరం అయ్యే సదవకాశం దక్కింది. అందుకే దొంగల్లారా.. దయచేసి ఆ లాటరీ టికెట్ మాకు ఇచ్చేయండి. మీ వద్ద ఉన్నా అది మీకు ఉపయోగపడదు. మాకు ఇచ్చేస్తే మీకూ అందులో వాటా తప్పకుండా ఇస్తాం. డీల్ కుదుర్చుకుందాం. మా ఆఫీస్‌కు వచ్చేయండి. మీరు ఆలస్యం చేస్తే ఆ టికెట్‌ను నగదుగా మార్చుకునే క్లెయిమ్ గడువు తీరిపోతుంది. అప్పుడు మనందరికీ దక్కేది సున్నా. కాలం మించిపోతోంది. సమయం లేదు మిత్రమా. త్వరగా వచ్చి ఒడంబడిక చేసుకుని డబ్బు తీసుకెళ్లండి. ఆ డబ్బుతో మేం సెటిల్ అవుతాం. మీరూ సెటిల్ అవ్వండి’’అని లాయర్ పియరీ డెబూసన్ చెప్పారు. ఈ వింత ప్రకటన చూసి ఫ్రాన్స్ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో తమకు నచ్చినట్లు పోస్ట్‌లు పెడుతున్నారు.సిటీలో కొట్టేసి.. టౌలూస్ నగరానికి చెందిన జీన్ డేవిడ్ ఫిబ్రవరి మూడో తేదీన కారులో తన బ్యాక్‌ప్యాక్‌ను ఉంచేసి వెళ్లాడు. కారు తెరచి దొంగలు ఆ బ్యాక్‌ప్యాక్‌ను, అందులోని పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేశారు. ఆ కార్డుతో ఒక చిల్లర దుకాణంలో లాటరీ టికెట్ కొన్నారు. ‘‘ఇల్లూ, చెప్పుకోవడానికి అడ్రస్ కూడా లేని ఇద్దరు వ్యక్తులు మా దుకాణానికి వచ్చి కాంటాక్ట్‌లెస్ విధానంలో 52.50 యూరోలతో ఒక లాటరీ టికెట్, మరికొన్ని సిగరెట్లు కొన్నారు. టికెట్ కొన్న ఆనందంలో వాళ్లు సిగరెట్లు కూడా మర్చిపోయి వెళ్లారు’’అని టబాక్ దిస్ థెర్మాస్ దుకాణ యజమాని చెప్పారు. -
ఇది కదా లాటరీ అంటే.. ఏకంగా రూ.10 వేలకోట్లు
లాటరీలలో భారీ మొత్తాలను గెలుచుకున్న వారి గురించి గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలో కాలిఫోర్నియాలోని ఓ చిన్న కుటుంబం ఏకంగా రూ. 10వేలకోట్ల లాటరీ టికెట్ (Lottery Tickets) విక్రయించింది.కాలిఫోర్నియా (California)లోని కాటన్వుడ్లో ఒక చిన్న కుటుంబం ఓ చిన్న స్టోర్ నడుపుతోంది. ఆ కుటుంబం ఇటీవల 1.22 బిలియన్ డాలర్ల విలువైన లాటరీ టికెట్ విక్రయించి వార్తల్లో నిలిచింది. ఇది లాటరీ చరిత్రలోని అతిపెద్ద జాక్‌పాట్‌లలో ఒకటిగా నిలవడంతో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.ఈ లాటరీ ఎవరు గెలిచారు అనేదానికి సంబంధించిన వివరాలు.. టికెట్స్ విక్రయదారులు వెల్లడించలేదు. కానీ కాటన్‌వుడ్ సిటీలోని రోండారోడ్లోని సర్కిల్ కే(సన్‌షైన్ ఫుడ్ అండ్ గ్యాస్)స్టోర్‌లో ఈ టికెట్‌ను కొనుగోలు చేశారని సమాచారం. దీనిని జస్పాల్ సింగ్.. అతని కుమారుడు ఇషార్ గిల్ నిర్వహిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా కాటన్‌వుడ్ సంఘంలో భాగమైన సింగ్ కుటుంబం రూ.10 వేలకోట్ల లాటరీ టికెట్ విక్రయించినందుకు 1 మిలియన్ రిటైలర్ బోనస్ అందుతుందని కాలిఫోర్నియా లాటరీ ధృవీకరించింది. -
రూ.10,418 కోట్ల లాటరీ జాక్‌పాట్
వాషింగ్టన్: అమెరికాలో గుర్తు తెలియని వ్యక్తి జీవితంలోకి కొత్త సంవత్సరం అప్పుడే వచ్చేసింది. 3, 7, 37, 49, 55 నంబర్లు ఉన్న తెలుపు బంతులు, ఆరో నంబర్ ఉన్న బంగారు మెగా బంతి సరిపోలిన లాటరీ టికెట్‌కు 1.22 బిలియన్ డాలర్లు( దాదాపు రూ.10,418 కోట్లు) భారీ జాక్‌పాట్ తగిలింది. కాలిఫోర్నియాలో ఈ టికెట్ అమ్ముడుపోయిందని మెగా మిలియన్స్ లాటరీ సంస్థ శనివారం ప్రకటించింది. అమెరికా మెగా మిలియన్స్ లాటరీల చరిత్రలోనే ఇది మూడో అతిపెద్ద లాటరీ మొత్తంగా రికార్డ్ సృష్టించింది. గత మూడు నెలలుగా లాటరీ తీస్తున్న ప్రతిసారీ ఏ ఒక్కరికీ విన్నింగ్ నంబర్ మ్యాచ్ కాకపోవడంతో టికెట్ల అమ్మకాలు కొనసాగించారు. దాంతో గెలుపు మొత్తం అలా కొండలా పెరిగి చివరకు రూ.10,000 కోట్లను దాటేసింది. కాటన్‌వుడ్ సిటీలోని రోండారోడ్లోని సర్కిల్ కె(సన్‌షైన్ ఫుడ్ అండ్ గ్యాస్)స్టోర్‌లో ఈ గెలుపు టికెట్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కొన్నారు. టికెట్ గెలిచింది ఎవరనేది సంస్థ ఇంకా ప్రకటించలేదు. -
లాటరీ టికెట్ల వ్యాపారి ఇంట్లో రూ.2.25 కోట్ల సీజ్
తిరువొత్తియూరు: కోవై కరుమత్తంపట్టి సమీపంలో లాటరీ టికెట్ విక్రయ వ్యాపారి ఇంటిలో రూ. 2. 25 కోట్లు నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. కోవై జిల్లాలో లాటరీ టికెట్లు విక్రయాలు జరపకుండా పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందం పోలీసులు బుధవారం జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. కరుమత్తం పట్టి సమీపంలో ద్విచక్ర వాహనంలో వచ్చిన వ్యక్తిపై సందేహంతో తనిఖీ చేయగా అందులో లాటరీ టికెట్లు, నగదు ఉంది. విచారణలో నిందితుడు కోవై సెంథిల్ నగర్‌కు చెందిన నాగరాజు (42)అని, కేరళ రాష్ట్రం సరిహద్దు ప్రాంతం నుంచి లాటరీ టికెట్లను తీసుకుని వచ్చి విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీంతో సందేహ పడిన పోలీసులు అతని ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడున్న అట్ట పెట్టెలలో కట్టలు కట్టలుగా రూ 500, రూ 200, రూ. 50, రూ. 20 రూ.10, అని కరెన్సీ నోట్లు ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు దీనిపై కరుతంపట్టి డిప్యూటీ ఎస్పీ తంగ రామన్ అక్కడికి చేరుకుని నగదును లెక్కింపు పనిలో నిమగ్నమయ్యారు. తర్వాత మొత్తం రూ.2.25 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. అందులో 112 చల్లని 2000 రూపాయల నోట్లు ఉన్నట్లు వెల్లడించారు. తర్వాత నాగరాజును అరెస్టు చేసి అతని వద్ద నుంచి 1800 కేరళ లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
లాటరీలో రూ.1,804 కోట్లు!
లండన్: బ్రిటన్‌లో ఓ వ్యక్తికి అదృష్టం మామూలుగా కలిసిరాలేదు! ఏకంగా 17.7 కోట్ల పౌండ్ల (రూ.1,804 కోట్ల) లాటరీ తగిలింది. ఆ దేశ చరిత్రలోనే మూడో అతి పెద్ద లాటరీ మొత్తంగా నిలిచింది. మంగళవారం జరిగిన యూరోమిలియన్స్ లాటరీ డ్రాలో మనవాడు ఈ జాక్‌పాట్ కొట్టాడు. సదరు అదృష్టవంతుని వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. 2022లో ఓ అజ్ఞాత వ్యక్తి గెలుచుకున్న 19.5 కోట్ల పౌండ్లు బ్రిటన్‌లో ఇప్పటిదాకా అత్యంత భారీ జాక్‌పాట్‌గా నిలిచింది. గత మేలో గ్లోసిస్టర్కు చెందిన ఇద్దరు వ్యక్తులు గెలిచిన 18.4 కోట్ల పౌండ్లకు రెండో స్థానం దక్కింది. -
కేరళ మున్సిపల్ మహిళా కార్మికులకు జాక్‌పాట్
మలప్పురం: లాటరీ టికెట్ కొనేందుకు నానా హైరానా పడిన ఈ మహిళలు ఎన్నడూ ఊహించని విధంగా జాక్‌పాట్ కొట్టేశారు. కేరళ లాటరీ విభాగం ప్రకటించిన వర్షాకాల ఫలితాల్లో వీరు కొనుగోలు చేసిన టికెట్ ఒకటీ రెండూ కాదు..ఏకంగా రూ.10 కోట్లు గెలుచుకుంది. కేరళలోని పరప్పనంగడి మున్సిపల్ కొర్పొరేషన్లో ఇంటింటికీ తిరిగి సేకరించిన చెత్త నుంచి ‘హరిత కర్మ సేన’కు చెందిన 11 మంది మహిళా సభ్యులు ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేస్తుంటారు. వీరు తలా రూ.25 కంటే తక్కువగా పోగేయగా జమయిన రూ.250 పెట్టి ఇటీవల కేరళ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో హరిత కర్మ సేన కొనుగోలు చేసిన టికెట్ రూ.10 కోట్ల జాక్‌పాట్ వరించింది. దీంతో, వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గత ఏడాది కూడా ఓనమ్ పండుగ సందర్భంగా తలాకొంత పోగేసి కొన్న టికెట్‌కు రూ.7,500 రాగా అందరం సమానంగా పంచుకున్నామని చెప్పారు. అదే ధైర్యంతో ఈసారి కొన్న టికెట్‌కు ఏకంగా రూ.10 కోట్లు వస్తాయని ఊహించలేదన్నారు. ఈ డబ్బును అందరం సమంగా పంచుకుంటామని తెలిపారు. అప్పులు తీర్చుకుని, పిల్లల పెళ్లిళ్లు చేస్తామని, కుటుంబసభ్యులకు అవసరమైన వైద్యం చేయించుకుంటామని చెబుతున్నారు. వీరి నెలవారీ వేతనం రూ.7,500–రూ.14,000 వరకు ఉంది. -
ఆరేళ్ల క్రితం ఇల్లు లేదు... ఇప్పుడు మిలియనీర్
కాలిఫోర్నియా: ఆరేళ్ల క్రితం నిలువ నీడలేని అమెరికన్ మహిళ నక్కతోక తొక్కారు. అదృష్టం లాటరీ రూపంలో తలుపు తట్టి రాత్రికి రాత్రి కోట్లకు పడగలెత్తారు. లాటరీలో 50 లక్షల డాలర్లు గెలుచుకున్నానని తెలియగానే ఆమె మొదట నమ్మలేదు. అది నిజమేనని అర్థమయ్యాక ఆమె ఆనందానికి అంతేలేదు. కాలిఫోర్నియాకు చెందిన లూసియా ఫోర్సెథ్ను చాలా కాలంగా ఆర్థిక కష్టాలు వేధిస్తున్నాయి. ఆరేళ్ల క్రితం ఇల్లు కూడా లేదు. కష్టపడి చదివి డిగ్రీ సంపాదించారు. చిన్న ఉద్యోగం వచ్చింది. కారులో ఆయిల్ కొట్టించినప్పుడు చిల్లర లేక అయిష్టంగానే లాటరీ టిక్కెట్ తీసుకున్నారు. దాంతోనే ఆమె ఇంట డాలర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది లూసియా పెళ్లి చేసుకోనున్నారు. జీవిత భాగస్వామితో పాటు ఈ లాటరీ టిక్కెట్ తన జీవితాన్నే మార్చేసిందని సంబరపడుతున్నారు. -
భార్యను సంతోష పెట్టడానికి లాటరీ కొన్న వ్యక్తి.. కలిసొచ్చిన అదృష్టం
రాత్రికిరాత్రే కోటీశ్వరులు అయిపోతే ఎలా ఉంటుంది? లక్ష్మీ దేవి కరుణించి ఒక్కసారిగా కాసుల వర్షం కురిపిస్తే.. అబ్బా ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదా.. మరి అదే నిజమైతే మన ఆనందానికి అవధులుంటాయా?. లాటరీ వ్యక్తి జీవితాన్నే మార్చేస్తే?. సాధారణ వ్యక్తిని ఒక్కసారిగా కోటీశ్వరులను చేస్తే.. ఈ ప్రపంచలంలో మనకంటే అదృష్ట వంతులు ఎవరూ ఉండరని తెగ సంబరపడిపోతుంటాం. తాజాగా ఇలాంటి ఊహించనే ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన జంట గత మూపై ఏళ్లుగా ఒకే నెంబర్‌పై లాటరీ టికెట్ కొంటూ వస్తోంది. తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రతిసారీ వారికి నిరాశే ఎదురైతుంది. అయితే ఇటీవల భార్యను సంతోషపెట్టేందుకు అతడు ఆమె పేరు మీద టికెట్ కొనుగోలు చేశాడు. లక్ష్మీ దేవి కరుణించడంతో ఒకేసారి రెండు టికెట్లు గెలిచి ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయిపోయారు. ఈ ఘటన మార్చి 13న చోటుచేసుకుంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఆ జంట దాదాపు 16 కోట్ల 48 క్షలు గెలుచుకున్నారు. తనకు రెండు లాటరీ టికెట్లు ఎలా వచ్చాయో చెబుతూ సదరు వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు.. ‘గత మూప్పై ఏళ్లుగా లాటరీ టెకెట్ కొనుగోలు చేస్తున్నాం. గత వారం నా భర్య నెంబర్‌పై లాటరీ తీసుకోవడం మర్చిపోయారు. నేను చేసిన పనికి తను బాధగా ఫీల్ అయ్యింది. కోపంలో ఉన్న ఆమె ముఖం మీద చిరునవ్వు చూసేందుకు ఈ వారం తన పేరు మీదే రెండు లాటరీలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. సోమవారం ఉదయం నెంబర్ పరీక్షించగా మొదటి టికెట్‌పై మిలియన్ డాలర్లు(రూ. 8 కోట్లు)గెలుచుకున్నట్లు తెలిసింది. అప్పడే నేను తనకు రెండో టికెట్ కూడా తసుకున్నానని చెప్పాలనుకున్నా. వెంటనే రెండో టికెట్ కూడా విన్ అయినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని నాభార్యకు చెబితో ఉనందంతో ఎగిరి గంతేసింది. కాగా తన చాలా కాలంగా ఒకే నెంబర్ కాంబినేషన్ టికెట్ కొనుగోలు చేస్తోందని.. ఏదో ఒక రోజు గెలుస్తుందని ఊహించినట్లు చెప్పాడు. అయితే తన నమ్మకం నిజం కావడానికి చాలా కాలమే పట్టిందని.. ఇది ఖచ్చితంగా విలువైనదని ఉద్వేగానికి లోనయ్యారు. ఈ విజయాన్ని తమ కుటుంబ సభ్యులతో పంచుకోనున్నట్లు తెలిపారు. కూతురికి కొత్త ఇల్లు కొనిచ్చి.. తన పిల్లలు, మనవళ్ల భవిష్యత్తు కోసం ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక దేశమంతా చుట్టి రావాలన్న ఆలోచన కూడా ఉందని అన్నారు. -
సంచలనం: ఒక్కడికే కనీవినీ ఎరుగని లాటరీ ప్రైజ్‌మనీ!!
లాటరీ చరిత్రలోనే అదొక సంచలనం. కనివినీ ఎరుగని రీతిలో లాటరీ ప్రైజ్ దక్కించుకున్నాడు ఓ వ్యక్తి. ఎంతో తెలుసా? మన కరెన్సీలో అక్షరాల పదహారున్నర వేల కోట్ల రూపాయలకు పైనే. అమెరికా లాటరీ గేమ్ పవర్బాల్లో.. కాలిఫోర్నియాకి చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. ఏకంగా 2.04 బిలియన్ డాలర్లు గెల్చుకున్నాడు. ఆ విజేత ఎవరనే విషయాన్ని కాలిఫోర్నియా లాటరీ అధికారులు ఎట్టకేలకు చెప్పారు. ఆ వ్యక్తి పేరు ఎడ్విన్ కాస్ట్రో అంట. కానీ, అతనికి సంబంధించిన ఇతర వివరాలేవీ వెల్లడించలేదు అధికారులు. నవంబర్ నెలలో పవర్‌బాల్ జాక్‌పాట్ అతనికి దక్కగా.. తద్వారా చరిత్రలోనే కనివిని ఎరుగని లాటరీ ప్రైజ్మనినీ దక్కించుకున్నాడతను. కాలిఫోర్నియా చట్టాల ప్రకారం.. విజేత వివరాలను వెల్లడించొచ్చు. కానీ, అందులో కొన్ని కండిషన్లు ఉన్నాయి. పేరు చెప్పొచ్చు. ఆ టికెట్‌ను ఎక్కడ కొన్నాడనే విషయమూ చెప్పొచ్చు. టికెట్ కొన్న తేదీ.. గెల్చుకున్న తేదీ.. ఎమౌంట్ వివరాలను కూడా చెప్పొచ్చు. కానీ, అతని అడ్రస్ గిడ్రస్ లాంటి నేపథ్య వివరాలు మాత్రం వెల్లడించకూడదు. ప్రైజ్‌మనీ అనౌన్స్ చేసిన ఏడాదిలోపే ఎప్పుడైనా ఆ వ్యక్తి ముందుకొచ్చి ప్రైజ్ మనీ తీసేసుకోవచ్చు. కానీ, కాస్ట్రో మాత్రం అందుకు ఆసక్తిగా లేడట. మరి గోప్యంగా అయినా తీసుకుంటాడా? అనేది వేచిచూడాలి. Video Credits: NBC News ఇక జాక్పాట్కొట్టిన విషయం తెలిసిన వెంటనే షాక్‌కు, అదే సమయంలో భావోద్వేగానికి లోనైనట్లు క్యాస్ట్రో ఒక ప్రకటన విడుదల చేశాడు. పవర్‌బాల్ లాటరీ గేమ్‌లో గతంలో 1.6 బిలియన్ డాలర్లు(పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైనే..) గెల్చుకున్నారు ఎవరో. కానీ, ఆ ప్రైజ్‌మనీని మాత్రం తీసుకోవడానికి ముందుకు రాలేదంట. అమెరియా సంయుక్త రాష్ట్రాల్లోని.. 45 రాష్ట్రాల్లో పవర్‌బాల్ జాక్‌పాట్ లాటరీ గేమ్ బాగా పాపులర్. టికెట్ ధర ఎంతో తెలుసా? కేవలం 2 డాలర్లు మాత్రమే(మన కరెన్సీలో 170 రూ. దాకా ఉంటుంది). అలా చూసుకున్నా ఎడ్విన్ క్యాస్ట్రో ఎంత లక్కీనో కదా!. పద్దెనిమిదేళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఈ లాటరీ గేమ్ ఆడాలి. ఇదిలా ఉంటే భారత్‌లోనూ గుర్తింపు ఉన్న లాటరీ ఏజెన్సీల ద్వారా ఈ టికెట్ కొనుగోలు చేసుకుని ఆడొచ్చు. లక్షల్లో ఎవరో ఒకరికి చాలా చాలా అరుదుగా దక్కుతుంది ప్రైజ్ మనీ. అయితే గోల్డెన్ ఛాన్స్ కొట్టే వాళ్లు మాత్రం ఎడ్విన్ కాస్ట్రోలాగా.. కోట్లల్లో ఒక్కడు ఉంటాడేమో!. -
నిరుపేద డ్రైవర్‌కు లక్ష్మీ కటాక్షం!.. రాత్రికే రాత్రే రూ.30 కోట్లకు యజమాని
సాక్షి, జగిత్యాల(సారంగాపూర్): ఓ నిరుపేద యువకుడిని లక్ష్మీదేవి కరుణించడంతో రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఓగుల అజయ్ అనే యువకుడు దుబాయ్‌లో కొన్న లాటరీ టికెట్ అతన్ని రూ.30 కోట్లకు యజమానిని చేసింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. తుంగూరుకు చెందిన ఓగుల ప్రమీల– దేవరాజుది పేద కుటుంబం. వారికి గుంట వ్యవ సాయభూమి కూడా లేదు. దేవరాజు 2015లో మృతిచెందగా.. ప్రమీల తన ఇద్దరు పిల్లలు అజయ్, రాకేశ్‌ను కష్టపడి చదివించింది. అజయ్ నాలుగే ళ్లక్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ బంగారం దుకాణంలో డ్రైవర్‌గా పనికి కుదిరాడు. ఈ క్రమంలోనే 30 దిర్హాములతో రెండు ఎమిరేట్స్ లక్కీ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. అందులో నంబర్లు కలిపితే ప్రైజ్‌మనీ గెలుచుకోవచ్చు. అజ య్ ఆరు నంబర్లు కలపడంతో 1.50 కోట్ల దిర్హాము లు (రూ.30 కోట్ల రూపాయలు) గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అజయ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘మాది పేద కుటుంబం. నేను కొనుగోలు చేసిన లాటరీ టికెట్ ద్వారా రూ.30 కోట్లు గెలుచుకోవడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. -
ఇది కదా జాక్‌పాట్.. ఏడాదికి రూ.20 లక్షల చొప్పున జీవితాంతం
లాన్సింగ్: లాటరీలో అదృష్టం వరించిన వారికి ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు వస్తాయని అందరకీ తెలుసు. కానీ, ప్రతి ఏడాది లక్షల రూపాయలు జీవితాంతం లభిస్తే అది జాక్‌పాట్‌కే జాక్‌పాట్ అంటారు కదా? అలాంటి జాక్పాట్నే కొట్టేశాడు మిచిగాన్కు చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి. ఏడాదికి రూ.20లక్షల చొప్పున జీవితాంతం పొందే లాటరీని సొంతం చేసుకున్నాడు. ఆన్లైన్లో రాండమ్ నంబర్ జనరేటర్లో తన టికెట్‌పై ఉన్న నంబర్లను పొంది ఈ లాటరీ గెలుపొందనట్లు యూపీఐ పేర్కొంది. ఆయనే.. మిచిగాన్‌లోని వారెన్ ప్రాంతానికి చెందిన అరోన్ ఎసెన్‌మాచెర్(50). వారెన్ హ్యాపీ డేస్ పార్టీ స్టోర్‌లో సెప్టెంబర్ 15న లక్కీ ఫర్ లైఫ్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.‘నేను లక్కీ ఫర్ లైఫ్ ఆడాను. ప్రతిసారి ఒకే సెట్ నంబర్లను వినియోగించాను. నేను నా టికెట్ కొనుగోలు చేసినప్పుడు సాధారణంగానే సంఖ్యలను ఎంచుకున్నాను. తర్వాత ఆన్లైన్లో కనుగొన్న రాండమ్ సంఖ్యలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నా. డ్రా తీసిన తర్వాతి రోజు నేను నంబర్లను తనిఖీ చేశాను. నేను ఐదు నంబర్లను సరిగా మ్యాచ్ చేసినట్లు తెలుసుకున్నాను. రాండమ్ నంబర్ జనరేటర్లో గెలుపొందిన నంబర్లే ఇక్కడా వచ్చాయి. దాంతో షాక్‌కు గురయ్యాను. ధ్రువీకరించుకునేందుకు నా టికెట్‌ను యాప్‌లో పలుమార్లు స్కాన్ చేసి చూశాను. అప్పుడు నిజంగానే వచ్చిందని తెలుసుకున్నా.’ అని తెలిపారు అరోన్ ఎసెన్‌మాచెర్. ఐదు తెల్లని బంతులపై 02-18-27-41-45 సంఖ్యలు రావటంతో అరోన్ ఎసెన్‌మాచెర్ ఈ జాక్‌పాట్ గెలుపొందారు. దీంతో ఏడాదికి 25వేల డాలర్లు(రూ.20లక్షలు) పొందేందుకు అర్హత సాధించారు. ఇవి 20 ఏళ్లు లేదా జీవితాంతం(ఏది మందుగా వస్తే అది) చెల్లిస్తుంది లాటరీ సంస్థ. అయితే, ఈ 20 ఏళ్ల పాటు చెల్లించే డబ్బులు మొత్తం రూ.3.2 కోట్లు ఒకేసారి ఇవ్వాలని అరోన్ కోరినట్లు లాటరీ సంస్థ పేర్కొంది. అప్పులు చెల్లించాలని, మిగిలిన వాటితో టూర్‌కు వెళ్లాలని చెప్పినట్లు తెలిపింది. లక్కీ ఫర్ లైఫ్ ఆడేందుకు కేవలం 2 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నిసార్లైనా ఆడొచ్చు. ఈ గేమ్‌లో రోజుకు వెయ్యి డాలర్లు జీవితాంతం చెల్లించటం అతిపెద్ద ప్రైజ్. 1 నుంటి 48 నంబర్ల మధ్య ఐదు నంబర్లను సహా ఓ లక్కీ బాల్ 1-18 నంబర్లును మ్యచ్ చేస్తే గెలచుకోవచ్చు. అయితే, లక్కీబాల్ కాకుండా ఐదు నంబర్లు మాత్రమే సరిగా గుర్తిస్తే ఏడాదికి రూ.20 లక్షలు వస్తాయి. ఇదీ చదవండి: జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్‌లు’.. మరో వివాదంలో కర్ణాటక ప్రభుత్వం -
పారేద్దామనుకున్న టికెట్‌కు 1.6 కోట్లొచ్చాయి
వెదుకుతున్నది దొరికితే కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అలాంటిది పారేద్దామనుకున్న టికెట్‌కు రూ.కోట్లు దక్కితే... ఆనందానికి అవధులుండవు. ఈ యూఎస్ మహిళ విషయంలో అది నిజమైంది. రోపర్‌కు చెందిన 60 ఏళ్ల జాక్వలిన్ లేహ్ ఓ స్టోర్ నుంచి ‘నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ’ టికెట్ హాట్‘5’ను ఐదు డాలర్లకు కొన్నది. ‘ప్రతి టికెట్‌కు అదృష్టం వరిస్తుందా’ అని భావించిన జాక్వలిన్ ఆ టికెట్‌ను పారేసినంత పనిచేసింది. ఎందుకైనా మంచిదని... చెత్తబుట్టలో వేసేముందు మరోసారి చెక్ చేసింది. అంతే... ఆమె లాటరీ టికెట్ రెండు లక్షల డాలర్లను గెలుచుకుంది. ‘‘నాకు ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదు. పారేద్దామనుకున్న టికెట్‌కు డబ్బులు రావడం ఇంకా నమ్మశక్యంగా లేదు’’ అంటోంది జాక్వెలిన్. ట్యాక్స్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ పూర్తయ్యాక... కోటీ 20 లక్షల రూపాయలను ఇంటికి తీసుకెళ్లింది. కార్ లోన్ కట్టడంతోపాటు ఇతర అవసరాలన్నీ తీర్చేసుకుంటానని ఆనందంగా చెబుతోంది. చదవండి: మానవ హక్కుల పోరాటాలకు నోబెల్ శాంతి బహుమతి -
England: లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట
-
అదృష్టం అంటే వీరిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట
లండన్: యూకేలోనే అతిపెద్ద యూరో మిలియన్స్ లాటరీని లండన్‌లోని గ్లూసెస్టర్‌కు చెందిన జంట గెలుచుకుంది. గురువారం నిర్వహించిన లక్కీడిప్‌లో జో(49), జెస్‌థ్వైట్(44) అనే దంపతులు సుమారు రూ.1,800 కోట్ల (184 మిలియన్ పౌండ్ల) జాక్‌పాట్ కొట్టేశారు. దీంతో, సాధారణ జీవితం గడుపుతున్న వీరు రాత్రికి రాత్రే కుబేరులైపోయారు. భరత జో.. కమ్యూనికేషన్స్ సేల్స్ మేనేజర్ కాగా, జెస్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ నిర్వహిస్తోంది. వీరికి స్కూలుకెళ్లే వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు. తమ కలలను సాకారం చేసుకునే గొప్ప అవకాశం వచ్చిందని జో, జెస్ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, 2019 అక్టోబర్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి 170 మిలియన్ పౌండ్ల భారీ లాటరీ గెలుచుకోవడమే ఇప్పటి దాకా రికార్డుగా ఉంది. ఈ రికార్డును జో జంట తుడిచిపెట్టారు. చదవండి: ఇదేం చిత్రం.. ముసుగు వేసుకుని వార్తలు చదవాలట! -
ఊహించని అదృష్టం.. పొరపాటున లాటరీ టికెట్ కొంటే.. కోటీశ్వరురాలిని చేసింది
రాత్రికిరాత్రే కోటీశ్వరులు అయిపోతే ఎలా ఉంటుంది? లక్ష్మీ దేవి కరుణించి ఒక్కసారిగా కాసుల వర్షం కురిపిస్తే.. అబ్బా ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదా.. మరి అదే నిజమైతే.. మన కాళ్లు భూమ్మీద ఉంటాయా, ఆనందానికి అవధులుంటాయా.. సరిగ్గా ఇలాంటి ఆశ్చర్యకర ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. పొరపాటున తప్పుడు బటన్ నొక్కడంతో ఓ మహిళకు ఊహించని అదృష్టం వరించింది. కోట్ల రూపాయలు ఒళ్లో వచ్చిపడ్డాయి. వివరాలు.. కాలిఫోర్నియాకు చెందిన లాక్వెడ్రా ఎడ్వర్డ్స్ అనే మహిళ లాటరీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుంది. గత ఏడాది నవంబర్‌లో 40 డాలర్ట విలువైన టికెట్ కొనుగోలు చేయాలనుకున్నారు. అయితే అప్పుడే ఓ వ్యక్తి అనుకోకుండా ఆమె మీద పడటంతో మహిళ లాటరీ మెషిన్లో తప్పుడు బటన్ నొక్కింది. దీంతో మహిళ కొనుగోలు చేయలనుకున్న లాటరీ టికెట్‌కు బదులు వేరే టికెట్ వచ్చింది. పైగా దానికి డబ్బులు ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది. ఆమెను ఢీకొన్న వ్యక్తి మాత్రం ఏమీ మాట్లాడకుండానే అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఎడ్వర్డ్స్ ఆమె లాటరీ డబ్బులో 75 శాతం అనుకోకుండా ఒక టిక్కెట్‌కి వెళ్లడంతో పరిస్థితిని చూసి చికాకుపడింది. చదవండి: రన్‌వే మీద రెండు ముక్కలైన విమానం.. వీడియో అయితే ఆమె కోపం ఎక్కువ సేపు నిలవలేదు. జరిగిన పొరపాటుతో ఆమెకు అదృష్టం వరించింది. లాటరీ ఫలితాల్లో టికెట్‌ను స్క్రాచ్ చేయగా.. ఆమె 10 మిలియన్ల డాలర్ల(దాదాపు 75 కోట్లు) ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లు గ్రహించింది. ముందు ఆ విషయాన్ని ఆమె నమ్మలేకపోయింది. "నేను మొదట దానిని నిజంగా నమ్మలేదు. కానీ నేను టికెట్ చూస్తూ ఉండిపోయాను. మళ్లీ మళ్లీ చెక్ చేసుకున్నాను. నేనింకా షాక్‌లో ఉన్నాను." అని ఎడ్వర్డ్స్ చెప్పింది. నేను ధనవంతురాలిని అయిపోయానని సంబరపడిపోయింది. తనకొచ్చిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంటానని, అందరికీ ఉపయోగపడే విధంగా ఓ సంస్థను ప్రారంభిస్తానని ఎడ్వర్డ్స్ తెలిపారు. -
లాటరీలో లక్కీ చాన్స్! 150 కిలోల బరువు ఉండటంతో టికెట్ ఫ్రెండ్‌కు ఇచ్చి..
కేప్ కానవెరల్: ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ గతేడాది చేపట్టిన తొలి పౌర అంతరిక్షయానం ‘ఇన్స్పిరేషన్ 4’కు లాటరీలో టికెట్ గెలుచుకున్న వ్యక్తి దాన్ని తన స్నేహితుడికి ఇచ్చాడని తెలుసా? బరువు ఎక్కువున్నందు వల్ల స్పేస్‌లో ప్రయాణించే అవకాశాన్ని అతను కోల్పోయాడంటే నమ్ముతారా? అక్షరాలా నిజం. టికెట్ గెలుచుకున్న అసలు వ్యక్తి పేరు కైల్ హిప్చెన్. తన కాలేజీ స్నేహితుడు క్రిస్ సెంబ్రోస్కీకు ఆ టికెట్‌ను ఇచ్చాడు. అలా స్నేహితుడికి టికెట్ ఇచ్చిన విషయాన్ని హిప్చెన్ ఎప్పుడో తన స్నేహితులు, బంధువులకు చెప్పినా ఇటీవలే ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఫ్లోరిడాకు చెందిన ఎండీవర్ ఎయిర్ అనే విమానయాన సంస్థలో హిప్చెన్ కెప్టెన్‌గా పని చేస్తున్నాడు. 1990ల్లో ఏరోనాటికల్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు క్రిస్ సెంబ్రోస్కీ, హిప్చెన్ కలిసి ఒకే రూమ్‌లో ఉన్నారు. అప్పటి నుంచి వీరికి పరిచయం ఉంది. తర్వాత కాలంలో హిప్చెన్ కెప్టెన్‌గా ఫ్లోరిడాలో, క్రిస్ డేటా ఇంజనీర్‌గా వాషింగ్టన్లో ఉంటున్నారు. రూ. 48 వేలు పెట్టి లాటరీలో పాల్గొని.. స్పేస్ ఎక్స్ అంతరిక్షయానానికి సంబంధించిన ఓ సీటును ‘షిఫ్ట్4 పేమెంట్స్’ వ్యవస్థాపకుడు, సీఈవో జారెడ్ ఇసాక్‌మన్ కొనుగోలు చేశాడు. ఓ పిల్లల రీసెర్చ్ ఆస్పత్రి కోసం డబ్బులు పోగు చేయడానికి దాన్ని లాటరీ ద్వారా అమ్మతున్నట్టు ప్రకటించాడు. అది తెలుసుకున్న హిప్చెన్ రూ. 45 వేలు, క్రిస్ రూ. 3 వేలు కలిపి రూ. 48 వేలతో లాటరీలో పాల్గొన్నారు. 72 వేల మంది దరఖాస్తు చేసుకోగా ఫిబ్రవరిలో లాటరీ తీస్తే హిప్చెన్ పేరొచ్చింది. గెలిచిన వ్యక్తి 2 మీటర్ల లోపు పొడవు, 113 కిలోల వరకు బరువుండాలని స్పేస్ ఎక్స్ షరతు విధించింది. కానీ హిప్చెన్ 150 కిలోలున్నాడు. లాంచింగ్‌కు 6 నెలలుంది. బరువు తగ్గుదామనుకున్నాడు. కానీ ఒకేసారి అంత బరువు తగ్గడం మంచిదికాదని తెలుసుకున్నాడు. దీంతో తన స్నేహితుడు క్రిస్ సెంబ్రొస్కీని హిప్చెన్ ఎంచుకున్నాడు. -
ఏమా అదృష్టం.. పెయింటర్‌ను వరించిన రూ.12 కోట్ల లాటరీ.. టికెట్ కొన్న గంటల్లోనే
కొట్టాయం (కేరళ): యాభై ఏళ్లుగా సామాన్య పెయింటర్... రెక్కల కష్టంతో జీవితం నెట్టుకొస్తున్నాడు. ఆదివారం అదృష్టం ఆయన తలుపు తట్టింది. కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్‌కు సుడి మామూలుగా లేదు. క్రిస్మస్– నూతన సంవత్సరపు బంపర్ లాటరీలో ఆయన ఏకంగా రూ. 12 కోట్లు గెల్చుకున్నారు. ఆదివారం తిరువనంతపురంలో ఈ మెగా లాటరీ డ్రా తీశారు. దానికి కొద్ది గంటలకు ముందు సదానందన్ ‘ఎక్స్‌జి 218582’ నంబర్ లాటరీ టికెట్ కొన్నారు. అట్నుంటే బయటికి వెళ్లి మాంసం కొనుగోలు చేశారు. డ్రా తీశాక ఫలితాలను చెక్ చేసుకుంటే సదానందన్ టికెట్‌కు రూ. 12 కోట్లు తగిలింది. పిల్లలకు మంచి జీవితం అందించడానికి ఈ డబ్బును ఖర్చు చేస్తానని సదానందన్ చెప్పారు. భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులతో సదానందన్ కుడయంపాడిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. (చదవండి: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..) -
ఈ అంబులెన్స్ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు! కంగారులో..
ఓవర్ నైట్‌లో కోటీశ్వరులైపోవాలని కలలు కనని వారుండరేమో ఈ జిందగీలో! కానీ చాలా అరుదుగా మాత్రమే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. హఠాత్తుగా అదృష్టం వరించి రాత్రికిరాత్రే జాతకం మారిపోతుంది. అలాంటి వింతొకటి ఓ వ్యక్తి కి తారసపడింది. ఉదయం లాటరీ టికెట్ కొన్నాడు సాయంత్రానికి కోటీశ్వరుడైపోయాడు. అదెలాగో మీరే తెలుసుకోండి.. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బార్ధమాన్కు చెందిన షేక్ హీరా అనే అంబులెన్స్ డ్రైవర్ ఒక రోజు ఉదయం రూ. 270లతో కోటి రూపాయల జాక్‌పాట్ లాటరీ టికెట్ కొన్నాడు. అంతే! సాయంత్రానికి అతన్ని అదృష్ట దేవత వరించింది. దీంతో అయోమయానికి గురైన సదరు వ్యక్తి సమీపంలోని శక్తి ఘడ్ పోలీస్ స్టేషన్‌ను సలహాకోసం ఆశ్రయించాడు. లాటరీ టికెట్ పోతుందేమోననే భయం కూడా అతనిలో లేకపోలేదు. పోలీస్ అధికారులు అతన్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లి, బయట కొంత మంది పోలీసులను రక్షణగా ఉంచారు కూడా. నిజానికి అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించుకోవడానికి అతనికి డబ్బు అవసరం చాలా ఉంది. లాటరీని గెలుచుకున్న తర్వాత తన తల్లి త్వరగా కోలుకుంటుందనే ధీమా వ్యక్తం చేశాడు. ‘లాటరీ టికెట్ల ద్వారా ఏదో ఒక రోజు జాక్‌పాట్ కొట్టాలని కలలు కన్నాను. ఇన్నాళ్లకు నా కాల నెరవేరింద’ని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావని మీడియా అడిగిన ప్రశ్నకు.. తన తల్లికి మంచి వైద్యం చేయించి, ఉండటానికి చక్కని ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. ప్రస్తుతం అంతకు మించి వేరే ఆలోచన ఏమీ లేదని చెప్పాడు. హీరాకు టిక్కెట్ అమ్మిన దుకాణదారుడు షేక్ హనీఫ్ మాట్లాడుతూ.. ‘ఎన్నో యేళ్లగా లాటరీ టిక్కెట్ వ్యాపారం చేస్తున్నాను. చాలా మంది నా షాప్ నుండి టిక్కెట్లు కొంటారు. కొంతమందికి రివార్డ్‌లు అప్పుడప్పుడు దక్కుతాయి. కానీ ఇంత పెద్దమొత్తంలో ఎవరికీ మునుపెన్నడూ తగల్లేదు. నా షాప్‌లో కొన్న టికెట్ జాక్‌పాట్ కొట్టడం చాలా సంతోషంగా ఉంద’ని తెలిపాడు. చదవండి: గాడిదపాలు తాగితే కరోనా తగ్గుతుంది! లీటరు రూ. 10వేలు.. -
అత్యంత దురదృష్టవంతులు వీరే.. ఏకంగా రూ.31 కోట్లు మిస్సయ్యారు
లండన్: లాటరీ టికెట్ అంటే ఓ రకంగా చెప్పాలంటే జూదం. లక్షల్లో టికెట్ కొంటే ఒక్కరిని మాత్రమే అదృష్టం వరిస్తుంది. అలా మన ఇంటికి వచ్చిన అదృష్టాన్ని.. మన చేతులారా మనమే పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది.. ఆ బాధను వర్ణించడానికి మాటలు చాలవు. గత 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు బ్రిటన్‌కు చెందిన మార్టిన్ టాట్ అతడి భార్య కే. వీరి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో వీరికంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరని జాలిపడుతున్నారు. కారణం ఏంటంటే ఈ జంట కొన్న టికెట్‌కే లాటరీ తగిలింది. అది కూడా ఏ కోటి, రెండు కోట్లో కాదు.. ఏకంగా 31 కోట్ల రూపాయలు. కానీ ఏం లాభం వారి దగ్గర ఆ టికెట్ లేదు. లాటరీ తగిలిన ఆనందం కన్నా టికెట్ పొగుట్టుకున్న విషమే వారిని ఎక్కువ బాధించింది. 20 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పటికి వారిని ఎంతో బాధిస్తుంది. ఆ వివరాలు.. (చదవండి: ఆటో డ్రైవర్‌ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.12 కోట్లు) ఇరవై ఏళ్ల అనగా 2001 సంవత్సరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మార్టిన్, అతడి భార్య కే ప్రతి వారం లాటరీ గేమ్‌లో పాల్గొనేవారు. ఈ క్రమంలో ఓ సారి అదృష్టం బాగుండి కే కొన్న టికెట్‌కే లాటరీ తగిలింది. దాని విలువ ఏకంగా 31 కోట్ల రూపాయలు. ఇక తమ కష్టాలు అన్ని తీరిపోతాయి.. కోటీశ్వరులం అవుతామని కలలు కంటున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. కే కొన్న లాటరీ టికెట్ కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో కే లాటరీ నిర్వహిస్తున్న యాజమాన్యం దగ్గరకు వెళ్లి.. తాను కొన్న టికెట్‌కే లాటరీ తగిలిందని.. కావాలంటే తన టికెట్ నంబర్ని కంప్యూటర్లో చెక్ చేయవచ్చని కోరింది. కానీ సదరు కంపెనీ ససేమిరా అన్నది. టికెట్‌ని తీసుకువచ్చి చూపిస్తేనే ప్రైజ్‌మనీని ఇస్తామని స్పష్టం చేసింది. 30 రోజుల్లోపు పోగొట్టుకున్న టికెట్‌ని తీసుకువస్తే.. ప్రైజ్‌మనీని వారికి అందజేస్తామంది. కానీ దురదృష్టం కొద్ది టికెట్ దొరకలేదు. ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. చేతికొచ్చిన ముద్ద నోటికందకుండా పోయిందే అంటూ కే దంపతుల పరిస్థితిపై జాలి పడ్డారు జనాలు. (చదవండి: యూరోకప్ టోర్నమెంట్ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.10 కోట్లు) ఈ లాటరీ ప్రైజ్‌మనీ కోసం కే దంపతులు ఐదు సంవత్సరాల పాటు పోరాటం చేశారు. కానీ లాభం లేకుండాపోయింది. ఈ క్రమంలో వారి మధ్య బంధం కూడా బీటలు వారింది. 31 కోట్ల రూపాయలు చేతికందకుండా పోయాననే బాధతో ఇరువురు ఒకరినొకరు దూషించుకోసాగారు. అలా వారి సంసారంలో కలహాలు మొదలయ్యాయి. చివరకు వారిద్దరు విడాకులు తీసుకున్నారు. పాపం లాటరీ ప్రైజ్‌మనీ దక్కలేదు.. ఇటు వివాహ బంధం నిలవలేదు. వీరి గురించి విన్న ప్రతి ఒక్కరు ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతులు వీరేనని సానుభూతి చూపుతారు. చదవండి: నిజాయతీ: చేతికి దొరికిన రూ.7 కోట్లు తిరిగిచ్చేశారు -
ఆటో డ్రైవర్‌ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.12 కోట్లు
కోచి: అదృష్ట లక్ష్మి ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. ఓ ఆటో డ్రైవర్‌కు ఫ్యాన్సీ నంబర్ రూపంలో అదృష్టం వరించింది. తనకు నచ్చిన నంబర్‌తో ఉన్న లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడై పోయాడు ఈ కేరళ వాసి. కోచిలోని మరడుకు చెందిన పీఆర్ జయపాలన్ ఈ నెల 10వ తేదీన ఓనమ్ బంపర్ లాటరీ టికెట్ కొన్నాడు. (చదవండి: ‘అదృష్టాన్ని’ పర్సులోనే దాచింది.. 290 కోట్ల లాటరీ!) టీఈ 645465 అనే సీరియల్ నంబర్ ఉన్న ఈ టికెట్‌కు ఆదివారం వెల్లడించిన ఫలితాల్లో మొదటి బహుమతి దక్కింది. రూ.12 కోట్ల జాక్‌పాట్ దక్కింది తనకేనని తెలుసుకున్న జయపాలన్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. సొమ్ములో పన్నులు పోను రూ.7 కోట్ల భారీ మొత్తం ఆటో డ్రైవర్ జయపాలన్ అందుకోనున్నాడు. చదవండి: నిజాయతీ: చేతికి దొరికిన రూ.7 కోట్లు తిరిగిచ్చేశారు -
‘అదృష్టాన్ని’ పర్సులోనే దాచింది.. 290 కోట్ల లాటరీ!
బెర్లిన్: లాటరీ టికెట్ కొంటే లక్కీ డ్రా తేదీ కోసం కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తుంటారు చాలామంది. అలాంటిది ఒకావిడ తాను లాటరీ టికెట్ కొన్న సంగతే మర్చిపోయింది. కొన్న టికెట్ తన పర్సులోనే ఉన్నా దానిని వారాల పాటు ఆమె పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎలాగోలా లాటరీ ఫలితాల విషయం తెల్సి తన టికెట్ నంబర్‌ను చెక్ చేసుకుంది. తను కొన్న టికెట్‌కే 39 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.290.53 కోట్ల) బంపర్ డ్రా తగిలిందనే విషయం తెలిసి సంభ్రమాశ్చర్యానికి గురైంది. ఈ ఘటన జర్మనీలో ఇటీవలే జరిగింది. జూన్ తొమ్మిదిన లాటరీ ఫలితాలు ప్రకటించారు. 1.20 యూరోలు (దాదాపు రూ.105) పెట్టి టికెట్‌ను కొని ఇన్నాళ్లూ ఆ సంగతే మర్చిపోయిన ఆమె.. ఇటీవలే తన లాటరీ టికెట్‌లోని ఏడు నంబర్లను సరిచూసుకుని ఆనందసాగరంలో మునిగిపోయారు. -
యూరోకప్ టోర్నమెంట్ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.10 కోట్లు
లండన్: సాధరణంగా చాలా వరకు భార్యాభర్తల్లో ఒకరికి నచ్చినది మరోకరికి నచ్చదు. చాలా మంది భర్తలు స్పోర్ట్స్ చానెల్ చూడ్డానికి ఇష్టపడతారు.. కానీ భార్యలకేమో ఎంటర్టైన్మెంట్ చానెల్స్ చూడాలని ఉంటుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తుతాయి. అది వేరే విషయం. కానీ ఇప్పుడు మీరు మేం చెప్పబోయే విషయం వింటే.. అబ్బా మాకు ఇలానే జరిగితే ఎంత బాగుటుంది.. అటు గొడవలు ఉండవు.. ఇటు డబ్బులు వస్తాయి అనుకుంటారు. ఇంతకు ఏంటా విషయం అంటే కొద్ది రోజుల క్రితం యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2020 జరిగిన సంగతి తెలిసిందే. ఇక మన దగ్గర క్రికెట్‌కు ఎంత క్రేజో.. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు అంతకు మించి అభిమానులున్నారు. ఈ క్రమంలో భర్త అస్తమానం ఫుట్‌బాల్ మ్యాచ్ పెడుతుండటంతో బోర్ కొట్టి ఓ మహిళ సరదాకు 1 మిలియన్ పౌండ్లు విలువ చేసే లాటరీ టికెట్ కొన్నది. అదృష్టం కొద్ది ఆమెనే లాటరీ వరించడంతో ఏకంగా 10 కోట్ల రూపాయలకు పైగా గెలుచుకుంది. ఈ సంఘటన యూకేలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. బేసింగ్స్టోక్కు చెందిన 33 ఏళ్ల సమంతా యంగ్ చార్టెడ్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తుంది. ఇక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2020 ప్రారంభమైన నాటి నుంచి భర్త అస్తమానం ఫుట్‌బాల్ మ్యాచ్ పెడుతుండటంతో బోర్‌గా ఫీలయ్యేది. ఈ క్రమంలో జూలై 3న ఆమె టీవీలో మ్యాచ్ చూడటం ఇష్టం లేక ఆన్లైన్లో బ్రౌజ్ చేయసాగింది. దానిలో భాగంగా ఆమెకు ఓ కంపెనీ లాటరీ టికెట్ కంటపడింది. ఊరికే టైం పాస్‌కి 20 పౌండ్లు(2,067.69 రూపాయలు) చెల్లించి 1 మిలియన్ పౌండ్స్ (10,34,97,400 రూపాయలు)విలువ చేసే లాటరీ టికెట్ కొన్నది. కొద్ది రోజుల తర్వాత యంగ్‌కు ఓ ఈమెయిల్ వచ్చింది. ఆమె కొన్న లాటరీ టికెట్‌కే ప్రైజ్‌మనీ వచ్చిందని మెయిల్ సారాంశం. ఇది చూసి యంగ్ తనకు మహా అయితే 1,000 పౌండ్లు లాటరీ వచ్చాయేమో అని భావించింది. కానీ సరిగా చూస్తే.. దాని విలువ 1 మిలియన్ పౌండ్స్‌గా ఉంది. దాంతో భర్తను పిలిచి చూపించింది. అతడు కూడా తన భార్య కొన్న లాటరీ టికెట్‌కు 1 మిలియన్ పౌండ్స్ ప్రైజ్‌మనీ దక్కిందని తెలిపాడు. టైం పాస్ కాక కొన్న లాటరీ టికెట్‌కు ఇంత భారీ మొత్తం తగలడంతో యంగ్ దంపతులు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తనకు వచ్చిన మొత్తంతో వారి కలల సౌధం, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు కొనడతో పాటు కుటుంబం కోసం కొంత పొదుపు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. -
నిజాయతీ: చేతికి దొరికిన రూ.7 కోట్లు తిరిగిచ్చేశారు
మసాచుసెట్స్: రూపాయి దొరికితేనే ఎవరి కంటబడకుండా జేబులో వేసుకుని.. అక్కడ నుంచి జారుకునే రోజులివి. అలాంటిది ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా కోట్ల రూపాయలు దొరికితే ఎవరైనా తిరిగిచ్చేస్తారా.. ఎక్కువ శాతం మంది చెప్పే సమాధానం లేదనే. కానీ అక్కడక్కడ కొందరు నిజాయతీపరులుంటారు. వారి దృష్టిలో పరుల సొమ్ము పాముతో సమానం. అందుకే ఎంత భారీ మొత్తం దొరికినా అందులో రూపాయి కూడా ముట్టరు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మసాచుసెట్స్‌లో చోటు చేసుకుంది. భారత సంతతి కుటుంబం తమకు దొరికిన 1 మిలియన్ డాలర్(7,27,80,500 రూపాయలు) ప్రైజ్‌మనీ గెలుచుకున్న లాటరీ టికెట్‌ను దాని యజమానిదారుకు అప్పగించారు. ప్రస్తుతం ఆ కుటుంబంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనలు. ఆ వివారలు.. మౌనిశ్ షా అనే భారత సంతతి వ్యక్తి మసాచుసెట్స్‌లో సొంతంగా ఓ స్టోర్ నడుపుతున్నాడు. లాటరీ టికెట్లను కూడా అమ్ముతుంటారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మౌనిశ్ షా భార్య 1 మిలియన్ డాలర్ విలువ చేసే లాటరీ టికెట్‌ని లీస్ రోజ్ ఫిగా అనే మహిళకు అమ్మింది. అదృష్టం కొద్ది ఆ టికెట్‌కే లాటరీ తగిలింది. అయితే లీస్ రోజ్ షిగా ఆ టికెట్‌ని సరిగా స్క్రాచ్ చేయకుండానే.. తనకు లాటరీ తగలలేదని భావించి స్టోర్‌లో ఉన్న చెత్త డబ్బాలో పడేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మౌనిశ్ షా కుమారుడు అభి షా సాయంత్ర డస్ట్‌బిన్‌లో ఉన్న టికెట్లను బయటకు తీసి చెక్ చేయగా.. లీస్ రోజ్ ఫిగా టికెట్‌ను సరిగా స్క్రాచ్ చేయకపోవడం చూసి.. దాన్ని పూర్తిగా గీకి చూడగా.. ఆ నంబర్‌కే లాటరీ తగిలిందని గమనించాడు. చేతిలో ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే టికెట్ చూసి అభి ఉద్వేగానికి లోనయ్యాడు. వెంటనే దీని గురించి తల్లిదండ్రులకు చెప్పాడు. ముందు అభి ఆ డబ్బుతో టెస్లా కారు కొనాలని భావించాడు. కానీ అతడి తల్లిదండ్రులు ఆ టికెట్‌ను దాన్ని కొన్న లీస్ రోజ్ ఫిగాకు అప్పగించాలని భావించారు. దీని గురించి అభి భారతదేశంలో నివసిస్తున్న తన తాతయ్య, నానమ్మలకు చెప్పగా వారు కూడా ఆ టికెట్ ఎవరిదో వారికి తిరిగి ఇచ్చేయమన్నారు. ‘‘దాన్ని మన దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదు. టికెట్ వారికి తిరిగి ఇచ్చేయండి.. ఒకవేళ మీ అదృష్టంలో రాసిపెట్టి ఉంటే మీకే సొంతమవుతుంది’’ అన్నారు. దాంతో ఆ టికెట్‌ను లీస్ రోజ్ ఫిగాకు తిరిగి ఇచ్చేయాలని భావించాను’’ అన్నాడు అభి షా. ఇక మరుసటి రోజు అభి తల్లిదండ్రులను తీసుకుని లీస్ రోజ్ ఫిగా పని చేస్తున్న చోటకు వెళ్లి.. ‘‘మా అమ్మనాన్న మీతో మాట్లాడాలనుకుంటున్నారు.. ఒక్క నిమిషం బయటకు రండి అని పిలిచాను. బయటకు వచ్చాక ఆమెకు తను కొన్న టికెట్ అప్పగించాం’’ అన్నాడు. ఈ సందర్భంగా లీస్ రోజ్ ఫిగా మాట్లాడుతూ.. ‘‘అక్కడి వెళ్లాక వారు నా చేతిలో నేను డస్ట్‌బిన్‌లో పడేసిన టికెట్ నా చేతిలో పెట్టారు. దానికే ప్రైజ్‌మనీ వచ్చిందని తెలిపారు. అది చూసి నా కళ్లని నేను నమ్మలేకపోయాను.. సంతోషంతో అక్కడే కూర్చుని గట్టిగా ఏడ్చాను. ఆ తర్వాత వారిని కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపాను. లోకంలో ఇంత నిజయాతీపరులు ఉంటారని కలలో కూడా ఊహించుకోలేదు. జీవితాంతం వారికి రుణపడి ఉంటాను. దేవుడు వారిని చల్లగా చూడాలి’’ అని తెలిపింది. చదవండి: నాన్న ఇచ్చిన నాణెం: కోట్లు కురిపించింది! -
దురదృష్టం అంటే ఇదే.. 190 కోట్లు పాయే!
కాలిఫోర్నియా: అదృష్ట దేవత తలుపు తట్టినా.. దరిద్రం నెత్తిమీద తాండవం చేస్తుంటే పరిస్థితి ఇదిగో ఇలాగే ఉంటుంది. ఓ మహిళకు ఉచితంగా 26 మిలియన్ డాలర్లు (దాదాపు 190 కోట్ల రూపాయలు) కొట్టేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... గతేడాది నవంబరులో ఓ మహిళ నోర్వాక్లోని ఓ గ్యాస్ స్టేషన్లో సూపర్లాటో ప్లస్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. దానిపై వచ్చే మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు మే 13 ఆఖరు తేదీ. అయితే, టికెట్ అయితే కొన్నది గానీ, దాని విషయం పూర్తిగా మరచిపోయింది సదరు మహిళ. ప్యాంటు జేబులో టికెట్ పెట్టుకున్న విషయం గుర్తులేక దానిని లాండ్రీకి వేసింది. కానీ.. క్లెయిమ్ చేసుకునేందుకు చివరి తేదీ అన్న ప్రకటన చూడగానే అసలు విషయం గుర్తుకువచ్చి కంగుతిన్నది. వెంటనే సదరు షాపునకు పరుగులు తీసింది. అప్పటికీ, ఇంకా ఎవరూ కూడా అమౌంట్ క్లెయిమ్ చేసుకోవడానికి రాలేదని తెలుసుకుని, తన నంబరుకే లాటరీ తగిలిందని, ఎలాగైనా డబ్బులు తనకే ఇవ్వాలని కోరింది. కానీ, టికెట్ చూపించకలేకపోవడంతో ఆమెకు నిరాశే ఎదురైంది. ఈ విషయం గురించి లాటరీ నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘‘ఎవరైతే తాము లాటరీ గెలిచామని భావిస్తారో వారు కచ్చితంగా క్లెయిమ్ ఫాం పూర్తిచేయాలి. అదే విధంగా టికెట్ చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ టికెట్ పోగొట్టుకున్నట్లయితే, దాని ఫొటోనైనా చూపించగలగాలి. లేదంటే మేమేమీ చేయలేం’’ అని పేర్కొన్నారు. ఇక నోర్వాక్ స్టోర్ మేనేజర్ మాట్లాడుతూ.. ‘‘ ఆమె మా స్టోర్‌కు వచ్చారు. టికెట్ కూడా కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ మేం లాటరీ నిర్వాహకులకు పంపించాం. దీనిపై విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాగా దర్యాప్తులో గనుక సదరు మహిళ టికెట్ నంబరుకు లాటరీ తగిలిందని తేలనట్లయితే, ఆ మొత్తాన్ని కాలిఫోర్నియా పబ్లిక్ స్కూళ్లకు ఫండ్‌గా ఇస్తారు. చదవండి: చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’! -
నాన్న ఇచ్చిన నాణెం: కోట్లు కురిపించింది!
మిచిగాన్: లాటరీ గెలుచుకోవాలన్నది ఎంతోమంది కల. జీవితంలో ఒక్కసారైనా దాన్ని గెలుచుకుంటే చాలనుకునేవారు కోట్లల్లో ఉంటారు. కానీ ఓ వ్యక్తికి మాత్రం ఒక్కసారేంటి, రెండుసార్లు లాటరీ తగిలింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అమెరికాలోని మిచిగాన్కు చెందిన మార్క్ క్లార్క్ అనే వ్యక్తి 2017లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా ఆ లాటరీ టికెట్‌ను పదేళ్ల క్రితం చనిపోయిన తండ్రి కానుకగా ఇచ్చిన నాణెంతో గీకి చూడగా ఆ నంబర్ లాటరీ గెలుచుకుంది. దీంతో అక్షరాలా నాలుగు మిలియన్ డాలర్లు(30 కోట్ల రూపాయలు) అతడి సొంతమైంది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు సోమవారం ధృవీకరించారు. కాగా అతడు లాటరీ గెలుపొందండం ఇది రెండోసారి కావడం విశేషం. ఇక క్లార్క్ ముందు లాటరీ నిర్వాహకులు రెండు ఆప్షన్లు ప్రవేశపెట్టారు. (చెత్తలో పడేసిన టికెట్.. జీవితాన్నే మార్చేసింది) దీర్ఘ కాలంలో 4 మిలియన్ డాలర్లు తీసుకుంటారా? లేదా తక్షణమే 2.5 మిలియన్ డాలర్లు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. దీనికి అతడు డబ్బులు అందుకోడానికి ఎక్కువ కాలం వేచి చూడలేనంటూ 2.5 మిలియన్ డాలర్లు (18,95,18,750 కోట్ల రూపాయలు) అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడుతూ.. "నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా.. కానీ నేను మళ్లీ లాటరీ గెలిచానంటే అందుకు ఈ నాణెం కారణమని భావిస్తున్నా. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఇప్పుడు దశ తిరిగిపోయినట్లు అనిపిస్తోంది" అని పేర్కొన్నాడు. (ఇదీ లక్ అంటే: కోట్లు గెలుచుకున్నాడు!) -
ఇదీ లక్ అంటే: కోట్లు గెలుచుకున్నాడు!
అబుదాబి: అదృష్టమంటే ఇదేనేమో... ఏడాది బుడ్డోడు ఒక మిలియన్ డాలర్(సుమారు ఏడు కోట్ల పైచిలుకు) గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. ఈ అరుదైన ఘటన దుబాయ్‌లో జరిగింది. రమీస్ రహ్మాన్ అనే కేరళకు చెందిన వ్యక్తి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ నిర్వహిస్తున్న లాటరీ టికెట్లో తన అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోవాలనుకున్నాడు. వెంటనే తన ఏడాది వయసున్న కొడుకు మహమ్మద్ సాలా పేరు మీద టికెట్ కొనుగోలు చేశాడు. మంగళవారంనాడు లాటరీ సంస్థ నిర్వాహకులు లక్కీడ్రా నిర్వహించగా అందులో తనయుడు మహమ్మద్ పేరు కూడా ఉండటంతో అతని తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. (కోటి రూపాయల లాటరీ.. భయంతో పోలీసుల వద్దకు!) ‘ఇది నిజంగా ఎంతో సంతోషకరమైన వార్త. ఇక నాకు ఎలాంటి ఢోకా లేదు. లాటరీ డబ్బు నా కుమారుడి భవిష్యత్తుకు ఎంతగానో భరోసానిస్తుంది’ అని రమీస్ సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయాడు. కాగా గతంలోనూ చాలామంది భారతీయులు లక్కీడ్రాలో తమ అదృష్టాన్ని నిరూపించుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఓ భారతీయ రైతు ఉపాధిని వెతుక్కుంటూ దుబాయ్‌కు వలస వచ్చాడు. కానీ సరైన ఉపాధి దొరక్కపోవడంతో భారత్‌కు తిరుగుముఖం పట్టాడు. ఈ క్రమంలో తన దగ్గర చిల్లిగవ్వ లేకపోయినప్పటికీ భార్య దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని మరీ లాటరీ టికెట్ కొనుగోలు చేయగా 4 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. దీంతో అతని దిశే తిరిగిపోయింది. చదవండి: ఎర్రచీరలో ఇరగదీసిన పెళ్లికూతురు చెత్తలో పడేసిన టికెట్.. జీవితాన్నే మార్చేసింది -
చెత్తలో పడేసిన టికెట్.. జీవితాన్నే మార్చేసింది
కోల్‌కతా: అదృష్టవంతుడిని ఎవ్వరూ చెడగొట్టలేరు దురదృష్టవంతున్ని ఎవరూ బాగుచేయలేరు అనే మాట మరోమారు నిజమైంది. లాటరీ టికెట్ కొని ఎవరో ఏదో అన్నారని దాన్ని చెత్తబుట్టలో పడేసిన లాటరీ టికెట్‌కు రూ.కోటి రూపాయలు ప్రైజ్ మనీ వచ్చింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతాకు చెందిన వ్యాపారి తలదిక్ దమ్‌దమ్ ప్రాంతంలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. యధాప్రకారం ఒక రోజు నాగాలాండ్ లాటరీ టికెట్లు కొన్నాడు. ఆ సమయంలో షాపు వద్ద ఉన్న తెలిసినవారు నువ్వు ఎన్నిసార్లు లాటరీ టికెట్లను కొన్నా.. డబ్బులు వృథా కావాల్సిందే కానీ, నీకు లాటరీ తగలడం భ్రమే అంటూ ఎగతాళి చేశారు. చదవండి: కోడి కూరతో పాటు నువ్వూ కావాలన్న తహసీల్దార్ ఆవేదనతో అక్కడ నుంచి ఇంటికి వెళ్లిన సాదిక్ ఆ టికెట్లను చెత్తబుట్టలో పడేశాడు. తరువాత వాటి సంగతి మరచిపోయాడు. ఇక ఎప్పటిలానే తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే సాదిక్‌కు లాటరీ టికెట్లు అమ్మిన వ్యక్తి కనిపించి, నీకు కోటి రూపాయలు లాటరీ తగిలిందని చెప్పడంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే అతనికి ఆ టికెట్లను చెత్తబుట్టలో పడేసిన ఘటన గుర్తుకొచ్చి.. భార్య అమీనాకు ఫోన్ చేసి చెత్తబుట్టలో పడేసిన లాటరీ టిక్కెట్లు ఉన్నాయేమో వెతకమని చెప్పాడు. ఆమె లాటరీ టికెట్ల కోసం చెత్త బుట్టలో చూడగా అవి దొరికాయి. సాదిక్ కొన్న మొత్తం ఐదు టిక్కెట్లలో ఒక టికెట్‌కు కోటి రూపాయలు దక్కగా, మిగిలిన నాలుగు టికెట్లకు లక్ష రూపాయల చొప్పున బహుమతి లభించింది. ఈ సందర్భంగా అమీనా మాట్లాడుతూ లాటరీలో వచ్చిన మొత్తంతో తమ జీవితం మారిపోతుందని ఇప్పటి వరకూ ఎన్నో కష్టాలు చూశాం. ఇక నా కొడును మంచి స్కూల్లో చదివిస్తాం అంటూ సంతోషపడిపోతోంది. -
స్పెయిన్‌లో 17 వేల కోట్ల లాటరీ
బార్సిలోనా: క్రిస్మస్ను పురస్కరించుకొని స్పెయిన్‌లో నిర్వహించిన భారీ లాటరీలో 26590 నంబర్ టికెట్ గెలుపొందింది. లాటరీలో విజేతల ఎంపిక కార్యక్రమాన్ని ఆదివారం ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఎల్ గొర్డోగా పిలిచే ఈ లాటరీలో 26590 టికెట్ నంబర్ కలిగిన వారందరికీ రూ. 3 కోట్లు చొప్పున లభించనున్నాయి. విజేతలు దాదాపు రూ. 60 లక్షలు పన్నుల రూపంలో చెల్లించాలి. ఈ లాటరీ మొత్తం విలువ రూ. 17 వేల కోట్లు. లాటరీ మొత్తంపరంగా చూస్తే ప్రపంచంలో ఇదే అత్యంత విలువైనది. ఈ లాటరీని 1763లో కింగ్ కార్లోస్–3 ప్రారంభించారు. ఇందులో వచ్చే డబ్బును కొందరు దానధర్మాలకు కూడా వినియోగిస్తారు. ఏటా డిసెంబర్ 22వ తేదీన ఈ లాటరీ డ్రా తీస్తారు. -
దుబాయ్‌లో భారతీయుడికి జాక్‌పాట్
దుబాయ్: కేరళకు చెందిన ఓ వ్యక్తికి దుబాయ్‌లో జాక్‌పాట్ తగిలింది. యూఏఈలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీలో బ్రిట్టీ మార్కోస్ అనే వ్యక్తి రూ. 19.85 కోట్లు గెలుపొందాడని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. 2004 నుంచి దుబాయ్‌లో నివసిస్తున్న బ్రిట్టీ అబుదాబీలో డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేస్తున్నాడని తెలిపింది. లాటరీ గెలవడం పట్ల బ్రిట్టీ సంతోషం వ్యక్తం చేశాడు. తాను కొన్నేళ్లుగా బిగ్ టికెట్‌ను కొనుగోలు చేస్తున్నానని, ఇది ఐదోసారని తెలిపాడు. గెలిచిన మొత్తంలో కొంత భాగాన్ని అప్పులు తీర్చుకునేందుకు, మిగతా దానిని సొంత ఇంటి నిర్మాణానికి వినియోగిస్తానని చెప్పాడు. ఏటా ఎంతో మంది కేరళవాసులకు లాటరీ తగులుతుందని, ఈసారి తాను కచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నానని అదే నిజమైందని ఆనందం వ్యక్తంచేశాడు. కాగా, ఈ లాటరీలో మొత్తం పది మంది గెలుపొందగా, వారిలో తొమ్మిది మంది భారతీయులు సహా ఓ పాకిస్తానీ ఉన్నాడు. -
పోయిందనుకున్న 461 కోట్ల రూపాయల లాటరీ టికెట్..
స్కాట్లాండ్: ఏదైన విలువైన వస్తువు పోగొట్టుకుని తిరిగి పొందితే మురిసి పోతాం. అదృష్టమంటే నీదేరా..! అంటారందరు. కానీ, వందల కోట్ల లాటరీ తగిలితే..! పోయిందనుకున్న ఆ లాటరీ టికెట్ మళ్లీ కంటబడితే.. అంతకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు..! స్కాట్లాండ్లో ఇలాంటి అద్భుతమే జరిగింది. అబెర్డీన్ షైర్‌కు చెందిన వృద్ధ దంపతులు ఫ్రెడ్ (57), లెస్లీ హిగిన్స్ (67) ‘లైఫ్ చేంజింగ్’ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. అయితే.. డ్రాలో తమ నెంబర్ వచ్చిందేమోనని స్థానికంగా ఉండే లాటరీ ఆఫీస్‌కి వెళ్లగా అక్కడ నిరాశే ఎదురైంది. ఎటువంటి లాటరీ రాలేదని వారి టికెట్‌ను అక్కడి సిబ్బందిలో ఒకరు చించి చెత్త బుట్టలో వేశాడు. అయితే, హిగిన్స్‌కు మాత్రం సిబ్బంది నిర్లక్ష్యంగా తన టికెట్‌ను చించాడేమోనన్న అనుమానం వీడలేదు. ఎన్నోసార్లు కొన్నాడు.. కానీ హిగిన్స్‌కు లాటరీ టికెట్లు కొనడం.. ప్రతి మంగళవారం, శుక్రవారం జరిగే డ్రాలకు హాజరవడం అలవాటు. అయితే.. గత జూలై 10న (మంగళవారం) జరిగిన డ్రా మాత్రం తన జీవితాన్ని మార్చేసింది. సిబ్బంది సరిగా చూడకుండానే తన లాటరీ టికెట్ చించి పడేశాడనీ ఆరోపిస్తూ ఆయన సహాయ కేంద్రంలో విచారణ కోరారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతని నెంబర్‌ను కనుగొని.. డ్రాలో హిగిన్స్ నెంబర్ ఉందని విచారణలో తేల్చారు. డస్ట్‌బిన్‌ను మొత్తం వెతికించి అతని టికెట్‌ను కనుగొన్నారు. జీవితంలో ఎప్పడూ చూడనంత మొత్తాన్ని.. అక్షరాల 461 కోట్ల రూపాయల జాక్‌పాట్‌ను ఆ హిగిన్స్ దంపతులకు అందించారు. పెద్ద మొత్తంలో లాటరీ గెలుచుకోవడంతో హిగిన్స్ దంపతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. మొదటగా ఒక ఖరీదైన ఆడి కారు, కరీబియన్ దీవుల్లోని బార్బడోస్‌లో విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేస్తామని తెలిపారు. -
దుబాయ్‌లో భారతీయుడికి రూ.21కోట్ల లాటరీ
దుబాయ్: భారత్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో జాక్ పాట్ కొట్టాడు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో మంగళ వారం జరిగిన బిగ్ టికెట్ లాటరీలో ఏకంగా రూ.21.2 కోట్లు(12 మిలియన్ల దిర్హామ్‌లు) గెలుచుకున్నాడు. కేర ళకు చెందిన జాన్ వర్గీస్ ఇక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లాటరీ గెలిచినట్లు ఫోన్ కాల్ వచ్చిందని, ఎవరైనా తనని ఏప్రిల్ ఫూల్ చేయడానికి కాల్చేసి ఉంటారని భావించా నని జాన్ చెప్పారు. డబ్బుతో తొలుత స్మార్ట్‌ఫోన్ కొనుక్కుంటానని తెలిపాడు. తర్వాత కొంత భాగాన్ని తన ఇద్దరు పిల్లల చదువుకు, మిగతా మొత్తాన్ని పేదవారికి కేటాయిస్తానని చెప్పాడు. -
ప్రవాస భారతీయుడికి రూ.17.5 కోట్ల లాటరీ
దుబాయ్: అబుదాబిలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. అతని లాటరీ టికెట్‌కు సుమారు రూ.17.5 కోట్లు వచ్చాయి. కేరళకు చెందిన సునీల్ మప్పట్టా కృష్ణన్ కుట్టి నాయర్ లాటరీలో 10 మిలియన్ల దిర్హామ్‌లు గెలుచుకున్నాడని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నగదు మొత్తాన్ని నాయర్ తన ముగ్గురు స్నేహితులతో పంచుకోను న్నారని టికెట్ ధరలో కొంత మొత్తం ఇచ్చిన అతని కొలీగ్ తెలిపాడు. -
లాటరీ టికెట్ స్క్రాచ్ చేస్తే.. 66 కోట్ల బంపర్ ప్రైజ్!
పోకీప్సీ: 30 డాలర్లు పెట్టి ఓ గేమ్ టికెట్ కొని.. దాన్ని స్క్రాచ్ చేస్తే.. న్యూయార్క్ దంపతులకు ఏకంగా కోటి డాలర్ల (రూ. 66.63 కోట్ల) లాటరీ తగిలింది. న్యూయార్క్ రాష్ట్ర చరిత్రలోనే స్క్రాచ్ ఆఫ్ గేమ్స్‌లో అతిపెద్ద నగదు బహుమతి కలిగిన లాటరీ ఇదే కావడం గమనార్హం. స్క్రాచ్ ఆఫ్ గేమ్స్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా పది మిలియన్ డాలర్ల నగదు బహుమతితో ఈ లాటరీని నిర్వహించామని, హడ్సన్ వ్యాలీ పోకీప్సీ పట్టణంలోని స్టెవార్ట్ దుకాణంలో లాటరీ టికెట్ కొనుగోలు చేసిన ఓ జంటను ఈ బంపర్ అదృష్టం వరించిందని న్యూయార్క్ స్టేట్ గేమ్ కమిషన్ అధికారులు తెలిపారు. ఈ గేమ్ లాటరీ టికెట్ ధర కేవలం 30 డాలర్లు. అయితే, ఈ లాటరీని గెలుపొందిన అదృష్టవంతులైన దంపతుల పేర్లను అధికారులు వెల్లడించలేదు. విన్నింగ్ టికెట్ కొనుగోలు చేసిన స్టెవార్ట్ దుకాణం సమీపంలోనే గురువారం నాడు ఆ దంపతులకు బహుమతికి సంబంధించిన పెద్ద చెక్కును (క్రికెట్ మ్యాచ్‌లలో ఇచ్చేలాంటిది) లాటరీ అధికారులు అందజేయనున్నారు. -
లాటరీ తెచ్చిన తంటా..
ఒకే నెంబర్ ఇద్దరికి? గురజాల(గుంటూరు): గురజాలలో లాటరీ వ్యాపారం నిర్వాహకులు, కొనుగోలుదారుల మధ్య పెద్ద తంటా తెచ్చినట్లు సమాచారం. నిర్వాహకులు ఒకే నంబర్‌ను ఇద్దరికీ ఇవ్వడంతో సమస్య ఎదురైంది. పైగా అదే నంబర్‌కు సుమారు రూ.3 లక్షలకుపైగా లాటరీ తగిలినట్లు తెలుస్తోంది. విజేతలు మాత్రం ఎవరికి వారే ప్రైజ్ మనీ తనకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలీక నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. బుధవారం రాత్రి వరకు సమస్య ఓ కొలిక్కి రాలేదు. కాగా, పల్నాడు ప్రాంతంలో లాటరీ టిక్కెట్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో లాటరీలపై నిషేధం ఉండటంతో నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తున్నారు. సెల్‌ఫోన్ ద్వారా వచ్చిన లాటరీ నెంబర్‌ను నిర్వాహకులు కొనుగోలుదారులకు ఒక కాగితంపై రాసి ఇస్తున్నారు. సాయంత్రం సమయంలో ఫలితాలు వెలువడుతుంటాయి. విజేతలకు నరసరావుపేటలో నగదు అందచేస్తుంటారు. పోలీస్ సబ్ డివిజన్ కేంద్రమైన గురజాలలో లాటరీ వ్యాపారం సులభంగా, వేగంగా విస్తరిస్తోంది. ఏడాది కాలంలో సుమారు 10 మంది లక్షల్లో లాటరీ ద్వారా లబ్ధి పొందినట్లు ప్రచారం ఉంది. ఈజీ మనీ కావడంతో చిరు వ్యాపారులు కూడా బాగా ఆకర్షితులవుతున్నారు. లాటరీ తగిలినవాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, సొమ్ము పోగొట్టుకున్న వాళ్లు మాత్రం వెంటనే పోలీసులు రంగంలోకి దిగి లాటరీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆస్ట్రేలియన్ కుటుంబానికి రూ. 162 కోట్ల లాటరీ
మెల్బోర్న్: ఆస్ట్రేలియాకు చెందిన ఓ కుటుంబం 30 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 162 కోట్లు) భారీ లాటరీని గెలుచుకుంది. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో నిర్వహించిన లాటరీలో కాన్‌బెర్రాకు చెందిన ఓ మహిళ ఈ నెల 16న లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. గురువారం షాపింగ్ ముగించుకొని వెళ్తుండగా తాను ఓజ్ లొట్టొ లాటరీ గెలుకున్న సంగతి తెలుసుకుంది. ఈ లాటరీ గెలుచుకోవడం ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. -
రూ. 580 కోట్ల జాక్పాట్లో రూ. 403 కోట్ల విరాళం!
ఫ్రాన్స్‌లో ఓ లాటరీ విజేత ఔదార్యం పారిస్: ఫ్రాన్స్‌లో లాటరీలో 72 మిలియన్ల యూరోలను (రూ.580 కోట్లు) గెలుచుకున్న ఓ వ్యక్తి అందులోంచి 50 మిలియన్లను (రూ.403 కోట్లు) ధార్మిక సంస్థలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు శనివారం మీడియా వార్తలు తెలిపాయి. 50 ఏళ్ల ఆ వ్యక్తి తన పేరును గోప్యంగా ఉంచాల్సిందిగా కోరాడని, అతనికి వివాహం కాలేదని ఆ వార్తలు పేర్కొన్నాయి. కాగా, హ్యుట్-గారోన్ ప్రాంతంలో ఆ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోందని ఆర్టీఎల్ టెలివిజన్ తెలిపింది. ఫ్రాన్స్ చరిత్రలో ఇప్పటివరకు లాటరీ విజేతలనుంచి వచ్చిన విరాళాల్లో ఇదే అత్యధికమని మీడియా వార్తలు వెల్లడించాయి. పేదల సంక్షేమంకోసం కృషిచేస్తున్న సుమారు పన్నెండు వాలంటరీ సంస్థలకు ఈ విరాళాన్ని అందచేయనున్నట్టు తెలుస్తోంది. 8. భారత సంతతి ప్రొఫెసర్‌కు ఫుల్బ్రైట్-నెహ్రూ ఫెలోషిప్ వాషింగ్టన్: యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్‌కు చెందిన భారత సంతతి ప్రొఫెసర్ అనిల్ కుల్కర్ణికి విద్యా, వృత్తిగతమైన అనుభవంకోసం ప్రఖ్యాత ఫుల్బ్రైట్-నెహ్రూ ఫెలోషిప్ లభించింది. దీంతో ఆయన భారత్‌లోని నాలుగు యూనివర్సిటీల్లో పౌష్టికాహారంతో రోగనిరోధకం అనే అంశాన్ని బోధించనున్నారు. సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, పుణె యూనివర్సిటీ అనుబంధ సంస్థ దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ముంబైలోని హాఫ్‌కైన్ ఇన్స్టిట్యూట్లలో ఫ్యాకల్టీ మెంబర్‌గా పనిచేయనున్నారు. ఈ ఫెలోషిప్‌కు అర్హులను జె. విలియం ఫుల్బ్రైట్ ఫారిన్ స్కాలర్షిప్ బోర్డు ఎంపిక చేస్తుంది. 12 మందితో కూడిన ఆ బోర్డును అమెరికా అధ్యక్షుడు నియమిస్తారు. ఎంపికైన వారికి అమెరికా కాంగ్రెస్ కేటాయింపులు, భాగస్వామ్య దేశంతో పాటు ప్రయివేట్ రంగం నుంచి నిధులు సమకూరుస్తారు. ఫుల్బ్రైట్-నెహ్రూ ఫెలోషిప్ పొందిన అమెరికా ఫ్యాకల్టీ సభ్యులు, పరిశోధకులు, వృత్తి నిపుణులు భారత్‌లోని సంస్థల్లో టీచింగ్, పరిశోధన చేయడానికి అవకాశం కలుగుతుంది. -
లాటరీ తగిలింది... టికెట్ పోయింది
న్యూయార్క్: అమెరికాలోని ఓ దురదృష్టవంతుడు చేతులదాకా వచ్చిన డబ్బును చెత్తకుప్పలో పడేశాడు. ఏడాది కిందట సౌత్క్యూన్ స్ట్రీట్‌లోని జ్యూ గ్రోసెరీలో ఓ వ్యక్తి 25 లాటరీ టికెట్లు కొన్నాడు. అతను కొన్న టికెట్‌కు లాటరీ తగిలినా ఇప్పటివరకు డబ్బులు మాత్రం తీసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ లాటరీ టికెట్ కాలపరిమితి ముగిసింది. దీనిపై ఆ దురదృష్టవంతుడికి టికెట్ అమ్మిన వెన్డీ హింటన్ మాట్లాడుతూ.... ‘ఓ వ్యక్తి తరచుగా ఒకే సిరీస్ నంబర్ ఉన్న లాటరీ టికెట్లను మా దగ్గర కొనేవాడు. గత ఏడాది మార్చిలో కూడా అదే విధంగా 25 టికెట్లను కొనుక్కున్నాడు. రోజూ వచ్చి తన నంబర్‌కు లాటరీ తగిలిందో లేదో కూడా చూసుకునే వాడు. కానీ, ఆ రోజు లాటరీ తగిలిన తన నంబర్‌ను తప్పుగా చూసుకొని చేతిలో ఉన్న టికెట్లను చెత్తబుట్టలో పడేశాడు. రూ. 7.52 లక్షలు తగిలిన ఆ టికెట్ కాలపరిమితి ఇప్పుడు ముగిసింది. దీంతో లాటరీ డబ్బులు మొత్తం కంపెనీకి వెళ్లిపోతాయి’ అని చెప్పింది. టికెట్ తగిలిన లాటరీని చెత్తకుప్పలో పడేసిన ఆ వ్యక్తి పిచ్చివాడిలా ప్రవర్తించాడని పేర్కొంది. -
ఒక్క లాటరీ.. 1,100 కోట్లు..
వాషింగ్టన్: ఓ కారు.. పెద్ద బంగళా.. ఒంటి నిండా బంగారం.. పేద్ద టీవీ, ఫ్రిడ్జ్ వంటి సామగ్రి.. ఇంకా...!? ఇవన్నీ కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహించాల్సిందే.. అదే మరి ఒక్కసారిగా కొన్ని వందల కోట్లు వచ్చేస్తే ఎలా ఉంటుంది? అమ్మో వందల కోట్లే..!! అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే.. బ్రిటన్‌లోని ఒకాయన లాటరీ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కాదు కాదు.. వందల కోట్లీశ్వరుడు అయిపోయాడు. ఆ లాటరీలో వచ్చిన మొత్తం ఎంతో తెలుసా.. సుమారు 1,100 కోట్ల రూపాయలు (108 మిలియన్ల పౌండ్లు). దీంతో మనోడి జీవితమే మారిపోయింది. ఈ దెబ్బతో ఆయన బ్రిటన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలోకి కూడా ఎక్కేశాడు. బ్రిటన్‌లో లాటరీల్లో అత్యధిక మొత్తం పొందిన వారిలో ఈయన నాలుగో వ్యక్తి. అయితే, ఇంకా ఈ లాటరీ గెలుచుకున్న వ్యక్తి ఎవరో వెల్లడించలేదు. ఇంతకు ముందు 2011లో కోలిన్ అండ్ క్రిస్వెయిర్కు ఏకంగా రూ. 1,650 కోట్లు లాటరీ తగిలింది.