వాట్‌ ఏ టాలెంట్‌ బ్రో..! రెండు కాళ్లు లేకపోతేనేం.. | specially abled choreographer dancing with students viral video Goes Viral | Sakshi
Sakshi News home page

వాట్‌ ఏ టాలెంట్‌ బ్రో..!రెండు కాళ్లు లేకపోతేనేం..

Jun 3 2025 4:01 PM | Updated on Jun 3 2025 5:10 PM

specially abled choreographer dancing with students viral video Goes Viral

మనపై మనకున్న నమ్మకం, అచంచలమైన ధైర్యం ముందు..ఏ వైకల్యం అయినా చిన్నబోవాల్సిందే. అందుకు ఉదాహారణ ఈ కొరియోగ్రాఫర్‌. రెండు కాళ్లు లేపోయినా..విద్యార్థులకు అలవోకగా నృత్యం నేర్పిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. టాలెంట్‌ అంటే ఇదే అనేలా స్ఫూర్తిగా నిలిచాడు. 

అతడే కొరియోగ్రాఫర్‌​ అబ్లు రాజేష్ కుమార్. అతడు దివ్యాంగుడు. అయితేనేం..అతడి మనోధైర్యం, సంకల్పం.. అతడి కాళ్లకు ఊపిరిపోశాయా అనిపించేలా అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తాడు అతను. కూమార్‌ ప్రోస్థెటిక్‌ కాళ్లతో తన విద్యార్థులకు డ్యాన్స్‌ నేర్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా వారింది. 

ఆ వీడియోలో అతడు పిల్లలకు బాలీవుడ్‌ ప్రముఖ హిట్‌పాట చిట్టియాన్ కలైయాన్‌ పాటకు డ్యాన్స్‌ చేయడం నేర్పిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ పాటకు లయబద్ధంగా కుమార్‌ కదుపుతున్న స్టెప్పులు చూస్తే..కళ్లు రెప్పవేయడమే మర్చిపోతాం. ఏదో మ్యాజిక్‌ చేసినట్లు మంచి హవభావాలు పలికిస్తూ..డ్యాన్స్‌ చేస్తూ కనిపిస్తాడు వీడియోలో. 

ఈ వీడియోని చూసి నెటిజన్లు మనసుంటే మార్గం ఉంటుంది అనేందుకు ఇతడే ఉదాహరణ అని ఒకరు, అచంచలమైన ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం అని మరికొందరు కూమార్‌ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.  

 

(చదవండి: World Bicycle Day: 70 ఏళ్ల వ్యాపారవేత్త ఫిట్‌నెస్‌కి ఫిదా అవ్వాల్సిందే! ఇప్పటకీ 40 కి.మీలు సైకిల్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement