Kerala Auto Driver Hits Jackpot, Wins Rs 12 Crore In Lottery - Sakshi
Sakshi News home page

Kerala: ఆటో డ్రైవర్‌ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.12 కోట్లు

Published Tue, Sep 21 2021 10:30 AM | Last Updated on Tue, Sep 21 2021 3:58 PM

Kerala Auto Driver Win rs 12 Crore In Lottery - Sakshi

కోచి: అదృష్ట లక్ష్మి ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. ఓ ఆటో డ్రైవర్‌కు ఫ్యాన్సీ నంబర్‌ రూపంలో అదృష్టం వరించింది. తనకు నచ్చిన నంబర్‌తో ఉన్న లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడై పోయాడు ఈ కేరళ వాసి. కోచిలోని మరడుకు చెందిన పీఆర్‌ జయపాలన్‌ ఈ నెల 10వ తేదీన ఓనమ్‌ బంపర్‌ లాటరీ టికెట్‌ కొన్నాడు.
(చదవండి: ‘అదృష్టాన్ని’ పర్సులోనే దాచింది.. 290 కోట్ల లాటరీ!)

టీఈ 645465 అనే సీరియల్‌ నంబర్‌ ఉన్న ఈ టికెట్‌కు ఆదివారం వెల్లడించిన ఫలితాల్లో మొదటి బహుమతి దక్కింది. రూ.12 కోట్ల జాక్‌పాట్‌ దక్కింది తనకేనని తెలుసుకున్న జయపాలన్‌ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. సొమ్ములో పన్నులు పోను రూ.7 కోట్ల భారీ మొత్తం ఆటో డ్రైవర్‌ జయపాలన్‌ అందుకోనున్నాడు. 

చదవండి: నిజాయతీ: చేతికి దొరికిన రూ.7 కోట్లు తిరిగిచ్చేశారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement