విదేశీ టూరిస్టలు మన దేశంలోని చారిత్రక ప్రదేశాలకు వచ్చినప్పుడూ ఇబ్బంది పడుతుంటారు. మనతో కమ్యూనికేషన్ చేయలేక నానాపాట్లు పడుతుంటారు వాళ్లు. అందులోనూ మన దేశంలో చాలామందికి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోవడం లేదా వాళ్లు చెప్పింది అర్థం చేసుకోలేక ఇబ్బంది పడతుండటం జరుగుతుంది. కానీ ఈ ఆటో డ్రైవర్ మాత్రం అర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడి యూకే టూరిస్ట్‌ని ఆకట్టుకున్నాడు. అతడు ఇంగ్లీష్ మాట్లాడుతున్న తీరుకి ఇంప్రెస్ అయ్యి అతడితో జరిగిన సంభాషణను వివరిస్తూ.. అందుకు సంబధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవ్వుతోంది.
బ్రిటిష్ వాగ్లర్ జాకీ ఇటీవల కేరళ పర్యటనలో ఉన్నప్పుడూ జరిగింది ఈ ఘటన. అతను అక్కడ ఓ హోటల్‌లో స్టే చేశాడు. అయితే ఆ హోటల్‌ని ఖాళీ చేద్దామంటే.. సడెన్‌గా ఏటీఎం వర్క్ చేయడం మానేసింది. దీంతో ఫోర్ట్ కొచ్చికి వెళ్లే ప్రధాన రహదారి గుండా ఏటీఎం సెంటర్ ఎక్కడుందా? అని సర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ ఆష్రఫ్ ఏంటీ సార్ అంటూ ఆంగ్లంలో ఆ టూరిస్ట్‌ని పలకరించాడు. మొహమాటంగా టూరిస్ట్ పొడిపొడిగా సమాధానం ఇచ్చి వెళ్లేందుకు యత్నిస్తుంటే..ఎక్కడికైనా వెళ్తారా? ఆటో కావాలా అంటూ ఫ్రెండ్లీగా అర్థవంతమైన ఆంగ్లంలో మాట్లాడుతుండటంతో.. ధైర్యంగా టూరిస్ట్ తన సమస్య వివరిస్తాడు.
దాని గురించి తెలియజేయడమే కాకుండా ఆటోలో రావాల్సిందిగా కోరతాడు డ్రైవర్. అందుకు టూరిస్ట్ నిరాకరిస్తాడు. అయితే ఏటీఎం కోసం కాంప్లిమెంటరీ రైడ్ చేయమంటూ తన ఆటోలోకి ఆహ్వానిస్తాడు. ఆ ఆటోడ్రైవర్ మర్యాదపూర్వకమైన తీరుని చూసి టూరిస్ట్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాతా ఆ టూరిస్ట్‌ని ఏటీఎం సెంటర్ వద్ద డ్రాప్ చేసి వెళ్లిపోతాడు ఆటో డ్రైవర్. చక్కగా మంచి ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడడాని ఆ ఆటో డ్రైవర్‌ని మెచ్చుకుంటూ అతనితో జరిగిన సంభాషణ గురించి పోస్ట్‌లో రాసుకొచ్చాడు ఆ యూకే టూరిస్ట్. గతంలో ఇలా పర్యాటనకు వెళ్లినప్పుడూ పలు భాషా సమస్యలు ఎదుర్కొన్నాని ఆ పోస్ట్‌లో తెలిపాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనికి మిలియన్లలో వ్యూస్, లైక్‌లు వచ్చాయి.
(చదవండి: 1200 ఏళ్ల నాటి పురాతన సమాధి..అందులో ఏకంగా కోట్లు..!)
Comments
Please login to add a commentAdd a comment